అంకితభావం ఆయన సొంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంకితభావం ఆయన సొంతం

అంకితభావం ఆయన సొంతం

Written By news on Wednesday, December 24, 2014 | 12/24/2014


అంకితభావం  ఆయన సొంతం
వైఎస్సార్ సీపీ యువజన నేతగా ప్రత్యేక గుర్తింపు
ఇటీవలి ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఎమ్మెల్యేగా పోటీ

 
వరంగల్ : రోడ్డు ప్రమాదం యువ నాయకుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రాణాలను బలిగొంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుధీర్‌రెడ్డి ఆకస్మిక మృతి పార్టీ వర్గాలను కలవరపరిచింది. తొలి నుంచి వైఎస్సార్ సీపీకి అంకితభావం ఉన్న నాయకుడిగా ఆయన పేరొందారు. ధర్మసాగర్ మండలం మలక్‌పల్లిలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన భీంరెడ్డి ఎల్లారెడ్డి, అరుణాదేవి దంపతులకు సుధీర్‌రెడ్డి మూడో సంతానం. 1979 ఫిబ్రవరి 9వ తేదీన జన్మించిన ఆయన హన్మకొండలో డిగ్రీ వరకు విద్యనభ్యసించారు.  ప్రస్తుతం హన్మకొండలో తల్లితో కలిసి నివసిస్తున్నారు. సుధీర్‌రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాస్తులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సుధీర్‌రెడ్డి చిన్నతనం నుంచి చురుకైన వాడిగా పేరొందిన ఈయన క్రమంగా వైఎస్.రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా, కాంగ్రెస్ పార్టీపై మక్కువ పెంచుకున్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూనే వైఎస్ మరణాంతరం జగన్ యువసేన ఏర్పాటు చేశారు. జగన్ యువసేన జిల్లా కన్వీనర్‌గా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించిన మరుక్షణం ఆ పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జగన్  అందించిన మార్గమే తన మార్గమంటూ తరచూ చెప్పే వారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం మొండితనంతో వైఎస్సార్ సీపీకి అండగా నిలిచారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆయన ప్రాచుర్యం పొందారు.  వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భంలో ఆయన విడుదలయ్యేవరకు ‘బ్లాక్‌షర్ట్’ ధరించి నిరసన తెలియజేస్తానంటూ అదే పద్ధతిని పాటించి తన అభిమానాన్ని చాటుకున్నారు. సీబీఐ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ ప్రచారం నిర్వహించారు. తర్వాత క్రమంలో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ వెనుకంజ వేయకుండా వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. కేసులు పెట్టినా, దాడులు జరిగినా... వెరవకుండా పార్టీకి అంకితభావం గల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.

ప్రచారంలో సైతం తనదైన ప్రత్యేకతను సుధీర్‌రెడ్డి కనబరిచేవారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పరామర్శయాత్రలో జిల్లాలోని మరికొందరు యువకులతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన స్వయంగా నిర్వహించారు. అంతలోనే ప్రమాదంలో భీంరెడ్డి మృతిచెందడాన్ని పార్టీ శ్రేణులు జీర్నించుకోలేకపోతున్నారుు.

పలువురి సంతాపం

భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే మృతిచెందడంపట్ల ఆవేదన వ్యక్తం చేశా రు. పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, యువజన కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి, మిత్రుడు కూనూరు శేఖర్‌గౌడ్, వీసం సురేందర్‌రెడ్డి, వేరుుస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు సంతాపం తెలియజేశారు.
 
సుధీర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
నేడు అంత్యక్రియలకు రానున్న పొంగులేటి
 
హన్మకొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధీర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అంత్యక్రియలకు వస్తున్నట్లు తెలిపారు. సుధీర్‌రెడ్డి పార్టీలో అంకితభావం గల నాయకుడని, క్రీయాశీల కంగా పనిచేసేవారని శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు సుధీర్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం వరంగల్‌కు వస్తున్నారు.
Share this article :

0 comments: