వాటా ప్రకారం నీరు అందించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాటా ప్రకారం నీరు అందించాలి

వాటా ప్రకారం నీరు అందించాలి

Written By news on Saturday, December 27, 2014 | 12/27/2014


వాటా ప్రకారం నీరు అందించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ముండ్లమూరు : మోదేపల్లి మేజర్ పరిధిలోని సాగర్ ఆయకట్టు భూములకు వాటా ప్రకారం నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి సంబంధితాధికారులకు ఆదేశించారు. దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డితో కలిసి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. పీబీసీ పరిధిలోని రవ్వారం లాకుల వద్ద జమ్మలమడక మేజర్, మోదేపల్లి మేజర్లకు సంబంధించిన నీటి పంపకాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలు
అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మోదేపల్లి మేజర్‌లో ఆయకట్టు గ్రామాలైన ఉమామహేశ్వరపురం, ఈదర, కొమ్మవరం, వేములబండ, అయోధ్యనగర్, రమణారెడ్డిపాలెం, నాయుడుపాలెం, పూరిమెట్ల గ్రామాల్లోని దిగువ భూములకు నీరు సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల వైసీపీ కన్వీనర్ సుంకర బ్రహ్మారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నాట్లు వేయడం పూర్తి కాకముందే అధికారులు వారాబంధి విధానాన్ని అమలు చేస్తున్నారని, మోదేపల్లి మేజర్‌కు వాటా ప్రకారం 365 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 150 క్యూసెక్కులకు మించి రావడంలేదని ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం మోదేపల్లి మేజర్‌లో 2,300 ఎకరాలలో,  జమ్మలమడక మేజర్‌లో 1600 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని, సాగు ఎక్కువగా ఉన్న మోదేపల్లి మేజర్‌కు అదనంగా నీరు సరఫరా చేసి రైతులను ఆదుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీ సాగర్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. నీటి సరఫరా విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. వాటా ప్రకారం నీరు రప్పించి రైతులకు సరఫరా చేయాలని సూచించారు.

ఇప్పటికే అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో నీరు సక్రమంగా పంటకు అందకుంటే నష్టాలపాలవుతారనే విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. ఎన్‌ఎస్పీ సిబ్బంది నిత్యం కాలువపై పర్యటించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎన్‌ఎస్పీ డీఈ ఎ.అనుమాయమ్మ, ముండ్లమూరు, తాళ్ళూరు వైసీపీ కన్వీనర్లు బ్రాహ్మారెడ్డితోపాటు వెంకటరెడ్డి, రైతులు అన్నపురెడ్డి భిక్షాలురెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, గాదె నాసరరెడ్డి, సుంకిరెడ్డి, చింతల అంజిరెడ్డి, గూడాల సుబ్బారెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, సురా గురుస్వామిరెడ్డి, మన్నంగి అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, అబ్బని అంజిరెడ్డి, మైలా శ్రీరాములు, జే ఈలు క్రాంతికుమార్, శివరామకృష్ణ, ప్రసాదులు ఉన్నారు.
Share this article :

0 comments: