08 June 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Written By news on Saturday, June 14, 2014 | 6/14/2014

వైఎస్ షర్మిల బహిరంగ లేఖవైఎస్ షర్మిల
హైదరాబాద్:  తనను కించపరుస్తూ  సోషల్ మీడియాలో  దుష్ప్రచారం చేయడంపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆమెపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలు స్పందించారు.  ఈ విషయంలో షర్మిలకు అండగా ఉంటామని పలువురు తెలిపారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఒక మహిళా రాజకీయ నాయకురాలిపై ఈ విధంగా ప్రచారం చేయడాన్ని వారు ముక్తకంఠంతో ఖండించారు.

సోషల్ మీడియాలో తనకు అవమానం కలిగించే విధంగా  రాతలు రాసిన వారిపై  షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి  వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ సలహాదారులు డిఏ సోమయాజులు ఈరోజు ఉదయం  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి   ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై  20-25 వెబ్ సైట్లలో పనిగట్టుకుని చెప్పుకోలేని రీతిలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  పోలీసులను కోరినట్లు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి షర్మిల ప్రచారం చేస్తున్నారనే ఇటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నారన్నారు.  సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా,  షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన  ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన వెబ్ డిజైనర్ శ్రీపతి నరేశ్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కార్తీక్‌లు మరో ఇద్దరితో కలసి మూడు నెలల క్రితం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.  అప్పట్లో ఈ ఉదంతంపై వైఎస్సార్ సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు నెల క్రితమే ఒకరిని పట్టుకోగా.. తాజాగా శ్రీపతి నరేశ్, కార్తీక్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీఎస్ డీసీపీ పాలరాజు తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం:

 జూలై 14, 2014
 ప్రియమైన సోదరీ, సోదరులకు...

 ఒక మహిళ తన గురించి తాను, అదీ ఎవరో కొందరు ఆమె పట్ల సాగిస్తున్న దుష్ప్రచారానికి సమాధానం చెప్పుకోవలసి రావడంచాలా దుర్భరమైన స్థితి.  ఒక మహిళ శక్తిమంతురాలిగా ఆవిర్భవిస్తుంని భావిస్తుందని భావించే తరుణంలో  కరుగట్టిన ద్వేషం పగ, ప్రతీకారంతో నిండిన క్రూరమైన మనస్తత్వంతో  పనిగట్టుకుని కొందరు  ఆమెపై బురజల్లుతుంటారు.  అలాంటి నికృష్టుల దాడికి నేను కూడా లక్ష్యంగా మారాను. ఈరోజు  రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే  ఒక మహిళ పట్ల కనీస  మర్యాద పాటించాలన్న స్పృహను సైతం కూడా అవి కోల్పోయాయి.

 ఈ మధ్య కాలంలో నాకు ఒక తలుగు నటుడితో సంబందాన్ని అంగడుతూ ఇంటర్నెట్ లో  పుకార్లు  లేవదీశారు. కనీసంఆ నటుడు ఎవరో కూడా నేను  ఎప్పుడూ చూడలేదు, కలవలేదు. ఎప్పుడూ మాట్లాడను కూడా లేదు. నా  గౌరవ, మర్యాదలను మంట గలిపే ఏకైక దురద్దేశంతో పరమ దుర్మార్గమైన  రీతిలో నాపై బురజల్లే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నేను ఒక వాస్తవం చెప్పదలచుకున్నాను. ఈ పుకార్లను ప్రచారంచేస్తున్న వందలాది  వెబ్ సైట్లలో తమ ప్రచారానికి రుజువుగా ఒక్క సాక్ష్యం కూడా  చూపలేకపోయారు. అంటే దీనిని బట్టే ఈ పుకార్లు ఎంత నిరాధారమైనవో  అర్ధం అవుతుంది.  ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న శక్తులు ఎవరో, వారి అంతిమ లక్ష్యం ఏమిటో  విచార జరిపి నింతులను కఠినంగా శిక్షించవలసిందిగా కోరతూ నేను ఈ  రోజు ఒక చట్టబద్దమైన ఫిర్యాదును కూడా చేశాను.

 నాకు తెలుసు, ఇదో పెద్ద చర్చనీయమైన అంశంఅవుతుంని. ఇందులో  నాకు తగిన న్యాయం జరగుతుందో లేదో కూడా నాకు తలవదు. ఈ విచార ద్వారా నాకు, నన్ను అమితంగా ప్రేమించే నా కుటుంబ సభ్యులు,  స్నేహితుల మనసులకు తగిలిన గాయం మానుతుంన్న నమ్మకంలేదు.  నీతిబాహ్యమైన, అల్పబుద్ధి కలిగిన కొందరు వ్యక్తులు సాగించే ఈ చౌకబారు దుష్ప్రచారంపై  నేను అనవసరంగా స్పందించి వాటికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నానన్న సంగతి కూడా తెలుసు. దీని వలన నిస్సిగ్గుగా అలాంటి  ద్వేషపూరితమైన పుకార్లను ప్రచారంచేస్తున్న దుష్టులకు మరింత ప్రచారం కల్పించినట్లవుతుందని కూడా నాకు తలుసు. ఇతరల బాధను చూసి  ఆనందించే ఇలాంటి శాడిస్టులను ఊరికే వదలకుండా  వారిపై పోరాటానికి  నేను సిద్ధం అయినప్పుడు నాతోపాటు  నా కుటుంబ సభ్యులు, స్నేహితులు  సైతం తెరచాటుగా వారు మాపై సాగించే దొంగ యుద్ధానికి లక్ష్యం కావలసి  ఉంటుందనని కూడా నాకు తెలుసు.

 కానీ, ఇలాంటి ప్రతికూల  పరిస్థితుల మధ్య పోరాటానికి దిగడం వలన ఈ  దుర్మార్గులు మాపై మరింతగా విషం చిమ్ముతార్న భయంతో  నేను మౌనంగా   ఉండదలచుకోలేదు. అమానుషమైన రీతిలో నన్ను అభాసుపాలు చేయడానికి  సాగుతున్న కుట్రలో మౌనంగా సమిధనైపోవడానికి నేను సిద్ధంగా లేను.  భారతీయ స్త్రీగా నేను... నైతి విలువలు కలిగిన ఒక భారను, ఒక తల్లిని, ఒక  కుమార్తెను, ఒక సహోదరిని...నా నైతిక నిష్ఠకు ఆ భగవంతుడే సాక్షి. ఈ రోజున, బరువెక్కిన గుండెత, బాధాతప్త హృదయంత, నేను మీకు ఈ లేఖ  రాస్తున్నాను.  ఎంత బాధగా ఉందంటే .. ఎలాంటి నేరం చేయనప్పటికీ ,  నా గౌరవ  మర్యాదలు కాపాడుకోవడానికి, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు  ఈ  రోజున నేను బోను ఎక్కవలసి వచ్చింది.  నా గుండె తీవ్రంగా గాయపడింది. మనసు ఆగ్రహంతో రగిలిపోతోంది.  గౌరవ మర్యాదలతో  జీవించే ఏ మహిళకైనా ఇలాగే ఉంటుంది.

 ఇది నా ఒక్కరికి సంబంధించిన  సమస్యే కాదు... ప్రతి ఒక్క మహిళ పరువు,  హోదాకు సంబంధించినది. ఇది పరువు, ప్రతిష్టలు కలిగిన ప్రతి ఒక్క భార్య,  ప్రతి తల్లి, ప్రతి కుమార్తె, ప్రతి సోదరికి సంబంధించిన విషయం.  మీరు అమితంగా ప్రేమించేవారెవరికైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చరు.  అందువల్ల, నేను మీకు  విన్నవించేదేమిటంటే ఇలాంటి దుర్మార్గాలకు మౌన  సాక్షిలా మారవద్దు.  ప్రతి మనిషికి ఒకటే జీవితం ఉంటుంది. ఇతరుల జీవితాలతో  తమ  ఇష్టానుసారం ఆటలాడాలని ఎవరై అనుకుంటే, మన శక్తి, సత్త ఏమిటో  వారికి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

 మీడియా, శాసన కర్తలు, చట్టాన్ని పరిరక్షించేవారు., దేశాభిమానులు ఒక్కరుగా  నిలబడి ఇలాంటి నీచమైన దుష్ప్రరాలకు ఒడిగట్టే వారి దుస్సాహసాన్ని  నిలదీయాలి.  ప్రజలను, సమాజాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలడన్న దృమైన  నమ్మకం, విశ్వాసం ఉన్నందునే నా అన్న కోసం నేను పోరాడాను. వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ లక్ష్యలను నేను ముమ్మూటికీ విశ్వసింశాను. అందుకే ఆ లక్ష్య  సాధన కోసం ప్రచారం చేశాను. నా విశ్వాసం, నమ్మకం పట్ల ఎవరికైనా  ఆక్షేపణ ఉండి నన్ను సవాలు చేయదలచుకుంగే  వారు నాతో  ముఖాముఖి
 తలపడాలి. అలాంటి ప్రయత్నాన్ని నేను గౌరవించి, అది ఒక మహిళను  అవమానించే చర్యగా నేను ఎన్నడూ పరిగణించే దానిని కాదు. కానీ ఇలా  అతి నీచమైన రీతిలో  పిరికిపందల్లా వెన్నుపోటుకు దిగే చర్యలు ఏమాత్రం  సహిందగ్గవి కాదు. ఏ మహిళ కూడా వీటిని సహిస్తూ, భరించలేదు.

 నా భావాలత ఏకీభవించే వారంరికీ నా విన్నపం ఒక్కటే. మహిళా  ఆత్మగౌరం కోసం నేను చేసే ఈ పోరాటంలో నాకు తోడుగా నిలబడండి.  మహిళలకు సమానత్వం, సమాన హక్కులు, సమాన అధికారం వంటి  విశిష్టమైన హామీలు నెరేరడానికి ముందుగా సమాజంలో మహిళ సమాన  ఆత్మగౌరంతో  జీవించే అవకాశం కల్పిస్తే చాలు. నా కుటుంబం,  స్నేహితులు నా ప్రతిస్పందనను అర్ధం చేసుకోగలరు. వాళ్ళు  నన్ను ఇసుమంత కూడా శంకించరని  నాకు తెలుసు. వాళ్ళు నన్ను అమితంగా  ప్రేమిస్తారు. నాకు అనుక్షణం రక్షణగా నిలబడతారు.  ఇలాంటి సమయంలో   వారు నా భావాలను మనస్పూర్తిగా గౌరవించడంతో పాటు  నాకు మరింత  మనోబలాన్ని ఇస్తాని కూడా తెలుసు. నా జీవితం పట్ల నేను ఎంతగా గర్వపడతానో నా కుటుంబం, స్నేహితుల పట్ల కూడా అంత గర్వపడతాను.

 ఈ విషప్రచారంలోకి ఏ నటుడినైతే  లాగారో వారు కూడా ఈ పిరికిపందల  చర్యలను గుర్తించి దొంచాటుగా సాగిస్తున్న ఈ పుకార్లను తీవ్రంగా ఖండిస్తారని  ఆశిస్తున్నా.  మహిళలను న్యూనతపరిచేలా నిరాధారంగా, ద్రోహచింతనతో,  ద్వేషపూరితంగా సాగించే  ఈ దుష్ప్రరానికి తెరదింపాలి. రాజకీయాలలోకి  చొచ్చుకు వస్తున్న ఇలాంటి కుళ్ళును కడిగివేయాలంటే మనమంతా సమష్టిగా నిలబడి నిర్భయంగా పోరాడాలి.

 భయ, భీతులకు లోను చేసే ఇలాంటి పిరికిపందల ముందు నేను కనురెప్పలు కూడా వాల్చను. సిగ్గుతో తలదించుకోబోను. ఇలాంటి విషప్రచారకుల విశృంకల కార్యకలాపాలకు మీర చెక్ పెడతారని నమ్మకం కూడా  నాకు ఉంది. రాజకీయాలు అంటే అవి మురికికూపం కాదని మనం నిరూపిద్దాం. మనందరం చేతులు కలిపి రాజకీయాలను దృఢ విశ్వాసానికి, రక్షణకు అత్యంత ఘనమైన వేదికగా తీర్చిదిద్దుదాం.

-వైఎస్ షర్మిల రెడ్డి  

వైఎస్ షర్మిలకు అండగా ఉంటాం

వైఎస్ షర్మిలకు అండగా ఉంటాంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలకు అండగా ఉంటామని ఆ పార్టీ మహిళా నాయకులు, ఎంపీలు చెప్పారు. సోషల్ మీడియాలో షర్మిలను కించపరుస్తూ దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు బుట్టా రేణుక, కొత్తపల్లి గీత మాట్లాడారు.

మహిళలను ప్రోత్సహించాలే కానీ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా అసభ్యంగా చిత్రీకరించడం దారుణమని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళల రాణించకుండా చేయడానికి కొన్ని వెబ్ సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజా సమస్యల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిలపై అసత్య ప్రచారం చేయడం తగదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలకు అండగా ఉండాలని చెప్పారు. అస్యత ప్రచారం చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు.

బాబు మోసాలు త్వరలో వెలుగులోకి వస్తాయి: వైఎస్ జగన్

బాబు మోసాలు త్వరలో వెలుగులోకి వస్తాయి: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ : ప్రజలను మోసం చేసిన అబద్దాలాడి పదవుల్లోకి రావాలనే ఉద్దేశ్యం తనకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ వేళ అలా పదవిలోకి వేళ్తే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని అన్నారు. శనివారం విజయవాడలో కృష్ణాజిల్లా వైఎస్ఆర్ సీపీ నేతలతో వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాకు చెందిన పార్టీ నాయకులను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. మనం మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన అన్నారు. ప్రజల్లో ఏ ఒక్కరు మనం మోసం చేశామని చెప్పకోకూడదని జగన్ పేర్కొన్నారు.
 
నిజాయితీ, విశ్వసనీయతలతో కూడిన రాజకీయాల్లే చేయాలనుకున్నాం తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మోసాలు మరికొన్ని రోజుల్లో వెలుగులోకి వస్తాయని వైఎస్ జగన్ వెల్లడించారు. మరో కొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతులు రుణాల కోసం బ్యాంకులకు వెళ్తారు. అప్పటిలోగా రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ ఏర్పాటు చేసి కాలయాపన చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  జగన్ సూచించారు.

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదు

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, సీపీకి ఫిర్యాదువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలను కించపరుస్తూ వెబ్ సైట్లలో దుష్ప్రచారంపై ఆపార్టీ నేతలు శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, సోమయాజులు ఈరోజు ఉదయం సీపీని కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు.
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం జరుగుతోందని, దానిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరామన్నారు. చెప్పుకోలేని రీతిలో ఈ ప్రచారం చేస్తున్నారని, అది చాలా బాధాకరమన్నారు. 20-25 వెబ్ సైట్లలో పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి షర్మిల ప్రచారం చేస్తున్నారనే ఇటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరామన్నారు. సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కాగా  షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన  ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన వెబ్ డిజైనర్ శ్రీపతి నరేశ్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కార్తీక్‌లు.. మరో ఇద్దరితో కలసి మూడు నెలల క్రితం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.  అప్పట్లో ఈ ఉదంతంపై వైఎస్సార్ సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు నెల క్రితమే ఒకర్ని పట్టుకోగా.. తాజాగా శ్రీపతి నరేశ్, కార్తీక్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీఎస్ డీసీపీ పాలరాజు శుక్రవారం తెలిపారు.
ఫిర్యాదు పూర్తి పాఠం ఈ దిగువన చూడండి..
ఒకటో పేజీ
రెండో పేజీ
మూడో పేజీ
నాలుగో పేజీ
ఐదో పేజీ

బెజవాడలో సమీక్ష నిర్వహిస్తున్న వైఎస్ జగన్

విజయవాడ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.  బందరు రోడ్డులోని కానూరులోని ఆహ్వానం కల్యాణ మండలంలో  ఈ సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు విజయవాడ తూర్పు నియోజక వర్గంపై  సమీక్ష జరిగింది. అనంతరం విజయవాడ సెంట్రల్, మైలవరం, నంగదిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, పెడన, మచిలీపట్నం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలసై వైఎస్ జగన్ సమీక్షిస్తారు.

ఆదివారం  మచిలీపట్నం పార్లమెంట్ నియోజక వర్గపరిధిలోని  పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలపై సమీక్షలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, పార్టీ మండల అధ్యక్షులు ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు.

కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు

కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు
గుడివాడ : శుక్రవారం జరిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కుమార్తెల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కొడాలి నాని కుమార్తె విజయదుర్గకు కొడాలి నాని సోదరుడు చిన్న కుమార్తె శ్రీఅఖిలాండేశ్వరిదేవికి ఆయన ఆశీస్సులందజేశారు.  

జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ ప్రముఖులు హాజరయ్యారు. గుడివాడకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కార్యకర్తలు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా,పేర్ని నాని, కైకలూరు నియోజక వర్గ పార్టీ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు తెనాలి పార్లమెంటు మాజీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, గుడివాడ మున్సిపల్   చైర్మన్  యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటిశశిభూషణ్, పాలేటి చంటి, నందివాడ మండల పార్టీ కన్వీనర్ పెయ్యల ఆదాం, గుడివాడ పట్టణ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కాటాబత్తుల రత్నకుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు అడపా బాబ్జీ, మేరుగు మరియకుమారి, గొర్ల శ్రీనివాసరావు, నెరుసు చింతయ్య, పొట్లూరి కృష్ణారావు వెంపల హైమావతితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులున్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక

తాగునీటి ఎద్దడి నివారణకు పక్కా ప్రణాళిక
  •      నీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులు కేటాయింపు
  •      త్వరలో నియోజక వర్గాలవారీగా సమీక్షలు
  •      తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం
  •      పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి
మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు  ఎంపీ నిధులను ఎక్కువగా కేటాయిస్తానని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మదనపల్లెకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.  

ఈ విషయంపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో చర్చించనున్నట్టు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికను రూపొందించనున్నట్టు చెప్పారు.ముఖ్యంగా కండలేరు నదీజలాలను తీసుకురావడానికి నిధులు కొరత ఉందన్నారు. జిల్లాలో అందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టనున్నామని చెప్పారు.  

రాజంపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మదనపల్లె, పుంగనూరు పట్టణాల్లో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుల  నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
 
టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
 
అధికార తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దొంగదార్లలో కౌన్సిలర్లను కొనుగోలుచేస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన వారు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి కౌన్సిలర్లను కొనుగోలుచేస్తే ఆ డబ్బును సంపాదించేందుకు అవినీతికి పాల్పడతారే తప్ప అభివృద్ధి  ఏంచేస్తారని ప్రశ్నించారు.

ఎంపీ వెంట మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షమీమ్ అస్లాం, మైనారిటీల నాయకుడు బాబ్‌జాన్, కౌన్సిలర్ జింకా వెంకటా చలపతి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కార్యదర్శి ఎస్‌ఏ కరీముల్లా, రాష్ర్ట బీసీ నాయకులు పాల్ బాలజీ, నాయకులు బాలకృష్ణారెడ్డి, కోటూరి ఈశ్వర్, భువనేశ్వరి సత్య, కత్తి కృష్ణమూర్తి, నిమ్మనపల్లె,  రామసముద్రం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

నేటినుంచి వైఎస్సార్‌సీపీ ‘కృష్ణా’ సమీక్షలు

విజయవాడ: వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా సమీక్షలు శనివారం విజయవాడ నగరంలో ప్రారంభం కానున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ ముఖ్యనేతలతో పాటు మండల స్థాయి కన్వీనర్లు కూడా పాల్గొననున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బందరురోడ్డులో  కానూరు సమీపంలో ఉన్న  ఆహ్వానం కల్యాణమండపంలో సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఇవి రాత్రి వరకు కొనసాగుతాయి.

దాడులు చేస్తే సహించేది లేదు..జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే..

రుణమాఫీపై బాబుకు చిత్తశుద్ధి లేదు
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జంకె, డేవిడ్‌రాజు, ముత్తుముల ధ్వజం  

 మార్కాపురం టౌన్ :  రైతుల రుణమాఫీపై సీఎం చంద్ర బాబుకు చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాదయాత్రలో రైతుల కష్టాలు కళ్లారా చూశానని, రుణమాఫీతో వారి కష్టాలు తీరుస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇవ్వకుండానే రైతుల రుణాలు మాఫీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అధికారం చేజిక్కించుకునేందుకు బాబు సాధ్యం కాని హామీలిచ్చారని, దీన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందే పసిగట్టారని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిమితులతో కూడిన రుణ మాఫీ చేస్తానని చెబుతుండగా అక్కడి టీడీపీ శాసనసభ్యులు మాత్రం రైతులపై ఉన్న రుణాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శాసనసభ సమావేశాల్లో రైతుల రుణమాఫీపై పట్టుబడతామని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తామన్నారు.

దాడులు చేస్తే సహించేది లేదు
పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నాయకులు ఇప్పుడు అధికారంలోకి రావడంతో గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని ఎమ్మెల్యేలు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు న్యాయం పక్షాన నిలవాలని కోరారు. తొలుత ఆర్డీఓ కొండయ్య, డీఎస్పీ రామాంజనేయులును కలిసి పశ్చిమ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎమ్మెల్యేలు డేవిడ్‌రాజు, ముత్తుముల, జంకె విజ్ఞప్తి చేశారు.

విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ బట్టగిరి తిరుపతిరెడ్డి, దోర్నాల జెడ్పీటీసీ అమిరెడ్డి రామిరెడ్డి, పుల్లలచెరువు మండల పార్టీ కన్వీనర్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, గాలి రమణారెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దప్పిలి విజయభాస్కరరెడ్డి, బి.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే..
జిల్లాలో ఫ్యాను గుర్తుపై గెలుపొందిన 31 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్ సీపీలోనే ఉన్నారని, ఎవరూ టీడీపీలోకి వెళ్లలేదని మార్కాపురం, త్రిపురాంతకం జెడ్పీటీసీలు జవ్వాజి రంగారెడ్డి, చంద్రమౌళిరెడ్డి తెలిపారు. జిల్లా జెడ్పీ పీఠం తమదేనని చెప్పారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలంతా తమ పార్టీలోకి వస్తున్నారని టీడీపీ నాయకులు దుష్ర్పచారం చేయడంపై మండిపడ్డారు.

మీ నమ్మకాన్ని వమ్ము చేయను

Written By news on Friday, June 13, 2014 | 6/13/2014

మీ నమ్మకాన్ని వమ్ము చేయను
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మధిర: జిల్లా ప్రజలు తనపై నమ్మకంతో వేసిన ఓటును వృథా కానివ్వనని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ మధిర నియోజకవర్గం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రెడ్డి గార్డెన్స్ కల్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని, జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి శక్తివంచన లేకుండా అభివృద్ధి చేస్తానన్నారు. తెలంగాణ ప్రజలకు సేవచేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో యావత్ తెలంగాణ ప్రజలు ఖమ్మం పార్లమెంట్ వైపే చూశారని అన్నారు.

అయితే విజయం సాధించినప్పటికీ.. వివిధ కారణాలతో ఆశించినంత మెజార్టీ రాలేన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినప్పటికీ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారని చెప్పారు. ఏదేమైనా ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా కృషి చేస్తానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మాట తప్పనని హామీ ఇచ్చారు. తన సత్తా ఏమిటో చూపిస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల విషయంలో ప్రభుత్వానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, అందుకే జిల్లాలో ఎంపీతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నామని చెప్పారు. పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. మీ శీనన్నగా ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటానన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు జెవీ రెడ్డి, తూమాటి నవీన్‌రెడ్డి, వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో పొంగులేటిని సన్మానించారు.

ముందుగా పొంగులేటికి పూర్ణకుంభంతో పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పొంగులేటిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశ ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. పార్టీ జిల్లా నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజు, నాయకులు యన్నం కోటేశ్వరరావు, తూమాటి నర్సిరెడ్డి, వేమిరెడ్డి ల క్ష్మారెడ్డి, చావా హన్మంతరావు, బండి వెంకటేశ్వ ర్లు, అంకసాల శ్రీనివాసరావు, లకిరెడ్డి నర్సిరెడ్డి, కోట నిర్మలజ్యోతి, కొట్టె విజయలక్ష్మి, వేమిరెడ్డి త్రివేణి, కొప్పుల నాగేశ్వరరావు, మునుగోటి వెం కటేశ్వరరావు, అబ్బూరి రామకృష్ణ పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి గళమెత్తుతా

కల్లూరు : జిల్లాలోని ప్రధాన సమస్యలను పార్లమెంట్‌లో వినిపించి వాటి పరిష్కారం కోసం పోరాడుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి చెప్పారు. గురువారం ఆయన కల్లూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదం దురదృష్టకరమని, తాము అక్కడికి వెళ్లి పరిశీలించామని, గల్లంతయిన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల బాధ వర్ణనాతీతంగా ఉందని తెలిపా రు. గల్లంతయిన, మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. ప్రజా సంక్షేమంకోసం చేపట్టే ప్రతిపనికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుం దన్నారు. సమావేశంలో కల్లూరు సర్పంచ్ భరోత్ సుజాత, వైస్ సర్పంచ్ బొలగాని తిరుపతిరావు, ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ పాలెపు రామారావు, నాయకులు కర్నాటి అప్పిరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాసరావు, ఉబ్బన గోపాలస్వామి, అత్తునూరి సత్యనారాయణరెడ్డి, మేకల కృష్ణ, పాలడుగు శంకర్‌రావు, భరోత్ రాము, బుర్రి వీరయ్య, ఉబ్బన శ్రీను, ధరావత్ మోహన్, వెంగళ పెంటయ్య, కమల్, లక్కిరెడ్డి యేసురెడ్డి పాల్గొన్నారు.

ప్రజలతో మమేకం... సమస్యలపై పోరాటం

ప్రజలతో మమేకం... సమస్యలపై పోరాటం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘అయ్యిందేదో అయ్యింది. భవిష్యత్ మనదే. సమష్టిగా పని చేద్దాం...    ప్రజల మధ్యే ఉంటూ....వారి సమస్యలపై పోరాడుతూ మరో వైపు  పార్టీని పటిష్టం చేద్దాం. వచ్చే నాలుగేళ్లూ కార్యకర్తలకు అండగా ఉందాం. అన్ని వేళలా పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వద్దాం’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎస్. కోట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.

 ఆ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలపై విశాఖపట్నంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్‌లో గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వచ్చిన ఓట్లపై ఆరా తీశారు. ఎక్కడ నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. పార్టీ నాయకులతో ఫలితాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రత్యర్థుల గెలుపునకు దోహదపడిన అంశాలపైనా, పార్టీ పరమైన లోటుపాట్లపై లోతుగా విశ్లేషించారు. లోపాలను సరి చేసుకుని ముందుకెళ్దామని సూచించారు. భవిష్యత్‌లో పార్టీని పటిష్ట పరుచుకుని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఉద్యమించి, కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో పార్టీని సమర్థంగా నడుపుకొందామన్నారు.

 ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే మనమే అధికారంలోకి వచ్చేవారమని, అలా చేసి ఉంటే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అప్రతిష్టను మూట గట్టుకునే వాళ్లమన్నారు. విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేద్దామని, ప్రజలకు అండగా నిలిచి, వారి అభిమానంతోనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వద్దామని శ్రేణుల్లో జోష్ నింపారు. ఇదే సందర్భంలో పార్టీని  పటిష్ట పరిచేందుకు కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అత్యధిక మందితో వ్యక్తిగతంగా మాట్లాడి సూచన, సలహాలు తీసుకున్నారు.  సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు రొంగలి జగన్నాథం,  నెక్కల నాయుడుబాబు, వేచలపు చిన రామునాయుడు, తూర్పాటి కృష్ణస్వామినాయుడు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

 ఎస్. కోట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నెక్కల నాయుడుబాబు.. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం మేరకు ఎస్.కోట నియోజకవర్గ ఇన్‌చార్జి ్జగా నెక్కల నాయుడుబాబును నియమిస్తున్నట్టు సమీక్ష సమావేశంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నాయుడుబాబును ప్రత్యేకంగా అభినందించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయుడుబాబు పార్టీని సమర్థంగా నడపగలరన్న అభిప్రాయం మేరకు ఆయన్ని నియమించినట్టు తెలిసింది.

ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్ష సాధింపు

డోన్‌లో తెలుగు తమ్ముళ్ల హల్‌చల్
 డోన్ టౌన్ : అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. డోన్  పట్టణంలో తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గురువారం సాయంత్రం రద్దీగా ఉన్న చిగురుమానుపేటలోని అమ్మ హోటల్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై కొందరు రౌడీమూకలు తప్పతాగిన మైకంలో కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో నడిరోడ్డులో ఈ దృశ్యాలను చూస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

దాడి వెనుక టీడీపీ చెందిన నాయకుల కుట్ర ఉందని బాధితులతో పాటు దాడిని ప్రత్యక్షంగా చూసిన పలువురు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి రోడ్డులో బండల వ్యాపారం చేసే ఉప్పరి ఈశ్వరయ్య ఇటీవల జరిగిన మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల  విజయానికి కృషి చేశారు. పార్టీ కార్యకర్తగా ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీలో మంచి గుర్తింపు రావడం, పలువురితో పరిచయాలు ఉండటం, ఆర్థికంగా పలువురిని ఆదుకోవడం లాంటి పనులు ఈశ్వరయ్య చేస్తుండేవాడు.

జీర్ణించుకోలేని ఆ ప్రాంత టీడీపీ చోటా నాయకులు ఫైనాన్స్ విషయాలను సాకుగా చూపి రౌడీలను దాడికి ఉసిగొల్పారని బాధితుడి బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో బోయ ఈశ్వరయ్య, బోయ నాగరాజు, గిడ్డయ్య, పుల్లగుమ్మి మద్దిలేటి, రాజంపేట మల్లికార్జున తదితరులు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఈశ్వరయ్య...:

రౌడీ మూకల దాడిలో గాయపడ్డ ఉప్పరి ఈశ్వరయ్య కడుపులో కత్తిపోటు పడటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రథమ చికిత్స అందించిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రెఫర్ చేశారు.

పెట్రేగిపోతున్న అధికార పార్టీ దాడులు...:
మూడు రోజుల క్రితం రాచర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీలో ఏఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్న అంకన్నపై అధికార పార్టీకి చెందిన వీరేష్, సురేష్‌గౌడ్ దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంలో తాత్సరం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతలోనే డోన్ పట్టణంలో మరో సంఘటన చోటు చేసుకోవడంతో నిందితులపై పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
పీసీ పల్లి : కేవలం రేషన్ షాపునకు డీడీ కట్టినందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పీసీ పల్లి మండలంలోని పెదఅలవలపాడు గ్రామంలో గురువారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... పెదఅలవలపాడులోని రేషన్ షాపును వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారుడు మాధవరపు నర్శింహులు నిర్వహిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం వచ్చినందున రేషన్ షాపునకు సరుకులకు సంబంధించి ఈ నెల డీడీ తీయవద్దని, డీలర్‌షిప్‌ను తాము తీసుకుంటామని టీడీపీ నాయకులు కొల్లా వెంకట్రావు, డి.కృష్ణ, నాగార్జున మరికొందరు కలిసి గురువారం డీలర్ నర్శింహులును బెదిరించారు.

దీంతో రెండువర్గాల మధ్య వివాదం జరిగింది. దీనిపై పరస్పరం ఫిర్యాదు చేసుకునేందుకు పీసీ పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే, అక్కడ ఎస్సై లేకపోవడంతో ఫిర్యాదు పత్రాలను సిబ్బందికి అందజేసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కాగా, వివాదంలో తాము లేకపోయినప్పటికీ ఫిర్యాదులో తమ పేర్లు ఎందుకు పేర్కొన్నారంటూ వైఎస్‌ఆర్ సీపీకి చెందిన గోగడ శింగయ్య, గోగడ సురేష్, కంచర్ల తిరుపతమ్మలు టీడీపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు   చెన్నుపాటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మల్లికార్జున, గొనుగుంట్ల వెంకట్రావు, దారపనేని కృష్ణ మరికొందరు కలిసి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా వారిపై దాడిచేశారు.

ఈ దాడిలో శింగయ్య, తిరుపతమ్మ తలలు పగలగా సురేష్‌కు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని ముందుగా కనిగిరి వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. వారిలో శింగయ్య, తిరుపతమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పీసీ పల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

పదవి కోసం ప్రజలను మోసం చేయలేం : వైఎస్ జగన్

Written By news on Thursday, June 12, 2014 | 6/12/2014

పదవి కోసం ప్రజలను మోసం చేయలేం : వైఎస్ జగన్
విశాఖపట్నం: పదవి కోసం ప్రజలను మోసం చేయలేం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో  గెలుపోటములపై నిన్న, ఈరోజు ఇక్కడ ఆయన సమీక్ష జరిపారు‌. నిన్న అనకాపల్లి పార్లమెంటుతోపాటు పెందుర్తి, చోడవరం, మాడుగుల శాసనసభ స్థానాలలో జరిగిరిన ఎన్నికలపై సమీక్ష జరిపారు. ఈ రోజు తూర్పు విశాఖ, భీమిలి నియోజకవర్గాలతోపాటు విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలని ఎవరికి ఉండదు? అని ప్రశ్నించారు. కాని ఆపదవి పొందడానికి ఎలాంటి అబద్ధాన్నైనా తాను ఆడలేనన్నారు. పదవికోసం ఎలాంటి గడ్డైనా తినే అలవాటు తనకు లేదని చెప్పారు. అబద్ధాలు ఆడి, మోసం చేసి సీఎం పదవిలోకి వెళ్తే మనం ప్రజలకు న్యాయం చేసినవారం అవుతామా? అని ప్రశ్నించారు.

మరో 10 రోజుల్లోనే ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుంది. రుణాల కోసం ప్రతి రైతు బ్యాంకుల దగ్గరకు వెళ్తున్నారు. పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు చెప్పినప్పుడు ప్రతిరైతు ఎంత బాధపడతారో మనకు తెలుసని అన్నారు.  సీఎం అయి నిజాయితీతో పరిపాలన చేయాలని, ప్రజలకు సేవ చేయలని అందరికీ ఉంటుందన్నారు. ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతోపాటు తన ఫొటోకూడా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పదవి కోసం మనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనప్పుడు ఆ వెంటనే ప్రజలు నిలదీస్తారని గుర్తు చేశారు. అప్పుడు వారికి మనం సమాధానం చెప్పగలమా? అని అడిగారు.

 నియోజకవర్గాలపై సమీక్షల సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, నేతలు హాజరయ్యారు. నియోజక వర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో లోపాలను సవరించుకోవాలన్నారు. గ్రామాల్లో చురుగ్గా పనిచేసే కమిటీలను ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు

చివరి శ్వాసవరకు జగన్ వెంట వైఎస్ఆర్ సిపిలోనే

ఏబిఎన్,ఈనాడు మైండ్ గేమ్తమ్మినేని సీతారాం
విశాఖపట్నం: ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు కథనాలను వైఎస్ఆర్ సిపి నేత తమ్మినేని సీతారాం ఖండించారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌సీపీని బలహీనపర్చడానికే, ఉద్దేశపూర్వకంగా తమ పట్ల ఏబిఎన్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏబిఎన్, ఈనాడు మైండ్ గేమ్ ఆడుతున్నట్లు ఆయన ఆరోపించారు. వ్యక్తుల రాజకీయ విలువలను దెబ్బతీసేలా అవి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తన చివరి శ్వాసవరకు తాను జగన్ వెంట వైఎస్ఆర్ సిపిలోనే ఉంటానని చెప్పారు.

ఇప్పటికైనా మైండ్‌గేమ్ ఆపకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏం జరిగినా ఆయా మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలన్నారు. ఏబిఎన్  వరుస కథనాలపై పరువునష్టం దావా వేస్తామని   సీతారాం హెచ్చరించారు. మీడియాకు ఎంత స్వేచ్ఛ ఉందో, అంత పరిమితి కూడా ఉందని చెప్పారు.

ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయండి

న్యూఢిల్లీ : నంద్యాల ఎంపీ ఎస్ పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పిటిషన్ అందించింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ ఎంపీలు...స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ టీడీపీలో చేరినట్లు ఎస్పీవై రెడ్డి తనకు తానుగానే ప్రకటించుకున్నారని గుర్తు చేశారు.

అనర్హత వేటు వేస్తే టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆయనే చెప్పారని, నిబంధనల ప్రకారం ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించినట్లు మేకపాటి తెలిపారు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని స్పీకర్ తమకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్సార్సీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవెరైడ్డి  విజయం సాధించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా అమ్మను పోటీకి దింపా

'ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా అమ్మను పోటీకి దింపా'
విశాఖ : నాన్న బతికున్నంతకాలం అమ్మ ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తనకు తోడుగా ఉంటుందనే అమ్మను రాజకీయాల్లోకి తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతున్న సందర్భంగా వైఎస్ జగన్ గురువారం మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు భరోసా ఉంటుందనే విశాఖ నుంచి అమ్మతో పోటీ చేయించినట్లు తెలిపారు. విశాఖ నాయకులు, కార్యకర్తలపై నమ్మకంతోనే విశాఖ ఎంపీగా అమ్మను నిలబెట్టినట్లు ఆయన చెప్పారు. విశాఖ లోక్సభ ఎన్నికల సమయంలో కడప నుంచి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాలేదని జగన్ తెలిపారు.
 
కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విజయవాడలో ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనున్నారు. కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్ లో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు.

హామీల అమలు వదిలేసి జగన్‌పై విమర్శలా?

హామీల అమలు వదిలేసి జగన్‌పై విమర్శలా?
బొజ్జల తీరుపై చెవిరెడ్డి ధ్వజం
 
తిరుపతి : ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై దృష్టిపెట్టకుండా వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వంటి సీనియర్ నాయకుడికి తగద ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం  తిరుపతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డిపై బొజ్జల చేసిన అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో 11 చార్జ్‌షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఒక్క అభియోగా న్ని కూడా నిరూపించలేదని, జగన్‌మోహన్‌రెడ్డి అవి నీతిపరుడని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. అయితే గతం లో జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ పదేపదే ఆరోపించి తమకు అనుకూలమైన పత్రికల్లో పనిగట్టుకుని కథనాలు రాయించిన టీడీపీ నాయకులు మళ్లీ పాతపాట పాడుతున్నారని చెవిరెడ్డి విమర్శించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలైనా గడవక ముందే చ ంద్ర బాబు మంత్రివర్గంలో ప్రాధాన్యం కలిగిన పోర్ట్‌పోలియో కోసమే జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసినట్లుందన్నారు. అమాసకు, ఆడికి ఒకసారి నియోజకవర్గం పక్క తొంగిచూసే గోపాలకృష్ణారెడ్డి గురించి, ఇసుక మాఫియాలతో ఆయనకు గల సంబంధాల గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ గాలిగోపురం కూలిపోతే నియోజకవర్గానికి చెందిన బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా గోపాలకృష్ణారెడ్డి ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

హుందాగా వ్యవహరించండి 
             
సీనియర్ నాయకులుగా ఉన్న బొజ్టల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు లాంటి వారు హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. తొలి సంతకాలను సంతకాలకే పరిమితం చేసి ఏ ఒక్కటీ అమలు దిశగా చర్యలు చేపట్టని టీడీపీ పాలనపట్ల అప్పుడే ప్రజలు పెదవి విరుస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామేమోనని పశ్చాత్తాప పడుతున్నారన్నారు. వైఎస్. రాజశేఖరరెడ్డి తన తొలి సంతకంతోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలను రద్దు చేసిన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని అంశాలకు సంబంధించి తొలి ఐదు సంతకాలు చేయడంకన్నా ‘ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నా.. క్షమించండి’ అంటూ రాసిన ఫైలుపై ఒకే ఒక సంతకం చేసి ఉంటే బాగుండేదని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి తాను అమలు చేయగలనన్న నమ్మకం ఉన్నవాటినే ప్రజలకు చెప్పారన్నారు. ప్రజలు వాస్తవాలను త్వరలోనే గ్రహించి వారిని ఛీకొట్టే రోజులు వస్తాయన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, ప్రజాసమస్యలపై వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నపుడు వ్యవహరించినట్లే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పోత్ర పోషిస్తుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
హుజూర్‌నగర్:ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ నిరంతరం కృషి చేస్తుం దని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. బుధవారం స్థాని క పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం స్థాపించిన వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుం దన్నారు. ప్రజల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో నిరంతర ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో పార్టీని ఆదరించి ఓట్లు వేసిన ప్రజలకు, నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలుపంచుకుంటానన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు గాను రైతులు ఎదుర్కొం టున్న సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రుణమాఫీ పథకంపై స్పష్టమైన ప్రకటన చేసి రైతులలో నెలకొన్న ఆందోళనను తొలగించాలన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో త్వరలో జరిగే ఎంపీ పీ ఎన్నికలలో పార్టీ పక్షాన గెలిచిన ఎంపీటీసీలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆ పార్టీ హుజూర్‌నగర్, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల అధ్యక్షులు వేముల శేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులు,జాల కిరణ్, సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

కార్యకర్తలతో జగన్ మమేకం

నవ్యోత్సాహం
నియోజకవర్గాల సమీక్షతో వైఎస్సార్ సీపీ కేడర్‌లో జోష్
కార్యకర్తలతో జగన్ మమేకం
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం

 
 ‘ప్రతిపక్షంలో ఉన్నామని భయపడాల్సిందేమీ లేదు. నాలుగున్నరేళ్లుగా మనం పడ్డ కష్టాలు జనాలకు తెలుసు. మోసపూరిత హామీలతో గెలిచిన ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి మరెంతో సమయం లేదు. భవిష్యత్తంతా మనదే. బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. అధికార పార్టీ దాడులకు వెరవద్దు. మీ తోడుగా ఉంటా.

 -  సమీక్ష సమావేశంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
 


విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే చాలు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలుపడ్డ దృశ్యాలు కళ్లముందే ఉన్నాయి. అలాంటిది ఏకంగా తమ అభిమాన నేత తమతో మాట కలపడం.. తమ సలహాలు సూచనలు ఆసాంతం వినడం.. భవిష్యత్ మనదేనని భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటా యి. ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నగరంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రారంభమయ్యాయి.

కార్యకర్తలతో మమేకం


ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పదుల సంఖ్యలో ప్రధాన కార్యకర్తలు, నేతలతో జగన్‌మోహన్‌రెడ్డి మమేకమయ్యారు. ప్రతి నేత, కార్యకర్తను పేరడిగి తెలుసుకున్నారు. వారి రాజకీయ అనుభవం, వారి కుటుంబ నేపథ్యం వారి నోటి నుంచే విన్నారు. ఒకటికి రెండుసార్లు పేర్లు తెలుసుకుని.. మధ్యమధ్యలో పేరుపెట్టి పిలుస్తూ.. వారికి మైక్ అందించే ఏర్పాట్లు చేశారు. తాజా ఎన్నికల ఫలితాల్ని స్థూలంగా వారికి వివరించారు. అనంతరం వారి నుంచి ఎన్నికల ఫలితాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు, ఓటముల్లో కార్యకర్తలు అనుభవాలను పంచుకున్నారు. గెలిచిన చోట వారనుసరించిన కార్యాచరణ, ఓటమి చెందిన చోట కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణుల విశ్లేషణను నోట్ చేసుకున్నారు.
 
భవిష్యత్‌పై దిశానిర్దేశం

 యువనాయకత్వం ముందుండగా.. కాస్త పెద్దవాళ్లు, ముసలివాళ్లను సలహా కమిటీగా ఏర్పాటు చేస్తూ జిల్లా స్థాయిలో పార్టీకి మరిన్ని జవసత్వాలు చేకూర్చుతామంటూ పార్టీ శ్రేణులకు అధినేత జగన్ మోహన్‌రెడ్డి దిశానిర్దేశనం చేశారు. బూత్/ గ్రామ/వార్డు/డివిజన్ స్థాయి నుంచి మండ లం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తామంటూ జోష్‌నిచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరినీ సమన్వయపరచగలిగే వారికే పార్టీలో పదవులు కట్టబెడతామంటూ చెప్పారు. పార్టీ శ్రేణుల్ని భవిష్యత్ దిశగా కార్యోన్ముఖుల్ని చేశారు.
 
వైఎస్‌కు నివాళి

 సమీక్ష ప్రారంభానికి ముందు వేదికపై ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం హి మాచల్‌ప్రదేశ్ సంఘటనపై రెండు నిముషాలు మౌనం పాటించారు. జగన్‌తోపాటు సమీక్ష సమావేశాల్లో పార్టీ కీలక నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తైనాల విజయ్‌కుమార్‌తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు బూడి ము త్యాలునాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, పార్టీ నేతలు గొల్ల బాబూరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, బొడ్డేడ ప్రసాద్, తిప్పల గురుమూర్తిరెడ్డి, మళ్ల విజయ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమిపాలైన గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు తాజాగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గ సమావేశంలో గండి బాబ్జీ, మాడుగుల సమావేశంలో బూడి ముత్యాలునాయుడు, చోడవరం సమీక్షలో కరణం ధర్మశ్రీ, బలిరెడ్డి సత్యారావు, నర్సీపట్నం సమీక్షలో పెట్ల ఉమాశంకర్ గణేష్, సూర్యనారాయణరాజు, కాకినాడ సమీక్షలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట సమీక్షలో జ్యోతుల నెహ్రూతోపాటు నియోజకవర్గాల పరిధిలోని తాజా, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఉదయం విశాఖ విమానాశ్రయంలో బుధవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది.
 

ముందు పాలనపై దృష్టి సారించండి

ముందు పాలనపై దృష్టి సారించండి
చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనపై విమర్శలు మానివేసి ఆంధ్రప్రదేశ్‌లోని సవాళ్లను ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి సారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉండడానికి కారణం రాజశేఖరరెడ్డి పాలనేనని చంద్రబాబు విమర్శించడం సమంజసంగా లేదన్నారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు పరిపాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. మీ పాలనలో రైతాంగం సంక్షోభంలో, అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. వైఎస్‌ను నిందించే లక్ష్యంతో రాష్ట్ర పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, విజన్ 2020 పత్రాన్ని రూపొందిస్తామని చంద్రబాబు అంటున్నారని, గతంలో శ్వేతపత్రం, విజన్ 2020 గురించి చంద్రబాబు మాట్లాడారంటే అది కొత్త పన్నులను వేయడానికో లేదా ప్రపంచబ్యాంకు విధానాలను అమలు చేయడానికో అని రాష్ట్ర ప్రజలు భయపడేవారని గుర్తుచేశారు. ఇపుడు మళ్లీ అదే మాటలు చెబుతున్నారంటే రైతుల రుణమాఫీని నీరుగార్చడానికో లేదా వైఎస్ సంక్షేమ పథకాలను కుదించడానికో అనే అనుమానాలు, భయాందోళనలు ప్రజల్లో కలుగుతున్నాయని చెప్పారు.

జగన్‌ను విమర్శిస్తే ప్రజలే బుద్ధిచెబుతారు

జగన్‌ను విమర్శిస్తే ప్రజలే బుద్ధిచెబుతారు
విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పార్టీ అనకాపల్లి లోక్‌సభ స్థానం నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబునాయుడు కాళ్లు పట్టుకుని ఆ పార్టీలోకి వెళ్లేందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వీరభద్రరావు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పెద్ద మనిషికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని దాడి వీరభద్రరావు వైఎస్సార్ సీపీలో చేరారని పేర్కొన్నారు.

చివరకు ఆయన తన కొడుకును గెలిపించుకోలేక తిరిగి జగన్‌పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగన్ లాంటి నేతను విమర్శిస్తే దాడికి పుట్టగతులుండవన్నారు. ఇదే దాడి రాష్ట్రానికి జగన్ ద్వారానే మేలు జరుగుతుందని అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. తిరిగి మళ్లీ ఆయన జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు. ఇదేం పద్ధతని ప్రశ్నించారు. అసలు దాడికి కనీస నైతిక విలువలు లేవని చెప్పారు. ఆయనది తిన్నింటి వాసాలు లెక్కించే నైజమని పేర్కొన్నారు. పార్టీ నాయకుడు గుడివాడ్ అమర్‌నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఓటమికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణం కాదని, దీనికి ఎన్నో కారణాలున్నాయని చెప్పారు.

