భారీవర్షంలోనూ చెక్కుచెదరని సంకల్పం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారీవర్షంలోనూ చెక్కుచెదరని సంకల్పం

భారీవర్షంలోనూ చెక్కుచెదరని సంకల్పం

Written By news on Thursday, December 11, 2014 | 12/11/2014


మహబూబ్ నగర్ : ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం.. అయినా చెక్కుచెదరని సంకల్పం. రాజన్న మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారిని పరామర్శించాలన్న దీక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో సాగిస్తున్న పరామర్శ యాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. కొడంగల్, కోస్గి ప్రాంతాలలో గురువారం నాడు భారీ వర్షం కురిసింది. ఆ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా షర్మిల తన పరామర్శ యాత్రను కొనసాగించారు.

ఇది పరామర్శ యాత్ర కాదని, పేద ప్రజల భరోసా యాత్ర అని గుయ బసవయ్య కొడుకు అమరేశ్వర్ వైఎస్ షర్మిలతో అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుకు అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఆయన చెప్పారు. ఆ పథకాలన్నింటి సంరక్షకులం మనమేనని ఆయన అన్నారు.
Share this article :

0 comments: