02 March 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయనున్న జగన్, విజయమ్మ షర్మిల

Written By news on Saturday, March 8, 2014 | 3/08/2014

రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయనున్న జగన్, విజయమ్మ షర్మిల
హైదరాబాద్ : త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేయడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధం అవుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల, ఇతర సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏయే ప్రాంతాల్లో పర్యటిస్తారన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయం కూడా ఖరారవుతుందని, నేతలంతా ప్రచారానికి వెళ్లడం మాత్రం ఖాయమైందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్ సభ... ఇలా ఒకేసారి అన్ని స్థాయులకు సంబంధించిన ఎన్నికలు జరగడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమం. సాధారణంగా ఎంతో కొంత సమయం తర్వాతే ఈ ఎన్నికలన్నీ జరుగుతుంటాయి. అయితే వివిధ కారణాల వల్ల మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో  ఇప్పుడు కోర్టు ఆదేశాలతో వాటిని కూడా దాదాపుగా సార్వత్రిక ఎన్నికలకు కొంచెం అటూ ఇటూగా నిర్వహించాల్సి వస్తోంది.

దీంతో రాజకీయ పార్టీలన్ని తలమునకలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే సీమాంద్ర ప్రాంతంలో పోటీ చేయించడానికి తగిన అభ్యర్థులు కూడా దొరక్క తల పట్టుకుంటోంది. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం సామాన్య ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైంది. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు జనంలోకి వెళ్లేందుకు సాహసించడంలేదు. గ్రామాల్లో అయితే కాంగ్రెస్ పేరెత్తితే చాలు.. జనం కొట్టేలా ఉన్నారని స్వయంగా ఆ పార్టీ కిందిస్థాయి నాయకులే వాపోతున్నారు. అందుకే ఇప్పటికే చాలామంది వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తమ అధినేత లేఖ వల్లే విభజనకు పునాదులు పడ్డాయన్న భయంతో ఉంది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కాలికి బలపం కట్టుకుని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అందరినీ కలిసి మద్దతు పలకాల్సిందిగా కోరి, శాయశక్తులా రాష్ట్ర సమైక్యతకు ప్రయత్నించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావడంతో  ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రం ధైర్యంగా జనంలోకి వెళ్లి ఆ మాట చెప్పగలుగుతున్నారు. వారికి అండగా ప్రచారం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులంతా సిద్ధమవుతున్నారు.

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరార్

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సమర్పించింది. రేపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

జెడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల వివరాలు:
కరీంనగర్, ఆదిలాబాద్, గుంటూరు, మెదక్ బీసీ (మహిళ)
విజయనగరం, నల్గొండ  ఎస్ టి (మహిళ)
ఖమ్మం, వరంగల్ ఎస్ సి (మహిళ)
వైఎస్‌ఆర్ జిల్లా, మహబూబ్‌నగర్ ఎస్ సి
నిజామాబాద్, కర్నూలు, అనంతపురం బిసి
విశాఖ, శ్రీకాకుళం,కృష్ణా, చిత్తూరు - జనరల్ మహిళ
నెల్లూరు, ప్రకాశం, రంగారెడ్డి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి - జనరల్

చిత్తూరు జిల్ల్లాలోని 65 మండలాల్లో మూడు ఎస్టీలకు, 12 ఎస్సీలకు, 18 బీసీలకు, 32 జనరల్ కు కేటాయించారు

కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల

కిరణ్ ఆడలేక మద్దెల ఓడంటున్నారు: కొణతాల
హైదరాబాద్ : కిరణ్ కుమార్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల కన్వీనర్లతో జరిగిన విస్తృత సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఉన్నప్పుడు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని పడగొట్టమంటే మాట్లాడలేదని, ఇప్పుడు తమమీద నిందవేస్తున్నారని మండిపడ్డారు. ''ఆఖరి నిమిషం వరకు ఇదిగో కొడతా, అదిగో కొడతా అన్నారు. పార్లమెంటులో ప్రతాపం చూపించలేదు, అసెంబ్లీలోనూ చూపించలేదు. సుప్రీంకోర్టులో ఆయనొక్కరే కాదు, అందరూ కేసులు వేశారు. అన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది తప్ప అందులో ఆయన గొప్పతనం కూడా ఏమీ లేదు'' అని చెప్పారు.

నాలుగేళ్లుగా పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలందరూ ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అవకాశం వస్తోందని, అందువల్ల పార్టీ శ్రేణులన్నీ పూర్తిస్థాయిలో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చినట్లు కొణతాల తెలిపారు. ఆయనేమన్నారంటే.. ''స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇబ్బందికరమే. రిజర్వేషన్లపరంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి. అయినా కోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నాయి కాబట్టి మేం పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధమయ్యాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో జిల్లా కన్వీనర్లతో సమావేశం ఏర్పాటుచేశాం. అన్ని స్థానాలకూ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఈ అన్ని ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కామన్ సింబల్ గా కేటాయించారు. కాబట్టి ఆగుర్తుతోనే అందరూ పోటీ చేస్తారు. పర్యవేక్షణకు కమిటీలు ఏర్పాటుచేస్తారు. వాటిని రేపు జిల్లాలకు పంపుతాం. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఈ పర్యవేక్షణ ఉంటుంది. రేపు అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటుచేసుకుని, అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నాం. ఎన్నికల ప్రచారానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగన్, విజయమ్మ, షర్మిల పర్యటిస్తారు. ఎవరు ఎక్కడ, ఎప్పుడు తిరుగుతారో చెబుతాం. రాష్ట్రస్థాయిలో పరిశీలకులు ఉంటారు. వాళ్లు కూడా ఎక్కడికక్కడ ఎన్నికల సన్నాహాలను పరిశీలిస్తారు. పార్టీ నిర్మాణం రాష్ట్రంలో బలంగా ఉంది. ఆ విషయం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతోనే తేలిపోతుంది'' అని కొణతాల చెప్పారు.

ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో జగన్ కసరత్తు

మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు తోడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడనున్న నేపథ్యంలో... పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యవసరంగా సమావేశం కానున్నారు. లోటస్ పాండ్ లో శనివారం ఉదయం  పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన భేటీ అవుతారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో గుంటూరు జిల్లాలో పర్యటన ముగించుకుని జగన్ గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.

కాగా జగన్ మోహన్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన వాయిదా పడింది. గుంటూరు జి్లా మాచర్లలో శనివారం రెండోరోజు ఓదార్పు యాత్ర ముగించుకుని ఆదివారం నుంచి ఆయన నల్గొండ జిల్లాలో యాత్ర చేయాల్సి ఉంది. అయితే మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే వెలువడటం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కూడా వెలువడుతున్న నేపథ్యంలో జగన్ పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీ అవుతున్నారు. మళ్లీ ఏ తేదీల్లో జగన్ నల్గొండ జిల్లాలో పర్యటించేది తరువాత ప్రకటిస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.

పార్టీలో చేరిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్(కాంగ్రెస్) శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయన మెడలో కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనభేరి సభలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, గుదిబండి చిన వెంకటరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని, పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డిని ఆశీర్వదించండి. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చక్రం తిప్పాలని కోరుతున్నా’’ అని జగన్ సభలో పిలుపునిచ్చారు.

నల్లగొండ జగన్ పర్యటన వాయిదా

‘ఎన్నికల వ్యూహరచన కోసం ముఖ్యనేతలతో సమావేశం కావాల్సిన అత్యవసర పరిస్థితి వల్ల వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. ఆయన రాక కోసం మా పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం...’  అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. ఆదివారం  హుజూర్‌నగర్ నియోజవర్గం నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటనను మొదలు పెట్టాల్సి ఉంది. దీనికోసం పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, మున్సిపాలిటీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూలు విడుదల అయ్యింది.
 
 సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు కూడా విడుదలైంది. ఇంకోవైపు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడం, రెండు రోజుల్లో షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉండడంతో ఒకేసారి మూడు ఎన్నికలు జరగనున్నాయి. అతి కీలకమైన ఈ ఎన్నికలలో విజయాలతో అగ్రభాగాన నిలిచేందుకు పార్టీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల వ్యూహరచనలో భాగంగానే ముఖ్యనేతలతో సమావేశమయ్యేందుకు వైఎస్ జగన్ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడం వల్లే ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారని పార్టీ శ్రేణులకు వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే త్వరలోనే ఆయన జిల్లా పర్యటనకు వస్తారని పార్టీ నాయకత్వం పేర్కొంటోంది. ఆదివారం నుంచే జగన్ పర్యటన ఉండడంతో శుక్రవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మిర్యాలగూడలో భేటీ ఆయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, సీఈసీ సభ్యులు బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, కోఆర్డినేటర్లు ఎర్నేని వెంకటరత్నం బాబు, మల్లు రవీందర్‌రెడ్డి, అనుంబంధ సంఘాల నాయకులు ఇరుగు సునీల్‌కుమార్, మహ్మద్ సలీం , ఇంజం నర్సిరెడ్డి తదితర నేతలు ఈ భేటీలో ఉన్నారు. తమ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించినట్లు తెలిపారు. అయితే, శుక్రవారం సాయంత్రం అధినేత పర్యటన వాయిదా పడినట్లు సమాచారం అందుకున్నామని పార్టీ నేతలు తెలిపారు.
 
 అన్ని ఎన్నికలూ ఒకేసారి కలిసి రావడంతో ఈ సమయంలో జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన జరిగితే తమకు లాభిస్తుందని ఆశించారు. తాత్కాలికంగా వాయిదా పడినా, తిరిగి త్వరలోనే తేదీ ప్రకటిస్తామని నాయకత్వం ప్రకటించి, తమ కార్యకర్తలకూ, కిందికి స్థాయి వరకూ సమాచారం ఇచ్చారు. అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, జగన్ పర్యటన ఎపుడు పెట్టుకున్నా విజయవంతం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను..

* 4 సంక్షేమ సంతకాలతోపాటు ఐదో పనిగా రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం: వైఎస్ జగన్
తెలుగుజాతి మొత్తం ఒక్కటవుదాం.. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం
ఇటు సమస్య వస్తే అక్కడి తెలుగు బిడ్డలు.. అటు సమస్య వస్తే ఇక్కడి తెలుగు బిడ్డలు అండగా నిలుద్దాం
మనకు అన్యాయం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపేద్దాం
మన రాష్ట్రానికి మంచి చేసేవారిని, డబ్బులిచ్చేవారినే ప్రధానిని చేద్దాం
రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు అబద్ధాల హామీలిస్తున్నారు
అన్నీ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు
మన బడ్జెట్ రూ. లక్షా 25 వేల కోట్లయితే.. ఆయన మాఫీల లెక్క రూ. లక్షా 60 వేల కోట్లు
నేను ఆయనలా అబద్ధపు హామీలు ఇవ్వలేను..

 
సాక్షి, గుంటూరు: ‘‘నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర చరిత్రను మార్చే నాలుగు సంతకాలను చేయడంతోపాటు మనమంతా కలిసి ఐదో పనిగా రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. ఇందుకు తెలుగు జాతి మొత్తం ఒక్కటవుదాం. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్న తెలుగు బిడ్డలు తోడుగా రావాలి. అక్కడ సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు బిడ్డలు వారికి అండగా నిలబడాలి. ఐదో పని కోసం మనమంతా ఒక్కటవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘తెలుగుజాతి ప్రజలంతా ఒక్కటై 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందాం.. అప్పుడు మన రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తారో..మేలు చేస్తారో.. డబ్బులిస్తారో.. వారినే ప్రధాన మంత్రి సీటులో కూర్చోబెడదాం. చంద్రబాబు చెబుతున్న సింగపూర్ కంటే మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. అందరి గుండెలూ ఒక్కటై అన్యాయం చేసిన వారిని బంగాళాఖాతంలో కలిపేద్దాం’’ అని ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటలకు మాచర్ల పట్టణంలోని అంబేద్కర్‌పార్కు సెంటర్‌లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఇవాళ్టికీ బాబు భయానక పాలన గుర్తుంది..
 ‘‘వైఎస్ సువర్ణ యుగానికి ముందు రాష్ట్రంలో భయానక పరిపాలన సాగుతుండేది. అది చంద్రబాబు నాయుడి పాలన. అవ్వా తాతలకు ముష్టేసినట్లు రూ. 70 పెన్షన్ ఇచ్చే రోజులవి. గ్రామాల్లో అప్పటికే పెన్షన్ పొందుతున్న ఒకరు చనిపోతే తప్ప కొత్తవారికి పెన్షన్ ఇవ్వని రోజులవి. గ్రామాల్లో పిల్లల్ని పెద్ద చదువులు చదివించడానికి తల్లిదండ్రులు ఉన్న అర ఎకరా, ఎకరా భూమి అమ్మేయక తప్పని భయానక రోజులు ఇవాళ్టికీ గుర్తున్నాయి. రూ. 2కే కిలో బియ్యం ఇస్తానని చెప్పి.. ముఖ్యమంత్రి అయ్యాక బియ్యాన్ని రూ. 5.25 పైసలు చేశారు ఇదే చంద్రబాబు. అక్కాచెల్లెళ్ళను మోసం చేసేందుకు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం చేస్తున్నారు కదా అని ప్రతి అక్కా చెల్లెమ్మ ఆయనకు ఓటువేసి ముఖ్యమంత్రిని చేశారు. ఎన్నికలు అయిపోయాక, మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం అంతా అతలాకుతలమైపోతుందంటూ ‘ఈనాడు’లో పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాయించారు. అలా రాయించిన మూడో రోజుకే గ్రామ గ్రామాన బెల్టుషాపులు వెలిశాయి. చంద్రబాబు సాగించిన భయానక పరిపాలనలో రైతన్నలు ఎంత దారుణంగా బతికేవారంటే కరువు కాటకాలతో అలమటిస్తూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రైతన్నలను ఆదుకోండి... వడ్డీ మాఫీ చేయండి... కరెంటు ఉచితంగా ఇవ్వండి అని అడిగితే వడ్డీ మాఫీ దేవుడెరుగు.. కరెంటు తీగలు చూపించి అవహేళన చేశారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోండని అడిగితే వారిని ఆదుకుంటే ఇంకా ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారని, తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిన పరిస్థితిని చంద్రబాబులోనే చూశాను.
 
 బిల్లు అన్యాయంగా ఉంటే ఎందుకు ఓటేశావు?
 అధికారం పోయినా చంద్రబాబు మనసులో ఎటువంటి మార్పూ లేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఎవరినైనా అమ్మేయగలడు.. వెన్నుపోటు పొడవగలడు. విభజన బిల్లు అన్యాయంగా ఉందని ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు తన పార్టీ ఎంపీలచేత అదే బిల్లుకు ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా... బిల్లు ఇంత అన్యాయంగా ఉంటే ఎందుకయ్యా ఓటేసి మద్దతు తెలిపావు? సమాధానం రాదు. చంద్రబాబు ఎంత దిగజారిపోయారంటే ఓట్ల కోసం, సీట్ల కోసం మన రాష్ట్ర ప్రజలను అమ్మేయడానికి కూడా వెనకాడలేదు.
 
బాబు ఎన్ని అబద్ధాలైనా  ఆడతారు:  చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆశ్చర్యం కలిగించే మాట ఒకటి చెప్తున్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణ మాఫీ చేస్తానని చెప్తున్నారు. అయ్యా.. చంద్రబాబూ ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తూ మాట్లాడుతున్నావు! ఇవాళ రాష్ట్రంలో రైతన్నలు తీసుకున్న రుణాలు ఎంతో తెలుసా? ఏకంగా రూ. లక్షా 27 వేల కోట్లు. వీటితోపాటు డ్వాక్రా మహిళలకు మరో రూ. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటున్నావు. ఉచితంగా ఫీజులు ఇస్తానంటున్నావు. ఉచితంగా కరెంటు ఇస్తానంటున్నావు..  ఎవ్వరు పోయి అడిగినా ఏం కావాలో చెప్పండి అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్నావు. 2008లో పూర్తిగా రుణాలు కట్టలేక చేతులెత్తేసిన రైతన్నలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం 28 రాష్ట్రాల్లో రూ. 65 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. అందులో మన రాష్ట్రానికి రూ. 12 వేల కోట్లు వచ్చి ఆ మేరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఒక్క కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 65 వేల కోట్లు మాఫీ చేస్తే చంద్రబాబు మన రాష్ట్రంలోనే రూ. లక్షా 27 వేల కోట్లు మాఫీ చేస్తానని అబద్ధాలు చెబుతున్నారు. బడ్జెట్‌లో మనకున్న ఆదాయమే రూ. లక్షా 25 వేల కోట్లు. చంద్రబాబు మాఫీ కార్యక్రమాలు ఎంత అంటే రూ. లక్షా 60 వేల కోట్ల వరకు ఉన్నాయి.
 
 కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పేలా లీడర్ ఉండాలి..
 ఎన్నికలకు పోతున్న ఈ తరుణంలో మీరు కూడా హామీలు చెప్పండంటూ నన్ను చాలా మంది అడిగారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు ఆడే వ్యక్తిని కాను. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు మళ్లీ కనిపించరు. ఆయన పార్టీ కూడా ఉండదు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడే పరిస్థితిలో ఆయన ఉన్నారు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పే విధంగా నాయకుడు ఉండాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ యుగం మళ్లీ రావాలి. ప్రతి గుండె చప్పుడు వైఎస్సార్‌ను కోరుకుంటోంది.’’
 
 అక్కాచెల్లెమ్మల కోసం రెండు సంతకాలు
 ‘‘బహుశా ఏ రాజకీయ నాయకుడూ నాలా పూరిగుడిసెల్లోకి వెళ్లి అక్కాచెల్లెమ్మల కష్టాలు తెలుసుకోలేదు. అక్కాచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారని ఏ ఒక్కరికీ అవగాహన లేదు. అక్కాచెల్లెమ్మల కోసమే నేను మొదటి సంతకం పెడతా. పిల్లలను బడికి పంపించినందుకు ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలోనే నేరుగా డబ్బులు వేస్తాం. రెండో సంతకం అవ్వా, తాతల కోసం పెన్షన్‌ను రూ.700 చేసేందుకు పెడతా. మూడో సంతకం రైతన్నల కోసం రూ.3 వేల కోట్ల స్థిరీకరణ నిధి కోసం చేస్తా. నాలుగో సంతకం మళ్లీ అక్కాచెల్లెమ్మల కోసమే.. డ్వాక్రా రుణాల మాఫీపై చేస్తా.’’
 
 నాలుగు కుటుంబాలకు జగన్ ఓదార్పు
 గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏడాదిన్నర కిందట ఓదార్పు యాత్రను నిలిపేసిన జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్ళీ మాచర్ల నియోజకవర్గం కారంపూడి నుంచి యాత్ర పునఃప్రారంభించారు. వైఎస్ మృతిని తట్టుకోలేక తనువు చాలించిన గాదెవారిపల్లెలో చల్లా రామరాజు, మాచర్ల పట్టణంలో కందుకూరి యేసుదానం, మంజుల అర్జునరావు, వంకాయలపాటి మేరమ్మ కుటుంబాల్ని పరామర్శించారు. కారంపూడి మీదుగా పెదకొదమగుండ్ల, చినకొదమగుండ్ల, గాదెవారిపల్లె, భట్టువారిపల్లె, అడిగొప్పుల, దుర్గి, పోలేపల్లి జంక్షన్, రాయవరం జంక్షన్ మీదుగా జగన్ రోడ్ షో సాగింది. రోడ్ షోలో అడుగడుగునా జగన్‌కు జనం నీరాజనం పలికారు. తమ గ్రామాలకు రావాలంటూ ప్రతి చోటా జగన్‌పై ఆప్యాయత కురిపించారు. అడుగడుగునా అభిమానం పోటెత్తడంతో మాచర్లలో ‘వైఎస్సార్ జనభేరి’ సభ ప్రకటించిన సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా మొదలైంది. శనివారం పార్టీ నేతలతో భేటీ నేపథ్యంలో సభ ముగియగానే జగన్ హైదరాబాద్ బయల్దేరారు.
 
 పార్టీలో చేరిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేశ్
 ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్(కాంగ్రెస్) శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయన మెడలో కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనభేరి సభలో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, గుదిబండి చిన వెంకటరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని, పార్లమెంటు అభ్యర్థి అయోధ్యరామిరెడ్డిని ఆశీర్వదించండి. అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చక్రం తిప్పాలని కోరుతున్నా’’ అని జగన్ సభలో పిలుపునిచ్చారు.

మాచర్ల వైఎస్ఆర్ జనభేరిలో జగన్

Written By news on Friday, March 7, 2014 | 3/07/2014

పేదల గుండె చప్పుడు.. వైఎస్ఆర్: మాచర్ల వైఎస్ఆర్ జనభేరిలో జగన్
మాచర్ల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. సభ ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ రాక కోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. జగన్ రాక సందర్భంగా మాచర్ల రోడ్లు జనసంద్రమయ్యాయి.

జగన్ ప్రసంగం ఆరంభించగానే ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తనను ఓ కుటంబ సభ్యుడిగా ఆదరిస్తూ, ఎనలేని అభిమానం చూపిస్తున్న ప్రజలకు జగన్ ధన్యవాదాలు చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ ఎక్కడున్నారంటే.. జనం తమ గుండెల మీదు చేయిపెట్టుకుని గుండెల్లో ఉన్నారని చెబుతారని జగన్ అన్నారు. ప్రతి గుండె చప్పుడు వైఎస్ఆర్ ను కోరుకుంటుందని చెప్పారు. 'వైఎస్ఆర్ పాలనకు ముందు చంద్రబాబు నాయుడనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అవి భయానక రోజులు. అప్పట్లో గ్రామాలకు వెళ్లేవాడిని. అవ్వా తాతలు నా దగ్గరకు వచ్చి కాస్త పెన్షన్ ఇప్పించు నాయనా అని అడిగేవారు. పేదలకు ముష్టి వేసినట్టు ఫించన్ ఇచ్చేవారు. అధికారులకు చెబితే గ్రామానికి కొంతమందికి ఇస్తున్నామని, కొత్తవారికి ఇవ్వాలంటే లబ్దిదారులు ఎవరైనా చనిపోవాలని చెప్పేవారు. చదువుకునే పిల్లలు వచ్చి తమ కష్టాలు చెప్పుకునేవారు. చంద్రబాబు ఏ రోజునైనా విద్యార్థులు, పేదల కష్టాల గురించి తెలుసుకున్నారా? ప్రజలు అనారోగ్యంతో, పేదరికంతో కష్టాలు పడ్డ ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి' అని జగన్ అన్నారు.
 
'చంద్రబాబు నాయుడు పదవీ కాంక్ష కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. కొంతమంది నన్ను కూడా అలాంటి హామీలు ఇవ్వాలని చెప్పారు. తానెప్పటికీ ప్రజలను మభ్యపెట్టను. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పను. వయసులో ఆయన కంటే నేను 25 ఏళ్ళు చిన్నవాడిని. ఎన్నికల తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం. విశ్వసనీయత పాలన అందించడమే నా లక్ష్యం. అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం నాలుగు సంతకాలు పెట్టబోతున్నా' అని జగన్ అన్నారు. 

వైసీపిలోకి భారీ చేరికలు.. కొత్తపల్లి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు

వైసీపిలోకి భారీ చేరికలు.. కొత్తపల్లి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బరాయుడు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కారంపూడిలో గురువారం వారు సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలన్న తమ అభిమతాన్ని జగన్ కు తెలియజేయగా, ఆయన సుముఖత వ్యక్తం చేశారు.

శుక్రవారం సాయంత్రం మాచర్లలో జరగనున్న వైఎస్ఆర్ జనభేరిలో జగన్ సమక్షంలో సురేష్ పార్టీలో చేరనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇదివరకే రాజీనామా చేశారు. సుబ్బరాయుడు నరసాపురం ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు ఎంపికయ్యారు.

కిరణ్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదు: భూమన

కిరణ్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదు: భూమన
తిరుపతి : కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్త పార్టీకి ఒక్క సీటు కూడా రాదని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్ఠానానికి పూర్తిస్థాయిలో సహకరించింది కిరణ్ కుమార్ రెడ్డేనని, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పుడు కిరణ్ నిందలు వేయడం సిగ్గుచేటని భూమన మండిపడ్డారు. అసలు జగన్ పేరు వింటేనే కిరణ్, చంద్రబాబులకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన అన్నారు

జగన్ శ్రీవారి దర్శనంలో వివాదం లేదు:టీటీడీ ఈవో

తిరుమల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఎలాంటి వివాదం లేదని టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హిందూ సంప్రదాయబద్ధంగానే స్వామివారిని దర్శించుకున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని టీటీడీ ఈవో గోపాల్‌ మండిపడ్డారు.
ఒకవర్గం మీడియాలో వైఎస్ జగన్ శ్రీవారి దర్శనంపై విపరీతంగా ప్రచారం జరగడం, ఆ వివాదం ఏంటో వివరాలు పంపాలని గవర్నర్ నరసింహన్ కూడా టీటీడీ అధికారులను కోరడం లాంటి విషయాలు తెలిసిందే. ఇప్పుడు స్వయంగా టీటీడీ ఈవోనే విషయం బయటపెట్టడంతో వివాదానికి తెర పడినట్లయింది.

నేడు జగన్ పర్యటన ఇలా...

నేడు జగన్ పర్యటన ఇలా...
 సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం గురువారం తెలిపారు. కారంపూడి మండలం పెదకొదమగుండ్ల, చినకొదమగుండ్ల, గాదెవారిపల్లె, నరమాలపాడు, దుర్గి మండలం అడిగొప్పుల మీదుగా పర్యటిస్తారు. సాయంత్రం ఐదుగంటలకు మాచర్ల పట్టణం అంబేద్కర్ పార్కు సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు.

నాడు వైఎస్‌కు, చంద్రబాబు పాలనకు తేడా విశ్వసనీయతే

* నరసరావుపేట జనభేరిలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* నాడు వైఎస్‌కు, చంద్రబాబు పాలనకు తేడా విశ్వసనీయతే
* అన్నీ ఫ్రీ అని చెప్పి ఎన్నికలయ్యాక మాట తప్పడం చంద్రబాబు నైజం
* ఆయనకివే చివరి ఎన్నికలు కాబట్టి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు
* నేను యువతరం ప్రతినిధిని.. మాట కోసం ఎందాకైనా పోతాను..
* వైఎస్ నుంచి నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత
* చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం..   మళ్లీ సువర్ణ యుగాన్ని తీసుకొద్దాం
 

సాక్షి, గుంటూరు: ‘‘దివంగత నేత రాజశేఖరరెడ్డి పాలనకు, అంతకుముందు చంద్రబాబు పాలనకు ఒకే తేడా ఉంది. ఆ తేడా విశ్వసనీయత అన్న పదమే అని గట్టిగా చెబుతున్నా. చంద్రబాబైతే అన్నీ ఫ్రీగా ఇస్తానని ఏ మొహమాటం లేకుండా అబద్ధాలు చేప్పేస్తారు. కారణం ఏమిటంటే ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజలతో నాకేంటని అనుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయన వయసు 65 సంవత్సరాలు.. ఆయనకు ఇదే చివరి ఎన్నిక కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఇదే చంద్రబాబుకునేను ఒకటి చెప్పదలచుకున్నా.
 
 ఆయనకన్నా నేను 25 సంవత్సరాలు చిన్నవాడిని. నేను యువతరానికి ప్రతినిధిని. ఒక మాటంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా పోతానని చెబుతున్నా. విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తానని చెబుతున్నా. నాకూ చంద్రబాబుకు తేడా అది. విశ్వసనీయత అన్నది రాజశేఖరరెడ్డి గారి నుంచి నాకు వారసత్వంగా వచ్చిందని నేను గట్టిగా, గర్వంగా చెబుతున్నా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ‘వైఎస్‌ఆర్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
  వైఎస్ పేదరికానికి వైద్యం చేశారు..
 ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే రాముని రాజ్యమైతే నేను చూడలేదుగానీ రాజశేఖరుని సువర్ణ యుగం మాత్రం మనమంతా చూశాం. పేదరికానికి కులముండదు, మతం ఉండదు, పార్టీలుండవు, రాజకీయాలుండవు. అలాంటి పేదరికానికి వైద్యం చేయాలని ఓ డాక్టర్‌గా ముందుకు వచ్చిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఈ రోజు వైఎస్ బతికి ఉంటే ఎంతో బాగుండని అనే మాట రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది. ఆ పాలనను సువర్ణ యుగం అంటారు. ఆ పాలనను విశ్వసనీయత పాలనంటారు. నిజాయతీతో కూడిన పాలనంటారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఈ రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది.
 
 ఈ రాజకీయ వ్యవస్థ మీదే అసహ్యం పుడుతోంది..
 రాజకీయాలు నేడు చదరంగంలా తయారయ్యాయి. ఒక మనిషిని తప్పించడానికి ఎలా దొంగ కేసులు పెట్టాలి? అని చూస్తున్నారు. ఒక పార్టీ లేకుండా చేయడం కోసం ఆ మనిషిని జైలుకు పంపేందుకు మనస్సాక్షి కూడా అడ్డురావడం లేదు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడానికి వెనుకాడని పరిస్థితికి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. మొన్న విభజన బిల్లు విషయంలో పార్లమెంటు, అసెంబ్లీలో జరిగిన తీరును మనమందరం గమనించాం. పార్లమెంటులో జరిగిన తీరును ఒక్కసారి చూస్తే రాజకీయ వ్యవస్థ మీదనే అసహ్యం పుడుతుంది. కారణం ఏమిటంటే ఆ పార్లమెంటు జరుగుతున్న సమయాన ఇదే చంద్రబాబు నాయుడు బిల్లు చాలా అన్యాయంగా ఉందని మాట్లాడుతారు. లోపలేమో ఆ బిల్లుకు అనుకూలంగా తన ఎంపీల చేత ఓటు వేయిస్తారు.
 
 సువర్ణ యుగాన్ని తిరిగి తీసుకొద్దాం.
 చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరం వైపు చూస్తాడు. కానీ అడ్డగోలు విభజనతో ఇప్పుడు ఆ నగరాన్ని మనకు కాకుండా చేశారు. కొత్త రాజధాని కట్టుకునేందుకు ఎంత డబ్బులు ఇస్తారు? ఎక్కడ కట్టుకోవాలనే విషయం కూడా చెప్పకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. ఇంతటి దారుణంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇద్దరూ కూడా ఓ వైపు బిల్లు అన్యాయంగా ఉందీ అంటూనే దానికి అనుకూలంగా ఓటేశారు. ఇది న్యాయమా? అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన ఈ పార్టీలు మళ్లీ ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసం, సీట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రాజకీయ వ్యవస్థను మనం మార్చేద్దాం. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ యుగాన్ని కలిసికట్టుగా మళ్లీ సాధించుకుందాం.
 
 దేవుడు చూస్తున్నాడు..
 వీళ్ళు చేసిన అన్యాయం... చేస్తున్న అన్యాయం ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారు. కానీ పై నుంచి దేవుడు అనేవాడు మాత్రం కచ్చితంగా చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మనం మన సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం... రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం.. అదే రాజన్న యుగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారం రోజు దివంగత నేత రాజశేఖరరెడ్డి గర్వపడేలా నాలుగు సంతకాలు పెడతాను. ఈ నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయి. మొట్టమొదటి సంతకం నా అక్కాచెల్లెళ్ల కోసం.. వారి జీవితానికి భరోసా కోసం ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. ఇక నుంచి మీ పిల్లలను మీరు పనికి కాకుండా బడికి పంపించండి. మీ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తా.
 
 ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతా. ప్రతి పిల్లాడికి రూ. 500లు చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి నెలానెలా అక్కాచెల్లెమ్మల బ్యాంకు అకౌంట్‌లో మేము వేస్తామని హామీ ఇస్తున్నా. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెడతానని గర్వంగా చెబుతున్నా. రెండు నెలలు ఆగండి.. మీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇవాళ ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ సంతకం పెడతాడు. ఇక మూడవ సంతకం ప్రతి రైతన్న కోసం చేసి.. రూ. 3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని తీసుకొస్తా. మద్దతు ధర, గిట్టుబాటు ధర కోసం రైతన్నకు భరోసా ఇస్తా. నాలుగో సంతకం కూడా మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసం పెడతా. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తూ సంతకం చేస్తానని భరోసా ఇస్తున్నా.’’
 
 జన నీరాజనం
 నరసరావుపేటలో గురువారం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్‌షో, జనభేరి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి రాజన్న బిడ్డపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. బుధవారం రాత్రి ఖమ్మంలో జనభేరి సభను ముగించుకొని ఆయన గుంటూరు చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ బస చేసిన ప్రాంతానికి చేరుకొని జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం 10.30 గంటలకు గుంటూరు నగరం నుంచి ఆయన నరసరావుపేట బయలు దేరారు. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వికలాంగులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. దీంతో కొంత ఆలస్యంగా ఆయన సభా ప్రాంతానికి చేరుకున్నారు. సభకు హాజరైన జనసందోహంతో నరసరావుపేట పట్టణం పోటెత్తింది.  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
 
 ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కపిలవాయి విజయకుమార్, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ ఖాజావలితో పాటు అనేక మంది మాజీ కౌన్సిలర్లు, నేతలు, న్యాయవాదులు పార్టీలో చేరారు. ఈ సభలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ నాయకులు బాలశౌరి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నేతలు మోపిదేవి వెంకట రమణ, నందమూరి లక్ష్మీపార్వతి, ఆర్కే, విజయచందర్, అంబటి రాంబాబు, రావి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
వీళ్ల మోసాలను నమ్మొద్దు..
 ‘‘కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాబోయే ఎన్నికల్లో మోసాలు చేస్తూ ఎన్నెన్నో మాటలు చెబుతారు. నేనైతే ఒకే ఒక మాట చెబుతున్నా. వీళ్ల మోసాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. కొద్దిరోజుల క్రితమే మన కళ్లెదుటే పార్లమెంటు సాక్షిగా ఏం జరిగిందో మనమంతా చూశాం. కాంగ్రెస్ పార్టీ బిల్లు తెస్తే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి మనల్ని హతం చేశారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మనిషిని పొడిచేసి శ్మశానానికి కూడా తానే తీసుకుపోతానని మోసం చేసేలా.. ఇటువైపు వచ్చి సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో నిజాయితీ, విశ్వసనీయత ఒకవైపు ఉంటే... మరో వైపు వంచన, కుమ్మక్కు రాజకీయాలు ఉంటున్నాయి. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోయే ఎన్నికలివి.’’    
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

Jagan speech Narasaraopet

Written By news on Thursday, March 6, 2014 | 3/06/2014

http://www.sakshi.com/video/news/y-s-jaganmohan-reddys-speech-ysr-jana-bheri-in-narasaraopeta-11788?pfrom=inside-related-video

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నరసారావు పేట జనసంద్రమైంది. గురువారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ జనభేరీకి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. వైఎస్ఆర్ చిరునామా ఎక్కడని అడిగితే ప్రజల గుండెల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి బతికేఉన్నారని చూపిస్తున్నారని జగన్ అన్నారు. మనం రామరాజ్యం అయితే చూడలేదు కానీ, రాజశేఖర రెడ్డి పాలనలో సువర్ణయుగం చూశామని గర్వంగా చెప్పవచ్చని వాఖ్యానించారు. పేదవాడి కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్ద చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ 108 ఏర్పాటు చేశారని, వైద్యుడిలా ముందుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయని, ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ప్రస్తుత నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారని జగన్ మండిపడ్డారు. పదవి కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారని జగన్ విమర్శించారు. చంద్రబాబు పాతతరం మనిషి అయితే, తాను యువతరం ప్రతినిధి అని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నది ముఖ్యమని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ గర్వపడేలా నాలుగు సంక్షేమ పథకాలపై సంతకాలు చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయని, రాష్ట్రాన్ని ముక్కులు చేసినవారికి బుద్ధి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

నరసరావుపేట దెబ్బ ఏంటో చూపిద్దాం

'నరసరావుపేట దెబ్బ ఏంటో చూపిద్దాం'వీడియోకి క్లిక్ చేయండి
నరసరావుపేట(గుంటూరు జిల్లా): వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ బాటలో నడుద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్నాడు పౌరుషం ఏంటో చూపిద్దామని పిలుపునిచ్చారు. నరసరావుపేట దెబ్బ ఎలావుంటుందో చూపించాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలరని చెప్పారు. జగన్ నాయకత్వంలో నడిచి వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేయాలని అయోధ్యరామిరెడ్డి కోరారు.

జగన్ రాకతో జనసంద్రమైన నరసారావుపేట

Photo: JAI JAGANవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నరసారావు పేట జనసంద్రమైంది. గురువారం రాత్రి వైఎస్ఆర్ జనభేరీ ఆరంభమైంది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.
Photo: Narasaraopet lo pandaga

వైఎస్ఆర్ చిరునామా ఎక్కడని అడిగితే ప్రజల గుండెల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి బతికేఉన్నారని చూపిస్తున్నారని జగన్ అన్నారు. మనం రామరాజ్యం అయితే చూడలేదు కానీ, రాజశేఖర రెడ్డి పాలనలో సువర్ణయుగం చూశామని గర్వంగా చెప్పవచ్చని వాఖ్యానించారు. పేదవాడి కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్ద చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ 108 ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయని, ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ప్రస్తుత నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారని జగన్ మండిపడ్డారు.

వైఎస్సార్ సీపీలో చేరిన పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి -నరసారావుపేటలో వైఎస్ జగన్ జనభేరి

సీమాంధ్రలో వ్యవసాయం ఏం చేస్తావు బాబూ?

సీమాంధ్రలో వ్యవసాయం ఏం చేస్తావు బాబూ?జూపూడి ప్రభాకర రావు
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  సీమాంధ్రను సింగపూర్‌గా మారుస్తానంటున్నారని, సీమాంధ్రలో ఉన్న వ్యవసాయాన్ని ఏం చేస్తారు? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి  జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సనిచేశాయన్నారు. ఆ 2 పార్టీలు ఎప్పటి నుంచో తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ నేతలను కలుపుకుని పనిచేద్దామని  టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తున్నారని  జూపూడి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కలిసి తిరుగుతున్నారని విమర్శించారు.  టీడీపీలో కాంగ్రెస్ విలీనం అవుతుందన్నారు.  టీడీపీ కాస్త పిల్ల టీడీపీ కాంగ్రెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు.

ఖమ్మంలో వైయస్ఆర్ జనభేరీనేడు రాజమండ్రికు మైసూరా

నేడు మైసూరా రాక
అమలాపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, ఉభయ    గోదావరి జిల్లాల పార్టీ ఎన్నికల పరిశీల కుడు ఎంవీ మైసూరారెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు.  జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహంపై ఆయన పార్టీ నేతలతో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం రాజమండ్రి జాంపేట  లోని ఉమారామలింగేశ్వర కల్యాణ మంటపంలో ఉదయం పది గంటలకు జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి     చిట్టబ్బాయి బుధవారం అమలాపురంలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సీజీసీ సభ్యులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, తాజామాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, అబ్జర్వర్ల్లు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల పార్టీ    కన్వీనర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
 

Popular Posts

Topics :