06 April 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్సార్ సీపీ సీమాంధ్ర జాబితా విడుదల వాయిదా

Written By news on Saturday, April 12, 2014 | 4/12/2014

సీమాంధ్ర కు సంబంధించిన అభ్యర్ధుల జాబితా అంతా ఒకేసారి ప్రకటించే ఆలోచనలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్

నాడు తాతయ్యతో.. నేడు మామయ్యతో.. లక్కీగర్ల్వీడియోకి క్లిక్ చేయండి
కుందన సాయి.. ఈ పేరు చెబితే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల గుండె ఉప్పొంగుతుంది. ఆమె ఎవరో కాదు.. 2004, 2009 ఎన్నికలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెన్నంటే ఉండి, ఆయనకు అదృష్టాన్ని పంచిచ్చిన బంగారు తల్లి. వైఎస్ఆర్ ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా ఆయన వెంట కుందన సాయి తప్పకుండా ఉండేది. చేవెళ్ల, నందికొట్కూరులో ప్రారంభ, ముగింపు సభలలో వైఎస్ వెంట ఆమె కూడా ప్రచార సభల్లో పాల్గొంది. రెండు ఎన్నికలలోను వైఎస్ఆర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆమెను ప్రేమగా 'లక్కీ గర్ల్' అని పిలుచుకునేవారు.

ఇప్పుడు ఐదేళ్లు గడిచాయి... ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుండటంతో ఆయన వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ చిన్నారి తల్లి సిద్ధమైంది. శనివారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కుందనసాయి.. చాలా ఉద్వేగంగా ఆయనతో మాట్లాడింది. వైఎస్ఆర్ ఇప్పుడు లేరు కాబట్టి, తాను జగన్ వెంట ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటానని, అందుకు అవకాశం ఇప్పించాలని కోరింది. ''నేను తాతయ్య వెంట 2004, 2009 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నాను. తాతయ్య నన్ను 'లక్కీ గర్ల్' అనేవారు. ఇప్పుడు జగన్ మామయ్య కోసం ప్రచారం చేస్తాను. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను'' అని కుందనసాయి తెలిపింది.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు.. ఆయన ఫొటోతోనే ఓట్లా?

ఎన్టీఆర్ కు వెన్నుపోటు.. ఆయన ఫొటోతోనే ఓట్లా?
చుండూరు : ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయన పథకాలను నీరుగార్చి, ఇప్పుడు ఆయన ఫొటోలతోనే చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నారని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ఆర్ జనభేరిలో భాగంగా ఆమె గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబుది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకమని, 54 ప్రభుత్వ రంగ సంస్థలను టీడీపీ  నేతలకు కట్టబెట్టి 7 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఉద్యోగాలిస్తే ప్రభుత్వానికి నష్టమన్న బాబు ఇవాళ మూడున్నర కోట్లు ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ చలవతోనే కేంద్రం దేశమంతటా రూ.65 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ బతికుంటే తెలంగాణ అడిగేవారికి, ఇచ్చేవారికి దమ్ము, దైర్యం ఉండేదా అని వైఎస్ విజయమ్మ నిలదీశారు. 30 మంది ఎంపీలను గెలిపించుకుని కేంద్రాన్ని శాసించి నిధులు తెచ్చుకుందామని ప్రజలకు తెలిపారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తమ కుటుంబంతో పాటు తెలుగు ప్రజలు కూడా చాలా అవమానాలకు గురయ్యారని విజయమ్మ అన్నారు. తమ కష్టాలను ఎవరూ పూడ్చలేరు గానీ, ప్రజల కష్టాలు తీర్చేందుకు మాత్రం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఉన్నారని ఆమె చెప్పారు. ప్రజల్లో ఒకడిగా, అందరికీ అండగా జగన్‌ ఉంటారని, వైఎస్ఆర్ నాటి స్వర్ణయుగం మళ్లీ జగన్ పాలనతోనే సాధ్యమని తెలిపారు. గడపగడపకూ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను జగన్‌ అందిస్తారని వైఎస్‌ విజయమ్మ హామీ ఇచ్చారు.

వైఎస్ కు పంచడం.. బాబుకు దోచుకోవడమే తెలుసు

వైఎస్ కు పంచడం.. బాబుకు దోచుకోవడమే తెలుసు
గుంటూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పంచడం తెలిస్తే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం తెలిసింది దోచుకోవడమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. గుంటూరు జిల్లా వలివేరులో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ జనభేరిలో ప్రసంగించారు.

చంద్రబాబు ఎక్కడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు గానీ, రామోజీ రావు, సీఎం రమేష్, మురళీ మోహన్ లాంటి వాళ్లకు వేలాది ఎకరాల భూములను మాత్రం దోచిపెట్టారని ఆమె విమర్శించారు.

వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

సీమాంధ్రలో పలు నియోజకవర్గాలలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు.  సీమాంధ్రలోని  25 లోక్ సభ, 175 శాసనసభ  స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు.  

వైఎస్ఆర్ జిల్లా రాజంపేట శాసనసభ  స్థానానికి వైఎఎస్ఆర్ సిపి అభ్యర్థిగా అమర్నాథరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి తరఫున ఆయన తనయుడు అభినయరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే జిల్లా  పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీకి వైఎస్ఆర్ సీపీ తరఫున కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

నెల్లూరు సిటీ అసెంబ్లీ వైఎస్ఆస్ సిపి అభ్యర్థిగా డాక్టర్ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి  ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, కాకాని, మేరగ మురళీధర్‌ తదితరులు హాజరయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి దొరబాబు నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా  తాడేపల్లిగూడెం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా తోట గోపి నామినేషన్ వేశారు. ఉండి అసెంబ్లీ స్థానానికి పాతపాటి సర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.

వైఎస్ఆర్ సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్

వైఎస్ఆర్ సీపీలోకి మాజీమంత్రి పార్థసారధి, వేదవ్యాస్
హైదరాబాద్ : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీమంత్రి పార్థసారధి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ శనివారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే డీజీపీ దినేష్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

సాయంత్రం 5గం.వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల

సాయంత్రం 5గం.వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో విడుదల
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం సాయంత్రం పార్టీ ఎన్నికల మేనిఫెస్ట్ ను విడుదల చేయనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం అయిదు గంటలకు లోటస్ పాండ్ లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు విడివిడిగా మేనిఫెస్టోను విడుదలు చేయనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీతో బాబుకు డీల్ కుదరబట్టే..

పిచ్చి ప్రేలాపనలు ఆపండి!
టీడీపీపై ధ్వజమెత్తిన వాసిరెడ్డి పద్మ
 
‘టైటానియం’పై డొంక తిరుగుడు  కథనాలెందుకు?
‘సాక్షి’ విసిరిన సవాలును స్వీకరించండి
దమ్ముంటే విజయమ్మ పిటిషన్‌పై విచారణకు రండి
చంద్రబాబుపై సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదు

 
 హైదరాబాద్: టైటానియం ఖనిజం కేసులో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఈ కేసుకు సంబంధించి తోక పత్రికల్లో డొంక తిరుగుడు కథనాలు రావడం, వెంటనే టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఈ కేసుతో తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సాక్షి పత్రిక బహిరంగ సవాలు విసిరింది. ఈనాడుకు తమ పత్రికను ధారాదత్తం చేస్తామని, నిరూపించకపోతే ఈనాడును వదిలేస్తారా? అని సవాల్ విసిరినా మౌనంగా ఉండిపోయారు.

సవాల్‌కు స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరించారు. నిస్సిగ్గుగా మళ్లీ అనేక కథనాలు రాస్తున్నారు. ఆ కథనాలు పట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌కు కళ్లులేవా అని చెబుతున్న టీడీపీ నేత సోమిరెడ్డికి కళ్లు మూసుకుపోయాయని ధ్వజమెత్తారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నోరకాలుగా కుట్రపన్నుతున్నారు. 16 నెలలు జైల్లో పెట్టించినా.. మేం ఓపికతో ఉన్నాం.. చట్టాన్ని గౌరవించాం. కాబట్టే గత ఉప ఎన్నికల్లో ప్రజలు మావైపే నిలిచారు. ఇప్పుడు మీరు, మీ తోక పత్రికలు పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ఊరుకునేది లేదు. ప్రజలు అంతా గమనిస్తున్నారు’’ అని పద్మ హెచ్చరించారు.

 కాంగ్రెస్ పార్టీతో బాబుకు డీల్ కుదరబట్టే..

చంద్రబాబునాయుడిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సీబీఐ ఎందుకు దర్యాప్తు జరపడంలేదని పద్మ ప్రశ్నించారు. ఐఎంజీ భూముల వ్యవహారంతోపాటు పలు అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పిటిషన్ వేస్తే ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతో డీల్ కుదుర్చుకోబట్టే విచారణ విషయం పక్కకుపోయిందన్నారు. దమ్ముంటే విజయమ్మ వేసిన పిటిషన్‌పై నిలబడాలని, సీబీఐ విచారణను ఆహ్వానించాలని సవాలు విసిరారు. కోర్టుల్ని అడ్డం పెట్టుకుని కారుకూతలు కూస్తున్నారన్నారు.

చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన, పదేళ్ల ప్రధాన ప్రతిపక్ష నేతగా పోషించిన సమయంలో ఆయన ఎక్కడెక్కడకు వెళ్లారో విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాస్‌పోర్ట్‌లు పరిశీలిస్తే బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు తన అవినీతి చరిత్ర బయటపడకుండా కాపాడుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ కాళ్లు పట్టుకుంటున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనలేమని తెలిసే ఇలాంటి చౌకబారు విద్యలు ప్రదర్శిస్తున్నారన్నారని ఆమె విమర్శించారు.

వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి

వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర చిన్ననీటి పారుదల సంస్థ చైర్మన్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఘంటా మురళీరామకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలసి హైదరాబాద్ వెళ్లిన ఆయన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ ఆయనను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు.మురళితోపాటు చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తూతా లక్ష్మణరావు, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు, రావికంపాడు సర్పంచ్ ఏసుబాబు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వైసీపీలో చేరారు.

 జగన్ సమర్థతను చూసే పార్టీలో చేరా
కామవరపుకోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థతను చూసే తాను పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ఇక్కడి విలేకరులతో ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కాంగ్రెస్ పాలకుల తీరు వల్ల నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాల న్నా.. రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. ప్రజ లకు మేలుచేసే మరిన్ని కొత్త పథకాలు రావాలన్నా జగన్‌మోహన్‌రె   డ్డి నాయకత్వంలోనే సాధ్యమన్నారు.

మురళితో కలసి వైసీపీలో చేరిన వారిలో, గొర్రె లు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు కొలుసు రాంబాబు, తడికలపూడి సొసైటీ మాజీ డెరైక్టర్ పసుమర్తి శ్రీమన్నారాయణ, తడికలపూడికి చెందిన గుణకల దుర్గారావు, ముళ్లపూడి నాగరాజు, ఏకాంత సత్యనారాయణ, ప్రొద్దుటూరి ఆనందరావు, నల్లూరి శివరామకృష్ణ, సాగిపాడుకు చెందిన తమ్మినేని శ్రీనివాసరావు, రావికంపాడుకు చెంది న కనుమూరి అంజిరెడ్డి, ఏఎంసీ డెరైక్టర్ కె.ప్రసాదరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ మీరాసాహెబ్, గుంటుపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బేతిన వెంకట్రావు తదితరులు ఉన్నా రు. వారివెంట కామవరపుకోట మం డల వైసీపీ కన్వీనర్ మిడతా రమేష్ ఉన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి ఇద్దరు ఎమ్మెల్సీలు


*  పార్టీలో చేరిన విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య
 * మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జయచంద్రనాయుడు కూడా

 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఓ మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేతో పాటు విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
 విజయనగరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, లావు రత్తయ్య, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కె.జయచంద్రనాయుడు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణలు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో వేర్వేరు సందర్భాల్లో కలిసి పార్టీలో చేరారు. వారికి జగన్ పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 
 జగన్ సారథ్యంలోనే సీమాంధ్ర అభివృద్ధి : కోలగట్ల
 జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు.

రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇది తేటతెల్లమైందని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడు ‘మీరు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరితే బాగుంటుంది’ అని సూచించారని, తమ కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడమో లేదా తన కుటుంబీకుల్లో ఒకరిని రంగంలోకి దించడమో చేస్తానన్నారు. తన సోదరుడు తమ్మన్న శెట్టి కూడా పోటీ చేసే అవకాశం ఉందని, అయితే అది జగన్ నిర్ణయాన్నిబట్టే ఉంటుందని చెప్పారు.
 
 ఉద్యోగులకు మంచి పీఆర్‌సీ ఇస్తానన్నారు : గాదె
 ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మంచి పీఆర్సీ ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆయన తండ్రి వైఎస్ మాదిరిగానే స్నేహపూర్వకంగా వ్యవహరిస్తానని జగన్ తనతో చెప్పారన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తానన్నారని తెలిపారు.
 
 
 ఉపాధ్యాయులు, ఉద్యోగుల డిమాండ్లపై ఓ వినతిపత్రాన్ని జగన్‌కు సమర్పించానని, ‘అన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తాను శీనన్నా..’ అని ఆప్యాయంగా హామీ ఇచ్చారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, తమకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆయన నెరవేర్చారని గాదె తెలిపారు. జగన్ కూడా అదే విధంగా చేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
 
 బాబు ఒంట్లో 50 శాతం కాంగ్రెస్ రక్తమే : రత్తయ్య
 తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒంట్లో ప్రవహిస్తున్న రక్తంలో 50 శాతం కాంగ్రెస్‌దని, మరో 30 శాతం బీజేపీదైతే మిగతా 20 శాతమే టీడీపీదని విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య విమర్శించారు. టీడీపీ ప్రస్తుతం సహజత్వాన్ని కోల్పోయిందని చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం ఆయన సీజీసీ సభ్యురాలు లక్ష్మీపార్వతితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న చివరి దశలో తానేమీ టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, పార్టీకి అన్ని విధాలా మద్దతు తెలిపేందుకే వచ్చానని చెప్పారు.
 

 సీమాంధ్రకు దృఢమైన నాయకత్వం కావాలని, అది ఒక్క జగన్‌కే సాధ్యమని చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామికాభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలు, వసతి, దుస్తులు, పుస్తకాలు, ఆరోగ్య పరిరక్షణ వంటి సంక్షేమ పథకాలు జగన్ ఒక్కరి వల్లే సాధ్యమవుతాయన్నారు. ప్రజల ఆకాంక్షను జగన్ నెరవేరుస్తారని తెలిపారు. తానూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. టీడీపీలో టికెట్ రాకపోవడం వల్లే వైఎస్సార్ సీపీలో చేరారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నన్ను టీడీపీ వాళ్లు నాలుగుసార్లు పిలిచారు. నేను ఒక్కసారే వెళ్లాను. ఎన్టీఆర్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ఇప్పుడు కూడా టికెట్ కోసం నేను వైఎస్సార్‌సీపీలోకి రాలేదు’’ అని చెప్పారు.
 
 మాటకు కట్టుబడే వ్యక్తి జగన్:ఘంటా మురళీరామకృష్ణ
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఘంటా మురళీ రామకృష్ణ కొనియాడారు. వైఎస్‌లాగే జగన్ అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగిస్తారన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్‌తో వచ్చి లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో తాను పార్టీలో చేరినట్టు తెలిపారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
 
 బాబు పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లింది: లక్ష్మీపార్వతి
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంతో దిగజారిపోయిందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అప్పటివరకూ రూ.3 వేల కోట్ల అప్పుంటే, చంద్రబాబు దానిని రూ.36 వేల కోట్లకు తీసుకువెళ్లారన్నారు. కళాశాలల్లో పేదలు చదువుకోనీయకుండా చేశారని, మద్యపాన నిషేధం ఎత్తేశారని దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని జగన్ నివాసం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు.  బాబు హయాంలో ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయని, విద్యుత్ సమస్యలూ ఎక్కువయ్యాయన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని, వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. రాష్ట్రానికి ప్రస్తుతం కొత్త నాయకత్వం కావాలని, అది జగన్‌కే సాధ్యమన్నారు.

నేటి నుంచి విజయమ్మ పర్యటన

నేటి నుంచి విజయమ్మ పర్యటన
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని పునఃప్రారంభిస్తున్నారు. ఆమె 12వ తేదీన తెనాలి శాసనసభా నియోజకవర్గంలోని కొలకలూరు, గుడివాడ, కోపల్లి, అంగలకుదురు, వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెం, ఎడ్లపల్లి, ఒలివేరు, చుండూరు, మోదుకూరు, మోపర్రు, తురిమెళ్ల, అమృతలూరు, గోవాడ, ఎలవర్రు, ఇంటూరు, బాపట్ల నియోజకవర్గంలోని చందోలి గ్రామాల్లో పర్యటిస్తారని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
జగన్ పర్యటన మరో రోజు వాయిదా
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన మరో రోజు వాయిదా పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన ఈనెల 13నుంచి తన ప్రచారాన్ని కర్నూలు నుంచి పునఃప్రారంభిస్తారు.
 
13 నుంచి తెలంగాణలో షర్మిల ప్రచారం
జగన్ సోదరి షర్మిల ఈ నెల 13వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలో పర్యటించి పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. 

సాక్షి సవాల్ కు ఈనాడు ఎందుకు స్పందించలేదు?

Written By news on Friday, April 11, 2014 | 4/11/2014

సాక్షి సవాల్ కు ఈనాడు ఎందుకు స్పందించలేదు?
హైదరాబాద్: టైటానియం డీల్ కు సంబంధించి ఈనాడు ప్రచురించిన కథనంపై సాక్షి విసిరిన సవాల్ కు రామోజీ రావు ఎందుకు స్పందించలేదని వైఎస్సార్ సీపీ నేత వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పని ఈనాడు.. ఇప్పుడు డొంక తిరుగుడు కథనాలు రాస్తుందని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిదని ఆమె సూచించారు. టీడీపీ నేతలు చేసే ఆరోపణలు రాజ్యాంగ సంస్థలను బ్లాక్ మెయిల్ చేసేలా ఉంటున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు.
 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి దమ్ము -దైర్యం ఉంటే  వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ పై విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. చంద్రబాబుపై ఆరోపణలు వచ్చినా సీబీఐ విచారణ ఎందుకు జరగడం లేదని వాసిరెడ్డి ప్రశ్నించారు.

వైఎస్ఆర్ సీపీలోకి ఊపందుకున్న వలసలు

వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తన అనుచరులతో కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సీమాంధ్రలో అభివృద్ధి జరుగుతుందన్నారు.

 కాగా గంటా మురళికి మంచి పట్టు ఉండటంతో ఆయన చేరికతో చింతలపూడి నియోజకవర్గంలోని కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌ సీపీ మరింత బలపడనుంది. కాగా విజ్ఞాన్‌ సంస్థలు అధినేత లావు రత్తయ్య కూడా ఇవాళ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో  వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు.

సీపీఎం-వైఎస్ఆర్ సీపీ మధ్య కుదిరిన అవగాహన

ఖమ్మం-మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానికంగా అవగాహన కుదిరింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 2 స్థానాల్లో సీపీఎం, 5 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయనుంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు స్థానాల్లో సీపీఎం, నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ పోటీ చేస్తున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు.

బోగస్.. లైక్ బాబు!

బోగస్.. లైక్ బాబు!
* ఎల్లో ఫేస్.. బుక్ అయింది
*  మూడేళ్లలో టీడీపీ పేజీకి 3.65 లక్షల లైక్‌లు
*  24 గంటల్లో ఏకంగా 75,000 పెంపు
*  టర్కీ నుంచి ఐదు వేలట
*  బాబు మరో హైటెక్ లీల
*  నివ్వెరపోతున్న నెటిజన్లు


 మీడియా అయినా...సోషల్ మీడియా అయినా సరే...మేనేజ్ చేయడంలో బాబు ఘనుడే. తాజాగా ‘నెట్టింటి’లోనూ ఆయన ‘పచ్చ’ని చూపు పడింది...సోషల్ మీడియాను కాస్తా ‘ఎల్లో’ మీడియాగా భావించి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడబోయి బొక్కబోర్లా పడ్డారు. ఆయన తాజా పాలి‘ట్రిక్స్’ కథాకమామీషు ఏంటంటే...

 
 తెలుగుదేశం పార్టీ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజీకి మూడు సంవత్సరాల నేపథ్యం ఉంది. అలాంటి ఆ పేజ్‌కు మొన్నటి ఏప్రిల్ మూడో తేదీ నాటికి ఉన్న అభిమానుల సంఖ్య మూడు లక్షలా 65 వేల మంది. అయితే ఏప్రిల్ నాలుగో తేదీ నాటికి ఆ పేజ్‌కు ఉన్న అభిమానుల సంఖ్య నాలుగు లక్షలా 40 వేల మంది! రాత్రికి రాత్రి ఆ పేజ్‌కు 75 వేల మంది అభిమానులు పెరిగారు! ఉన్నపళంగా ఇన్ని ‘లైక్’లు ఏమిటి చెప్మా...! అని ఆశ్చర్యపోవడం నిపుణుల వంతైంది. ఈ హైటెక్ లీలను ఓ ఆంగ్ల పత్రిక వెలుగులోకి తేవడంతో నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి పేజ్‌కు హఠాత్తుగా ఇన్ని లైక్‌లు పెరగడం ‘ప్లాన్’ ప్రకారం జరిగిందే నని అంటున్నారు.
 
 ఈ పేజ్‌కు ఏ దేశాల నుంచి ఎక్కువమంది అభిమానులున్నారు, ఏ ప్రాంతం నుంచి ఎక్కువ లైకులు వచ్చాయి.. అనే విషయం గురించి పరిశీలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే...తెలుగుదేశం పార్టీకి టర్కీ నుంచి దాదాపు ఐదువేల  లైకులున్నాయి. అయితే 2012 అధికారిక గణాంకాల ప్రకారం టర్కీలోని ప్రవాస భారతీయుల సంఖ్య కేవలం 500 మంది. అందులోనూ తెలుగువారి సంఖ్య ఇంకా తక్కువ. అలాంటి చోట అన్ని లైక్స్ ఉండటం నమ్మశక్యంగా లేదని విశ్లేషకులు అంటున్నారు.
 
  నకిలీ లైక్స్ గురించిన బండారం బైట పడటంతో టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో  వివరణ ఇస్తూ ఓ పోస్ట్‌ను పెట్టారు. టీడీపీ అధికారిక పేజీకి చంద్రబాబు అధికారిక పేజీలోని 1.4 లక్షల లైక్స్ ఒక్కసారిగా వచ్చి చేరాయని, అందువల్లే లైక్స్‌లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించిందని అందులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ వాదన. ఎందుకంటే టీడీపీ అధికారిక పేజీలో లైక్స్‌కు మరో పేజీలోని లైక్స్‌ను చేర్చాలంటే ఆ పేజీ పేరు కూడా టీడీపీ అనే ఉండాలి. మన అభ్యర్థన మేరకు ఒకే పేరుతో ఉన్న పేజీలనే ఫేస్‌బుక్ మెర్‌‌జ చేస్తుంది. చంద్రబాబు పేరుతో ఉన్న పేజీని టీడీపీ పేజీలో మెర్‌‌జ చేశారని వాదించడంలోనే వారి బండారం బైటపడుతోందని సోషల్ మీడియా అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
 
హైటెక్ లీలలు అన్నీ ఇన్నీ కావు...!
 కొన్ని టీవీ చానల్స్‌లో పెట్టే పోల్స్‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూ లంగా ఫలితాలు వచ్చేందుకు నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఒక టీమ్ పనిచేస్తోందని తెలుగుదేశం నేతలే చెబుతారు. ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ వ్యవహారాన్ని చూస్తుంటే సోషల్ మీడియాను మ్యానేజ్ చేయడానికి కూడా ఇదే టీం పనిచేసి ఉంటుందని వారి వాదన.

వైఎస్ఆర్ సీపీలో చేరిన విజ్ఞాన్ రత్తయ్య

విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్య శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లోటస్ పాండ్ లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రత్తయ్య మాట్లాడుతూ సీమాంధ్ర అభివృద్ధికి బలమైన నాయకత్వం కావాలని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. తాను టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, వైఎస్ఆర్ సీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీలో సహజత్వం కోల్పోయిందని.... కాంగ్రెస్ వలసలతో ఆపార్టీ నిండిపోయిందని రత్తయ్య వ్యాఖ్యానించారు

గ్రేటర్‌లో రేపటి నుంచి షర్మిల జనభేరి

గ్రేటర్‌లో రేపటి నుంచి షర్మిల జనభేరి
  •      12, 13, 14 తేదీల్లో విస్తృత ప్రచారం
  •      పన్నెండు నియోజకవర్గాల్లో భారీ సభలు
 సాక్షి, సిటీబ్యూరో:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల మూడు రోజుల నగర పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12, 13, 14 తేదీల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ‘జనభేరి’ పేరిట షర్మిల విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు శివకుమార్ గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, వైఎస్ కుటుంబసభ్యుల రాక కోసం ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
 
ఇదీ షెడ్యూల్..
12వ తేదీ (శనివారం): ఉదయం 11కి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి జనభేరి ప్రారంభం. ఖైరతాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో
     
రోడ్డు షోలు, బహిరంగసభలు.
13వ తేదీ (ఆదివారం): ఉదయం కుత్బుల్లాపూర్ నుంచి ప్రచార యాత్ర ప్రారంభమై మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి నియోజకవర్గాల మీదుగా సాగుతుంది.
     
14వ తేదీ (సోమవారం):
మల్కాజిగిరి నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్, ఉప్పల్, అంబర్‌పేట మీదుగా ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి చేరుతుంది.

14న అనంతపురం జిల్లాలో జగన్ జనభేరి

14న జననేత జగన్ జనభేరి
 సాక్షి ప్రతినిధి, అనంతపురం :  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నారు. అనంతపురం లోక్‌సభ పరిధిలోని గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 14న జనభేరి నిర్వహిస్తారు. 15న హిందూపురం లోక్‌సభ పరిధిలోని మడకశిర, పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారు కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. 2012లో అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారు. దాదాపు రెండేళ్ల తర్వాత జననేత జిల్లాకు రానుండటం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుంది

వైఎస్ఆర్ సీపీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

హైదరాబాద్ : సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మురళీ కృష్ణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మురళీ కృష్ణ ఆ పార్టీలో చేరనున్నారు.
 
2009 ఎన్నికల్లో మురళీ కృష్ణ కోడుమూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.

వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు

Written By news on Thursday, April 10, 2014 | 4/10/2014

వైఎస్ జగన్ ను సీఎం చేయడమే ధ్యేయం: సీకే బాబు
చిత్తూరు: మహాప్రస్థానం ముగింపు రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉంది అని చిత్తూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. చిత్తూరులో సాక్షి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే మా ధ్యేయం సీకే బాబు అని అన్నారు.
 
వైఎస్ జగన్ నిరంతం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని  సీకే బాబు తెలిపారు. 
 
సీకే బాబుగా సుపరిచితులైన సీకే జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆతర్వాత 1994, 1999, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 

500 రూపాయల నోటు మీద సైకిల్ గుర్తు రబ్బరు స్టాంపు వేసి మరీ...

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటినుంచే డబ్బు రాజకీయాలకు తెరదీశారు. పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు సంబంధించిన కొంతమంది మనుషులు డబ్బు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సంగం డెయిరీకి చెందిన నలుగురు ఉద్యోగులు డబ్బు పంపిణీ చేయిస్తుండగా గ్రామస్థులే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్వయంగా సంగం డెయిరీ ఛైర్మన్ అయిన ఎమ్మెల్యే నరేంద్ర పంపిన డబ్బును వీళ్లు పంచుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు.

ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో 'ఆంధ్రజ్యోతి' విలేకరి సాయంతో డబ్బులు పంచుతుండగా పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం నాటి సంఘటనలో డబ్బు పంచతున్నవాళ్లు ఓ ఘనకార్యం కూడా చేశారు. 500 రూపాయల నోటు మీద సైకిల్ గుర్తు రబ్బరు స్టాంపు వేసి మరీ పంపిణీ చేశారు. కేసు నమోదు చేయకుండా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామునే వీరిని అదుపులోకి తీసుకున్నా, ఇంతవరకు అరెస్టు చూపించలేదు. మీడియాను కూడా పోలీసు స్టేషన్ లోపలికి రానివ్వలేదు.

TDP ‘inflates’ Facebook base, buys Likes in Turkey


http://www.deccanchronicle.com/140410/nation-politics/article/tdp-%E2%80%98inflates%E2%80%99-facebook-base-buys-likes-turkey
Facebook File photo      -(Photo AFP)
Facebook File photo -(Photo AFP)
HYDERABAD: Has the Telugu Desam faked its fans on Facebook? Social media experts believe that astronomical growth of FB “Likes” for TD’s official page on April 4 and “Likes” from suspicious countries like Turkey strongly indicate that the party has resorted to a scam in order to inflate its fan numbers.
The “Likes” for the TD official page jumped by 75,000 within a few hours from April 3 to April 4 from countries that hardly have any Indian population, leave alone from AP. After India and  the US, most “likes” are from Turkey which has no Telugu base.
The country is a known place for buying FB “likes” and the same thing allegedly took place in former Rajasthan Chief Minister Ashok Gehlot’s case in 2013.
The TD has so far 4.4 lakh “Likes” on its FB page. Among the political parties in the country like the YSRC, AAP and the Congress, the TD has one of the highest percentage of fans from underdeveloped countries categori-sed as “Others and not yet targeted countries”.
Socialbakers, an international organisation that releases social statistics, revealed that the TD page has reported the highest number of hits, more than 75,000, from April 3 to April 4. It also stated that the TD has the highest number of fans from Turkey, 4,496 after India and the US.
75K likes in hours amaze IT experts
The Telugu Desam is the only party with at least one per cent of fan distribution from Turkey where as for the other parties it’s very negligible. The top four countries common for the BJP, YSRC and the Aam Aadmi Party are the United Arab Emirates, United States, Saudi Arabia and Kuwait, apart from India, where there are large numbers of Indians.
Forum for Good Governance secretary M. Padmanabha Reddy said, “Standard political parties should not resort to these kind of cheap tricks. They should work for real liking of the people. Depending on social media will not yield results for the parties. The impact is less and focused on urban youth.”
Experts say the sudden surge in the FB “Likes” indicate that the TD has resorted to buying “Likes”.
A social media expert Y. Praveen Kumar said, “At best, regional parties as well as national parties can get 3,000 to 5,000 ‘Likes’ a day. How did the TD manage to get more than 75,000 within a few hours is a big question. It is also a well-established fact that acquiring fans from Turkey is cheaper.
This is not the first time a politician has used Turkey to ‘buy’ fans. Earlier, Mr Gehlot had employed the same tactic and the national media had accusing him of buying ‘likes’. This is something fishy.”
Mr Gehlot’s Facebook page is believed to have had 2,14,639 “Likes” till June 30 in 2013, shooting up from 1,69,077 in May. After the steep jump in “Likes”, it transpired that Mr Gehlot was more popular in Istanbul than Jaipur.
For the YSRC, the total number of FB “Likes” are 3.94 lakh with a 95 per cent Indian base, whereas the TD has only 92 per cent Indian base. Turkey was actually in second position for the TD fans till two days ago. However, in the past few days, around 2,000 “Likes” were added from the United States.

http://www.deccanchronicle.com/140410/nation-politics/article/tdp-%E2%80%98inflates%E2%80%99-facebook-base-buys-likes-turkey

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సినీనటి పూర్ణిమ
విశాఖ : ప్రముఖ సినీనటి, ముద్దమందారం కథానాయిక పూర్ణిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో నిన్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే తనకు చాలా అభిమానమన్నారు. రాష్ట్రాభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని తెలిపారు. పార్టీ విజయానికి తనవంతు కృషి చేస్తానని పూర్ణిమ వెల్లడించారు.

ఇంటర్వ్యూ: దినేశ్‌రెడ్డి

ఓర్వలేకే ఆరోపణలు: వి.దినేశ్‌రెడ్డి
ఇంటర్వ్యూ: దినేశ్‌రెడ్డి
* వీస్తోంది జగన్ ప్రభంజనమే
రాజన్న ఆశయాలే జగన్ శ్వాస
అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా
తెలంగాణతో విడదీయలేని బంధం
అధికారిగానూ సహకరించా
టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తా

 
వనం దుర్గాప్రసాద్: హోరెత్తుతున్న జగన్నినాదం కొన్ని రాజకీయ పార్టీలకు గుండెదడ పుట్టిస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి 420 ఆలోచనలు చేస్తున్నారని మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా బ్యానర్లు కడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల రాష్ట్ర గతినే మార్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల వారసుడిగా ఎదిగిన జగన్‌కే జనం పట్టం కడతారని దినేశ్ స్పష్టం చేశారు. రాజకీయ పబ్బం కోసం అవినీతి మచ్చ వేస్తున్న పార్టీలు, నేతలు... జనమంతా జగన్ వైపే ఎందుకున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. తెలంగాణతో విడదీయలేని బంధమే ఈ ప్రాంతంలో తనను ప్రజాసేవకు పురిగొల్పిందంటున్న దినేశ్‌రెడ్డి ‘జనాయుధం’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 పోలీసు విభాగంలో 36 ఏళ్లు నిస్వార్థ సేవ చేసిన నేను అనేక ఉన్నత పదవులు నిర్వహించా. ప్రజలకు మేలు చేసే సంస్కరణలు తీసుకొచ్చా. పదవీ విరమణ తర్వాత కూడా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసిన నాకు వైఎస్ రాజశేఖరరెడ్డితో పనిచేసే అవకాశం రావడం ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఉన్నతాధికారిగా ఆయన వద్దకు వెళ్లిన ప్రతిసారీ ఆయన ప్రజల గురించే మాట్లాడేవారు. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అంతే. నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారు. వారికే అంకితమవ్వాలనే ఆకాంక్ష  ఆయనది. ఇవే నన్ను ఆకర్షించాయి. ఆయన నేతృత్వంలోనే ముందుకెళ్లాలని నా అంతరాత్మ చెప్పింది. దాంతో వైఎస్సార్‌సీపీలో చేరా.
 
 టీడీపీవి 420 ఆలోచనలు
 జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేస్తున్న ఆలోచనల్లో అర్థం లేదు. అందంతా నాన్‌సెన్స్. ఏ ఆధారంతో ఆయనపై నిందలు వేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదంతా వైఎస్ వ్యతిరేక శక్తుల కుట్రగా భావించాలి. అవన్నీ 420 ఆలోచనలు. ఈ ఆరోపణలు చూస్తుంటే నాక్కూడా బాధేస్తోంది. మాజీ పోలీసు అధికారిగా నాకున్న సమాచారంతో చెబుతున్నా. జగన్‌పై ఓ వర్గం కుట్ర చేస్తోంది. దీని వెనుక ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీలున్నాయి. నాయకులున్నారు. ఈ శక్తులకు వత్తాసు పలుకుతూ ఎల్లో పత్రికలు జగన్‌పై ముప్పేట దాడికి దిగాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఎల్లో మీడియా వాస్తవ రూపాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. ఎవరెన్ని అనుకున్నా ఒక్కటి మాత్రం నిజం. ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.

 వైఎస్ స్మృతులను చెరిపేసే కుట్ర

 నా సర్వీసులో ఎన్నో కేసులు చూశాను. ఆ అనుభవంతోనే చెబుతున్నా. జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ప్రతీ ఆరోపణలోనూ రాజకీయ కోణమే కన్పిస్తోంది. మొదట్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసును సీబీఐకి అప్పగించారు. ఏం తేలింది? చార్జిషీట్‌లో రూ.300 కోట్లని పేర్కొన్నారు. ఇది కూడా ఆరోపణ మాత్రమే. కోర్టులో నిరూపణ కాని అంశం. ఇతర నేతలపై ఇలాంటి ఆరోపణలు లేవా? కోర్టులు తప్పుబట్టలేదా? వాటిని పత్రికలు ఎందుకు హైలెట్ చేయవు. కారణం.. జనానికి జగన్‌ను దూరం చేయాలి. వైఎస్ స్మృతులను చెరిపేయాలి. కానీ అది సాధ్యం కాదు. దళితులు, మైనార్టీలు, మహిళలు, యువత, ఉద్యోగులు.. ఒకరేంటి? వైఎస్ పాలనను అంతా రామరాజ్యం అన్నారు. మళ్లీ అలాంటి పాలన తేగల సత్తా ఒక్క జగన్‌కే ఉంది. దమ్ముంటే సర్వే చేయించమనండి? ఇదే ఫలితం వస్తుందో? రాదో? చూడండి.
 
 అభివృద్ధి పత్రికల మహిమే
 హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ధి చేశారని ఆయనకు వత్తాసు పలికే పత్రికలు పతాక శీర్షికన ప్రకటిస్తున్నాయి. అదే నిజమైతే చంద్రబాబు రెండుసార్లు ఎందుకు ఓడిపోతారు? ఆయనపై మైనారిటీల్లో ఎందుకంత వ్యతిరేకత వస్తుంది?  గోరంతను కొండంతగా చూపే పత్రికల ప్రచారం మినహా, ఇందులో వాస్తవం లేదు. వైఎస్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. విద్యా ప్రమాణాలు మెరుగయ్యాయి. పారిశ్రామికాభివృద్ధిలో హైదరాబాద్ పరుగులు తీసింది. ఈ వాస్తవాన్ని విస్మరించి చంద్రబాబు ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు.  

 ఆ ఆరోపణల్లో నిజం లేదు

 నేను తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాననే ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు. ఉద్యమ సమయంలో కాస్త కఠినంగా వ్యవహరించి ఉంటాను. అది ప్రజల కోసమే. శాంతిభద్రతల అదుపుకోసమే అలా ఉండాల్సి వచ్చింది. నేను తెలంగాణ వ్యతిరేకినే అయితే.. ఏ తెలంగాణ సభనైనా అడ్డుకున్నానా చెప్పమనండి? ఏ సభకైనా అనుమతి నిరాకరించానా? లేదే.  

 తెలంగాణతో మమేకమయ్యా

 నేను స్థానికేతరుణ్ని కాదు. పుట్టింది ఇక్కడ కాకపోవచ్చు. కానీ పెరిగింది, చదువుకుంది ఇక్కడే. మా అక్కను నల్గొండ ఇచ్చాం. వియ్యం, కయ్యం అంతా తెలంగాణలోనే. బంధువులంతా తెలంగాణలోనే ఉన్నారు. తెలంగాణతో మమేకమయ్యాను అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? నా సర్వీసులో తొమ్మిదేళ్లు మినహా మిగిలిన కాలం మొత్తం హైదరాబాద్‌లోనే. కాబట్టే ఇక్కడ నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నా.
 
 అభివృద్ధి చేసి చూపిస్తా
 మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానం. అనేక ప్రాంతాల వాళ్లు ఇక్కడ రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల రక్షణ కోసం కేం ద్రస్థాయిలో ఎంతకైనా వెళ్లగల నేత ఉండాలని భావిస్తున్నారు. అనేక మంది నా దగ్గరకొచ్చి ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక ఈ ప్రాం తంలో నిరుద్యోగులున్నారు. అభివృద్ధికి దూరమైన వాడలున్నాయి. బడుగు, బలహీనవర్గాల మహిళలు రక్షణ కోరుకుంటున్నారు. అందు కే ఈ స్థానాన్ని చాలెంజ్‌గా తీసుకున్నా. అభివృద్ధి చేసి చూపిస్తా.

 ప్రాణాలు పణంగా పెట్టడానికైనా సిద్ధం

 పోలీసు అధికారిగా ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఏ గల్లీలో ఏం జరిగినా వెంటనే స్పందించేవాణ్ని. పరిష్కారం చూపేవాడిని. అయితే ఈ విషయం ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను నేరుగా వారి వద్దకే వెళ్తా.  సమస్యలు తెలుసుకుంటా. ఏ క్షణంలోనైనా నాతో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీం నంబరు ఏర్పాటు చేస్తా. మైనార్టీలకు బాసటగా నిలుస్తాను. అవసరమైతే ప్రాణాలు పణంగా పెడతాను. క్రమశిక్షణ నరనరాన నిండిన మాజీ పోలీసు అధికారిగా ఇస్తున్న భరోసా ఇది. నన్ను నమ్మండి.

తెలంగాణలో 105 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ

తెలంగాణలో 105 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 పార్లమెంట్, 105 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసింది. మంగళవారం 13 మంది పార్లమెంట్, 81 మంది అసెంబ్లీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయగా... బుధవారం ఉదయం మరో 24 మందికి బీ-ఫారాలు అందజేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన వారి సంఖ్య 105కు చేరింది.
 

వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా..
 
హైదరాబాద్: చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు (జయచంద్రారెడ్డి), తణుకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిద్దరూ బుధవారం వైస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, చింతలపూడి  కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు సన్నిహిత  సహచరుడైన గంటా మురళి కూడా జగన్‌ను కలిసి పార్టీ లో చేరారు.

తన సతీమణి లావణ్యతో వచ్చిన సి.కె.బాబుకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లావణ్యకు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. కారుమూరు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరిన సందర్భంగా నర్సాపురం, ఏలూరు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తలు ఎం.ప్రసాదరాజు, తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు. వేణుగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఉన్నారు.
 
వైఎస్ పథకాలు ఆదర్శనీయం: కారుమూరు
పదేళ్ల కిందట భయానకమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి  చేపట్టిన పథకాలు ఎంతో మేలు చేశాయని, ఇవన్నీ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే అమలవుతాయనే విశ్వాసంతోనే పార్టీలో చేరానని నాగేశ్వరరావు చెప్పారు. వైఎస్ పథకాల వల్ల బడుగు, బలహీనవర్గాలకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. తన లేఖతోనే రాష్ట్రం విడిపోయిందని తెలంగాణలో మాట్లాడుతూ... సీమాంధ్రలో మరో విధంగా చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిలకడలేని నాయకుడని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు.
 
సీఎం అంటే వైఎస్సే: కోదండరామిరెడ్డి
వైఎస్ నిత్యం నవ్వుతూ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉండేవారని సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రిననే భావం లేకుండా అందరినీ పలకరిస్తూ పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు.  వైఎస్ అంటే తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని, ఆయన కడుపున పుట్టిన బిడ్డగా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తాను పార్టీలో చేరానని కోదండరామిరెడ్డి వెల్లడించారు.
 
బాబును, బీజేపీని ప్రజలు నమ్మరు: వంటేరు
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును, దగ్గరుండి విభజన జరిపించిన బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరని వంటేరు వేణుగోపాలరెడ్డి చెప్పారు. కొత్త రాష్ట్రం జగన్ నేతృత్వంలో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంద న్నారు. వేణుగోపాలరెడ్డి 1999లో కావలి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Popular Posts

Topics :