షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?

షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?

Written By news on Tuesday, December 23, 2014 | 12/23/2014


రుణ మాఫీ పేరుతో ముంచేశారు..
* చంద్రబాబు సర్కారుపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు చేస్తున్నదేమిటి?
షరతులు, నిబంధనలు, పరిమితులు, కోతలు పెడతామని అప్పుడు చెప్పలేదేం?
యాభై వేల రూపాయల రుణం ఉంటే.. రూ. 15 కే మాఫీ అర్హత ఉందన్నారు
అందులోనూ తొలి విడత కింద మూడంటే మూడు రూపాయలే జమ చేశారు
తొలి విడత రుణ మాఫీ అంటూ ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వడ్డీలకూ సరిపోలేదు
ప్రభుత్వ నిర్వాకంతో రైతులు వడ్డీ రాయితీ, వడ్డీ లేని రుణాలు కోల్పోయారు
రుణ బకాయిలు తీరనందున ఈ ఏడాది పంటల బీమాకూ నోచుకోలేదు
580 మండలాల్లో కరవు తాండవిస్తోంటే 226 మండలాల్లోనే అని ప్రకటిచారు
ఏడు నెలల్లో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సర్కారు గుర్తించలేదు
ఎన్నికల హామీలను ఎలాంటి షరతులు, పరిమితులు లేకుండా అమలుచేయాలి


సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. రకరకా ల నిబంధనలు, పరిమితులతో రైతులను మో సం చేశారని, రుణమాఫీ పేరుతో రైతులను రుణగ్రస్తులను.. మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ చేస్తున్నామంటున్న ప్రభుత్వం.. వాస్తవంగా అనేక నిబంధనలతో రైతులను ఎంత దగా చేస్తోందో నిండు సభలో కేస్ స్టడీస్‌లతో సహా ఎండగట్టారు. తొలి విడత కిం ద జమ చేసిన మొత్తం.. వడ్డీ కిందకు కూడా సరిపోలేదన్నారు. ఐదేళ్లలో ఐదు వాయిదాల్లో చెల్లించే మొత్తాలు వడ్డీలకూ చాలకపోతే.. ఇక అసలు రుణం ఎప్పుడు తీరుతుందని నిలదీశారు.

 సర్కారు వైఖరి కారణంగా రైతులకు రుణ బకాయిలు తీరకపోగా.. వడ్డీ లేని రుణాలను కోల్పోయారని, పైగా అపరాధ వడ్డీ భారం పెరిగిపోతోందని, పంట బీమాకూ నోచుకోలేకపోయారని, ఈ ఏడాది కొత్త రుణాలూ లభించలేదని.. బ్యాంకర్ల కమిటీల లెక్కలను సభ ముందు పెట్టారు. ఇటు బ్యాంకుల్లో రుణ భారం పెరుగుతుండగా.. వ్యవసాయం కోసం ప్రైవేటు అప్పులు చేసిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం 344 నిబంధన కింద రాష్ట్ర శాసనసభలో రుణ మాఫీపై చర్చ జరిగింది. ఈ చర్చను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

రైతులపై భారమని బ్యాంకర్లే చెప్పారు
‘‘వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? మార్చి 31 నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ. 14,204 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) 184వ సమావేశంలో సీఎం చంద్రబాబు సమక్షంలోనే చెప్పింది. రుణాలు రీషెడ్యూల్ చేసుకోకపోవడం వల్ల పంటల బీమా రక్షణ రైతులకు లేకుండా పోతోందని.. బ్యాంకర్లు స్పష్టంగా చెప్పారు.  

కొత్త రుణాలూ దక్కలేదు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేయడం వల్ల.. ఈ ఏడాది వారికి కొత్త రుణాలూ అందలేదు. రైతులకు రూ. 56,019 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకుంటే.. ఇచ్చింది రూ. 7,263 కోట్లే. రబీకి ఇచ్చిన రుణాలు కలిపినా రూ. 10 వేల కోట్లు దాటలేదని తాజా లెక్కలు చెప్తున్నాయి. మిగతా రూ. 46 వేల కోట్ల రుణాలను రైతులు రూ. 2-3 వడ్డీకి ప్రయివేటు వ్యక్తుల నుంచి తెచ్చుకున్నారు. డ్వాక్రా రుణాల పరిస్థితీ అంతే. ఈ ఏడాది (2014-15)లో రూ. 12,274 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. నవంబర్ ఆఖరు వరకు ఇచ్చింది కేవలం రూ. 2,179 కోట్లే. డ్వాక్రా మహిళలు రూ. 10 వేల కోట్ల రుణాలు తీసుకొనే అవకాశాన్ని కోల్పోయారు.

ఎంత మాఫీ చేస్తున్నారో చెప్పరేం?
అధికారంలోకి వచ్చాక రకరకాల పరిమితులు, నిబంధనలు, షరతులు విధిస్తామని అన్నారా? బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి ఉపయోగించుకొనే ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను మాఫీలో కోతలు వేయడానికి వాడుకుంటామని ఒక్కసారైనా ఎన్నికల ముందు చెప్పారా? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, ఆధార్, రేషన్ కార్డులకు ముడిపెడతామని, అందరికీ కాకుండా కొందరికే కొంతమేరే రుణ మాఫీ చేస్తామని, అది కూడా వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని, అది వడ్డీకీ సరి పోదని.. ఒక్కసభలో అయినా రైతులకు టీడీపీ చెప్పిందా? ప్రభుత్వం రుణ మాఫీకి ఇచ్చింది రూ. 4,644 కోట్లే.  ఇప్పటికైనా చంద్రబాబు.. రుణాల మాఫీకి ఎంత ఇస్తున్నా రు? వడ్డీకి ఎంత? అసలుకు ఎంత? చెప్పడం లేదు.

వడ్డీలేని రుణాలకు మంగళం ...
ప్రభుత్వం చెల్లించిన మాఫీ సొమ్ము పోనూ, మిగతా రుణాలను చెల్లించి రీషెడ్యూలు చేసి, 4% వడ్డీ ప్రయోజనం పొందాలని కొండపి సభలో చంద్రబాబు రైతులకు సూచించినట్లు ‘ఈనాడు’లో వచ్చింది. వడ్డీకి సరిపోయేంత కూడా మాఫీ సొమ్ము కింద ప్రభుత్వం జమచేయక రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉంటే.. రుణాలు చెల్లించి, రీషెడ్యూలు చేసుకోవాలని చంద్రబాబు సూచించడం ఏమిటి? ఎన్నికల ముందు రుణాలు చెల్లించవద్దని చెప్పి.. ఇప్పుడేమో చెల్లించమని చెప్పడం ఏమి న్యాయం? ‘ఏరు దాటాక...’ అన్నట్టు ఇప్పుడు బాబు ఇలా చెబుతున్నారు. 4% వడ్డీ ప్రయోజనం గురించి మాట్లాడుతున్నారంటే.. వడ్డీలేని రుణాలకు మంగళం పాడినట్లే కదా! కొంతమందికైనా వడ్డీ సొమ్ము మాఫీ కింద రాలేదు. కేస్ స్టడీస్ కొన్ని సభ దృష్టికి తెస్తా. ఇవన్నీ బ్యాంకు పత్రాలే.

రుణాల మంజూరు లక్ష్యానికి ఎంతో దూరంగా..
ఏటా రుణాల మంజూరు లక్ష్యం, బ్యాంకులు రైతులకు ఇచ్చిన రుణాల వివరాలను చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ మాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసం చేయడం వల్ల లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నదీ తెలిసిపోతుంది.
సంవత్సరం     లక్ష్యం               మంజూరైన మొత్తం
2011-12    రూ. 31,877 కోట్లు    రూ. 35,615 కోట్లు
2012-13    రూ. 35,654 కోట్లు    రూ. 50,060 కోట్లు
2013-14    రూ. 47,017 కోట్లు    రూ. 49,774 కోట్లు
2014-15    రూ. 56,019 కోట్లు    రూ. 7,263 కోట్లు
                                 (ఖరీఫ్ ముగిసే నాటికి)

తొలి వాయిదా మాఫీ ‘మూడు రూపాయలు’...
-    రూ. 50 వేల రుణం తీసుకుంటే రుణ మాఫీ అర్హత మొత్తం రూ.15 అని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు వాయిదాల్లో మాఫీ చేసిన రూ. 15 చెల్లిస్తామని, తొలిసారి రూ. 3ను బ్యాంకు ఖాతాకు  జమ చేసింది.
-    కృష్ణా జిల్లా నందివాడ జనార్థనపురానికి చెందిన మలినేటి రమ్య కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 2013 ఏప్రిల్ 19న మూడు ఎకరాల్లో వరి సాగుకు రూ. 70,350 రుణం తీసుకున్నారు. ఆమె రుణం తీసుకున్న సమయంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వరికి రూ. 24 వేలుగా నిర్ధారించారు. ప్రభుత్వం రుణ మాఫీ కోసం ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రూ. 19 వేలుకు తగ్గించింది. దీని ప్రకారం ఆమె తీసుకున్న రుణంలో రూ. 57,190 మాఫీకి అర్హతగా ప్రభుత్వం నిర్ధారించింది. 2013 డిసెంబర్ వరకు వడ్డీతో కలిపి రూ. 59,800 మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

 వాస్తవంగా ఇప్పటి వరకు అయిన వడ్డీ రూ. 10,491. తొలి వాయిదా కింద ప్రభుత్వం జమ చేసిన మొత్తం రూ. 11,960. ఈ ఏ డాది వడ్డీని తీసేస్తే.. అసలుకు జమ అయ్యే మొత్తం రూ. 1469. అసలు నుంచి ఈ రూ. 1469ని తీసేస్తే.. ఇంకా రూ. 68,881 అప్పు బ్యాంకులో ఉంటుంది. 14 శాతం వడ్డీ రేటు ప్రకారం వచ్చే ఏడాది రూ. 9,643 వడ్డీ భారం పడుతుంది. ప్రభుత్వం వచ్చే ఏడాది రెండో వాయిదా కింద రూ. 11,960 జమ చేస్తుంది. వడ్డీపోనూ అసలులోకి జమ అయ్యే మొత్తం రూ. 1917. ఇలా ఐదేళ్లపాటు  వడ్డీకే సరిపోతుంది. ఐదు సంవత్సరాల తర్వాత బ్యాంకులో మిగిలే సొమ్మును ఎవరు తీర్చాలి?

-    తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర వెంకటసత్యనారాయణ 0.55 ఎకరాల భూమిలో వరి సాగు కోసం 2013 జూలై 15న రూ. 34 వేల రుణం తీసుకున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రూ. 13,200 మాఫీకి అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి వాయిదా కింద రూ. 2,762ను ప్రభుత్వం జమ చేసింది. 14 శాతం వడ్డీ ప్రకారం.. ఆయన ఖాతాలో రూ. 4,760 వడ్డీని బ్యాంకు అసలుకు కలిపేసింది. ప్రభుత్వం చేసిన విచిత్రమైన రుణమాఫీ ఫలితంగా ఇంకా రూ. 2 వేల వడ్డీ రైతు మీద పడింది.
-    విజయనగరం జిల్లా చంద్రంపేటకు చెందిన బి.రామూనాయుడు 0.55 ఎకరాల మీద తీసుకున్న రుణంలో మాఫీ చేసిన మొత్తం రూ. 15. తొలి వాయిదా కింద ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 3. మూడంటే మూడు రూపాయలే.  

86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు...
ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవుతో రైతులు అల్లాడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని రుణ ఊబిలో కూరుకుపోయాయి. ఫలితంగా టీడీపీ ప్రభుత్వం వచ్చాక 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సాధారణ వర్షపాతం కంటే 35 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. 580 మండలాల్లో కరవు తాండవిస్తోందని స్వయంగా సంబంధిత మంత్రే చెప్తుంటే.. ప్రభుత్వం 226 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించింది. అది కూడా శాసనసభ సమావేశాలకు ఒక రోజు ముం దు.. ఈ నెల 17న రాత్రి పది గంటలకు జీవో ఇచ్చింది. నవంబర్ ప్రారంభానికే కరవు మండలాల ప్రకటన వస్తే, రబీకి ఎలాంటి ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలో నిర్ణయించడానికి, రైతులకు సకాలంలో అందించడానికి వీలవుతుంది.

86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వాటిని ప్రభుత్వం గుర్తిం చనూ లేదు. వారి పరిహారం చెల్లించాల్సి ఉం టుందనే కారణంతోనే ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ కుటుంబాలను కూడా ఇంటింటీకి వెళ్లి ఓదార్చుతాను. అప్పుడైనా మీకు బుద్ధొస్తుంది. షరతులు, నిబంధనలు, పరిమితులు లేకుండా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబుకు సూటిగా చెప్తున్నా.’’
Share this article :

0 comments: