13 July 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు

Written By news on Saturday, July 19, 2014 | 7/19/2014


'ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబు'వీడియోకి క్లిక్ చేయండి

హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లర్లతో కలిసి ఏపి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు దిగిన ఫొటోలను వైఎస్ఆర్ సిపి  ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఈరోజు మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఎర్రచందనం అక్రమరవాణాపై సీబీఐ విచారణ జరిపంచాలని సవాల్ విసిరారు. సీబీఐ విచారణ మీ చేతులో పనే కదా, నిష్పాక్షికంగా విచారణ జరిపితే మీ నాయకుల బాగోతమంతా బట్టబయలవుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోనే ఏపీని బందిపోట్ల రాజ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. దుష్టరాజకీయాలు చేయడంలో చంద్రబాబు మహానటుడన్నారు. నీ తప్పులను ప్రశ్నిస్తే తమపై ఎదురుదాడా? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడికి పశువుల దొడ్డిలాంటి చోట గదిని కేటాయిస్తారా? అని అడిగారు.

 సచివాలయంలో హుండీ పెట్టిమరీ అడుక్కుంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.  ఎర్రచందనం అమ్మితే, హుండీలు పెట్టి అడుక్కుంటే ప్రజల కష్టాలు తీరుతాయా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కన్నీళ్లు తుడుస్తూ...

కన్నీళ్లు తుడుస్తూ...
అసలే వలస బతుకులు...కూలీనాలీ చేసుకుంటూ ఎలాగోలా జీవనాన్ని నెట్టుకొస్తున్న వారిపై మృత్యువు పంజా విసిరింది. ఇంటి పెద్ద దిక్కులను కబళించింది. తీరని శోకం మిగిల్చింది. చెన్నైలో ఇటీవల సంభవించిన రెండు ప్రమాదాల్లో తమవారిని కోల్పోరుు పుట్టెడు దుఃఖంలో ఉన్న పలు కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రెండో రోజు శుక్రవారం పరామర్శించారు. వారి ఆవేదనను ఆలకించారు. కన్నీళ్లు తుడిచారు. ప్రమాద కారణాలు తెలుసుకుని ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. నష్టపరిహాం అందజేసేందుకు పార్టీ తరఫున చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.             -నరసన్నపేటరూరల్/సారవకోట రూరల్/టెక్కలి/కోటబొమ్మాళి/భామిని
 
సత్రాం గ్రామంలో రాము తల్లిదండ్రులను ఓదారుస్తూ...
జగన్: మీకు అందివచ్చిన కొడుకు మరణించడం నన్ను కలచివేసిందమ్మా...
సరోజిని, సిమ్మయ్య(మృతుని తల్లిదండ్రులు): అవును బాబూ.. మాకు ముగ్గురు కుమారులు. పెద్దవాడు రాము సంపాదన మీదే ఆధారపడి బతుకుతున్నాం.

జగన్: చెన్నై ఎప్పుడు వెళ్లారు?
సిమ్మయ్య: మూడు మాసాల కిందట పెద్దోడు రాము, చిన్నోడు భాస్కరరావుతో కలిసి నేను కూడా వెళ్లాను. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో చిన్నోడు, నేను వచ్చేసినాం. పెద్దోడు అక్కడే ఉండిపోరుు గోడ కూలిన ఘటనలో చనిపోయూడు. సరోజిని కలుగుజేసుకుని ఇదే ప్రమాదంలో నా తమ్ముళ్లు, వారి పిల్లలు చనిపోయూరయ్యూ అంటూ భోరున విలపించింది.

జగన్: వారిది కూడా ఇదే ఊరా?
సరోజిని: లేదయ్యా... వారిది చుట్టిగుండం

జగన్: ప్రభుత్వం నుంచి సాయం అందిందా?
మృతిని తండ్రి: మన ప్రభుత్వం నుంచి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు.

జగన్: మన ఎమ్మెల్యేలను తమిళనాడు పంపించి మంచి లాయర్లను ఏర్పాటు చేసి మీ బాధ వినిపించేలా చేస్తాను. అక్కడే ఉన్న రాము తమ్ముళ్లు చిన్నారావు, భాస్కరరావుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు.  

జగన్: మీరిద్దరూ ఏమి చేస్తున్నారు? (మృతిని తమ్ముళ్లను )
చిన్నారావు: 
నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నాను, తమ్ముడు భాస్కరరావు భవన నిర్మాణ కార్మికుడు.

జగన్: నీవు చదువు కోలేదా?
భాస్కరరావు: 
చదువు మానేశాను.

జగన్: చదువుకుని ఉంటే బాగుండేది కదా... ఇప్పుడు అక్కడకెళ్లి కూలి పని చేస్తావు. తరువాత మేస్త్రీ అవుతావు అంతే కదా... చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది కదా. ఇద్దరు పిల్లల్ని చదివించండి. వారికి మంచి భవిష్యత్ ఇవ్వండి. మన దాసన్న రెండు రోజులలో వస్తారు.. మీకు ఆర్థికంగా సహాయం అందిస్తారు.
 
బాలసీమలో దువ్వారపు పద్మ కుటుంబ సభ్యులతో...
జగన్: భవనం కూలిపోరుు పద్మ చనిపోవడం చాలా బాధగా ఉందయ్యూ...
అప్పన్న(పద్మ భర్త): కళ్లముందే నా భార్య చనిపోయింది సార్. నేను కూడా ఈ ప్రమాదంలో చిక్కుకోవల్సింది. నాకు పని లేదని మేస్త్రి చెప్పడంతో పక్క బిల్డింగ్‌లో పనికి వెళ్లాను. మరో అరగంటలో పని నుంచి బయటకు వస్తారనగా బిల్డింగ్ కూలింది. అడుగున ఉన్న అంతస్తులో నా భార్య చిక్కుకుంది.

జగన్: ఎంతమంది పనికి వెళ్లారు. రోజుకు  కూలి ఎంత వస్తుంది?
అప్పన్న: నేను, నా భార్య, అన్నలు ఇద్దరు, అన్న భార్యలు కలిసి పనికెళ్లాం. ఎలచ్చన్లకు వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లాం. రోజుకు మేస్త్రీకి రూ. 500, ఆడమనిషికి రూ.250 ఇస్తారు.

జగన్:  ప్రభుత్వం సాయం చేసిందా..
అప్పన్న: 
రెండు దఫాలు పిలిచి  రూ.ఏడు లక్షలు ఇచ్చారు.

జగన్: బిల్డర్ నుంచి ఆర్థిక సహాయం అందిందా?
అప్పన్న:  
లేదు సార్. బిల్డింగ్ కూలిన వెంటనే వాళ్లను పోలీసులు పట్టుకు పోయారు. మాకు పైసా కూడా ఆయన నుంచి రాలేదు. మీరే ఏదో ఒకటి చేయాలి.

జగన్: వైఎస్సార్ సీపీ తరఫున మా ప్రయత్నం మేము చేస్తాం. దాసన్నతో పాటు మన పార్టీ ఎమ్మెల్యేలను కొందరిని తమిళనాడు పంపుతాం. అక్కడి ప్రభుత్వంతో వారు మాట్లాడతారు. అనంతరం మంచి లాయరును పెట్టి కేసు వేద్దాం.

జగన్: ఎంతమంది పిల్లలు? చదువుతున్నారా?
అప్పన్న: ఇద్దరు పిల్లలు సార్. పాప లక్ష్మి పెద్దది. శ్యామలరావు కుమారుడు. వీరి కోసమే నాభార్య ఎక్కువగా కష్టపడేది. లక్ష్మి ఇంటర్ చదువుతుంది. శ్యామలరావు టెన్త్‌కు వచ్చాడు. మా పిల్లలను మీరే ఆదుకోవాలి సార్.

జగన్: పిల్లలను బాగా చదివించు. పాపను నర్సింగ్‌లో చేర్పించు. తన కాళ్ల మీద తను నిలబడుతుంది. పిల్లలిద్దరినీ బాగా చదువుకోవాలంటూ ఆశీర్వదించారు.
 
