04 May 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదు

Written By news on Saturday, May 10, 2014 | 5/10/2014

కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధంలేదుగట్టు రామచంద్ర రావువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  వ్యాఖ్యలతో వైఎస్ఆర్ సిపికి సంబంధం లేదని ఆ పార్టీ  అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి సీఎం కావడం తథ్యం అని, దానికి సర్వేలు అవసరం లేదని చెప్పారు.

రాష్ట్ర విభజన విషయంలో జగన్‌, కేసీఆర్‌లు భిన్న ధృవాలన్నారు. యువత బలిదానాలకు కారణం యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సిపి పోరాడుతుందన్నారు.  రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పాగా వేస్తామని గట్టు చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం
అనంతపురం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ నేత అనంత వెంకట్రామి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 25 ఎంపీ, 130 నుంచి 150 వరకు ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని వెంకట్రామి రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ ఘోర పరాజయం చవిచూస్తుందని, ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు. అనంతపురం సిట్టింగ్ ఎంపీ అయిన వెంకట్రామిరెడ్డి ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే కొలబద్దగా కేంద్రంలో పాత్ర

కాంగ్రెస్‌కు మద్దతు ప్రసక్తే లేదు:  వైఎస్సార్ సీపీ
  రాష్ట్ర ప్రయోజనాలే కొలబద్దగా కేంద్రంలో పాత్ర
►  తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా వ్యవహరిస్తాం
► చంద్రబాబులా సాగిలబడే తత్వం మాది కాదు
► జాతీయ స్థాయిలో మా విధానం స్పష్టం
► కేంద్రంలో మద్దతుపై వక్రీకరించడం సరికాదు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వాటిని పట్టుబట్టి సాధించుకుంటామని పేర్కొంది. కేంద్రంలో మోడీ ఉండొచ్చు, మరెవరైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే మద్దతునిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు సత్యదూరమని ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు...
 
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో పైచేయి సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చునని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి పట్టుబట్టి సాధించుకోవచ్చని మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అనేకమార్లు ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. చంద్రబాబులా ఢిల్లీలో సాగిలపడిపోం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తామని పోలింగ్ ముగిసిన తరువాత పులివెందులలో జరిగిన పత్రికా సమావేశంలోనూ విస్పష్టంగా ప్రకటించారు.
  చంద్రబాబు రాష్ట్రంలో మోడీని చూపి ఓట్లు అడగ్గా జగన్‌మోహన్‌రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతామంటూ ప్రజా మద్దతు కోరిన విషయం అందరికీ తెలుసు. ఈ అంశాలను పట్టించుకోకుండా ఆంగ్ల మీడియా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై తోచిన రీతిలో కల్పితాలతో కథనాలు ఇవ్వడం సమంజసం కాదు.
  రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. 25 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికగా మా మద్దతు మోడీకా, మల్లయ్యకా, ఎల్లయ్యకా అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ప్రజల్లో భయాందోళనలు, సందిగ్ధతను సృష్టిం చేందుకు పార్టీ వైఖరిని వక్రీకరిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలి.
 
 జగన్‌ను కలిసిన పార్టీ నేతలు
 పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, బాలశౌరి తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పోలింగ్ సరళి గురించి వారు పార్టీ అధినేతకు వివరించారు.

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

Written By news on Friday, May 9, 2014 | 5/09/2014

కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  కేంద్రంలో ప్రభుత్వానికి పార్టీ మద్దతు విషయమై ఆంగ్ల మీడియా కథనాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.  కేంద్రానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిలా దాసోహం అనకుండా కేంద్రం మెడలు వంచేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని వైఎస్ జగన్ అన్నారు. 
 
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని వైఎస్ జగన్ తెలిపారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తీరని నష్టం చేసింది కాంగ్రెస్సేనని,  ఎన్నికల ఫలితాలు వచ్చాక రాష్ట్రానికి మేలు చేసేవారితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ఆయన అన్నారు. 
 
అంతేతప్ప ఫలానావారితో పొత్తు కుదుర్చుకుంటామని ఎక్కడా చెప్పలేదని,  ఈ విషయమై లేనిపోని కథనాలు ప్రచురించి ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని మీడియాకు వైఎస్ఆర్సీపీ లేఖ రాసింది. 

జగన్ అధికారంలోకి వస్తున్నాడు..

సీమాంద్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే చెబుతున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు చెప్పారు.తెలంగాణ లో తాను, సీమాంద్రలో జగన్ అదికారం చేపట్టబోతున్నామని అన్నారు.పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా తాము కలసి పనిచేయవలసి ఉంటుందని అన్నారు. జగన్ ఏమైనా అంటరాని వాడా అని ఆయన ప్రశ్నించారు.జగన్ కు వందకు పైగా సీట్లతో అదికారంలోకి వస్తాడని కెసిఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కల్ల అని ఆయన చెప్పారు. రెండు చోట్ల చంద్రబాబుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.చంద్రబాబు ఇప్పటికే సింగపూర్ వెళ్లాడట.. ఆ తర్వాత ఏమో అని వ్యంగ్యంగా అన్నారు.తెలంగాణ ఆవిర్భావం దినాన్ని ముందుకు తీసుకువచ్చే పరిశీలించాలని హైకోర్టు సూచించిందని, న్యాయశాఖ పరిశీలిస్తోందని కెసిఆర్ అన్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20140509_14.php

నేదురుమల్లికి వైఎస్ జగన్ నివాళులు

నేదురుమల్లికి వైఎస్ జగన్ నివాళులువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. సోమాజిగూడలోని నేదురుమల్లి స్వగృహానికి వెళ్లిన ఆయన నేదురుమల్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేదురుమల్లి మృతి పట్ల జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేదురుమల్లి శుక్రవారం ఉదయం అయిదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

కాగా వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేత సోమయాజులు కూడా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, సి.రామచంద్రయ్య, ఆనం రామనారాయణ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులు నేదురుమల్లికి నివాళులు అర్పించారు.

ఇక చంద్రబాబుకు సింగపూరే గతి!

ఇక చంద్రబాబుకు సింగపూరే గతి!: గట్టు రామచంద్రరావు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్‌కు వెళ్లిపోవడం ఖాయమని, ఆయన తిరిగి ఎప్పటికీ కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మే 16న వెలువడే ఫలితాల్లో తమ పార్టీ సీమాంధ్రలో కింగ్, తెలంగాణలో కింగ్ మేకర్ అవుతుందని.. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్, ఎల్లో మీడియా కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పనిచేయలేదని విమర్శించారు. ఇప్పటికే ఓటమికి గల మార్గాలను వెతుక్కునే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు.
 
  ఇప్పుడు నరేంద్ర మోడీ, పవన్‌ను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల తర్వాత వారిని కచ్చితంగా విమర్శిస్తారని.. వారి వల్లే ఓడిపోయానని బాబు చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. తాను చేసే తప్పులన్నీ ఇతరులపై నెట్టడం బాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. దాడులకు పాల్పడుతూ, దొంగ నోట్లు, మద్యం పంచుతూ టీడీపీ నేతలే పట్టుబడితే..  తీవ్ర ఒత్తిడిలో ఉన్న బాబు మాత్రం తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎల్లో మీడియా రాసిన కథనాలను ప్రతీ ఒక్కరూ నమ్మాలని, వారు చేసే ప్రతి పనికి మీడియా సంఘాలు మద్దతివ్వాలని అంటూ బాబు అడ్డగోలు వాదన చేస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఈ సందర్భంగా సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. టీడీపీ నేతల వద్ద కోట్ల రూపాయలు పట్టుబడినా సమాధానం ఉండదన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా మే 16 తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక పక్కవాడికోసం పార్టీ పెట్టిన ఘనత పవన్ కల్యాణ్‌దేనని, ఆయన కూడా మే 16 తర్వాత కనుమరుగవడం ఖాయమని గట్టు పేర్కొన్నారు.

లగడపాటి అండ్ కో సర్వేల గారడీ

లగడపాటి అండ్ కో సర్వేల గారడీ
  •  ఏలూరు కేంద్రంగా బెట్టింగ్ శిబిరం!
  •  వందల కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం
  •  టీడీపీదే గెలుపంటూ బోగస్ ప్రచారం
 ఆయన పేరు లగడపాటి రాజగోపాల్. బెట్టింగ్‌ల విషయంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ సన్యాసం స్వీకరించి తెరమరుగయ్యారు. సార్వత్రిక సమరం అనంతరం సర్వేల పేరుతో హల్‌చల్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని తొలుత చెప్పిన లగడపాటి తర్వాత తూచ్ అన్నారు. తాజాగా టీడీపీకి చాన్స్ ఉందంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా లగడపాటి రంగులు మార్చడం వెనుక బడా బెట్టింగ్ స్కాం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా లగడపాటి బెట్టింగ్ దందాకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
 
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సర్వేల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారు. లడగపాటి అండ్ కో భారీ బెట్టింగ్ స్కీ(స్కా)ం కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సర్వేల పేరుతో వందల కోట్లు దండుకున్న లగడపాటి తాజాగా అదే మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. గతంలో సర్వేల రాయుడిగా జనంలో కొంత ఇమేజ్ సంపాదించుకున్న రాజగోపాల్ దాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం రూపొందించారు. ఏలూరు కేంద్రంగా భారీ బెట్టింగ్  రాకెట్ నడుపుతున్నారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.
 
స్వాహాకు వ్యూహం...
 
ఏలూరు అడ్డాగా నడిచే బెట్టింగ్ శిబిరానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ లగడపాటేనని తెలుస్తోంది. తెరపైకి మాత్రం బుకీలు కనిపిస్తారు. సర్వేలు తారుమారు చేయడం ద్వారా పందేల బరిని సిద్ధం చేస్తారు. ఆనక ఒకటికి రెండిస్తామని పందేలరాయుళ్లను రెచ్చగొడతారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే పార్టీకి అనుకూలంగా సర్వే నివేదికలు సృష్టిస్తారు. విజయం సాధించే పార్టీ తరఫున లగడపాటి వర్గం పందెం వేస్తోంది. వందల కోట్లు స్వాహా చేస్తోంది. ఇది లగడపాటి మార్క్ సర్వేల వెనుక దాగున్న లోగుట్టు. ఇవేమీ తెలియని అమాయక జనం పందేల పేరుతో సర్వం పోగొట్టుకుంటున్నారు.
 
అంతా బోగస్...
 
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గాలిని కోరుకున్నారు. విజయవాడలో లగడపాటి ఓటు వేసే సమయంలో కొన్ని టీవీ చానళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాయి. అప్పటికి 50 శాతం పోలింగ్ పూర్తయింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోందని విలేకరులు ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనని లగడపాటి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని గురువారం లగడపాటి సర్వే విడుదల చేశారు. బెట్టింగ్ వ్యాపారంలో ఆరితేరిన లగడపాటికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బోగస్ సర్వేతో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో  లగడపాటి గందరగోళానికి తెరతీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర విభజన సర్వే ఏమైంది...
 
రాష్ట్రం ముమ్మాటికీ విడిపోదు. నా వద్ద సర్వేలు ఉన్నాయి అని నానా హడావిడి చేసిన లగడపాటి సర్వే ఏమైందని పలువురు ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. తప్పుడు సర్వేలు సృష్టించడం, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందడం లగడపాటికి వెన్నతో పెట్టిన విద్య అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకొని తెరమరుగైన రాజగోపాల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సర్కస్‌లో బఫూన్‌లా మారడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
లీకేజ్ రాయుడు...
2009 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తోందని లగడపాటి తన అనుచరగణం ద్వారా లీకులిప్పించారు. అప్పటివరకు సందిగ్ధంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి పందేలు కాశారు.
 
కాంగ్రెస్ గెలుస్తోందని లగడపాటి అనధికారికంగా సర్వే విడుదల చేశారు. దీంతో పందేలు రెండింతలయ్యాయి.
 
నగర ంలోని ఒక సహకార బ్యాంక్‌లో పందెం సొమ్ము డిపాజిట్ చేసే విధంగా పందేల ఒప్పందం కుదిరింది.
 
ఈ ఎన్నికల్లో లగడపాటి సుమారు రూ.100 కోట్లు పందెం గెలిచినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.
 
అంతర్జాతీయ బుకీలతో లగడపాటికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
 
రాజగోపాల్ సర్వేల కోసం లక్షలు ఖర్చు చేసి బెట్టింగ్‌ల రూపంలో కోట్లు దండుకుంటారని భోగట్టా.

త్వరలోనే రాజన్న రాజ్యం

Written By news on Thursday, May 8, 2014 | 5/08/2014

'త్వరలోనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది'
అనంతపురం: ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఖాయమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు శంకర్‌నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, తొపదుర్తి ప్రకాశ్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డిలు మాట్లాడుతూ..  త్వరలోనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది అని అన్నారు.  
 
వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఉచిత హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. అవాస్తవాలకు, అబద్ధాలకు చిరునామా చంద్రబాబు గుర్నాథ్‌రెడ్డి విమర్శించారు. 

హైదరాబాద్ బయల్దేరిన వైఎస్ విజయమ్మ

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్ సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ గురువారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కాగా వైఎస్ విజయమ్మ నిన్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటించారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. పలు పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటర్ల నాడిని ఆమె గమనించారు. భీమిలి నియోజకవర్గం పరిధిలోని మధురవాడ జడ్పీ హైస్కూల్ ను నిన్న సాయంత్రం సందర్శించారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తుండగా విజయమ్మను అభిమానులు చుట్టుముట్టారు.

పన్ను ఎగవేసిన రామోజీ

పన్ను ఎగవేసిన రామోజీ
* రూ. 77 లక్షలకు పైగా డాల్ఫిన్ హోటల్ బకాయి
*విశాఖలో ఆస్తి పన్ను చెల్లించని తీరు
‘ఈనాడు’ను, రామోజీని చూసి చర్యలకు వెనకాడుతున్న అధికారులు

 
 సాక్షి, విశాఖపట్నం: ఎదుటివారికి చెప్పేందుకే నీతులన్నాయని నమ్మేవారిలో మొదటి వ్యక్తి ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావే. పెన్ను పట్టుకుని ఇతరులపై ఇంతెత్తున లేచే రామోజీరావు... తాను మాత్రం అన్నిటికీ అతీతమనుకుంటారు. ఆఖరికి స్థానిక సంస్థలకు పన్ను కూడా కట్టకుండా ఎగవేస్తున్నారు ఈ రాజగురివింద. విశాఖలో ఈయన కబ్జా చేసిన డాల్ఫిన్ హోటల్ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నా... గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏటా చెల్లించాల్సిన ఆస్తి పన్నును మాత్రం ఎగవేస్తోంది. జీవీఎంసీ యంత్రాంగం ఎన్నిసార్లు నోటీసులిచ్చినా డాల్ఫిన్ నుంచి స్పందన మాత్రం కరువవుతోంది. అధికారులేమో ఈనాడును, రామోజీరావును చూసి చర్యలకు వెనకాడుతున్నారు.
 
 బకాయిలు రూ.77,31,252
 జీవీఎంసీ 28వ వార్డులో రామోజీ గ్రూప్‌కు చెందిన డాల్ఫిన్ హోటల్‌కు మూడు డోర్ నంబర్ల పేరిట మూడు(17225, 17430, 17471) అసెస్‌మెంట్లున్నాయి. వీటికి 1996, 2012 ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా ఆస్తిపన్ను బకాయిలున్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాల బకాయిలు రెండేళ్ల కిందట చెల్లించినా.. అదీ అరకొరే. దీంతో వడ్డీ కూడా భారీగా పేరుకుపోయింది.
 
 గడచిన ఆర్థిక సంవత్సరం నాటికి ఈ వార్డులో మొత్తం పన్ను బకాయిలు రూ.3.50 కోట్లుండగా.. ఇందులో ఒక్క డాల్ఫిన్ హోటల్ యాజమాన్యమే రూ.77 లక్షల 31 వేల 252 చెల్లించాల్సి ఉంది. దీనిపై జీవీఎంసీ ఎన్నిసార్లు నోటీసులిచ్చినా.. యాజమాన్యం నుంచి స్పందన అంతంతమాత్రమేనని అధికారులు చెప్తున్నారు. మిగిలిన వాణిజ్య సంస్థల బకాయిలపై తీసుకున్నంతగా కఠిన చర్యలు వీటిపై తీసుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా వంత పాడటంతో తామేం చేయలేని పరిస్థితికి చేరుకున్నామని చెప్తున్నారు. నిబంధనల మేరకు ఏళ్ల తరబడి పన్ను బకాయిలున్నవారికి జీవీఎంసీ సేవల్ని నిలిపేయడంతో.. పాటు ఆర్‌ఆర్ చట్టం ప్రకారం ఆస్తుల వేలానికి కూడా వెళ్లొచ్చు. అయితే వీరిపై ఆ స్థాయి చర్యలకు సిద్ధపడే పరిస్థితి లేదు.
 వడ్డీ ఎక్కువే!
 మొత్తం బకాయిలు రూ.77,31,252లో వడ్డీ రూ.23,47,554 కాగా మిగిలింది ఎగవేసిన మొత్తం. ఎగవేసిన బకాయిలపై ప్రతి నెలా 2 శాతం చొప్పున వడ్డీ పెరిగేలా నిబంధనలుండటంతో మొత్తం బకాయి ఈ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది వడ్డీ మినహాయింపునిస్తూ ఆస్తిపన్ను చెల్లింపునకు అవకాశం కల్పించినా.. యాజమాన్యం మాత్రం చెల్లించేందుకు మొండికేయడంతోనే.. ఈ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెప్తున్నారు.

 బకాయిల వివరాలు

 అసెస్‌మెంట్ నం.    ఎప్పటి నుంచి    బకాయి (రూ.ల్లో)
 17225    2012    28,84,170
 17430    2012    6,37,206
 17471    1996    42,09,876

ప్రజలు ఏకపక్షంగా తీర్పు

కెరటంలా తీర్పు
 ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు: జగన్
 చంద్రబాబు మోడీ కోసం ఓటడిగారు..
 నేను సీమాంధ్ర భవిష్యత్తు కోసం ఓటడిగాను
 కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం మనమిచ్చే
 ఆక్సిజన్‌పైనే బతికే పరిస్థితి రాబోతోంది
 రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే వారికే కేంద్రంలో మద్దతిస్తాం
 కక్షగట్టిన వారితో నాలుగున్నరేళ్లుగా ఒంటరి పోరాటం చేశా.. ఆ పోరాటానికి
 ఈ ఎన్నికల్లో తీర్పు రాబోతోంది

 
 సాక్షి, కడప: ‘‘దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఈ రెండూ మెండుగా నాకున్నాయి. సీమాంధ్రలో తీర్పు ఓ కెరటంలా ఉండబోతోంది. ఏకపక్షంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ‘‘నేను మొదటి నుంచీ బహిరంగ సభల్లో చెబుతున్నాను. ఢిల్లీకి సాగిలపడేలా చంద్రబాబు నరేంద్ర మోడీకి ఓట్లు వేయాలని అడిగారు. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఓట్లు వేయాలని అడిగాను. ఢిల్లీలో మనం అడిగిన పనులు చేసే వారికే మద్దతు ఉంటుంది. కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా మన దగ్గరకు రాక తప్పదు.. ఆ సంఖ్య మనకు వస్తుంది. మనమిచ్చే ఆక్సిజన్‌పైనే కేంద్ర ప్రభుత్వం బతికే పరిస్థితి ఉంటుంది’’ అని స్పష్టంచేశారు. బుధవారం సాయంత్రం పులివెందులలోని స్వగృహంలో జగన్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా బయటకొచ్చి ఓటేయడంతో 75 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందన్నారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నాలుగున్నరేళ్లపాటు నాతో నడిచిన ప్రతి కార్యకర్త, నాయకులు, అక్క, అవ్వ, చెల్లి, సోదరులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా పోరాటానికి ఈ ఎన్నికల్లో తీర్పు రాబోతోంది. నా వెంట నడిచిన మీకందరికీ చేతులు జోడించి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’’ అని అన్నారు.
 
 చంద్రబాబు అదే పనిగా గొడవలు సృష్టించారు..
 
 ‘‘చంద్రబాబు నాయుడు పోలింగ్ శాతం తగ్గించేందుకు అదే పనిగా గొడవలు సృష్టించారు. జమ్మలమడుగు ప్రాంతంలో దేశం నాయకులను ప్రోత్సహించారు. అక్కడ టీడీపీ నిబంధనలు ఉల్లంఘించింది. ఆ ఊరిలోని వ్యక్తినే ఏజెంట్లుగా ఉంచాలని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ బలవంతంగా అక్కడికి వేరే వ్యక్తులను తీసుకుపోవడం వల్లనే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. మైదుకూరులో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే దాన్ని ఆపేందుకు వెళ్లిన అభ్యర్థి రఘురామిరెడ్డి కారుపై రాళ్లు వేసి అద్దాలు పగులగొట్టారు’’ అని జగన్ టీడీపీ వైఖరిని తప్పుబట్టారు. ‘‘చంద్రబాబు కావాలనే ఈ ప్రయత్నం చేశారు. రెండు నెలలుగా ‘ఈనాడు’ దారుణంగా రాతలు రాస్తోంది. దీంతోపాటు నాపై ఎందరో కక్షగట్టి వే ధించారు. అందరితో ఒంటరి పోరాటం చేశాను. ఇంతమంది ఒకవైపు, నేను ఒక్కడిని మరోవైపు నిలిచాను. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రజలు కెరటంలా లేశారు. దేవుని దయ, ప్రజల ఆశీస్సులు నాకు అండగా ఉన్నాయి’’ అని అన్నారు.
 
 మన రాష్ట్రంతో ఆటలాడుకున్నారు..
 
 రాష్ట్ర విభజనలో సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అతి దారుణంగా విభజన బిల్లు తీసుకొచ్చింది. దారుణమని తెలిసి టీడీపీ, బీజేపీ నేతలు మద్దతిచ్చారు. మన రాష్ట్రంతో ఆడుకున్నారు. కొన్ని రోజుల్లో పదవి దిగిపోయే ప్రధాని ఓ లెటర్ చదివి వినిపించారు. ఆ లేఖలో అంశాలు కనీసం బిల్లులోకి రాలేదు. హైదరాబాదును సీమాంధ్ర నుంచి వేరు చేశారు. కొత్త రాజధానికి ఇంత డబ్బు ఇస్తామని చెప్పలేదు. హైదరాబాదు నుంచే 75 శాతం వ్యాట్‌తోపాటు రాష్ర్ట ఆదాయంలో 60 శాతానికి పైగా అక్కడి నుంచే వస్తుంది. అలాంటి హైదరాబాద్‌ను మనకు కాకుండా చేశారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అది ఏరకంగా ఉంటుందో? దాని ప్రయోజనాలేంటి? ఎన్ని సంవత్సరాలు ఉంటుందో స్పష్టంగా చెప్పలేదు’’ అని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా, కేంద్రం దిగివచ్చేలా, మనకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చేలా ఏకపక్షంగా తీర్పు ఉండబోతోందన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్ కోసం ఎవరు పాటుపడతారో వారికే కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ మద్దతు

పులివెందులలో ఓటేసిన జగన్
 150 సీట్లు వస్తాయి: భారతి, షర్మిల
 
 పులివెందుల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందుల బాకరాపురంలోని 124 పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, విశాఖపట్టణం ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్‌ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ తదితరుల కుటుంబ సభ్యులు క్యూలో నిలబడి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల, వైఎస్ భారతి తమను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. వైఎస్‌ఆర్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, 150 సీట్లు వస్తాయని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రజలు కూడా ఇతర పార్టీలకు బుద్ధి చెప్పాలని ఎంతో కసిగా ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పిల్లల భవిష్యత్ కోసం ఎవరు పాటుపడతారో వారికే కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ మద్దతు ఇస్తుందన్నారు.

పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 స్థానాలు
 జగన్ సీఎం అవడం ఖాయం: మైసూరారెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ 25 లోక్‌సభ స్థానాలను, కనీసం 140 అసెంబ్లీ సీట్లను గెల్చుకుంటుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ నేతలు పి.ఎన్.వి.ప్రసాద్, కె.శివకుమార్, చల్లా మధుసూదనరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు చారిత్రకమైనవని, పోలింగ్ సరళినిబట్టి రాష్ట్రవ్యాప్తంగా జగన్ పవనాలు వీస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పా రు. టీడీపీ నేతలు జనంలోకి వెళ్లినా వారికి స్పందన కరవైం దని, అందుకే చేతులెత్తేసి ఎన్నికల కమిషన్ అధికారులతో వాదులాటకు దిగుతున్నారని, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల  తీరునుబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు ఖాయమైందనే విషయం వెల్లడవుతోందన్నారు. 25 లోక్‌సభ స్థానాలను గెల్చుకుని కేంద్రంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ చక్రం తిప్పుతుందని చెప్పారు.  
 
 పోలింగ్ సరళితో చేతులెత్తేసిన టీడీపీ: గట్టు
 
 సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సరళి చూసిన తర్వాత టీడీపీ చేతులెత్తేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఓటమిని ముందే అంగీకరించిన ఆ పార్టీ నాయకులు ముఖం చాటేశారన్నారు. ఓటమికి గల కారణాలను బీజేపీ, పవన్‌కల్యాణ్‌పై నెట్టే పనిలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని గట్టు ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తీవ్ర ఒత్తిడికి లోనైన టీడీపీ నేతలు ఆఖరికి ఎన్నికల అధికారులపై దుర్భాషలాడుతూ దాడులకు దిగారన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఈసీ పట్ల వ్యవహరించిన తీరును స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తీవ్రంగా తప్పుబట్టడాన్ని చూస్తే వారి నైజం బయటపడిందన్నారు.
 
 ఓటమిని ఒప్పుకున్న టీడీపీ: వాసిరెడ్డి పద్మ
 
 సాక్షి, హైదరాబాద్: పోలింగ్ పూర్తవకముందే టీడీపీ ఓటమిని అంగీకరించిందని, అందువల్లే వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఎల్లో మీడియా ద్వారా పోలింగ్ రోజున కూడా దుష్ర్పచారం చేయించిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు.

జగన్ ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ

Written By news on Wednesday, May 7, 2014 | 5/07/2014

జగన్ ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ
విశాఖపట్నం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజలందరూ తమ గుండెల్లో ఉంచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్‌ఆర్ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై ప్రజలకు నమ్మకం కలిగిందని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి లేని లోటును జగన్ తీరుస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారని అన్నారు.

విలువలకు, విశ్వసనీయతకే ప్రజలందరూ ఓటేశారని విజయమ్మ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసాన్ని ఇమె వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

పూర్తి మెజారిటీ సాధిస్తాం: వైఎస్ జగన్

పూర్తి మెజారిటీ సాధిస్తాం: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
పులివెందుల: సీమాంధ్రలో తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. సీమాంధ్రలో వచ్చే ప్రజా తీర్పు కెరటంలా ఉంటుందని అన్నారు. సీమాంధ్రలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాలుగున్నరేళ్లుగా తనతో పాటు నడిచిన వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. దేవుడి దయ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అన్నారు.
 
ఈ సారి భారీ పోలింగ్ బాగా జరిగిందన్నారు. 75 శాతానికి పైగా ఓటింగ్ జరగడం హర్షణీయమన్నారు. తెలుగు జాతి పౌరుషం నిలబెట్టుకోవాలని, అలాంటివారినే గెలిపించాలని తాను కోరినట్టు చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ దారుణంగా విభజించిందని గుర్తు చేశారు. బీజేపీ, టీడీపీ కూడా విభజనను సమర్థించాయన్నారు. సీమాంధ్రకు అన్ని రకాలుగా అన్యాయం జరిగిందన్నారు. ఏ విషయంలోనూ కేంద్రానికి స్పష్టత లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను అసలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. దీన్ని సీమాంధ్ర ప్రజలు కూడా గుర్తించారని అందుకే ఏకపక్షంగా తీర్పునివ్వబోతున్నారని జగన్ చెప్పారు. కేంద్రమే దిగివచ్చేలా ప్రజలు తీర్పు ఉంటుందన్నారు.

జమ్మలమడుగులో ఎన్నికల నియమావళిని టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి అతిక్రమించారని, దాన్ని ప్రశ్నించినందుకే తమ వారిపై దాడి చేశారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనపై ఈనాడు ఎంతో దుష్ప్రచారం చేసిందని, ఎందరో కక్ష కట్టి వేధించారన్నారు. అందరితో పోరాటం చేశానని చెప్పారు. ఇంత మందితో పోరాటం చేశానంటే తనకు దేవుడు, ప్రజలు అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే వారితోనే తమ పొత్తు ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం

సీమాంధ్రలో పోలింగ్ ముగిసింది: భన్వర్ లాల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ వెల్లడించారు. పోలింగ్ గడువు సాయంత్రం 6.00 గంటల్లోగా క్యూ లైన్ లో ఉన్నవారందరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.బుధవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 5 గంటల వరకు 71.09 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.
 
కొద్దిపాటి చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. మే 16వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ

'అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఎం. వి. మైసూరారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో మైసూరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలలో తమ పార్టీని సీమాంధ్ర ప్రజలు ఆదరించారన్నారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఏకపక్షంగా ఓటు వేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీని ఆదరించిన ప్రజలకు మైసూరా రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
 
ఎన్నికల్లో తమ పార్టీ140 సీట్లు కైవసం చేసుకుంటుందని పార్టీ సంస్థాగత ఎగ్జిట్ పోల్ లో తేలిందని చెప్పారు.  25 లోక్ సభ సీట్లు గెలిచి కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ కేంద్రంలో చక్రం తిప్పబోతోందని అన్నారు. టీడీపీ నేతలకు జనస్పందన లేక చేతులెత్తేసి భౌతిక దాడులకు దిగారని మైసూరా ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. అందుకు సాక్షాత్తు ఈసీని కూడా బెదిరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని విమర్శించారు.సీమాంధ్రలో బుధవారం అటు లోక్ సభ ఇటు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా మైసూరా రెడ్డి విలేకర్లతో పై విధంగా మాట్లాడారు.

సీమాంధ్రలో జగన్ బలమైన శక్తి..ఎదుర్కోవడం కష్టం: అంగీకరించిన బీజేపీ నేత..!!

YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy
సాధారణంగా వోటింగ్ ప్రారంభం కాగానే ఏ పార్టీపై వైపు ‘గాలి’ వీస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే చేస్తున్నట్టుగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమపై దాడులకు దిగుతోందని, అక్రమాలు చేస్తోందని ఆరోపణలు చేయడం, మరోవైపు ఎన్నికల ప్రధాన అధికారి సంపత్ ను కలిసి ఫిర్యాదు కూడా చేయడం, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ భన్వర్  లాల్ పై చిందులు వేయడం, ఇక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రజలకు బహిరంగ లేఖనే రాయడం చూస్తుంటే ఓడిపోతామని పక్కా సమాచారం వారికి వచ్చి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నాయకుల పరిస్తితి అలా ఉంటే, బీజేపీ నాయకులు కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదమేనని అంగీకరిస్తున్నారని ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక సంచలన కధనం ప్రసారం చేసింది. ఆ పత్రికతో బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో చాలా బలంగా ఉన్నాడని, అయన పార్టీ అధికారంలో రావడం ఖాయంగా కనిపిస్తోందని అంగీకరించారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు, జగన్ ను ఎదుర్కోలేకపోయాడని కూడా ఆ నేత చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

http://telugu.hydfirst.com/bjp-leader-confesses-ys-jagan-is-strong-in-seemandhra/

పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి

పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి
కడప : ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌కు పోలీసులే ఆటంకాలు సృష్టిస్తున్నారని కడప లోక్సభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అసలు పోలింగ్ అధికారి అనుమతి లేకుండా పోలింగ్ బూత్లోకి ఏఎస్పీ ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు.

జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ను బూత్ నుంచి బయటకు లాగి మరీ ఏఎస్ఐ కొట్టడంపై ఆయన స్పందించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని ఎన్నికల కమిషన్కు వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి

పోలీసులే ఆటంకం సృష్టిస్తున్నారు: వైఎస్ అవినాష్ రెడ్డి
కడప : ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌కు పోలీసులే ఆటంకాలు సృష్టిస్తున్నారని కడప లోక్సభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అసలు పోలింగ్ అధికారి అనుమతి లేకుండా పోలింగ్ బూత్లోకి ఏఎస్పీ ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు.

జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ను బూత్ నుంచి బయటకు లాగి మరీ ఏఎస్ఐ కొట్టడంపై ఆయన స్పందించారు. ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని ఎన్నికల కమిషన్కు వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

టీడీపీ ఓటమిని అంగీకరించినట్టుగా ఉంది

'టీడీపీ ఓటమిని అంగీకరించినట్టుగా ఉంది'
హైదరాబాద్: ఓటింగ్ పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ ఓటమి అంగీకరించినట్లుగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ నిరాధార ఆరోపణలు చేస్తూ టీడీపీ ఓటమిని  ఒప్పుకుందని చెప్పడానికి నిదర్శనమన్నారు.
 
విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నది టీడీపీయేనని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు కుడి, ఎడమగా నిలుచుంది లిక్కర్ సిండికేట్లనని, లిక్కర్ మాఫియా చంద్రబాబుకు నీడలా ఉందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజలు చంద్రబాబుకు తమ ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు.

 

జనాలతో ఆడుకుంటారా?

జనాలతో ఆడుకుంటారా?వైఎస్ షర్మిల
పులివెందుల: తమ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తూ జనాలతో ఆడుకుంటారా? అని  సబ్బం హరిని ఉద్దేశించి వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ ఉదయం ఆమె తన వదిన భారతితో కలసి పులివెందులలో ఓటు వేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి రాష్ట్రం విడిపోదని చెబుతూ వచ్చారని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఆ తరువాత క్లీన్ బౌల్డ్ అయి చెప్పుల పార్టీ ఒకటి పెట్టారన్నారు.

 వారికి విశ్వసనీయతలేదని, అందుకే సబ్బం హరి పోటీ నుంచి విరమించుకొని బిజెపికి మద్దతు అంటున్నరని విమర్శించారు. బిజెపి లేకపోతే టిడిపికి మద్దతు అంటారు. ఏమనుకుంటున్నారు వారు? జనంతో ఆడుకుంటారా? అని మండిపడ్డారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు.

జనం స్పందన బ్రహ్మాండంగా ఉందన్నారు. రాజశేఖర రెడ్డి గారిలో విశ్వసనీయతను చూశారు. అదే విశ్వసనీయతను జగన్మోహన రెడ్డిలో చూస్తున్నారని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వందమందిని వేసుకొచ్చినా ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. జనం ఆయనను నమ్మరని చెప్పారు.  ఓటర్లు చాలా కసిగా ఉన్నారని, వారు కసిగా ఓటువేస్తారని చెప్పారు.

తెలుగుదేశం వారి వద్ద గొట్టం పెడితే 175 స్థానాలు తమవే అంటారు.

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్ లాల్

సీఎం రమేష్.. పద్ధతి మార్చుకోండి: భన్వర్ లాల్
హైదరాబాద్ : ఓడిపోతున్నామన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నామో కూడా వారికి తెలియట్లేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అమర్యాదగా ప్రవర్తించారు. తన నోటి దురుసును ప్రదర్శించారు. దీంతో భన్వర్ లాల్ నొచ్చుకుని, రమేష్ ను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఇలాగే ఉంటారా అంటూ తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

పక్కగ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు స్టే ఇస్తే మీరేం చేస్తున్నారంటూ భన్వర్‌లాల్‌ను సీఎం రమేష్‌ ప్రశ్నించారు. అయితే, హైకోర్టు తీర్పు తన పరిధిలోకి రాదని ఆయనకు భన్వర్‌లాల్‌ చెప్పారు. అంతేకాక, మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదని, పద్దతి మార్చుకోవాలంటూ సీఎం రమేష్‌ను భన్వర్ లాల్ హెచ్చరించారు.

నాయకుడి నాలుగేళ్ల పోరాటానికి మన సాయం నేడు!

సత్యమేవ జయతే! సోనియా గాంధి నియంతృత్వానికి ఎల్లలు లేవు, చంద్రబాబు అధికార యావకి పొత్తులు చాలవు, యెల్లో మీడియా దుష్ప్రచారానికి హద్దులు లేవు, పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్క లేదు, అంబాని సోదరుల కేజీ బేసిన్ మీదున్న ఆశకి అంతే లేదు! వీరందరికి ఎదురు నిలిచి పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయమే లేదు! తెలుగుజాతి గర్వపడే పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి మీద దేశ విదేశాల్లోని పచ్చ జాతి చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డు అదుపు లేదు. అబద్ధాలని నిజాలుగా అలవోకగా చలామణీ చేస్తారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. జగన్ కాంగ్రేసుని వీడి బయటకపోయి పార్టీ పెట్టగానే, సోనియా గాంధీ ప్రభుత్వ విచారణా సంస్థలని వాడుకుని అన్యాయంగా కేసులు పెట్టి జైలుకి పంపి, విచ్చలవిడిగా మల్టిపుల్ చార్జుషీట్లు వేసి 90 రోజుల్లో ఇవ్వాల్సిన బెయిల్ 16 నెలలుగా ఇవ్వకపోవడం రాజకీయ కుమ్మక్కుతోనేనని, ప్రజాక్షేత్రంలో ఆ దృఢమైన నాయకుడిని ఎదుర్కోలేక పోవడమేనని రాష్ట్ర ప్రజలందరికీ ఎరుకైన విషయమే అయినా ఈ పచ్చజాతి మేధావులకి మాత్రం పట్టదు, రాజ్యాంగానికి జరుగతున్న అపచారాన్ని ప్రశ్నించరు ఎందుకంటే వాళ్లకి కావాల్సింది వారి వర్గానికి అధికారం రావడమే ఎన్ని వ్యవస్థలు నాశనమయినా! వారు పట్టిన కుందేలుకి రెండే కాళ్ళు! వాళ్ళ కుమ్మక్కు నాయకుడు చంద్రబాబులా కాకుండా జగన్ కాంగ్రెసుని, సోనియా గాంధిని ఎదుర్కుని పోరాటం చెయ్యడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారత దేశం లోనే కానరాదన్న సంగతి ఈ మేధావులకి తెలీదంటే విడ్డూరం. సిబిఐ కేసులు అనగానే తోక ముడిచి కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్న మన రాష్ట్ర, ఇతర రాష్ట్రాల నాయకులను ఎంతో మందిని ఇప్పటికీ చూస్తున్నాము. జగన్ ఒక్కడే ధైర్యంగా నా ఆస్తులు మొత్తం పోయినా, నన్ను జైల్లో పెట్టినా నేను ఇచ్చిన మాటను తప్పను, మాట తప్పని మడమ తిప్పని నాయకుడిని నేను అని సగర్వంగా ప్రకటించుకుని, ఇచ్చిన మాటకు కట్టుబడి జైలుకు కూడా ధైర్యంగా వెళ్లి జైల్లో ఎన్ని రోజులుంటాడో కూడా తనకే తెలియని పరిస్థితుల్లో తన పార్టీ నాయకులకు, తన అభిమానులకి, ప్రజలకి ధైర్యం చెపుతూ వచ్చారు. ఇలాంటి నాయకుడు మన నాయకుడు కావడం ఆంధ్ర ప్రదేశ్ అదృష్టం. రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్లిష్ట పరిస్థితుల నుంచి జగన్ ఒక్కడే బయట పడేయగలడని ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలు అయ్యే శుభదినం నేడు!
పదహారు నెలల తరవాత క్విడ్ ప్రో కో లేదన్నది సిబిఐ. ఆధారాలేమి దొరక లేదన్నది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చెయ్యలేదు కాబట్టి, ఆయన సంపాదించుకున్నది చాలామంది తెలివైన వ్యాపారవేత్తలు సంపాదించుకున్నంతే. ఆ సమయంలో వచ్చిన అవకాశాలతో చాలా మంది మన కళ్ళముందే కోట్లకి కోట్లు సంపాదించిన వైనం మనకి తెలుసు. క్విడ్ ప్రో కో జరిగింది, జగన్ లక్ష కోట్లు అవినీతితో సంపాదించాడని వండి వార్చిన యెల్లో మీడియా నోర్లు అయితే పనిచేస్తున్నాయి కాని ఇంతవరకు ఏ ఆధారాన్ని చూపించ లేదు, ఎందుకంటే ఏ ఆధారాలు లేవు కాబట్టి. కోర్టులను ప్రభావితం చేసే విధంగా ప్రాచారం చేసి, కోర్టులను పక్క దోవ పట్టించి రాష్ట్ర దేశ ప్రజల సమయాన్ని వృధా చేసిన చంద్రబాబు, యెల్లో మీడియా మీదే సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది! అక్రమంగా ఏ సాక్ష్యాలు లేకుండా విలువైన 16 నెలల సమయం కోల్పోయిన జగన్మోహన రెడ్డి గారికి ఏ విధంగా లెక్కగట్టి తిరిగి చెల్లించుకోగలరు ఈ సిబిఐ, ఈ రాజకీయ కుమ్మక్కు నాయకులు? కాని, అన్నిటికన్నా మనందరం గుర్తించిన విషయమేమంటే అక్రమ నిర్భందం చేసినా జగన్ మానసికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏ మాత్రం చెక్కు చెదరలేదు సరికదా ఇంకా దృఢమైన నాయకుడిగా తయారయ్యారు!
ఒక వర్గానికి దన్నుగా నిలిచే మీడియా వైఎస్సార్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డిపై ఏ చిన్న వివాదం పైనైనా ఏకంగా 14 న్యూస్ చానళ్ల కెమెరాలు ఎక్కుపెడతాయి. అవకాశం దొరికితే చీల్చి చెండడతాయి. అదే వైఎస్సార్ కాంగ్రెసుకుండే అనుకూల పరిస్థితి గురించి మాత్రం ఏ ఒక్క ఛానల్ కూడా ప్రసారం చేయదు. తాము మద్దతిచ్చే పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతున్నా ఆ పార్టీని వెనకేసురావడానికి, వెలిగిపోతోంది అంటూ అనుకూల సర్వేలను ప్రచారంలోకి తీసుకురావడానికి మాత్రం ముందుంటుంది! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఈ మీడియా టార్గెట్ చేస్తోంది. అక్కడికీ సాక్షి పేపర్, సాక్షి టీవీ చానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఉన్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందని కూడా రాష్ట్ర, దేశ ప్రజలకు తెలిసేది కాదు. అయినా జగన్మోహన్ రెడ్డి తరపున సాక్షి ఒంటరిపోరాటం చేస్తోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెసులో చీమ చిటుక్కుమన్నా 14 న్యూస్ చానళ్లు, రెండు పెద్ద పత్రికలు నానా హైరానా చేస్తాయి. ఒకవేళ నామినేషన్ల కోలహాలంలోనూ, బీజేపీతో పొత్తు వ్యవహారంలోనూ తెలుగుదేశం పార్టీలో రేగిన వివాదాల వంటి వివాదాలే వైఎస్సార్ కాంగ్రెసులో గనుక రేగి ఉంటే నిజంగా వైకాపా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తెలుగుదేశం నేతల మధ్య విభేదాలున్నట్టుగా, తెలుగుదేశం నేతలు తన్నుకొన్నట్టుగా వైకాపా వాళ్లు తన్నుకొని ఉంటే వైఎస్సార్ కాంగ్రెసును మరో ప్రజారాజ్యం పార్టీలా చూపించేది ఈ మీడియా. జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండి అభ్యర్థులను ప్రకటించుకొని రెబల్స్ పోటు లేకుండా చేసుకొన్నాడు. జగన్మోహన్ రెడ్డిలో ఇలాంటి టాలెంట్ లేకపోతే ఈ మీడియా చేతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలి అయ్యేది. ఈ మీడియాకు మొత్తం ఇప్పుడు వైకాపాలోని లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి అనుకూలంశాల గురించి మాత్రం ఈ మీడియా ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదు. అంతదాకా ఎందుకు శోభా నాగిరెడ్డి అంత్యక్రియలకి జగన్, విజయమ్మ, షర్మిల, భారతి - నలుగురు తమ అత్యంత ముఖ్యమైన ప్రచారాన్ని మధ్యలో వదిలేసి రెండు రోజుల పాటు సమయాన్ని గడిపితే, ఇదే మీడియా జగన్ కుటుంబం అంత్యక్రియలకి హాజరుకాలేదని రాసింది! లక్ష కోట్ల అవినీతని ఇంటి కప్పుల మీద నుంచి అరిచినోల్లే లక్షల కోట్ల అవినీతి చేసారు. ఉదాహరణలు రామోజీరావు, చంద్రబాబు, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, సిఎం రమేష్, ఇంకా చాలా తెలుగుదేశం నాయకులు. ఈ రోజు విజయవాడ సిద్ధార్థ కాలేజీలో పట్టుబడిన డబ్బే దీనికి సాక్షం. కాని, ఈ పచ్చ మేధావులకి ఇది అసలే పట్టదు! మీడియా అనుకూలంగా నిలిచినంత మాత్రాన పార్టీలు గెలిచేస్తాయని చెప్పడానికి లేదు. దీనికి గతంలోని అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెసుకి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది!
ప్రజా వ్యతిరేక శక్తుల కుట్రలు, కుతంత్రాలు ఇక ఆగిపోతాయి అని అనుకోవడం ఎండమావుల్లో నీళ్ళు వెదుక్కోవడమే. వైఎస్సార్, జగన్ అభిమానులు విశ్రాంతి తీసుకోకుండా ఇంకా శ్రమించాల్సి వుంటుది. ఐదున్నర లక్షల మెజారిటీతో అఖండ విజయం సాధించిన, రాబోయే ఎన్నికల్లో మిగిలిన పార్టీలను తుడిచిపెట్టగల ఒక రాజకీయ పక్ష నాయకుడిని, ఒక ప్రజానాయకుడిని జైల్లో వేయడం ఒక ఎత్తైతే అదే జననేతని ఎదుర్కోలేక ఒక రాష్ట్రాన్ని విడదీయడానికి కూడా వెనుకాడని దృష్ట రాజకీయ వ్యవస్త ఉన్నంత వరకు, ఆ వ్యవస్థని ఎల్ల వేలలా కాపాడటానికి నడుం కట్టిన ప్రజాస్వామ్య నాలగవ స్థంభం అయిన మీడియా ఉన్నంత వరకు వైఎస్సార్ అభిమానుల పోరాటం ఆగదు! ఇక చంద్రబాబు, యెల్లో మీడియా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. వైఎస్సార్, జగన్ మీద అర్ధం పర్ధం లేని అవినీతి ఆరోపణలు చెయ్యకుండా, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఉంటే ఈ రోజు వారికి పవన్ కళ్యాణ్, మోడీల మద్దతు కోసం నీఛానికి దిగజారే దుస్థితి వచ్చేది కాదు. ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయి వారి ఆస్థిత్వాన్నే కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇదీ చంద్రబాబు 30 యేల్ల వ్యూహ నైపుణ్యం! ఏ విధంగా చూసినా చంద్రబాబు అనే వ్యక్తి ఒక మామూలు నాయకుడు. అతనేమి వీరుడు, శూరుడు కాడు. అతనొక అహంకార, విలువలులేని, అల్ప అర్భక నేత! ఒక వర్గపు మీడియా ప్రచారంతో ఊదరకొట్టి ప్రజలని మభ్యపెట్టిందే గాని అంతక మించి ఒక్క అణా ఎత్తు కూడా ఎక్కువ కాదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అధికార పక్షమైన కాంగ్రెస్తో కుమ్మక్కై నీతిబాహ్యంగా కుట్రలు చేసి ఒక ప్రజా నాయకుడిని కారాగారం పాలు చేసి, ఎన్నో కష్టాలు పెట్టి ఈ రోజు ఏ భేషిజం లేకుండా మాట్లాడగలిగే ఒక నీతి లేని రాజకీయ వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబుని, ఆయన్ని సమర్ధిస్తున్న మీడియాని చూస్తుంటే ప్రజలకి విస్మయం కలుగుతున్నది! దీన్ని బట్టి అర్ధమయ్యేదేంటంటే ఒకరు రాజకీయం ఊపిరిగా బ్రతుకుతుంటే, ఇంకొకరు ప్రజలకి సమర్ధవంతమైన నాయకత్వం వహిస్తున్నారు. ఆ సమర్ధ నాయకుడు అక్షరాలా దృఢమైన నాయకుడు - వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
జాబు కావాలంటే బాబు కావాలి అనే నినాదమిస్తున్న చంద్రబాబే మన రాష్ట్రంలోని ఎక్కువ ఉద్యోగాలు తొలిగించింది.  భద్రత కావాలంటే బాబు కావాలనే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది స్వయానా ఆయనే ముఖ్యమంత్రి అలిపిరిలో ఆయన కిందే బాంబు పెట్టినప్పుడు! ఏ చంద్రబాబుని హై టెక్ ముఖ్యమంత్రి అంటారో, ఆయన కాలంలోనే ఐటీ ప్రగతి మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది! సైబర్ టవర్స్ కట్టడంలో జరిగిన కుంభకోణాలకి అంతే లేదు. రాష్ట్ర నిర్మాణానికి బాబే కావాలనేవాళ్లకి ఈయన నిర్మించిన ప్రాజెక్టులు చూపించాడానికేమీ కనబడవు, ఎందుకంటే సైబర్ టవర్ తోబాటు ఎల్ అండ్ టీ కట్టిన ఎన్టీఆర్ భవన్ మాత్రమె ఉంది కాబట్టి. మోడీ ప్రధానమంత్రి అయితే మేము ప్రక్కనుండి నిధులు తెస్తాం అనే వాళ్లకి కనీసం ఐదన్నా ఎంపీలు ఉండాలి కదా? అవే లేనప్పుడు వీళ్ళకేమాత్రం విలువిస్తాడు మోడీ?
నమ్మిన సిద్ధాంతాల కోసం అవిశ్రాంతంగా, అహర్నిశలూ పోరాటం చేసి, పొత్తులు కోసం అర్రులు చాచకుండా, చావైనా రేవైనా అన్నట్టు మొత్తం శత్రువులు సంఘటితంగా వచ్చినా వెన్నుచూపని వైఎస్ జగన్మోహన్ రెడ్డే అసలు, సిసలు నాయకుడు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు మీద నమ్మకమున్న, పేద ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండగలిగిన,  ప్రజల సంక్షేమంలో రాష్ట్ర నిర్మాణంలో తను ఇచ్చిన హామీలకోసం ఎందాకైనా నడవగలిగేది ఒక్క జగనే! ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది మనకి!
- గురవా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అమెరికా
- See more at: http://telugu.greatandhra.com/politics/political-news/nayakudi-nalugella-porataniki-mana-sayam-nedu-52476.html#sthash.JrI3DYVM.dpuf

150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతి

150 సీట్లకుపైగా గెలుస్తాం: వైఎస్ భారతివీడియోకి క్లిక్ చేయండి
పులివెందుల : సీమాంధ్రలో 150 సీట్లకు పైగా గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి  ధీమా చేశారు. బుధవారం ఆమె  పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైఎస్ భారతితో పాటు వైఎష్ షర్మిల కూడా ఉన్నారు.

50 కోట్ల టీడీపీ డబ్బు దొరికింది!

50 కోట్ల టీడీపీ డబ్బు దొరికింది!
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ బరితెగించేసింది. ప్రచారంలోనే చేతులెత్తేసిన తెలుగుదేశం ఆఖరి క్షణాల్లో డబ్బును, మద్యాన్నే నమ్ముకుని సోమ, మంగళ వారాల్లో చెలరేగిపోయింది. విజయవాడ సిద్ధార్థ అకాడమీ కేంద్రంగా కోట్ల రూపాయల డంప్ బయటపడింది. పోలింగ్ సిబ్బంది తమ సామగ్రి, పరికరాల్ని ఉంచటానికి వినియోగిస్తున్న ప్రాంతాన్ని టీడీపీ డబ్బుల పంపిణీకి ఎంచుకోవటంతో వారం రోజులుగా ఇక్కడి నుంచి నాలుగు జిల్లాలకు డబ్బు పంపిణీ యథేచ్చగా సాగిపోయింది. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం కూడా కోట్ల రూపాయలు తరలిపోవటంతో చివరకు పోలీసులు దాడి చేయటంతో తెలుగుదేశం గూడుపుఠానీ బయటపడింది. అప్పటికే దాదాపు 50 కోట్ల వరకూ తరలించేసినా... ఇంకా రూ.50 కోట్ల వరకూ అక్కడ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే సాయంత్రమే వ్యవహారం బయటకు పొక్కినా విలేకరులను గానీ, ఫోటోగ్రాఫర్లను గానీ పోలీసులు లోపలకు రానివ్వలేదు.
 
 దాదాపు కోట మాదిరిగా ఉండే అకాడమీలోకి అనుమతి లేనివారెవరూ వెళ్లే అవకాశం కూడా లేదు. దీంతో మొదటి అంతస్తులోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో టీడీపీ ఈ సొమ్మును భద్రపరిచింది. మంగళవారం సాయంత్రం నుంచి మీడియా ప్రతినిధుల్ని ఆ అంతస్తులోనికి వెళ్లనీయకుండా అకాడమీ సెక్యూరిటీ అడ్డుకున్నారు. తొలుత రూ.2.5 కోట్లు దొరికిందని తనిఖీ చేస్తున్న సిబ్బంది చెప్పగా, ఆ తరువాత రూ.4 కోట్లకు పెంచారు. అర్ధరాత్రి దాటిన తరువాత ‘‘రూ.6 కోట్ల వరకు లెక్కించాం. ఇంకా చాలా కట్టలున్నాయి. బుధవారం చూస్తాం’’ అంటూ చెప్పి వెళ్లిపోవడం విశేషం. విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ సొమ్ము అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో లాకర్ ఉందని, రూ.50 కోట్ల వరకూ ఉన్న ఈ మొత్తాన్ని తీయటానికి అకాడమీ యాజమాన్యం అంగీకరిచడం లేదని తెలిసింది. మరోవంక తమ పార్టీకి చెందిన అంతమొత్తం ఒకేసారి దొరికిపోవటంతో దాన్ని విడిపించుకునేందుకు టీడీపీ రాష్ట్రస్థాయి నాయకులు అధికారులతో బేరసారాలు సాగిస్తున్నారు.
 
 ఇక్కడి నుంచే జిల్లాలకు: పోలింగ్ పరికరాలు, సామగ్రి ఉంచటానికి, సరఫరా చేయటానికి ఎన్నికల సిబ్బంది ఈ అకాడమీని వినియోగిస్తున్నారు. దాన్ని అదనుగా తీసుకుని కొన్ని రోజులుగా టీడీపీ ఇక్కడ వందల కోట్ల రూపాయలను దాచి తరలించినట్లు మంగళవారం నాటి సంఘటనతో బయటపడింది. ఇప్పటికే సుమారు రూ.50 కోట్లకు పైగా మొత్తాన్ని చుట్టుపక్కలున్న ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తరలించారని కూడా తెలిసింది. దీన్నంతటినీ సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో కలిసి టీడీపీ కృష్ణా జిల్లా వ్యవహారాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సుజనా చౌదరి పర్యవేక్షించారని, మంగళవారం ఉదయం నుంచి ఆయన కూడా పత్తాలేరని సమాచారం. నిజానికి మూడు రోజులుగా ఎక్కడ పర్యట చేస్తున్నా చంద్రబాబు రోజూ విజయవాడ వచ్చి పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని చంద్రబాబు విజయవాడ వచ్చి సుజనా చౌదరి ఎక్కువగా ఉండే హోటల్‌లోనే బస చేశారు. ఆదివారం ఉదయం పార్టీ నేతలతో కొద్దిసేపు ఆర్థిక లావాదేవీలు మాట్లాడాకా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఎన్నికల ప్రచారానికి ఆఖరు రోజు కావడంతో ఆ రోజు కృష్ణాజిల్లా అవనిగడ్డ పర్యటనకు వచ్చి విజయవాడకు వచ్చి ఇక్కడ నాయకులతో మంతనాలు జరిపి ఇక్కడ నుంచే డబ్బు పంపిణీకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
 
 అంబులెన్స్ ద్వారా తరలింపు: విశ్వసనీయ సమాచారం మేరకు... అకాడమీలో భద్రపరిచిన సొమ్మును తొలుత టీడీపీ ముఠా తమకు అనుకూలంగా ఉన్న హాస్పటల్స్‌కు తరలించింది. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఒక రోగికి సెలైన్ ఇచ్చి పడుకోబెట్టి బెడ్ కింద డబ్బు పెట్టి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ తరలించారు. ఆసుపత్రి నుంచి రోగిని పంపుతున్నట్లుగా రిపోర్టులుండటంతో అధికారులు కూడా తనిఖీ చేయలేదు. దీంతో పచ్చనోట్లు యదేచ్ఛగాా నాలుగు జిల్లాలకు తరలిపోయాయి. కాగా మంగళవారం విషయం తెలిశాక అకాడెమీ వద్ద మీడియా ప్రతినిధులు నిఘా పెట్టారు. వారి దృష్టి మరల్చేందుకు రాత్రి 9 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశమంటూ  అన్ని చానల్స్, పేపర్ల ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికలు కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండగా విలేకర్ల సమావేశం పెట్టడం చర్చనీయమైంది. సాక్షి చాన్సల్‌లో వచ్చే వార్తలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ చెప్పేందుకే విలేకర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పడం విశేషం.
 
 సుజనా చౌదరిని అరెస్టు చేయండి
 ఆ అకాడమీపై తక్షణం చర్య తీసుకోండి: వైఎస్సార్ కాంగ్రెస్
 
 విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ఎన్నికల అధికారులకు పట్టుబడిన డబ్బుకు సంబంధించి టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. సుజనా చౌదరి మనీ లాండరింగ్ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు తరలించారని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని తమ ఫిర్యాదులో పార్టీ పేర్కొంది. సొమ్మును దాచిన అకాడమీ దీనికి బాధ్యత వహించాలని, అకాడమీపై కూడా చర్య తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Popular Posts

Topics :