
వైఎస్సార్‌జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా ప్రతి పక్ష నేత జిల్లాలో శనివారం విస్తృతంగా పర్యటించారు. చాపాడు మండల పరిధిలోని మడూరు సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త ఓబులేసును రెండు నెలల క్రితం ప్రత్యర్థులు హత్య చేసిన నేపథ్యంలో చిన్న వరదాయపల్లెలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ముందుగా ఓబులేసు చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈశ్వరమ్మతోపాటు కుమారులు వెంకటసుబ్బయ్య, కిరణ్‌కుమార్, పవన్‌కుమార్, కుమార్తె కవితలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన సంఘటనను చెబుతూ బోరున విలపించారు. విచారించవద్దని తాము అండగా నిలబడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
పులివెందులలో పలు వివాహాలకు హాజరు
శనివారం ఉదయాన్నే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలోని వీజే కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి హాజరై నూతన వధూవరులు నాగమల్లిక, రామకృష్ణారెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం అంబకపల్లె రోడ్డులోని సుభాకర్ కళ్యాణ మండపంలో పెద్దజూటూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి సోదరుని కుమార్తె హిమబిందు, శివప్రసాదరెడ్డి వివాహానికి హాజరయ్యూరు. అనంతరం తొండూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి హాజరై శివప్రసాద్, శివప్రసన్నలను ఆశీర్వదించారు.
అహోబిళం సీతారాముల విగ్రహ ప్రతిష్టలో...
సింహాద్రిపురం మండలం అహోబిళం గ్రామ సమీపంలో కొమ్మా శివయ్యగారి సోమేశ్వరరెడ్డి నిర్మించిన సీతారాముల దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలయం వద్దకు రాగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వైఎస్ జగన్ సీతారాముల స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తర్వాత రావులకొలను గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, కంభం మహేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిల ఇళ్లకు వెళ్లి మర్యాదకపూర్వకంగా పలుకరించారు.
చిలంకూరులో బ్రహ్మరథం పట్టిన జనం
ఎర్రగుంట్ల మండలం చిలంకూరు వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ వస్తున్న విషయం తెలుసుకుని భారీగా జనసందోహం రావడంతోపాటు పూల వర్షం కురిపిస్తూ జై జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. కాన్వాయ్‌కూడా ముందుకు కదలటానికి వీలులేనంత జనం తరలి రావడంతో ఒక దశలో పోలీసులు జోక్యం చేసుకుని అందరిని సర్దడంతో వాహనాలు ముందుకు కదిలాయి.
మైసూరా సోదరుని కుమారుడితో కాసేపు
ఎర్రగుంట్ల సమీపంలోని నిడుజువ్వికి రాగానే యువ నాయకులు, మైసూరా రెడ్డి సోదరుని కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ పూలతో స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ర్యాలీగా ఇంటికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌లు దాదాపు అర్ధగంటపాటు సుధీర్ రెడ్డితో ఇంటిలో గడిపారు.
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు వచ్చి కలిసి చర్చించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జయరాములు, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తనయుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులపై వారు మాట్లాడుకున్నారు.
చెంచుపల్లె చర్చిని పరిశీలించిన ప్రతిపక్షనేత
చాపాడు మండల పరిధిలోని చిన్నవరదాయపల్లెకు వెళ్లి వస్తున్న వైఎస్ జగన్ కాన్వాయ్ వద్దకు చెంచుపల్లె గ్రామస్తులంతా మూకుమ్మడిగా వచ్చారు. అంతా పట్టుబట్టడంతో గ్రామానికి వెళ్లి నిర్మాణంలో ఉన్న చర్చిని పరిశీలించారు.
పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వరకు
శనివారం ఉదయాన్నే పులివెందుల నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయల్దేరారు. అయితే అడుగడుగునా వాహన కాన్వాయ్‌కు గ్రామస్తులు వచ్చి నిలబెడుతూ హారతులు పట్టారు. సైదాపురం, తొండూరు వద్దకు రాగానే గ్రామస్తులు కాన్వాయ్‌ని ఆపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం చేశారు. అనంతరం మల్లేల వద్ద భారీగా జనాలు వచ్చి జగన్‌ను కలిశారు. కొంత మంది చంటిబిడ్డలను ఎత్తుకుని జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చారు. అలాగే బూచుపల్లె వద్ద, ముద్దనూరు నాలుగు రోడ్ల సర్కిల్ వద్ద కాన్వాయ్‌ని ఆపి జగన్ నినాదాలతో హోరెత్తించారు.
దీంతో చుట్టుపక్కల ఉన్న డ్రైవర్లు, ప్రయాణికులు, కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి జగన్‌తో కరచాలనం చేశారు. అందరికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. అనంతరం కొత్తపల్లి వద్ద, చిలంకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల, పోట్లదుర్తి, ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఇలా ప్రతి చోట ఎక్కడ చూసినా కాన్వాయ్‌ని ఆపి జగన్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉదయం 9 గంటలకు బయల్దేరిన వైఎస్ జగన్ ప్రొద్దుటూరుకు వచ్చేసరికి రాత్రి దాదాపు 7 గంటలు అయిందంటే అడుగడుగునా మహిళలు ఎలా మంగళహారతులు ఇచ్చారో ఇట్టే అర్థమవుతోంది.
వైయస్ జగన్‌కు ఘనస్వాగతం
ముద్దనూరు: వైయస్ జగన్మోహన్‌రెడ్డికి శనివారం ముద్దనూరులో నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా ముద్దనూరు మీదుగా ఎంపీ అవినాష్‌రెడ్డితో కలసి ప్రొద్దుటూరుకు వెళ్తున్న వైయస్ జగన్‌కు స్థానిక 4రోడ్ల కూడలిలో వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు, నల్లబల్లె ఎంపీటీసీ సభ్యుడు వరదారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మహిళలను వైయస్‌జగన్ ఆప్యాయంగా పలుకరించారు. ఎస్‌ఐ యుగంధర్ బందోబస్తు ఏర్పాటుచేసారు.
పర్యటన విజయవంతం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. శనివారం రాత్రి ఎర్రగుంట్ల నుంచి హైదరాబాద్‌కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. శనివారం జిల్లాలోని పులివెందుల, సింహాద్రిపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, చాపాడు మండలాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు ఎర్రగుంట్ల నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు హైదరాబాద్‌కు బయల్దేరారు.
బోడివారిపల్లెలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
తొండూరు మండలం బోడివారిపల్లె గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. రోడ్డు వద్ద నుంచి గ్రామం వరకు డప్పు వాయిద్యాల మధ్య పూలవర్షం కురిపిస్తూ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. గ్రామ నడిబొడ్డున స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, బాలిరెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
0 comments:
Post a Comment