23 February 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ఆర్ సీపీలో చేరిన చిత్తూరు నేతలు

Written By news on Saturday, March 1, 2014 | 3/01/2014

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతిలో శనివారం జరిగిన వైఎస్ఆర్ జనభేరి సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుమార రాజ సహా కాంగ్రెస్ నేతలు పట్టాభిరెడ్డి, రమేష్, రవి వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

వైఎస్ఆర్ జనభేరికి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా తిరుపతి రహదారులు జనసంద్రమయ్యాయి. పార్టీ కార్యకర్తలతో పాటు యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సమైక్యం కోసం చివరి దాకా పోరాడా: తిరుపతి సభలో వైఎస్ జగన్

సమైక్యం కోసం చివరి దాకా పోరాడా: తిరుపతి సభలో వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
తిరుపతి: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తిరుపతిలో నిర్వహించిన వైఎస్ ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ ఆర్ సీపీ ఒక్కటేనని, వారి దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి దాకా పోరాడమని చెప్పారు.

రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం యాత్ర చేశానని గుర్తు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కుమ్మక్కయి రాష్ట్రాన్ని విడగొట్టారని జగన్ ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు వీలుగా తమ పార్టీ ఎంపీలతో ఓట్లు వేయించారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సహకరించి పెద్దమ్మ అంటూ ఒకరు.. చిన్నమ్మ అంటూ మరొకరు చెప్పుకొంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

జగన్ రాకతో తిరుపతి జనసంద్రం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో జనసంద్రంగా మారింది. 'వైఎస్ఆర్‌ జనభేరి' సభకు వేలాదిగా జనం తరలి వస్తున్నారు. జగన్‌ రాకతో తిరుపతి రోడ్లు జనమయం అయ్యాయి. యువత, మహిళలు పెద్ద ఎత్తున  రోడ్‌ షోలో పాల్గొన్నారు. మరోవైపు జగన్‌ నినాదాలతో తిరుపతి రోడ్లు మారుమోగుతున్నాయి. మరోవైపు నడవలేని స్థితిలో కూడా వృద్దులు రాజన్న తనయుడ్ని చూడటానికి  తరలి వస్తున్నారు.

కాగా సీమాంధ్రను సింగపూర్‌ చేస్తానంటోన్న టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారని వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రశ్నించారు. చంద్రబాబు  రెండు కళ్లు, రెండు చిప్పల విధానంపై మండిపడ్డారు. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ సీట్లలో 140కిపైగా అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తాయని చెప్పారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వద్దంటేనే మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు

తిరుపతిలో జగన్ కు ఘన స్వాగతం

http://www.sakshi.com/video/news/ys-jagan-mohan-reddy-gets-grand-welcome-in-tirupati-11475?pfrom=home-top-videos

రేణిగుంటలో జగన్ కు ఘన స్వాగతం

తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ నినాదాలతో విమానాశ్రయం మార్మోగింది. తిరుపతిలో నేడు జరగనున్న 'వైఎస్‌ఆర్‌ జనభేరి' పాల్గొనేందుకు ఆయన శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి బయల్దేరారు.
వైఎస్సార్‌ జనభేరిలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్ కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. నేటి నుంచి జగన్ 'వైఎస్‌ఆర్‌ జనభేరి' పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.

ఇందులో భాగంగానే శనివారం తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతిలో పర్యటిస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఆ తర్వాత ఎన్నికల జనభేరి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.

 జగన్ షెడ్యూల్ వివరాలు:
* మార్చి 1: తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమల లో బస చేస్తారు.
*మార్చి 2 : తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
*మార్చి 3: హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.  సాయంత్రం 4గంటలకు ఏలూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
*మార్చి 4: సాయంత్రం 4 గంటలకు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
*మార్చి 5: సాయంత్రం 4 గంటలకు ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
*మార్చి 6 : సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
*మార్చి7, 8 : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
*మార్చి 9: నుంచి నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.

నేడే జనభేరి

నేడే జనభేరి
  • ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న జగన్
  •  లక్ష్మీపురం సర్కిల్ నుంచి నగరంలో రోడ్‌షో
  •  తిరుపతిలో రెండు కుటుంబాలకు ఓదార్పు
  •  లీలామహల్ సర్కిల్‌లో భారీ బహిరంగ సభ
 సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుపతి నగరం నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ జనభేరి పేరిట నిర్వహించనున్న ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రానికే నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, వీధుల్లో స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు తరలిరానున్నారు.

లీలామహల్ సర్కిల్‌లో వేదిక నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో- ఆర్డినేటర్ తలశిల రఘురాం, తిరుపతి నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పరిశీలించారు. సభాస్థలిలో చేయాల్సిన మార్పులు, చేర్పులు గురించి చర్చిం చారు. శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దక్షిణం వైపున వేదిక నిర్మించనున్నారు.

వైఎస్ జగన్ ఒక్కడే సమైక్యనాయకుడు : పెద్దిరెడ్డి

 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే సమైక్య నాయకుడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని ఆయన అనేక విధాలుగా పోరాడారని గుర్తుచేశారు. సమైక్యనాయకుడిగా తిరుపతిలో ఎన్నికల ప్రచారభేరి మోగించేందుకు వస్తున్నారని తెలిపారు. ఆయనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కుప్పం, మదనపల్లె సభలను తలదన్నే విధంగా తిరుపతి వైఎస్సార్ జనభేరి సభ నిర్వహిస్తామన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరిగిందన్నారు. తెలంగాణలోనూ తమ పార్టీ రానున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని తెలిపారు.
 
జగన్ సీఎం అయితేనే సీమాంధ్ర అభివృద్ధి : భూమన
 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే సీమాంధ్ర సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆయన సభాస్థలి వద్ద మీడియాతో మాట్లాడుతూ జగనన్న సీఎం అయితేనే పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయన్నారు. విభజన వల్ల కోల్పోయిన విద్య, ఉపాధి అవకాశాలు తిరిగి నిలబెట్టుకోవాలన్నా, అభివృద్ధి చేసుకోవాలన్నా, యువత భవిష్యత్ బాగుపడాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడిన యోధుడిగా, ప్రజా పక్షపాతిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి నుంచి ఎన్నికల భేరిని మోగించేందుకు వస్తున్నారన్నారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచార సభకన్నా, వైఎస్సార్ జనభేరి మూడింతల జనంతో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో జనం తరలివచ్చి సభను జయప్రదం చేయనున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం జగనన్నను సీఎంను చేసేందుకు ప్రతిఒక్కరూ చేయుతనివ్వాలన్నారు. పట్టభద్రులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, సీమాంధ్రలోనే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో, పట్టుదలతో ఉన్నారని ఆయన వివరించారు.
 
వార్డుల్లో విస్తృత ప్రచారం

తిరుపతి నగరంలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు, అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటున్న వైఎస్సార్ జనభేరి సభకు హాజరుకావాలని ఆహ్వానించారు. దొడ్డాపురం వీధిలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు

కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీ ఏర్పాటు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పని చేసేందుకు అన్ని పార్టీల నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు మొదటి నుంచి అలుపెరగని పోరాటం సాగించినా.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో రాష్ట్రం రెండుగా చీలిపోయింది. ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతుండటంతో ఎన్నికల వేళ పార్టీలో చేరికలు ముమ్మరమయ్యాయి.
 
