పలు సేవా కార్యక్రమాల రూపంలోజగన్‌ పుట్టిన రోజు వేడుకలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పలు సేవా కార్యక్రమాల రూపంలోజగన్‌ పుట్టిన రోజు వేడుకలు

పలు సేవా కార్యక్రమాల రూపంలోజగన్‌ పుట్టిన రోజు వేడుకలు

Written By news on Saturday, December 20, 2014 | 12/20/2014


రేపు జగనన్న బర్త్‌డే
సేవా కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ పిలుపు
సాక్షి,చెన్నై : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను చెన్నైలో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు విస్తృత ఏర్పాట్లు  చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతలు జకీర్‌హుస్సేన్, శరవణన్ తెలిపారు.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే  తమిళులకు ఎంతో అభిమానం. ఆ కుటుంబానికి ఎప్పటినుంచో భాసటగా ఉంటూ వస్తున్నారు. తమ అభిమానాన్ని చాటుకునే విధంగా వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన 42వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈమేరకు సేవా కార్యక్రమం రూపంలో ఆయన బర్తడేను నిర్వహించేందుకు తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్‌లు నిర్ణయించారు. శుక్రవారం సాక్షితో వారు మాట్లాడారు.

ఈ ఏడాది పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. వ్యాసార్పాడిలోని డాన్‌బాస్కో స్కూల్ ఆశ్రమంలోని పిల్లలు, వృద్ధులతో కలసి బర్తడే వేడుకకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయాన్నే అక్కడి వారికి అల్పాహార విందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పదిన్నర గంటలకు భారీ కేక్‌ను రెండు వందల మంది పిల్లల సమక్షంలో కట్ చేయబోతున్నట్టు తెలిపారు. పిల్లలకు కేకులు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెడతామన్నారు. ఈ వేడుకకు నగరంలోని వైఎస్సార్, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. వివరాలకు 9841042141 నెంబర్‌ను సంప్రదించ వచ్చని సూచించారు.
Share this article :

0 comments: