20 April 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మానసిక స్థితి సరిగాలేని బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా?

Written By news on Saturday, April 26, 2014 | 4/26/2014

బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా?:షర్మిలవీడియోకి క్లిక్ చేయండి
అనంత:  మానసిక స్థితి సరిగాలేని బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? అని షర్మిల నిలదీశారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే..ఆ కేసు నుంచి బయట పడేందుకు మానసిక స్థిమితం లేదంటూ బాలకృష్ణ ఒక సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతిని షర్మిల గుర్తు చేశారు.  జిల్లాలోని హిందూపురంలో ప్రసంగించిన ఆమె.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలపై మండిపడ్డారు. పిచ్చివాళ్లకు ఓటు వేస్తే ప్రజలను పిచ్చోళ్లను చేస్తారన్నారు. మంచి కొడుకు అనిపించుకోలేని బాలకృష్ణ నటుడు కావొచ్చేమో కాని...మంచి రాజకీయ వేత్త కాలేరని షర్మిల అభిప్రాయపడ్డారు.

మంచి నేత అంటే మీసాలు తిప్పడమో, తొడ గొట్టడమే కాదని..ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడమన్నారు. చంద్రబాబు ప్రజల కోసం ఏనాడు పోరాడ లేదని, కాంగ్రెస్‌తో కుమ్మక్కు రాజకీయాలు చేయడానికే ఆయనకు సమయం సరిపోయిందని షర్మిల తెలిపారు. ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెడితే ఆయన విప్ జారీ చేసి కాంగ్రెస్‌ను కాపాడారన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి..ఆయనపై చెప్పులు వేయిస్తే బాలకృష్ణ మాత్రం ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్నారు. కొడుకు అన్న పదానికి మచ్చ తెచ్చిన ఆయనకు జగన్నను విమర్శించే స్థాయి ఉందా? అంటూ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ కోసం మరణించిన కుటుంబాలను కొడుకుగా జగన్ ఓదార్చి.. చెయ్యని నేరాలకు జైలుకు వెళ్లారన్నారు. అసలు బాలయ్యకు.. జగనన్నకు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. రైతులు, చేనేతలు, విద్యార్థుల పక్షాన నిలబడి దీక్షలు చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని ఆమె గుర్తు చేశారు. చివరకు ఓదార్పు కోసం జగన్ పదవులను సైతం తృణప్రాయంగా వదులుకున్నారన్నారు.
 
ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక భరోసా అని వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. పేదవాడి మనసెరిగి పరిపాలించిన ఆ మహానేతకు ఇప్పటికీ ప్రజల గుండెల్లో స్థానం పదిలంగానే ఉందన్నారు. జిల్లాలోని ఎన్నికల రోడ్ షోలో భాగంగా హిందూపురంలో పర్యటించిన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాజన్న సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆనాటి వైఎస్సార్ పాలనలో పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ప్రతీ పేద విద్యార్థి డాక్టర్, ఇంజనీర్ కావడమే లక్ష్యంగా పని చేసిన వైఎస్సార్ ప్రతీ ఒక్కరిగా భరోసా కల్పించారని షర్మిల తెలిపారు. ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం పేదవాడు వైద్యం చేయించుకోవడాని ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లను వైఎస్సార్ కల్పించారన్నారు. ఆయన హయాంలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని షర్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు

వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు
కడప: వైఎస్ఆర్ జిల్లాలో పేరున్న సీనియర్ రాజకీయ నాయకులు కందుల సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుల శివానంద రెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న కందుల సోదరులు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో  ఉన్నారు.  కొద్ది కాలం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మల్లీ కొద్ది కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత నెలలోనే మళ్లీ టిడిపిలో చేరారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో అక్కడ ఇమడలేమనుకున్నారో ఏమో ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో చేరారు.

కందుల శివానందరెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.1981 నుంచి 1986 వరకు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు.1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప శాసనసభ స్థానంకు పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కూడా ఆయన మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులుగా పనిచేశారు. ఆయన సోదరుడు కందుల రాజమోహన్‌రెడ్డి కూడా పోలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.  కందుల రాజమోహన రెడ్డి మూడు సార్లు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2011లో ఉప ఎన్నికల సందర్భంగా కందుల సోదరులిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథంగా జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. బ్యాలెట్ పత్రంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పేరు శోభానాగిరెడ్డి పేరు, ఆ పార్టీ గుర్తు ఉంటాయి. అయితే ఆమెకు వేసే ఓటుని 'నోటా'గా పరిగణిస్తారు.

కర్నూలులో వైఎస్ఆర్ సిపి తరపున ప్రస్తుతానికి మరో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. ఇప్పటికే బ్యాలెట్ పేపరు, అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది.  శోభానాగిరెడ్డికి ఓటు వేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఆళ్లగడ్డలో ఫ్యాన్ గుర్తుకి వేసే ఓటును ‘నోటా’గానే పరిగణిస్తామని ఇసి స్పష్టం చేసింది. ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి మినహా మిగిలిన వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే  వారిని విజేతగా ప్రకటిస్తారు.

కార్యకర్తలకు ధైర్యం చెప్పిన భూమా నాగిరెడ్డి

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి సంతాప సభలో భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు. నంద్యాలలో జరిగిన సంతాప సభలో ఆయన పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని భూమా నాగిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టిన విషయం తెలిసిందే

వైఎస్సార్ అంటేనే ఒక భరోసా

వైఎస్సార్ అంటేనే ఒక భరోసా:షర్మిల
అనంత: ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటేనే ఒక భరోసా అని వైఎస్సార్ సీపీ నేత వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. పేదవాడి మనసెరిగి పరిపాలించిన ఆ మహానేతకు ఇప్పటికీ ప్రజల గుండెల్లో స్థానం పదిలంగానే ఉందన్నారు. జిల్లాలోని ఎన్నికల రోడ్ షోలో భాగంగా హిందూపురంలో పర్యటించిన ఆమె.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని రాజన్న సువర్ణ యుగాన్ని తెచ్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆనాటి వైఎస్సార్ పాలనలో పావలా వడ్డీకే రుణాలను ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ప్రతీ పేద విద్యార్థి డాక్టర్, ఇంజనీర్ కావడమే లక్ష్యంగా పని చేసిన వైఎస్సార్ ప్రతీ ఒక్కరిగా భరోసా కల్పించారని షర్మిల తెలిపారు.
 
ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం పేదవాడు వైద్యం చేయించుకోవడాని ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ముస్లిం మైనార్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లను వైఎస్సార్ కల్పించారన్నారు. ఆయన హయాంలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని షర్మల ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హుజూర్‌నగర్‌ నుంచే ఓదార్పు యాత్ర

హుజూర్‌నగర్‌  నుంచే ఓదార్పు యాత్ర : వైఎస్ జగన్
నల్లగొండ: రాబోయే రోజుల్లో ఓదార్పు కార్యక్రమం ఇక్కడి నుంచే మొదలుపెడతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. హుజూర్‌నగర్‌ లో జరిగిన వైఎస్ఆర్ జనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ సిపికి మద్దతు ఇవ్వండి, వైఎస్ఆర్‌ సువర్ణయుగం తెచ్చుకుందాం అని పిలుపు ఇచ్చారు. సిఎం  అంటే ఇలాగే ఉండాలని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి  ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వైఎస్ఆర్ చూడలేదన్నారు. ప్రతి పేదవాడి మనసు ఎరిగి ఆయన పాలన చేశారని చెప్పారు.

రాష్ట్రాలు విడగొట్టారు కానీ తెలుగు జాతిని, తెలుగు ప్రజలను విడగొట్టలేదన్నారు. మీకు ఏ కష్టం వచ్చినా  తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయం అంటే విశ్వసనీయత ఉండాలన్నారు. రాజకీయం అంటే ప్రతి పేదవాడి మనసు తెలుసుకోవాలని చెప్పారు. కానీ నేటి రాజకీయాలు పూర్తీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు ఒక చదరంగంలా మారిపోయాయన్నారు. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు. విశ్వసనీయత, నిజాయితీ ఒక వైపున ఉన్నాయని, కుళ్లు,కుతంత్రాలు మరో వైపున ఉన్నాయని అన్నారు.

ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే....పులి పులే

జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మళ్లీ అద్భుతంగా చేసి చూపిస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ జనభేరిలో భాగంగా ఆమె శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓబుళదేవర చెరువులో రోడ్ షో నిర్వహించిన షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాసేవకు జగనన్న తన జీవితాన్ని...అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని... ఎన్నికల్లో అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు  వేసి జగనన్న నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.... వైఎస్ఆర్ 31 లక్షలమందికి పెన్షన్లు ఇచ్చారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని... అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ వైఎస్ఆర్ ఏ ఒక్క ఛార్జీలు పెంచలేదన్నారు.చంద్రబాబు నాయుడు ఎనిమిదేళ్ల ప్రభుత్వంలో ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న బాబు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాన మోశారని ఆమె విమర్శించారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు చేస్తున్న వాగ్దానాల్లో నిజం లేదని షర్మిల పేర్కొన్నారు.

అధికారం ఇస్తే అది చేస్తాం ఇది చేస్తామని చంద్రబాబు బూటకపు వాగ్దానాలు చేస్తున్నారని షర్మిల అన్నారు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామంటే... ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న బాబు ...ఇప్పుడు తామూ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారన్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే....పులి ...పులేనని షర్మిల వ్యాఖ్యానించారు. మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

వ్యాఖ్యలు

Loading...Logging you in...
  • Logged in as
There are no comments posted yet. Be the first one!

Post a new comment

Comments by 
Advertisement
Advertisement
Advertisement
Advertisement

EPaper

Advertisement
Advertisement
© Copyright Sakshi 2014. All rights reserved.

Popular Posts

Topics :