15 June 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

గవర్నర్ ప్రసంగమా... సంతాప తీర్మానమా: వైఎస్ఆర్ సీపీ

Written By news on Saturday, June 21, 2014 | 6/21/2014

గవర్నర్ ప్రసంగమా... సంతాప తీర్మానమా: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగమా లేక సంతాప తీర్మానమా అంటూ ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై శనివారం హైదరాబాద్ లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా మాట్లాడారు. నరసింహన్ ప్రభుత్వ కరపత్రం చదవి రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆరోపించారు. విడిపోయిన రాష్ట్రంలో సంతాప సభలో మాట్లాడినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు.

గవర్నర్ తన ప్రసంగంతో ప్రజలకు మనోధైర్యం ఇవ్వలేకపోవడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆశలను నీరుగార్చారన్నారు. బీఏసీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కల్పించకపోతే ఆ సమావేశం నుంచి బహిష్కరిస్తామని వారు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం ఆసాంతం ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించినట్లు ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రోజాలు విమర్శించారు.

బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్ఆర్ సీపీ

శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశాన్ని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. బీఏసీలో సముచిత ప్రాధాన్యత కల్పించేవరకూ తాము బీఏసీ సమావేశాలకు హాజరు అయ్యేది లేదని ఆపార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలోకి తొక్కిందని ఆయన మండిపడ్డారు.
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సదుద్దేశంతో సహకరిస్తున్నా... అధికార పక్షం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ఇద్దరికే అవకాశం కల్పిస్తామంటూ మొండి వైఖరి అలవంభిస్తున్నారని జ్యోతుల నెహ్రు ధ్వజమెత్తారు. గతంలో పాటించిన సాంప్రదాయాలనే ఇప్పుడు కూడా పాటించాలని ఆయన డిమాండ్పక్షం

ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం

రైలు చార్జీల మోత
 ప్రయాణికులపై 8 వేల కోట్ల భారం
 సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రైల్వే ప్రయాణికులపై చార్జీల బాంబు పేలింది. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్‌డీఏ సర్కారు నెల తిరగకముందే రైల్వే చార్జీలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్యులు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరిపైనా చార్జీల భారం మోపింది. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టటానికి కొద్ది రోజుల ముందుగా అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ, సరకు రవాణా చార్జీలనూ పెంచేసింది. రైలు ప్రయాణ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచగా.. రైల్వే రవాణా చార్జీలను 6.5 శాతం పెంచింది. తద్వారా ఏటా రూ.8వేల కోట్ల మేర ప్రజ లపై నేరుగా భారం మోపింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.
 
  ప్రయాణ చార్జీల పెంపు ప్రజలపై నేరుగా ప్రభావం చూపనుండగా.. రవాణా చార్జీల పెంపు ప్రభావం పారిశ్రామిక రంగంతో పాటు.. అన్ని రకాల నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీయటం ద్వారా పరోక్షంగా భారాన్ని మరింత పెంచనుంది. రైలు చార్జీల పెంపును ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా తప్పుపట్టాయి. ఇంత భారీగా చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపటం నేరపూరితమని ఎన్‌డీఏ సర్కారుపై మండిపడ్డాయి. చార్జీలను పెంచే ముందుగా పార్లమెంటును ఎందుకు విశ్వాసంలోకి తీసుకోలేదని ప్రశ్నించాయి. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రకటించాక.. చార్జీల పెంపు నిర్ణయాన్ని తీసుకోవటంలో ఔచిత్యమేమిటని నిలదీశాయి. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి.
 
 దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్న వారం రోజుల్లోనే రైల్వే చార్జీల పెంపును ప్రకటించటం గమనార్హం. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన మే 16వ తేదీనే రైల్వేశాఖ చార్జీల పెంపును ప్రకటించింది. పెంపు అదే నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని కూడా చెప్పింది. అయితే ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో పెంపు ప్రకటన చేయటం పట్ల తీవ్ర విమర్శలు రావటంతో.. చార్జీల పెంపు అమలుపై రైల్వేబోర్డు వెనక్కు తగ్గింది. చార్జీల పెంపుకు సంబంధించిన వ్యవహారాన్ని తర్వాత రాబోయే ప్రభుత్వానికే అప్పగించాలని రైల్వేబోర్డుకు నిర్దేశిస్తూ నాటి యూపీఏ సర్కారులోని రైల్వేమంత్రి మల్లిఖార్జునఖర్గే ప్రకటన జారీచేశారు. ఈ మేరకు చార్జీల పెంపును నిలిపివేస్తున్నట్లు రైల్వేబోర్డు ఆ వెంటనే అధికారికంగా ప్రకటించింది.
 
 ‘నిలిపివేత’ను ఉపసంహరిస్తున్నానంతే...
 తాజాగా శుక్రవారం రైలు చార్జీల పెంపును ఢిల్లీలో ప్రకటించిన కొత్త రైల్వే మంత్రి సదానంద్‌గౌడ.. ‘‘మా ముందరి మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేయక తప్పని పరిస్థితి. చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను మాత్రమే నేను ఉపసంహరిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. గత (యూపీఏ) ప్రభుత్వం సమర్పించిన తాత్కాలిక బడ్జెట్‌లో.. మే 16వ తేదీన ప్రకటించిన చార్జీల పెంపు ప్రాతిపదికగా ఆదాయాన్ని అంచనా వేసిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఖరారు చేసిన చార్జీలను పెంచనిదే వార్షిక వ్యయాన్ని పూర్తిచేయటం సాధ్యం కాదన్నారు. కాబట్టి.. సవరించిన ప్రయాణ చార్జీలు, రవాణా చార్జీల పెంపును నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరిస్తున్నట్లు వివరించారు. దీంతో.. ఈ నెల 25వ తేదీ నుంచి పెంచిన ప్రయాణ, రవాణా చార్జీలు అమలులోకి వస్తాయని తెలిపారు. రైల్వేకు ప్రయాణ విభాగంలో ఏటా 900 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
 
 చమురు ధరలు తగ్గితే ఎఫ్‌ఏసీని సమీక్షిస్తాం: రైల్వేశాఖ
 చార్జీల పెంపుపై తీవ్ర విమర్శలు రావటంతో రైల్వేశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తాజా పెంపుపై వివరణ ఇచ్చింది. రైల్వే ప్రయాణ చార్జీలను 10 శాతం, రవాణా చార్జీలను 5 శాతం చొప్పున పెంచామని.. అయితే ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఏసీ) కూడా కలవటంతో ఈ పెంపు 14.2 శాతానికి, 6.5 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల ప్రకారం రిటైల్ పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ ధరలను సవరించినట్లు.. ప్రతి ఆరు నెలలకోసారి రైల్వే కూడా ఎఫ్‌ఏసీని సవరిస్తుందని వివరించింది. చమురు ధరల కారణంగా పెంచిన ఎఫ్‌ఏసీని.. చమురు ధరలు తగ్గిన పక్షంలో సమీక్షించటం జరుగుతుందని తెలిపింది. గత ప్రభుత్వం కూడా రెండు పర్యాయాలు ఎఫ్‌ఏసీని అమలు చేసిందని.. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్‌లో దీనిని అమలు చేసిందని ఉటంకించింది.
 
 ముందే తీసుకున్న టికెట్లకూ పెరిగిన చార్జీలు వర్తిస్తాయి
 ప్రయాణ చార్జీలను అన్ని తరగతుల్లోనూ 10 శాతం మేర పెంచగా.. ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఏసీ) రూపంలో అదనంగా మరో 4.2 శాతం పెంచారు. మొత్తంగా 14.2 శాతం మేర అన్ని తరగతుల చార్జీలూ భారం కానున్నాయి. లోకల్ రైలు టిక్కెట్‌లు, నెలవారీ పాస్‌ల పైన కూడా చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ నెల 25 (బుధవారం) అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.
25వ తేదీ అర్ధరాత్రి తర్వాత ప్రయాణం చేయటం కోసం.. పెరిగిన చార్జీల కన్నా ముందే ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను తీసుకుని ఉంటే.. పెరిగిన చార్జీల మేరకు తేడాను టికెట్ కౌంటర్లలో కానీ, ప్రయాణ సమయంలో రైళ్లలో టీటీఈలకు గానీ చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. రిజర్వేషన్ చార్జీలు, సూపర్‌ఫాస్ట్ చార్జీలను పెంచలేదు.

 ఇదా మీ సానుభూతి?: కాంగ్రెస్

 ‘‘ప్రభుత్వంలోకి వచ్చాక.. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా.. శ్వేతపత్రం విడుదల చేయకుండా.. రైల్వే బడ్జెట్ కోసం ఆగకుండా.. రైల్వే ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదం టూ.. చార్జీలను పెంచేశారు. నిన్నటివరకూ సామాన్యుడి ఆందోళనలను ఎలా పరిష్కరించాలనే దానిగురించి మాట్లాడిన వీరు.. తమకు ఓటేసి అధికారంలోకి తీసుకువచ్చిన అదే సామాన్యుడిపై ఇప్పుడు భారం మోపటం మొదలుపెట్టారు.. సామాన్యుడిపై చూపుతున్న సానుభూతి ఇదా?’’ అని కాంగ్రెస్ నేత మనీశ్‌తివారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 నేరపూరితం.. ఉపసంహరించాలి: సీపీఎం
 ‘‘రైల్వే చార్జీల అనూహ్య పెంపును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే అదుపులేని ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై రైలు చార్జీల పెంపు పెను భారంగా మారుతుంది. ఇది నేరపూరితం. చార్జీల పెంపును ఉపసంహరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అసలీ ప్రభుత్వ కపటత్వాన్ని చూడండి.. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల మధ్య, బడ్జెట్‌కు ముందు చార్జీలు పెంచితే.. ఎంత అప్రజాస్వామికమోనని వారు అంటారు. మోడీ సర్కారు సరిగ్గా అదే అప్రజాస్వామికంగా పార్లమెంటును అధిగమించి చార్జీలు పెంచింది’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మండిపడ్డారు.
 
 సరకు రవాణా చార్జీలు 6.5%
 సరకు రవాణా చార్జీలను 6.5 శాతం మేర పెంచగా.. ఇందులో 1.4 శాతం ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఏసీ)గా రైల్వే పేర్కొంది. సరకుల వర్గీకరణను కూడా 4 తరగతుల నుంచి 3 తరగతులకు తగ్గించారు. ఇప్పటి వరకు సరకు రవాణాకు కనీస దూరం 100 కిలోమీటర్లు కాగా.. దీనిని ఇప్పుడు 125 కిలోమీటర్లకు పెంచారు. సరకు రవాణా చార్జీల పెంపు పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా ఉక్కు, సిమెంటు, విద్యుత్, ఎరువులు, రసాయనాలు వంటి పారిశ్రామిక ఉత్పత్తుల ధరలూ పెరగనున్నాయి.
 
 పెరిగిన రైల్వే చార్జీలు ఇవీ..
 సాక్షి, హైదరాబాద్/విజయవాడ/విశాఖపట్నం/తిరుపతి: రైల్వే చార్జీల పెరుగుదల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడనుంది. ఆర్‌టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలను తట్టుకోలేక రైళ్లను ఆశ్రయిస్తున్న జనానికి.. ఇప్పుడు ఆ చార్జీలు కూడా భారీగా పెరగటం ఇబ్బందికరంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రతినిత్యం 709 రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. వీరందరిపైనా చార్జీల ప్రభావం ఉండనుంది. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే సుమారు రెండు లక్షల మంది నిత్యం రాకపోకాలు సాగిస్తారని అంచనా. 300 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణానికి స్లీపర్ క్లాస్ అయితే సుమారు రూ. 30 నుంచి రూ. 50 మేర చార్జీ పెరిగింది. ఏసీ త్రీ టైర్, టు టైర్ అయితే రూ. 50 నుంచి రూ. 100 మధ్య పెరిగింది.
 
 వరుసగా రెండేళ్లు భారీ వడ్డనలు..
యూపీఏ హయాంలో గతేడాది రైల్వే చార్జీలు భారీగా పెరిగాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మరోసారి చార్జీల భారం మోపింది. కేవలం ఏడాది కాలంలోనే ప్రజలపై రెండు సార్లు రైల్వే చార్జీల భారం పిడుగుపాటులా పడడం గమనార్హం. అంతకుముందు పదేళ్ల పాటు రైల్వే చార్జీల్లో ఎగువ స్థాయి తరగతుల్లో ఒకటీ అరా పెంపు తప్ప ఎలాంటి మార్పులూ లేవు.
అయితే.. 2012 ఫిబ్రవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్‌త్రివేది రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా రూ. 4000 కోట్ల మేర చార్జీల పెంపు ప్రకటించారు. కానీ తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ సమయంలో త్రివేది మంత్రి పదవిని కూడా కోల్పోవలసి వచ్చింది. కానీ ఆ మరుసటి ఏడాది.. అంటే గత ఏడాది 2013 జనవరి 21న అప్పటి రైల్వే మంత్రి బన్సల్ చార్జీలు పెంచారు. యూపీఏ-2 పాలనా కాలం పూర్తయ్యే వరకు కూడా చార్జీలు పెంచొద్దని భావించినప్పటికీ నష్టాలు, నిర్వహణ భారం దృష్ట్యా చార్జీల పెంపు అనివార్యమైందని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ఏడాది ప్రజలపైన రూ. 6,600 కోట్ల మేర భారం పడింది.

తండ్రీ కొడుకులు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన సంఘటనలు చాలా అరుదు

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్
అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిన ఏపీ స్పీకర్ కోడెల
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికారికంగా ప్రకటించారు. సభలో వైఎస్సార్ సీపీకి 67 మంది సభ్యుల బలముంది. ఇప్పటికే వారు శాసనసభాపక్ష నేతగా జగన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
 
 ప్రతిపక్ష నేతలుగా తండ్రీ కొడుకులు: తండ్రీ కొడుకులు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన సంఘటనలు చాలా అరుదు. కానీ ఈ అరుదైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, ప్రజానేతగా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1999-2004 మధ్య కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇదే శాసనసభలో ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడతామని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

మీరు మా వైపు (ప్రతిపక్షం) వచ్చే దాకా మీరు ఆవైపు (అధికారపక్షం) ఉన్నట్టే

మీరు మావైపు వచ్చే దాకా అటున్నట్టే!
* బీజేపీకి జగన్ చురక
బీజేపీ నేతల అభ్యంతరం కలలు కనొద్దన్న యనమల
ఆ దేవుడే నిర్ణయిస్తాడన్న జగన్
తడబడిన యనమల.. సభలో నవ్వులు


 సాక్షి, హైదరాబాద్:
 ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాల్లో రెండో రోజయిన శుక్రవారం మాటల తూటాలు పేలాయి. శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయిన కోడెల శివప్రసాదరావుకు అభినందనలు తెలిపే సమయంలో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తున్నప్పుడు ఒకసారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యలతో మరోసారి మాటల యుద్ధం నడిచింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ సభలో ప్రస్తుతం రెండే పార్టీలున్నాయని అన్నారు. మూడో పార్టీగా తామూ ఉన్నామని బీజేపీ సభ్యుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ‘మీరు మా వైపు (ప్రతిపక్షం) వచ్చే దాకా మీరు ఆవైపు (అధికారపక్షం) ఉన్నట్టే’ అని జగన్ బదులిచ్చారు.
 
 దానికి శ్రీనివాస్ ‘మాది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీతో ఎలా కలుస్తాం’ అంటుండగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకున్నారు. ‘‘జగన్ ఇంతవరకు అధికారం కోసం కలలు కన్నారు. ఇప్పుడూ కంటున్నారు. మేము ఎప్పటికీ అధికారపక్షమే, మీరు ప్రతిపక్షమే’’ అన్నారు. (ఈ సందర్భంలో యనమల తడబడ్డారు. మేమెప్పుడూ అధికారపక్షమే అనబోయి ప్రతిపక్షమే అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ప్రతిపక్ష సభ్యులు బల్లలు చరిచారు) యనమల వ్యాఖ్యలను జగన్ తిప్పికొడుతూ అధికారాన్ని దేవుడు నిర్ణయిస్తారన్నారు. ‘‘1999లో నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పాలకపక్షంలో ఉన్నారు. అదే శాశ్వతమని అప్పట్లో టీడీపీ చెప్పింది. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఎన్నికల్లో నాన్న అధికారంలోకి వచ్చారు. అధికారం అన్నది దేవుడు ఇస్తాడు. ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజలకు విడిచిపెడదాం. ఇక్కడివరకు సమస్యలపై దృష్టి పెడదాం. ప్రజాసేవకు పని చేద్దాం’’ అని చెప్పి ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టారు.
 
 మీ పడవ బోల్తా పడుతుంది: జలీల్ ఖాన్
 వైఎస్సార్ సీపీ సభ్యుడు జలీల్ ఖాన్ ప్రసంగిస్తున్నప్పుడు యనమల వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. ‘‘ఈ అధికారమేదో పర్మినెంట్ అనుకుంటున్నట్టున్నారు యనమల.. ఇది పర్మినెంట్ కాదు. ఎంత తేడాతో ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చారో చూడండి. తక్కువ నీళ్లలో నడుస్తున్న మీ పడవ బోల్తాపడుతుంది. తొందర్లోనే మేము అధికారంలోకి వస్తాం’’ అని జలీల్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిప్పికొడుతూ జలీల్ ఖాన్ టీడీపీనుంచి వెళ్లిన సంగతి తనకు బాగా తెలుసునన్నారు. ఈవైపు నుంచి వెళ్లిన వారే ఇప్పుడక్కడ ఉన్నారని చెప్పారు.
 
 దీనికి జలీల్ ఖాన్ తీవ్ర అభ్యంతరం చెబుతూ చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చిన వారేనని గుర్తుచేశారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘అంతెందుకు మీరు (గోరంట్ల) కూడా సీటు ఇస్తే ఇటు (వైఎస్సార్‌సీపీ) వైపు వస్తానని చెప్పిన వారేగా.. మా పార్టీలో (టీడీపీ) పరిస్థితి బాగా లేదన్న వారేగా? ఒక్క మైనారిటీ సభ్యుణ్ణి కూడా లేకుండా చేసుకున్న మీరా మాట్లాడేది?’’ అంటూ విరుచుకుపడ్డారు. 
 
 సభకు కరెంటు కోత: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకూ కరెంటు కోత తప్పలేదు. ఉదయం సభ జరుగుతుండగానే సభలో కరెంటు పోయింది. 10.50 గంటల సమయంలో పోవడంతో సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే జనరేటర్లు ప్రారంభమైనప్పటికీ కరెంటు వస్తూ పోతూనే ఉంది. సభలో మైకులు కూడా సరిగా పని చేయలేదు. వెనుక వరుసలోని ఏ మైకూ పని చేయకపోవడంతో సభ్యులు ముందుకు వచ్చి మాట్లాడారు. కాగా, ఈ వేళ సందర్శకులతో సభ గ్యాలరీ కళకళలాడింది. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు గ్యాలరీ లో కూర్చుని కొద్దిసేపు సభా కార్యక్రమాలను తిలకించారు.

పెంచిన ఛార్జీలు తగ్గించాలి

Written By news on Friday, June 20, 2014 | 6/20/2014

పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : రైల్వే ఛార్జీల పెంపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో, అసలు ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా రైల్వే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

ప్రయాణికులపై భారీ మొత్తంలో భారం మోపారని, అలాగే సరుకు రవాణా ఛార్జీలు కూడా పెంచి రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని ఉమ్మారెడ్డి  వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్, అసెంబ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ శుక్రవారం సభలో ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను శనివారానికి వాయిదా వేశారు. అంతకు ముందు స్పీకర్ మాట్లాడుతూ సభలో అధికారం, ప్రతిపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. సభ్యుల తీరును ప్రజలందరకూ గమనిస్తూ ఉంటారన్నారు.

సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే

మేము ఎప్పటికీ ప్రతిపక్షంలోనే....యనమల!వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తడబడ్డారు. తాము ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటామన్న ఆయన ఆ తర్వాత తన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఎన్నిక అయిన సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సభలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని, ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్షం అన్నారు.
అయితే మూడో పార్టీ బీజేపీ కూడా ఉందని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. దానిపై జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అయితే టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉందని, వారు ఇటువైపు వచ్చే వరకు పాలకపక్షంగానే పరిగణిస్తామని జగన్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

దీనిపై యనమల స్పందిస్తూ ఎప్పటికీ తాము పాలకపక్షంలోనే ఉంటామని అనబోయి.. ప్రతిపక్షంలోనే ఉంటామని అన్నారు. ఆ తర్వాత వెంటనే తన పొరపాటును సద్దుకున్నారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ 1999 సంవత్సరంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉంటారని టీడీపీ నేతలు అన్నారని, అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అధికారం అన్నది దేవుడు ఇస్తారని, ప్రజలు నిర్ణయిస్తారని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్

వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ప్రతిపక్షంగా తాము ప్రజావాణిని వినిపిస్తామని శాసనసభలో ప్రధాన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన శుక్రవారం సభలో మాట్లాడుతూ సభలో ఉన్నవి రెండు పార్టీలు మాత్రమేనని, స్పీకర్ అధికార పార్టీ సభ్యుడిగా కాకుండా ప్రతిపక్షానికి కూడా మద్దతుగా ఉండాలన్నారు.

ప్రతిపక్షానికి స్పీకర్ సభలో తగిన అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం అనే బండికి స్పీకర్ ఇరుసు లాంటివారు అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే బేధం లేకుండా సమదృష్టితో వ్యవహరించాలని ఆయన...స్పీకర్ ను కోరారు. భావి తరాలకు స్పీకర్ ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలపై జగన్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎవరు అధికారంలో ఉండాలో దేవుడే తేలుస్తాడని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి

దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి
 కర్నూలు(కలెక్టరేట్) : దశలవారీగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిని ఆయన చాంబర్‌లో కలిసి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ, కోడుమూరు-మంత్రాలయం రైల్వేలైన్ సర్వే వివరాలు తీసుకుని  రైల్వే మంత్రిని కలుస్తామన్నారు.

కేంద్ర విద్యా సంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలు నెలకొల్పవచ్చు అనే దానిపై జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రలో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఇక్కడ పరిశ్రమలతో పాటు విద్యా సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

నీటి సమస్య పరిష్కారంపై తన వంతు కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జిల్లాకు 24 టీఎంసీల నీటిని కేటాయిస్తే 16 టీఎంసీలు మాత్రమే వస్తుందని, కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌తో చర్చించినట్లు అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, వీటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు.

కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ

కాలినడకన తిరుమల కొండెక్కిన ఎంపీ వైవీ
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలతారెడ్డి దంపతులు గురువారం తిరుమల శ్రీవారికి కాలినడక మొక్కు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. ప్రస్తుతం శబరిమలై యాత్ర ముగించుకున్న వైవీ సుబ్బారెడ్డి తిరుమలేశునికి కాలినడక, తలనీలాల మొక్కులు చెల్లించేందుకు సతీసమేతంగా శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమల చేరుకున్నారు.

ఆ తర్వాత అతిథిగృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, స్వర్ణలతారెడ్డి మూడు కత్తెర్లతో తలనీలాల మొక్కు చెల్లించారు. వీరు శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకుంటారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఆయన శబరిమలై నడకతోపాటు తిరుమల కాలిబాటలో నిటారైన సుమారు 3 వేలకుపైగా మెట్లు ఎక్కి తిరుమల చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించి యాత్రను పరిపూర్ణం చేసుకోవడం గమనార్హం.

వైఎస్సార్‌సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు

వైఎస్సార్‌సీపీకే మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు
జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు
 సిద్దవటం:  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే కడప మేయర్, జెడ్పీ చైర్మన్ పదవులు లభిస్తాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు అన్నారు. మండలంలోని మూలపల్లె గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ ఉపాసి వెంకటసుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి చెందిన జెడ్పీటీసీలు మెజార్టీ స్థానాలలో గెలుపొందారన్నారు. 41 మంది జెడ్పీటీసీలు విజయం సాధించగా వారిలో 33 మంది క్యాంపులో ఉన్నారన్నారు. అలాగే కడప మేయర్ పదవి కూడా వైఎస్సార్‌సీపీకే దక్కుతుందన్నారు. డబ్బు, అధికార బలంతో టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్సార్‌సీపీకే ఈ పదవులు దక్కటం ఖాయమన్నారు.

రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుని దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకుని దుర్మరణం
జూలూరుపాడు: జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కరివారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్, వైఎస్‌ఆర్ సీపీ మండల సీనియర్ మండల నాయకుడు ఆంగోతు కృష్ణారావు(65) మృతిచెందారు.

పోలీసులు తెలిపిన ప్రకారం...
 కరివారిగూడెం గ్రామ సర్పంచ్ ఆంగోతు ధనమ్మ భర్త, మాజీ సర్పంచ్, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు ఆంగోతు కృష్ణారావు గురువారం జూలూరుపాడులోని తన కూతురు ఝాన్సీ ఇంటికి వెళ్లారు. అక్కడ మనుమరాళ్లుతో కొద్దిసేపు గడిపి తిరిగి కరివారిగూడెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు.

కొత్తగూడెం వైపు నుంచి జూలూరుపాడుకు వస్తున్న  బోర్‌వెల్ వాహనం.. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో గేదెలను తప్పించే క్రమంలో కృష్ణారావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. కృష్ణారావు అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రమాద స్థలంలో కృష్ణారావు మృతదేహాన్ని చూసి కుటుంబీకులు, బంధువులు గుండెవిసేలా రోదించారు.

కరివారిగూడెం గ్రామస్తులు, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. కృష్ణారావు దుర్మరణంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి ఎస్‌ఐ ఎన్.గౌతమ్ తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంగోతు కృష్ణారావు మృతిపట్ల ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, మండల కన్వీనర్ పొన్నెకంటి వీరభద్రం, రైతు విభాగం జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దారావతు నాగేశ్వరరావు తదితరులు కూడా వేరొక ప్రకటనలో సంతాపం తెలిపారు.

కొంగొత్త ఆశలు, ఆకాంక్షల మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ

కొలువుదీరిన ఏపీ తొలి అసెంబ్లీ
ముహూర్తం ప్రకారమే సభ ఆరంభం
చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి పరస్పర అభివాదాలు
సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్
ముందు చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం

సాక్షి, హైదరాబాద్: 
కొంగొత్త ఆశలు, ఆకాంక్షల మధ్య నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ గురువారం కొలువు దీరింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న పాత అసెంబ్లీ హాలు ఇందుకు వేదికైంది. మెడలో పార్టీ కండువాలు, ఆత్మీయ కరచాలనాలు, ఉభయ కుశలోపరి పలకరింపుల మధ్య ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 11 గంటల 52 నిమిషాలకు సభ ప్రారంభమైంది. సీనియర్ సభ్యుడైన పతివాడ నారాయణ స్వామి నాయుడు ఈ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికయిన శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రొటెం స్పీకర్ సభలోకి అడుగిడగానే అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, నూతన ప్రజాప్రతినిధులు గౌరవసూచకంగా లేచి నిలబడి సాదర స్వాగతం పలికారు. అనంతరం సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూర్చున్న చోటుకు వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురూ పరస్పర అభివాదాలు, కరచాలనం చేసుకున్నారు. సభా మర్యాదలను చదివి వినిపించిన అనంతరం సభ్యులతో ప్రొటెం స్పీకర్ పతివాడ ప్రమాణ స్వీకారాలు చేయించారు.

 ప్రమాణ స్వీకారం మొదలైందిలా..
 తొలుత సభా నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి దైవం పేరిట శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పేరు పిలిచినప్పుడు పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ ముకుళిత హస్తాలతో ప్రొటెం స్పీకర్‌కు, సభికులకు, సిబ్బందికి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులయిన కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పతోపాటు సీహెచ్ అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పి.సునీత తదితర మంత్రులు ప్రమాణం చేశారు. మంత్రుల్లో కామినేని శ్రీనివాసరావు ఆంగ్లంలో ప్రమాణం చేయగా మిగతా వారందరూ తెలుగులో చేశారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి కె.మృణాళిని పేర్లు పిలిచినప్పుడు సభలో లేకపోవడంతో వారు ఆ తర్వాత ప్రమాణం చేశారు.

 అక్షర క్రమంలో మహిళా సభ్యులు..
 మంత్రులవంతు పూర్తయిన తర్వాత మహిళా శాసన సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో జి.ఈశ్వరి పవిత్ర హృదయం సాక్షిగా ప్రతిజ్ఞ చేయగా మిగతా వారు దైవసాక్షిగా చేశారు. పురుషుల్లో తొలుత వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేరు పిలిచినప్పటికీ సభలోనే ఉన్న ఆయన తన ప్రమాణాన్ని శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. 72 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ పతివాడ నారాయణ స్వామి నాయుడు మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో అరగంట పాటు మధ్యాహ్న భోజన విరామాన్ని ప్రకటించారు. సభ తిరిగి మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన వెంటనే.. అంతకుముందు పిలిచినప్పుడు సభలో లేని స్వతంత్ర సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ వచ్చి ప్రమాణం చేశారు.

 166 మంది ప్రమాణ స్వీకారం..
 మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం సభ నుంచి వెళ్లిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కూడా రాలేదు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం టీ విరామ సమయానికి 151 మంది సభ్యులు ప్రమాణం చేయగా మిగతా వారితో ఆ తర్వాత చేయించారు. సభ ముగిసే సమయానికి మొత్తం 175 మంది సభ్యుల్లో 166 మంది సభ్యులు ప్రమాణం చేశారు. అప్పటికే పతివాడతో గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. వివిధ కారణాలతో ఆరుగురు సభ్యులు-రవీంద్రారెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, వి.సత్యనారాయణ మూర్తి, శ్యాంసుందర్ శివాజీ, జీవీ ఆంజనేయులు ప్రమాణం చేయలేదు. ప్రమాణానికి ముందే తంగిరాల ప్రభాకర్(నందిగామ), శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ) మృతి చెందిన విషయం విదితమే. వీరిద్దరికీ సంతాపం తెలిపే తీర్మానాలు ప్రవేశపెట్టాక పలువురు వారి సేవలను కొనియాడారు.అనంతరం సభా శుక్రవారానికి వాయిదా పడింది. ఐదు రోజుల పాటు జరిగే సమావేశాల్లో శుక్రవారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుంది.

శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డి

Written By news on Thursday, June 19, 2014 | 6/19/2014

శోభ భర్తగా గర్వపడుతున్నా: భూమా నాగిరెడ్డివీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: శోభానాగిరెడ్డి తనకు భార్య మాత్రమే కాదని మంచి స్నేహితురాలు కూడా అని భూమా నాగిరెడ్డి అన్నారు. దివంగత శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ... చాలా బాధతో అసెంబ్లీలో నిలుచున్నానని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు.

రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా కుటుంబాన్ని ఆమె నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. అన్ని విషయాలపై తామిద్దరం మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు. ప్రతి విషయంపై చర్చించుకున్న తర్వాత తమ దినచర్య మొదలయ్యేదని వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆమె ఎంతో తపించేవారని తెలిపారు. తనను మించి నాయకురాలిగా ఎదిగారని ప్రశంసించారు. శోభ భర్తగా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తామిద్దం అసెంబ్లీలో ఉండి జగన్ కు అండదండగా ఉండాలని శోభ ఆలోచించారని, కానీ ఆమె మనమధ్య లేకుండా వెళ్లిపోయారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని నాగిరెడ్డి ప్రార్థించారు.

ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్

ఆ బాధ నాకు తెలుసు: వైఎస్ జగన్
హైదరాబాద్: నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం దురదృష్టకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తంగిరాల, శోభానాగిరెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తంగిరాల గురించి తనకు పెద్దగా తెలియనప్పటికీ వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన దళిత నాయకుడు కాబట్టి ఆయన గురించి వేరే చెప్పక్కర్లేదన్నారు.

కుటుంబ పెద్దను కోల్పోతే ఆ బాధ ఎలావుంటుందో తనకు తెలుసునని జగన్ అన్నారు. తంగిరాల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తంగిరాల ప్రభాకరరావు సేవలను పలువురు నేతలు కొనియాడారు. కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గొల్లపాటి సూర్యారావు, ఉప్పులేటి కల్పన, రావెల కిశోర్, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు సభలో మాట్లాడారు

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ జగన్ అంగీకారం

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ జగన్ అంగీకారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసససభా స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఎన్నిక కానున్నారు. స్పీకర్ పదవికి ఆయన నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు పలికారు. కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా నామినేషన్ పత్రాలపై జగన్ సంతకం చేశారు.

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.... జగన్ ను కలిసి స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కోరగా ఆయన అంగీకరించారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో ఏపీ స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. రేపు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణస్వీకారం

Video
నూతన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ కొలువు తీరింది.  అసెంబ్లీ మొదటి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తాన్ని అనుసరించి ఉదయం 11.52 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణంలోని పాత శాసన సభా భవన మందిరంలో సభ సమావేశం అయ్యింది. సభ ప్రారంభం కాగానే  ప్రొటెం స్పీకర్‌ పతివాడ నారాయణస్వామి నాయుడు సభా మర్యాదలు సభ్యులకు తెలిపారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

తొలిసారి అసెంబ్లీకి వైఎస్ జగన్

తొలిసారి అసెంబ్లీకి వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టనున్నారు. అసెంబ్లీ సభ్యుడిగా ఎంపికైన తర్వాత తొలిసారి ఆయన శాసనసభకు వస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ జగన్  మొదటిసారి శాసనసభకు విపక్ష హోదాలో హాజరు అవుతున్నారు. దాంతో అందరి చూపు వైఎస్ జగన్ పైనే కేంద్రీకృతమై ఉంది.

కాగా గతంలో కడప లోక్ సభ నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన వైఎస్ జగన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి తొలిసారి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే బంపర్ మెజార్టీతో గెలుపొందారు.  వైఎస్ జగన్ 75 వేల ఓట్ల భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ వి సతీష్ రెడ్డిపై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వైఎస్ జగన్

ఎమ్మెల్యేలతో కలిసి బస్సులో అసెంబ్లీకి వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. లోటస్ పాండ్ నుంచి  పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ జగన్ కూడా బస్సులో బయల్దేరి వెళ్లారు. ముందుగా పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్ జగన్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అటునుంచి వారంతా అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు అంజలి ఘటించనున్నారు.

కాగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజు 19వ తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు, మరణించిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయి. రెండో రోజు 20న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 21న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 22న సెలవు. 23, 24 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ ఉంటుంది. శాసన మండలి ఈ నెల 23, 24 తేదీల్లో సమావేశమవుతుంది. అక్కడ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.

ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన లోటస్ పాండ్ లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు.
 
మరోవైపు ఉదయం పది గంటలకు పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించనున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లోటస్ పాండ్ నుంచి  అసెంబ్లీకి బస్సులో రానున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లెజస్లేచర్ పార్టీ కమిటీ నియామకం

Written By news on Wednesday, June 18, 2014 | 6/18/2014

ఫ్లోర్ లీడర్‌గా వైఎస్‌ జగన్మోహన రెడ్డివైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లెజస్లేచర్ పార్టీ  కమిటీ నియామకం జరిగింది.  ఫ్లోర్ లీడర్‌గా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, పి.రాజన్నదొర, ముత్యాల నాయుడులను నియమించారు.  కార్యదర్శులుగా సుజయకృష్ణ రంగారావు, జలీల్‌ఖాన్, నారాయణస్వామి, కాకాని గోవర్ధన్‌రెడ్డి, రోజాలను ఎంపిక చేశారు. వైఎస్‌ఆర్ సీపీ విప్‌గా అమర్నాథరెడ్డిని,  కోశాధికారులుగా కోన రఘుపతి, చాంద్‌ బాషాలను నియమించారు.

 కార్యనిర్వాహక సభ్యులు:  అనిల్‌ యాదవ్, కంబాల జోగులు, గౌరు చరితారెడ్డి, ముస్తఫా, పోతుల రామారావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, సర్వేశ్వరరావు, కలమట వెంకటరమణ, విశ్వేశ్వరరెడ్డి.

సమన్వయకర్తలు: శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, ఏ.సురేష్ లను నియమించారు.

అధికార ప్రతినిధులు: జ్యోతుల నెహ్రూ, జి.శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా

పార్టీ సమన్వయకర్తలు: ఎంవి మైసూరారెడ్డి, డిఏ సోమయాజులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారామ్, అంబటి రాంబాబు.

  ప్రతిపాక్ష పాత్ర అంటే వైఎస్ఆర్ సిపి అనేలా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు చెప్పారు. డిప్యూటి స్పీకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ఈ నిర్ణయాన్ని అధికార పార్టీ విజ్ఞతకే వదిలేస్తామన్నారు.

తంగిరాల పేరుంది.. శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడమేంటి?

తంగిరాల పేరుంది.. శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడమేంటి?
హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపే విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. సంతాప తీర్మానంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ పేరును మాత్రమే చేర్చి శోభా నాగిరెడ్డి పేరును విస్మరించడం తగదని అన్నారు. ఈ అంశాన్ని శాసన సభ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. చనిపోయిన శాసన సభ్యులకు సంతాప తెలపడం మానవత్వమని, చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు మాట్లాడారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ అధ్యక్షత బుధవారం జరిగిన ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. గురువారం ఆరంభయ్యే ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల్లో వైఎస్ఆర్ సీపీ అనుసరించబోయే వ్యూహం గురించి చర్చించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా, ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరణానంతరం శోభానాగి రెడ్డి ఆళ్ళగడ్డ నుంచి గెలుపొందారు.

పరిటాల వర్గీయుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి

'పరిటాల వర్గీయుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి'
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్యయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  
 
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయటమే కాకుండా అక్రమ కేసులను బనాయిస్తున్నారని ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడిపై పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలని ప్రకాశ్ రెడ్డి సూచించారు. 
 
పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే..న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. పరిటాల వర్గీయుల దాడితో పరిస్థితి అదుపుతప్పుతోందని..  బద్దలాపురంలో శాంతిభద్రతలను కాపాడాలని  తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోలీసులను కోరారు. 

వైఎస్ షర్మిల ఫిర్యాదుపై ఖచ్చితమైన చర్యలు: కేటీఆర్

వైఎస్ షర్మిల ఫిర్యాదుపై ఖచ్చితమైన చర్యలు: కేటీఆర్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : వైఎస్ షర్మిల గౌరవానికి భంగం కలిగేలా సోషల్ మీడియాలో అభూత కల్పనలపై ప్రచారం చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు తప్పవని తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపటానికి అవసరం అయితే చట్టంలో మార్పులు కూడా తెస్తామని ఆయన తెలిపారు. వైఎస్ షర్మిల ఫిర్యాదు అందిన మరుక్షణమే కమిషనరేట్ ఆఫ్ పోలీస్ తో మాట్లాడి  స్పందించాలని కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుపై చురుగ్గా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

కమిటీలు.. గడువులెందుకు?

కమిటీలు.. గడువులెందుకు?: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
* ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రుణాలు మాఫీ చేయాలి
లేకపోతే ప్రజల తరపున వైఎస్సార్ సీపీ పోరాడుతుంది

 
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేయడానికి కమిటీలు ఎందుకు? 45 రోజుల గడువెందుకు? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలన్నింటినీ అణా పైసలతో సహా మాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు ఈ కసరత్తు అంతా ఎందుకని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజను ప్రారంభమవుతున్న తరుణంలో రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, మరోవైపు రైతులు బంగారంపై తీసుకున్న రుణాలు కట్టకపోతే నగలను వేలం వేస్తామని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని అన్నారు.
 
 
 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వెంటనే రుణాలను మాఫీ చేసి, రైతులను ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే తొలి సంతకంతో రైతులు చెల్లించాల్సిన 1,200 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల బకాయిలను పూర్తిగా రద్దు చేయడమే కాక, ఆ వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలులోకి తెచ్చారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు రుణాల మాఫీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేలా మంచి పనులు చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మద్దతునిస్తుందని, కానీ మోసపూరితమైన హామీలిచ్చి నెరవేర్చకపోతే ప్రజల తరపున గట్టిగా పోరాడుతుందని శ్రీకాంత్ హెచ్చరించారు.
 
 గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షమైన కాంగ్రెస్‌తో కలిసిపోయిన విధంగా తాము వ్యవహరించబోమని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రజల తరపున అన్ని విధాలా పోరాటం చేస్తామని చెప్పారు. ఏ అంశాన్నీ పరిష్కరించకుండా రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విడదీశారని, అందుకు చంద్రబాబు ఇచ్చిన లేఖే కారణమని చెప్పారు.

వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షం సమావేశం నేడు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీఎల్పీ నేత జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. శాసనసభా సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగంపై చర్చ, ముఖ్యమైన గత ప్రజా సమస్యల ప్రస్తావన వంటి అంశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

టీడీపీ వర్గీయుల దాడికి గురైన కార్యకర్తకు వైవీ పరామర్శ

టీడీపీ వర్గీయుల దాడికి గురైన కార్యకర్తకు  వైవీ పరామర్శ
 ఒంగోలు అర్బన్: ఇటీవల పీసీపల్లి మండలం పెద అలవలపాడులో తెలుగుదేశం పార్టీ వారు చేసిన దాడుల్లో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతమ్మ అనే కార్యకర్తను కలసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రజాసంక్షేమంపై దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు తమ కార్యకర్తలను ఈ విధంగా రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. ఎంపీతో పాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ముక్కు కాశిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రసాద్, తాళ్లూరు జెడ్పీటీసీ సభ్యులు తదితరులున్నారు. 

తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసే మనస్తత్వం కాదు

విజయానందరెడ్డిని కలిస్తే తప్పేంటి?
నమ్ముకున్న కార్యకర్త సింగపూర్ జైల్లో ఉన్నా కలుస్తా
పీడీ యాక్టు కింద ఇద్దరు స్మగ్లర్లకు టీడీపీ బి.ఫారాలు ఇచ్చింది
ఆ ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబుకు సంబంధం ఉన్నట్టా?
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి


‘‘మా పార్టీ కార్యకర్త విజయానందరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలవడం నూటికి నూరు శాతం నా దృష్టిలో కరెక్ట్. అలా చేయడం మానవీయధర్మం’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పార్టీ కార్యకర్తను తను కలవడాన్ని టీడీపీ  రాజకీయం చేయడాన్ని ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ మేరకు మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 ‘‘నేను కష్టాన్ని భగవంతున్ని నమ్ముకుని ఎదగాలనుకునే వ్యక్తిని. తప్పుడు మార్గాలు ఎన్నుకుని ఎదగాలనే మనస్తత్వం కాదు. ఆ స్థాయికి ఎప్పటికీ దిగజారను. నేను తప్పులు చేసే వ్యక్తినైతే తప్పించుకుని తిరిగింటాగాని, ధైర్యంగా వెళ్లి జైలులో ఉన్న వ్యక్తులను కలిసేవాడిని కాదు. నేను దొంగచాటుగా విజయానందరెడ్డిని కలవలేదు. బహిరంగంగా జైలు సూపరింటెండెంట్‌కు లేఖ ఇచ్చి అనుమతి తీసుకుని అందరి ముందు కలిశాను. దీన్ని పెన్ను ఉందని పత్రికలో, నోరుందని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య హక్కులు కాలరాసేలా అనవసర రాద్ధాంతం చేస్తూ, వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం. రాజకీయ కక్షతో ఆరోపణలు చేస్తే వారిని న్యాయస్థానం ఎదుట నిలబెట్టక తప్పదు. నిజంగా విజయానందరెడ్డిగాని, లేక మా పార్టీలో మరెవరైనాగాని తప్పులు చేసివుంటే అది నిరూపణ అయితే ప్రభుత్వమో, న్యాయస్థానమో వారిని కఠినంగా శిక్షించాల్సిందే. అలాంటి వాటిని సమర్థిస్తా. ఒకవేళ మాకు తెలిసిన వ్యక్తి తప్పు చేసి శిక్ష పడినా వారు చేసిన తప్పును సమర్థించం కానీ, వారినైతే తప్పక వెళ్లి పలకరిస్తా. అది మా నైతిక బాధ్యత. జైల్లో ఉన్న విజయానందరెడ్డిని కలవడం అదేదో పెద్ద నేరమని చంకలు గుద్దుకుంటున్న టీడీపీ నాయకులను సూటిగా అడగదలచుకుంటున్నా. గతంలో పీడీ యాక్ట్ కింద అరెస్టయి బెయిల్‌పై ఉన్న రెడ్డినారాయణ వైఎస్‌ఆర్ జిల్లా సంబేపల్లె జెడ్‌పీటీసీ అభ్యర్థిగా, మహేష్‌నాయుడు సుండుపల్లి టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. వారికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో సంతకం చేసిన బీ-ఫారాలు ఇచ్చారు. ప్రస్తుతం వారు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అంటే చంద్రబాబుకు కూడా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధం అంటకడదామా? ఎర్రచందనం స్మగ్లింగ్‌లో గతంలో అరెస్ట్ అయినవారు, ఇంకా అరెస్ట్ కావలసిన వారు టీడీపీలో వందల సంఖ్యలో ఉన్నారు.

వారు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు, బహిరంగంగానే అటవీశాఖ మంత్రిని కలుస్తున్నారు. వారిపై చర్యలు తీసుకుని నిజాయితీని నిరూపించుకునే ధైర్యం పోలీసు అధికారులకు ఉందా? మన జాతి సంపద ఎర్రచందనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పోలీసులకే కాదు, ప్రతిపక్ష స్థానంలో ఉన్న మాకు కూడా ఉంది. అలాంటి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాల్సిందే. ఎంతటి వారినైనా వదలకుండా శిక్షించే పనిని ప్రభుత్వం, పోలీసులు పక్షపాతం లేకుండా చేస్తే వారికి సెల్యూట్ చేస్తాం. అంతేగాని పక్షపాతంతో, దుర్మార్గంగా ఒక పార్టీపై కక్షసాధింపు చర్యలకు పాల్పడితే తిరుగుబాటు తప్పదు. ఒకటి మాత్రం నిజం. భవిష్యత్‌లో మా పార్టీ కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న వారు సెంట్రల్ జైల్లో ఉన్నా, సింగపూర్ జైల్లో ఉన్నా వెళ్లి కలిసే తీరుతా. తెలిసిన వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు పత్రికలో, ప్రతిపక్షాలో విమర్శిస్తాయని భయపడి మాకెందుకులే అని వారిని వదిలేసే మనస్తత్వం కాదు నాది. అలా భయపడే పరిస్థితి వస్తే రాజకీయాలన్నా వదులుకుంటాగానీ, నమ్ముకున్న వారిని మాత్రం వదులుకునే ప్రసక్తే లేది’’ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు

Written By news on Tuesday, June 17, 2014 | 6/17/2014

'ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని క్షుద్ర రాజకీయాలు'
తిరుపతి: ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు క్షుద్రరాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు.
 
రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త విజయానందరెడ్డిని నేను కలవడాన్ని ఎల్లోమీడియా చిలువలు వలువలుగా వక్రీకరించిందని చెవిరెడ్డి మండిపడ్డారు. విజయానందరెడ్డిని కలవడాన్ని తాను నూటికి నూరు శాతం సమర్థించుకుంటున్నానని చెవిరెడ్డి అన్నారు. 
 
 వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆపదలో ఉంటే వారు ఏ జైలులో ఉన్నా కలిసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు, రెడ్డి నారాయణ, మహేష్ నాయుడులు పీడీ యాక్ట్ కింద గతంలో అరెస్ట్ అయ్యారన్నారు. 
 
వీరికి స్థానిక ఎన్నికల్లో  చంద్రబాబు బీఫారంలు ఇచారని.. అంటే బాబుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధమున్నట్లేనా అని చెవిరెడ్డి ప్రశ్నించారు.  వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను అంతమొందించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. 
 

ప్రజలకు ఉపయోగపడే ప్రతి పక్షపాత్ర

'ప్రజలకు ఉపయోగపడే ప్రతి పక్షపాత్ర'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
 
ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉండాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

శస్త్ర చికిత్స చేసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే

శస్త్ర చికిత్స చేసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
*హైరిస్క్ సర్జరీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి     
 
మదనపల్లె: కడుపులో పేగు కుళ్లిపోయి.. తీవ్ర నొప్పితో బాధపడుతూ మదనపల్లె ఏరియా ఆస్పత్రికి వచ్చిన బాలికకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్లు ముందుకు రాలేదు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లే స్థోమత లేదని, ఇక్కడే శస్త్రచికిత్స చేయాలని బాలిక తల్లిదండ్రులు వేడుకున్నారు. హైరిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను తాము చేయలేమని చేతులెత్తేశారు. విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా మదపల్లె ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు.
విజయవంతంగా ఆపరేషన్ చేసి బాలికప్రాణాలు కాపాడారు. మదనపల్లె చంద్రాకాలనీకి చెందిన బాలకృష్ణ, శిరీష దంపతుల కుమార్తె రెడ్డిశ్రీవల్లి (13) ఏడవ తరగతి చదువుతోంది. బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడం తో సోమవారం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. జనరల్ సర్జన్ ఫహీమ్‌నవాజ్, సహాయక సర్జన్ రామకృష్ణారెడ్డి ఆపరేషన్‌కు ఉపక్రమించారు.

థియేటర్‌లోనికి వెళ్లిన తర్వాత బాలిక పరిస్థితిని గమనించి ఎక్కువ రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అని తిరిగి వెనక్కి వచ్చేశారు. విషయాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ రవికుమార్ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డికి ఫోన్‌చేసి కేసు పరిస్థితిని వివరించారు. జనరల్ సర్జన్ అయిన తిప్పారెడ్డి స్థానికంగానే వైద్య సేవలందించేవారు. వెంటనే ఆస్పత్రికి చేరుకుని జనరల్ సర్జన్ల సమక్షం లో బాలికకు ఆపరేషన్ చేసి కుళ్లిపోయిన పేగును తీసేశారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎమ్మెల్యే గా రాజకీయ కోణంలోనే కాకుండా వైద్యుడిగా కూడా తన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తిప్పారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రుణమాఫీపై చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షాక్

రుణమాఫీపై చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షాక్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ షాక్ ఇచ్చింది. రుణమాఫీకి తాము అనుకూలం కాదని తేల్చి చెప్పింది. రుణమాఫీ అమలు బ్యాంకర్ల ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుందని... రుణాలు సక్రమంగా చెల్లించేవారికి మాఫీ అంశం అన్యాయం చేయడమే అవుతుందని పేర్కొంది. రుణమాఫీని నగదు రూపంలో చెల్లిస్తేనే అంగీకరిస్తామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను ఆమోదించేది లేదని తెలిపింది.

రుణమాఫీ వంటి పథకాన్ని తాము ప్రోత్సహించలేమని ఖరాఖండీగా చెప్పేసింది. ఆ మేరకు  ఆర్ బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలి పంత్ జోషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.  రుణమాఫీ వంటి విధానం... తిరిగి చెల్లించే సంస్కృతిని నాశనం చేస్తుందని.. దీనివల్ల బ్యాంకుల పరిస్థితి దిగజారుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీకి తాము అనుకూలంగా దీపాలి పంత్ జోషి ఈనెల 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కాగా ఆర్ బీఐ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 25న ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్ బీఐని రుణమాఫీ అంశంపై సడలింపులు కోరే అవకాశం ఉంది.

