11 May 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

కేవలం 1.96 శాతం ఓట్లే తేడా!

Written By news on Saturday, May 17, 2014 | 5/17/2014

ఆంధ్ర ప్రదేశ్ లో మెజార్టీ సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమికి, ఆ తరువాతి స్థానంలో నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓటింగ్ శాతం కేవలం 1.96 శాతం. ఈ ఓట్ల శాతంతోనే టిడిపి, బిజెపి కూటమి 39 శాసనసభ స్థానాలను అదనంగా గెలుచుకుంది. ఏపిలో మొత్తం 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో టిడిపి+బిజెపి కలిపి  106 సీట్లను గెలుచుకోగా, వైఎస్ఆర్ సిపి ఒంటరిగా 67 సీట్లను గెలుచుకుంది.

ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టిడిపి+బిజెపికి కోటి 34 లక్షల 95 వేల 308 ఓట్లు పోలయ్యాయి. ఒక్క వైఎస్ఆర్ సిపికి కోటి 29 లక్షల 31 వేల 730 ఓట్లు పోలయ్యాయి. టిడిపి కూటమికి 46.86 శాతం ఓట్లు పోల్ కాగా, వైఎస్ఆర్ సిపికి 44.90 శాతం ఓట్లు పోలయ్యాయి.  అంటే1.96 శాతం ఓట్ల తేడాతో 39 సీట్లను టిడిపి కూటమి అదనంగా  గెలుచుకోగలిగింది. అయితే ఏపిలో మొత్తం పోలైన ఓట్లు, టిడిపి, బిజెపి, వైఎస్ఆర్ సిపికి పోలైన ఓట్ల వివరాలు ఎన్నికల సంఘం ప్రకటించవలసి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం ప్రకటించిన తరువాత ఈ అంకెలలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకోగా, వైఎస్ఆర్ సిపి ఒంటరిగా పోటీ చేసింది. బిజెపితో పొత్తు పెట్టుకొని టిడిపి బాగా లాభపడింది. అలాగే బిజెపి కూడా రెండు లోక్ సభ, నాలుగు శాసనసభ స్థానాలను గెలుచుకోగలిగింది. అయితే ఎన్నికల కోసం ఏర్పడిన ఈ పొత్తు ఎంత కాలం కొనసాగుతుందో వేచి చూడాలి. ఫలితాలు వెలువడిన తరువాత కూడా  వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ ప్రజలతోనే తమ పొత్తు అని చెప్పారు. ఆ పార్టీ  ఈ అయిదేళ్లు శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలిచి, వారి మెప్పు పొందుతుందని ఆశిద్దాం.

టీడీపీకి కాదు... వైఎస్ఆర్ సీపీకే గుడివాడ కంచుకోట

'టీడీపీకి కాదు... వైఎస్ఆర్ సీపీకే గుడివాడ కంచుకోట'
గుడివాడ : తనకు తుది శ్వాస ఉన్నంత వరకు గుడివాడ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంచుతానని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కొడాలి నాని స్పష్టం చేశారు. శనివారం గుడివాడలో కొడాలి నాని విలేకర్లతో మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గం టీడీపీకి ఎంత మాత్రం కంచుకోట కాదని అన్నారు. గుడివాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తానే అందుకు ఉదాహరణ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తమకు తీవ్ర అన్యాయం చేస్తుందనే భావన గుడివాడ ప్రజలలో తీవ్రంగా నాటుకుపోయిందని తెలిపారు. ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీని చూసీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెగ మురిసిపోతున్నారని  ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబుకు అధికారం వచ్చిందంటే అదంతా గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనంతోనే అన్న విషయాన్ని గమనించాలని కొడాలి నాని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడ టీడీపీకి కంచుకోట అంటూ ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని అఖండ విజయం సాధించారు. ఈ  సందర్భంగా కొడాలి నాని శనివారం విలేకర్ల సమావేశంలో టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు

‘గుడివాడ’కు రుణపడి ఉంటా

‘గుడివాడ’కు రుణపడి ఉంటా
  • వైఎస్సార్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని
 గుడివాడ, న్యూస్‌లైన్: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని వైఎస్సార్‌సీపీ గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిరావి వెంకటేశ్వరరావుపై  11573 ఓట్ల మెజార్టీతో విజయంసాధించిన అనంతరం విజయవాడలోని కౌంటింగ్ హాలువద్ద విలేకరులతో మాట్లాడారు. తనను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.  

ప్రజలిచ్చిన తీర్పు  గౌరవిస్తాం...

 
సీమాంధ్రలో తమ పార్టీకి ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్యే కొడాలినాని పేర్కొన్నారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారని చెప్పారు.  రాష్ట్రంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వాళ్ల తరఫున పోరాటం చేస్తామన్నారు.  అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.
 

‘టీడీపీ’ పైశాచికం, వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య

‘టీడీపీ’ పైశాచికం, వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య
వి.కొత్తపాలెం (కోడూరు), న్యూస్‌లైన్ : ‘పిల్లలు భయపడుతున్నారు.. కాస్త దూరంగా టపాసులు కాల్చుకోండి’ అని అభ్యర్థించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తలు పైశాచికానికి తెగబడ్డారు. బాంబు అంటించి అతని తలపై వేశారు. దీంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. మండలంలోని వి.కొత్తపాలెంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందడం, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో వి.కొత్తపాలెంలో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవం చేసుకున్నారు. టపాసులు కాలుస్తూ కొంత దూరం వెళ్లాక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రేపల్లె సురేష్ (30) టపాసులు కాల్చడం వల్ల పిల్లలు, మహిళలు భయపడుతున్నారని, కొద్దిగా దూరంగా కాల్చుకోమని కోరాడు. దీనికి ఆగ్రహించిన ఓ కార్యకర్త వంకాయ బాంబు అంటించి సురేష్ తలపై వేయడంతో తల పగిలి మెదడు బయటికొచ్చి అక్కడిక్కడే చనిపోయాడు.

ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అవనిగడ్డ డీఎస్పీ హరి రాజేంద్రబాబు హుటాహుటిన గ్రామానికి వచ్చి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. మృతునికి రెండేళ్ల క్రితమే వివాహమైంది.
 
బాంబులతో బీభత్సం

పోలీసుల కథనం ఇలా ఉండగా ప్రత్యక్ష సాక్షుల కథనం మరోలా ఉంది. విజయోత్సవం చేసుకునేందుకు కావాలనే కొంతమంది టీడీపీ నాయకులు బయట నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన బాంబులను తీసుకొచ్చారని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్రామ పంచాయతీ వైఎస్సార్‌సీపీ పాలనలో ఉండటంతో తొలుత గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోకి రాగానే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆ భవనం మీదకు బాంబులు విసిరినట్టు చెప్పారు.

ఈ పరిణామంతో కొంతమంది తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పేలిన బాంబుల అవశేషాల్లో గాజు పెంకులు, సూదులు ఉన్నాయని, వంకాయ బాంబుల్లో అయితే ఇలా ఉండవని చెబుతున్నారు. ఈ ఘటనపై మృతుని మేనమామ యలవర్తి నాగమల్లికార్జునరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన యలవర్తి వెంకటేశ్వరరావు, రేపల్లె ప్రతాప్, మరో పదిమంది అనుచరులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.

ఖమ్మం జిల్లా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా

ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా తాను సాధించిన విజయం జిల్లా ప్రజలదేనని ఖమ్మం ఎంపీగా వైఎస్‌ఆర్ సీపీ నుంచి ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ విజయం పార్టీ కార్యకర్తల కృషి ఫలితమేనని చెప్పారు. తనను గెలిపించిన జిల్లా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.

తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. 14 నెలల పాటు తాను చేసిన ఈ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రజలు తన పట్ల తిరుగులేని ఆదరణ చూపించారని, దీన్ని ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆశించిన విధంగా జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

కొన్ని శక్తులు వైఎస్సార్‌సీపీపై కక్ష కట్టి తనకు ఆశించిన  స్థాయిలో మెజారిటీ రాకుండా కుట్ర చేశాయని అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేకపోయారన్నారు. రాజన్న దీవెనలు, జగనన్న సహకారం, జిల్లా ప్రజల ఆదరణతో లోక్‌సభ సీటుతో పాటు జిల్లాలో మూడు శాసనసభ స్థానాలు గెలిచామన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని, సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. 2019లో సీమాంధ్ర, తెలంగాణలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలు తెచ్చిన కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మిథున్ అఖండ విజయం

మిథున్ అఖండ విజయం
పుంగనూరు, న్యూస్‌లైన్ : ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులను ఢీకొని రాజంపేట లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి, ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీలో దిగారు.

ఎన్నికల ప్రచారంలో పురందేశ్వరి, సాయిప్రతాప్ త మ శక్తియుక్తులు దారపోసి మిథున్‌రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారు. మిథున్‌రెడ్డి, ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చతురత ముందు ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. యువనేత మిథున్‌రెడ్డి సుమారు 1,74,762 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలో మిథున్‌రెడ్డికి 1,05,772 ఓట్లు లభించాయి.

పురందేశ్వరికి 60,674 ఓట్లు వచ్చాయి. మరో మాజీ మంత్రి సాయిప్రతాప్‌కు 4,927 ఓట్లు మాత్రమే పోలయ్యూరుు. పుంగనూరులో మిథున్‌రెడ్డికి 46,009 ఓట్ల మెజారిటీ లభించింది. నిత్యం ప్రజా సేవలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు సొంత నిధులు ఖర్చుచేస్తున్న తండ్రీతనయులను ప్రజలు ఆదరించారు. విశేష అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతటి ఘన విజయం అందించిన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


పీలేరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి ఘన విజయం వెనుక మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కీలకమైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ సీఎం కిరణ్‌ను పీలేరులో ఓడించడమే ఏకైక లక్ష్యంగా పెద్దిరెడ్డి పావులు కదిపారు.

ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన తనయుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. దీంతో చింతల 15,250 ఓట్ల ఆధిక్యతతో జేఎస్పీ అభ్యర్థి నల్లారి కిషన్‌కుమార్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు.

నల్లారి కుటుంబానికి గుర్రంకొండ మండలంలో అత్యంత విధేయుడు, మైనారిటీల్లో బలమైన నేత అయిన జమీర్‌ఆలీఖాన్‌ను వైఎస్సార్ సీపీలో చేర్చుకోవడంతో గుర్రంకొండలో ఆధిక్యతను చాటారు. అలాగే కేవీపల్లె మండల మాజీ ఉపాధ్యక్షుడు ఎం.వెంకట్రమణారెడ్డి మాజీ సీఎం కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు, మండలంలో ప్రజా బలం ఉన్న నేత. ఆయన్ను సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో కిరణ్ కోటకు బీటలు వారాయి.
 
అంతటితో ఆగని పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కిరణ్‌కు అత్యంత సన్నిహితుడైన గుడిబండ రవికుమార్‌రెడ్డిని సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారు. పీలేరు మండలంలో మాజీ ఎంపీపీ ఎం.వెంకట్రమణారెడ్డితోపాటు జాండ్ల, వేపులబైలు సర్పం చ్‌లు శ్రీనివాసులు, ఆదినారాయణలను పార్టీలో చేర్చుకున్నారు. వేపులబైలు పంచాయతీలో కీలకమైన వ్యక్తి అయిన భవనం వెంకట్రామిరెడ్డి మరికొంతమంది ప్రముఖలను పార్టీలో చేర్చుకోవడం గమనార్హం.

పీలేరు పట్టణంలో అత్యంత ప్రజాదరణ కల్గివున్న మాజీ సర్పంచ్ ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు విశేష కృషి చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి సూచనలు, ఆదేశాల మేరకు ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి పార్టీ బలోపేతం కోసం పట్టణంలో శక్తివంచనలేకుండా కృషి చేశారు. మూడన్నరేళ్లు అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారంలో మాజీ సీఎం కిరణ్ విఫలమయ్యారని పెద్దఎత్తున ప్రజలకు వివరించి అత్యధికంగా ఓట్లు రాబట్టడంలో సఫలీకృతులయ్యారు.

మరోవైపు నియోజకవర్గ పరిధిలోని కలికిరి మినహా ఐదు మండలాల్లో బలమైన పార్టీ కేడర్ ఉండడం గెలుపునకు ప్రధాన కారణమైంది. ఇటీవల వెలువడిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంతోపాటు జెడ్పీటీసీల్లో పీలేరు, కేవీపల్లె, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో విజేతలుగా నిలిచారు. మాజీ సీఎం కిరణ్ తన సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా పెద్దిరెడ్డి ఎత్తుల ముందు చిత్తుకాక తప్పలేదు. అలాగే టీడీపీ మూడో స్థానానికే పరిమితం కావడం, కాంగ్రెస్ గల్లంతు కావడంతో చింతల గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేకపోయింది.

సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ!

సీమాంధ్రలో జగన్‌దే అత్యధిక మెజారిటీ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లోని మొత్తం శాసనసభ నియోజకవర్గాల్లో అందరికన్నా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. పులివెందుల నుంచి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్‌కుమార్‌రెడ్డిపై ఏకంగా 75,243 ఓట్ల మెజారిటీ సాధించారు.
 
సీమాంధ్రలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ ఇదే! 

నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: వైఎస్ జగన్

Written By news on Friday, May 16, 2014 | 5/16/2014

నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాయంత్రం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ ప్రభంజనం, చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలను ప్రజలు నమ్మినందున తమకు ఎదురు దెబ్బ తగిలిందన్నారు.
తీర్పును మనస్పూర్తిగా అంగీకరిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. తమపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లకు జగన్ అభినందనలు తెలిపారు.

అయిదేళ్లలో మళ్లీ వస్తాం
అయిదేళ్ల తర్వాత మళ్లీ తాము అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ అన్నారు. తాము ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి రాలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎంపీలు, 17మంది ఎమ్మెల్యేలకు పెరిగిందన్నారు.  ప్రస్తుతం తమ బలం 70 మంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎంపీల వరకూ పెరిగిందని జగన్ అన్నారు. మోడీ గాలి, బాబు అమలుకాని హామీలు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

మా పొత్తు ప్రజలతోనే
తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని వైఎస్ జగన్ స్ఫష్టం చేశారు. తమ పొత్తు ప్రజలతోనే అని ఆయన తెలిపారు. ప్రజల మనసులో నిలబడితే అదే పదివేలు అని జగన్ అన్నారు. ఈ అయిదేళ్లలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తాము పోరాడతామని జగన్ తెలిపారు. మళ్లీ కోలుకుని... అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు.

జిల్లా పరిషత్‌ స్థానాల్లో ఓడిపోయిన రెండు నెలల తర్వాత ......

Written By news on Thursday, May 15, 2014 | 5/15/2014

'అవే ఫలితాలు పునరావృతమవుతాయి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ అన్నారు. గతంలో గుజరాత్‌లో బీజేపీ అన్ని జిల్లా పరిషత్‌ స్థానాల్లో ఓడిపోయిన రెండు నెలల తర్వాత నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేశారు. అవే ఫలితాలు ఇక్కడ కూడా పునరావృతమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు.

ప్రజల తీర్పు మావైపే

ప్రజల తీర్పు మావైపే ఉంది: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: రేపు చారిత్రాత్మక తీర్పు రాబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని ఫలితాలు సాధిస్తుందని ఆమె దీమా వ్యక్తం చేశారు.

ప్రజల తీర్పు తమవైపే ఉందన్నారు. సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ సీపీదే విజయమని చెప్పారు. ఓటింగ్ పూర్తి కాకముందే తెలుగుదేశం పార్టీ ఓటమి అంగీకరించినట్లుగా ఉందని అంతకుముందు వ్యాఖ్యానించారు.

ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఎవరెన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ విజయదుందుభి మోగిస్తుంది

సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌ సీపీదే విజయమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో 110 పైగా అసెంబ్లీ, 17 పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ సీపీ విజయదుందుభి మోగిస్తుందని వైవీ సుబ్బారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

బెట్టింగుల కోసమేనా???

Lagadapati Bettings on YSRCP

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని ఇంటిపై రాళ్లదాడి

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని ఇంటిపై రాళ్లదాడి
కామవరపుకోట : ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచామన్న గర్వంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ సీపీ వర్గాలపై దాడులకు తెగబడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని మురారి రాజకుమారి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. చంపేస్తామని బెదిరించారు. రావికంపాడు పంచాయతీకి వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థినిగా తూర్పు యడవల్లికి చెందిన మురారి రాజకుమారి పోటీ చేశారు. ఈమెకు ప్రత్యర్థిగా వెంకటాపురానికి చెందిన కోటగిరి సామ్రాజ్యలక్ష్మి నిలబడ్డారు. ఎన్నికల్లో రాజకుమారి ఓటమి పాలయ్యారు.

ఏలూరులో కౌంటింగ్ కేంద్రం నుంచి వచ్చేసిన ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. తన భర్త వెంకటేశ్వరరావు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కింద పడేసి జెండా కర్రలతో కొట్టారని రాజకుమారి తెలిపారు. కోటగిరి కుటుంబ సభ్యులపైనే పోటీ చేస్తారా.. మీ అంతు చూస్తామంటూ బెదిరించారని ఆమె చెప్పారు. 16వ తేదీ తర్వాత మిమ్మల్ని చంపేస్తాం.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారని తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మురారి వెంకటేశ్వరరావు, రాజకుమారి దంపతులు తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేది జగనే

గుడివాడ అడ్డా అన్నవారు ఏమయ్యారు?
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేది జగనే
మహానేత వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులే గెలిపిస్తాయి
వైఎస్సార్ సీపీ గుడివాడ  ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని

 
 గుడివాడ
 టీడీపీ అడ్డా.. గుడివాడ గడ్డ అని కబుర్లు చెప్పుకున్న నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమయ్యారని వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ప్రశ్నించారు స్థానిక పార్టీ కార్యాలయంలో  ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. తమకు గుడివాడ ప్రజలతోపాటు మహానేత వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. వారి ఆశీస్సులతోనే నియోజకవర్గం పరిధిలో మున్సిపల్, జెడ్పీటీసీ,  ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు.
 సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయం సాధించడం, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తనను ఓడించడానికి ఒక వర్గం, ఒక పార్టీ నేతలు ఏకమై పనిచేశారని, వారి కుట్రలను ప్రజలు గమనించి బుద్ధిచెప్పారని అన్నారు. గుడివాడ మున్సిపాల్టీలో తమ పార్టీ అభ్యర్థులు 21 మందిని కౌన్సిలర్లుగా గెలిపించారని, మండల పరిషత్ ఎన్నికల్లో గుడివాడ రూరల్, నంది వాడ మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీలను గెలిపించారని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం ఒక్క ఎంపీటీసీ స్థానం కోల్పోయినందున చేజారిందని వివరించారు. అయితే ఎన్నికలు పూర్తయినందున అన్ని పార్టీలను కలుపుకుని అభివృద్ధికి కృషిచేస్తామని ప్రకటిం చారు.

గుడివాడలో మంచి నీటి పైపులైన్లు నిర్మాణానికి రూ.60 కోట్లు, డ్రెయినేజీ నిర్మాణానికి రూ.90 కోట్ల నిధులు అవసరం ఉందన్నారు. తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. గుడివాడ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పట్టణ సమగ్రాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. గుడివాడలో కొడాలి నాని నాయకత్వాన్ని బలపర్చిన ప్రజలు ఈ విజ యాన్ని అందించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు మేరుగు మరియకుమారి, వెంపల హైమావతి, కాటి విశాలి, చోరగుడి రవికాంత్, పార్టీ నాయకులు అడపా బాబ్జీ, గణపతి లక్ష్మణరావు, నెరుసు చింతయ్య, దుక్కిపాటి శశిభూషణ్, నెరుసు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు

సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు
- కేంద్రంలోనూ జగన్ ఆధిపత్యం
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా

 పుంగనూరు, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఫలితాలను బట్టి సీమాంధ్రలో వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టిస్తారని మాజీమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లతో పలు ప్రాంతాల్లో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ముస్లిం మైనార్టీలు పూర్తి స్థాయిలో గుణపాఠం కలిగేలా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారని తెలిపారు. ముస్లిం మైనార్టీల ఓట్లు స్థానిక సంస్థల్లో లభించిన ఓట్ల శాతం కన్నా అధికంగా వైఎస్సార్ సీపీకి లభించిందని, ఫలితంగా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గల్లంతు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సుమారు 120 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని, ఇరవైకి పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయని తెలిపారు.

జిల్లాలో కుప్పంతో సహా 14 ఎమ్మెల్యే స్థానాలు, మూడు ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజంపేట లోక్‌సభ స్థానంలో అత్యధిక మెజార్టీ సాధిస్తామని, కేంద్రంలో సైతం జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ఆధిపత్యాన్ని చాటుతారని తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌మోహన్‌రెడ్డి అవసరం ఏర్పడుతుందని తెలిపారు. త్వరలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయన్నారు.

 రాజశేఖరరెడ్డి కుటుంబంపై రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టనున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీస్సులు వైఎస్సార్ సీపీకే ఉన్నాయన్నారు. అలాంటి ప్రజలకు వైఎస్సార్ సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌ సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ సర్వే

వైఎస్సార్‌ సీపీకీ 80 నుంచి 100 సీట్లు: ఎన్డీటీవీ సర్వే
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ , టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని  ఎన్డీటీవీ సర్వే అంచనా వేసింది. సీమాంధ్రలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకే అత్యదిక స్థానాలు దక్కుతాయని ఎన్డీటీవీ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం సీమాంధ్రలో మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్సీపీకీ 80 నుంచి 100 సీట్లు దక్కనున్నాయని సర్వే పేర్కొంది. ఎంపీల విషయానికి వస్తే మొత్తం 25 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 14 సీట్లు లభించే అవకాశముందని సర్వే పేర్కొంది. 

ఎడిటోరియల్ : శభాష్ వైసీపీ

Written By news on Wednesday, May 14, 2014 | 5/14/2014

మున్సిపల్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం ప్రభంజనం వీచిందని, తెలుగుదేశం అద్భుత విజయం సాధించిందని అంటున్నారు. కానీ, ఇది వాస్తవం కాదు. నిజం చెప్పాలంటే, అద్భుత విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అరంగేట్రంలోనే ఆ పార్టీ అదరగొట్టేసింది. మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం పార్టీతో నువ్వా నేనా అన్నట్లు తలపడి ఆ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. 

పట్టణ ప్రాంతాల్లో మూడో వంతుకే పరిమితం అయినా.. పరిషత్ ఎన్నికల్లో మాత్రం పోటా పోటీగానే ఢీకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శనను సూపర్ డూపర్ హిట్ అనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీకి కూడా స్థానిక ఎన్నికల ఫలితాలు ఎందుకంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అర్థం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ప్రదర్శన ఏమంత గొప్పగా ఏమీ లేదు. అయినా ఇప్పుడు ఎందుకింతగా ఉలికిపడుతున్నారో కూడా అర్థం కాదు.

 ఉదాహరణకు, తెలుగుదేశం పార్టీ అద్భుత ప్రదర్శన చేసిందని చెబుతున్న శ్రీకాకుళం జిల్లానే తీసుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి వచ్చిన జడ్పీటీసీ సీట్లు 23. అప్పట్లో ఆ పార్టీ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2006లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుచుకన్న జడ్పీటీసీ స్థానాలు కేవలం పదంటే పది. 

ఈ ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం 22 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇక, తూర్పు గోదావరి జిల్లా విషయానికే వద్దాం. 2001లో తూర్పు గోదావరిలో తెలుగుదేశం గెలుచుకున్న జడ్పీటీసీ స్థానాలు 23. 2006 ఎన్నికల్లో ఆ జిల్లాలో గెలుచుకున్న జడ్పీటీసీలు 21. ఇప్పుడక్కడ 43 జడ్పీటీసీలను గెలుచుకుని జడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. 2001లోనూ, 2006 ఎన్నికల్లోనూ టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీకొని కూడా టీడీపీ అప్పట్లో మెరుగైన ఫలితాలనే సాధించింది. మరి, ఈ ఎన్నికల పరిస్థితిని చూద్దాం. 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా లేదు. ఆ పార్టీ టీడీపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. సరికదా.. కాంగ్రెస్ పార్టీలోని అత్యధిక శాతం నాయకులు టీడీపీలోకి వచ్చేశారు. వారంతా ఈసారి టీడీపీ తరఫున పోటీ చేశారు. అంటే.. టీడీపీ కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న పార్టీ. కాంగ్రెస్ కూడా కార్యకర్తల బలం పుష్కలంగా ఉన్న పార్టీనే. ఆ రెండు పార్టీల కార్యకర్తలూ కలిసి ఈసారి ఎన్నికల బరిలోకి టీడీపీ తరఫున దిగారు. ఆ రెండు పార్టీలూ కలిసి ఎవరితో పోటీ పడ్డాయి. 

తొలిసారిగా స్థానిక ఎన్నికల బరిలోకి దిగుతున్న, కార్యకర్తల బలం ఏమాత్రం లేని వైసీపీతో. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పిల్లకాకి. కాంగ్రెస్, టీడీపీ కలిసి ఉండేలుతో సమానం. ఉండేలు దెబ్బకు పిల్ల కాకి కకావికలం అయిపోయి ఉండాలి. కానీ, ఆ రెండింటినీ దీటుగా తట్టుకుని వైసీపీ నిలబడింది. నిలబడడమే కాదు కొన్నిచోట్ల విజయాలను కూడా సొంతం చేసుకుంది. మరొక్క విషయం జాగ్రత్తగా గమనించండి. 2001, 2006, 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు, సీట్లను గమనించండి. 

దీంతో ఒక విషయం అర్థమవుతుంది. అప్పటితో పోలిస్తే టీడీపీ బలం ఏమాత్రం పెరగలేదు. కానీ, కాంగ్రెస్ బలం జతకలవడం కారణంగానే ఇప్పుడు అద్భుత ఫలితాలు వచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మళ్లీ వాళ్ల పార్టీలోకి వెళ్లిపోతే టీడీపీ పరిస్థితి ఎప్పట్లాగే ఉంటుందన్నమాట. దీనినిబట్టి, అర్థం చేసుకోవచ్చు టీడీపీది వాపో.. బలుపో. మరో విషయం. సీమాంధ్రలో దుమ్ము దులిపేశామని టీడీపీ చంకలు గుద్దుకుంటే అంతకు మించిన పతనం ఆ పార్టీకి లేనే లేదు. 

ఎందుకంటే, సీమాంధ్రలో ఆ పార్టీ 2001 స్థానిక ఎన్నికల ఫలితాలను పునరావృతం చేసిందంతే. కానీ, తెలంగాణలో మొత్తంగా తుడిచి పెట్టుకుపోయింది. తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకోవడం ఎలా అని ఆలోచించకుండా సీమాంధ్రలో వైసీపీ కంటే పైచేయి అని సంతోషపడితే భవిష్యత్తులో టీడీపీకి ఆ కాస్త సీట్లు కూడా ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. అయితే, ఇక్కడ మరొక్క విషయం కూడా చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో కనక టీడీపీ ఈ ఫలితాలను సాధించకుండా ఉండి ఉంటే. ఈ ఎన్నికల్లో టీడీపీ సాధారణ ఫలితాలనే సాధించి ఉంటే.. ఆ పార్టీ మటాష్ అయిపోయి ఉండేది.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నిజంగా అద్భుత ఫలితాలను సాధించింది. వైసీపీ ఏర్పడిన తర్వాత ఏవో కొన్ని ఉప ఎన్నికల్లో మినహా ఆ పార్టీ నేరుగా తలపడింది లేదు. ప్రజా తీర్పు కోరింది లేదు. వైసీపీ ప్రత్యక్షంగా ప్రజా తీర్పు కోరిన తొలి ఎన్నిక మున్సిపల్ ఎన్నికగానే చెప్పుకోవచ్చు. రెండో ఎన్నిక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. దీనికితోడు ఫ్యాను గుర్తుపై జరిగిన తొలి ఎన్నికలు కూడా ఇవే. అయినా, వైసీపీ నాలుగు జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుంది.

 మిగిలిన వాటిలో ఎంతో కొంత పోటీ ఇచ్చింది. మొత్తంగా టీడీపీ 374 జడ్పీటీసీలను కైవసం చేసుకుంటే వైసీపీ 274 జడ్పీటీసీలను దక్కించుకుంది. ఎంపీటీసీల్లోనూ నువ్వా నేనా అన్నట్లు పోటీ ఇచ్చి టీడీపీ కంటే వెయ్యి తక్కువ సాధించింది. ఒకవేళ, రాష్ట్ర విభజన జరగకుండా కాంగ్రెస్ కూడా బరిలో ఉండి ఉంటే టీడీపీకి ఇన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీలు వచ్చి ఉండేవే కావు. టీడీపీకి వచ్చిన సీట్లను కాంగ్రెస్ కూడా పంచుకుని ఉండి ఉండేది. 

వైసీపీకి మాత్రం కాస్త అటూ ఇటుగా ఇవే సీట్లు వచ్చి ఉండేవి. అందువల్ల, ఏ విధంగా చూసుకున్నా వైసీపీ మంచి ఫలితాలను సాధించినట్లే కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు ఎటువంటి సంబంధం ఉండకపోయినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫలితాలను చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా వైసీపీకి జైకొట్టాయి. అయితే, చివర్లో చంద్రబాబు తన అమ్ముల పొదిలోని అస్త్రాలను ఒక్కొక్కటిగా వదిలి జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. అందుకే, అసెంబ్లీ ఫలితాలపై అందరిలోనూ అంత ఉత్కంఠ.




http://www.apherald.com/Politics/ViewArticle/56511/Muncipal-Elections-2014-YSRCP-Jagan-Sharmila-ZPTC-/

దుమ్ము దులిపిన ఫ్యాన్

దుమ్ము దులిపిన ఫ్యాన్
 గుడివాడ, న్యూస్‌లైన్ :గుడివాడ టీడీపీ కంచుకోటని గుండెలు బాదుకునే నేతలకు గుడివాడ ప్రజలు మరోమారు గుణపాఠం నేర్పారు.  మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు  రుచి చూపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో గుడివాడ టీడీపీ కంచుకోట బద్దలైంది. రెండు ఎన్నికల్లోనూ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఈఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఓడించాలనే కుట్రలతో టీడీపీతోపాటు కాంగ్రెస్ నేతలు ఏకమైనా వైఎస్సార్‌సీపీ హవాను ఏమాత్రం ఆపలేకపోయారు. ఎన్నారైలు, కార్పొరేట్ శక్తులు, ధనవంతులు ఏకమై గుడివాడలో  కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) వర్గాన్ని ఓడించాలని సర్వశక్తులు ఒడ్డినా  నిరాశే మిగిలిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రేపు అసెంబ్లీ తీర్పుతో వైఎస్సార్‌సీపీ బలం రెండింతలు పెరుగుతుందని చెబుతున్నారు.

 మున్సిపల్, పరిషత్‌లో జయకేతనం
 మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో గుడివాడ పట్టణ ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరించారు. గుడివాడ మున్సిపాల్టీలో 36 వార్డులకు గాను 21 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి స్పష్టమైన మెజార్టీ అందించారు. టీడీపీ  కేవలం 15 వార్డులతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన మండల పరిషత్ జిల్లా పరిషత్  కౌంటింగ్‌లోనూ టీడీపీని ఘోరంగా ఓడించారు. మాజీ మంత్రి పిన్నమనేని సొంత మండలం నందివాడలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు.గుడివాడ నియోజక వర్గంలో గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో 37ఎంపీ టీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాలు ఉండగా 22 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేసింది.

15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మూడు జెడ్పీటీసీ స్థానాలకు గానూ గుడివాడ రూరల్, నందివాడ మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలువగా  గుడ్లవల్లేరు మండలంలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. గుడివాడ రూరల్ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు  గెలుపొంది మండలాన్ని  చేజిక్కించుకున్నారు.   నందివాడ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గానూ ఆరుచోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. గుడివాడ, నందివాడ ఎంపీపీతోపాటు జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కేవలం గుడ్లవల్లేరు మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గానూ 7చోట్ల వైఎస్సార్‌సీపీ గెలువగా 8సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించింది. దీంతో గుడ్లవల్లేరు ఎంపీపీ, జెడ్పీటీసీ టీడీపీకి దక్కింది.

 ఆనందోత్సాహాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు...
 మండల పరిషత్ ఫలితాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా రావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు. ప్రతి రౌండులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.  కాగా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ నేతలు ఫలితాలు చూసి నీరసించారు.  ప్రజల ఆకాంక్ష మేరకు గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు.

వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమే: మైసూరారెడ్డి

వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమే: మైసూరారెడ్డి
హైదరాబాద్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. ప్రజలు.. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ-టీడీపీ మధ్య ఓట్లశాతంలో తేడా 4 మాత్రమేనని తెలిపారు. జడ్పీటీసీ-ఎంటీసీ ఎన్నికల్లో ఈ తేడా 2.9 శాతంగా ఉందన్నారు.

లోక్ సభ, శాసనస ఎన్నికల సమయానికి  రాజకీయంగా చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడపాటికి సర్వేలతో పనేంటని ప్రశ్నించారు. ఆయన సర్వేలు బెట్టింగ్ ల కోసమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి 110 నుంచి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిపారు. మొత్తం 20 పైగా ఎంపీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ సీపీకి 18 ఎంపీ స్థానాలు: నీల్సన్ సర్వే

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 18 లోక్ సభా స్థానాలను గెలుచుకుంటుందని ఏబీపీ స్టార్ నీల్సన్ సంస్థ ఎగ్జిట్ సర్వే తెలిపింది. ఈ విషయంలో ఇప్పటివరకు వచ్చిన సర్వేలు వేర్వేరుగా తమ తమ ఫలితాలు ఇచ్చినా.. గత ఎన్నికలలో కచ్చితమైన ఫలితాలను ముందుగా ఊహించిన ఏబీపీ నీల్సన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 లోక్ సభా స్థానాలు వస్తాయని తెలిపింది.

తెలుగుదేశం పార్టీకి 9 స్థానాలు, టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు మూడేసి స్థానాలు, ఇతరులకు మరో స్థానం దక్కుతాయని ఆ సర్వే పేర్కొంది. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆ సంస్థ వెల్లడించింది.

లగడపాటి సర్వే సన్నాసి సర్వే....

లగడపాటి సర్వే సన్నాసి సర్వే....వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ లగడపాటి సర్వే సన్నాసి సర్వే అని  వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వే బెట్టింగ్ ల కోసమేనని అన్నారు. ఆయన రాజకీయాలు మానేసి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని గట్టు రామచంద్రారావు విమర్శించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని లగడపాటికి తెలుసునని, అయితే బెట్టింగ్ ల ద్వారా సంపాదనే లక్ష్యంగా లగడపాటి సర్వే ఉందన్నారు. 16వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత లగడపాటి కమండలం పట్టుకుని హిమాలయాలకు వెళతారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని గట్టు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఇటువంటి సర్వేలన్ని రివర్స్ అవ్వడం ఖాయమన్నారు.

పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్

పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: పాతబస్తీలో శాంతి పరిడవిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. శాంతి సామరస్యాలు కాపాడాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో విషయంలో  సంయమనంతో వ్యవహరించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

కిషన్ బాగ్ ప్రాంతంలోని సిక్ చావ్ నీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు గాయపడ్డారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మృతులు ఇద్దరు పోలీసు కాల్పుల్లో మృతి చెందారా లేక అల్లర్లలో మృతి చెందారా అనేది పోస్టుమార్టంలో తేలుతుందని డీజీ(శాంతిభద్రతలు) వీఎస్ కే కౌముది అన్నారు. ప్రస్తుతం కిషన్ బాగ్ లో పరిస్థితి అదుపులోనే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి

ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి
* తొలిసారి ఎన్నికల్లోనే గ్రామీణ ఓటర్లలో పట్టు సాధించాం
ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై అంబటి
జనభేరీ ప్రారంభించే నాటికే స్థానిక పోరు ముగిసింది
అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు మాకు అను కూలంగా ఉంటాయి

 
 సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల బరిలో తొలిసారి రంగప్రవేశం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలపట్ల ఆ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నిర్మాణం పూర్తిగా జరక్కముందే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ గ్రామీణ ఓటర్లలో పార్టీ పట్టు సాధించడం పార్టీలో మ రింత ఆత్మస్థయిర్యాన్ని పెంచిందని తెలిపారు. సీమాం ధ్రలోని మొత్తం 653 జడ్పీటీసీల్లో 50 నుంచి 60 జడ్పీటీసీల వ్యత్యాసంతో ఏడెనిమిది జిల్లా పరిషత్‌లు వైఎస్సార్‌సీపీ చేజారాయని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేవి కావని, వీటికి సాధారణ ఎన్నికలకు ఎంతో వ్య త్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
 
 ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజులకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల వ్యత్యాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్రలో విస్తృతంగా వ్యాప్తి చెంది పుంజుకున్నదని మంగళవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశ్లేషిం చారు. మరో రెండు రోజుల్లో వెలువడే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న విశ్వాసం తమకుందని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
  పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఒకటిరెండు రోజుల్లోనే అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎ న్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయినప్పటికీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఈ స్థాయిలో ఫలితాలు సాధించడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. 10,092 ఎంపీటీసీల్లో 44 శాతం సీట్లను మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ దక్కించుకుంటే... మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన మా పార్టీ 37 శాతం సీట్లు సాధించుకుంది. 19 శాతం ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.
 
  పార్టీ నిర్మాణమే లేని దశలో వచ్చి పడిన ఎన్నికలను ఎదుర్కొనడం ఏ పార్టీకైనా కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది 653 జడ్పీటీసీల్లో దాదాపు సగభాగం స్థానాలు గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి మొత్తం జడ్పీటీసీల్లో టీడీపీ 53 శాతం సీట్లను సాధించగా... వైఎస్సార్ సీపీ 46 శాతం సీట్లు సాధించింది. మాకన్నా 50 జడ్పీటీసీ స్థానాలను అదనంగా గెల్చుకున్న టీడీపీ 9 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నప్పటికీ... ఓట్ల పరంగా, సీట్ల పరంగా మా పార్టీది గొప్ప విజయంగా చెప్పుకోవాలి.
 
  సాధారణ ఎన్నికల ఘట్టం ఊపందుకోవడానికి ముందుగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై ఉండబోవు. ఏప్రిల్ 6, 11 వ తేదీల్లో రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత నెల రోజులకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ నెల రోజుల్లోపు సీమాంధ్ర ఓటర్లలో ఎంతో వ్యత్యాసం క నిపించింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల ప్రభావం పెద్దగా ఉండదు. స్థానికంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది.
 
  పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత 12 వ తేదీన లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. 14 వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు పార్టీ అధ్యక్షుడు జగన్ జనభేరీ పేరుతో ప్రచారం ప్రారంభించారు. జగన్‌తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక సమతూకం పాటిస్తూ పార్టీ టికెట్లను ఖరారు చేయడం, పార్టీ ముఖ్య ప్రచారకర్తల విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణుల ంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు వైఎస్సార్‌సీపీ గెలుపు ధీమాను పెంచాయి.

ఖమ్మంలో వైఎస్సార్‌సీపీకి 5 జెడ్పీటీసీలు

హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో దాదాపు 115 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంటే కూడా వైఎస్సార్‌సీపీ మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. ఈ జిల్లాలో పార్టీ 5 జెడ్పీటీసీలు, 93 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది.

సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా

సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషించిన పార్టీ నేతలు
గ్రామీణ ప్రాంతాలపై పార్టీ పట్టు సాధించిందని వెల్లడి
ఈ ఫలితాలను చూస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా

 
 సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఓటర్లలో కనిపించిన మార్పు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడానికి చిహ్నమని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోల్చితే గ్రామీణ ఓటర్ల ప్రభావం ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో మంచి ఫలితాలను సాధించడంతో మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలోని 92 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది.
 
 ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ నేతలు సమావేశమై మున్సిపల్, పంచాయతీరాజ్ ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఈ ఫలితాల సరళిని విశ్లేషించిన తర్వాత సాధారణ ఎన్నికల్లో పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందన్న అంచనాకు వచ్చారు. మున్సిపాలిటీల్లో ఆశించిన మేరకు ఫలితాలు రానప్పటికీ, ప్రాదేశిక ఫలితాలు అనుకూలంగా రావడాన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు సాధించినట్టు ప్రాదేశిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషించారు. కీలకమైన గ్రామీణ ఓటర్లు ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల సరళి వైఎస్సార్‌సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తేల్చుతున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలో మొత్తం 3.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు (కార్పొరేషన్లు మినహా) 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.
 
 
 ఈ నియోజకవర్గాల్లో 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నది 45 లక్షల మంది ఓటర్లే. మిగతా 1.40 కోట్ల మంది మున్సిపాలిటీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మున్సిపాలిటీలతో సంబంధం లేని మిగతా 76 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో 1.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మిగతా ఓటర్లు మిగిలిన 12 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2.94 కోట్ల మంది (80 శాతం) ఓటు వేశారు. మున్సిపాలిటీలు, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయని తేటతెల్లమవుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. పైగా, సీమాంధ్రలో ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు గతనెల 12న నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ విడుదలకు  ముందే మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రెండు రోజులకే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆ వెంటనే పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జనభేరి పేరుతో విస్తృత ప్రచారం నిర్వహించారు.
 
 పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సాధారణ ఎన్నికల పోలింగ్‌నకు దాదాపు నెల గడువు ఉంది. ఈ 30 రోజుల్లో సీమాంధ్రలోని అనేక జిల్లాల  ప్రజల్లో ఎంతో మార్పు కనిపించిందని, ప్రతి జిల్లాలోనూ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని నేతలు పేర్కొన్నారు. ఈ సమయంలో 5 నుంచి 6 శాతం ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఊహించని విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క, ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు, అభ్యర్థి ప్రభావమే ఉంటుంది తప్ప రాష్ట్ర, జాతీయ అంశాల ప్రభావం ఉండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు ముడిపెట్టలేమని, ప్రజల్లో ఈ విషయంలో చాలా స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు తేడా కొన్ని జిల్లాల్లో కొట్టొచ్చినట్లు కనిపించిందని నేతలు విశ్లేషించారు.
 
  ప్రకాశం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగింటిలో టీడీపీ, రెండింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. మంగళవారం నాటి ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం చేజిక్కించుకోవడానికి అవసరమైన జెడ్పీటీసీ స్థానాలను గెల్చుకుంది. వైఎస్సార్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ మూడింటిలోనే గెలుపొందింది. నాలుగు చోట్ల టీడీపీ ఎక్కువ వార్డులను గెల్చుకుంది. అయితే, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని నేతలు విశ్లేషించారు.

ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఆగిపోయాయి?

13సాయంత్రానికి సీమాంధ్ర, తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ పై వున్న నిషేధం తొలగిపోయింది. దాదాపు అన్ని చానెళ్లు ఇక అంచనా ఫలితాలతో హొరెత్తిస్తాయని అనుకున్నారంతా. కానీ అలా జరగేలేదు. ఎందుకని? విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు అన్ని చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వైకాపాకు వందకు పైగా స్థానాలు వస్తాయని తేలినట్లు తెలుస్తోంది. కానీ మున్సిపల్ ఫలితాలు చూసుకుంటే తేదపా ముందంజలో వుంది. అదే ఎంపీటీసీ కి వస్తే, పోరు హొరా హోరీగా వుంది. దీంతో చానెళ్లు తమ సర్వేలు ఏ మేరకు వాస్తవం అన్నదానిపై అయోమయంలో పడినట్లు బోగట్టా.
 ఒక్క 10 టీవీ మాత్రం తన సర్వేను ప్రకటించింది. అది వైకాపా కే మొగ్గు వుందని స్పష్టం చేసింది.  నిజానికి సాయంత్రానికి ఎంపీటీసీల్లో వైకాపా చాలా వరకు ఫుంజుకుంది. మండల ప్రజాపరిషత్ ల్లో లీడ్ లోకి వెళ్లింది. 

జిల్లాల వారీగా చూసుకుంటే చాలా జిల్లాల్లో తెలుగుదేశం ఆధిక్యత వున్నా, అక్కడ చాలా దగ్గరగానే వైకాపా కూడా వుండడం విశేషం. దీంతో చానెళ్ల సర్వేలు వైకాపా కు అనుకూలంగా రావడం పెద్ద విశేషం కాదు.
 కానీ మెజారిటీ చానెళ్లు తేదేపాకు అనుకూలమైనవి కావడంతో, ఇప్పుడు తాము ప్రకటించినా, ప్రకటించకున్నా, ఫలితం ఒకటే కనుక, సైలెంట్ అయ్యాయని అంతర్గత వర్గాల బోగట్టా.  టీవీ 9 మరాఠీ చానెల్ జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో కూడా వైకాపాకే మొగ్గు కనిపించింది.

 అన్ని చానెళ్లు ఎగ్జిట్ సర్వేలు చేసినపుడు తెలుగు చానెళ్లు చేయకుండా ఎందుకుంటాయి. కానీ ఎందుకు బయటపెట్టడం లేదన్నది ప్రశ్న. నీల్సన్ తో కాంట్రాక్టు వున్న ఎన్టీవీ కూడా సర్వే చేయించిందని, కానీ ఈ సమయంలో ఇక వెల్లడించడం ఎందుకని మిన్నకుందని తెలుస్తోంది. మొత్తం మీద తేదేపాకు అనుకూలంగా వచ్చిన మున్సిపాల్టీ, వైకాపాకు హుషారు పెంచిన ఎంపీటీసీ లెక్కింపులు కలిసి, ప్రేక్షకులకు ఎగ్జిట్ పోల్స్ అందకుండా చేసాయి. 

- See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/exit-polls-enduku-agipoyayi-52616.html#sthash.H8b0UyNR.dpuf

స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ మెరుగైన ఫలితాలు

Written By news on Tuesday, May 13, 2014 | 5/13/2014

మారిన ఫలితాల సరళి
హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్ పిటిసి ఫలితాల సరళిలో  ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం  వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాలను సాధిస్తోంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60  టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
జిల్లాలుప్రకటించిన  స్థానాలువైఎస్ఆర్ సిపిటిడిపి
శ్రీకాకుళం జిల్లా675278360
విజయనగం2129788
విశాఖపట్నం292131136
తూర్పు గోదావరి564201332
పశ్చిమగోదావరి589166391
కృష్ణా624229311
గుంటూరు725330366
ప్రకాశం784401346
కర్నూలు709372283
అనంతపురం539215 310
వైఎస్ఆర్ జిల్లా308200102
నెల్లూరు528278212
చిత్తూరు617289327

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు

ANDHRA PRADESH
PartyParishad Results
ZPTC
(653)
MPTC
(10092)
ZP
(13)
MANDAL
(653)
YSRCP203348410
TDP166389600
Cong012200
BJP0500
Others232900
TELANGANA
PartyParishad Results
ZPTC
(443)
MPTC
(6512)
ZP
(09)
MANDAL
(443)
TRS184157800
Cong136179300
YSRCP49100
TDP3374600
Others1284100

Popular Posts

Topics :