Home »
» రుణం తీర్చుకోవడం అంటే ఇదేనా
రుణం తీర్చుకోవడం అంటే ఇదేనా
ఏలూరు:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణమాఫీ అమలు చేసే ఉద్దేశం లేనట్టుందని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. అసలు రుణమాఫీ అమలు చేసే యోచన ప్రభుత్వానికి ఉందా?అని నాని ప్రశ్నించారు. ప్రజల రుణం తీర్చుకోవడం అంటే ఇదేనా అని నిలదీశారు. రుణమాఫీ అమలు జరుగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణాల రీషెడ్యూల్ అని కాసేపు.. రైతుల వెన్నుముక విరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటాలకు ఇది నాంది మాత్రమేనన్నారు. చంద్రబాబు కళ్ళు తెరిచే లోగా ఈనెల 5న భారీ ధర్నా చేపడుతున్నట్లు నాని అన్నారు. ఆయన మోసపూరిత వాగ్దానాలతో పశ్చిమ ప్రజలు మోసపోయారని, వారి తరపున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని నాని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాజధానిపై ప్రభుత్వానికి ఒక అవగాహన లేదని మండిపడ్డ్డారు.
0 comments:
Post a Comment