22 June 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మా బతుకులు బూడిదయ్యాయి

Written By news on Saturday, June 28, 2014 | 6/28/2014

మా బతుకులు బూడిదయ్యాయి
అమలాపురం: గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో తమ బతుకులు బూడిదయ్యాయని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన  రెడ్డికి చెప్పారు.   తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన  ప్రదేశాన్ని పరిశీలించి, అక్కడి బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. నగరం విషాద ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

బాధితులు జరిగిన ఘటన తలచుకుంటే భయపడిపోతున్నారు. వణికిపోతున్నారు. ఓ బాధితురాలు మాట్లాడుతూ తమ కుటుంబంలో 11 మంది ఉన్నట్లు తెలిపారు. వారిలో ఏడుగురు కాలిపోయినట్లు చెప్పారు. మరో మహిళ మాట్లాడుతూ నిద్రపోతున్న పిల్లలను బయటకు తీసుకువచ్చేసరికే మంటలు ఇంటిలోపలకు వచ్చేశాయన్నారు.

తమ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు డాక్లర్ చెప్పారు.  చికిత్స పొందుతున్నవారిలో అయిదుగురు ఆడవారు, ఇద్దరు మగవారు వున్నట్లు తెలిపారు. వారు కోలుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్ లో మాత్రం వాటాలేదు

నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్ లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
నగరం: గ్యాస్ ఉత్పత్తిలో గానీ, పంపిణీలో గానీ ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా నష్టపోయేది రాష్ట్రమేనని,  గ్యాస్ లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పారు.  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన  ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. అయితే ఈ ప్రాంత మనుషుల జీవితాలకు, పర్యావరణానికి భద్రతలేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కాదని చెప్పారు. ఇక్కడ గ్యాస్ లీకవుతుంటే పట్టించుకునేవారు లేరన్నారు.

సింగరేణి కాలరీస్ లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం  వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు.  కేంద్రంను అడిగి గ్యాస్ లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును  జగన్ కోరారు.

ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధితులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్

బాధితులకు అండగా ఉంటాం: వైఎస్ జగన్
నగరం:  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌లో పేలిన ప్రదేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అధికారులు, నేతలు ఆయనకు వివరించారు. ఈ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓఎన్జీస్‌ గ్యాస్‌ స్టేషన్‌ సమీపంలో గెయిల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌లో పేలుడు సంభవించి, 17 మంది సజీవ దహనమయ్యారు.  ఈ ప్రమాదంలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా నిట్టనిలువునా తగలబడిపోయిన కొబ్బరి చెట్లను,  ఇళ్లు  కాలిపోయి శ్మశానవాటికను తలపిస్తున్న గ్రామాన్ని ఆయన పరిశీలించారు.  పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన వెంట గ్రామానికి తరలి వచ్చారు.

అంతకు ముందు ఆయన బాధితులను పరామర్శించారు. బాధితులను అందరిని కలుసుకొని పరామర్శించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటనను, వారుపడిన బాధలను వివరిస్తుంటే జగన్ చలించిపోయారు. ఒకే కుటుంబంలో ఆరుగురు, మరో కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఆ కుటుంబాలు అన్నిటిని ఆయన కలుసుకుంటున్నారు. బాధితులు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తమ బాధలు చెప్పుకున్నారు. బాధితులకు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్ వారికి హామీ ఇచ్చారు.

నేటి జగన్ పర్యటన

నేడు జగన్ రాక
- నగరంలో పేలుడు ప్రాంతం సందర్శన
- కాకినాడ, అమలాపురంలలో
- క్షతగాత్రులకు పరామర్శ

 సాక్షి, కాకినాడ : నగరం పైపులైన్ పేలుడులో మృతి చెందిన వారి కుటుంబాలను, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, రాష్ర్ట ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి మధురపూడి చేరుకుంటారు.

అక్కడి నుంచి కారులో కాకినాడ  చేరుకుని, అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అమలాపురం చేరుకొని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి నగరం గ్రామం చేరుకొని పైపులైన్ పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించి పేలుడులో దుర్మరణం పాలైన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.

విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు-టీడీపీ ప్రలోభాల పర్వానికి కళ్లెం

వైఎస్సార్‌సీపీకి విప్ అధికారం
  •  మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు
  •  విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
  •  టీడీపీ ప్రలోభాల పర్వానికి కళ్లెం
గుడివాడ : వైఎస్సార్‌సీపీకి స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందించింది. ఈ మేరకు శుక్రవారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లకు, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు గాను ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. దీంతో వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన అభ్యర్థులందరికీ విప్ వర్తిస్తుంది.

ఇప్పటికే ప్రత్యర్థి టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీకి విప్ జారీ అవకాశం లేదని, కాబట్టి తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని కొన్నిచోట్ల ప్రలోభాలకు తెర తీశారు. స్వల్ప ఆధిక్యత ఉన్నచోట్ల ఈ ప్రలోభాల పర్వం ఇప్పటికే కొనసాగింది. ఈ నేపథ్యంలో విప్ జారీ చేసే అవకాశం రావటంతో వీరి ప్రలోభాలకు తెరపడినట్లయింది.

విప్ జారీ చేస్తే అనర్హతే..

జూలై మూడున జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జూలై నాలుగున జరగనున్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో, జూలై ఐదున జరిగే జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు ప్రవర్తిస్తే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశముంటుంది.
 
విప్ జారీ చేసే పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉండాలి...
 
ఏదైనా పార్టీ విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎన్నిక సందర్భంగా ఎవరికి ఓటు వేయమంటే ఆ అభ్యర్థికే ఓటు వేయాల్సి ఉంటుంది.
 
పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా విప్‌ను వ్యతిరేకించినట్లే అవుతుంది.
 
విప్ జారీ చేసినపుడు ఆ సమావేశానికి ఎన్నిక సందర్భంగా హాజరు కాకపోయినా విప్ ధిక్కారం కింద అనర్హత వర్తిస్తుంది.
 
విప్ జారీ చేసినపుడు ఆ పార్టీ చెప్పిన వ్యక్తి ఓటు వేయకుండా తటస్థంగా వ్యవహరించినా విప్ ధిక్కారమే అవుతుంది. మున్సిపల్ కౌన్సిలర్లు, మండల పరిషత్‌కు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీల విప్‌కు లోబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సిందేనని ఎన్నికల కమిషన్ తన నిబంధనల్లో పొందుపర్చింది. అలా చేయని సభ్యులపై నిబంధనల ప్రకారం విప్ దిక్కారం ద్వారా అనర్హుడుగా ప్రకటించే అవకాశముంది.
 

బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Written By news on Friday, June 27, 2014 | 6/27/2014

బ్లో అవుట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో జరిగిన గెయిల్ పైపులైను పేలుడు సంఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపం, సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోందని, వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాద సంఘటనపై విచారణ జరిపించాలని జగన్ కోరారు.

కాగా.. క్షతగాత్రుల్లో ఎనిమిదిమందిని అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో వారిని కాపాడేందుకు వైద్యబృందాలు శ్రమిస్తున్నాయి.

గెయిల్ పైప్ లైన్ పేలుడు ఘటన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీసుకెళ్లారు. పెట్రోలియం శాఖ మంత్రితో కూడా ఆయన మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకున్నారు.

బిజీ బిజీగా...

బిజీ బిజీగా...
 సాక్షి పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌కు ఎర్రగుంట్లలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా బద్వేలు, కడపలో పలువురు బొకేలు అందించి అభినందనలు తెలిపారు.
 
 రుణమాఫీ అంశంతో పాటు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అసెంబ్లీ తొలిసమావేశాల్లో ప్రసంగించిన తీరు ఎంతో బాగుందని కార్యకర్తలు తమ సంతోషాన్ని జగన్ తో పంచుకున్నారు. ఐదేళ్లు కాదు.. ఎన్నాళ్లయినా మీ వెంటే ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురైనా తాను వెంటనే స్పందిస్తానని.. ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
 
 పల్లెపల్లెలో  హారతి పట్టిన మహిళలు :
 పులివెందులనుంచి బద్వేలుకు ఉదయం 9.30గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ బయలుదేరగా.. చాలాచోట్ల  మహిళలు, అభిమానులు ఆపి హారతి పట్టారు.  అట్లూరు మండలం వెంకటాపురం వద్ద గ్రామస్తులంతా రోడ్డుపైకి వచ్చారు. రామాంజనమ్మ అనే మహిళ వైఎస్ జగన్‌ను చూడగానే కన్నీరు పెట్టుకుంది. జగన్ ఆమెను ఓదార్చుతూ  ఏడవద్దు.. నేనున్నాను.. మీకష్టమేమిటో చెప్పండంటూ అడిగి తెలుసుకోవడంతో పాటు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రాజుపాలెం గ్రామం వద్ద కూడా పలువురు మహిళలు జగన్ కాన్వాయ్‌ను ఆపి మాట్లాడారు.
 
 ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి.. :
 శాసనసభలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన అనంతరం తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కు అడుగడుగునా ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొందరు పూలమాలలు వేస్తూ.. మరికొందరు పుష్ప గుచ్చాలను అందిస్తూ స్వాగతం పలికారు. గురువారం ఉదయాన్నే ముద్దనూరులో రైలు దిగగానే కార్యకర్తలు బాణా సంచా పేల్చారు. పులివెందులలోని ఇంటికి వద్దకు రాగానే పలువురు మహిళా కార్యకర్తలు దిష్టి తీసి హారతి పట్టారు. ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి పర్యటిస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు.. కరచాలనం చేసేందుకు జనాలు ఆరాటపడ్డారు.

 వైఎస్ జగన్ వెంట పర్యటించిన ఎంపీ వైఎస్ అవినాష్ :
 శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా పలు కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. బద్వేలులో నూతన జంట ఆశీర్వాదంతోపాటు కార్యకర్తలు, నాయకులతో చర్చించే సమయంలో కూడా వైఎస్ జగన్ వెంటే అవినాష్‌రెడ్డి నడిచారు. అనంతరం కడపలో కూడా కార్యకర్తలు, నాయకుల సమస్యలను వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆలకిస్తూ వచ్చారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు :
 శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డిని గురువారం పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. బద్వేలులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీసీ గోవిందరెడ్డితోపాటు ఎమ్మెల్యే జయరాములు కలిసి చర్చించారు.
 
 అనంతరం వైఎస్ జగన్ నేరుగా కడపకు రాగా అక్కడ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ అభ్యర్థి సురేష్‌బాబు, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కడప, మైదుకూరు ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయాలకు సంబంధించిన అంశాలతోపాటు జిల్లాలో పార్టీ పరిస్థితులపై  వారు మాట్లాడుకున్నారు.
 బద్వేలు, కడప కార్యాలయంలో
కార్యకర్తలతో.. :
శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం 12గంటల ప్రాంతలో బద్వేలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లతో చర్చించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు పార్టీ కార్యకర్తలతో గడిపిన జగన్ అనంతరం నూతన జంట మానస వీణ, సుబోధ్‌రెడ్డి పెళ్లి రిసెప్షన్‌కు హాజరై నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.
 
 ఈ సందర్భంగా అక్కడే వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సత్యప్రభావతమ్మ, నాగేళ్ల సాంబశివారెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కూడా వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం నేరుగా కడపకు చేరుకుని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో కార్యకర్తలతో మమేకమయ్యారు. సాయంత్రం 4గంటలనుంచి రాత్రి వరకు కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అంతకుమునుపు దాదాపు గంటపాటు కడప కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
 
 నేడు పులివెందుల కార్యాలయంలో వైఎస్ జగన్ :
 శాసనసభ పక్ష నేత. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజలు, కార్యకర్తలు, నేతలు, అభిమానులు వైఎస్ జగన్‌ను కలవవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
 
 అన్నా.. అంటూ ఆప్యాయ పలకరింపు
 కడప రూరల్ : ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తొలిసారిగా కడపకు వచ్చారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి కలిశారు. ఈ సందర్బంగా తమ సమస్యలను వివరించారు. వినతిపత్రాలను సమర్పించారు.
 
 తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులను వైఎస్ జగన్ పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కడప కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ పరిచయ కార్యక్రమంలో వైఎస్ జగన్ కార్పొరేటర్లను అన్నా అంటూ... ఆప్యాయంగా పేరుపేరునా పలుకరించారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఓటమి చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లను పలుకరించి ఏం ఫర్వాలేదంటూ భరోసా ఇచ్చారు. భవిష్యత్తు మనదేనని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నడవాలని సూచించారు

ఎర్రదొంగలకు బాబు దన్ను?

ఎర్రదొంగలకు బాబు దన్ను?
* చంద్రబాబును కలిసిన రెడ్డినారాయణ భార్య, మహేష్ తండ్రి
* బెయిల్ కోసం చంద్రబాబుకు వినతి
* అన్నీ తెలుసునని బాబు భరోసా
 
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్లు రెడ్డినారాయణ, మహేష్‌నాయుడు, భాస్కర్‌నాయుడుకు తెలుగుదేశం పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు. వీరిని స్మగ్లింగ్ కేసుల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పలు కేసులు ఉన్న రెడ్డినారాయణ, మహేష్ నాయుడు, భాస్కర్ నాయుడుపై పీడీ యాక్ట్ అమలులో ఉంది. వీరు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.

పీడీ యాక్ట్ నుంచి వారిని బయటపడే సేందుకు కుటుంబ సభ్యులు టీడీపీ నేతల సహకారం కోరారు. టీడీపీ నేతల సమాచారం మేరకు... మహేష్ నాయుడు, రెడ్డినారాయణ భార్యలు వారం రోజుల కిందట ఎంపీ సీఎం రమేష్ భార్యతో కలసి చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లారు. పార్టీ కోసం కష్టపడిన తమ భర్తలకు అండగా నిలవాలని చంద్రబాబును కోరారు. ఇదే విషయాన్ని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడా విన్నవించుకున్నారు. వారిద్దరూ వీరికి అభయహస్తం ఇచ్చినట్లు చెబుతున్నారు. గురువారం పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. 

రిమాండ్‌లో ఉన్న రెడ్డినారాయణ, భాస్కర్ నాయుడు, మహేష్ నాయుడును కూడా హాజరయ్యారు.  అంతకు ముందురోజు... బుధవారం రెడ్డినారాయణ భార్య, మహేష్ నాయుడు తండ్రి తమ అనుచరులతో సీఎం చంద్రబాబును కలిశారు. పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డులో ఎలాగైనా బెయిల్ వచ్చేలా ప్రయత్నించాలని వారు బాబుకు విన్నవించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. వారు చెప్పింది సావధానంగా విన్న చంద్రబాబు అన్నీ నాకు తెలుసు.. నేను చూసుకుంటానని.. అని భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
 
బెయిల్ కావాలంటే ఐదు కోట్లు ఇవ్వాల్సిందే
తమ వారికి బెయిల్ ఇప్పించాలని వీరు చంద్రబాబుతోపాటు పొరుగు జిల్లాకు చెందిన ఓ ఎంపీని కలసి విన్నవించారు. తాము ఈ స్థాయికి రావడానికి రూ.వంద కోట్లు ఖర్చు అయిందని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా పనులు చేసుకుంటూపోతే కుదరదని సదరు ఎంపీ వీరికి చెప్పినట్లు తెలిసింది.  పీడీ యాక్ట్ నుంచి బయటపడి బెయిల్ రావాలంటే ఒక్కొక్కరు రూ. ఐదు కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది. రెడ్డినారాయణ, మహేష్ నాయుడు కుటుంబ సభ్యులు అతనితో వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.

అబద్ధాలతోనే బాబుకు అధికారం

‘అబద్ధాలతోనే బాబుకు అధికారం’
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘నాలుగేళ్లుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. అధికారం మనదే అనుకున్నాం. కేవలం 5.6 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యాం. 3 లక్షల ఓట్లు అటువైపు నుంచి ఇటు పడి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్లం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పిన ఒక్క అబద్ధంతో అధికారాన్ని కోల్పోయాం. రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు అబద్ధం చెప్పారు. అధికారాన్ని దక్కించుకున్నారు. మనం అబద్ధం చెప్పి ఉంటే అధికారం మనకే దక్కి ఉండేది. మనం విలువలు, విశ్వసనీయతలతో కూడిన రాజకీయాలు చేశాం. వాటికే కట్టుబడి ఉన్నాం. అందుకే అబద్ధం చెప్పలేదు. ఇవే విలువలకు కట్టుబడి ఉందాం. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిద్దాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.

గురువారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో జరిగిన కడప కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజలు అబద్ధాన్ని ఒకసారి నమ్ముతారు. ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి పంపుతారు.’’ అని చెప్పారు. స్థానిక సంస్థల ప్రతినిధులను భయపెట్టి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని జగన్ విమర్శించారు.

నిజమైన ప్రతిపక్షం అంటే ప్రజలే: వైఎస్ జగన్

Written By news on Thursday, June 26, 2014 | 6/26/2014

నిజమైన ప్రతిపక్షం అంటే ప్రజలే: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
కడప: రైతు రుణమాఫీ చేస్తామనే ఒకే ఒక అబద్ధం చెప్పి ఉంటే మనం కూడా కచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లమని కడప కార్పొరేటర్లతో సమావేశంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక్కసారి అబద్ధం చెప్పి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఉంటే ఐదేళ్లకే ప్రజలు ఇంటికి పంపిస్తారని వైఎస్ జగన్ అన్నారు. 
 
రాబోయే రోజుల్లో వారి అబద్ధాలు, మోసాలు బయటకు వస్తాయని,  సాధారణంగా ఒక సీఎంపై రెండేళ్ల తర్వాతగాని అసంతృప్తి కలుగుతుందని, కాని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎంపై 25 రోజుల్లోనే అసంతృప్తి కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు.  ఆ తర్వాత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంటుందన్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత, విలువలపై ఆధారపడి ఉందన్నారు. 
 
నిజమైన ప్రతిపక్షం లాక్కున్న ఎంపీలు, ఎమ్మెల్సీలలో ఉండదని, నిజమైన ప్రతిపక్షం అంటే ప్రజలేనని పార్టీ కార్పోరేట్లకు వైఎస్ జగన్ వివరించారు. అధికార పక్షం మోసం చేస్తుందని తెలుసుకున్న రోజు ప్రజలే తిరగబడతారని  వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర ఇచ్చినా .. భవిష్యత్‌లో 160 స్థానాలు ఇచ్చి మనల్ని నిలబెడతారని వైఎస్ జగన్ తెలిపారు. 
 
మనందరం ఒకటిగా తోడుగా ఉందాం.  పోలీసు కేసులు, ఒత్తిళ్లు అనేకం ఉంటాయి.  ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్నా.. అందరం కలిసి పోరాడదాం. మీకు తోడుగా నేనుండి.. రోడ్డుపైకి రావడానికైనా సిద్ధం అని కార్యకర్తలతో వైఎస్ జగన్ అన్నారు. 
 
కడప కార్పొరేషన్‌ మేయర్‌గా సురేష్ బాబుకు మద్దతు పలకాలని కార్పోరేటర్లకు వైఎస్ జగన్ సూచించారు.  డిప్యూటీ మేయర్, ఇతర పదవుల ఎంపికలో అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యత ఇచ్చామని..కడప నుంచే రాష్ట్రానికి ఒక సందేశాన్ని అందిస్తున్నామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి.. లాక్కునే స్థాయికి ప్రస్తుత రాజకీయాలు దిగజారాయని వైఎస్ జగన్ అన్నారు

నేడు కడపకు వైఎస్ జగన్

నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం పులివెందులకు రానున్నారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. వైఎస్ జగన్ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా పులివెందులకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10గంటల ప్రాంతంలో బద్వేలు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన జంట మానస వీణ, సుభోద్‌కుమార్‌రెడ్డిలను ఆశీర్వదించనున్నారు. అనంతరం కొద్దిసేపు నాయకులు, ప్రజలను కలిసి ఆ తర్వాత కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే శనివారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన అధికారులతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాలు ఖరారైనా తర్వాత పరిస్థితిని బట్టి మరికొన్ని కార్యక్రమాలు పొందుపరచనున్నట్లు వైఎస్ అవినాష్‌రెడ్డి సాక్షి ప్రతినిధికి వివరించారు.
 
 ప్రతిపక్ష హోదాలో తొలిసారి
 గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో పులివెందులకు వచ్చిన ప్రతి సందర్భంలో నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూనే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు. అనంతరం వైఎస్‌ఆర్ సీఎం అయిన తర్వాత కూడా పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో పులివెందులకు వస్తున్నారు.
 
 ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం గతనెల 22వ తేదీన ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే అధికారికంగా శాసనసభలో స్పీకర్ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొనడంలో భాగంగా వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి పులివెందులకు రానున్నారు.
 
 నేడు కడపకు వైఎస్ జగన్
 కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అధినేత, శాసనసభలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురువారం కడపకు రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం బద్వేలులో పర్యటన ముగించుకొని మధ్యాహ్నానికి కడపకు చేరుకుంటారన్నారు. కడపలో సెంట్రల్ జైలు వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొని 3.30గంటల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.   

ప్రతిపక్ష హోదాలో తొలిసారి...

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో తొలిసారి ఆయన పులివెందులకు విచ్చేసారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన వైఎస్ జగన్ కు కార్యకర్తలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ జగన్ ఈరోజు  ఉదయం 10గంటల ప్రాంతంలో బద్వేలు బయలుదేరి వెళతారు. అక్కడ నూతన జంట మానస వీణ, సుభోద్‌ కుమార్‌ రెడ్డిలను ఆశీర్వదించనున్నారు.

అనంతరం కొద్దిసేపు నాయకులు, ప్రజలను కలిసి ఆ తర్వాత కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. 27, 28 తేదీలలో పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అలాగే శనివారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన అధికారులతోపాటు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమీక్షించనున్నారు.

రైతుల బంగారం వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ

రైతుల బంగారం వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ
నరసరావుపేట: వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బ్యాంకు వేలం పాటను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన పేరం విజయభాస్కరరెడ్డి బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష, ఆవుల కృష్ణారెడ్డి రూ.2 లక్షలు పైగా బ్యాంక్ ఆఫ్ ఇండియూలో రుణం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు రుణమాఫీని అమలు చేస్తామని చెబుతుండటంతో వాళ్లు రుణం చెల్లించే విషయంలో నిర్లిప్తత ప్రదర్శించారు.

దీంతో వీరి ఖాతాలకు చెందిన బంగారాన్ని వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు సన్నద్ధమయ్యూరు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, మండల మైనార్టీ కన్వీనర్ మాబు సుభాని, దొండపాడు మాజీ సర్పంచ్ శివారెడ్డి, పట్టణ కార్యదర్శి వనిపంట కృష్ణారెడ్డి తదితరులు బ్యాంకు మేనేజర్ సుబ్బారావును కలసి ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే తీసుకున్న రుణం చెల్లిస్తామంటూ హామీపత్రం రాసి ఇవ్వడంతో వేలం ఆగిపోయింది

ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారంతా మాతోనే

Written By news on Wednesday, June 25, 2014 | 6/25/2014

'ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వారంతా మాతోనే'
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. టీడీపీ చర్యలను  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తూ, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించేలా వ్యవహరిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అలాగే మున్సిపల్‌ ఛైర్మన్లు, మేయర్లు, ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

గవర్నర్ తో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా తమతోనే ఉన్నారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తమ డిమాండ్ పై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఎన్నికలు జరుపుతామని హామీ ఇచ్చారన్నారు. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు.

17 హత్యలు.. ఇదీ టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్!!

17 హత్యలు.. ఇదీ టీడీపీ ప్రోగ్రెస్ కార్డ్!!టీడీపీ దాడిలో గాయపడ్డ ఈశ్వరయ్య (ఫైల్ ఫొటో)
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16వ తేదీన వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరణించారు. 110 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ నెలరోజుల్లో సాధించిన ప్రోగ్రెస్ కార్డ్. ఈ వివరాలను అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినట్లు తెలియగానే తెలుగు తమ్ముళ్ల అరాచకాలు మొదలైపోయాయి.

మొట్టమొదట పవిత్ర క్షేత్రమైన తిరుమల కొండ మీద ఉన్న దుకాణాలను ధ్వంసం చేసి తమ ప్రతాపం చూపించారు. అక్కడి నుంచి వాళ్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు రకాల తోటలను ధ్వంసం చేశారు. నిమ్మ, నారింజ, అరటి తోటలను ఎడా పెడా నరికేశారు. చెట్ల పాదుల్లో కిరోసిన్ పోసి మరీ వాటిని మళ్లీ బతకకుండా చేశారు. అనంతపురం జిల్లాలో ఓ వైఎస్ఆర్ సీపీ నేత ఇంట్లో అయితే ఏకంగా టైంబాబు పెట్టారు!!

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని చిగురుమానుపేటలోని అమ్మ హోటల్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై కొందరు రౌడీమూకలు తప్పతాగిన మైకంలో కత్తులు, రాడ్లతో దాడి చేశారు. రౌడీ మూకల దాడిలో గాయపడ్డ ఉప్పరి ఈశ్వరయ్య కడుపులో కత్తిపోటు పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమణారెడ్డికి చెందిన రెండు వేల బొప్పాయి చెట్లను టీడీపీ కార్యకర్తలు నరికేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో చోటుచేసుకుంది. అనంతపురం పట్టణంలో ఉన్న శిల్పారామానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్కడున్న ఫర్నిచర్ ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన, ఇతర కార్యకర్తలు, నాయకులపైన శిల్పారామం కాంట్రాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో మద్యం బాటిళ్లతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో వైఎస్ విగ్రహం పాక్షికంగా దెబ్బతింది.

ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక రకాల దౌర్జన్యాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్పడుతున్నా, పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకుల్లాగే మిగిలిపోయారు.

రేపటి వైఎస్ జగన్ పర్యటన

రేపటి నుంచి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
కడప కల్చరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి నాలుగు రోజులపాటు జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
 
 గురువారం కడప, బద్వేలు ప్రాంతాల్లో జరగనున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు. శుక్ర, శని, ఆదివారాలు కూడా జిల్లాలోనే ఉంటారని పేర్కొన్నారు.

జగన్ మా గుండెల్లో ధైర్యాన్ని నింపారు

జగన్ మా గుండెల్లో ధైర్యాన్ని నింపారు
 భీమవరం క్రైం : ‘ఆయుష్’ ఉద్యోగులను కొనసాగించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి తమ గుండెల్లో ధైర్యాన్ని నింపారని ఉద్యోగులు పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం పోరాటాలకు వెనుకాడమని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టాక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ‘ఆయుష్’ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఉద్యోగులను తొలగించాలని చూడటం దారుణమన్నారు. జిల్లా వ్యాప్తంగా 44 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న 81 మంది ఆయుష్ ఉద్యోగులను ఇంటికి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ తమకు అండగా ఉందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా అండగా ఉండాలని వారు కోరుతున్నారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం
 ఆయుష్ ఉద్యోగులను తొలగించడం సబుబు కాదని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం ఎంతో సంతోషాన్ని కలిగిం చింది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంలో ఆయుష్ శాఖ ద్వారా ఉద్యోగాలు పొందిన 81 మంది జిల్లాలోని 44 డిస్పెన్సరీల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వారిని తొలగించడం సరికాదు.  
 - డాక్టర్ జీఎన్‌బీ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, పాలకోడేరు
 
 సంతోషంగా ఉంది
 2008 నుంచి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా ఉద్యోగాల నుంచి తొలగిం చాలనుకోవడం దారుణం. మా గురించి అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగ భద్రతకు ఆయన చేస్తున్న కృషి మరువలేనిది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగా ఆయుష్‌ను బలోపేతం చేసి మమ్మల్ని కొనసాగించాలి. 
 - ఎన్.ఆంజనేయులు, కాంపౌండర్, మంచిలి

నెల రోజుల్లో సాధించిందేమిటి?

నెల రోజుల్లో సాధించిందేమిటి?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగింపు
టీడీపీ దాడుల్లో 17మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తల మృతి
 అధికారంలో ఎవరున్నా ఈ తరహా దాడుల్ని ఖండించాలి
 మేము సూచనలు, సలహాలిస్తాం.. వాటిపై ధ్యాస పెట్టాలి
 
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ గెలిచి నెల రోజులైందని,  ఈ కాలంలో సాధించిన ప్రగతి ఏమిటని ఆంధ్రప్రదేశ్ సర్కారును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిలదీశారు. ఈ నెల రోజుల కాలంలో ఏమి జరిగిందో గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం అసెంబ్లీలో చర్చను జగన్ కొనసాగించారు. రైతుల సమస్యలు, ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్న తీరును ప్రధానంగా ప్రస్తావించారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదన్న కోపంతో టీడీపీ వర్గాలు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు 17 మంది చనిపోయారని, 110మంది గాయపడ్డారని వివరించారు. అయినా పోలీసులు కేసులు నమోదు చేయడంలేదని చెప్పారు. నిమ్మ, నారింజ వంటి తోటల్ని ధ్వంసం చేస్తున్నారని, చెట్ల పాదుల్లో కిరోసిన్ పోసే దుర్మార్గ స్థితికి చేరుకున్నారని వివరించారు. ‘అధికారంలో ఈవేళ మీరు ఉండొచ్చు.
 
రేపు మేము ఉండొచ్చు. ఎవరున్నా ఈ తరహా దాడుల్ని ఆయా పార్టీల నాయకత్వాలు ఖండించాలి. పోలీసులు చర్య తీసుకుంటారనే నమ్మకాన్ని కలిగించాలి’ అని సలహా ఇచ్చారు. మరోపక్క ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ప్రలోభ పెడుతూ వేరే పార్టీల బీ ఫారాలపై గెలిచిన వారిని లాగేస్తున్నారని, శాసన మండలిలో ఏడుగురు ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి లాగేసుకున్నారని చెప్పారు. ఇలా చేస్తే ప్రతిపక్షం గొంతు నొక్కవచ్చునేమో గానీ నిజమైన ప్రతిపక్షం ప్రజలేనని అన్నారు. ఈ దశలో అధికారపక్ష సభ్యులు పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు. ప్రతిపక్షంలో ఉన్న తమను ఖండించండి గానీ బండలేయడమే లక్ష్యంగా పెట్టుకోవద్దని జగన్ అధికారపక్షానికి సలహా ఇచ్చారు. వ్యవస్థలోని లోపాలను, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకోమని కోరితే ఓపికతో వినడం మాని విమర్శలకు దిగడం సరికాదని అన్నారు. ఎవరేమన్నా తాము నిర్మాణాత్మక సూచనలు, సలహాలే ఇస్తామని, వాటిపై ధ్యాస పెట్టాలని హితవు పలుకుతూ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అంకెల గారడీ, అనవసరపు అపోహలతో కేంద్రం నుంచి అదనపు సహాయం రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సభలో మరోసారి గందరగోళం చెలరేగింది.
 
 గోరంట్ల వ్యాఖ్య.. భగ్గుమన్న సభ
 
 ఈ దశలో టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని జగన్ మీద విమర్శలు చేశారు. చంద్రబాబుపై ఎన్ని కేసులున్నాయో ఆయన మామగారే (ఎన్టీఆర్) చెప్పారన్న జగన్ వ్యాఖ్యను ఆక్షేపించారు. ‘ఆపరేషన్ ఆకర్ష్ వైఎస్ రాజశేఖరరెడ్డే చేపట్టారు. 16 నెలలు జైల్లో ఉన్న వాళ్లు ఇక్కడెవ్వరూ లేరు. మీ తల్లిగారైన విజయమ్మ గారు ఢిల్లీ వెళ్లి మీపై ఉన్న కేసుల గురించి మంతనాలు చేయలేదా’ అని అన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఒక్కుమ్మడిగా సభ మధ్యలోకి దూసుకెళ్లారు. సభలో లేని వారి ప్రస్తావన ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్ మాట్లాడేందుకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. సభను అదుపులో పెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో జగన్ మాట్లాడేందుకు అనుమతిచ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ‘విజయమ్మ, రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడటంవల్ల ఏమి ఉపయోగం? వాళ్లు ఇక్కడ లేరు, సమాధానం చెప్పుకోలేరు. ఎన్టీఆర్ గురించి మేమేమీ చెడ్డగా మాట్లాడలేదు. మాట్లాడం కూడా. వాళ్లంతట వాళ్లే ఏదేదో ఊహించుకుని అభాండాలు వేయడం మంచిది కాదు.
 
 దయచేసి సభలో ఉన్న వాళ్ల గురించి మాట్లాడుకుంటే ఏదైనా మంచి జరుగుతుంది’ అని చెప్పారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తరఫున జగన్ వకాల్తా పుచ్చుకున్నారు. ఎవరెవరికో ఉద్యోగాలు పోతున్నాయని బాధ పడుతున్నారు. జగన్ తీరు చూస్తుంటే బెల్ట్ షాపులు నడిపేవారికి, ఎర్రచందనం స్మగ్లర్లకు కూడా ఉపాధి పోతుందేమోనని భయపడేటట్టున్నారు. ఆద ర్శ రైతు వ్యవస్థ పోతున్నందుకు రైతులు సంతోషపడుతుంటే జగన్‌కు బాధ ఎందుకు? హత్యా రాజకీయాలు, అరాచకాలకు ఎవరు బాధ్యులో ప్రపంచానికి తెలుసు’ అని అన్నా రు. దీనిపై భూమా నాగిరెడ్డి తీవ్ర అభ్యంతరం చెబుతూ ప్రస్తుతం ఆ హంతకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. జరిగే హత్యల్ని ఖండించమని చెపితే ఈ గొడవేమిటని అన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, ఎస్సీ వర్గాలు ఉన్నాయని, వాళ్లను రక్షించే బాధ్యత తీసుకోవాలని సలహా ఇచ్చారు.
 
 అంకెల గారడని నిరూపిస్తారా?: జగన్
 
 తన ప్రసంగంలో పేర్కొన్న సంఖ్యలను అంకె ల గారడీ అనడాన్ని జగన్ తీవ్రంగా ఖండిం చారు. తాను సీఎస్‌వో, కాగ్, ఆర్‌బీఐ డాక్యుమెంట్ల నుంచి ఆ వివరాలు తీసుకున్నానని, అవి తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు. ఒకవేళ అధికార పక్షం దాన్ని నిరూపించకపోతే రాజీనామా చేసి ఇళ్లకు పోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దాన్ని తోసిపుచ్చిన కాలువ శ్రీనివాసులు.. జగన్‌కు అంత సరదా ఉంటే రాజీనామా చేయమనండి అన్నారు. ఆ తర్వాత అధికారపక్ష సభ్యులు జయ నాగేశ్వర్‌రెడ్డి, మీసాల గీత మాట్లాడారు.
 
 కృష్ణా డెల్టాకు నీరు వదలండి
 
 కృష్ణా డెల్టాకు నీరు వదిలేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. సాగర్ నుంచి తక్షణమే 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఆయన అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

YS Jagan Seems Like YS Rajashekar Reddy In AP Assembly : TV5 News

Written By news on Tuesday, June 24, 2014 | 6/24/2014

ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తు.రెండు రాష్ట్రాల్లోనూ గుర్తింపు

ఇక రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి గుర్తింపు
హైదరాబాద్: ఇక కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్సార్ సీపీ గుర్తింపు లభించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది.  ఉభయ రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ సీపీకి సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. అంతకముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పార్టీ గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యాన్‌ను ఇక  రెండు రాష్ట్ర్రాలో శాశ్వత ప్రాతిపదికన ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయించడం జరుగుతుంది.

కాంగ్రెస్ సర్కారును కాపాడామని సభసాక్షిగా టీడీపీయే ఒప్పుకుంది

అసెంబ్లీ సాక్షిగా టీడీపీయే ఒప్పుకుంది: వైఎస్ జగన్
హైదరాబాద్ : రైతుల రుణమాఫీ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని వైస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు ప్రస్తుతం కమిటీతో కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ఖరీఫ్ మొదలైనా ఇప్పటికీ రుణాలు అందటం లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మాఫీ కోసం రైతులు చూస్తున్నారని, బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవటంతో ప్రవేయిటుగా మూడు రూపాయిలకు వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు.

రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడిగితే, కేంద్రం, ఆర్ బీఐ సహాయం చేయాలని చెపుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేటప్పుడు ఇదే విషయాలు ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. బాబు వస్తే...జాబు వస్తుందని ప్రతి సమావేశంలో చెప్పారని, దాంతో చంద్రబాబు సర్కార్ వస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే భావనలో ఉన్నవారిని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు...ప్రయివేటు ఉద్యోగాలు అంటున్నారన్నారు.  ఆ ఉద్యోగాలు కూడా ఎప్పుడు వస్తాయో కూడా చెప్పటం లేదని జగన్ అన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు నుంచి ఇస్తారో చెప్పటం లేదన్నారు. చంద్రబాబు పాలనలో పరిశ్రమలు మూతపడటం వాస్తవం కాదా, ఉద్యోగులు రోడ్డున పడిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ఎప్పటినుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఇస్తారో చెప్పటం లేదని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో 11 వందల కోట్ల యూనిట్లు కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు. ఆస్తులు, అప్పుల నిష్పత్తి గురించి తాము చెబితే దాన్ని కూడా తప్పుదోవ పట్టించారని జగన్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తమ అనుయాయి అనే భావన కలిగించే ప్రయత్నం చేశారన్నారు. అదే చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ సర్కారును కాపాడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నలు సంధించారు. 2003-2004 సంవత్సరంలో అధికారం నుంచి తప్పుకునేసరికి రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉందని చంద్రబాబు సత్యదూరమైన మాటలు చెప్పారన్నారు. అప్పటికి రాష్ట్రం పూర్తిగా లోటులో ఉందని వైఎస్ జగన్ అన్నారు.

కాంగ్రెస్ సర్కారును కాపాడామని సభసాక్షిగా టీడీపీయే ఒప్పుకుందని జగన్ అన్నారు. 34వేల కోట్ల కరెంట్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని, అయితే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాల్సింది పోయి కాంగ్రెస్ ను కాపాడామని ఇప్పుడు ఒప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరోజు చంద్రబాబు విప్ జారీ చేయకపోతే కాంగ్రెస్ సర్కారు కచ్చితంగా కూలిపోయేది, రాష్ట్ర విభజన ఆగిపోయి ఉండేదని వైఎస్ జగన్ అన్నారు.

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: మేకపాటి

షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి: మేకపాటి
నెల్లూరు: ఎన్నికల మానిఫెస్టోలో వెల్లడించిన విధంగా, ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు విధించకుండా రైతు రుణమాఫీని అమలుచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 
 
రుణమాఫీతోపాటు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేకపాటి సూచించారు. కమిటీలు వేశామని.. ఆర్ బీఐ అనుమతి కోసం వేచి చూస్తున్నామనే ప్రకటనలకే పరిమితం కాకుండా, కాలయాపన చేయకుండా రుణమాఫీని అమలు చేయాలని తెలుగుదేశం ప్రభుత్వానికి సూచించారు. 

ప్రజలకు అరచేతిలో వైకుంఠం

'ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: అసత్య హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని, ఇప్పుడు ఆ హామీలను దాటవేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా, విశ్వేశ్వర్ రెడ్డి, ఐజయ్య విమర్శించారు. పంటల రుణమాఫీ, 9 గంటల ఉచిత విద్యుత్ హమీల అమలుపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదన్నారు.

కేంద్రం, ఆర్ బీఐపై నెపం మోపుతూ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలుపై కార్యాచరణ ప్రకటించకుండా కోటయ్య కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయనని, రుణమాఫీ అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!

తండ్రికి ధీటుగా ప్రజాపక్షమే అజెండాగా..!
అసెంబ్లీ ప్రారంభమైంది. జనంలో ఆసక్తి అధికంగా కన్పించింది. తొలిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం వినాలనే తలంపు ఎక్కువైంది. అంతలోనే ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ తొలిసారి ప్రసంగం మొదలు పెట్టారు. ప్రజల ప్రక్షపాతిగా, వారి సమస్యలే అజెండాగా అధికార పక్షాన్ని ధీటుగా ఢీకొన్నారు. ఉక్కిరిబిక్కిరైనా అధికార పక్షం అడుగడుగునా అడ్డు తగులుతున్నా వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టారు. ఎన్నికల హామీలను విస్మరించడంపై టీడీపీ అధినేత వైఖరిని కడిగిపారేసి తండ్రికి తగ్గ తనయుడుగా... అసలు సిసలైన ప్రజాపక్షపాతిగా వైఎస్ జగన్ నిలిచారు.

ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల పక్షపాతి. ప్రజా సమస్యలే ఏకైక ఎజెండాగా మెలగాల్సిన నేత. ఆ స్ఫూర్తితో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా జనానికి అండగా నిలిచారు. పదేళ్లు కిందట అసల సిసలైన ప్రజల పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రతిపక్ష నాయకుడుగా వైఎజ్ జగన్ నిలవనున్నారని తండ్రిగా తగ్గ ప్రజాపక్షపాతిగా తొలిరోజే నిరూపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష నేతలు కూడా ప్రశంసించటం విశేషం.

సింగరేణి కాలరీస్ ఎండీకి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ

ఆర్టీపీపీపై సవతి ప్రేమ
- ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయండి
- సింగరేణి కాలరీస్ ఎండీకి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, కడప: 
రాయలసీమకు మణిహారంగా నిలుస్తున్న ఆర్టీపీపీకి అవసరమైన బొగ్గు సరఫరాలో సవతిప్రేమ చూపొద్దని, జెన్‌కో సంస్థతో చేసుకున్న అగ్రిమెంటు మేరకు బొగ్గు సరఫరా చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆర్టీపీపీలో బొగ్గునిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఎండీ సుతిత్రభట్టాచార్యకు సోమవారం లేఖ రాశారు. 1050 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేక యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు.

సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉందన్నారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆయన వివరించారు. జెన్‌కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా, ఆమేరకు బొగ్గు సరఫరా కావడం లేదని అవినాష్‌రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు. జెన్‌కోలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ

ఆర్టీపీపీ ఏరోజుకారోజు బొగ్గు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపరిణామానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్‌సీసీఎల్ కారణంగా ఉత్పత్తి ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఎస్‌సీసీఎల్ ఛెర్మైన్‌కు రాసిన లేఖలో తెలిపారు.

జగన్ రెండు సవాళ్లు...

భూ కేటాయింపులపై రగడ: జగన్
* ధూళిపాళ్లకు జగన్ సవాల్
* బ్రహ్మణి స్టీల్ స్థలంపై లోన్ తీసుకున్నట్టు నిరూపిస్తారా?
* సభలో లేని వ్యక్తిపై దాడేమిటి?
* గాలి జనార్దన్‌రెడ్డిని కాల్వ శ్రీనివాసులు
* సింగపూర్ తీసుకువెళ్లి చంద్రబాబుతో కలిపించారా? లేదా?: జగన్

 
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)కు భూము ల కేటాయింపుపై సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా అధికార టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చేసిన వ్యాఖ్యలు సభలో ఈ గందరగోళానికి దారితీశాయి. గవర్నర్ ప్రసంగంలో లేని జలయజ్ఞం, సెజ్‌లకు భూ కేటాయింపులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. బ్రహ్మణి స్టీల్స్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ... బల్లులు కూడా గుడ్లు పెట్టని పది వేల ఎకరాల భూముల్ని ఆ సంస్థకు అప్పగించామని ఆనాటి ముఖ్యమం త్రి చెప్పారని, కానీ ఆ సంస్థ నిర్వాహకులు అటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.300 కోట్లు రుణం తీసుకున్నారని, స్థలాభివృద్ధికి 20 కోట్లు మాత్రమే వ్యయం చేశారని ఆరోపించారు. ఈ తరహాలో దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కాకినాడ సెజ్‌కు 20 వేల ఎకరాలు కేటాయించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
 
 
 
 జగన్ రెండు సవాళ్లు...
 ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ధూళిపాళ్ల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. కాకినాడ సెజ్ విషయంలో సభను తప్పుదోవ పట్టించేలా ధూళిపాళ్ల మాట్లాడుతున్నారంటూ... దానిపై నిజనిరూపణకు సిద్ధమా అంటూ శ్రీకాంత్‌రెడ్డి తరఫున సవాల్ విసిరారు. బ్రహ్మణి స్టీల్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.300 కోట్ల రుణం తీసుకున్నట్టు నిరూపించగలిగితే శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా చేస్తారని, లేకుంటే నరేంద్ర కుమార్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. ధూళిపాళ్ల రాజీనామాకు సిద్ధమంటే విచారణ జరిపిద్దామన్నారు.
 
 ఇదే సందర్భంలో తానింకో సవాల్ కూడా చేస్తున్నానంటూ... కాల్వ  శ్రీనివాసులు ద్వారా గాలి జనార్దన్‌రెడ్డి సింగపూర్‌లో చంద్రబాబును కలిసిన మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు, జనార్దన్‌రెడ్డి, ఈ సభలోనే ఉన్న కాల్వ శ్రీనివాసుల పాస్‌పోర్టులు చెక్ చేయండి. వీసాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే గాలి జనార్దన్‌రెడ్డిని చంద్రబాబుతో కలిపించేందుకు కాల్వ శ్రీనివాసులు సింగపూర్ తీసుకువెళ్లారా? లేదా? ఈ విషయాన్ని ఎంతదాకా తీసుకువెళ్లేందుకైనా శ్రీకాంత్‌రెడ్డి సిద్ధం’’ అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి ఐదేళ్లయింది, ఆ తర్వాత పాలన చేసిన కాంగ్రెస్‌ను వదిలి నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 కాల్వ శ్రీనివాసులు జవాబిది..
 కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ జగన్ వ్యాఖ్యలను తోసిపుచ్చా రు. ధూళిపాళ్ల మళ్లీ కాకినాడ భూములు, సెజ్‌ల వ్యవహా రాన్ని మొదలుపెట్టారు. దీనికి అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగంపై మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
 
 మైనారిటీ వాణి విన్పించనివ్వరా?
 ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు జలీల్‌ఖాన్, జ్యోతు ల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. దానికి స్పీకర్ అంగీకరించలేదు. మైనారిటీ వాణి వినిపించడానికైనా అవకాశం ఇవ్వండని జలీల్‌ఖాన్ కోరారు. ఈ దశలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని తమకు ఎవరిపైనా ద్వేషం లేదని తెలిపారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

కార్యకర్తలకు అండగా ఉంటా
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి

 
 గుంతకల్లుటౌన్: పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే నాలుగేళ్లు తన వెంట ఉన్న వారికి న్యాయం చేయాలని భావించానని, అయితే దురదృష్టవశాత్తు ఓడిపోయామన్నారు. కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో పార్టీ ఓటమిపాలైందన్నారు. అంతేగాకుండా టీడీపీ తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పటినుంచి తాను కూడ కార్యకర్తల్లో ఒకడిగా పార్టీ అభివృద్ధికి పాటుపడతానని, అధికారపార్టీ చేసే తప్పులపై ప్రజల తరఫున పోరాడతానన్నారు. కార్యకర్తలు కూడ అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మునిసిపల్ ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యుగంధర్‌రెడ్డి, మైనుద్దీన్, పట్టణ క న్వీనర్లు సుధాకర్, ఎద్దుల శంకర్, నాయకులు జింకల రామాంజనేయులు, గోపా జగదీష్, ఫ్లయింగ్ మాబు, మల్లికార్జున శాస్త్రి, త్యాగరాజు, బావన్న, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌

జాప్యమేల బాబూ?
ఎన్నికల హామీల అమలుపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి
వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
కమిటీలతో కాలయాపన చేస్తే మరింత నష్టం ,గవర్నర్ ప్రసంగంలో గత పదేళ్లలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు
కానీ చంద్రబాబు హయాంతో పోలిస్తే గత పదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి మెరుగ్గా ఉందని గణాంకాలే చెబుతున్నాయి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ప్రభుత్వం తీరును ఎండగట్టిన జగన్
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నికలకు ముందు మీరిచ్చిన అనేక హామీలను నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ హామీలు నెరవేరుస్తారని కోట్లాది మంది వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా చెల్లెమ్మలు రుణాలు మాఫీ అవుతాయని ఆశగా ఉన్నారు. మీరేమో కమిటీలంటూ కాలయాపన చేయడం సమంజసంగా లేదు..’’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ల పెంపు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, 9 గంటలపాటు ఉచిత కరెంటు వంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రభుత్వం తరఫున ఒక్క అడుగూ ముందుకుపడటం లేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు.
 
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం శాసనసభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో దాదాపు 2 గంటలపాటు జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. అయితే ప్రతిపక్ష సభ్యులపై ముందే దాడికి సిద్ధమైన రీతిలో 17 సార్లు అధికారపక్ష టీడీపీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘మీరు మాట్లాడినప్పుడు మేం శ్రద్ధగా విన్నాం. మీరు కూడా మా ప్రసంగం పూర్తయ్యాక స్పందించవచ్చు. అంతేకానీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేది వినడానికి కూడా ఓపిక లేదంటే ఎలా?’ అంటూ జగన్ ప్రశ్నిస్తూ, అక్కడక్కడా అధికారపక్షానికి చురకలంటిస్తూ తన ప్రసంగం కొనసాగించారు.
 
 ఇంకా అధ్యయనం దేనికి?
 
 ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం కోటయ్య కమిటీ, ఆ కమిటీ ఈ కమిటీ అంటూ జాప్యం చేస్తుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ‘‘సీజన్ వచ్చినందున వెంటనే పంట రుణాలివ్వాలి. పాత రుణాలను కడితేగానీ కొత్త రుణాలివ్వలేమని బ్యాంకులు అంటున్నాయి. పైగా రుణాలను చెల్లించాలని బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. (ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో జూన్ 17న ఓ రైతుకు ఎస్‌బీఐ బ్యాంకు ఇచ్చిన నోటీసును సభలో చూపించారు.) రైతుల రుణమాఫీపై అధ్యయనం చేస్తున్నామని చెబుతున్నారు.. కానీ ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ) సమావేశంలో రూ.87వేల కోట్లకుపైగా రైతుల రుణాలు ఉన్నాయని, రూ.14 వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయని నివేదిక ఇచ్చారు. మరి ఇంకా అధ్యయనం ఎందుకో అర్థం కావడం లేదు’’ అని అన్నారు. రుణాల మాఫీ జాప్యం జరిగితే రైతులు పంట బీమాను కోల్పోయే ప్రమాదం ఉంటుందని జగన్ అన్నారు. ఆయన శాసనసభలో అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనవి ఆయన మాటల్లోనే..
 
 కోతతో విలవిల..
 
 నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గ్రామాల్లో ఇప్పటికీ 15 గంటలపైనే కోత సాగుతోంది. అధికారికంగానే 12 గంటలు కోత విధిస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో రైతులు నరకం అనుభవిస్తున్నారు. దీనివల్ల పరిశ్రమలూ మూతపడుతున్నాయి. చాలామంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. అంతేకాదు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామన్న మీరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సీమాంధ్ర పదమూడు జిల్లాల్లో 14 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కళాశాలలు ఫీజులు కట్టాలని నోటీసులు ఇచ్చాయి. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా లేదు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అన్నారు. కానీ ప్రైవేటు స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు చెల్లించనిదే విద్యార్థులను చేర్చుకోని పరిస్థితి. మరోవైపు సీమాంధ్రలో పెద్దాసుపత్రులు లేవు. ఆరోగ్యశ్రీ పేషెంట్లందరూ హైదరాబాద్‌కు వచ్చే పరిస్థితి. ఆస్పత్రి యాజమాన్యాలు వెనక్కు పంపిస్తున్నాయి. వైద్య ఖర్చులు ఎవరు చెల్లిస్తారో చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు. సంతకం పెట్టిన రోజునుంచే వెయ్యి రూపాయలు పింఛన్ వస్తుందని అవ్వాతాతలు సంబరపడ్డారు. కానీ అక్టోబర్ 2 నుంచి అమలుచేస్తామని మీరు అంటున్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సింది పోయిమిన్నకున్నారు.
 
 లీడర్ అంటే..
 
 నాయకుడనేవాడు ప్రజలను నిరాశా నిస్పృహలకు గురిచేయడం కాకుండా.. ముందుండి నడిపించాలి. హైదరాబాద్ లేకపోయినా మనం పుంజుకునే అవకాశాలున్నాయి. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నాగార్జున, కోరమాండల్ వంటి కంపెనీలున్నాయి, విశాఖ ఉక్కు పరిశ్రమ ఉంది, హెచ్‌పీసీఎల్ వంటి రిఫైనరీలున్నాయి, ఫార్మా రంగం ఉంది. గంగవరం, కృష్ణపట్నం వంటి భారీ ఓడరేవులున్నాయి. పారిశ్రామిక వేత్తలున్నారు, భూములున్నాయి, వీటన్నిటినీ వినియోగించుకోవాలి. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో విమానాశ్రాయాలున్నాయి.. వాటిని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. మనకున్న బలం వ్యవసాయం, పరిశ్రమలే. ఇక్కడ ఒక్క ఐటీ పరిశ్రమ లేదు.. గుజరాత్‌లో కూడా ఐటీ పరిశ్రమ లేకపోయినా ముందంజ వేశారు. హైదరాబాద్ ఉన్న తెలంగాణలోనూ ఐదు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. సీమాంధ్రలో ఆరు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి.
 విభజించిన వారికి వంతపాడారు..
 
 రాష్ట్రాన్ని విభజిస్తున్నారని, తీరని అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నా వినలేదు. నాడు విభజనకు లేఖ ఇచ్చారు.. పార్లమెంటులో మద్దతు పలికారు(టీడీపీని ఉద్దేశించి). కనీసం అన్యాయం జరిగిందని గవర్నర్ ప్రసంగంలోనైనా ఆ నష్టాన్ని గుర్తించారు.. సంతోషం. (దీనిపై టీడీపీ సభ్యులు అడ్డుపడగా..)అసలు మీరు విభజనకు వంతపాడిన పార్టీ(బీజేపీ) పంచనే చేరారు కదా? ఎవరివల్ల రాష్ట్ర విభజన జరిగిందో అందరికీ తెలిసిందే కదా!
 
 వైఎస్ స్ఫూర్తితోనే..
 
 మా పార్టీ పేరులోనే రైతు ఉన్నాడు.. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితోనే రైతుల పక్షాన నిలబడతాం. వైఎస్ హయాంలో ప్రతి పేదవాడికీ లబ్ధి జరిగింది. అంత వరకూ 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వస్తుంటే.. వైఎస్ హయాంలో 71 లక్షలకు వర్తింపచేశారు. అప్పటి వరకూ ఏడాదికి 2.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టిస్తే వైఎస్ వచ్చిన తర్వాత ఏటా 10 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వైఎస్ రాకముందు 1.2 కోట్లు రేషన్ కార్డులుఉంటే.. ఆయన వచ్చాక 2 కోట్లకు చేరాయి.
 
 ప్రతిపక్ష పార్టీ అంటే అన్నీ వ్యతిరేకించేది కాదు..
 
 ప్రతిపక్ష పార్టీగా కొత్త సాంప్రదాయానికి తెర తీస్తాం. ప్రతిపక్ష పార్టీ అంటే అన్నీ వ్యతిరేకించేది కాదు. ఆ ఆలోచన నుంచి అధికార పక్షం కూడా బయటకు రావాలి. రైతులకు, బలహీన వర్గాలకు మేలు జరుగుతుందంటే అధికార పక్షానికి ప్రతిపక్షంగా సహకరించే విషయంలో ముందుంటాం. అంతేగానీ ప్రతిదాన్నీ రాజకీయం చేయడం తగదు.
 
 హామీలపై చర్చించాకే మేనిఫెస్టో..
 
 హామీలు ఇచ్చేముందు అమలు చేయగలమా లేదా అని ఆలోచించే మేం ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాం. బాబు హామీలు ఇచ్చి అమలు చేస్తానని చెబుతున్నారు మరి మనమెందుకు చెయ్యలేమని, ఆర్థిక సలహాదారులతో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరితో సుదీర్ఘంగా చర్చించాను. కానీ హామీలు ఇచ్చాక అమలు చేయకపోతే అభాసుపాలవుతామని అందరూ చెప్పారు. హామీలు అధికారంలోకి తీసుకువచ్చేందుకే కాదు, ఆచరణ సాధ్యమయ్యేలా ఉండాలి. అందరి నిర్ణయం మేరకే నాడు సాధ్యంకాని హామీలివ్వలేదు.. అంతేగానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కమిటీలంటూ కాల యాపన చేసేందు కు కాదు.
 
 సింగపూర్ సిటీ వస్తోందని ఆశగా ఉంది..
 
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపదే పదే రాజధాని సింగపూర్ సిటీ కన్నా అద్భుతంగా చేస్తామని అన్నారు. అంతకంటే మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. కేపిటల్ సిటీ అంటే అసెంబ్లీ, హైకోర్టులే కాదు.. అందరికీ అందుబాటులో, రాష్ట్రానికి మధ్యలో ఉండేటట్టు చేయాలి. రాజధాని అంటే విస్తారంగా నీళ్లు ఉండాలి.. స్థలాభావం లేకుండా ఉండాలి.. పేదవారినికూడా దృష్టిలో ఉంచుకుని రాజధాని ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
 
 బాబొచ్చె జాబు పోయే పరిస్థితి వద్దు..
 
 ఇంటికో ఉద్యోగం అన్నారు. ఉపాధి లభించే వరకూ నిరుద్యోగ భృతి అన్నారు. టీవీల్లో పదే పదే ప్రకటనలు ఇచ్చారు. ఇది నిజమేననుకుని ప్రజలు ఓట్లేశారు. కానీ ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలే పోయే పరిస్థితి వచ్చింది. 24 వేల మంది ఆదర్శ రైతులను తొలగిస్తూ నోటీసులు ఇచ్చారు. గృహనిర్మాణ సంస్థలో 3,600 మంది, వైద్య ఆరోగ్యశాఖలో 4 వేల మంది, జలయజ్ఞంలో 7 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇలా వివిధ విభాగాల్లో వేలాది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇంటికో జాబు అన్న మీరు ఉన్న జాబు పోయే పరిస్థితి తీసుకురావద్దు. హామీ ఇచ్చినట్లుగా ఇంటికొక ఉద్యోగం కల్పించండి.
 
 
 అన్నీ తెలిసే హామీలిచ్చారు
 మీరు హామీలిచ్చే నాటికి రాష్ట్రం విడిపోతుందని తెలుసు, అన్నీ తెలిసే హామీలిచ్చారని చంద్రబాబుని జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా విమర్శించారు.  ఫిబ్రవరి 12న తెలంగాణ బిల్లును లోక్‌సభలో  ప్రవేశపెట్టారు, 18న బిల్లు ఆమోదించారు.. ఇన్ని జరిగాక మీకు రాష్ట్రం విడిపోతుందని తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 2న అపాయింటెడ్ డే ఇచ్చారనీ మీకు తెలుసని,  రాష్ట్రం విడిపోయాక ఆర్థికంగా ఎంతగా నష్టపోవాల్సి ఉంటుంది, రాజధాని లేకపోతే పరిస్థితి ఏమిటి ఇవన్నీ మీకు తెలియని కావు. ఇవన్నీ తెలిశాకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు మీరు మార్చి 31న మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు మీకు రాష్ట్ర పరిస్థితులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.  గవర్నర్ ప్రసంగంలో రూ.15 వేల కోట్లు రెవెన్యూ లోటు ఉందని రాశారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాక రూ.15 వేల కోట్లా, లేదా ముందే అంత లోటు ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగా మీకు ముందే రెవెన్యూ లోటు ఉందని తెలిసి ఇన్నిహామీలు ఎలా ఇచ్చారు. హామీలు ఇస్తే ఎలా నెరవేరుస్తామని అనుకుంటున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2014 ఏప్రిల్ 11న ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారని, రెవెన్యూ వివరాలన్నీ తెలుసుకునే లేఖ రాశారని, హామీలన్నీ ఎలా నెరవేర్చేది కూడా ఇచ్చారని, మరి ఇప్పుడెందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో పేజీ నంబర్6లో ఓవైపు విభజనతో అన్యాయం జరిగింది అంటూనే, మరోవైపు చాలా బాగుంది అంటూ వివరాలు ఎలా ఇచ్చారు.. మళ్లీ రెవెన్యూ డెఫ్షిట్ అంటున్నారు ఇది ఎలా సాధ్యమో చెప్పాలని అన్నారు.
 
 పదేళ్లలో ఏం జరిగిందో మీకు తెలియదా?
 
 ‘‘గవర్నర్ ప్రసంగంలో గడిచిన పదేళ్లలో రాష్ట్రం చాలా నష్టపోయినట్టు పొందుపరిచారు, కానీ అధికారపక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరముంది. మామూలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందీ అని చెప్పడానికి కొన్ని పరామితులుంటాయి. వీటిలో జీడీపీ, తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ వంటివాటిని ప్రధాన కొలమానాలుగా తీసుకోవచ్చు.
 
  గడిచిన మూడు దశాబ్దాల్లో జీడీపీ (వార్షిక వృద్ధి రేటు) చూస్తే, 1984-94 మధ్య దేశంలో అది 5 శాతం ఉంటే రాష్ట్రంలో 5.38 ఉంది.. చంద్రబాబు పాలించిన 1994-2004 మధ్య దేశంలో జీడీపీ 6 శాతం ఉంటే, రాష్ట్రంలో వృద్ధిరేటు 5.72 శాతంగా ఉంది. అదే 2004-2014 మధ్య దేశంలో వృద్ధి రేటు 7.56 శాతం ఉంటే రాష్ట్రంలో 8.23 శాతం ఉంది. ఈ లెక్కన చంద్రబాబుకు 57 మార్కులు వస్తే, ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి 82 మార్కులు వచ్చాయి.
 
  ఇక రెండో కొలమానం తలసరి ఆదాయం.. చంద్రబాబు హయాంలో తలసరి ఆదాయం రూ.25,321 ఉంటే, 2013-14లో తలసరి ఆదాయం రూ.89,214 ఉంది.. రెండింటికీ పొంతన ఉందా? ఇవి ఇక్కడ తీసిన లెక్కలు కూడా కావు.. కేంద్ర గణాంక సంస్థ ఇచ్చిన అధికారిక డాక్యుమెంట్లు. అభివృద్ధి అంటే ముందుకు పోవడం.. కానీ వెనక్కు వెళ్లడం కాదన్న విషయాన్ని అధికార పార్టీ గుర్తుంచుకోవాలి.
 
  మూడోది జీఎస్‌డీపీ.. చంద్రబాబు పాలన ముగిసిన ఏడాది 2004-2005లో జీఎస్‌డీపీ రూ.2,24,713 కోట్లు అయితే.. 2013-14లో అది రూ.8,57,364 కోట్లకు చేరింది. ఇది గర్వించదగిన అంశం. ఇక్కడ దేశంలోనే మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది.
 
  ఇక నాలుగోది జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి... చంద్రబాబు సీఎంగా వచ్చినప్పడు జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి 20.5 శాతం అయితే చంద్రబాబు దిగిపోయేనాటికి దాన్ని 32.4 శాతానికి తీసుకుపోయారు. అంటే అప్పులు పెంచేశారు. 2004-2014 కాలంలో అది 22.4 శాతానికి తగ్గింది.
 
 భారం మోపింది మీరు కాదా..
 
  1994 నుంచి 2004 వరకూ చంద్రబాబు సామాన్యులపై వేయని పన్నులంటూ ఏమైనా ఉన్నాయా? రూ.2 కిలో బియ్యం ధరను పెంచేశారు, మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు, హార్స్‌పవర్ రేటును పెంచారు, రవాణా చార్జీలు పెంచారు, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీరు అమలు చేయలేదు. అయినా రూ.21,994 కోట్ల రెవెన్యూ లోటును చూపించారు. మీరు దిగిపోయాక అంటే 2004-2014 మధ్య కాలంలో రూ.10,329 కోట్ల రెవెన్యూ సర్‌ప్లస్ వచ్చింది. హెచ్‌డీఐ (హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్) ఇచ్చిన వివరాల ప్రకారం 1981-1991 మధ్య దేశంలో రాష్ట్రానిది 9వ స్థానం, అదే చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రం 10వ స్థానానికి పడిపోయింది. దీన్నిబట్టి రాష్ట్రం ముందుకు వెళ్లినట్టా, వెనక్కు వెళ్లినట్టా?’’

Popular Posts

Topics :