కొరమలో దాసరిరాము, దాసరి కుమారి కుటుంబ సభ్యులతో...
జగన్: అమ్మా... దంపతులిద్దరూ మరణించడం దారుణం. పిల్లలు అనాథలయ్యూరు. దేవుడు మీ కుటుంబానికి అన్యాయం చేశాడు...
అప్పలనర్సమ్మ, ప్రకాశ్(మృతుని తల్లి, సోదరుడు):అవును బాబూ... దేవుడు మా కుటుంబానికి కష్టాలు తెచ్చాడు.

జగన్: ప్రమాదానికి కారణమైన బిల్డర్ నుంచి పరిహారం వచ్చిందా?
ప్రకాశ్: రాలేదు

జగన్: పరిహారం కోసం మీ తరఫున కేసు వేద్దాం. నాణ్యత లేని భవనాలు నిర్మించిన బిల్డర్‌ను బాధ్యుడిని చేద్దాం?
ప్రకాశ్
అలాగేనండి... పరిహారం వచ్చేలా చూడండి సార్.

జగన్:  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎంపీలతో ఒక కమిటీ వేశాం. వీరు చెన్నైవెళ్లి మీ తరఫున పోరాటం చేస్తారు. మీలో ఎవరో ఒకరు వారితో వెళ్లండి చాలు.
అప్పలనర్సమ్మ: అలాగే బాబూ. మీరు చెప్పినట్లు వింటాం.
జగన్: మృతుల పిల్లలు మణికంఠ, సంధ్యలను దగ్గరకు తీసుకుని... బాగా చదువుకోండి అంటూ దీవించారు.
అప్పలనర్సమ్మ: దిక్కులేని పిల్లలకు చదవు లెలాసాగుతాయి నాయినా?

జగన్: పిల్లల బాధ్యత తీసుకుంటాం. మా ఎమ్మెల్యే విశ్వాసరారుు కళావతి పిల్లలిద్దరినీ పాఠశాలలో చేర్పించి చదువుకు సాయం చేస్తారు.
అప్పలనర్సమ్మ: ఆదుకోండి బాబూ. మీరే దిక్కు...

జగన్: తప్పకుండా... పార్టీ తరఫున ఎమ్మెల్యే ద్వారా సాయం చేస్తాం.

జగన్: గ్రామం నుంచి ఎంతమంది వలసలు వెళ్లారు?
ప్రకాశ్: 
కొరమ నుంచి సుమారు 50 మంది వరకు చెన్నైలో పనిచేస్తున్నారు.

జగన్: జాబ్ కార్డులందరికీ ఉన్నాయా?
ప్రకాశ్: లేవు సార్,  ఉపాధి పనులు కూడా లేవు.

జగన్: ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా?
ప్రకాశ్:
 అందింది. రెండు విడతులుగా ఇచ్చారు.
 
చుట్టిగుండంలో మృతుల కుటుంబ సభ్యులతో...
జగన్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడం బాధగా ఉందమ్మా...
మృతులు సిమ్మయ్య, అప్పయ్యల చెల్లెలు చిన్నమ్మడు:అవును బాబూ... ఇప్పటికీ తెరుకోలేకపోతున్నాం.. ఆ దేవుడు మా కుటుంబానికి అన్యాయం చేశాడు. నేను చెన్నైలో గోడకూలి చనిపోయిన సిమ్మయ్యకు అక్కనవుతాను... అప్పయ్యకు చెల్లెలనవుతాను... వీరితో పాటు మా ఇద్దరు వదినలు ఉమా, లక్ష్మీలు, చిన్న మేనల్లుడు జగదీష్ కూడా చనిపోయారు.

జగన్: అసలు ప్రమాదం ఎలా జరిగింది...?
మృతుడు అప్పయ్య కుమారుడు ప్రసాద్: మా అమ్మా నాన్న, మా పెద్దనాన్న పెద్దమ్మలు.. పని చేస్తున్న దగ్గర్లో ఉన్న ప్రహరీ ఆనుకుని పాకలు వేశారు. ఆ రాత్రి గోడకు వెనుక నుంచి వాహనం ఢీ కొనడంతో గోడ కూలిపోయి ఉండవచ్చని అక్క డే పనిచేస్తున్న కొంత మంది తెలిసిన వారు  చెబుతున్నారు. కానీ మాకు స్పష్టంగా తెలియడం లేదు.

జగన్: ఒకే కుటుంబం నుంచి ఇంత మంది ఎందుకు వెళ్లారు?
చిన్నమ్మడు: మా ఊళ్లో పూర్తిగా పనులు లేవు... ఉపాధి పనుల వలన కూడా పూట గడవని పరిస్థితి. పొట్టగడవడాని కోసం మా వాళ్లంతా కలిసి చెన్నై వెళ్లారు.

జగన్: గోడ కూలిన ఘటనలో ఆ కంపెనీపై కేసులేమైనా పెడ్తున్నారా... మా సాయం కావాలా?
మృతుని బావ యర్రయ్య: చెన్నైలో అధికారులు కొంత మంది మా వాళ్ల దగ్గరకు వచ్చి సంతకాలు తీసుకున్నారటన్నా... వాళ్లు మాకు విషయం చెప్పారు. ముందు మాకు సంబంధం లేదని కంపెనీ వాళ్లు బుకాయించారు.  

జగన్: చెన్నై నుంచి పరిహారం అందిందా?
చిన్నమ్మడు: పరిహారం బాండ్లు తయారయ్యాయని అధికారులు చెప్పారు... చిన్న పిల్లలు కావడంతో వారికి ఇవ్వలేదు... మరో రెండు రోజుల పోతే ఆంధ్రాబ్యాంక్‌లోని ఖాతాకు జమచేస్తామని చెప్పారు. తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా మరో రెండు రోజుల్లో వస్తాయన్నారు.

జగన్: మీ ఊళ్లో ఎంత మంది చెన్నై వెళ్లారు... ఊళ్లో ఉపాధి పనులు లేవా?
మృతుల బావ ముసలయ్య: మా ఊరు నుంచి ఇంటికి ఒకరు చొప్పున చెన్నైలో ఉన్నారు. ఇక్కడ పనుల్లేవు బాబూ... అందుకే చెన్నై వెళ్లిపోయారు. చనిపోయిన వాళ్లంతా మొన్ననే ఊరోచ్చివెళ్లారు... ఊళ్లో పనులు ఉంటే వారు వెళ్లేవారు కాదు.

జగన్: పిల్లలు చదువుతున్నారా... ఎక్కడ చదువుతున్నారు?
మృతుల తండ్రి నర్సింహులు: సిమ్మయ్యకు ఒక్క కొడుకు సంతోషే మిగిలాడు... ఇక్కడే చదువుతున్నాడు... అప్పయ్య పిల్లలు ప్రసాద్, అశ్వినిలు వాళ్ల తాతగారి ఊరు జలుమూరులో చదువుతున్నారు.

జగన్: మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ పార్టీ ఇన్‌చార్జి శీను ఉంటాడు... రేపు మరళా మీ ఊరు వస్తాడు... ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కోసం ఆయన మీకు సాయం చేస్తాడు... అంటూ జగన్ మృతుల పిల్లలు ప్రసాద్, అశ్విని, సంతోష్‌లను అప్యాయంగా ముద్దాడారు.

రిమ్స్‌క్యాంపస్: 
చెన్నైలో ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని పరామర్శించేందుకు రెండోరోజు శుక్రవారం నరసన్నపేట మండలంలోని బాలసీమ, సారవకోట మండలంలోని సత్రాం, కోటబొమ్మాళి మండలంలోని పాకివలస, చుట్టిగుండం, భామిని మండలం కొరమ గ్రామాలకు వెళ్లిన రాజన్నబిడ్డ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. కొన్ని చోట్ల తమ సమస్యలు చెప్పుకున్నారు.

జగనన్న వచ్చారు...పదండ్రో అంటూ సారువకోట మండలం అలుదు గ్రామం వద్దకు జగన్ కాన్వాయ్ రాగానే అక్కడి ప్రభుత్వ పాఠాశాల విద్యార్థులు రోడ్డుపైకి పరుగులు తీశారు. వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. సారవకోట మండలం సత్రాం గ్రామానికి జగన్ వస్తున్నారని తెలుసుకుని బి.తవిటయ్య అనే వికలాంగుడు దేకురుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. తవిటయ్యను చూసిన జగన్ దగ్గరకు వెళ్లి కష్టసుఖాలను తెలుసుకున్నారు. బాబు ఎంత మోసం చేశాడో జగనన్నకు చెబుదామంటూ కోటబొమ్మాళి మండలం పాకివలస డ్వాక్రా మహిళలు పరుగున వచ్చారు.
 
మడపాం సమీపంలోని మహిళలు రోడ్డుపై నిరీక్షించడంతో జగన్ కాన్వాయ్‌ను ఆపి వారిని పలకరించారు. రుణాలు మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు తమను మోసం చేశారంటూ బైరి జంక్షన్ వద్ద పలువురు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని జగన్‌కు విన్నవించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలయ్యేలా చూడాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు చుట్టిగుండంలో జగన్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా నుంచి తిరిగివెళ్తున్న జగనన్నకు ఆమదాలవలస వద్ద తమ్మినేని విద్యాసంస్థల విద్యార్థులు టాటా చెప్పారు.

ఇటు చెన్నై బాధితులకు భరోసా.. అటు పీడిత ప్రజలకు బాసట

జగన్ రాక ఏరువాక.
* రెండు రోజులూ జననేత వెన్నంటి నడిచిన వర్షం.. జనం
* ఇటు చెన్నై బాధితులకు భరోసా.. అటు పీడిత ప్రజలకు బాసట
* జనాదరణ చూసి ఉప్పొంగిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు

శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంత స్తబ్దత ఆవరించిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన కొత్త ఉత్సాహం నింపింది. టానిక్‌లా పని చేసి నిస్సత్తువను పారదోలింది. నిజానికి ఈ పర్యటన చెన్నై దుర్ఘటనల్లో మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు ఉద్దేశించిందే అయినా.. రెండురోజుల పాటు పర్యటన సాగిన తీరు, ప్రజలు అడుగడుగునా జననేతను చూసేందుకు గం టల తరబడి నిరీక్షించిన తీరు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉత్తేజితం చేసింది. పార్టీ అధికారంలోకి రాకపోయినా.. జనంలో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని ఈ పర్యటన ససాక్ష్యంగా రుజువు చేసింది.

రైతులు, నిరుద్యోగు లు, విద్యార్థులు, ఇంకా పలు వర్గాల ప్రజలు జగన్ కలుసుకొని తమ కష్టాలు చెప్పుకోవడం.. న్యాయం చేయమని కోరడం చూస్తే ప్రతిపక్ష నాయకునిగా ఆయన్ను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని స్పష్టమైంది. దీనికితోడు జగన్ సైతం చెన్నై బాధితుల తరఫున అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పడం, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటి కో ఉద్యోగం వంటి హామీల విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ తీరు తీవ్రంగా ఎండగట్టడమే కాకుండా రైతుల పక్షాల ఉద్యమిస్తామని ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు వైఎస్‌ఆర్‌సీపీ బాసటగా నిలుస్తుందని చాటిచెప్పడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనల్లో మృతి చెందిన 23 మంది జిల్లావాసుల కుటుం బాలను పరామర్శిం చేందుకు వచ్చిన ఆయన రెండు రోజు ల పాటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పర్యటించారు.

మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి బాధితుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అండగా ఉంటామ ని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బిల్డర్లు, యజమానులతో పరిహారం ఇప్పించేందుకు బాధితుల తరపున పార్టీ పోరాటం చేస్తుందని జగన్ హామీ ఇచ్చారు. దీని కోసం పార్టీ నాయకులతో ఉన్నతస్థాయి కమిటీని వేసి చెన్నై పంపిస్తామన్నారు. అలాగే పలుచోట్ల రైతులు జననేత వాహనాన్ని ఆపి రుణమాఫీపై టీడీపీ ప్రభుత్వ సాచివేత ధోరణిని ప్రసావించారు. ప్లకార్డులతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి జగన్ స్పందిస్తూ ప్రభుత్వానికి నెలరోజులు గడువిస్తున్నామని, అప్పటికీ రుణమాఫీ చేయకుంటే రైతుల పక్షాన నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని ప్రకటించారు.

తద్వారా ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఆదర్శ రైతుల తొలగింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ఆయా వర్గాల ప్రజలు చేసుకున్న విన్నపాలకు జగన్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభుత్వంతో పోరాడతామని చెప్పడం ద్వారా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలే తమ ఎజెండా అన్నట్లు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే జగన్ అర్ధరాత్రి వరకు పర్యటించినా.. ఆయన పర్యటన సాగిన మార్గాల్లో ప్రతి గ్రామ కూడలి వద్ద మహిళలు, వృద్ధులు సైతం పెద్ద సంఖ్యలో నిరీక్షించారు. జగన్‌ను చూడగానే ఆయనతో మాట్లాడేందుకు, చేయి కలిపేందుకు పోటీ పడటం.. జగన్ కూడా ఎక్కడికక్కడ వాహనం ఆపి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, చిన్నారులను ఆశీర్వదిస్తూ ముందుకు సాగడం పార్టీకి కొత్త ఊపునిచ్చింది.

బాబు వచ్చాడు... జాబు పోయింది!

బాబు వచ్చాడు... జాబు పోయింది!
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా ఉద్యోగుల గెంటివేత
 
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా మూడు నెలల క్రితం ప్రతి నియోజకవర్గానికి ఒక్కో ప్రతినిధి చొప్పున ఎన్నికల సర్వే, పార్టీ కార్యకలాపాల కోసం 294 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చారు. వీరితో పాటు ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ నాయకులను ఎన్నుకునేందుకు కొందరు నిరుద్యోగ యువతిలను కూడా రిక్రూట్ చేసుకున్నారు. మూడు నెలలు గడిచాయి... ఎన్నికలు ముగిశాయి... ఫలితాలు వచ్చాయి... బాబు గెలిచాడు... అయితే పర్మినెంట్ అనుకున్న ఉద్యోగాలు ఉన్న పళంగా పోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఈ ఉద్యోగులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద బాబుతో ములాఖత్ కోసం పడిగాపులు కాసారు. ట్రస్ట్ భవన్‌లోకి అనుమతించకపోవడంతో కేబీఆర్ పార్కు వద్ద ఆకలిడప్పులతో అలమటిస్తూ ఉండిపోయారు. మీకు హామీలు ఎవరు ఇచ్చారో వారిని తీసుకొని రండంటూ ట్రస్టు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశాడని బాధితులు వాపోయారు.

సాక్షాత్తు ట్రస్ట్ భవన్‌లోనే మాకు శిక్షణా తరగతులు ఇచ్చారని, చంద్రబాబు కూడా కొన్నిసార్లు తమతో ముఖాముఖి అయి మాట్లాడిన సందర్భాలున్నాయని ఇలా మోసపోతామని కలలో కూడా ఊహించలేదని   ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకునేటప్పుడే అందరు ఉన్నత చదువులు చదివి ఉండాలని మంచి భవిష్యత్ ఉంటుందని, రూ. 18 వేల జీతం అని చెప్పారని వారు బాధపడుతున్నారు. ధర్నా చేయడానికి వచ్చిన వీరందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెల కొంది. లోకేష్ వచ్చాక నిర్ణయం  చెబుతామని ట్రస్ట్‌భవన్ వర్గాలు చెప్పడంతో వారు ఎటు పాలుపోని స్థితిలో ఉన్నారు.

విపక్షనేత వైఎస్ జగన్‌కు కేటాయించిన కార్యాలయమిదీ

చెత్తాచెదారం.. దుర్వాసనసచివాలయంలో వైఎస్ జగన్ కు కేటాయించిన గది. (ఇన్ సెట్లో) గది పరిసరాల్లో చెత్తాచెదారంవీడియోకి క్లిక్ చేయండి
 విపక్షనేత వైఎస్ జగన్‌కు కేటాయించిన కార్యాలయమిదీ
 పనికిరాని వస్తువులతో డంపింగ్ యార్డును తలపిస్తున్న వైనం
 67 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ఒకేఒక్క గది!
 చీఫ్ విప్, విప్‌లకు రెండేసి గదులు

 
 సాక్షి, హైదరాబాద్: చెత్తాచెదారంతో భరించలేని కంపు.. అగ్గిపెట్టె లాంటి చీకటి గుహను తలపించే గది... వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కేటాయించిన చాంబర్ పరిసరాల్లోని దుస్థితి ఇదీ. ఏపీ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణరావు తాజా గా జారీ చేసిన సర్క్యులర్‌లో ప్రతిపక్ష నేతతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లకు కేటాయించిన చాంబర్ల వివరాలను వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లకు రెండేసి గదులను కేటాయిస్తున్న ట్లు సర్క్యులర్లో పేర్కొన్న అధికారులు.. 67 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీని మాత్రం ఒకే గదికి పరిమితం చేశారు. అది కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న భవనంలో కాకుండా అసెంబ్లీ సచివాలయ పరిపాలనా భవనంలోని జీ 4 గదిని ప్రతిపక్ష నేతకు కేటాయించారు.

ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ అదనపు కార్యదర్శి గోపాలకృష్ణ గతంలో ఈ చాంబర్‌లోనే విధులు నిర్వహించారు. రెండేళ్ల క్రితం అవినీతి ఆరోపణలపై ఆయన సస్పెండ్ కావడంతో నాటి నుంచి ఈ గదిని సీజ్ చేశారు. అగ్గిపెట్టెను తలపించే ఈ గదిలో పట్టుమని పదిమంది కూర్చునే స్థలం లేదు. అలాంటి చాంబర్‌ను ఏకంగా 67 మంది ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేతకు కేటాయించడం గమనార్హం. ప్రతిపక్ష నేత పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావాలంటే వేరే చోటును వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు కాగా ఆ గది చుట్టూ ఉన్న పరిసరాలు భయానకంగా ఉన్నాయి. చీకటిగుహను తలపించే ఆ గదిలో ఎటుచూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. పనికిరాని వస్తువులన్నీ అక్కడే పడేసి డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు. ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్వాసన వెదజల్లే పరిసరాల్లో ప్రతిపక్షనేతకు చాంబర్ కేటాయించడం చర్చనీయాంశమైంది. శాసనసభ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళితే వారు నోరు మెదపకపోవడం గమనార్హం. సీఎం చంద్రబాబు, టీడీపీకి చాంబర్ల కేటాయింపు అంశాన్ని మాత్రం ఈ సర్క్యులర్లో ప్రస్తావించలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఆ పార్టీకే యథాతథంగా కేటాయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

Written By news on Friday, July 18, 2014 | 7/18/2014

'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'
హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసిన విధానాన్ని డీజీపీకి వివరించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని డీజీపీకి వివరించినట్టు వైఎస్‌ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఇప్పటిదాకా స్థానిక పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.

పోలీసులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఈ నెల 13న మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

ఆదర్శ రైతుల కొనసాగింపుపై పోరాటం

ఆదర్శ రైతుల కొనసాగింపుపై పోరాటం: వైఎస్ జగన్
శ్రీకాకుళం: ఆదర్శ రైతుల కొనసాగింపుపై పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ను 500 ఆదర్శ రైతులు కలిసి తమ గోడును చెప్పుకున్నారు. 
 
