అసెంబ్లీలో నిలదీస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసెంబ్లీలో నిలదీస్తాం

అసెంబ్లీలో నిలదీస్తాం

Written By news on Wednesday, December 17, 2014 | 12/17/2014


* చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
ప్రజలకు భరోసా ఇవ్వలేని వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు?
రైతన్నలు, డ్వాక్రా మహిళలు, అవ్వాతాతలు, కార్మికులను బాబు మోసం చేశారు
రైతులకు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తే.. బాబు పదేళ్ల బకాయిలు కట్టాలంటూ  బిల్లులు ఇవ్వడం దారుణం
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబ
ద్ధీకరించేలా పోరాటం చేస్తాం


సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘నోటి వెంట ఒక మాటొస్తే ఆ మాట  నిలబెట్టుకుంటాడనే నమ్మకం, భరోసా ప్రజలకు ఇవ్వలేని వ్యక్తి సీఎం స్థానంలో ఎందుకు కూర్చోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమ లుచేయకుండా రైతన్నలను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, కాంట్రాక్టు ఉద్యోగ సోదరులను, అవ్వా తాతలు అందర్నీ మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే.  ఇటువంటి వ్యక్తి సీఎం అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది.
 
అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును గట్టిగా నిలదీస్తాం. అప్పటికీ ఆ మనిషికి సిగ్గురాకపోతే... మీకు నేను అండగా ఉంటాను. మీ తరపున పోరాడుతా. మరో నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ అందరి సమస్యలు పరిష్కరిస్తానని నేను భరోసా ఇస్తున్నా ను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గుంటూరు మాజీ ఎంపీపీ, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పెద్ద కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన మంగళవారం గుంటూరు వచ్చారు.
 
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి గుంటూరు వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన జగన్‌ను దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వారి సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌పై సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తమకు ఉచిత కరెంటును అందిస్తే ప్రస్తుతం చంద్రబాబు ఎనిమిదేళ్ల నుంచి కరెంటు బకాయిలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారని తాడేపల్లిలో రైతులు, మహిళలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వాపోయారు. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
 
భూ సమీకరణపై రైతుల ఆవేదన
 తమ భూములన్నింటినీ సర్కార్ లాక్కుంటే రో డ్డున పడతామని, సారవంతమైన భూములను రాజధాని భూ సమీకరణకు ఇచ్చేది లేదని రాజ ధాని భూ సమీకరణ వ్యతిరేక గ్రామాల రైతులు జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి నిడమర్రు,  కురగల్లు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో మంగళగిరి వద్ద జగన్‌కు విజ్ఞాపనలు అందించారు. రైతుల తరపున అసెంబ్లీలో పోరాడుతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
 
విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కరకట్టపై తమ ఇళ్లను అధికారులు తొలగించే ప్రయత్నంచేస్తున్నారని పలువురు మహిళలు వాపోయారు. ఇక్కడ ఇళ్లు తొలగిస్తే మీకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వాన్ని కోరతానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు వంగవీటి రాధా, పి.గౌతమ్‌రెడ్డి మీ తరపున పోరాడుతారని జగన్ వారికి ధైర్యం చెప్పారు. జగన్‌వెంట ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జలీల్ ఖాన్, మహ్మద్ ముస్తాఫా, పార్టీరాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, తలశిల రఘురామ్, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్ధసారధి, మర్రి రాజశేఖర్, గుంటూ రు నగర అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి,  మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్‌రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షులు మేరుగ నాగర్జున, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు
Share this article :

0 comments: