29 June 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

సోమవారం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

Written By news on Saturday, July 5, 2014 | 7/05/2014

సోమవారం గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. వైఎస్ జగన్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ తో సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ జెడ్సీ చైర్మన్ ల ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాల గురించి వైఎస్ జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీలను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దాడులకు
పాల్పడటం వంటి సంఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

ప్రకాశం జడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా

ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. శనివారం జరిగిన ఛైర్మన్ అభ్యర్థి ఎన్నికలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ప్రకాశం జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయక తప్పలేదు. టీడీపీ సభ్యులు సహకరించకపోవడంతోఛైర్మన్ ఎన్నికను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ విజయ్ కుమార్ ప్రకటించారు. టీడీపీ నేతలు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించి ఆందోళన దిగారు. టీడీపీ సభ్యులు సహకరించాలని కలెక్టర్ పలుమార్లు విన్నవించినా వారు సహకరించకపోవడంతో ఛైర్మన్ ఎన్నికను తాత్కాలికంగా నిలిపివేశారు. సమావేశ హాల్లో టీడీపీ సభ్యులు వీరంగ సృష్టించడంతో వైఎస్సార్ సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎలాగోలా ప్రలోభాలతో  దక్కించుకోవాలని, లేనిపక్షంలో ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ ఆద్యంతం యత్నించింది. శనివారం మధ్యాహ్నం ప్రకాశం కలెక్టర్ అధ్యక్షతన జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్నికకు సమావేశం ప్రారంభం కాగానే కొద్ది సేపటికే తెలుగుదేశం నాయకులు వీరంగం వేశారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ 31 మంది సభ్యులతో సృష్టమైన ఆధిక్యంలో ఉన్నా టీడీపీ నేతలు ఆందోళనతో అడ్డుకున్నారు. కేవలం 25 సభ్యుల సంఖ్యా బలం మాత్రమే ఉన్న టీడీపీ ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యుల్ని ప్రలోభాలకు గురి చేయాలని యత్నించింది. ప్రకాశం ఛైర్మన్  పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ ఆద్యంతం యత్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. వైఎస్సార్ సీపీ సభ్యులతో టీడీపీ వాగ్వివాదానికి రణరంగాన్ని తలపించారు. చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగడంతో అభ్యర్థి ఎన్నికను వాయిదా వేశారు.

ప్రజాస్వామ్యంలో ఓ బ్లాక్ డే

ప్రజాస్వామ్యంలో ఓ బ్లాక్ డే
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక బ్లాక్‌ డే అని  వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇనుప కంచెలు వేసి జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యమా? అని ఆమె ప్రశ్నించరు. టీడీపీ నేతలు బరితెగించి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలలో టిడిపి నేతలు పాల్పడని అక్రమంలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ బాధపడే రోజు ఇదని ఆమె అన్నారు.

జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు అప్రజాస్వామికంగా, అమానుషంగా, అరాచకంగా వ్యవహరించారన్నారు. టిడిపి నేతల వ్యవహారశైలిని ఆమె తప్పుపట్టారు. అందుకు పోలీసులు మద్దతు పలకడాన్ని కూడా ఆమె విమర్శించారు.
ఉన్నత చదువులు చదివిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లుకూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడం బాధాకరం అన్నారు. కోట్ల రూపాయల డబ్బును టీడీపీ నేతలు మంచినీళ్లలా ఖర్చు పెట్టి తమ నేతలను కిడ్నాప్‌ చేశారని, వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్

'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిక్షరణలో ఘోరంగా విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ సిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా  ఒంగోలులో ఓటర్లు కానివారు కూడా ఎన్నికల హాలులోకి ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు.  చంద్రబాబు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడలేకపోతోందన్నారు. టీడీపీ సర్కారు అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందని చెప్పారు. ఈ  ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్‌ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరతామని చెప్పారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను ఈ రోజే  నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వ్యవహార తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజాస్వామ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు ఘటనలపై డీజీపీకి  ఫిర్యాదు చేసినట్లు మైసూరారెడ్డి తెలిపారు.

మా నేతలపై కేసులు బనాయిస్తున్నారు: వైఎస్సార్‌సీపీ

ఏపీ డీజీపీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
 సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్‌ఐ దురుసు ప్రవర్తన కారణంగా తమ పార్టీకి చెందిన సహకార సంఘ అధ్యక్షుడు మరణించిన తరువాత కూడా తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం జరుగుతోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలసి సంఘటన వాస్తవాలను వివరించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలుచోట్ల తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. గిద్దలూరులో గత నెల 30వ తేదీన సహకార సంఘ అధ్యక్షుడు వై. భాస్కరరెడ్డి మృతికి కారణమైన ఎస్‌ఐని వెంటనే సస్సెండ్ చేసి ఆరెస్టు చేయాలని డీజీపీని కోరారు.

సమంజసం కాదు: వైఎస్ జగన్

సమంజసం కాదు: వైఎస్ జగన్
ఏపీఎన్జీవోల భూమి స్వాధీనంపై వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలకు హైదరాబాద్‌లో కేటాయించిన 189 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తిరిగి ఆ భూములను ఏపీఎన్జీవోలకు అప్పగించాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
 
ఈ భూముల కేటాయింపు రెండు దశాబ్దాల కిత్రమే జరిగిందని, ఆ భూమిని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాట్లుగా విభజించుకుని.. అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాల అభివృద్ధికోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను రద్దు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వేరెవరికైనా భూ కేటాయింపులు చేయదలుచుకుంటే ప్రత్యామ్నాయంకోసం చూడాలి తప్పిస్తే, ఈ భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని సూచించారు. ఈ భూములను తిరిగి ఏపీఎన్జీవోలకు అప్పగించడమే న్యాయమన్నారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలుంటే వాటిపై ఏపీ ప్రభుత్వం కలుగజేసుకుని ఏపీఎన్జీవోలకు అండగా నిలబడాలని కోరారు

వైఎస్ఆర్సీపీ మహిళా ఎంపీటీసీపై టీడీపీ కార్యకర్తల దాడి

Written By news on Friday, July 4, 2014 | 7/04/2014

అనంతపురం: పలు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. తన ఇంటి ముందు బాణాసంచా కాల్చవద్దన్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎంపీటీసీ రమాదేవిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. 
 
ఈ ఘటన అనంతపురం జిల్లా గోరంట్లలో చోటు చేసుకుంది. తనపై, తన నివాసంపై రాళ్లదాడి చేసిన  టీడీపీ కార్యకర్తలపై ఎంపీటీసీ రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపిటీసీ నివాసంపై దాడి చేయడంపై నిరసన వ్యక్తం అవుతోంది. 

కళ్లల్లో కారం చల్లి..వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు రణరంగంగా మారింది. మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నికలను పరిశీలించేందుకు వెళ్లిన కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ కౌన్సిలర్లు అవినాష్ రెడ్డి కళ్లల్లో కారం చల్లారు. అవినాష్ రెడ్డికి గాయాలవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశంతో  సాయంత్రం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు  పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఎస్ఐ సహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి భాష్పాయువు ప్రయోగించారు.

డీజీపీని కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులను నివారించాలంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడును కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. కడప, చీరాల, కనిగిరి ఘటనలపై విచారించాలని డీజీపీని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు

ఏపీ ఎన్జీవోల భూములు తిరిగి ఇవ్వండి: వైఎస్ జగన్

 ఏపీ ఎన్జీవోలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు.  ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆ భూములను ఏపీ ఎన్జీవోలకు అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

ఏపీ ఎన్జీవో ఉద్యోగులు ఆ భూములను ప్లాట్లుగా విభజించుకుని, విద్యుత్, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరికైనా భూకేటాయింపులు చేయదలచుకుంటే ప్రత్యామ్నయం చూడాలే కానీ, ఆ భూములను స్వాధీనం చేసుకోవటం తగదన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఏపీ ఎన్జీవోలకు అండగా ఉండాలని జగన్ కోరారు.

చంద్రగిరి ఎమ్మెల్యేకు భద్రత కుదించిన సర్కార్!

ఇదేందయ్యా ‘చంద్రం!
- చంద్రగిరి ఎమ్మెల్యేకు భద్రత కుదించిన సర్కార్!
- అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధికి భద్రత కుదించడంపై విమర్శలు

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆ నియోజకవర్గం ఒకప్పుడు నక్సల్స్‌కు అడ్డా.. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు.. ఇప్పుడు ఆ నియోజకవర్గం తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల కు చిరునామా.. ఎర్రచందనం స్మగ్లర్లను ఏరివేయడానికి పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. అత్యం త సమస్యాత్మక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు భద్రత పెంచాల్సింది పోయి ప్రభుత్వం తగ్గించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఈ ఎత్తు వేశారని పోలీసు వర్గాలే విమర్శిస్తున్నాయి..
 
చంద్రగిరి నియోజకవర్గం సీఎం చంద్రబాబునాయుడు జన్మించిన ప్రాంతం. మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎంపీ శివప్రసాద్ ఆ నియోజకవర్గానికి చెందిన వారే. ఆ నియోకజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటగింపుగా మారింది.

ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలతో మేమకవుతుండటం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రతను కుదించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలని టీడీపీ నేతలు ఎత్తు వేశారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి భద్రతను 2+2 నుంచి 1+1కు కుదించింది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై పోలీసువర్గాలే నివ్వెరపోతున్నాయి.
 
ఎన్నికలకు ముందూ.. తర్వాతా..
సార్వత్రిక ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదయాత్ర చేస్తోన్న సమయంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులు లక్ష్యంగా టీడీపీ నేతలు దాడులు చేశారు. ఈ దాడుల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. ఫలితాలు వెలువడ్డాక ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.
 
‘ఎర్ర కూలీలకు అడ్డా..
తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఇదే నియోజకవర్గం కేంద్రంగా అరాచకాలు సాగిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు భా రీ ఎత్తున గాలింపు చేపట్టారు. పోలీసులు, ఎర్రచంద నం స్మగ్లర్ల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఎదురుకాల్పుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు, పోలీసులు కన్నుమూశారు. నియోజకవర్గ గత చరిత్రను ఒక్కసారి పరిశీ లిస్తే ఫ్యాక్షన్ రాజకీయాలు సాగినట్లు స్పష్టమవుతోంది. నక్సల్స్ కార్యకలాపాలకు ఈ నియోజకవర్గం కేంద్రం గా ఉండేది. పలు ప్రాంతాల్లో నక్సల్స్ చేసిన దాడుల్లో పలు ఇళ్లు, ఆస్తులు ధ్వంసమైన విషయం విదితమే.
 
భద్రత పెంచాల్సిన సమయంలో..
అత్యంత సమస్యాత్మకమైన ఈ నియోజకవర్గంలో ఎ మ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. భద్రత కుదించిన నేపథ్యంలో సంఘవిద్రోహక శక్తులు చెవిరెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల వంటి సంఘవిద్రోహక శక్తులు తమపై పోలీసులు చేస్తోన్న దాడికి నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డిని కిడ్నాప్ చేసే అవకాశం కూడా ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు విశ్వసనీయం గా తెలిసింది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఎమ్మెల్యే చెవిరెడ్డికి భద్రత పెంచాల్సిన ప్రభుత్వం కుదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డిని ప్రజలకు దూరం చేసేందుకే భద్రతను కుదించినట్లు పోలీసువర్గాలే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం

పురపాలక ఎన్నికల్లో టీడీపీ అరాచకం

* పురపాలక ఎన్నికల్లో టీడీపీ అరాచకం
* ప్రజా సమస్యలు పక్కనపెట్టి మున్సిపాలిటీలపైనే గురి
* పలువురు ప్రతినిధులతో నేరుగా మాట్లాడిన ఏపీ సీఎం
* ప్రలోభాలు, బెదిరింపులు, బలవంతంగా ఓటింగ్
* టీడీపీకి మెజారిటీ ఉన్నవి 55 కాగా నెగ్గినవి 73
* 15 మున్సిపాలిటీలు గెలుచుకున్న వైఎస్సార్‌సీపీ
* జమ్మలమడుగు, మార్కాపురం ఎన్నికలు వాయిదా
 
సాక్షి, హైదరాబాద్: ప్రలోభాలు... దౌర్జన్యాలు... అక్రమాలు... అన్యాయాలు... రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన మున్సిపాల్టీలు, కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం వ్యవహరించిన తీరిది. సీఎం చంద్రబాబు స్వయంగా ఆయా జిల్లాల్లోని మంత్రులకు, సీనియర్ నేతలకు ఫోన్లు చేసి వ్యవహారాలను నడిపించారు. ఫిరాయించడానికి ఇష్టపడని ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రతినిధులతో నేరుగా చంద్రబాబే ఫోన్‌లో మాట్లాడి తనవైపునకు తిప్పుకున్నారు.

ఇతర పార్టీల సభ్యులను ప్రలోభాలకు గురిచేసో, బెదిరించో బలవంతగా ఓట్లు వేయించుకొని చివరకు మెజారిటీ లేని పలు మున్సిపాలిటీలను సైతం టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 మున్సిపాల్టీలకు గాను 90 స్థానాల్లో చైర్మన్ ఎన్నికలు జరగ్గా కడప జిల్లా జమ్మలమడుగు, ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాల్టీల్లో వాయిదా పడ్డాయి. ఎన్నికలు పూర్తయిన వాటిలో 73 స్థానాలు టీడీపీ, ఆ పార్టీ మద్దతుతో ఒకటి సీపీఐ, 15 వైఎస్సార్ కాంగ్రెస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. అధికార పక్షం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ తట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ 15 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ఏడు కార్పొరేషన్లలో అయిదు టీడీపీ కైవసం కాగా రెండింటిని వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకుంది.
 
అధికార పార్టీ అరాచకాలు సాగాయి ఇలా....
వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీకి చెరి 11 స్థానాలు ఉన్నాయి. వైసీపీ కొంత స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ ఆ పార్టీ గెలుస్తుందన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు చివరి నిమిషంలో గందరగోళాన్ని సృష్టించి ఎన్నిక వాయిదా వేయించారు. ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రణరంగంగా మారింది. మార్కాపురంలో వైస్ చైర్మన్ అభ్యర్థిపై వివాదం నెలకొనడంతో టిడిపి సభ్యులు హాజరు కాక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

చీరాల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం.. చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీలోకి ఆమంచి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పోతుల సురేష్‌వర్గం వారితో ఘర్షణకు దిగడంతో ఎస్సై రామిరెడ్డి గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా బొబ్బిలి మున్సిపాల్టీని టీడీపీ దక్కించుకుంది.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లను,స్వతంత్రులను టీడీపీ ప్రలోభాలకు గురిచేసి తమ క్యాంపునకు తరలించింది.  ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా ఇక్కడ టీడీపీకి అధిక స్థానాలు లభించినా చైర్మన్ కేటగిరీ అభ్యర్థి ఎవరూ గెలవలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మాత్రం నలుగురు ఎస్సీ మహిళలు గెలుపొందారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యురాలు కొప్ప న పార్వతిని తమవైపు తిప్పుకొని చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
 
టీడీపీ గెలిచిన మున్సిపాల్టీలు
పలాస, ఆమదాలవలస, పాలకొండ, విజయనగరం, సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి, యలమంచిలి, నర్సీపట్నం, అమలాపురం, తుని, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, పిఠాపురం, ఏలేశ్వరం నగర పంచాయతీ(న.పం), గొల్లప్రోలు (న.పం), ముమ్మిడివరం (న.పం), భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం (న.పం), పెడన, మచిలీపట్నం, నందిగామ, ఉయ్యూరు, తిరువూరు (న.పం), తెనాలి, నరసరావుపేట, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, చీరాల, కనిగిరి (న.పం), చీమకుర్తి (న.పం), అద్దంకి (న.పం), కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట(న.పం), గూడూరు, వెంకటగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, ధర్మవరం, కదిరి, హిందూపురం, పామిడి, గుత్తి, పుట్టపర్తి, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్.
 
వైఎస్సార్‌సీపీ గెలిచిన మున్సిపాల్టీలు
ఇచ్ఛాపురం, జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడు, తాడేపల్లి, గిద్దలూరు (న.పం), పుంగనూరు, పలమనేరు, నగరి, పులివెందుల, ఎర్రగుంట్ల, రాయచోటి, ఆదోని, నందికొట్కూరు, ఆళ్లగడ్డ (న.పం).
 
 సీపీఐ గెలిచిన మున్సిపాల్టీ: గుంటూరు జిల్లా వినుకొండ
 
 కాంగ్రెస్ గెలిచిన మున్సిపాల్టీ: నెల్లూరు జిల్లా ఆత్మకూరు (న.పం) (టీడీపీ మద్దతుతో)

 ప్రకాశం జిల్లా మార్కాపురం, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది
 కర్నూలు జిల్లా ఆత్మకూరు, గూడూరు నగర పంచాయతీలు ఏ పార్టీకి దక్కుతాయో ఇంకా తేలలేదు.

 
 మున్సిపల్ కార్పొరేషన్లు...
 టీడీపీ గెలిచినవి: రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు
 వైఎస్సార్‌సీపీ గెలిచినవి: కడప, నెల్లూరు

లతీష్‌రెడ్డిని పరామర్శించిన జగన్

Written By news on Thursday, July 3, 2014 | 7/03/2014

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా పార్టీ నేత నన్నపనేని సుధ భర్త లతీష్‌రెడ్డిని పరామర్శించారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన లతీష్‌రెడ్డి ఇక్కడి స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

జగన్‌తోపాటు మరో నేత అయోధ్య రామిరెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లి లతీష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

టీడీపీ సాధించిన విజయం చెత్తబుట్టలో ...

టీడీపీ సాధించిన విజయం చెత్తబుట్టలో ...
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆమె అభివర్ణించారు. టీడీపీ  నేతలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని అన్నారు.
 
టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని సాధించిన ఈ విజయాన్ని చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగులో కోరం ఉన్నా ఛైర్మన్ ఎన్నిక రేపటికి ఎందుకు వాయిదా వేశారంటూ ప్రభుత్వాన్ని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రలోభాలకు గురి చేయడం దారుణమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలను బయటకు పంపించండి

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం లేఖ రాసింది. 4,5 తేదీల్లో జరిగే ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా జనరల్ బాడీ సమావేశం అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నికల ప్రక్రియ నుంచి బయటకు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ లేఖలో విజ్ఞప్తి చేసింది. మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో ఇప్పటికే పలుచోట్ల కిడ్నాపులు, ప్రలోభాలు జరిగాయని, ఈ నేపధ్యంలోనే  ప్రజా ప్రతినిధులు అక్కడే ఉంటే ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లేఖలో పేర్కొంది.

ముఖ్యమంత్రి కాదు.. ఆర్‌బీఐ చెప్పాలి

ముఖ్యమంత్రి కాదు.. ఆర్‌బీఐ చెప్పాలి
* రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదు
రుణాలు రీ షెడ్యూల్ చేయమని ప్రభుత్వాలు అడగలేవు
* రుణాలు రీ షెడ్యూల్ చేస్తే 10 శాతం వడ్డీ చెల్లించాలి
* బాండ్లు జారీ చేసే ఆర్థిక స్తోమత ఏపీకి లేదు
* ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా మాఫీ హామీ ఎలా ఇచ్చారో
ప్రభుత్వ నిర్ణయం జాప్యమయ్యేకొద్దీ డిఫాల్టర్లు పెరుగుతారు
*
 ఇప్పటికే ఆంధ్రాబ్యాంకులో ఎన్‌పీఏలుగా మారిన   రూ. 1,000 కోట్ల రైతు రుణాలు
 * ప్రభుత్వ పాలసీ త్వరగా రాకపోతే 11,000 కోట్లు ఎన్‌పీఏలే
 
* రుణమాఫీ అంశంలో తెలంగాణ పరిస్థితి కొంత మెరుగు
  ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా ఇచ్చిన హామీలు బ్యాంకింగ్ రంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ అనుమతి లేనిదే రుణమాఫీ పథకం అమలు చేసే అవకాశం లేదంటున్నారు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్.
ఒకవేళ రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే వ్యవసాయ రుణాలపై లభిస్తున్న సబ్సిడీ వర్తించదంటున్న రాజేంద్రన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రీ-షెడ్యూల్ చేయమని కోరుతోంది కదా? ఇందులో సాధ్యాసాధ్యాలు వివరిస్తారా?
 రుణాలను రీ-షెడ్యూల్ చేయమని బ్యాంకులను అడిగే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేంద్రం కేవలం కరువు మండలాలను మాత్రమే ప్రకటించగలదు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో రుణాలను రీ-షెడ్యూల్ చేయాలంటే ఆర్‌బీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ అనుమతిస్తే చేయడానికి మేం సిద్ధం. ఆర్‌బీఐ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. అంతే తప్ప  రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని రీ-షెడ్యూల్ చేయలేం.

 రీ-షెడ్యూల్ కోసం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అనుమతి కోరమని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్యాంకులకు విజ్ఞప్తిచేశారు కదా?
 ఈ విషయంలో బ్యాంకులు నేరుగా కల్పించుకోలేవు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో జరిగిన మినిట్స్‌ను ప్రాంతీయ ఆర్‌బీఐ కార్యాలయం కేంద్ర కార్యాలయానికి పంపుతుంది. త్వరలోనే ఆర్‌బీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది.

 రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే వ్యవసాయ రుణాలకు లభించే 3 శాతం వడ్డీ ప్రయోజనం కొనసాగుతుందా? అలాగే కొత్త రుణాలను మంజూరు చేస్తారా?
 ఒకవేళ రుణాలు రీ-షెడ్యూల్ చేస్తే ఆ రుణాలపై 7 శాతానికి బదులు 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రీ-షెడ్యూల్‌కు ఆర్‌బీఐ అనుమతిస్తే ప్రస్తుత పంటకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. లేదా రుణాలు చెల్లించిన వారికి కూడా కొత్త రుణాలను మంజూరు చేస్తున్నాం.

 ఇలా పెరిగిన వడ్డీ రేటును  రైతులే భరించాల్సి ఉంటుందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా?
 వాస్తవంగా అయితే ప్రభుత్వం చెల్లించాలి. కానీ దీనిపై స్పష్టత లేదు. అసలు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ప్రకటించే అధికారం లేదు. ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటే అప్పుడు రైతుల తరఫున రుణం చెల్లించే విధంగా హామీ ఇవ్వొచ్చు.  రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించకుండా ఇతర మార్గాలను అవలంబించాల్సి వస్తే మాత్రం ఆర్‌బీఐ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే.

 రుణ వసూళ్ల కోసం రైతుల మీద ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా? చెల్లించని వారిని డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్నారా?
 ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు.  రాజకీయంగా ఒత్తిడి ఉండటం, రైతులు ఆందోళన చేస్తుండటంతో చెల్లించని వారిపై ఎటువంటి రికవరీ చర్యలు తీసుకోలేకపోతున్నాం. తమ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టత తీసుకురావాలి. జూన్ నెలలోనే చాలా మంది రైతుల్ని డిఫాల్టర్లుగా ప్రకటించాం. ఆలస్యం అయ్యేకొద్దీ ఈ జాబితా పెరుగుతుంది. గడచిన త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఎన్‌పీఏలుగా మారాయి. ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఆలస్యం చేస్తే మిగతా రూ.11,000 కోట్ల వ్యవసాయ రుణాలు కూడా ఎన్‌పీఏగా మారే అవకాశం ఉంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం.

 ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌గా రుణ మాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశారా?
 చేయాలనుకుంటున్న రుణమాఫీ మొత్తం, కటాఫ్ తేదీపై (రుణ మాఫీ లేదా రీషెడ్యూల్‌కు అర్హులైన రైతుల గుర్తింపునకు వర్తింపచేసే నిర్ణీత తేదీ) ముందు స్పష్టత తెచ్చుకోమని సూచించాం. అప్పుడు ఎంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్న దానిపై  అవగాహన వస్తుంది. ఈ రుణమాఫీ పథకం పరిధిలోకి వచ్చే రైతులు వారి బకాయిల్ని ముందుగా చెల్లిస్తే కొత్త రుణాలను ఇస్తాం.
అప్పుడు రైతులు బ్యాంకుకు చెల్లించిన సొమ్మును ప్రభుత్వం రైతులకే నేరుగా చెల్లించుకోవచ్చు. రైతు చెల్లించిన రుణానికి సంబంధించి మేము ప్రభుత్వానికి సర్టిఫికెట్ రూపం లో ఇస్తామన్నాం. ఈ సర్టిఫికెట్‌ను పరిశీలించుకొని ప్రభుత్వం రైతులకు ఐదేళ్ల లోపు చెల్లించుకోవచ్చు. అప్పుడు ఇది రైతులకు, ప్రభుత్వానికి మధ్య కుది రిన ఒప్పందమవుతుంది.దీనికి ఆర్‌బీఐ అనుమతులు అవసరం లేదు. కానీ ఇక్క డ ప్రభుత్వం గ్యారంటీగా రైతులకి చెల్లిస్తామన్న హామీ ఉండదు. ఇది పూర్తిగా ప్రభుత్వం, రైతులకు మధ్య ఉన్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది.

 చెల్లించాల్సిన రుణ బకాయిలకు సంబంధించి బ్యాంకులకు రాష్ర్ట ప్రభుత్వం బాండ్లు జారీ చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారంలో ఉంది కదా?

 ఇది కూడా సాధ్యమయ్యేపని కాదు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్  (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట ప్రకారం జీడీపీలో 3 శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడానికి లేదు. ఈ విధంగా చూస్తే రూ.13,000 కోట్లు మించి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడానికి లేదు. అలా అప్పు చేసిన నిధులు ప్రభుత్వం నడవడానికే చాలా అవసరం. కాబట్టి బాండ్లను జారీ చేసే అవకాశం కూడా లేదు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇంత పెద్ద హామీలను ఏ విధంగా ఇచ్చారో తెలియడం లేదు. గతంలో అంత ఆదాయం ఉన్న కేంద్ర ప్రభుత్వమే దేశమంతటా రూ.60,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తే ఒక్క రాష్ట్రం రూ.50,000 కోట్ల రుణాల మాఫీ హామీని ఎలా ఇచ్చారో.., దీన్ని ప్రజలు  ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ హామీ ప్రభావం ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

 రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల మొత్తంపై భిన్నమైన గణాంకాలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో వ్యవసాయ రుణాల విలువ ఎంత ఉంటుంది?
 గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాల విలువ రూ.1.30 లక్షల కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.77 వేల కోట్లపైనే ఉంది. మాకొస్తున్న సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల్లో కలిపి అర్హులుగా గుర్తించే రైతులకు రూ.55,000 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.35,000 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ.20,000 కోట్లుగా ఉన్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాల అంచనా. ఏ పరిమితులు ఆధారంగా ఈ గణాంకాలు తయారు చేశారో తెలియదు. ఈ ప్రకారం చూస్తే ఆంధ్రాబ్యాంక్ సుమారు రూ.11,670 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తెలంగాణ వాటా రూ.4,557 కోట్లు.

 రుణ మాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది?
 బ్యాంకుల నుంచి సమాచారం తీసుకున్నారే  కాని ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కాని ఆంధ్రప్రదేశ్ రాష్టంతో పోలిస్తే రైతులు తీసుకున్న రుణాల విలువ తక్కువగా ఉండటం, మిగులు బడ్జెట్‌ను కలిగి ఉండటంతో తెలంగాణ రాష్ట్రం కొద్దిగా మెరుగైన పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు.

మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం..

రైతు నెత్తిన పిడుగు
బాబు సీఎంగా ప్రమాణం చేసి నెలవుతున్నా మాఫీపై స్పష్టత కరువు
తాకట్టు బంగారం, భూములు వేలం వేస్తామంటూ బ్యాంకుల హెచ్చరికలు
రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్న బ్యాంకు అధికారులు
పాత రుణాలు పూర్తిగా తీరనిదే కొత్తవి ఇచ్చేది లేదని స్పష్టీకరణ
రైతుల్లో తీవ్ర ఆందోళన.. రుణాల మాఫీపై ఆవిరవుతున్న ఆశలు
మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం.. నిపుణుల ఆందోళన


నెట్‌వర్క్: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత మళ్లీ పెనుగండంలో పడ్డాడు. ఒకవైపు వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలు.. మరోవైపు రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల తాఖీదులు.. ఇంకోవైపు మళ్లీ సాగు కోసం కొత్త రుణాలు లభించిని దుస్థితి.. బ్యాంకుల రుణాలు, సాగు కోసం ప్రయివేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. ఇంత చేసినా ఖరీఫ్ ఆరంభమైనా వర్షాల జాడలేని ఆందోళనకరస్థితి.. అన్నీ కలగలిసి రైతన్నను అగాథంలోకి నెట్టివేస్తున్నాయి. తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశానిస్పృహలతో రాష్ట్ర రైతాంగం కుంగిపోతోంది. నలుదిక్కుల నుంచీ సమస్యల దాడితో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సర్కారు ఇప్పటికైనా ఆదుకుంటుందా.. అన్నమాటను నిలబెట్టుకుంటుందా.. అని దైన్యంగా నిరీక్షిస్తోంది!!

ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలుత వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రైతుల రుణాల మాఫీపైనే తొలి సంతకం చేస్తాననీ హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేయగానే ఫైలుపై సంతకం కూడా చేశారు. కానీ.. అది రుణాల మాఫీపై అధ్యయనానికి సంబంధించిన ఫైలు! మాఫీ ఎలా, ఎవరికి, ఎంత చేయాలి వంటి విధివిధానాలను సిఫారసు చేయటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఫైలు! కమిటీ 15 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తుందని, దాన్ని బట్టి రుణ మాఫీపై స్పష్టత ఇస్తామని బాబు ప్రకటించారు. ఆ 15 రోజులూ గడిచాయి. మధ్యంతర నివేదికకే మరో 10 రోజుల గడువు పెంచారు. బాబు సీఎంగా ప్రమాణం చేసి దాదాపుగా నెల కావస్తున్నా రుణ మాఫీ ఊసే లేదు! ఎట్టకేలకు సదరు కోటయ్య కమిటీ తాత్కాలిక నివేదిక ఇచ్చినా.. అందులో విధివిధానాల మాట లేదు!! ఇప్పుడేమో రుణాల మాఫీ మాట పక్కన పెట్టేసి రీషెడ్యూల్ రాగం వినిపిస్తున్నారు! అంటే రుణాల మాఫీ ఇప్పుడుండదు. ఎప్పుడుంటుందో తెలియదు. ఎవరికుంటుందో కూడా తెలియదు! పోనీ రీషెడ్యూల్ అయినా జరుగుతుందా అంటే అదీ అయోమయమే! ఇన్ని వేల కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూల్ చేయటం సాధ్యం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు స్వయంగా స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, కోటయ్య కమిటీ కలిసి విజ్ఞప్తి చేసినా అదే మాటను పునరుద్ఘాటించింది.
 రుణ మాఫీపై స్పష్టత ఇవ్వండని తాజాగా రాష్ట్ర స్థాయి సమావేశంలో బ్యాంకర్లు కోరినా బాబు నుంచి స్పష్టతే రాలేదు. మాఫీకి కట్టుబడ్డామన్నారే తప్ప ఎప్పుడు, ఎలా, ఎంత రుణాన్ని మాఫీ చేస్తామన్నది మాత్రం చెప్పలేదు. పైగా రైతు రుణాలను రీషెడ్యూల్ చేయండంటూ బ్యాంకర్లను కోరారు బాబు! ఆర్‌బీఐ అంగీకరిస్తేనే అది సాధ్యమని, ఆర్‌బీఐని సంప్రదించి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు స్పష్టంచేశారు. మరి రీషెడ్యూలైనా జరుగుతుందా, జరిగితే ఎన్ని మండలాలకు, ఎంతమందికి, ఎంత మొత్తానికి, బంగారం రుణాలకు, టర్మ్ రుణాలు కూడా వర్తిస్తుందా వంటి అనేకానేక ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. కానీ వీటిలో ఒక్కదానిపైనా స్పష్టత లేదు!! ఒకవైపు ఖరీఫ్ సీజన్ మొదలై రోజలు, వారాలు గడిచిపోతున్నాయి. మరోవైపు గత ఏడాది తీసుకున్న వ్యవసాయ రుణాల చెల్లింపు గడువు ముగిసిపోయింది. తీసుకున్న అప్పులు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే తాకట్టు పెట్టిన బంగారాన్ని, భూములను వేలం వేసి తమ రుణాలకు జప్తులు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి.

నోటీసు అందుకున్న 15 రోజుల్లో బ్యాంకు బకాయి చెల్లించకుంటే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని స్పష్టంచేస్తున్నాయి. పలు చోట్ల రైతులు తాకట్టు పెట్టిన నగలు వేలం వేస్తున్నారు కూడా. కొన్ని ప్రాంతాల్లో అయితే రుణ బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తెస్తున్నారు. ‘అసలు రుణమాఫీ అయ్యేది కాదు.. రీషెడ్యూలు చేసినా మీకే భారం పెరుగుతుంది. వడ్డీ పెరుగుతుంది. చక్ర వడ్డీ పడుతుంది. ఇప్పుడు చెల్లిస్తేనే మంచిది. కొత్త రుణాలు వస్తాయి. లేదంటే కొత్త అప్పులూ పుట్టవు’ అని చెప్పేస్తున్నారు. దీంతో.. రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైగా.. బకాయిలు చెల్లించే దాకా కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తేల్చి చెప్తున్నారు. రుణాలు రికవరీ కాకపోవడంతో పంట రుణాల పంపిణీని బ్యాంకులు పూర్తిగా పక్కన పెట్టాయి.

సమస్యల సుడిగుండంలో...

అప్పులు కట్టే మార్గం లేదు.. అప్పులు పుట్టకపోతే మళ్లీ సాగు చేసేదెలాగో తెలీదు! ప్రభుత్వ ఇచ్చిన హామీల మేరకు రుణాలన్నీ మాఫీ అవుతాయని.. మళ్లీ కొంత అప్పుచేసి సాగు చేసుకోవచ్చని గంపెడాశతో ఎదురు చూస్తున్న అన్నదాతలపై పిడుగులు పడ్డట్లే అవుతోంది. ఖరీఫ్ సీజన్‌లో అదును దాటిపోతుండటంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయలకు మూడు రూపాయలు, ఐదు రూపాయలు వడ్డీ చొప్పున అప్పులు చేస్తూ పాత బకాయిలపై వడ్డీలు కడుతున్నారు. వ్యవసాయం చేయకపోతే బతుకే లేని పరిస్థితుల్లో ప్రయివేటు అప్పులతో సాగుకు సమాయత్తమవుతున్నారు. పైగా.. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది.

ఇక అప్పులు చేసి సాగు చేసినా పంటల పరిస్థితి ఏమిటన్న భయాందోళనలు రైతులను పీడిస్తున్నాయి. బ్యాంకుల అప్పులు మాఫీ కాక, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు రాక.. పాత బాకీలు తీర్చటానికి, మళ్లీ సాగుచేయటానికి భారీ వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేస్తూ... ఇలా ఎటు చూసినా రైతన్న మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. వెరసి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు పిల్లిమొగ్గలు, బ్యాంకుల నోటీసులు, కొత్త అప్పుల బాధలతో చాలామంది రైతుల నోట ఆత్మహత్యల మాటలు వినిపిస్తుండటం పెను ప్రమాద ఘంటికలను మోగిస్తోందని.. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకుని అన్నదాతను ఆదుకోకపోతే పది పదిహేనేళ్ల కిందటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు.

బ్యాంకర్లు, అధికారులు ముందే వివరాలిచ్చినా...

నిజానికి కోటయ్య కమిటీ ఏర్పాటుకు ముందే, అంటే బాబు సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో రైతులకు ఎంత మేరకు రుణాలు ఇచ్చామన్న విషయాన్ని బ్యాంకర్లు, అధికారులు ఆయనకు నివేదికలు అందించారు. పంట రుణాలెన్ని, బంగారం కుదవపెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలెన్ని వంటి వివరాలన్నింటినీ కేటగిరీలవారీగా అందజేశారు. అయినా బాబు మాత్రం వాటి సంగతిని పక్కన పెట్టి కోటయ్య కమిటీ వేశారు. అదేమో తన పని ప్రారంభిస్తూనే రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యను, తద్వారా రుణాల మొత్తాన్ని కుదించడంపైనే దృష్టి సారించింది!

జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే

జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే
ఒంగోలు సెంట్రల్ : జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానంతోపాటు గిద్దలూరు, చీరాల మున్సిపాలిటీలను వైఎస్‌ఆర్ సీపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ప్రకాశం జిల్లా ఎన్నికల పరిశీలకుడు, గుంటూరు అర్బన్ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా జిల్లా నాయకులతో చర్చించడానికి అప్పిరెడ్డి బుధవారం ఒంగోలు వచ్చారు. పార్టీ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి జిల్లాలో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లతో మాట్లాడారన్నారు.

వారందరూ వైఎస్‌ఆర్‌పై అభిమానం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో కొనసాగుతున్నారన్నారు. టీడీపీ నాయకులు గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ నీచానికి ఒడిగుడుతున్నారని చెప్పారు. రేషన్ డీలర్లు, వ్యాపారాలు, నగదు ఇస్తామని అభ్యర్థులకు ఎరవేస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్ సీపీకి విప్ అధికారం ఉందని, దాన్ని ధిక్కరించిన వారిపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. 30కి పైగా ఎంపీపీలను పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతు రుణ మాఫీ ఊసే లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలివిగా రూణమాఫీని కేంద్రానికి రుద్దాలని చూశారని, తమకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని చెప్పారు. అధికారాన్ని, పొలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.  ఉద్యమాలు, పోరాటాలతో పుట్టిన వైఎస్‌ఆర్ సీపీ ఇవేమీ చేయలేవన్నారు. గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు, ైవె ఎస్‌ఆర్ సీపీ నాయకుడు వైజా భాస్కర్‌రెడ్డిని ఎస్సై వై శ్రీనివాసరావు తన్నడంతోనే మృతి చెందాడన్నారు. ఈ సంఘటనపై జ్యూడిషియల్ విచారణ నిర్వహించాలని కోరారు. అమాయకుడైన భాస్కర్‌రెడ్డి ప్రాణాలు పోవడానికి కారకుడైన ఎస్సైను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, బుర్రా మధు సూదన్, శింగరాజు వెంకట్రావు, నాగిరెడ్డి, శంకర్, ఎ. ఆంజనేయులు, కె.వి. రమణా రెడ్డి, కె.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్‌ఆర్ సీపీ విప్‌ల జారీ
 ఒంగోలు అర్బన్ : స్థానిక ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో వైఎస్‌ఆర్ సీపీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లకు విప్ ఇవ్వాలని ఆ పార్టీ ఎన్నికల పరిశీలకుడు అప్పిరెడ్డి జిల్లా నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించారు. జిల్లాకు సంబంధించి విప్‌లు జారీ చేసే అధికారం పార్టీ మాజీ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డికి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించారని చెప్పారు. ఆయన ఆదేశానుసారం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు విప్‌లు అందచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ వై. నాగిరెడ్డి, దూళిపూడి ప్రసాద్ పాల్గొన్నారు.

ఎస్సై ప్రవర్తన ప్రజాస్వామ్యానికే మచ్చ
గిద్దలూరు రూరల్ : గిద్దలూరు ఎస్సై వై.శ్రీనివాసరావు ప్రవర్తన ప్రజాస్వామ్యానికే తీరని మచ్చ అని వైఎస్‌ఆర్ సీపీ నగర పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకుడు అప్పిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గృహానికి బుధవారం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయం చేయాలని కోరినందుకు ఎస్సై దురుసుగా ప్రవర్తించడమే కాక నెట్టడంతో మరణించిన వైజా భాస్కర్‌రెడ్డి లోటు పార్టీకి పూడ్చలేనిదన్నారు. ఆయన మృతికి కారకుడైన ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు.

భాస్కరరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తొలుత మృతుడు భాస్కర్‌రెడ్డి గృహానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆంజనేయులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కేవీ ప్రసాద్, యువజన విభాగం అధ్యక్షుడు నూనె ఉమామహేశ్వరరెడ్డి, నాయకులు యేలం వెంకటేశ్వరరావు, కే రమణారెడ్డి, పీ వెంకటరాజుయాదవ్, నారు అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల కిడ్నాప్

Written By news on Wednesday, July 2, 2014 | 7/02/2014


* గుంటూరులో ముగ్గురిని అపహరించుకుపోయిన టీడీపీ నేతలు
* మండలాధ్యక్ష పదవి కోసమే కిడ్నాపులు
* ఎంపీటీసీ భర్తను సైతం కిడ్నాప్ చేసిన తెలుగు తమ్ముళ్లు!
* ఏపీ అదనపు డీజీపీకి ఎంపీటీసీ మామ ఫిర్యాదు
* స్పీకర్ కోడెలపై వైసీపీ నేత అంబటి నిప్పులు
 
సాక్షి, హైదరాబాద్/రాజుపాలెం/చిలకలూరిపేట: గుంటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీల కిడ్నాప్ పర్వం తీవ్ర కలకలం సృష్టించింది. మండలాధ్యక్ష పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు ఆయా ఎంపీటీసీలను అపహరించుకు పోయినట్టు స్థానికులు వెల్లడించారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని నెమలిపురి-2 వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ వేముల అంజలీదేవిని ఆమె భర్త, కుమారుడు సహా టీడీపీ నేతలు పోలీసుల సాయంతో అపహరించడం మరింత కలకలం సృష్టించింది. అదేవిధంగా ఇదే జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి-2 ఎంపీటీసీ జమ్మలమడక కృష్ణ, చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడుగుంటుపల్లి శ్రీనివాసరావును కూడా టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఆయా ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాష్ట్ర అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసింది. వివరాలు..

* గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని నెమలిపురి-2 ఎంపీటీసీగా వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందిన వేముల అంజలీదేవిని ఆమె కుటుంబం సహా టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసినట్టు జెడ్పీటీసీగా ఎన్నికైన మర్రి వెంకట్రామిరెడ్డి మంగళవారం ఫోన్‌లో తెలిపారు.
 
 రాజుపాలెం మండలంలో 13 ఎంపీటీసీలకు వైఎస్సార్ సీపీ 8 స్థానాలు, టీడీపీ 5 స్థానాలు గెలుపొందాయి. ఈ క్రమంలో మండలాధ్యక్ష పదవిని ఎలాగైనా దక్కించుకోవాలన్న దురాశతో టీడీపీ నాయకులు కుట్రలు పన్ని అంజలీదేవిని కిడ్నాప్ చేసినట్టు మర్రి తెలిపారు. భర్త రమేష్, కుమారుడితో సహా అంజలీదేవి విశాఖపట్నం సమీపంలోని చోడవరం వద్ద ఉండగా కొందరు టీడీపీ నాయకులు పోలీసుల సహకారంతో బలవంతంగా తీసుకెళ్లినట్టు చెప్పారు.
 
 మరోఘటనలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి-2 వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ జమ్మలమడక కృష్ణను మంగళవారం రాత్రి టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. మాట్లాడాలని పిలిచి బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించారని గ్రామస్తులు తెలిపారు. ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపించారు.

 ఇదే జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడుగుంటుపల్లి శ్రీనివాసరావును కూడా టీడీపీ నేతలు మంగళవారం రాత్రి 7గంటలకు కిడ్నాప్ చేశారు. మొత్తం 15 ఎంపీటీసీలకు వైఎస్సార్ సీపీ 8 స్థానాల్లో, టీడీపీ 6 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందాయి. చిలకలూరి పేట ఎంపీపీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ నేతలు కట్టుబడివారిపాలేనికి బైక్‌పై వెళుతున్న శ్రీనివాసరావును అపహరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. దీనిపై  వైఎస్సార్ సీపీ నేతలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఏపీ అదనపు డీజీపీకి ఫిర్యాదు..
ఎంపీటీసీ వేముల అంజలీదేవి కిడ్నాప్‌పై ఆమె మామ వేముల ఏడుకొండలు మంగళవారం హైదరాబాద్‌లో ఏపీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, మాజీ ఎంపీపీ మర్రి సుందరరామిరెడ్డి, రాజుపాలెం ఎంపీటీసీ పులిబండ్ల వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) ఆర్పీ ఠాకూర్ కార్యాలయానికి వెళ్లిన ఏడుకొండలు ఈ మేరకు ఫిర్యాదు సమర్పించారు.
 
* చోడవరంలోని సురక్షిత ప్రాంతంలో ఉన్న అంజలీదేవి కుటుంబాన్ని టీడీపీ వర్గీయులు బలవంతంగా తీసుకువెళ్లారని, దీనికి శాసనసభ స్పీకర్‌గా ఉన్న ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజుపాలెం ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు తన కోడలిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారని, ఒత్తిడి తట్టుకోలేక ఆమె తన కుటుంబంతో సహా చోడవరంలో తలదాచుకోగా.. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు బలవంతంగా తీసుకెళ్లారని వివరించారు. చోడవరం పోలీసులను ఆశ్రయించినా స్పందించలేదని, తక్షణమే అంజలీదేవి కుటుంబాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎన్నికల కమిషనర్‌కు కూడా వినతిపత్రం అందించారు.
 
స్పీకర్ కోడెల నియోజకవర్గంలోనే కిడ్నాపులా?: అంబటి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నికైన సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రజా ప్రతినిధులను అపహరించారని అంబటి విమర్శించారు. ఎంపీటీసీల అపహరణపై రాష్ట్ర అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రాజుపాలెం మండలంలో వైఎస్సార్ సీపీ 8, టీడీపీ 5 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా మండల పరిషత్ అధ్యక్ష పదవిని టీడీపీ కైవసం చేసుకునేందుకు ఒక మహిళా ఎంపీటీసీని పోలీసుల సహకారంతో అపహరించుకు పోయారని ధ్వజమెత్తారు.

నెమలిపురి-2 స్థానం నుంచి ఎన్నికైన వేముల అంజలీదేవి అనే ఎంపీటీసీని, ఆమె భర్త, కుమారుడిని గత నెల 21న అర్థరాత్రి పోలీసుల సహకారంతో అపహరించుకు పోయారన్న విషయంలో అంజలీదేవి మామ వేముల ఏడుకొండలుతో కలిసి తాము రాష్ట్ర అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన కోడలు, కుమారుడు అపహరణకు గురయ్యారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోక పోవడంతో డీజీపీ దృష్టికి తెచ్చామన్నారు. ఏడుకొండలు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్ ప్రమేయంతో ఇలా జరుగడం దారుణమని అంబటి దుయ్యబట్టారు.

వాస్తవానికి కోడెల నేరచరిత్ర గలవాడని, ఆయనపై అనేక కేసులున్నాయన్నారు. స్పీకర్ అయ్యాక మారతారని భావించామని అయితే పాత వాసనలేవీ పోలేదని అక్కడ జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థమవుతోందని అన్నారు. తన సొంత నియోజకవర్గంలోనే వైఎస్సార్ సీపీకి మెజారిటీ ఉన్న మండలాన్ని వారికి దక్కకుండా కిడ్నాపులను ప్రోత్సహిస్తున్న స్పీకర్ కోడెల ఈ ఐదేళ్లూ ఇక అసెంబ్లీని ఎలా నిర్వహిస్తారనే విషయం ఇట్టే అర్థం అవుతోందన్నారు. కోడెల ఇంట్లో బాంబులు పేలాయని సీబీఐ నిర్ధారించినా అప్పట్లో ఆయన రాజకీయ పలుకుబడితో కేసు నుంచి బయట పడ్డారని విమర్శించారు.

వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే హక్కుంది.. అది చెల్లుతుంది.

వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే  హక్కుంది.. అది చెల్లుతుంది.
పార్టీ నేతలకు వెల్లడించిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్
సోమిరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ సీపీ వినతి
తీవ్రంగా ధ్వజమెత్తిన అంబటి రాంబాబు


హైదరాబాద్: ‘‘ఈ నెల 3, 4, 5 తేదీల్లో స్థానిక సంస్థల పదవులకు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే హక్కు, అధికారం ఉన్నాయి. ఆ పార్టీ జారీ చేసే విప్ చెల్లుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తమకు స్పష్టంగా చెప్పారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే నాటికి వైఎస్సార్సీపీకి గుర్తింపు లేదు కనుక విప్ జారీ చేసే అధికారం ఆ పార్టీకి లేదని, ఒకవేళ జారీ చేసినా అది చెల్లదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటన చేయడంపై ఎన్నికల కమిషన్ కార్యదర్శికి ఫిర్యాదు చేశామని తెలిపారు. సోమిరెడ్డి తప్పుడు ప్రకటనను మిట్టల్ దృష్టికి తేగా ఆయన పైవిధంగా వివరణ ఇచ్చారని రాంబాబు చెప్పారు. అంబటి రాంబాబుతో పాటు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ మంగళవారం ఎన్నికల కమిషన్‌ను కలిశారు.

ఆ తర్వాత రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీని, ప్రజలను గందరగోళ పరిచేందుకే సీఎం చంద్రబాబు..  సోమిరెడ్డితో నాటకం ఆడిస్తున్నారని ధ్వజమెత్తారు.
 సోమిరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..: స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రలోభపెడుతూ వారిని పార్టీలు మారినా తప్పులేదని ప్రోత్సహించేలా ప్రకటన జారీ చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.  

త్వరలో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు

Written By news on Tuesday, July 1, 2014 | 7/01/2014

'త్వరలో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు'
ఉచిత హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం హెచ్చరించారు. 
 
ఎన్నికల నియమ, నిబంధనల్ని ఉల్లంఘించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే ఆలోచనలో  టీడీపీ ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏపార్టీ వ్యవహరించని తీరుగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని సీతారాం అన్నారు. మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో గెలిచేందుకు వ్యూహ రచన చేస్తున్నామని సీతారాం తెలిపారు. 

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక కూడా దిగజారుడు రాజకీయం సమంజసమేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  చంద్రబాబూ.. నీకు ఎందుకంత అధికారదాహం అని నిలదీశారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే దురుద్దేశంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బలవంతంగా ఎత్తుకెళ్లారని అంబటి మీడియాకు తెలిపారు. 
 
ఎంపీటీసీలను ఎత్తుకుపోయిన విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీచేసే అధికారం ఉందని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసిన విషయాన్ని అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. 

వైఎస్ఆర్ సిపి ఎంపిటిసి కుటుంబం కిడ్నాప్

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం నెమలపురి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ వేముల అంజలిదేవి కుటుంబాన్ని  టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ఏపీ అడిషనల్‌ డీజీపీ ఠాకూర్‌ ను కలిశారు. వేముల అంజలీదేవి కుటుంబాన్ని కిడ్నాపర్ల నుంచి విడిపించాలని వారు  ఠాకూర్‌ కు వినతి పత్రం అందజేశారు.

అధికారం కోసం కొందరు నేతలు కిడ్నాప్ లకు తెగబడుతున్నారు. బలం లేకపోయినా దౌర్జన్యంగానైనా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ పదవుల కోసం కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు.  ఎంపీటీసీల బంధువులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డిని కలిసి టిడిపి నేతలపై   ఫిర్యాదు కూడా చేశారు. టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు.

భాస్కర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

భాస్కర్ రెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎస్ఐ శ్రీనివాసరావు అమానుష ప్రవర్తన కారణంగా మరణించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  వైజా విజయ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించిన ఆయన భాస్కరరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. స్థానిక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో మాట్లాడిన జగన్‌ బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేయాలని అవసరమైతే మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని ఆయన సూచించారు.

బాబు... మోసం, దగా చేయబోతున్నారు

'బాబు... మోసం, దగా చేయబోతున్నారు'
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో రైతులకు ఇచ్చిన హమీ ప్రకారం తక్షణమే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం రైతులను మోసం, దగా చేయబోతున్నారని ఆరోపించారు.
 
మంగళవారం హైదరాబాద్ లో రైతుల రుణమాఫీపై చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరీపై అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రుణమాఫీ అంటే అర్థం రీషెడ్యూల్ చేయడమా అంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా రీషెడ్యూల్ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై ఇంతకన్నా దౌర్బాగ్యం మరొకటి లేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి... రక్తచరిత్ర కాదు

'రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి... రక్తచరిత్ర కాదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సోమాలియాగా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భాస్కరరెడ్డి మరణం పోలీసులతో టీడీపీ నేతలు చేయించిన రాజకీయ హత్య అని ఆమె అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి కానీ... రక్త చరిత్ర కాదని చంద్ర బాబు కు ఈ సందర్బంగా పద్మ హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ హత్య రాజకీయాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారని పద్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. హత్యా రాజకీయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది

వైఎస్సార్‌సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది
మైసూరా, అంబటి స్పష్టీకరణ

 హైదరాబాద్ :  జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూ టికి నూరు శాతం చెల్లుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఎంవీ మైసూరారెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల మాటలు, చేస్తున్న ప్రచారం అభూత కల్పనలని వారు పేర్కొన్నారు. విప్ ఉల్లంఘించే సభ్యులపై వేటు తప్పదని హెచ్చరించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అనైతికంగా తన వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతోందని మైసూరా, అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన (27.06.2014) నోటిఫికేషన్‌లో సైతం వైఎస్సార్ సీపీని రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొన్నందున.. విప్ చెల్లుతుందని వారు తెలిపారు.

జగన్ అడుగు జాడల్లో నడుస్తా

జగన్ అడుగు జాడల్లో నడుస్తా
చినగంజాం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అతి చిన్న వయసులో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదరించిన జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎప్పటికీ వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని వివరించారు. తాను అమెరికా వెళ్తున్నట్లు ఎవరో కొందరు ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారని, కార్యకర్తలు ఎవరూ ఆ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

గతంలో సమైక్యాంధ్ర కోసం తాను నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు తనను ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మండలాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలా పని చేస్తానని భరత్ వివరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కోట విజయభాస్కర్‌రెడ్డి, ఇటీవల పార్టీ తరఫున గెలుపొందిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, సుమారు 300 మందిపైగా కార్యకర్తలు పాల్గొన్నారు.

వేధిస్తే ఊరుకోం

వేధిస్తే ఊరుకోం
 జమ్మలమడుగు: అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని తమ కార్యకర్తలతో పాటు ఇతరులకు అన్యాయం చేస్తే ఊరుకోమని వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. అవసరమైతే అసెంబ్లీవరకు ఉద్యమిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సి. ఆదినారాయణరెడ్డి,రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, జయరాములు, కొరముట్ల శ్రీనివాసులు,ఆంజాద్‌బాష, ఎమ్మెల్సీదేవగుడినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి ఆమరనాథరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ సురేష్‌బాబు సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

రేషన్‌షాపులను నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తొలగిస్తుండడం అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకమునుపే టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయమన్నారు. చిన్న చిన్న ఉద్యోగుల కడుపులు కొట్టే కార్యక్రమం మంచిది కాదన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజలను నమ్మించి మోసగించడం టీడీపీకి మాత్రమే చెల్లిందన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇందుకు అధికారులు కూడా సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని శాశ్వతంగా ఉండేది ఉద్యోగులేనని.. అటువంటి వారు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోమన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ధర్నాలో డీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు తిరుపాల్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్‌లు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ముక్తియార్. మాజీ జెడ్పీటీసీ శివనాథరెడ్డి, శివనారాయణరెడ్డి, జానకీరామిరెడ్డి, అంకిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు హనుమంతరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడు కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి

బాబు పాలనలో వర్షాలు రావు
పెదగంట్యాడ(విశాఖపట్నం): ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వర్షాలు కురవడం లేదని, గతంలోనూ ఆయన పాలనలో ఇదే దుస్థితి ఏర్పడిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునే ఐదుగురు చనిపోయారని, ప్రతీరోజు ఎంతోమంది చనిపోతున్నారని వ్యాఖ్యానించారు.

గాజువాకలోని శ్రీ షిర్డీసాయిబాబా ఆలయంలో భక్తులనుద్దేశించి ప్రసంగించినప్పుడుపై వ్యాఖ్యలు చేశారు. సూర్యాస్తమయం తరువాత ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయాలకు మంచిది కాదన్నారు. గతంలో ఇలా ప్రమాణ స్వీకారం చేసిన వారు దుష్ఫలితాలు పొందారని గుర్తు చేశారు.
 
 బాబుకు అధికారం.. ప్రజలకు కరువుకాలం: రాఘవులు
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువుకాలం కూడా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గతంలో ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఇప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో అదే పరిస్థితి నెలకొందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.

Popular Posts

Topics :