షర్మిలకు ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిలకు ఘన స్వాగతం

షర్మిలకు ఘన స్వాగతం

Written By news on Tuesday, December 9, 2014 | 12/09/2014


షర్మిలకు ఘన స్వాగతం
మాడ్గుల: జిల్లాలో సోమవారం ప్రారంభమైన పరామర్శ యాత్రకు వచ్చిన షర్మిలకు నల్గొండ జిల్లా కుర్మేడు వద్ద వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు  ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎడ్మ కిష్టారెడ్డి షర్మిలకు పుష్పగుచ్ఛం అందజేసి జిల్లాలోకి స్వాగతం పలికారు. అలాగే ఆమె వెంట ఉన్న పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వై.సుబ్బారెడ్డిలకు ఆయన స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్, అలంపూర్, నారాయణపేట, కొడంగల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల తదితర నియోజకవర్గాల నుంచి వైఎస్‌ఆర్ శ్రేణులు అధికసంఖ్యలో తరలొచ్చారు.

జిల్లాలోని కొత్త బ్రాహ్మణపల్లి వద్ద షర్మిల జిల్లాలోకి ప్రవేశించారు. డప్పువాయిద్యాలతో మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లానాయకులు రవీందర్‌రెడ్డి, సత్యం, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, జెట్టి రాజశేఖర్, జమీర్‌పాషా, బంగి లక్ష్మణ్, నసీర్, హైదర్‌అలీ, ఆరోగ్యరెడ్డి, సత్తయ్యగౌడ్, సంబు పుల్లయ్య, యాదగిరిరెడ్డి, లక్ష్మినారాయణ, యూసుఫ్‌తాజ్, నాగరాజు, చంద్రశేఖర్, మద్దిలేటి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: