12 January 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

జనంలోకి వెళ్తే మీ బండారం ......

Written By news on Saturday, January 18, 2014 | 1/18/2014

 జనంలోకి వెళ్తే మీ బండారం బయటపడతుందని కాంగ్రెస్, టిడిపి నేతలను వైఎస్ఆర్ సిపి నేతలు హెచ్చరించారు. శాసనసభ వాయిదా వేసిన తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ  తెలంగాణ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు. సమైక్య తీర్మానం చేయాలని ఇప్పటికే తమ పార్టీ పలుమార్లు కోరిందని చెప్పారు.

విభజనకు వ్యతిరేకంగా మొదటిసారి గళమెత్తింది తమ పార్టీయేనని తెలిపారు. సమైక్యం కోసం వైఎస్ జగన్మోహన రెడ్డి  అలుపెరుగని పోరాటం చేశారని చెప్పారు.  రాష్ట్రపతి, ప్రధానికి సమైక్య ఆవశ్యకతను వివరించామన్నారు. విభజన నష్టాన్ని ప్రజలకు వివరించినది తమ పార్టీయేనన్నారు. ఒక ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా తాము సమైక్యాన్ని వీడలేదని చెప్పారు.

మూడు ప్రాంతాలను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి  సమానంగా చూశారని చెప్పారు.  వైఎస్‌ హయాంలో తెలంగాణలో 20వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదనడం  సరికాదన్నారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించినవారిలో తెలంగాణవారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. రాష్ట్ర విభజనను వైఎస్ఆర్ మొదట్నుంచీ వ్యతిరేకించారన్నారు. వైఎస్ఆర్ సీపీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.

విభజిస్తూనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యాంధ్ర అంటున్నారని విమర్శించారు. టిడిపి నేతలు కూడా విభజనకు సహకరిస్తూనే  నాటకాలాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవుతుందని చెప్పారు.  ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని తాము కోరలేదని చెప్పారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేకు రాసిన లేఖలో విభజన చేయాలని కోరలేదని తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా తమ పార్టీ  ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. ఏ ప్రాంతానికీ మేలు జరగనప్పుడు విభజన ఎందుకు? అని ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్లుగా కోయమనలేదని, సమన్యాయం అంటే సమంగా పాలించమని అర్థం అని వివరించారు.

హంతకులను బహిరంగంగా కాల్చేసేలా శిక్ష విధించాలి

విజయవాడ: ముంబైలో అనూహ్యను హత్య చేసిన హంతకులను బహిరంగంగా కాల్చేసేవిధంగా శిక్ష విధించి, అమలు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేత పేర్ని నాని అన్నారు. ముంబైలో దారుణంగా హత్యకు గురైన అనూహ్య భౌతికకాయానికి ఈ రోజు మచిలీపట్నంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ అనూహ్య మృతి దురదృష్టకరం అన్నారు.

చట్టాలు వచ్చినా మహిళలపై దాడులను ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులను బహిరంగా కాల్చేసే శిక్షలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.

ఆయన... సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది

సమైక్య ముసుగులో విభజనకు పూర్తి స్థాయిలో తోడ్పడుతున్న వ్యక్తి ఎవరైన ఉన్నారంటే అది రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో టి.బిల్లు చర్చ సందర్బంగా గుర్నాథ్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా శైలజానాథ్ సమైక్యవాదానికి తూట్లు పొడిచారని అన్నారు. సమైక్య కన్వీనర్ గా ఉన్న శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేశారని గుర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు.

గాలి వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్ కాంగ్రెస్

తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిస్పందించేందుకు వీలుగా తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ మనోహర్ ను కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో స్పీకర్ పోడియంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టుముట్టారు.

కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు శాసనభలో మొత్తం 9,024 సవరణలు అందినట్లు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బిల్లుపై సోమవారం నాడు మొత్తం సభ్యులందరికీ సవరణ ప్రతిపాదనలు అందిస్తామని ఆయన అన్నారు.

Shobha Nagi Reddy addressing media on Jan 18

Jagan's Samaikya yatra to resume on Jan 20

రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి

బాబుతో జైసమైక్యాంధ్ర అనిపించగలరా?
హైదరాబాద్ : ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీలా తమది రెండుకళ్ల సిద్ధాంతం కాదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడితో జై సమైక్యంధ్ర అనిపించగలరా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పని గోవిందా అని ఆయన అన్నారు.

రాష్ట్ర సమైక్యత కోరుకున్న మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.  వైఎస్ హయాంలో తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందన్నారు. మూడు ప్రాంతాలను వైఎస్ సమానంగా చూశారన్నారు. రాష్ట్ర ప్రజల మేలుకోరే తాము సమైక్యవాదాన్ని వినిపిస్తున్నామని భూమన అన్నారు. విభజన జరుగుతోందని తెలియగానే మొదట స్పందించింది వైఎస్ఆర్ సీపీయేనని ఆయన గుర్తు చేశారు.

తమ సమైక్య పోరాటం రాజకీయ లబ్ధి కోసం కాదని స్పష్టం చేశారు. సమైక్య తీర్మానం పెట్టాలని తాము తొలి నుంచి కోరుతున్నామన్నారు.  విభజన బిల్లుకు తాము వ్యతిరేకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది లోపలా, బయటా ఒకటే మాట అని భూమన స్పష్టం చేశారు. విభజనకు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు చేయటం దుర్మార్గమని భూమన మండిపడ్డారు

సి.ఎమ్. రమేష్ కు 400 కోట్ల రుణాల రీషెడ్యూలా!

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం రుణాల రీషెడ్యూలింగ్ ఎలా ఇచ్చిందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్.పి డాక్టర్ ఎమ్.వి.మైసూరారెడ్డి ప్రవ్నించారు.కాంగ్రెస్ తో సంబందం లేకుండానే ఆయనకు నాలుగు వందల కోట్ల రుణాల రీషెడ్యూల్ జరిగిందా అని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ భయపడే అవిశ్వాస తీర్మానం నోటీసును ఉపసంహరించిందన్న రమేష్ ఆరోపణను కొట్టివేస్తూ , తాము ఉపసంహరించుకోలేదని, వాయిదా మాత్రమే కోరామని, ఆ మేరకు లేఖను కూడా విడుదల చేస్తామని ఆయన అన్నారు.ఏడు రోజుల పాటు అవిశ్వసం నోటీసు ఇచ్చామని ,అసలు అవిశ్వాసం చర్చకు రావడానికి ఎందుకు టిడిపి ప్రయత్నించలేదని మైసూరా అన్నారు.

Courtesy; Kommineni

ఆ పార్టీలు ఎందుకు పెదవి విప్పడం లేదు?

సమైక్యంపై ఆ పార్టీలు ఎందుకు పెదవి విప్పడం లేదుఅసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న శోభానాగిరెడ్డి
హైదరాబాద్ : సమైక్యంపై శాసనసభలో కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు పెదవి విప్పడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి ఆ రెండు పార్టీలను ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శోభానాగిరెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేందుకు ఆ రెండు పార్టీలు ఉన్న సమయాన్ని వృధా చేస్తున్నాయని ఆరోపించారు.
 
కానీ సమైక్యంపై మాట్లాడేందుకు నోరు రావడం లేదంటూ అటు కాంగ్రెస్, ఇటు టీడీపీలకు సమయం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు చర్చలో పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒకే మాటకు కట్టుబడి ఉంటుందని శోభానాగిరెడ్డి స్పష్టం చేశారు.

విభజన కుట్రకు సాక్షులం కాలేం

విభజన కుట్రకు సాక్షులం కాలేంఅసెంబ్లీలో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ
* అసెంబ్లీలో విజయమ్మ స్పష్టీకరణ
* సభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్
 
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రమనే నినాదం ముసుగులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న విభజన కుట్రలో తాము ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనలేమని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ స్పష్టంచేశారు. ‘‘విభజన బిల్లుకు సభ అనుకూలమా? వ్యతిరేకమా? అని నిగ్గు తేల్చే విధంగా శాసనసభలో ఓటింగ్ పెట్టాలి. కానీ మేం ఎన్ని విధాలుగా అడిగినా సమాధానాలు లభించనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం’’ అని ఆమె ప్రకటించారు. అనంతరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు సమైక్య నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

శుక్రవారం ఉదయం 9 గంటలు సభ ప్రారంభమైన వెంటనే.. బిల్లుపై ఓటింగ్ కోసం పట్టుపడుతూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడింది. రెండోసారి 10.30 గంటలకు మొదలయినప్పుడు కూడా సభలో ఇదే దృశ్యం పునరావృతమైంది. వైఎస్సార్ సీపీ సభాపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ మనోహర్ చెప్పడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాంతించి తమ స్థానాల్లో కూర్చున్నారు. నిరసన వ్యక్తం చేయడానికి విజయమ్మకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...

ఎన్నిసార్లు సీఎంకు విన్నవించినా, బీఏసీలో మా పార్టీ విధానం చెప్పినా.. దురదృష్టవశాత్తూ విభజన ప్రక్రియ ముందుకు సాగుతోంది. బిల్లు ఉద్దేశాలు, కారణాలు చెప్పకుండా, ఆర్థికపరమైన సమాచారం ఇవ్వకుండా బిల్లును సభకు పంపించారు.
విభజన బిల్లును తిరస్కరించడానికి సభలో ఓటింగ్ నిర్వహిస్తారా? నిర్వహించరా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలి. సభానేతగా ముఖ్యమంత్రి అయినా స్పష్టత ఇవ్వాలి.

 ఓటింగ్ ఉంటే ఎలా ఉంటుంది? క్లాజుల వారీ లేదా షెడ్యూళ్ల వారిగానో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలి.
 ఎలాంటి స్పష్టత లేకుండా బిల్లు మీద ఎందుకు చర్చ జరగాలి? ఈ విషయాలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోంది?

 ‘విభజన వద్దు. అడ్డుకుందాం...’ అనేది మా పార్టీ విధానం. ఈమేరకు అఫిడవిట్ల రూపంలో రాష్ట్రపతికి చెప్పాం. 164 నిబంధన కింద మా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పిటిషన్ల రూపంలో సమర్పించాం. బిల్లులోని అన్ని క్లాజులను తొలగించాలని సవరణ ప్రతిపాదనలు ఇచ్చాం.

విభజన ఎలా జరగాలన్న చర్చలో భాగస్వాములం కాదల్చుకోలేదు.
సమైక్యం ముసుగులో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కలిసి చేస్తున్న విభజన కుట్రలో ప్రత్యక్ష సాక్షులుగా పాల్గొనబోం. అదే సమయంలో.. రాష్ట్రపతి అడిగిన మేరకు మా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తాం.

రాష్ట్ర విభజన 10 కోట్ల మందికి సంబంధించిన అంశం. కాంగ్రెస్ ఇంటి విధానం కాదు. వారి (కాంగ్రెస్) స్వార్థం కోసం తెలుగుజాతిని బలిపెట్టద్దని కోరుతున్నాను.

సమైక్యంలోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. 1972లో ఇందిరాగాంధీ కూడా చెప్పారు. 60 సంవత్సరాలుగా కలిసున్న రాష్ట్రాన్ని ఎందుకు విడదీయాలి? 2,700 సంవత్సరాలు కలిసున్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలి? బ్రిటిష్, నిజాం కాలంలో విడిపోవాలనుకోలేదు. ఇప్పుడెందుకు విడిపోవాలి?

* విభజనకు శాసనసభ అనుకూలమా?వ్యతిరేకమా? అని చెప్పడానికి ఓటింగ్ నిర్వహించాలి. మా అభిప్రాయం చెప్పమన్నప్పుడు మా ఎమ్మెల్యేలు వచ్చి చెప్తారు. సమైక్యం మా విధానం, నినాదం.

ప్రాజెక్టులు పట్టని ప్రభుత్వం

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆయన పార్టీ జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి సౌకర్యం లేక జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
 
 రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. ఏజెన్సీలోని గిరిజన రైతుల ఉపయోగార్థం పాలెంవాగు, మోడికుంట, గుండ్లవాగు ప్రాజెక్టులకు వైఎస్ సమయంలోనే నిధుల కేటాయింపులు జరుగగా, వీటి గురించి ప్రస్తుతం పట్టించుకున్న నాథుడే లేడన్నారు. సాగునీటి ఇబ్బందులను అధిగమించి రెక్కల కష్టంతో పండించిన పంటకు కూడా ఈ ప్రభుత్వం తగిన గిట్టుబాటు ధర కల్పించకపోవటం బాధాకరమన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం కనీసం ప్రకృతి వైపరీత్యాల సమయంలోనైనా తగిన రీతిలో స్పందించి ఆదుకోకపోవడం విచారకరమన్నారు. గోదావరి వరదలతో పరివాహక రైతులకు అపార నష్టం వాటిల్లిందని, అనేక మంది ఇళ్లను కూడా కోల్పోయారని, వారికి మాత్రం నేటికి తగిన రీతిలో పరిహారం అందలేదని అన్నారు. ప్రజల కష్టాలు పట్టించుకోని ఈ ప్రభుత్వాలు ఉండి ఉపయోగమేమిటని ప్రశ్నించారు. రైతు బాధలు తొలగించే రాజన్న రాజ్యం జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో త్వరలోనే వస్తుందన్నారు.  
 
 సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యం : వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ పాయం
 సంక్షేమ పథకాలు ప్రజలకు  సవ్యంగా అందాలంటే జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పడిన వైఎస్సార్‌సీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుందని అన్నారు. రాజన్న రాజ్యం కోసం అన్ని వర్గాల ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేసే ఈ ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాగా వేయనున్నట్లుగా తెలిపారు. ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్తలు తాటి వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడబోతున్నారని జోస్యం చెప్పారు.
 
 ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, పార్టీ విభాగాల రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, ఉప్పాడ ప్రసాదరెడ్డి, నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఉమామహేశ్వరి, పట్టణ కన్వీనర్ పెద్దినేని శ్రీనివాస్, మహిళా విభాగం మండల కన్వీనర్ దామెర్ల రేవతి పాల్గొన్నారు.

ఎవరికి ఓటు వేయాలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ...

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెడితే టీడీపీకే నష్టం జరుగుతుందని, తమ పార్టీపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి అన్నారు.  కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళదామనుకుంటున్నవారు సీఎం పార్టీ పెడితే ఆగిపోతారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎం వెంట వెళ్లరన్నారు.
 
 వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని ఓ పత్రిక, చానల్‌లో వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. వారు మాబలం ఎంత పడి పోతుందని చెబితే అంత  ఎక్కువగా బలం ఉన్నట్లని అన్నారు. ఉప ఎన్నికలు జరిగినపుడు కూడా వైఎస్సార్‌సీపీ బలం తగ్గిపోయిందని అదే పత్రిక, చానల్ వార్తలు ప్రసారం చేశాయని.. కానీ ఫలితాలు ఎలా వచ్చాయన్నది అందరికీ తెలిసిందేనన్నారు

బాబు పెద్ద అవకాశవాది

బాబు పెద్ద అవకాశవాది: వైఎస్సార్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది ఆకాశమంత అవకాశవాదమని వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించింది.  తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో విభజన డిమాండ్ చేయిస్తూ, సీమాంధ్ర వారితో సమైక్య నినాదాలు వినిపిస్తున్న చంద్రబాబు దోబూచులాట తేటతెల్లమవుతోందని దుయ్యబట్టింది. బాబుది అవకాశవాదమైతే, కిరణ్‌ది బూటకపు సమైక్యవాదమని ధ్వజమెత్తింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని మొదట్నుంచీ చెబుతున్న దానికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది.
 
 పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి,అమరనాథరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డితో కలసి గొల్ల బాబూరావు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘‘విభజన వల్ల కలిగే నష్టాలను గ్రహించి ఇకనైనా కళ్లు తెరవండి. అని మా శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ సీఎం,ప్రతిపక్ష నేతను కోరారు. కానీ, వారిద్దరూ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసేందుకు సంఘీభావం తెలుపలేదు. ఆ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలనే డిమాం డ్‌కు అంగీకరించనందునే మా పార్టీ వాకౌట్ చేసింది’’ అని వివరించారు.

31న ఓటర్ల జాబితా ముద్రణ

ఓటర్ల జాబితా ముద్రణ ఈ నెల 31న జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా, ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవ ఏర్పాట్లతో పాటు రానున్న ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు వంటి అంశాలపై సమీక్షించారు.

 ఓటరు దరఖాస్తులను ఈ నెల 21లోగా ఫొటోలతో సహా అప్‌డేట్ చేయాలని, 23లోగా ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన ధ్రువీకరణ ప్రతాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 4,41,441 దరఖాస్తులు అందాయని, 3,70,780 తనిఖీ చేసి ఆమోదించామన్నారు. 39,232 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపారు.

 మిగిలిన పెండింగ్ దరఖాస్తుల పరిశీలన శనివారం మధ్యాహ్నం నాటికి పూర్తవుతుందన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.

విధానాలను వీధుల్లో విడిచి...

విధానాలను వీధుల్లో విడిచి, సమైక్యవాదాన్ని గాలికొదిలి... శాసనసభ వేదికగా అంటకాగుతున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలు వైఎస్సార్‌సీపీపై మూకుమ్మడిగా దాడి ప్రారంభించాయి. రెండు కళ్ల సిద్ధాంతం, ప్రాంతాలవారీ వాదనలతో గందరగోళం సృష్టించిన ఆ రెండు పార్టీలు సమైక్యజెండాను భుజానికెత్తుకున్న వైఎస్సార్‌సీపీపై దాడి చేయడానికి ఒక్కటయ్యాయి. శాసనసభలో శుక్రవారం చోటుచేసుకున్న ప్రసంగాలు, పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. విభజన ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి, ఎలాంటి ఆటంకాలు లేకుండా బిల్లును ఢిల్లీ చేర్చడానికి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే శాసనసభలో వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
 శుక్రవారం పరిణామాలివీ...
 -    తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని పార్టీ పోలిట్‌బ్యూరో ఎప్పుడో నిర్ణయించిందంటూ సభావేదికపైనే టీడీపీ సభ్యుడు రావుల నొక్కి చెప్పినా ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర సభ్యులు నోరు విప్పరు. ఒక పార్టీ తరఫున ఒకే అభిప్రాయం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయరు.
-    అప్రజాస్వామికంగా సాగుతున్న చర్చలో పాల్గొనలేమని వైఎస్సార్‌సీపీ వాకౌట్ చేస్తే.. మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తంచేశారు. నిరసన తెలిపేవారు ఇంత సుదీర్ఘంగా మాట్లావద్దంటూ... వైఎస్సార్‌సీపీపై విమర్శల దండకం అందుకున్నారు. గతవారం కూడా సభలో ఇవే అంశాలను చెప్పారని, మరోసారి నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఆ పార్టీకి అవకాశం ఇవ్వద్దని స్పీకర్‌ను కోరారు. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌దీ అదే మాట. అయితే ఓటింగ్ కోసమే విజయమ్మ పట్టుబడుతున్న విషయాన్ని కావాలనే విస్మరించారు.
 
 -   ‘‘సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల అసలు రంగు బయటపెట్టడం ద్వారా అప్రజాస్వామికంగా సాగుతున్న విభజన ప్రక్రియను విజయమ్మ సభలో ఎండగట్టారు. ఓటింగ్ ఉంటుందో లేదో చెప్పకుండా జరిగే చర్చలో పాల్గొనమన్నారు. సర్కారు తీరుకు నిరసనగా ఆమె మాట్లాడుతున్నప్పుడు.. సమైక్యవాదులని చెప్పుకుంటున్న వారంతా రాజకీయ ప్రయోజనాల కోసం చూశారే తప్ప.. సమైక్యవాదానికి అనుకూలంగా కలిసివచ్చే చిరు ప్రయత్నం కూడా చేయలేదు’’ అని ఒక నేత మీడియాపాయింట్ వద్ద వ్యాఖ్యానించారు.
 
 -    ‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏదీ స్పష్టంగా చెప్పరు. కనీసం సవరణలూ ప్రతిపాదించరు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోరు, ఆయనముందే పార్టీ సభ్యులు పరస్పర అనుకూల, వ్యతిరేక వాదనలు వినిపిస్తారు. కాంగ్రెస్ పార్టీలోనూ అంతే. కానీ వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడితే.. ఇరు వైపుల నుంచి రెండు పార్టీలకు చెందిన సభ్యులు ప్రాంతాలకు అతీతంగా విమర్శలకు దిగారు’’ అని ఒక మరో నేత విశ్లేషించారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప.. సమైక్యవాదం ఎవరికీ పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా

జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా
* రెండు రోజుల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
* 20 నుంచి నగరిలో పునఃప్రారంభం
 
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మెడనొప్పి తగ్గకపోవడంతో సమైక్య శంఖారావం యాత్ర మరో రెండు రోజులు వాయిదా పడింది. నొప్పి కారణంగా ఇప్పటికే ఆయన తన యాత్రను ఈ నెల 18కి వాయిదా వేసుకున్న విషయం విదితమే. శుక్రవారం మధ్యాహ్నం జగన్‌ను పరీక్షించిన అపోలో ఆసుపత్రి వైద్యులు మరో రెండు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు.

దీంతో ఈ నెల 20న చిత్తూరు జిల్లా నగరి నుంచి యాత్ర పునఃప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. 20వ తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో బయలుదేరి వెళ్లి నగరి నియోజకవర్గంలో యాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

Vasireddy Padma press meet on Jan 17th

Written By news on Friday, January 17, 2014 | 1/17/2014

YS Vijayamma speech in assembly on Jan 17

మీ కళ్లు బైర్లు కమ్మాయా?

'కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసిన ప్రతి తప్పులో మీరు భాగస్వాములు కాదా?, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని నిలవదీయలేని మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారా?, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్, విజయమ్మలు చేసిన దీక్షలు మీకు కనిపించలేదా?, కళ్లు బైర్లు కమ్మాయా?, కాంగ్రెస్ విసిరే కుక్క బిస్కెట్లకు ఎగబడే మీరా?మమ్ముల్ని విమర్శించేది' అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సీమాంధ్ర ఎంపీలపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..  సీమాంధ్ర సమైక్యత కోసం ఆ ప్రాంత ఎంపీ హోదాలో ఉన్న సబ్బం హరి ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
 
అసలు వైఎస్ జగన్ కు సలహాలు ఇచ్చే అర్హత ఉందా?అని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి తప్పులో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భాగస్వాములేనని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడం కోసం వైఎస్ జగన్, విజయమ్మ చేసిన దీక్షలు కనబడలేదా?అని ఆమె ప్రశ్నించారు..

అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు

'అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు'
హైదరాబాద్:లోక్ సభలో వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. కావాలనే టీడీపీ నేతలు దగుల్బాజీ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.అవిశ్వాసానికి అవసరమైన మద్దతుకోసం కాంగ్రెస్-టీడీపీలు ఏరోజూ ప్రయత్నించలేదన్నారు. లోక్ పాల్ బిల్లుకోసం అవిశ్వాసాన్ని వాయిదా వేయమని కోరామే తప్పా..ఉపసంహరించుకోలేదని మైసూరా తెలిపారు. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులని విమర్శించారు.టీడీపీ చేస్తున్న సిగ్గులేని రాజకీయాలను చేసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

అధిష్టానం చేతిలో సబ్బం కీలుబొమ్మ

నర్సాపురం : ఎంపీ సబ్బం హరివి ఊసరవెల్లి రాజకీయాలని వైఎస్ఆర్ సీపీ నేత ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా మారిన ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని శుక్రవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ఆయన పావుగా ఉపయోగపడుతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారని ప్రసాదరాజు అన్నారు

ఆనం నోరు అదుపులో పెట్టుకో'

రెవెన్యూ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, బాబురావు, శ్రీనివాసులు హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం వారు మాట్లాడారు. దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యం వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్న విషయాన్ని మరచిపోవద్దని వారు ఆనంకు గుర్తు చేశారు.
 
మరోసారి నోరు జారితే చూస్తూ ఊరుకోమన్నారు. తెలుగుదేశం పార్టీ నేత పయ్యావులకు తమను విమర్శించే అర్హత లేదన్నారు. విభజనపై మీ విధానమేంటో మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును అడగాలని వారు సూచించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ తమ పార్టీని విమర్శించే హక్కు లేదని అమర్నాథ్‌రెడ్డి, బాబురావు,శ్రీనివాసులు తెలిపారు.

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

 రాష్ట్ర విభజన వద్దు.. విభజనను అడ్డుకుంటామనేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విధానమని.. వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీలో స్పష్టంచేసింది.  ఓటింగ్‌పై స్పష్టత ఇవ్వనందుకు.. సభనుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వాకౌట్‌ చేసింది.  విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది సభ తేల్చాలని.. ఇందుకు ఓటింగ్‌ ఉంటుందా లేదా అన్న అంశంపై.. స్పీకర్‌ స్పష్టత ఇవ్వాలని..వైఎస్ విజయమ్మ కోరారు. 
రాష్ట్ర విభజన.. ప్రభుత్వం, ప్రతిపక్షం కలసి చేస్తున్న కుట్రఅన్న  విజయమ్మ.. ఈ కుట్రలో తాము భాగస్వాములం కామన్నారు. 10 కోట్ల తెలుగుజాతికి అన్యాయం చేయొద్దని.. అసలు తెలుగు ప్రజలు ఎందుకు విడిపోవాలని.. వైఎస్ విజయమ్మ సభలో ఆవేదన వ్యక్తంచేశారు.   విభజన బిల్లుపై చర్చించడమంటే ప్రజలను వంచించడమేనంటూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

అమ్మో.. ‘దేశ’ ముదురు

అమ్మో.. ‘దేశ’ ముదురుపశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో తెలుగుదేశం నాయకునిగా ఏర్పాటుచేసిన బొమ్మరిల్లు అధినేత రాయల రాజారావు (రాజా) ప్లెక్సీ
* వంద కోట్లు మింగేసిన ‘బొమ్మరిల్లు’ రాజారావు
* అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు
* కోట్లు సేకరించి టీడీపీ మద్దతుదారుల గెలుపు కోసం వెదజల్లిన వైనం
* వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి చింతలపూడి టికెట్ ఆశిస్తున్న రాజారావు
* పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం రూ.3 కోట్ల ఖర్చు
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది ఏజెంట్లు.. మాయమాటలతో 40 వేల మంది నుంచి డిపాజిట్ల సేకరణ.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా వంద కోట్లు! మోసం బట్టబయలు కాగానే పరార్!! ‘బొమ్మరిల్లు’ పేరుతో అమాయక జనాన్ని నిండా ముంచిన ‘దేశ’ ముదురు రాయల రాజారావు ఘరానా మోసమిదీ. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్తగా ఉన్న ఈయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

వివిధ జిల్లాల్లోని డిపాజిట్‌దారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాజారావును, ఆయన భార్య స్వాతిని అరెస్టు చేసేందుకు విశాఖ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విశాఖ పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి.. ఎనిమిది జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న రాజారావు, రెండో ముద్దాయిగా ఉన్న ఆయన భార్య స్వాతి, మూడో ముద్దాయి, రాజారావు బావమరిది లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నారు.
 
పక్కాగా స్కెచ్..
* గతంలో హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసిన రాజారావు.. వచ్చే ఎన్నికల్లో చింతలపూడి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు వీలుగా ఇటీవలే విశాఖకు మకాం మార్చారు.
* ఏలూరుకు చెందిన టీడీపీ నేత మాగంటి బాబు ద్వారా పార్టీలో చేరిన ఈయన ఎనిమిది నెలలుగా చింతలపూడిలో భారీగా ఖర్చుచేస్తున్నారు.
     
* ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థుల కోసం బొమ్మరిల్లు సంస్థ నుంచి రూ.3 కోట్లకు పైగా సొమ్ము మళ్లించినట్లు సమాచారం. వీటన్నింటిపై పోలీసులు దృష్టి సారించారు.
     
* ఆర్‌బీఐ, సెబీ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసిన రాజారావు.. రాజకీయాల్లో చేరడం ద్వారా రక్షణ పొందాలనే వ్యూహంతోనే టీడీపీలో చేరారని పోలీసులు అనుమానిస్తున్నారు.
     
ఈ వ్యూహంలో భాగంగానే బొమ్మరిల్లు సంస్థల చైర్మన్, ఎండీ పదవులనుంచి తప్పుకొంటున్నట్లు నాటకం ఆడి డెరైక్టర్ల పేరిట కొందరు అనామకులను తెరపైకి తీసుకువచ్చారు.
     
బొమ్మరిల్లు డెరైక్టర్లుగా ఉన్న వానపల్లి వెంకటరావు, సాధ శ్రీనివాసరావు, కమ్మెల బాపూజీ, గోవిందు ఎర్రయ్య, మేనేజర్ సత్యనారాయణలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
 
మోసం ఇలా..
2011, ఆగస్టులో రాజారావు బొమ్మరిల్లు సంస్థను ప్రారంభించారు. హైదరాబాద్‌లో రాజా హోమ్స్, విశాఖలో బొమ్మరిల్లు రియల్ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ సహా పలు సంస్థలను ఏర్పాటు చేశారు.
     
సినీనటులు, రాజకీయ నేతలతో ఆర్భాటంగా వెంచర్లు ప్రారంభింపజేశారు. ప్రజల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేశారు.
కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప, తూర్పు గోదావరి తదితర జిల్లాలతో పాటు ఒడిశాలోనూ డిపాజిట్లు సేకరించారు.
     
దాదాపు 3 వేల మంది ఏజెంట్లను నియమించి 40 వేల మంది నుంచి రూ.100 కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. ఇందులో ఇప్పటి వరకూ రూ. 20 కోట్లు మాత్రమే చెల్లించారు.
 
సంస్థ పేరిట ఉందంటున్న 300 ఎకరాల భూమి కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ కాలేదని సమాచారం.

సబ్బం చెప్పినవన్నీ అబద్ధాలే

తమ పార్టీ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయమై ఎంపీ సబ్బం హరి చెప్పినవన్నీ అబద్ధాలేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పష్టం చేశారు. సబ్బం హరి చేసిన విమర్శలను గురువారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు డ్రామాలో మరో అంకమనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ఆయన పావుగా ఉపయోగపడుతున్నారనే విషయూన్ని చెప్పకనే చెప్పాడన్నారు.
 
  ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందలేదంటూనే, అదే ఏఐసీసీ డ్రామాలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు నానా పాట్లూ పడ్డారని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెస్‌లోనే కొనసాగడమే కాకుండా.. ఆ పార్టీ ఆడిస్తున్న వీధినాటకాల్లో తానెంతటి నీచపాత్రనరుునా పోషిస్తానని హైకమాండ్‌కు సంకేతాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాలోని ఒక తోకపత్రిక తన ఆత్మానందం కోసం పుట్టించుకున్న ఓ సర్వే అనే బిడ్డను సబ్బం తన  భుజాలకు ఎత్తుకుని మోశారని విమర్శించారు.
 
  కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీ తెలుగుదేశం, సబ్బం హరి చేరాలనుకుంటున్న సీఎం పార్టీల సత్తా ఏమిటో, ఆయనకు జనంలో ఉన్న ఇమేజీ ఏమిటో మరో నాలుగు నెలల్లో తేలిపోతుందని అన్నారు. రామోజీ పత్రికను మత గ్రంథాలతో పోల్చడం ద్వారా రామోజీరావే తనకు దేవుడని సబ్బం చెప్పకనే చెప్పుకున్నారని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నినాదం కాదని.. విధానమని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉండే అవకాశం లేనేలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రేలాపనలు కట్టిపెట్టాలని సబ్బం హరిని అప్పారావు హెచ్చరించారు.

విభజన బిల్లును వ్యతిరేకిస్తూ... అభిప్రాయాలు మళ్లీ చెబుతాం

 చర్చలో పాల్గొనం వైఎస్సార్‌సీపీ
జగన్‌తో పార్టీ ముఖ్యనేతల భేటీ
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటేస్తామన్న భూమన
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి ఉద్దేశించిన విభజన బిల్లుపై శాసనసభలో జరిగే చర్చలో తాము పాల్గొనబోమని, అయితే రాష్ట్రపతి సూచనల ప్రకారం బిల్లుపై తమ అభిప్రాయాలను మాత్రం మళ్లీ కచ్చితంగా చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ బిల్లుపై ఓటింగ్ జరిపితే అందులో తమ ఎమ్మెల్యేలందరూ పాల్గొని వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశామని, విభజనకు వ్యతిరేకంగా మళ్లీ అవే అభిప్రాయాలను వెల్లడిస్తామే కానీ చర్చలో పాల్గొనబోమని విస్పష్టంగా తెలిపారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎంవి మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, వైవీ సుబ్బారెడ్డి, దాడి వీరభద్రరావు సహా పలువురు ముఖ్యనేతలు, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమై శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో బిల్లుపై ఓటింగ్ జరిగేలా ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం కరుణాకర్‌రెడ్డి పార్టీ శాసనసభాపక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి, విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ సమక్షంలో సభలో జరిగే చర్చలో పాల్గొనే ప్రసక్తే లేదని చెప్పారు. సమైక్యవాదం ముసుగులో సీఎం కిరణ్, రాష్ట్రాన్ని విభ జించాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇద్దరూ కుమ్మక్కయి విభజన బిల్లుపై చర్చ సజావుగా పూర్తి చేసి కేంద్రానికి పంపడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కోర్ కమిటీలోనూ, ఆ తరువాత సీడబ్ల్యూసీలోనూ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకున్నపుడు భాగస్వామిగా ఉన్న సీఎం అప్పుడు గంగిరెద్దులా తలూపి వచ్చారని, ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు భయపడి పది రోజుల తరువాత బయటకు వచ్చి తాను విభజనకు వ్యతిరేకమంటూ సన్నాయి నొక్కులు నొక్కి పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకుని మాట్లాడి ఆ ఉద్యమంపై కిరణ్ నీళ్లు చల్లారన్నారు.

తీర్మానం ద్వారా బిల్లును ఓడిద్దామని, రకరకాలుగా ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి.. చివరకు విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకే సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. సభలో బిల్లును ప్రవేశపెట్టేటపుడు ఉద్దేశ్యపూర్వకంగా సభకు రాకుండా, బీఏసీ సమావేశాలకు గైర్హాజరవుతూ బయట మాత్రం సమైక్యవాదినని పత్రికల్లో రాయించుకున్నారని ఆరోపించారు. ఇక బాబు 2008లో ప్రణబ్ కమిటీకి తెలంగాణ ఏర్పాటు చేయాలని లేఖ నివ్వడంతో పాటుగా 2009లో అప్పటి హోంమంత్రి చిదంబరంతో జరిగిన సమావేశంలో కూడా విభజనకు అనుకూలమని స్పష్టంగా చెప్పారని భూమన గుర్తుచేశారు.

అంతటితో ఆగకుండా షిండేతో జరిగిన సమావేశంలో సైతం రాష్ట్రాన్ని త్వరగా విడగొట్టాలని చెప్పారని, అయితే సీమాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాక ఇపుడు ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలతో నాటకాలాడిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ద్వారా వచ్చిన బిల్లుపై తమ పార్టీ వంద శాతం అభిప్రాయాలు వ్యక్తీకరిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ నెల 11న ఏకాదశి నాడు తిరుమలలో విచ్చలవిడిగా వీఐపీ పాసుల జారీపై ప్రశ్నించినందుకు సామాన్య భక్తులపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు

అంతా అధిష్టానం ఆదేశానుసారమే

 కిరణ్ నేతృత్వంలో ‘కొత్త పార్టీ’
* అంతా అధిష్టానం ఆదేశానుసారమే
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరో డ్రామాకు శ్రీకారం చుట్టింది. అంతర్గతంగా రాష్ట్ర విభజనకు సహకరిస్తూ, పైకి మాత్రం సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈ కొత్త నాటకానికి తెర లేపుతోంది. తన ఆదేశాలను తు.చ. తప్పకపాటిస్తూ, రాష్ట్ర విభజనను చివరి అంకంవరకు తీసుకొచ్చిన కిరణ్‌ను ఇప్పుడు సమైక్య నినాదం ముసుగులో జనంలోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సమైక్యం పేరుతో కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. సీమాంధ్ర జిల్లాల్లో కొద్ది రోజులుగా దర్శనమిస్తున్న ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులన్నీ అధిష్టానం మొదలుపెట్టిన కొత్త డ్రామాలో అంకమేనన్న విషయం మరో నాలుగు రోజుల్లో ప్రజల ముందు బహిర్గతం కానుంది. త్వరలో ముసుగును తొలగించి కొత్త నాటకంలో తన పాత్రలోకి ప్రవేశించేందుకు కిరణ్‌కు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను ఆయన సిద్ధం చేశారు.

రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చను సాఫీగా ముగించి, బిల్లు రాష్ట్రపతికి చేరేలా మార్గాన్ని సుగమం చేశాక కిరణ్ ద్వారా కొత్త పార్టీకి అంకురార్పణ చేయించడమే కొత్త నాటకంలో ప్రధానాంశంగా తేలుతోంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలే అందుకు వేదికగా మారనున్నాయి. శుక్రవారం నుంచి, అసెంబ్లీ సమావేశాలు ముగిసే 23వ తేదీ దాకా సమైక్య ప్రచారాన్ని కిరణ్ ముమ్మరం చేస్తారు. ఆ వెంటనే పార్టీ ప్రకటన వంటి పరిణామాలూ ఈ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఉన్నాయని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎనిమిది రోజులూ సభ లోపల, బయట కిరణ్ సమైక్యవాదాన్ని వినిపించడంతో పాటు అందుకు పెద్ద ఎత్తున ప్రచారం లభించేలా రంగం చేశారు.
 
ఆది నుంచీ...
విభజన కీలక దశలకు ముందు కిరణ్‌కు వాటినే ప్రస్తావిస్తూ, అవి సాధ్యం కానే కావని చెప్పడం, ఆ తరవాత సరిగ్గా అదే దిశగా కేంద్రం చర్యలను పూర్తి చేయడం జరిగిపోతూ వచ్చాయుని గుర్తు చేసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలను శిరసావహించి వచ్చినందునే కిరణ్  కోర్‌కమిటీలో తానేం మాట్లాడానో మీడియా ముందుకు వచ్చి చెప్పకుండా, సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించినట్లుగా బయుటకు మాత్రం లీకులు ఇప్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేయడంతోపాటు యూపీఏ భాగస్వామ్యపక్షాల సమావేశాన్నీ నిర్వహించి వారి ఆమోదాన్నీ తీసుకుంది.

ఈరెండు సమావేశాలు గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే సమైక్యవాదంపై చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి ఉండేవారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత పది రోజుల పాటు ఏమీ మాట్లాడకుండా సీఎం వనం దాల్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఆ తరువాత మీడియా సమావేశం పెట్టి నింపాదిగా సమస్యలు ఏకరవు పెడుతూ విభజన ఎలా చేస్తారంటూ అధిష్టానాన్ని ప్రశ్నించినట్లుగా మాట్లాడారు.

తాను చెప్పే సమస్యలను తీర్చాకనే విభజన చేయాలన్నారు. అది పార్టీ నిర్ణయమే తప్ప కేంద్రం నిర్ణయం కాదని, కేంద్రం రాష్ట్ర విభజనపై అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదన్నారు. విభజనకు కారణాలు చూపే పీఠికను రూపొందించడమే కష్టమని చెబుతూ వచ్చారు. తీరా కేంద్ర హోం శాఖ తెలంగాణ నోట్‌ను రూపొందించడంతోపాటు దాన్ని టేబుల్ ఐటెమ్‌గా కేబినెట్ ముందుకు తీసుకురావడం, ఎలాంటి చర్చకు తావులేకుండానే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయినా కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి స్పందన లేకుండా వారం గడిచాక నోరు విప్పారు.
 
మరో వారంలో: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. ఆరోజుతో అసెంబ్లీలో బిల్లుపై అభిప్రాయ సేకరణ పూర్తిచేసి తిరిగి రాష్ట్రపతికి పంపాలి. ఈతరుణంలో సమైక్యం పేరిట కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రజల్లోకి పంపే సన్నాహాల వెనుక రాజకీయంగా బలమైన కారణాలే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్య నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి దూసుకుపోతుండడంతో అటు కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడబలుక్కొని ఈ కొత్త నాటకానికి తెర తీసినట్టు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని ఇప్పటివరకు దేశంలోని అన్ని కాంగ్రెసేతర జాతీయ పార్టీల నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలసి విన్నవించారు.

ఈ దశలోనే సీఎం కిరణ్‌తో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టించేందుకు అసెంబ్లీ వేదికగా సమైక్య ప్రచారం వినిపించేలా కార్యాచరణ రూపొందినట్టు తెలుస్తోంది. ఈ కొత్త పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించిన సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ చూస్తున్నట్లు చెబుతున్నారు. వివిధ బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.30 వేల కోట్ల మేర అక్రమాలు చేసినట్లు ఆరోపణలున్నప్పటికీ ఆ ఎంపీపై అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం వెనుక రాష్ట్ర విభజనకు ఆయన అందిస్తున్న సహకారమే కారణమని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తన ఆదేశాలను తూ.చ తప్పక పాటిస్తున్నందునే చివరి నిముషం వరకు సీఎం సీట్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధిష్టానం కొనసాగనిస్తోందని, అలా కాకపోతే ఈపాటికే ఆయన్ను మార్చేసేవారేనని పేర్కొంటున్నారు.

తనకు వ్యతిరేకంగా ఉంటే ఢిల్లీలో విమానం ఎక్కి హైదరాబాద్‌లో దిగేలోపే సీఎంలను మార్చే సంస్కృతి ఉన్న కాంగ్రెస్ కిరణ్ పట్ల ఇంత ఉదారతతో ఉందంటే అందుకు కారణం ఆయన విభజనకు పూర్తి సహకారం అందించడమేనని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సమైక్యం కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను ఎలా కట్టడి చేయాలో అంతుబట్టక కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా కొత్త ముసుగులో త్వరలోనే తెరమీదకు రావడానికి సర్వం సిద్ధమైంది.
 
సీమాంధ్రులను మభ్యపెట్టి
విభజనపై అధిష్టానానికి ఆది నుంచి కిరణ్ పూర్తి సహకారాన్ని అందించడమే కాకుండా, సమైక్య ముసుగులో సీవూంధ్ర పార్టీ ఎమ్మెల్యేలను భ్రమల్లో ఉంచడం ద్వారా ఎక్కడా అడ్డంకులు లేకుండా చేయడం తెలిసిందే. బిల్లును అడ్డుకుంటానంటూ చెబుతూనే, దానిపై చర్చను చివరి దశ దాకా తీసుకెళ్లడమే గాక, సహచర ఎమ్మెల్యేల నుంచి కూడా అందుకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన నైజం అర్థమయ్యాక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా కంగుతిన్నారు.

కిరణ్ సమైక్య నినాదం వెనుక రాష్ట్ర విభజనకు సహకారం, కొత్త పార్టీ వ్యూహం దాగున్నాయని అర్థమై, తాము పూర్తిగా మోసపోయామంటూ ఆవేదనకు గురవుతున్నారు. రాష్ట్ర సమైక్యతకు కిరణ్ అడుగడుగునా తూట్లు పొడిచిన వైనాన్ని వారు వరుసగా గుర్తుచేసుకుంటున్నారు. విభజనపై ప్రతి అడుగూ కిరణ్‌కు ముందే తెలుసునని, అయినా అధిష్టానంతో కుమ్మక్కై వ్యవహారాన్ని ముందుకు నడిపించారని నిర్ధారణకొస్తున్నారు. గత ఏడాది జనవరిలో జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీలోనే అధిష్టానం తెలంగాణపై నిర్ణయుం తీసుకొని కిరణ్‌కు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు తెలిపింది. ఈ విషయాన్ని బొత్సే పలుమార్లు స్పష్టంగా ప్రకటించారు. ఆ సమావేశంలో అధిష్టానం ఆదేశాలకు కిర ణ్ తలూపి, పార్టీ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవసరమైన రంగాన్ని సిద్ధంచేశారు.

తెలంగాణపై నిర్ణయం అధికారికంగా ప్రకటించే ముందు అధిష్టానం పార్టీ కోర్‌కమిటీ సవూవేశానికి సీఎంను పిలిచి చర్చించింది. ఈ సమావేశంలో తాను రూపొందించిన రోడ్ మ్యాప్‌ను అధిష్టానానికి కిరణ్ అందించారు. అప్పుడే అధిష్టానం కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి తన ముందున్న రోడ్‌వ్యూప్‌ను కిరణ్‌కు ఇచ్చి, దాని అవులు బాధ్యతను ఆయునపైనే పెట్టినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.. అందుకే విభజనకు సంబంధించి కేంద్రం వేసే ప్రతి అడుగు కిరణ్‌కు ముందే తెలుసునని పేర్కొంటున్నాయి.
 
అడుగడుగునా బాబు సహకారం
మరోపక్క రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది. సభా నాయుకుడిగా సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబునాయుడు ఇద్దరూ పరస్పర సహకారంతో రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయుం వెలువడిన వెంటనే చంద్రబాబు దాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటన చేయడంతోపాటు సీమాంధ్రలో కొత్త రాజధాని కోసం నాలుగు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కూడా కోరారు. ఆ తరువాత రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకొనే ప్రతి కీలక దశకు ముందు ఆయన ఢిల్లీలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పెద్దలకు సహకారం అందించేలా వ్యవహరించారు.

కేబినెట్ ఆమోదం ముందురోజు ఆయన ఢిల్లీలోనే పలువురు నాయకులతో సమావేశమయ్యారు. ఆ తరువాత ఢిల్లీలో సమన్యాయం పేరిట చంద్రబాబు దీక్షకు దిగిన రోజునే కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ తరువాత మరో సందర్భంలో బాబు ఢిల్లీయూత్ర సమయంలోనే మంతత్రుల బృందం తొలి భేటీ జరిగింది. అటు కిరణ్, ఇటు చంద్రబాబులు ఇద్దరూ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను అనుసరించి విభజన ను ముందుకు నడిపించుకుంటూ తీసుకువచ్చారు. తనపై ఎమ్మార్, ఐఎంజీ భారత్ భూముల కుంభకోణంతోపాటు మద్యం కేసులు ఇతరత్రా అనేక అవినీతిపై విచారణ జరిపించకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రతి అడుగులోనూ కాంగ్రెస్‌కు సహకరించారన్న విషయంలో అనేక విమర్శలొచ్చాయి.
 
చిత్తశుద్ధే ఉండి ఉంటే...
విభజనను వ్యతిరేకించే వ్యక్తే అయ్యుంటే కేబినెట్ నిర్ణయుం తరువాతైనా కిరణ్ వెంటనే రాజీనామా చేసి ఉండేవారు. తద్వారా సంక్షోభం ఏర్పడి కేంద్రం విభజన నిర్ణయం నుంచి వెనకడుగు వేసేదని ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. కానీ ఆయన అలా చేయకపోగా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాల్సి ఉంటుంది కనుక రాజీనామాలు వద్దంటూ నిలువరించారు.

మరోపక్క సీమాంధ్రలో రెండు నెలలకుపైగా ఉధృతంగా సాగిన ఉద్యోగుల సమ్మెను సైతం భయుపెట్టి, బెదిరించి అర్ధంతరంగా ఉపసంహరించేలా చేసి విభజన ప్రక్రియకు ఆటంకం లేకుండా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడేలా చేశారు. ఇక రాష్ట్ర విభజనపై కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేయడం, దానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావలసిన సమాచారాన్ని మొత్తం ఆగమేఘాలపై అందేలా కిరణ్ సహకరించారు. రాష్ట్ర విభజనపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించే అధికారం తమకు లేదని, కేవలం విభజన సమస్యల పరిష్కారం మాత్రమే తమ బాధ్యత అని మంత్రుల బృందం ప్రకటించగా అదే బృందం ముందుకు వెళ్లి సీఎం తన అభిప్రాయాలు వినిపించారు. సమైక్యమన్న వాదనపైనే సీఎంకు చిత్తశుద్ధి ఉండి ఉంటే జీఓఎం ముందుకు వెళ్లే వారే కాదు.

రాష్ట్రపతి నుంచి విభజన బిల్లు వచ్చే సమయానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేలా రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తేదీలను ఖరారు చేయించారు. రాష్ట్ర విభజన బిల్లు రాకముందే సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పదేపదే విజ్ఞప్తి చేసినా కిరణ్ వినిపించుకోలేదు. సమైక్య తీర్మానం చేస్తే రేపటి రోజున పార్లమెంట్‌లో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తూ అడ్డుకునే ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో సమైక్య తీర్మానం ప్రతిపాదనపైన కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూవచ్చారు.

ఇలావుండగా, బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ హైదరాబాద్‌కు వచ్చి అది సభకు వెళ్లేలా ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. బిల్లు తన చేతికి వచ్చిన 17 గంటల్లోనే సీఎం ఆగమేఘాలపై అసెంబ్లీకి పంపారు. మరోవైపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టించడం, చర్చను చేపట్టించడం అంతా నాటకీయు రీతిలో ముందుకు నడిపించారు. చర్చ ప్రారంభమైందా లేదా అన్న దానిపై మూడు రోజుల పాటు రసవత్తర డ్రామాను నడిపించి చివరకు ప్రారంభమైందని తేల్చేశారు.

రేపు నగరి నియోజకవర్గ పర్యటన

చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు.

 శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 రేపు నగరి నియోజకవర్గ పర్యటన
 నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్‌మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు.

 శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్‌ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు.

అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు

రేపు నగరి నియోజకవర్గ పర్యటన

చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు.

 శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 రేపు నగరి నియోజకవర్గ పర్యటన
 నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్‌మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు.

 శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్‌ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు.

అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు

రేపు నగరి నియోజకవర్గ పర్యటన

చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్యశంఖారావం, ఓదార్పు యాత్ర ఒకరు రోజు వాయిదా పడిందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కే.నారాయణస్వామి గురువారం తెలిపారు.

 శుక్రవారం నుంచి సాగాల్సిన యాత్ర శనివారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ఉంటుందని వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 రేపు నగరి నియోజకవర్గ పర్యటన
 నగరి, న్యూస్‌లైన్ : ముందుగా ప్రకటించినట్లుగా జగన్‌మోహన్ రెడ్డి 17వ తేదీన వడమాలపేట, పుత్తూరు పట్టణాల్లో పర్యటించడం లేదని కార్యక్రమం 18వ తేదీకి వాయిదా పడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఆర్కే రోజా తెలిపారు. గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పర్యటించే మార్గంలోనూ మార్పు చోటుచేసుకుందన్నారు.

 శనివారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయం నుంచి బైపాస్ సర్కిల్, కేఎల్‌ఎం హాస్పిటల్, గాజుల మండ్యం, షుగర్ ఫ్యాక్టరీ, అత్తూరు క్రాస్, కదిరి మంగళం క్రాస్, పూడి, పూడి బీసీ కాలనీ, కాయం ఎస్సీ కాలనీ, కాయం, కాయంపేట, బ్రాహ్మణపట్టు మీదుగా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని పత్తిపుత్తూరుకు వస్తారన్నారు.

అప్పలాయగుంట, యనమలపాళెం, తిరుమణ్యం, టీఆర్ కండ్రిగ, వేమాపురం, వేమాపురం ఎస్సీ కాలనీ, గొల్లకండ్రిగ, వడమాల, వడమాలపేట, ఎస్వీపురం, తడుకు రైల్వేస్టేషన్, మజ్జిగ గుంట, తడుకు, గొల్లపల్లి, అగ్రహారం ప్రాంతాల్లో పర్యటిస్తూ పున్నమి జంక్షన్ నుంచి పుత్తూరు పట్టణంలోకి ప్రవేశిస్తారని, అక్కడి నుంచి ధర్మరాజుల గుడి వీధి, బజారు వీధి మీదుగా వచ్చి సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారని అక్కడ భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు

పార్టీ బలోపేతానికి ఐక్యత అవసరం

వల్లూరు(టంగుటూరు),న్యూస్‌లైన్: తమ పార్టీలో పాతవారికి సముచిత స్థానం ఇస్తామని.. అలాగే కొత్తవారినీ ఆహ్వానిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. వల్లూరులో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచించారు. పార్టీని ఆదుకునేవారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ఆర్ ఆశయ సాధనకోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భవించిందన్నారు.
 
 ప్రజల విశ్వాసం నుంచి వైఎస్ కుటుంబాన్ని వేరుచేయడం ఎవరితరమూ కాదని తెలిపారు. ఆ కుటుంబంపై చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. చంద్రబాబును ఎవరూ విశ్వసించడంలేదన్నారు. 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్ సంక్షేమ పథకాలను తిరిగి సమర్థవంతంగా కొనసాగించగల నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. అందుకే ఆయన సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. వైఎస్ తమ మనిషని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆయన పథకాలను ఎందుకు మూలన పెడుతోందని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌టీఆర్, వైఎస్‌లకు దీటుగా జగన్ పనిచేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని, బూత్‌కమిటీలు ఏర్పాటు చే సి.. సమర్థులైన వారిని సభ్యులుగా నియమించాలని కోరారు.
 
 పార్టీ తీర్థం పుచ్చుకున్న హనుమారెడ్డి
 ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ కుందం హనుమారెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ గ్రామానికి దివంగత నేత వైఎస్ చేసిన సేవలకు కృతజ్ఞతగా పార్టీలో చేరినట్లు హనుమారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఓకే ఒక నాయకుడు జగన్ మాత్రమేనని అభినందించారు. మండల కన్వీనర్ బొట్లా రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తాటితోటి నరిసింగరావు, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఉప్పలపాటి నర్సరాజు, పొందూరు సర్పంచ్ చిట్నీడి రంగారావు, ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు చెక్కా రాజేశ్వరరావు, మండల కన్వీనర్ దాసరి సుబ్బారావు, కుందం మోహనరెడ్డి, యువజన నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

జగన్‌ కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా

Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి  బదులు 18వ తేదీకి వాయిదాపడింది.

 జగన్‌ కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర  ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా  కన్వీనర్‌ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి  జగన్‌ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం

'విభజన బిల్లుపై చర్చలో మేము పాల్గొనం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై జరిగే చర్చ్లల్లో తాము పాల్గొనమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలుగా సభలో అభిప్రాయాన్ని మాత్రమే చెబుతామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశం ముగిసిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లుపై చర్చలో పాల్గొనకుండా ఉండాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. విభజన అంశంపై రేపు జరిగే సభలో ఓటింగ్ కోసం పట్టుబడతామని ఆయన తెలిపారు. విభజన ప్రక్రియను వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్ని విషయాన్ని భూమన మరోసారి గుర్తు చేశారు.
 
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారని విమర్శించారు.  వారివురూ అసెంబ్లీకి వచ్చిన బిల్లును సజావుగా వెనక్కు పంపేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తిరుమల దైవ సన్నిధికి వచ్చిన భక్తులపై టీటీడీ కేసులు పెట్టడాన్ని భూమన తీవ్రంగా ఖండించారు. వారిపై కేసులు పెట్టడం సరికాదని తెలిపారు.

ఉద్దేశపూర్వకంగానే ఇదంతా...

అది బాబు మైండ్ గేమ్
* ఓ పత్రికలో కథనంపై వైఎస్సార్‌సీపీ నేత రఘురామకృష్ణంరాజు
* జగన్‌తో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి
* వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం
 
సాక్షి, తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా): విజయం సాధించలేననే అనుమానంతో పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు చెప్పారు. తాడేపల్లిగూడెంలో మంగళవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై వచ్చిన కథనాన్ని గోబెల్స్ ప్రచారంగా అభివర్ణించారు.

ఆ పత్రిక ఉద్దేశపూర్వకంగానే ఇదంతా రాసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, ఇదంతా చంద్రబాబు ఆడుతున్న మైండ్‌గేమ్ అని విమర్శించారు. సమావేశంలో పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, పట్టణ కన్వీనర్ యెగ్గిన నాగబాబు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తెన్నేటి జగ్జీవన్ పాల్గొన్నారు.

 ఆయనేమన్నారు?
మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిపై నేను అసంతృప్తితో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం అభూత కల్పన. ఆయనతో నేను సన్నిహితంగా ఉంటా, ఎలాంటి విభేదాలూ లేవు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్నా. ఒక సర్వే ప్రకారం నియోజకవర్గంలో నాకు 53 నుంచి 54 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర పార్టీ, తెలుగుదేశం విభజన పార్టీ. కోస్తాంధ్రలోనే మా పార్టీకి 140 నుంచి 145 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో పార్టీ బలంగా ఉంది. తెలంగాణలోనూ గణనీయమైన సీట్లు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం.

ఈ నెల 23వ తేదీన తర్వాత కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఆ పార్టీకి చెందిన వారంతా మా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి చాలాచోట్ల అభ్యర్థులు దొరకడంలేదు. అందుకే బలంగా ఉన్న మా పార్టీని బలహీనంగా చూపించడానికి ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారు.
     
విభజన పార్టీ అయిన తెలుగుదేశం రెండు ప్రాంతాల్లో రెండు వాదనలు వినిపిస్తోంది. తెలంగాణలో ఎర్రబెల్లి, కోస్తాంధ్రలో పయ్యావుల కేశవ్ విభిన్న వాదనలు ఎలా వినిపిస్తారు?
   
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ చాలా చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వెనక్కు తగ్గుతున్నట్లు ఎలా రాస్తారు? విజయవాడ నుంచి పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేయనని వెనక్కి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదం. ఆయనసలు మా పార్టీలోనే లేరుకదా. 

Popular Posts

Topics :