ఒకపక్క మూడు పార్టీల కూటమి, మరోపక్క ఎల్లోమీడియా.. ఇలా అందరూ ఒకవైపు.. జగన్ ఓవైపు ఉన్నారన్నారు. అయినా రికార్డుస్థాయి ఓట్లు పడ్డాయని గుర్తుచేశారు. దాడి జగన్‌పై ఎన్నికలకు ముందుకాకుండా ఇప్పుడే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని పార్టీలో చేరిన దాడి.. తీరా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో స్వార్థప్రయోజనంతో బురద జల్లుతున్నారని విమర్శించారు. జగన్ పార్టీకి రానురాను గ్రాఫ్ పెరుగుతోందన్నారు. కొత్తగా పుట్టి అసెంబ్లీ ఎన్నికల్లో దిగిన పార్టీ రికార్డు స్థాయిలో ఓట్లు సాధించడం బహుశా ఎక్కడాలేదని చెప్పారు. కానీ దాడి ఏదో ప్రయోజనంతోనే దుర్బుద్ధితో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

‘ప్రత్యేక హోదా’ 20 ఏళ్లకు పెంచండి: మేకపాటి

‘ప్రత్యేక హోదా’ 20 ఏళ్లకు పెంచండి: మేకపాటి
న్యూఢిల్లీ: విభజన తర్వాత ఏర్పడిన అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదాను 20 ఏళ్లకు పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే విభజన బిల్లులో పేర్కొన్న అన్ని వాగ్దానాలతోపాటు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని కోరారు. బుధవారం లోక్‌సభలో ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

‘తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను నిబంధనలకు విరుద్ధంగా విడగొట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలున్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో చెప్పినట్టుగా అన్ని హామీలనూ నెరవేర్చాలి. ముఖ్యంగా ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కనీసం 20 ఏళ్లుగా మార్చాలి’ అని కోరారు.

భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్

భవిత మనదే.. యువతకే పెద్దపీట: వైఎస్ జగన్
 నియోజకవర్గ సమీక్షల్లో వైఎస్ జగన్ ప్రకటన
 గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పార్టీ బలోపేతం
 యువతకు మార్గదర్శకంగా సీనియర్లతో కమిటీలు
అధికారం కోసం చంద్రబాబులా అసత్యాలు చెప్పలేను
 టీడీపీ, ఎల్లో మీడియా దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలి
 ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరాటాలకు సిద్ధపడాలి
 వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధికారం ఖాయం
 విశాఖలో పార్టీ సమీక్షల్లో అధినేత వైఎస్ జగన్ భరోసా

 
సాక్షి, విశాఖపట్నం: ‘‘పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలి. పార్టీ శ్రేణులంతా ఏకమవ్వాలి. జిల్లాలోని అందర్నీ సమన్వయపరిచే స్థాయి ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తాం. యువతరానికే పెద్దపీట వేస్తాం. సీనియర్లను సలహా కమిటీలో చేర్చి.. యువతరాన్ని నడిపించేలా విధానాలు రూపొం దిస్తాం.. రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే అని ప్రజలు ఈ ఎన్నికల్లో విస్పష్ట సంకేతమిచ్చారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు వివరించారు. ‘‘సాధ్యం కాదని తెలిసి కూడా రూ. 88 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చారు. ప్రజలు కాస్తో కూస్తో నమ్మారు. వారిని నమ్మించేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 అదేపనిగా కంకణం కట్టుకున్నాయి.

దాంతో మనం కేవలం 5.6 లక్షల ఓట్ల తేడాతో ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు కోటీ 30 లక్షల ఓట్లొచ్చాయి. టీడీపీకి కోటీ 35 లక్షలు ఓట్లు వచ్చాయి’’ అని ఆయన కార్యకర్తలతో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా పార్టీ రెండో దశ సమీక్షా సమావేశాలు బుధవారం విశాఖపట్నంలోని బీచ్‌రోడ్‌లో గల విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. బుధవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకూ కార్యకర్తలు, శ్రేణులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకున్న జగన్ తన ప్రసంగంతో వారిలో పునరుత్తేజం నింపారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
మరో 10 రోజుల్లో అబద్ధాలు బట్టబయలు...
‘‘చంద్రబాబులా నేనూ అబద్ధం చెప్పేస్తే.. తప్పకుండా మనం అధికారంలోకి వచ్చేవాళ్లం. అయితే అధికారంలోకి వచ్చిన మూడు మాసాలకే అమలు కాదని తెలిసీ రైతు రుణమాఫీపై ఎందుకు హామీలిచ్చారు? గ్రామాల్లోకి వెళ్తే రైతులంతా మమ్మల్ని తిడుతున్నారన్నా.. అంటూ నావద్దకే వచ్చి చెప్పేవారు. నేనేవో అబద్ధాలు చెప్పి ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఆ తర్వాత జనాల వ్యతిరేకతకు గురవడానికి ఇష్టపడను. 30 ఏళ్ల పాటు విశ్వసనీయ రాజకీయాలు చేయాలనుకునేవాణ్ణి. నా మరణం తర్వా త.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తమ ఇళ్లల్లో పెట్టుకున్నట్టు.. నా ఫొటో కూడా పెట్టుకోవాలని ఆశించేవాణ్ణి. జనాలెవరూ అబద్ధాలాడే, మోసం చేసే వారి ఫొటోలను ఇళ్లల్లో ఉంచుకోవాలనుకోరు. మరో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. రుణాల కోసం బ్యాంకులకు రైతులు వెళ్తారు. పాత రుణాలు చెల్లించకపోతే కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తిప్పి పంపిస్తారు. టీడీపీ అబద్ధపు హామీలు బయటపడతాయి. అయినప్పటికీ చంద్రబాబుకు వంతపాడేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 మళ్లీ ముందుకొస్తాయి. గ్రామ స్థాయి నుంచే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ఉద్యమించేందుకు మనం సిద్ధంగా ఉండాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు.
 
జైల్లో పెట్టి లొంగదీసుకోవాలనుకున్నారు...
‘‘నాపై కేసుల విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎల్లో మీడియా చేస్తోంది. వైఎస్సార్ బతికున్నపుడు, జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు ఈ కేసులు పెట్టలేదు. వైఎస్సార్ మరణించిన 18 మాసాలకు, జగన్ పార్టీ నుంచి బయటికొచ్చేసిన రెండు మాసాలకు కేసులు పెట్టారు. ప్రత్యర్థిగా ఎక్కడ తయారవుతానోనన్న భయంతోనే.. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలకు పాల్పడ్డాయి. జైల్లో పెట్టి ఎన్ని విధాలా లొంగదీసుకోవాలన్నా.. లొంగలేదు. జైల్లో ఉంటూనే.. ఎఫ్‌డీఐ బిల్లుకు వ్యతిరేకంగా మన ఎంపీలతో ఓటేయించాం. చంద్రబాబు విప్ జారీ చేసి మరీ తమవారిని అడ్డుకున్నారు. కిరణ్ సర్కార్ ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ చార్జీలు వడ్డిస్తే.. ఇదే చంద్రబాబు విప్ జారీ చేసి కాంగ్రెస్‌ను కాపాడారు. ఆ సమయంలో కనీస మెజార్టీ 148 సీట్లకు రెండు తక్కువగా 146 ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ ఉంది. అప్పుడే చంద్రబాబు సహకరిస్తే రాష్ట్ర విభజనే జరిగేది కాదు. నాకున్న బలం దేవుడి దయ.. ఇంతమంది గుండెల్లో అభిమానం. నేనెవరికీ అన్యాయం చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9కు కూడా. అయినా నేనంటే వారికి ద్వేషం. 2004 లోనూ ఇదే జరిగింది. అయినా నాన్నగారికి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి భయంతో సర్వశక్తులూ ఒడ్డింది. మనం గెలుపు ధీమాతో నిర్లిప్తం గా వ్యవహరించాం.. అంతే తేడా!

యువతకే ప్రాధాన్యం...

పార్టీ దెబ్బతిన్న చోట మన వాళ్లకు మనోధైర్యం కలి గించాలి. జరిగిన తప్పు మరోసారి పునరావృతం కాకుండా సరిదిద్దుకోవాలి. పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలి. అధికారపక్షం నేతల నుంచి భౌతిక దాడులు, బెదిరింపులు ఉండొ చ్చు. వాటిని ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులంతా ఏకమవ్వాలి. జిల్లాలోని అందర్నీ సమన్వయపరిచే స్థాయి ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తాం. యువతరానికే పెద్దపీట వేస్తాం. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో యువతకే ప్రాధాన్యం ఇస్తాం. పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. వయసెక్కువ ఉన్న సీనియర్ నేతలను సలహా కమిటీలో చేర్చి.. యువతరాన్ని నడిపించేలా విధానాలు రూపొందిస్తాం.
 
రాబోయే భవిష్యత్తు మనదే...
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ రెండూ ప్రతి పక్ష పార్టీలుగానే ఎన్నికలకు వెళ్లాయి. దాంతో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక ఓటు ఎవరికి వెళుతుందోనన్న సందిగ్ధత ఉండేది. కానీ వచ్చేసారి మనం ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళతాం. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు ఈ ఐదేళ్లలో పూర్తిగా విఫలమవుతారు. వైఎస్సార్ కాంగ్రెస్  ఈ ఐదేళ్లు సంస్థాగతంగా బలోపేతం కావడంతో పాటు.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరుబాటలో సాగుతుంది. దాం తో కచ్చితంగా వైఎస్సార్ సీపీనే అధికారంలోకి వస్తుం ది. మనం కేవలం మన రాజకీయ ప్రత్యర్థి టీడీపీతోనే కాదు.. ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియాతో కూడా పోరాడాల్సి వస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 నిష్కారణంగా మనపై భవిష్యత్తులో కూడా దుష్ర్పచారం చేస్తాయి. కానీ మనం మాత్రం విశ్వసనీ యతతో కూడిన రాజకీయాలు చేయాలి. నిత్యం ప్రజల తోనే ఉండాలి. దాంతో ప్రజలే వాస్తవాలు గ్రహిస్తారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే వైఎస్సార్ సీపీ ని ఆదరిస్తారు’’ అని జగన్ భరోసా కల్పించారు.

పదవుల కోసమే దాడి పిచ్చివాగుడు

Written By news on Wednesday, June 11, 2014 | 6/11/2014

'పదవుల కోసమే దాడి పిచ్చివాగుడు'మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు
విశాఖపట్నం: పదవుల కోసమే దాడి వీరభద్రరావు పిచ్చివాగుడు వాగుతున్నారని వైఎస్ఆర్ సిపి మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు విమర్శించారు. పలువరు పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిస్తేనే దాడి అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు.  పార్టీలోకి రమ్మని దాడిని ఎవరూ ఆహ్వానించలేదని చెప్పారు. దాడి ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు.  పదవుల కోసమే దాడి ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిపోదలచుకుంటే వెళ్లిపోవాలని, ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిదికాదని అన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇతర నాయకులు మాట్లాడుతూ  జగన్ ఓ శక్తి అని, ఆ శక్తిని అడ్డుకునే దైర్యం ఎవరికీ లేదన్నారు.  పార్టీ మారాలన్న ఉద్దేశం, అధికార దాహంతో దాడి అలా మాట్లాడుతున్నారన్నారు. టిడిపిలో పదవులు అనుభవించిన దాడి, అధికారంలో ఉండే పార్టీలోకి వెళ్లడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ పార్టీ మారడానికే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఊసరవెల్లిలా పార్టీలు మారే దాడి  నైజం మరోసారి బయటపడిందన్నారు. దాడి కోవర్టుగా వచ్చినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించారు. ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరే సమయంలో చంద్రబాబు నాయుడుని విమర్శించారు. ఇప్పుడు జగన్ ను విమర్శిస్తున్నారు. ఆయన నైజం అదేనన్నారు. ప్రజలు అర్ధం చేసుకుంటారని చెప్పారు. ఆయన ఎక్కువగా మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు తిప్పికొడతానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పార్టీలో విలీనం కావలసిన పరిస్థితి లేదన్నారు. జగన్ పై అభిమానంతో తమ పార్టీకి జనం బాగానే ఓట్లు వేసినట్లు చెప్పారు. కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు శ్వేతపత్రాలు, విజన్ లంటే ప్రజలకు భయం

చంద్రబాబు శ్వేతపత్రాలు, విజన్ లంటే  ప్రజలకు భయం
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలన్నా, విజన్‌ డాక్యుమెంట్లన్నా ఈ రాష్ట్ర ప్రజలకు చాలా భయం అని వైఎస్ఆర్ సిపి ఉరవకొండ  ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ  గతంలో చంద్రబాబు ఇలాంటి పత్రాలు విడుదలచేసినప్పుడు కొత్త పన్నులు వేసేవారని,  ప్రపంచ బ్యాంకు షరతులను అమలుచేసేవారని చెప్పారు.  చంద్రబాబు విజన్‌ 2020 పెద్ద బోగస్‌ అని కొట్టిపారేశారు.   వీటన్నింటి పేరుపై సంక్షేమ కార్యక్రమాలను కుదించే ప్రయత్నాన్ని ఆయన చేస్తారన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. విజన్‌ డ్యాంక్యుమెంట్ల పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీనికి వేరే వారు కారణమని చంద్రబాబు చెప్తున్నారని విమర్శించారు. 30 సంవత్సరాలుగా ఆయన వివిధ హోదాల్లో ఉన్నారని,  అలాంటి చంద్రబాబు తన ముందు ఏదో కొత్త పరిస్థితి ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  రుణమాఫీ అమలును కూడా నీరుగారుస్తారనే అనుమానం తమకు ఉందన్నారు.  ఈ హామీలు ఇచ్చినప్పుడు ఆయనకు రాష్ట్ర పరిస్థితులు తెలియనివికావన్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో రైతులు అప్పుల్లో కూరుకుపోయారని గుర్తు చేశారు.  ఆయన వైఎస్సార్‌సీపీని నిందించడం మానుకొని, చిత్తశుద్ధితో పనిచేయాలని విశ్వేశ్వర్‌రెడ్డి సలహా ఇచ్చారు.

సమస్యలపై పోరాటం: వైఎస్ జగన్ పిలుపు

సమస్యలపై పోరాటం: వైఎస్ జగన్ పిలుపువిశాఖ సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
విశాఖపట్నం: సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉందామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌లో  జరుగుతున్న సమావేశంలో మొదటగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంపై  సమీక్ష నిర్వహించారు. పెందుర్తి, మాడుగుల శాసనసభ స్థానాలపై సమీక్షలు ముగిశాయి.  మాడుగుల నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన ముత్యాల నాయుడును జగన్ అభినందించారు. కార్యకర్తలు చెప్పిన అన్ని విషయాలను జగన్ విన్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మనం బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు.  గ్రామస్థాయి నుంచే క్యాడర్‌ని బలోపేతం చేయడానికి అందరు కృషిచేయాలని కార్యకర్తలను కోరారు.  ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నుంచే పోరాడుదామన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్పారన్నారు.  ఇచ్చిన హామీలు అమలుకు చంద్రబాబును నిలదీద్దామన్నారు.

ప్రతిపక్షం నుంచే పోరాడదాం: వైఎస్ జగన్

ప్రతిపక్షం నుంచే పోరాడదాం: వైఎస్ జగన్
విశాఖ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి నుంచే క్యాడర్ ను బలోపేతం చేయాడానికి అందరూ కృషి చేయాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నుంచే పోరాడదామని ఆయన అన్నారు.

విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌లో  జరుగుతున్న ఈ సమీక్షలో  తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా జగన్ సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.

విశాఖలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, నేతలు,అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ రెండు రోజుల పాటు సమీక్ష జరుపుతారు.

బుధవారం తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా ఆయన సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.

Popular Posts

Topics :