
తిరుపతి రూరల్: పార్టీకి కార్యకర్తలే ప్రాణవాయువు అని వైఎస్‌ఆర్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. చిన్నగొట్టిగల్లు మండలం కార్యకర్తరెడ్డి సుబ్రమణ్యం కోరిక మేర కు భాకరాపేటలోని ఆయన నివాసాని కి శనివారం విజయసాయిరెడ్డి వెళ్లా రు. ఆయన వెంట చంద్రగిరి ఎమ్మె ల్యేచెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులతో కలసి విందు చేశారు.
అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ. సమస్యలపై నిత్యం పోరాడుతూ, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న కార్యకర్తలు లక్షల్లో ఉండడం బలం అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి బాబి నిబద్ధతగా పనిచేస్తున్నారని అభినందించారు. పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి సహదేవరెడ్డి, మండల కన్వీనర్ యుగంధర్ రెడ్డి, నాయకులు మహేం ద్ర నాయుడు, శంకర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, రెడ్డి సుబ్రమణ్యం, జయపాల్, వేణు, రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment