19 January 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్‌ఆర్‌సీపీ బాటలోకి కిరణ్‌, చంద్రబాబు

Written By news on Saturday, January 25, 2014 | 1/25/2014

వైఎస్‌ఆర్‌సీపీ బాటలోకి కిరణ్‌, చంద్రబాబుకిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలోకి వచ్చారు.  రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకగా ఉందని, దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని మంత్రి శైలజానాధ్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు  నోటీసు ఇప్పించారు. శాసనమండలిలో కూడా మంత్రి రామచంద్రయ్య ఇదే నోటీస్ ఇచ్చారు. టిడిపి కూడా ఇదే తరహా నోటీస్ ఇచ్చింది.

డిసెంబర్ 12నే ఈ తీర్మానం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే అంశంపై డిసెంబర్‌ 16న ఆ పార్టీ మరో లేఖ ఇచ్చింది. ఎప్పటి నుంచో వైఎస్ఆర్ సిపి నెత్తినోరు కొట్టుకున్నా  కిరణ్ వినలేదు. నిన్నటికి నిన్న కూడా ఆ పార్టీ ఈ విషయాన్ని స్పీకర్ కు గుర్తు చేసింది.  బిల్లు వచ్చి 44 రోజులు గడిచాయి. వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి చెబుతూనే ఉంది. శాసనసభలో  బిల్లుపై  95 మంది సభ్యులు మాట్లాడారు. ఇప్పుడు ఆయనలో కదలిక వచ్చింది. రూల్‌ 77, రూల్‌78ల కింద స్సీకర్ కు నోటీస్‌ ఇచ్చారు.    ఉభయసభల్లో తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్‌ను కోరారు. పార్లమెంటులో పెట్టే బిల్లుని శాసనసభకు పంపకపోవడం ఆక్షేపణీయం అన్నారు. బిల్లు విషయంలో రాష్ట్రపతి తప్పేమీలేదని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు. కేంద్రం అసమగ్ర బిల్లు  పంపినట్లు చెప్పారు.

 కిరణ్ కుమార్ రెడ్డిని చూసి చంద్రబాబులో కదలిక వచ్చింది. టిడిపి  కూడా ఇంత కాలం తరువాత అదే తరహా నోటీస్ ఇచ్చింది. చంద్రబాబు కూడా అవే నిబంధనలు ప్రస్తావించి బిల్లును వెనక్కు పంపడానికి తీర్మానం చేయాలని కోరారు.


సీఎం కిరణ్, చంద్రబాబు చర్యలను కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. మొదటి రోజే బిల్లును తిరిగి పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారని టిఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేంద్ర గుర్తు చేశారు. అప్పడు మాట్లాడని సీఎం ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. సభలో సమైక్యతీర్మానం చేయాలన్నా 10 రోజులు పడుతుందని చెప్పారు.

కిరణ్, చంద్రబాబులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు.  బిల్లుపై ఇన్నాళ్లు మాట్లాడకుండా సీఎం ఏం చేశారు? అని ప్రశ్నించారు. విభజన బిల్లు వెనక్కు పంపాలని సీఎం స్పీకర్‌కు లేఖ రాయడం ఏకపక్షం అన్నారు. సీఎం వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని  గండ్ర హెచ్చరించారు.

Gattu Ramachandra Rao's press meet on 25-01-14

44 రోజుల తరువాత మేల్కొన్న సిఎం కిరణ్

44 రోజుల తరువాత మేల్కొన్న సిఎం కిరణ్గట్టు రామచంద్ర రావు
హైదరాబాద్: తెలంగాణ బిల్లు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 44 రోజుల తరువాత మేల్కొన్నారని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లు తిప్పిపంపాలని స్పీకర్ కు తిరస్కరణ నోటీస్ బిల్లు తిప్పిపంపేందుకు సభలో తీర్మానం చేయాలని మంత్రి శైలజానాథ్ ద్వారా స్పీకర్ కు నోటీస్ ఇచ్చారు. ఇన్నాళ్లు సమైక్యత అని వైఎస్ఆర్ సిపి నెత్తినోరు కొట్టుకున్న కిరణ్ వినలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా అసలు సిసలు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

డిసెంబర్ 12నే ఈ తీర్మానం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే అంశంపై డిసెంబర్‌ 16న మరో లేఖ ఇచ్చినట్లు చెప్పారు. ఆయనకు సడన్ గా సమైక్యత గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం 2014-01-24
























వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యశంఖారావం 2014-01-23
















దొంగే దొంగ అని అరిచినట్లుంది

శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. శాసనసభ వాయిదా అనంతరం ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కిరణ్, చంద్రబాబు బీఏసీలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బిల్లు లోపభూయిష్టమని సీఎంకు ఇప్పుడు తెలిసిందా...ఇన్ని రోజులు సీఎం కళ్లు మూసుకొని ఉన్నారా అని మండిపడ్డారు.

కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగు ప్రజల దురదృష్టమని శోభా నాగిరెడ్డి అన్నారు. ప్రజలను కిరణ్, చంద్రబాబు నిట్టనిలువునా ముంచారని ఆమె ధ్వజమెత్తారు. సభలో తెలంగాణ బిల్లుపై కిరణ్ ప్రసంగం నీరసంగా, నిర్వేదంగా సాగిందన్నారు. విభజన నిర్ణయం బాధపెట్టిందన్న కిరణ్ మరి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.

రానున్న ఎన్నికలే రెఫరెండం: వైఎస్ అవినాష్ రెడ్డి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శనివారం కడపలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు సమైక్యానికి, విభజన వాదానికి రెఫరెండం అని ఆయన పేర్కొన్నారు.
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లే కేంద్రం విభజన దిశగా అడుగులు వేస్తుందని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు

రాష్ట్రం విడిపోదు: కృష్ణంరాజు

నరసాపురం : రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తి లేదని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీకి కేవలం వారం రోజుల గడువు మాత్రమే పెంచడం హేయమైన చర్య అని, కనీసం 30 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.

ఘనంగా వైఎస్ జయమ్మ వర్థంతి

పులివెందుల : వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ జయమ్మ  వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. పులివెందులలోని జయమ్మ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. జయమ్మ పార్కులోని ఆమె విగ్రహానికి పూలమాలు వేశారు. వైఎస్  వైఎస్ వివేకనందరెడ్డి , వైఎస్ భారతి, షర్మిల, వైఎస్ అవినాష్ రెడ్డి, విమలమ్మ, భారతమ్మ, ఈసీ సుగుణమ్మ, రాజమ్మ తదితరులు నివాళులు అర్పించారు.

నేడు జగన్ పర్యటన ఇలా

ఇప్పటికైనా సమైక్య తీర్మానం: విజయమ్మ

ఇప్పటికైనా సమైక్య తీర్మానం: విజయమ్మ
స్పీకర్‌కు విజయమ్మ లేఖ
టీ బిల్లును తిప్పి పంపేందుకు రాష్ట్రపతిని కోరాలి
77, 78 నిబంధనల కింద గత నెల నోటీసులిచ్చిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం


సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పునఃపరిశీలన నిమిత్తం కేంద్ర మంత్రివర్గానికి తిరిగి పంపాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరుతూ శాసనసభలో ఇప్పటికైనా తీర్మానాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత వై.ఎస్.విజయమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఆమె ఒక లేఖ రాశారు. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన 77, 78 నిబంధనల కింద రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని తామిచ్చిన నోటీసుపై పది రోజుల్లోపు తదుపరి చర్య చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకూ దాని ఊసే లేదని ఆమె గుర్తు చేశారు.
 
  గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన అవే నిబంధనల కింద పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర మంత్రివర్గ పునఃపరిశీలన నిమిత్తం వెనక్కి పంపాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ తీర్మానం చేయాలని ఇచ్చిన నోటీసుపై కూడా పది రోజుల గడువు దాటినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె స్పీకర్ దృష్టికి తెచ్చారు. తామిచ్చిన ఈ రెండు నోటీసుల మేరకు ఇప్పటికైనా తీర్మానాలు చేయాలని విజయమ్మ కోరారు. ఈ లేఖపై పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకులు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబూరావు సహా పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

హత్యా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య

పరిటాలను చంపించింది బాబే: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత పరిటాల రవిని చంద్రబాబునాయుడే హత్య చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. టీడీపీలో పరిటాల ఎదుగుదలను ఓర్వలేక చంద్రబాబే హత్య చేయించారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారని ఆయన అన్నారు. అయితే నేడు సిగ్గులేకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయానికీ రాజశేఖరరెడ్డిని, జగన్‌లను విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, బి.గుర్నాథరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
 
  హత్యా రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, పదవికోసం ఎన్‌టీ రామారావునే వెన్నుపోటు పొడిచి హత్య చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. అంతేగాక.. కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హత్య చేయించారన్నారు. అలాగే ఎలిమినేటి మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, పి.ఇంద్రారెడ్డిలను కూడా చంద్రబాబే హత్య చేయించారనే ఆరోపణలున్నాయన్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వీరి మరణాలతో చంద్రబాబుకు నిజంగా సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు.

విడిపోతే సీమాంధ్ర ఎడారే !

విడిపోతే సీమాంధ్ర ఎడారే !
వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రాయలసీమ వంటి ప్రాంతాల్లో తాగునీటికీ తంటాలు పడాల్సి ఉంటుందని గుర్తు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత తదితరులు మాట్లాడారు. విడిపోవడం వల్ల మూడు ప్రాంతాల ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, సభలో సమైక్య ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. విభజన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రాష్ట్రం విడిపోతే కొనసాగించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.
 ఓటింగ్ నిర్వహించాలి: సుచరిత
 రాజ్యాంగ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న తెలంగాణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. విభజన సరికాదంటూ శ్రీకృష్ణ కమిటీ తుది అభిప్రాయంతో 461 పేజీల నివేదికను వెల్లడించింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రతోపాటు తెలంగాణ కూడా తీవ్రంగా నష్టపోతుంది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే. సభలో వెంటనే సమైక్య తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించాలి.
 
 ‘రెండు కళ్ల’ పార్టీలవల్లే ఈ ముప్పు: రామకృష్ణారెడ్డి
 కొన్ని పార్టీల వైఖరి స్పష్టంగా లేనందునే విభజన బిల్లు ఇక్కడిదాకా వచ్చింది. వారు అసలు విషయాలు చెప్పకుండా మోసం చేస్తున్నారు. రెండు కళ్లు అంటూ కొన్ని పార్టీలకు స్పష్టమైన విధానం లేకపోవడంతో విభజన జరిగే ప్రమాదం నెలకొంది. నాగార్జునసాగర్ నుంచి ఇప్పటికే కుడిప్రాంతానికి నీరు సరిగ్గా రావట్లేదు. విభజన తర్వాత ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదముంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లిపోమంటే.. సీమాంధ్రుల భవిష్యత్తు ఏంకావాలి?
 
 అసమర్థుల పాలనతోనే ఉద్యమాలు: బాలరాజు
 రాజశేఖర్‌రెడ్డి వంటి దమ్మున్న నాయకుడు లేకపోవడం... అసమర్థ నాయకుల పాలనతో ఉద్యమాలు వచ్చాయి. పునర్వ్యవస్థీకరణ బిల్లు సభకు రావడం విచారకరం.. బాధాకరం.. దురదృష్టకరం. వైఎస్సార్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చిఉండేదికాదు. ఆయన పాలన స్వర్ణయుగం. అన్ని ప్రాంతాల్నీ సమంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారు. ఆయన సమయంలో ఏ వాదం, ఉద్యమం లేదు. మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకం. సమైక్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి ప్రస్తుత బిల్లు వ్యతిరేకం. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలి. విభజనతో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుంది. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న గిరిజనులు ఐదవ షెడ్యూల్ కింద గవర్నర్ రక్షణలో ఉంటారు. ఈ ప్రాంతాల్లోనుంచి దేనిని విడదీయాలన్నా.. గ్రామసభల ఆమోదం తప్పనిసరి. కానీ అలాంటివేవీ లేకుండానే విభజిస్తున్నారు. అసెంబ్లీ తీర్మానం లేదు. ప్రజల హక్కులకు వ్యతిరేకంగా తెచ్చిన ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. వ్యతిరేకిస్తూ మేమిచ్చే లేఖల్ని రాష్ట్రపతికి పంపించండి.
 
 ఓటింగ్ కోసం వైఎస్‌ఆర్‌సీపీ పట్టు
 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో వెంటనే ఓటింగ్ నిర్వహించాలని ైవె ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఈ మేరకు నినాదాలు చేశారు. రోజూ చర్చ కొనసాగుతూనే ఉందని, ఇప్పటికైనా వెంటనే ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత వివిధ పార్టీలకు చెందిన సభ్యులు.. అబ్రహాం (అలంపూర్), సత్యవతి (ఆముదాలవలస), శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ), రామకోటయ్య (నూజివీడు), పద్మజ్యోతి (తిరువూరు), ముత్యాలపాప (నర్సీపట్నం), లింగయ్య (నకిరేకల్), శ్రీధర్ (వర్ధన్నపేట), రాములు (అచ్చంపేట), కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), వెంకట్రామయ్య (గాజువాక) చర్చలో పాల్గొన్నారు.

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్ : శాసనసభలో శనివారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. శాసనసభలో విభజన బిల్లుపై సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఓటింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అలాగే తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన వైఖరిపై సభలో చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

పేదోడి పెద్ద కొడుకు వైఎస్

పేదోడి పెద్ద కొడుకు వైఎస్
సమైక్య శంఖారావంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఒక మనిషి మరణించి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ  జనం గుండె చప్పుళ్లలో సజీవంగానే ఉన్నారు.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహా నాయకుడు. రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువెత్తు చిరునామా. పేదవాడి గుండె చప్పుడును హృదయంతో విన్న డాక్టర్. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి కుటుంబానికి ఆయన పెద ్దకొడుకు. అలాంటి ప్రియతమ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుంచి దూరమయ్యాక రాజకీయాల్లో విశ్వసనీయత కనుమరుగయిపోయింది. రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
 
 పస్తుతం రాజకీయాలను ఒక చదరంగంలా మార్చేసి, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని లెక్కలేస్తున్నారే తప్ప పేద ప్రజల గురించి ఆలోచించడమే లేదని అన్నారు. నాలుగో విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ శుక్రవారం ఐదోరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో సాగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 వైఎస్ అందుకే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు..
 
 ‘‘ఎనిమిదిన్నర కోట్ల మందిలో దేవుడు ఒక్కరికే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇస్తాడు. పదవిలో ఉన్నప్పుడు ప్రజల కోసం మనమేం చేశామన్న ప్రాతిపదికగానే ప్రజలు మనల్ని చనిపోయాకగానీ, పదవి నుంచి దిగిపోయాక గానీ గుర్తు పెట్టుకుంటారు. మహానేత మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయన మా గుండెల్లోనే సజీవంగా ఉన్నాడని ఇంత మంది గర్వంగా చెప్పుకుంటున్నారంటే అందుకు కారణం.. పదవిలో ఉన్న ప్రతిక్షణం ఆ నేత ప్రజల బాగోగుల కోసం పరితపించడమే. మండుటెండలో 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను అతి దగ్గర నుంచి గమనించారు.
 
 పేదవాడు అప్పుల ఊబిలో కూరుకు పోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి పిల్లల చదువులు, మరొకటి అనుకోకుండా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపితే పేదవాడిని అప్పుల ఊబి నుంచి బయటపడేయగలం అని వైఎస్ భావించారు. అందుకే పెద్ద చదువులకు పేదరికం అడ్డురాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఈ పథకాలను రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేశారు. ఎంతమంది అర్హులుంటే అంత మందికీ ప్రయోజనం కలిగేలా పథకాలను తీర్చిదిద్దారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు పూయించడం కోసం అనుక్షణం తపన పడ్డాడు. అలా పేదవాడి కుటుంబంలో పెద్దకొడుకయ్యాడు. ఇలా దివంగత నేత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
 
 ఇదా రాజకీయం..?
 
 మహానేత మనకు దూరమయ్యాక రాష్ట్రంలో ప్రజల కోసం తపించే ఒక్క నాయకుడూ లేకుండా పోయాడు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేదే లేకుండా పోయింది. ఎత్తులు, పైఎత్తుల రాజకీయ చదరంగంలో పేదవాణ్ణి ఎప్పుడో పక్కకు నెట్టేశారు. ఈ రోజు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలి? ప్రత్యర్థిపై ఎలా కేసులు పెట్టాలి? ఎలా జైల్లో పెట్టాలి? అన్న అంశాలే రాజకీయాలైపోయాయి. అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి చూస్తే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతుంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు ఒక చేత్తో సైగ చేసి తన ఎమ్మెల్యేల్లో కొందరితో సమైక్య మనిపిస్తారు. మరోచేత్తో సైగచేసి ఇంకొందరితో విభజన కేకలేయిస్తారు. ఇదా రాజకీయం..? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏ ప్రాంతానికైనా వెళ్లినా.. ‘నన్ను నమ్మండి. మీకు నేనున్నాను. నన్ను చూసి ఓటేయండి’ అని అడిగే దమ్మూ, ధైర్యం లేని వారు నాయకులుగా చలామణి కావడమే నేటి రాజకీయాల్లో దౌర్భాగ్యం. ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసుకుని ఫలానా వ్యక్తి మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రీ లేరు.
 
 పతిపక్ష నేతా లేరు. ఒకరేమో సీఎం కుర్చీలో ఎంతకాలం వీలైతే అంతకాలం ఉండేందుకు సోనియా గీసిన గీత దాటకుండా ‘సమైక్య’ ముసుగులో విభజన కార్యక్రమాన్ని సజావుగా కొనసాగిస్తారు. మరొకరేమో ప్యాకేజీల బేరసారాలతో కుమ్మక్కవుతున్నారు. రాజకీయాల్లో విలువలు లేని ఈ పరిస్థితిని మనమే మార్చుకోవాలి. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో విభజన కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేద్దాం. 30 మంది ఎంపీలను మనమే గెలిపించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం.
 
 సమైక్య రాష్ట్రాన్ని సజీవంగా ఉంచుకుందాం’’
 యాత్ర సాగిందిలా...
 
 గంగాధర నెల్లూరు నియోజక వర్గం తిరువీధి కుప్పం నుంచి యాత్ర మొదలైంది. తొలుత జగన్ ముసలయ్యగారి పల్లె చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆవులకొండలో పార్టీ జెండాను ఆవిష్కరించి తూగుండ్రం, పిలారికుప్పం, ఆముదాల క్రాస్ మీదుగా పాలసముద్రం మండలంలోకి ప్రవేశించారు. వీర్లగుడి గ్రామంలో చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతర అక్కడ శిఖామణి సుగానందం కుటుంబాన్ని ఓదార్చారు. ఏటుకూరి పల్లెలో చెరకు రైతులను కలసి బెల్లం తయారీ విధానాన్ని పరిశీలించారు. పాలసముద్రంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ్నుంచి నగరి చేరుకుని మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ గృహంలో బస చేశారు. పాలసముద్రం నుంచి నగరి వచ్చే దారిలో దాదాపు 15 కి.మీ. మేర జగన్ తమిళనాడు సరిహద్దులో ప్రయాణించారు. పల్లెపట్టు నియోజకవర్గ కేంద్రం దాటేంత వరకు దారిపొడవునా ఉన్న తమిళ గ్రామాల ప్రజలు జగన్‌ను ఆప్యాయంగా పలకరించారు. అతిమాంజరిపేట వద్ద జనం పెద్దఎత్తున రోడ్డుపైకి వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జగన్ ముందుకు సాగారు. యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి, పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 విద్యుత్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
 రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (వైఎస్‌ఆర్‌టీయూసీ అనుబంధం) 2014 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు. ఆరుమాకుల పల్లె సమీపంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్మిక విభాగం నేత జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో తరలి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టీయూసీ జిల్లా కన్వీనర్ బీరేంద్రవర్మ, విద్యుత్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

YS Jagan's speech in Palasamudram, Chittoor dist

Written By news on Friday, January 24, 2014 | 1/24/2014

YS Jagan meets bereaved family of Suganandam

YSRCP MLAs write letter to speaker again

Chandra Babu Naidu might be involved in Paritala Ravi murder case


రాష్ట్రం ఒకటిగా ఉన్నా.. రెండుగా విడిపోయినా ఎన్నికలు యధాతథంగా...

విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్
రాష్ట్రం ఒకటిగా ఉన్నా.. రెండుగా విడిపోయినా ఎన్నికలు యధాతథంగా జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని ఆయన తెలిపారు.
 
జనవరి 25 తేదిన జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవాన్నినిర్వహిస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రతి ఒక్కరూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు నమోదు అయిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది ఆయన తెలిపారు. 
 
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6 కోట్ల 24లక్షల 6వేల 81 మంది అని తెలిపారు.  రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50లక్షల పదివేల 24 మంది ఓటర్లు ఉన్నారని.. విజయనగరంలో అత్యల్పంగా 16లక్షల 86వేల 174 మంది ఓటర్లు ఉన్నారని భన్వర్ లాల్ తెలిపారు. 

ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి

ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి: వైఎస్ జగన్
చిత్తూరు: ప్రతి పేదవాడికి నేనున్నానే భరోసా కల్పించే దమ్ము ప్రస్తుత రాజకీయాల్లో ఏ నేతకు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజన్న పాలనలో సువర్ణయుగం చూశామని ప్రతి ఒక్కరూ అంటున్నారని ఆయన తెలిపారు. సువర్ణ పాలన చూసే అవకాశం ఎనిమిదిన్నర కోట్ల జనాభాకు మాత్రమే దక్కింది అని పాలసముద్రం సభలో వైఎస్ జగన్ అన్నారు. 
 
రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయని,  ప్రజా రాజకీయాల నుంచి ఓ వ్యక్తిని దూరం చేయాలని కుయుక్తులు పన్నారని జగన్ తెలిపారు. అయితే ప్రతి గుండె చప్పుడులో వైఎస్ఆర్ ఉన్నారనే విషయం వారికి ఇప్పుడు అర్థమైందని ఆయన చెప్పారు.  ప్రతి పేదవాడి సంక్షేమం కోసం మండుటెండల్లో పాదయాత్ర చేసి.. కష్టాల్లో ఉన్న ప్రజల గుండెచప్పుడు విన్న ఏకైక నేత వైఎస్ఆర్ అని జగన్ అన్నారు. 
 
ప్రతి పేదవాడు బాగుండాలని తాపత్రాయపడింది ఈ రాష్ట్రంలో మహానేత వైఎస్ఆర్ ఒక్కరే అని ఆయన తెలిపారు.  'ప్రతి అక్క నుంచి అవ్వలకు.. అవ్వల నుంచి అయ్యలకు..అయ్యల నుంచి ప్రతి యువకుడు లబ్ది పొందేలా అనేక ప్రజా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు' అని వైఎస్ జగన్ తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగువాడి సత్తా చాటుదాం అని ఆయన అన్నారు. ఢిల్లీ అహంకారానికి,  తెలుగువారి ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతోంది ఆయన వెల్లడించారు.  ఢిల్లీ గుండె అదిరేలా తీర్పునివ్వండి వైఎస్ జగన్ అన్నారు.  వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం. కుమ్మక్కురాజకీయాలను ఛేదిద్దాం అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. 

వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఆయన తన యాత్రను ముసలయ్యాగారి పల్లె నుంచి ప్రారంభించారు. అభిమానుల కోలాహలం మధ్య మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పల్లెప్రజలు చూపించిన ప్రేమానురాగాలకు జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ్టి యాత్ర  గంగాధర నెల్లూరు,  నగరి నియోజకవర్గాల్లో  సాగనుంది. వీర్లగుడి ఎస్సీ కాలనీలో శిఖామణి సుగానందం కుటుంబాన్ని జగన్ ఓదారుస్తారు. నగరిలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్న అక్కడే రాత్రి బస చేస్తారు

పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?

పరిటాల హత్యపై విచారణకు సిద్ధమా?
హైదరాబాద్: టీడీపీ నేతలు కన్నుమూసినా, తెరిచినా వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్సే కనిపిస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఏనాడూ వ్యవహరించలేదని విమర్శించారు. ఏ అవకాశం దొరికినా వైఎస్సార్‌సీపీపై బురదజల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

పరిటాల రవి హత్య విషయంలో చంద్రబాబు చేస్తున్నవి సిగ్గులేని ఆరోపణలని కొట్టిపారేశారు. చాలామంది నేతలు పరిటాల రవికి దగ్గరవుతున్న బాధతో చంద్రబాబే హత్యచేయించారని అనుమానాలున్నాయని అన్నారు. పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి పరిటాల రవిని చంద్రబాబే హత్యచేయించారనే ఆరోపణలున్నాయన్నారు.

చంద్రబాబు అన్నీ ఇలాంటి రాజకీయాలే చేస్తారన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడానికి కూడా అలాంటి రాజకీయాలే చేశారన్నారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డిల మరణాలపై సీబీఐ దర్యాప్తుకు చంద్రబాబు సిద్ధమా అని శ్రీకాంత్‌రెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రతిష్ట నానాటికీ దిగజారిపోతుందని అన్నారు.

Popular Posts

Topics :