రుణమాఫీ అమలు చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ఈ వార్త అశనిపాతమనే చెప్పవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందించిన వెంటనే రైతుల రుణ మాఫీకి చర్యలు తీసుకుంటామని  చంద్రబాబునాయుడు పేర్కొన్న విషయం తెలిసిందే. కమిటీ ఈ నెల 22లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత 45 రోజుల్లో తుది నివేదిక వచ్చాక కేంద్రంతో మాట్లాడి మాఫీకి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ షరతులు షాక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

Written By news on Monday, June 16, 2014 | 6/16/2014

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ రోజు కొంత మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన ఘటన జిల్లాలోని కనగాపల్లి మండలం బద్దాలపురంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.  వైఎస్సార్ సీపీకి అండగా ఉండటం సహించలేని కొంతమంది టీడీపీ వర్గీయులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

పదవి ఉన్నా లేకున్నా నిజాయతీగానే రాజకీయూలు చేస్తా: వైఎస్ జగన్

అబద్ధం ఆడను.. ఆడలేను
పదవి ఉన్నా లేకున్నా నిజాయతీగానే రాజకీయూలు చేస్తా: వైఎస్ జగన్
 
 
పార్టీని పటిష్టం చేసేందుకు అవసరమైన సలహాలన్నీ పాటిస్తా
నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.. ఇంటింటికీ వెళ్లాలి
ముగిసిన కృష్ణాజిల్లా సమీక్ష


విజయవాడ: ‘పదవి ఉన్నా, లేకపోయినా అబద్ధాలు చెప్పను. చెప్పలేను. ఆ పని నావల్ల కాదు. నిజాయతీగానే రాజకీయాలు చేస్తా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అవసరమైన  సూచనలు, సలహాలు అన్నీ పాటిస్తానని, కానీ అబద్ధాలు మాత్రం ఆడనని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడ శివారు కానూరులోని ఆహ్వానం కల్యాణ మండపంలో మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాజకీయాల్లో విజయం సాధించామా, లేదా అన్నదే ముఖ్యమని, కురుక్షేత్ర యుద్ధంలో గెలిచేందుకు శ్రీకృష్ణుడంతటివాడే అనేక అధర్మాలు చేశాడని, మనం కూడా అలాగే ముందుకెళ్లాలని సూచించినప్పుడు జగన్ పైవిధంగా స్పందించారు. సమీక్షా సమావేశంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..

తప్పులు పునరావృతం కాకూడదు

‘ఈ ఎన్నికల్లో సంస్థాగతంగా మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే మళ్లీ అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు కూటమికి, మన పార్టీకి కేవలం 5 లక్షల 60 వేల ఓట్లు మాత్రమే తేడా. కోటీ 30 లక్షల మంది మనకి ఓట్లు వేస్తే, చంద్రబాబు కూటమికి కోటీ 35 లక్షల మంది ఓట్లు వేశారు. ఈ 5 లక్షల 60 వేల ఓట్లు పెద్ద తేడా కాదు. ఉప ఎన్నికలో నా కొచ్చిన మెజారిటీయే దేశం మొత్తం నిలబడి చూసేట్టుగా 5.50 లక్షలు ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఓట్ల తేడా పెద్ద తేడా కాదు. ఈ 5 లక్షల 60 వేల ఓట్లలో మూడు లక్షల ఓట్లు అటువైపు నుంచి ఇటువైపు వచ్చి ఉంటే మనం అధికార పక్షంలో ఉండేవాళ్లం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండేవారు. అయినా ఈ తేడా ఎందుకొచ్చిందనే అంశాన్ని మనం విశ్లేషించుకోవాలి. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్ర మోడీ గాలి పట్టణాల్లో కొంత పనిచేయడం. రెండో కారణం అసాధ్యమని తెలిసి కూడా చంద్రబాబు రూ.88 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కాస్తోకూస్తో ప్రజలను నమ్మించారు. బాబు మాదిరిగా మనం కూడా సాధ్యం కాదని తెలిసి కూడా హామీలిచ్చినా, ఆయన ఆడిన అబద్ధాలను మనమూ ఆడినా మూడు లక్షల ఓట్లో, అంతకంటే ఎక్కువ ఓట్లో మనకు వచ్చేవి. అవే అబద్ధాలు చెప్పి ఉంటే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఉండేవాడినేమో. కానీ ఆ తర్వాత మూడు నెలలు కూడా తిరక్కుండానే రాష్ట్రంలోని ప్రతి రైతు మనల్ని తిట్టుకునేవాడు. మీరు కూడా వచ్చి నన్ను ప్రశ్నించేవారు. సాధ్యం కాదని తెలిసి కూడా ఎందుకు చెప్పావన్నా అని అడిగేవారు. ఎందుకన్నా మోసం చేశావని నిలదీసేవారు. ముఖ్యమంత్రి కావాలని ఎవరికైనా ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడి, మోసం చేసి, గడ్డి తింటే.. ప్రజలకు న్యాయం చేయగలమా? నాలో కూడా గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే కోరిక ఉంది. ఒకసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు నిజాయతీతో కూడిన పాలన ఇవ్వాలని ఉంది. 30 ఏళ్లు ఎంతగా మంచి చేయాలంటే ఆ మంచిని చూసి ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాలనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయమే నన్ను ఈ రోజు రాజకీయాల్లో నడిపిస్తోంది. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పి, మోసం చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ తర్వాత ప్రజలు ఐదేళ్లకే ఇంటికి పంపించి వేస్తారు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అందుకే చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేదు. విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేదు’ అని జగన్ చెప్పారు.

రోజుకో అబద్ధం రాశారు

‘చంద్రబాబు చేస్తున్న మోసం ఆయన ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఆయనకు జత కలిశారుు. ఎన్నికలకు ముందు రెండునెలల నుంచి రోజుకో అబద్ధం రాశారు. ఇంత అన్యాయంగా కూడా రాస్తారా? అని అనిపించేది. బాధనిపించినా చేయగలిగిందేమీ లేక ప్రజల్లోకి వెళ్లాం. చంద్రబాబు మోసం 10-15 రోజుల్లో బయటపడుతుంది. మరో 10 రోజుల్లో వర్షాలు పడతాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులు బ్యాంకుల వద్దకు వెళతారు. పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు ఇవ్వబోమని అక్కడ చెబుతారు. అలా చెప్పినప్పుడు ప్రతి రైతు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. చంద్రబాబు బండారం పూర్తిగా బయటపడినా ఆయన్ను రక్షించేందుకు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఒక్కటవుతాయి. చంద్రబాబు మంచోడే, ఆయనవి మంచి ఉద్దేశాలే కానీ ఆర్‌బీఐ ఒప్పుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవడం లేదని చెబుతారు..’ అంటూ వివరించారు. ‘చంద్రబాబు మాదిరిగా ఇన్ని టీవీ చానళ్లు, పత్రికల మద్దతు మనకు లేదు. కానీ చంద్రబాబుకు లేనిది, మనకి ఉన్నది దేవుడి దయ ఒక్కటే. మనం ప్రజల్ని నమ్ముకున్నాం. మళ్లీ ప్రజల వద్దకే వెళదాం. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఉండాలి. ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను వివరించాలి. రాబోయే రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు చేపడతాం’ అంటూ జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు

Popular Posts

Topics :