 శుక్రవారం ఆలూరు నియోజకవర్గంలో కీలకమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు పలువురు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వైకుంఠం శివప్రసాద్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నీరజారెడ్డి ముఖ్య అనుచరుడు మార్కెట్‌యార్డు చైర్మన్ డేగులపాడు గోవిందప్ప, మాజీ సర్పంచ్ మల్లికార్జున, నంచర్ల సర్పంచ్ రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీలు మల్లికార్జున, బెల్డోణ ఈరన్న, రైల్వే కాంట్రాక్టర్ విరూపాక్షి, మండల కాంగ్రెస్ నాయకుడు పెద్ద పెద్దయ్య, లాల్‌స్వామి, మారయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు లింగన్న తదితరులు వంద మందితో ఆయా పార్టీలకు గుడ్‌బై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిపోయారు. నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు ముఖ్యమైన నాయకులు పార్టీ మారడం చర్చనీయాంశమైంది.
 
 ఏళ్ల తరబడి టీడీపీనే నమ్ముకున్న వైకుంఠం శివప్రసాద్‌ను కాదని మరొకరికి టిక్కెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతమే కాకుండా.. టిక్కెట్లను అమ్ముకునేందుకూ వెనుకాడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం కల్పించడం లేదంటూ రెండు రోజుల క్రితం ఆలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు, వెంకటప్పనాయుడు కుమార్తె బొజ్జమ్మ బహిరంగంగా విమర్శించారు. ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్, టీడీపీల్లో కలకలం రేగుతోంది.

వైఎస్సార్‌సీపీలో పని చేయూలన్నదే నా అభిమతం

పదవులన్నీ వైఎస్  చలవే
వైఎస్సార్‌సీపీలో పని చేయూలన్నదే నా అభిమతం: ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి

 మహానంది (కర్నూలు), న్యూస్‌లైన్: తనకు జెడ్పీటీసీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, ఎంఎల్‌ఏ పదవులన్నీ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వల్లే వచ్చాయని కర్నూలు జిల్లా నందికొట్కూరు శాసనసభ్యుడు లబ్బి వెంకటస్వామి చెప్పారు. మహానందీశ్వరుడి దర్శనార్థం శుక్రవారం మహానందికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను వైఎస్ శిష్యుడినని, రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. తాను టీడీపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. వైఎస్ తనయుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీలో పని చేయాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఈ ప్రాంతానికి చెందినవారే అయినా సీమాంధ్రకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక ప్రతిపత్తితో రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరారు.

9 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

నల్లగొండ: వివిధ కారణాలతో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన వైఎస్‌ఆర్  కాంగ్రెస్ అధినేత, కడప ఎంపీ  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర ఖరారైంది. పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 9వతేదీ నుంచి 14వ తేదీ వరకు జిల్లాలో ఓదార్పుయాత్ర జరగనుంది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో పదుల సంఖ్యలో ఆయన అభిమానులు చనిపోయారు. కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. వీరందరి కుటుంబాలను కలిసి, వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని, కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాలని మహానేత రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నల్లకాలువ బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి ఓదార్పు యాత్ర చేపట్టిన ఆయన నల్లగొండ జిల్లాలో మాత్రం పర్యటనను పూర్తి చేయలేకపోయారు.
 
 వివిధ కారణాలు, రాజకీయ అంశాల నేపథ్యంలో ఇన్నాళ్లూ వాయిదా పడింది. జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పలు కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు. ఇప్పటికే కుటుంబాలను గుర్తించడం, ఆర్థిక సాయం కూడా అందించేందుకు ఏర్పాట్లు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రాంతాలు, వాదాలకు అతీతంగా వైఎస్‌ఆర్ అభిమానులు ఉండడం, ఆయన సీఎంగా చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధిపొందిన వితంతులు, వికలాంగులు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు ఇలా... పలు రంగాలకు చెందిన వారు ఉన్నారు.
 
 వైఎస్‌ఆర్ మరణ వార్త విని తట్టుకోలేక కుప్పకూలి పోయిన వారు, తమ ఆత్మబంధువును కోల్పోయామన్న బాధలో బలవన్మరణాలకు పాల్పడిన వారున్నారు. ఇలాంటి కుటుంబాలను కలిసి, వారికి భరోసా కల్పించేందుకు, ‘మీకు నేనున్నాను..’ అన్న ధీమాను ఇచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు  యాత్ర కోసం జిల్లా పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. యాత్ర తేదీలు ఖరారు కావడంతో ఏర్పాట్లలో ఉన్నారు. అయితే, యాత్ర ఏ నియోజకవర్గంలో మొదలయ్యి, ఏ నియోజకవర్గంలో ముగుస్తుందో, యాత్ర మార్గం ఏమిటో ఇంకా తెలియాల్సి ఉందని పార్టీ నాయకత్వం వివరించింది.  

6న నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో ‘జనభేరి’

జనభేరికి సన్నద్ధం
‘చలో నరసరావుపేట’ నినాదంతో మార్చి ఆరో తేదీన నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘జనభేరి’ కార్యక్రమానికి లక్షలాదిగా తరలిరావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు.
 
శుక్రవారం రామిరెడ్డిపేటలోని తన కార్యాలయంలో నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వారందరితో కలసి అయోధ్యరామిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరిగే జనభేరి సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు.
 
ఆ సభలో ఆయన సమక్షంలో తనతో పాటు అనేక మంది నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరబోత్నునట్టు చెప్పారు. ఈ సభకు హాజరయ్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనుద్దేశించి, పార్టీ విధివిధానాలపై జగన్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరిన తరువాత నరసరావుపేట పార్లమెంటు స్థానానికి  పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటానని ప్రకటించారు. రాష్ట్రానికి దిశ, దశా నిర్ధేశించగల నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని ఆయన చెప్పారు.
 
 
కాంగ్రెస్,బీజేపీలు తీరని అన్యాయం చేశాయి : మర్రి రాజశేఖర్
 
 వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడి ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. భారతీయ జనతాపార్టీ కూడా సీమాంధ్రులను మురిపించి అన్యాయానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో జగన్ ఒక్కరే మొదటి నుంచి సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ దేశంలోని జాతీయ నాయకులందరిని కలిసి రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందరి వేదనలను పెడచెవిన పెట్టి విభజనకు పాల్పడిందన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన సర్వేలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారంలోకి రానున్నట్లు తెలియజేస్తున్నాయన్నారు. జగన్ సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని తమ ఇబ్బందులను తొలగించేది జగన్ ఒక్కరేనని భావిస్తున్నారన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ, సమన్యాయం అంటే ఏమిటో ఇప్పటికీ చంద్రబాబుకు తెలియదన్నారు.
 
కాంగ్రెస్‌వారిని చేర్చుకొని చ ంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని, రాష్ట్ర విభజనకు అన్ని విధాల సహకరించిన రాష్ట్ర మంత్రులను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. జనభేరి సభకు ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు స్వచ్ఛంధంగా తరలిరానున్నట్లు చెప్పారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో మాచర్లలో ఓదార్పు యాత్రను కూడా జగన్ నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు, వినుకొండ నియోజవకర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నన్నపనేని సుధ ఇంకా ఆళ్ల పేరిరెడ్డి పాల్గొన్నారు

శ్రీవారి ఆశీస్సుల కోసం నేడు తిరుమలకు జగన్

శ్రీవారి ఆశీస్సుల కోసం నేడు తిరుమలకు జగన్ రాక
సాక్షి, తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుమలకు రానున్నారు. చిన్నతనంలోనే పలుమార్లు ఆయన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు 2009 ఏప్రిల్ 17న శుక్రవారం తిరుమలకు వచ్చారు. 18న శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు ముందు 2012 మే 2న బుధవారం తిరుమలకు వచ్చా రు. 3న గురువారం మరోసారి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని వెళ్లారు. కడప పార్లమెంట్ స్థానంలో తాను రికార్డు స్థా యి మెజారిటీతో గెలుపొందడమే కాకుండా 18 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను గెలిపించారు. తాజాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తం గా పర్యటించనున్నారు.

ఇందులో భాగంగానే శనివారం తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతిలో పర్యటిస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని ఇక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని తిరుగుప్రయాణమవుతారు. ఆ తర్వాత ఎన్నికల జనభేరి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు

నేటి నుంచి వైఎస్సార్ జనభేరి

నేటి నుంచి వైఎస్సార్ జనభేరి
 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న జగన్
 
 సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం ‘వైఎస్సార్ జనభేరి’ మోగించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఓదార్పుయాత్ర కూడా నిర్వహించనున్నారు. జగన్ శనివారం నుంచి పూరించనున్న జనభేరి, ఓదార్పుయాత్ర కార్యక్రమాల వివరాలను పార్టీ పోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
 
     మార్చి 1, 2014: జగన్ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 రాత్రికి తిరుమల లో బస చేస్తారు.
     మార్చి 2,2014: తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
 
     మార్చి 3, 2014: హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. సా. 4గంటలకు ఏలూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 4, 2014: సా.4 గంటలకు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 5, 2014: సా.4 గంటలకు ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 6, 2014: సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 7, 8, 2014: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
 
     మార్చి 9 నుంచి నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు

తెలుగు కాంగ్రెస్‌గా మారుతున్న టీడీపీ

Written By news on Friday, February 28, 2014 | 2/28/2014

'తెలుగు కాంగ్రెస్‌గా మారుతున్న టీడీపీ'
విజయనగరం: కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పార్టీని ఆశ్రయించి.. ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో టీడీపీలో చేరుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు పెన్మత్స సాంబశివరాజు తెలిపారు. పార్టీ కోసం పనిచేయమంటే పదవులే లక్ష్యంగా పార్టీలు మారుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న చంద్రబాబు ఆ పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారా టీడీపీని తెలుగు కాంగ్రెస్‌గా మార్చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సీమాంధ్ర జిల్లాల్లో కూడా వైఎస్‌ఆర్‌ అభిమానులున్నారని సాంబశివరాజు తెలిపారు. తమ పార్టీకి తెలంగాణలోనూ సత్తా చాటుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.

సీమాంధ్రలో 145కు పైగా సీట్లు వైఎస్ఆర్ సీపీవే

'సీమాంధ్రలో 145కు పైగా సీట్లు వైఎస్ఆర్ సీపీవే'
కర్నూలు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో అవకాశం లేకే కాంగ్రెస్‌ నేతలు టీడీపీలో చేరుతున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు.  సీమాంధ్రలో 145 నుంచి 150 స్థానాలను  వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో టీడీపీని ఎవరూ నమ్మరని శోభానాగిరెడ్డి అన్నారు.  కరెంట్‌ తీగలపై బట్టలారేసుకోవాలన్న చంద్రబాబు ఇపుడు ఉచిత విద్యుత్ అంటూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.  9గంటల ఉచిత విద్యుత్‌ అంటూ చంద్రబాబు చేస్తున్న వాగ్దానాల్ని ఓట్ల కోసమే అని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు.

సింగపూర్, మలేషియా, దుబాయ్.. బాబుకు మూడు కళ్లు

సింగపూర్, మలేషియా, దుబాయ్.. బాబుకు మూడు కళ్లు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. సీమాంధ్రను సింగపూర్‌ మాదిరి తయారు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని,  సింగపూర్‌కు మీకు ఏమిటీ సంబంధమేంటని రామచంద్రరావు ప్రశ్నించారు.

చంద్రబాబుకు  సింగపూర్, మలేషియా, దుబాయ్ మూడు కళ్లులాంటివని వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో ఉన్న మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు గట్టు సవాల్ విసిరారు. 'ఎన్నికల సర్వేలను మేనేజ్ చేయడంలో మీకు మీరే సాటి. 2004, 2009 ఎన్నికల సందర్బంగా మళ్లీ మీకే పగ్గాలంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకున్నది వాస్తవం కాదా? సర్వేలను మేనేజ్ చేయగలరేమో గాని, ప్రజలను మేనేజ్ చేయడం అసాధ్యం' అంటూ చంద్రబాబును ఉద్దేశించి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ఆర్ జనభేరి షెడ్యూలు విడుదల

వైఎస్ఆర్ జనభేరి షెడ్యూలు విడుదల
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగించే వైఎస్ఆర్ జనభేరి షెడ్యూలు విడుదలైంది. శనివారం.. మార్చి ఒకటోతేదీన తిరుపతిలో వైఎస్ఆర్ జనభేరి జరుగుతుంది. సాయంత్రం లీలామహల్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. మార్చి 3, 4 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పర్యటిస్తారు. మూడో తేదీన ఏలూరులోను, నాలుగో తేదీన నిడదవోలులోను బహిరంగ సభలు జరుగుతాయి. ఐదో తేదీన తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ జనభేరి ఉంటుంది.

మార్చి 6, 7, 8 తేదీలలో గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలుంటాయి. మార్చి 6న నరసరావుపేటలోను, 7, 8 తేదీల్లో మాచర్ల నియోజకవర్గంలోను వైఎస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేస్తారు. మార్చి 9 నుంచి14వ తేదీ వరకు నల్గొండ జిల్లాలో ఓదార్పుయాత్ర ఉంటుందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

గన్నవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు

3న జిల్లాకు జగన్
సాక్షి, విజయవాడ : మూడున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్న ఆయన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్తారని ఆయన వివరించారు.

సింగపూర్ చేసి తన కడుపు కొట్టొద్దంటున్నాడ్సార్!!

కార్టూన్

వైసీపీ ఎన్నికల శంఖారావం

వైసీపీ ఎన్నికల శంఖారావం
 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 3న ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశేషంగా కృషి చేయాలని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఏలూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏలూరులో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుందని, గతంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై కుట్రలు పన్ని జైలులో పెట్టించారన్నారు. వీటికి భయపడని జగన్ దమ్మున్న నాయకునిగా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయటానికి కాంగ్రెస్, టీడీపీలు పన్నిన కుట్రలను సమర్థంగా ఎదుర్కొని అనేక ఆందోళనలు చేశారని వివరించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని బాలరాజు స్పష్టం చేశారు.
 
 వైఎస్ ఆశయ సాధనే పార్టీ లక్ష్యం : తోట చంద్రశేఖర్
 పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవ ర్గ ఇన్‌చార్జి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించబోయే ఎన్నికల శంఖారావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే కాదని మరో నాలుగైదు వారాల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగే అవకాశమున్నందున వాటికి కూడా వర్తిస్తుందన్నారు. రాబోయే అన్ని స్థాయిల ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని ఆధికాన్ని ఇచ్చి ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అత్యధిక లోక్‌సభ స్థానాలు కట్టబెట్టి కేంద్రాన్ని శాసించే స్థాయికి సీమాంధ్ర ప్రజలు చేరుకోవాలన్నారు. ఏలూరులో నిర్వహించనున్న ఎన్నికల శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా సీమాంధ్ర అంతటా సానుకూల సంకేతాలు పంపాల్సిన గురుతర బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ఇతర పార్టీల్లా డబ్బులిచ్చి ప్రజలను సభలకు తెచ్చుకోవాల్సిన దుస్థితి వైసీపీకి లేదన్నారు. ప్రజలకు పార్టీపై ఉన్న అభిమానాన్ని నిలబెడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళితే చాలన్నారు. 
 
 వైఎస్ కుటుంబానికి అండగా ఉండండి : ఆళ్ల నాని
 వైఎస్ కుటుంబానికి రాష్ట్ర ప్రజలు రెండు నెలలపాటు అండగా ఉంటే అక్కడి నుండి రాష్ర్ట ప్రజలకు వారు అండగా ఉంటారని ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నాని అన్నారు. ఈ  రాష్ట్రాన్ని పాలించటానికి వైఎస్ జగన్‌మోహనరెడ్డే  అర్హుడని ప్రజలంతా విశ్వసిస్తున్నారని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను పణంగాపెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియా నియంతలా వ్యవహరించటాన్ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభంజనాన్ని చూసి వైఎస్సార్ కుటుంబంపై బురదజల్లడానికి కాంగ్రెస్, టీడీపీ, కిరణ్ కుమార్‌రెడ్డి చేయని ప్రయత్నంలేదని పేర్కొన్నారు. వైసీపీని అడ్డుకోకపోతే పాతికేళ్ళపాటు తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందనే భయంతో వైఎస్ జగన్‌ను ఎన్ని విధాలుగా కష్టపెట్టాలో అన్ని విధాలా కష్ట పెట్టారని చెప్పారు. వాటన్నిటినీ తట్టుకుని ప్రజల కోసం ఉద్యమాలను వీడకపోవడం ఆయన విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌గౌడ్, రామచంద్రరావు, పీవీ రావు, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, జిల్లా అధికార ప్రతినిధులు బొద్దాని శ్రీనివాస్, వగ్వాల అచ్యుతరామారావు, ఏలూరు నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ మంచెం మైబాబు, పార్టీ వివిధ విభాగాల నగర కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 విశ్వసనీయతకు మారుపేరు వైసీపీ
 ఏలూరు(ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : రాజకీయాల్లో ఏ పార్టీ సంపాదించుకోలేని విశ్వసనీయతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే పొందిందని పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. గురువారం  వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఆ నాయకులు మాట్లాడుతూ సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయతత్వాన్ని లేవదీసి రాజకీయ ప్రయోజనాలకోసం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయా పార్టీల పేరు చెబితే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం చేసిన ఒంటరి పోరాటం తమను విశేషంగా ఆకర్షించిందన్నారు. ఇటువంటి నాయకుని నాయకత్వంలో సామాన్య కార్యకర్తగా పనిచేసినా తమకు తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే పార్టీకీ స్థానం లేదని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో సీమాంధ్ర పునర్నిర్మాణంలో తమ వంతు ఉడతా భక్తి సహకరించడానికే వైసీపీలో చేరుతున్నామని స్పష్టం చేశారు.  నగరంలోని ఐదో డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతా దుర్గారెడ్డి నాయకత్వంలో సుమారు 200 మంది కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు, 36వ డివిజన్‌కు చెందిన దొంతంశెట్టి బదరీనారాయణ, పుచ్చల అప్పారావు నాయకత్వంలో సుమారు 100 మంది కార్యకర్తలు, వెంకటాపురం పంచాయతీకి చెందిన 11వ వార్డు సభ్యుడు జీలపాటి పరశురామ్, దేవినేని సుబ్బయచౌదరి నాయకత్వంలో సుమారు 100 మంది వైసీపీలో చేరారు. 

వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యునిగా ఎల్‌ఎం

 అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యునిగా ఎల్‌ఎం మోహన్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
 
  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయిన ఎల్‌ఎం మోహన్‌రెడ్డి ప్రస్తుతం మడకశిర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. సీఈసీ సభ్యునిగా నియమించడం ద్వారా ఎల్‌ఎంకు పార్టీలో ఉన్నత స్థానం కల్పించినట్లయింది. ఈ నియామకం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
 

టీడీపీ అసమర్థత వల్లే బొత్స అవినీతి

టీడీపీ అసమర్థత వల్లే బొత్స అవినీతి
బొబ్బిలి, న్యూస్‌లైన్ :టీడీపీ అసమర్థత వల్లే జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయ ణ అవినీతి, అక్రమాలు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. అక్రమాలపై బొత్సను నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. అందువల్లే బొత్స అవినీ తి, అక్రమాలకు అడ్డూ అదుపులేకుండాపోరుుందని చెప్పారు. గురువారం ఆయన బొబ్బి లి కోటలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు బొత్స అవినీతిపై అనేక వాస్తవాలు మాట్లాడారని, అయితే ఆయన అవి నీతి పెరగడానికి టీడీపీ వైఖరే కారణ మన్నారు. 2004లో బొత్స మంత్రి అయిన దగ్గర నుంచి జరుగుతున్న తప్పిదాలను, అక్రమాలను ప్రజల తరఫున టీడీపీ ఎంతవరకూ పోరాటం చేసిందని ప్రశ్నించారు. 
 
 బొత్సకు బుద్ధి చెప్పడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకు కారణమైన టీడీపీని కూడా క్షమించరని చెప్పారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పారిశ్రామికంగా వెనుకబడ్డాయన్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో చంద్రబాబు హయాంలోని ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని తెలిపారు. విజయనగరం జిల్లాను మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామంటున్న బాబు తొమ్మిదేళ్లలో ఏమి చేశారని ప్రశ్నించారు. తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ, తారకరామతీర్థసాగర్ జలాశయాలు గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిశ్రమలు సంఖ్య పెరిగిందన్నారు. వైఎస్ తన హయాంలో జలయజ్ఙం పేరుతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించారన్నారు. ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారని చెప్పారు. ఆయనతో పాటు రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకుడు రౌతు రామ్మూర్తి , తదితరులు ఉన్నారు.

రేపు తిరుపతిలో వైఎస్‌ఆర్ జనభేరి

రేపు తిరుపతిలో వైఎస్‌ఆర్ జనభేరి
  •      స్వాగత సన్నాహాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  •      లక్ష్మీపురం సర్కిల్ నుంచి తిరుపతి నగరంలో రోడ్‌షో
  •      ఏర్పాట్లపై సమీక్షించిన వైవీ.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన
  •      నగరమంతా వెలసిన స్వాగత ఫ్లెక్సీలు, కటౌట్లు
  •      లీలామహల్ సర్కిల్లో సభ
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. మార్చి ఒకటిన తిరుపతిలోని లీలామహల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసే ‘వైఎస్‌ఆర్ జనభేరి’ కి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. ఆ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో జననేత రోడ్‌షో నిర్వహిస్తారు. నగరంలో రెండు కుటుంబాలను ఓదారుస్తారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు రోడ్‌షో ప్రారంభమవుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.
 
భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ని యోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలు రెండు రోజుల నుంచి జననేత పర్యటనను జయప్రదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ.సుబ్బారెడ్డి సమీక్షించారు. వైఎస్.జగన్ మార్చి 1వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి నగరంలోని ప్రధానమార్గాల మీదుగా రోడ్‌షో నిర్వహిస్తారు. వైఎస్ మరణానంతరం మృతి చెందిన అభిమానుల కుటుంబాలను మధ్యాహ్నం ఓదారుస్తా రు. సాయంత్రం లీలామహల్ సర్కిల్‌లో నిర్వహించే వైఎస్‌ఆర్ జనభేరి సభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమలలో బస చేసి, మార్చి 2వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అదే రోజు బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు.
 
ఏర్పాట్లు సమీక్షించిన ఎమ్మెల్యే భూమన

తిరుపతిలో నిర్వహించనున్న వైఎస్‌ఆర్ జనభేరి ఏర్పాట్లను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సమీక్షించారు. ఇప్పటి వరకు నగరంలో జననేతకు స్వాగతం పలికేందుకు ఎక్కడెక్కడ సన్నాహాలు చేస్తున్నారనే విషయాలను ఆరా తీశారు. నగరంలో రోడ్‌షో నిర్వహించాల్సిన మార్గాలను ఖరారు చేశారు. జనభేరి ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే జగనన్న సీఎం కావాలని అందుకోసం రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు గట్టిగా పని చేయాలని అన్నారు. శనివారం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యే వైఎస్‌ఆర్ జనభేరి సభకు జనం పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
 
నగరమంతా వెలసిన స్వాగత ఫ్లెక్సీలు

తిరుపతి నగరంలో నిర్వహించే వైఎస్‌ఆర్ జనభేరికి హాజరయ్యే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ వార్డు వార్డునా ఫ్లెక్సీలు వెలిశాయి. నగరంలో జగన్ రోడ్‌షో నిర్వహించే అన్ని మార్గాలతో పాటు, ప్రధాన కూడళ్లలో అభిమాన నాయకుడికి ఘనస్వాగతం అంటూ రాసిన ఫ్లెక్సీలు, ఫ్యాను గుర్తుకే ఓటు వేయండి జగనన్నను సీఎం చేయండి, భూమన కరుణాకరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచే అన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాట్లు మొదలయ్యాయి.

లీలామహల్ సర్కిల్‌లో వేదిక నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. లక్ష్మీపురం సర్కిల్, టీవీఎస్ కూడలి, డీఆర్.మహల్ సర్కిల్, గ్రూప్ థియేటర్స్, బండ్లవీధి, గాంధీరోడ్డు, క్రిష్ణాపురం ఠాణా, జ్యోతిథియేటర్ సర్కిల్, భవానీనగర్ జంక్షన్, మున్సిపల్ ఆఫీసు కూడలి ఇలా దాదాపు అన్ని ప్రధాన మార్గాల్లో జననేత వైఎస్.జగన్‌కు స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రతి కూడలిలోనూ పెద్ద ఎత్తున మహిళలు, యువకులు స్వాగతం పలికేందుకు ఆయా వార్డుల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వైవీ సుబ్బారెడ్డి పరిశీలన


వైఎస్‌ఆర్ జనభేరి కార్యక్రమ నిర్వహణ గురించి చర్చించేందుకు గురువారం రాత్రి తిరుపతికి పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ. సుబ్బారెడ్డి వచ్చారు. ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా జనభేరి జరిగే ప్రాంతమైన లీలామహల్ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ సభాస్థలిని పరిశీలించారు. అనంతరం పీఎల్‌ఆర్ గ్రాండ్ హోటల్‌లో ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అ ధ్యక్షులు కే.నారాయణస్వామి, రాజం పేట పార్లమెంట్ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఆదిమూలం, తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నెల్లూరు జి ల్లాకు చెందిన నాయకులు సంజీవయ్య, సునీల్, పార్టీ కార్యనిర్వాహక మండలి సభ్యుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆల్‌ఫ్రీ చంద్రబాబు మాటలు నమ్మితే సర్వం ....

ఆల్‌ఫ్రీ బాబు మాటలు నమ్మితే అంతే..
నిమ్మనపల్లె, న్యూస్‌లైన్: ఆల్‌ఫ్రీ చంద్రబాబు మాటలు నమ్మితే సర్వం కోల్పోవాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన నిమ్మనపల్లె మండలంలో గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అగ్రహారం చెరువుముందరపల్లె నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూలవాండ్లపల్లె, నల్లంవారిపల్లె అగ్రహారం, బోడుమల్లయ్యగారిపల్లె, నిమ్మనపల్లె గ్రా మాల్లో  పర్యటించారు. ఈ సందర్భంగా నిమ్మనపల్లె కందూరు రోడ్డు నుంచి అగ్రహారం రోడ్డు వరకు బస్టాండు మీదుగా మహిళలతో ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బస్టాండు కూడలిలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించారు. నియంత సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ల పాలనలో హైదరాబాద్‌ను కోల్పోయినట్టే ఆల్ ప్రీ చంద్రబాబు మాటలు వింటే సర్వం కోల్పోవాల్సివుంటుందన్నారు. రాష్ట్రాన్ని కిరణ్, చంద్రబాబు సహకారంతో యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలుగా చేసిందన్నారు. దీంతో  ఉద్యోగ అవకాశాలు,  తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ను కోల్పోయి జీవితాంతం సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తప్పడు కేసులు బనాయించి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో ఉంచారన్నారు. అయి నా ఆయన ప్రజల పక్షాన నిలి చార న్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. రాజన్న పాలన తిరిగి రావాలంటే వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సదాశివారెడ్డి, ప్రచార కార్యదర్శి ఈతకట్టు చంద్రశేఖర్, సింగిల్‌విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు నాగరాజ, వెంకటరమణ, రుఖియాబేగం, బాబు, ప్రవీణ్‌కుమార్, ప్రసన్న లక్ష్మీ, చిన్నరెడ్డెప్పరెడ్డి, గంగాధర్, మదనపల్లె నాయకులు ిపీఎస్‌ఖాన్, మాజీ కౌన్సెలర్ జింకా వెంకటాచలపతి, సురేంద్ర, వైజయంతి, మల్లిక, ఈశ్వ ర్, ఎర్రయ్య, మునిరత్న, మదన్మోహన్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి  మహిళలు, రైతులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్‌ఆర్ సీపీకి పొరుగు రాష్ట్రాల్లోనూ ఆదరణ

బెంగళూరు, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ఈ రెండేళ్లలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లో విశేష ఆదరణ లభిస్తోందని పార్టీ చిత్తూరు జిల్లా నాయకుడు శివప్రకాశ్ రాజు తెలిపారు. గురువారం ఇక్కడి టౌన్ హాలులో డాక్టర్ వైఎస్‌ఆర్ కర్ణాటక యువ వేదిక ఏర్పాటు చేసిన ‘నగరంలోని వివిధ ప్రాంతాల్లో పదాధికారుల నియామకం, మిస్డ్ కాల్ ద్వారా వైఎస్‌ఆర్ సీపీ సభ్యత్వం నమోదు’ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తూ, కొద్ది రోజుల్లోనే వైఎస్‌ఆర్ సీపీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటలీకి చెందిన ఒక మహిళ మన దేశ నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాలను వ ుుక్కలు చేస్తోందని ఆరోపించారు. కేవలం సోనియా తప్పుడు నిర్ణయం వల్లే నేడు అన్నదమ్ములుగా కలిసి ఉన్న మనం రెండు ప్రాంతాలుగా విడిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా రాష్ట్ర విభజనకు యథాశక్తి కృషి చేసిందని విమర్శించారు. డాక్టర్ వైఎస్‌ఆర్ యువ వేదిక అధ్యక్షుడు ఎన్‌పీ. సురేష్ కుమార్ నేతృత్వంలో నాలుగేళ్లుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని ఆయన కొనియాడారు. వైఎస్‌ఆర్ సీపీ పులివెందుల నియోజవర్గం నాయకుడు సర్వోత్తమరెడ్డి మాట్లాడుతూ... బెంగళూరులో వైఎస్‌ఆర్ అభిమానులు లక్షల్లో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అందరూ తమ నియోజక వర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సురేష్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం తమ వేదిక తరఫున ప్రచారం చేస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వెలువ డిన తర్వాత ప్రచార కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా నగరంలో వైఎస్‌ఆర్ అభివ ూనులు బీటీఎం లేఔట్ నుంచి నాగేంద్ర బృందం, యలహంక నుంచి ఆర్‌ఎన్. ముని, మహాలక్ష్మి లేఔట్ నుంచి  కృష్ణప్ప, మల్లేశ్వరం నుంచి చిరంజీవి, జేజే నగర నుంచి కాంతరాజు, బాబు, జయమహల్ నుంచి (బెన్సన్‌పేట) నాగేంద్ర,  విద్యారణ్యపురం నుంచి త్యాగరాజు రెడ్డి, జయనగర నుంచి శ్రీనివాసులు, రామాంజనేయులు, బన్నేరుఘట్ట నుంచి ప్రవీణ్ రెడ్డి, వినోద్ బృందాలు వైఎస్‌ఆర్ యువ వేదికలో చేరాయి.

ఇదే సందర్భంలో క్యాలెండర్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా కొత్త చెరువు సర్పంచ్ మాణిక్యం బాబా, వైఎస్‌ఆర్ సీపీ ఐటీ వింగ్ సభ్యుడు వీరభద్రరావు, బెంగళూరు జల మండలి అధికారి ఎల్. పోతన్న శెట్టి, యువ వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డీఎన్. రసూల్, పదాధికారులు ఓ.గంగన్న, ఆంజనప్ప, రామయ్య, కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.
 

చంద్రబాబుకు భయం పట్టుకుంది

Written By news on Thursday, February 27, 2014 | 2/27/2014

ఏలూరు: వైఎస్‌ కుటుంబాన్ని రాజకీయంగా అంతం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై విభజనకు సహకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు, డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. కుమ్మక్కై రాజకీయాలతో ఆరు కోట్ల సీమాంధ్ర ప్రజలతో ఆడుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదన్నట్టుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కుటుంబం అధికారంలోకి వస్తే జగన్‌ సుపరిపాలన ద్వారా టీడీపీ కనుమరుగవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు.

ప్రజాసంక్షేమం కోసం పోరాడింది వైఎస్ కుటుంబం మాత్రమేనని, రాజన్న రాజ్యం రావడానికి ఎంతో దూరం లేదన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం వైఎస్ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వీరు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల రాజేష్‌కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మార్చి 1 నుంచి జగన్ జనభేరి

మార్చి 1 నుంచి జగన్ జనభేరి
తిరుపతి: మార్చి 1న తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  జనభేరి ప్రారంభిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి చెప్పారు. భగవంతుడి సన్నిధి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంన్నారు. రాజన్నరాజ్యం జగన్ ద్వారానే సాధ్యం అని ఆయన చెప్పారు.

జగన్ రాక కోసం ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. మార్చి 1న సాయంత్రం లీలామహల్ సెంటర్‌లో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. అదే రోజు తిరుపతిలో రెండు కుటుంబాలను జగన్ ఓదారుస్తారన్నారు.

బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని, అక్కడ ఏర్పాట్లను  పార్టీ నేతలు  వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి పరిశీలించారు.

పిట్టలదొరలా చంద్రబాబు...

'పిట్టలదొరలా చంద్రబాబు ప్రగల్బాలు'వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిట్టలదొరలా ప్రగల్భాలు పలుకుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శించారు.  ప్రజాగర్జన పేరుతో చంద్రబాబు పదేపదే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ  బిల్లుకు అనుకూలంగా మొదటి ఓటును వేశామన్న మీ ఎంపీల మాటలు మీకు గుర్తులేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు టీడీపీకి తేడా ఏంటి? విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి కేంద్రాన్ని తొందరపెట్టిన విషయం మీకు గుర్తులేదా? అని అడిగారు.  ఏ ప్రాంతంలోనూ 10 ఎమ్మెల్యే సీట్లు గెలవలేని మీరు రాష్ట్రాన్ని సింగపూర్‌గా ఎలా మారుస్తారు? 9 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు సీమాంధ్రకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. పగటివేషగాడిలా కబుర్లు చెప్పడం మానుకోమని పద్మ సలహా ఇచ్చారు.

సింగపూర్ అంటే.. మళ్లీ వ్యవసాయం గల్లంతే

సింగపూర్ అంటే.. మళ్లీ వ్యవసాయం గల్లంతే
విజయనగరం : సీమాంధ్రను సింగపూర్ చేయడం అంటే.. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందని, సింగపూర్ లో వ్యవసాయం గానీ, పరిశ్రమలు గానీ లేవన్న సంగతి చంద్రబాబుకు తెలియదా అని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు మండిపడ్డారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. చంద్రబాబు వస్తే మళ్లీ సీమాంధ్రలో ఆయన పాలన నాటి పరిస్థితే వస్తుందని చెప్పారు.

జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే సర్వేలపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం సర్వేలు వద్దని సిఫార్సు చేస్తే అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి చంద్రబాబు అని అన్నారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు అదేంటో చెప్పలేదని సుజయకృష్ణ రంగారావు గుర్తుచేశారు.

సోనియా... రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చేసింది

సోనియా... రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చేసిందిదాడి వీరభద్రరావు
విశాఖపట్నం : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు.  గురువారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి తొమ్మిది రోజులవుతున్న ముఖ్యమంత్రిని నియమించాలా లేకా రాష్ట్రపతి పాలన విధించాలా అనేది మాత్రం తేల్చుకోలేక పోతుందన్నారు. రాష్ట్రంలో సీఏం పదవికి కాంగ్రెస్ అధిష్టానం వేలం పాట నిర్వహిస్తున్నట్టుందని దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు.
 

సీమాంధ్రలో రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తామని ప్రకటించడం విచారకరమన్నారు. రానున్న ఎన్నికలలో గెలుపొందే ఎమ్మెల్యేలకు రాజధానిని నిర్ణయించుకునే హక్కు కూడా ఇవ్వరా అంటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంత అయిపోయాక కొత్త పార్టీ పెట్టి ఏం లాభం అంటూ అపద్ధర్మ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని దాడి ప్రశ్నించారు. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసం కిరణ్ మాయమాటలు చెప్పి విభజనకు సహకరించారని విమర్శించారు.
 
మొదటి నుంచి విభజన వాది అయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమైక్యం కోసం కృషి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది బాబే అన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ లో టీడీపీ సవరణలు ఇవ్వకుండా సమైక్యం కోసం పోరాడుతున్నామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాలనలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చయకుండా ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగులలో అభద్రతభావాన్ని కలిగించింది మీరు కాదా అంటు చంద్రబాబును ప్రశ్నించారు.

కొత్త పార్టీలు ఎన్నొచ్చినా జగన్‌కు ఎదురు లేదు

  • చరిత్రలో అసమర్థ ముఖ్యమంత్రి కిరణ్  
  •  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చౌడేపల్లె, న్యూస్‌లైన్: కొత్త పార్టీలు ఎన్ని పుట్టుకొచ్చి నా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురులేదని, ఖచ్చితం గా ముఖ్యమంత్రి అవుతారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చౌడేపల్లె మండలంలో నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం బుధవారం ఐదవ రోజుకు చేరింది. పర్యటనలో భాగంగా కొలింపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టినా అభ్యర్థులను గెలిపించుకునే సత్తా లేదన్నారు.

శాసనసభ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏనాడు వేల ఓట్ల మెజారిటీ సాధించలేదని గుర్తుచేశారు. అసమర్థత పాలన కొనసాగించి రాష్ట్రా న్ని రెండు ముక్కలుగా చేయడానికి కేంద్రంలోని పెద్దలకు సహకరించారని ఆరోపించారు. ఓట్ల కోసం ఏమార్చడానికి చూస్తున్న నాయకులకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చరిత్రలో అసమర్థ సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిలిచిపోయారన్నారు. మూడు నెలల కాలంలో అనేక ఫైళ్లపై సంతకాలు చేసి అధికారం ముసుగులో వేల కోట్లు అక్ర మం గా కూడబెట్టారని ఆరోపించారు.

ఇప్పటికే కేంద్రం నుంచి తనిఖీ బృందం గవర్నర్ సమక్షంలో తనిఖీలు చేస్తున్నారని అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయన్నారు. ఎన్ని కొత్త పార్టీలొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, టీడీపీకి అప్పుడే గుబు లు పట్టుకుందని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడం తధ్యమని, అన్ని ప్రాం తాలను సమానంగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, సీడీసీఎంఎస్ మాజీ చైర్మన్ ద్వారకనాథరెడ్డి, నాయకులు ఎన్.రెడ్డెప్ప, ఇంకా రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్, మునస్వామిరాజు, గాజుల రామ్మూర్తి, పద్మనాభరెడ్డి, లడ్డూరమణ, నాగభూషణరెడ్డి, ప్రవీణ్‌కుమార్, వెంకటరెడ్డి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబు గూబ గుయ్‌మనేలా శంఖారావం

బాబు గూబ గుయ్‌మనేలా శంఖారావం
  •    ఫ్యాను గాలికి  టీడీపీ కొట్టుకుపోతుంది..
  •      ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
 తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: తిరుపతి ఆధ్మాత్మిక పుణ్యక్షేత్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పూరించనున్న ఎన్నికల శంఖారావం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గూబ గుయ్ మనేలా ఉంటుందని తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని కొర్లగుంట, గాంధీరోడ్డు ప్రాంతాల్లో బుధవారం పార్టీ నాయకు డు జ్యోతిప్రకాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు.

ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా కిరణ్, చం ద్రబాబు కుమ్మక్కు రాజకీయాలతో అధిక భారాలు మోపి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. దీం తో విసిగిపోయిన ప్రజలు జగనన్న పాలన కోసం ఎదురుచూస్తున్నారన్నా రు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గాలికి టీడీపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. సోనియాగాంధీకి తొత్తులుగా వ్యవహరించి తెలుగుజాతిని ముక్కలు చేసిన దుర్మార్గులు కిరణ్, చంద్రబాబు అని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన ద్రోహులైన కిరణ్, చంద్రబాబుకు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఆరు నెలల పాటు రాష్ట్ర సమైక్యత కోసం అలుపెరగని ఉద్యమ, పోరాటాలు చేసింది ఒక్క వైఎస్‌ఆర్‌సీపీ మాత్రమేనని గుర్తు చేశారు. తాను గెలుపొందిన రెండేళ్ల కాలంలో నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే ఎన్నిక ల్లో వైఎస్‌ఆర్ సీపీని గెలిపించాలని విజ్ఞ ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ నాయకులు పుల్లయ్య, కేతం జయచంద్రారెడ్డి, పి. అమరనాథరెడ్డి, టి. రాజేం ద్ర, బాలమునిరెడ్డి, తాలూరి ప్రసాద్, రామకృష్ణయ్య, చెలికం కుసుమ, గీత, శారద, దుర్గ, శాంతారెడ్డి, బోయళ్ల రాజేంద్రరెడ్డి పాల్గొన్నారు.
 

5న ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ బహిరంగసభ

: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం బహిరంగసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హైదరబాద్‌లో ఇటీవల జరిగిన సమన్వయకర్తల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు వివరించారు.

తెలంగాణలో పార్టీకి ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక్కడ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాలకు ఈ సభ స్ఫూర్తిగా నిలవాలని, ఇందుకోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నంబూరి రామాలింగేశ్వరరావు (సత్తుపల్లి), ఎడవల్లి కృష్ణ(కొత్తగూడెం), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), బానోత్ మదన్‌లాల్(వైరా), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారరావుపేట), సామాన్యకిరణ్(మధిర), నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మార్కం లింగయ్యగౌడ్, ముస్తాఫా, మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన మాట కోసం తెలంగాణలో ఓదార్పుయాత్ర చేయబోతున్నా

అందరూ నావాళ్లే
రాజన్న రాజ్యం తేవడమే వైఎస్సార్ సీపీ ధ్యేయం
 పార్టీ తెలంగాణ, సీమాంధ్రలోనూ ఉంటుంది
 రాష్ట్రాన్ని విడగొట్టారు కానీ.. తెలుగువారి ఆప్యాయతలను విడగొట్టలేరు
 విశ్వసనీయతను చూసి ఓట్లేయమని అడుగుతాం
 ఇచ్చిన మాట కోసం తెలంగాణలో ఓదార్పుయాత్ర చేయబోతున్నా
 ఎన్నికల షెడ్యూలు వెలువడి వీలుకాని పక్షంలో నా తల్లి, చెల్లి ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు
 ఓదార్పు యాత్రలో పేదల కష్టాలు చూశాను..
వాటిని పరిష్కరించే దిశగా ప్లీనరీ వేదికగా  పలు హామీలిచ్చాను
 ఆ హామీల కోసం నా జీవితం ధారపోస్తాను

 
 
 సాక్షి, హైదరాబాద్: రాజన్న రాజ్యం కోసం కృషి చేసే తమ పార్టీ అన్ని ప్రాంతాల్లోనూ ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతి పేదవాడి మనసు తెలుసుకుని వారి గుండెల్లో నిలిచిపోయే రీతిలో పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘‘రాష్ట్రాన్ని విడగొట్టారు. భూమిని విడగొట్టారు. కానీ తెలుగుజాతిని విడదీయలేరు. తెలుగువారు ఎక్కడున్నా వారి మనసులు, వారి ఆప్యాయతలను విడగొట్టలేరు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ... అక్కడా ఇక్కడా అన్ని చోట్లా నా అన్నదమ్ములున్నారు.
 
 
 అక్కచెల్లెళ్లున్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా నాది అన్న భావనే సమైక్యం. ఆప్యాయతలు అక్కడా ఇక్కడా అన్ని చోట్లా ఉన్నాయని చెప్పడమే నా అభిప్రాయం. ఇదే నినాదంతో తెలంగాణలోకి వెళతాం. తెలంగాణలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఉంటుంది’’ అని వివరించారు. త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేయడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రెండు రోజుల చర్చా వేదికలో జగన్ పాల్గొని ముగింపు ఉపన్యాసం చేశారు. ‘‘తెలంగాణలోనూ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని పార్టీ శ్రేణుల్లోనూ విశ్వాసం నింపుతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా తెలంగాణలో ఓదార్పుయాత్ర చేయబోతున్నాను’’ అని చెప్పారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 మనమిచ్చే ఆక్సిజన్‌తోనే ప్రధాని బతకాలి!

 ‘‘వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకునే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. మనమిచ్చే ఆక్సిజన్‌తోనే కేంద్రంలో ప్రధాని పదవిలో ఉండేవాళ్లు బతికే పరిస్థితులు తీసుకురావాలి. సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆయనకు ఒకటే చెబుతున్నాను. అయ్యా.. ప్రధానమంత్రి మన ఆక్సిజన్‌తో బతికే పరిస్థితి వచ్చినప్పుడు.. మనకు డబ్బులు వచ్చినప్పుడు.. నువ్వే అవసరం లేదు.. ఎవరైనా ఆ పని చేయగలుగుతారు. తెలుగువారమంతా ఒక్కటై కచ్చితంగా ఆ పరిస్థితి తీసుకురావాలి. రాజకీయంగా ఇది చాలా అవసరం.
 
 ఓదార్పు యాత్రలో షర్మిల, విజయమ్మ ఉంటారు..

 తెలంగాణ ప్రాంతంలో నేను ఓదార్పు యాత్ర చేస్తాను. ఓదార్పు యాత్రలో నా చెల్లి షర్మిల, నా తల్లి విజయమ్మను భాగస్వాములను చేస్తాను. కారణమేమిటంటే.. నా తల్లికి, చెల్లికి పేదవాడు ఎలా బతుకుతున్నాడని అవగాహన కలగాలి. చనిపోయిన తర్వాత కూడా ఆ పేదవాడి గుండెల్లో బతికి ఉండడం ఎలా అనే ఆలోచన వాళ్లకు కలగాలి. ఒకవేళ ఎన్నికల షెడ్యూలు వెలువడి నేను సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించాల్సి వస్తే కూడా యాత్ర ఆపను. నాతల్లి, చెల్లి తెలంగాణలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు. ఎవరి జీవితంలోనైనా వెనుక కొందరున్నారంటారు. నా జీవితంలో కూడా నా తల్లి, నా చెల్లి, నా భార్య ఈ ముగ్గురూ ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను. తెలంగాణలో ప్రతి కార్యకర్తకు కూడా భరోసా ఇస్తూ చెబుతున్నాను.. మన పార్టీ ఎక్కడికీ పోదు.. తెలంగాణలో కూడా మన కుటుంబం ఉంటుంది.
 
 ప్రతి నాయకుడూ పేదల కష్టాలు తెలుసుకోవాలి..

 బహుశా ఏ రాజకీయ నాయకుడికీ రాని అవకాశం నాకు వచ్చింది. ఓదార్పు సందర్భంగా పేదల ఇళ్లకు వెళ్లి  వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నాను. సాధారణంగా ఏ నాయకుడైనా ఒక మండల  కేంద్రం వరకూ వెళ్లి అక్కడే ఒక సభలో మాట్లాడి బైబై, టాటా అని వెళ్లడం అలవాటు. నేను దాదాపు 700 కుటుంబాలను కలిశాను. వారి కష్టాలు తెలుసుకున్నాను. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావాలనుకునే ప్రతి నాయకుడూ ఇలాంటి పరీక్షకు సిద్ధపడాలి. పేదల పూరిగుడిసెలకు వెళ్లి వారి జీవితాలను తెలుసుకుని ఏ విధంగా వారిని బాగు చేయవచ్చనే తలంపుతో పని చేయాలి.
 
 ఇదేనా ఆ పార్టీల విధానం?

 రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ; కేంద్రంలో కూడా అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ.. ఈ నాలుగూ కుమ్మక్కయి దారుణంగా వ్యవహరించాయి. రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని బీజేపీ చెప్పింది. టీడీపీ చెప్పింది. కానీ పార్లమెంటులో ఈ రెండు పార్టీలూ విభజన బిల్లుకు మద్దతు పలికాయి. ఇదెక్కడి విధానం? అన్యాయంగా విభజన జరుగుతోందని చంద్రబాబు ఓవైపు చెప్పి మరోవైపు వాళ్ల ఎంపీల చేత బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టి గతంలో ఎక్కడా లేని విధంగా సీమాంధ్ర ఎంపీలందరినీ సస్పెండ్ చేసి మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నారు.
 
 అందుకే కలసి ఉండాలన్నాం..

 మహానగరం, మహా సముద్రం కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, నౌకాశ్రయం, విమానాశ్రయం రెండూ కలసి ఉంటేనే తెలుగు జాతికి మేలు జరుగుతుందని భావించాం. 42 మంది లోక్‌సభ సభ్యులుంటే.. కేంద్రంతో గట్టిగా పోరాటం చేసి పెద్ద ప్రాజెక్టులను మన రాష్ట్రానికి తీసుకువచ్చి గుజరాత్ వంటి రాష్ర్టంతో పోటీపడి దేశంలోనే అగ్రగామిగా ఉంచొచ్చని ఆశించాం. అందుకే రాష్ట్రం ఒకటిగా ఉండాలని తాపత్రయపడ్డాం. అందుకోసం అలుపెరుగని పోరాటం చేశాం. కానీ అధికార, ప్రతిపక్షాలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కలసిపోవడంతో ఈ రాష్ట్రాన్ని ఒకటిగా కలిపి ఉంచలేకపోయాం.
 
 నా మీద నమ్మకంతో ఓట్లేయాలని అడుగుతాను..

 పేదల జీవితాలను చూశాను కనుకనే వారి సంక్షేమం కోసం కొన్ని పథకాలకు రూపకల్పన చేసి ప్లీనరీలో ప్రకటించాం. మన ప్లీనరీలో ఇచ్చిన హామీల కోసం నా జీవితాన్ని ధారపోస్తాను. రాజకీయాల్లో ఎవరైనా మా నాయకుడు ఫలానా జగన్‌లా ఉండాలి అనిపించుకునే విధంగా పనిచేస్తాను.
 
 
 నేను ఏ రోజూ సీమాంధ్రకు వెళ్లి తెలంగాణను ద్వేషించే విధంగా మాట్లాడలేదు. తెలంగాణకు వెళ్లి సీమాంధ్ర వారిపై రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నాయకుడు అనేవాడు ఏ ప్రాంతంలోకి వెళ్లయినా.. నన్ను చూసి ఓట్లేయండి.. నామీద నమ్మకం ఉంచండి అని చెప్పగలగాలి. నన్ను, నా విశ్వసనీయతను చూసి ఓట్లేయమని అడుగుతాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ ఉంటుంది. రాజన్న సంక్షేమ రాజ్య స్థాపనే మన ధ్యేయం.’’
 
 
 విడగొట్టాం కనుక  ఓట్లేయమంటున్నారు..

 ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన భావోద్వేగ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికలకు వెళుతున్నాం. ఇక్కడ పార్టీల తీరుచూస్తుంటే.. ‘రేషన్ కార్డులిచ్చాం.. ఇల్లులిచ్చాం.. అభివృద్ధి చేశాం... ఫలానా మంచిపని చేశాం.. ఓట్లు వేయండి’ అని వారు ఓట్లు అడిగే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టి ఆ భావోద్వేగాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘రాష్ట్రాన్ని విడగొట్టిన పెద్దమ్మను నేను.. నాకు ఓట్లేయండి..’ అని ఒకరు, ‘రాష్ట్ర విభజనలో నా పాత్రా ఉంది.. చిన్నమ్మను నేను.. నాకు ఓట్లేయండి’ అని మరొకరు ఓట్లు అడిగే పరిస్థితిని చూస్తున్నాం. రాష్ట్రాన్ని విడగొట్టాం కాబట్టి పొత్తు లేదా విలీనం చేయండని మరొకరు అడిగే పరిస్థితి. ‘నేనిచ్చిన లేఖ వల్లే రాష్ట్రాన్ని విడగొట్టారు కనుక ఒక ప్రాంతంలో విజయోత్సవాలు చేసుకోండి’ అని నిస్సిగ్గుగా చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టేవారు ఇంకొకరు. మళ్లీ చంద్రన్న రాజ్యం తెస్తాన ని ధైర్యంగా చెప్పలేని స్థితిలో చంద్రబాబున్నారు.
 

Popular Posts

Topics :