శ్రీకాకుళం మండలం కరజాడ వద్ద వైఎస్ జగన్‌ను శుక్రవారం మధ్యాహ్నం ఆదర్శ రైతులు కలిశారు. జిల్లాలోని ఆదర్శ రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తమ సమస్యలను రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వైఎస్ జగన్ రైతులకు భరోసానిచ్చారు.

హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తారట

హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తారట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోపం వచ్చింది. అంతా ఇంతా కాదు. ఆ ఆగ్రహం కాస్తా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ రప్పించేంత వరకూ. గురువారం  పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో  చంద్రబాబును ఓ రైతు కరెంట్ సమస్యను ప్రస్తావించినందుకు సీఎం అసహనానికి గురయ్యారు.  కథలు చెప్పవద్దని ఆ రైతును గద్దించారు.  పైపెచ్చు నేను తలచుకుంటే హైదరాబాద్ కు రప్పించి నీకు ఫైన్ వేస్తానంటూ బాబు హుంకరించారు.

నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబును..గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించాడు. కరెంటు ఎప్పుడుంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయాడు. దానికి సీఎం స్పందిస్తూ 'కాంగ్రెస్ హయాంలో దారుణంగా ఉండేది. నేను వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది' అని సెలవిచ్చారు. అయితే దీనికి గంగరాజు బదులిస్తూ...'గవర్నర్ పాలనలోనే నాలుగు గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు రెండు గంటలే ఉంటోంది' అన్నాడు.

దాంతో బాబు మండిపడుతూ 'ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు' అని గదమాయించారు. సార్ నేను చెబుతోంది నిజమే అని ఆ రైతు అనటంతో బాబుకు బీపీ అమాంతరం పెరిగిపోయింది. 'ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడతా. ఏదో చెప్పాలనుకుని చెబితే ఊరుకోను. నీకు సమస్యలు వస్తాయ్. నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా' అని ఒకింత బెదిరింపు ధోరణితో అన్నారు.

అయినా అదరని గంగరాజు... రెండు రోజులగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు అని తెగేసి చెప్పాడు. దాంతో పక్కనున్న రైతులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. దాంతో బాబు... సరే... నాకు పనుంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా అంటూ వెళ్లిపోయారు.

ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీకి 167 సీట్లు

ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీకి 167 సీట్లువీడియోకి క్లిక్ చేయండి
శ్రీకాకుళం : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు 167 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల్లోకి వెళ్లి ఓటు వేస్తారా అని అడగగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.  శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గ్రాఫ్ ఇంత తొందరగా పడిపోతుందని అనుకోలేదన్నారు. మామూలుగా ప్రజా వ్యతిరేకత రావటానికి ఏ ప్రభుత్వానికి అయినా రెండేళ్లు పడుతుందని, అయితే చంద్రబాబుకు మాత్రం ప్రజా వ్యతిరేకతకు నెలరోజుల సమయం కూడా పట్టలేదన్నారు.

చంద్రబాబు దారుణంగా అబద్ధాలాడుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఎర్రచందనం అక్రమ నిల్వల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రి చెరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. ఎర్ర చందనాన్ని అమ్మి రుణమాఫీ చేస్తామంటున్నారని, 8వేల టన్నుల ఎర్రచందనం ఉందని, నాలుగు వేల టన్నులు వేలం వేస్తే టన్నుకు రై.10 లక్షల చొప్పున వస్తుందని ఓవైపు అటవీశాఖ మంత్రి చెబితే, మరోవైపు చంద్రబాబు  మాత్రం 15వేల టన్నులని చెబుతున్నారన్నారు. అలా అయినా వచ్చే రూ.1500 కోట్లతో ఎలా రుణమాఫీ చేస్తారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు మాత్రం అమలుకు కష్టంగా ఉందంటున్నారని చెప్పటం శోచనీయమని వైఎస్ జగన్  అన్నారు. పార్లమెంట్ లో ఓటేయించి రాష్ట్రాన్ని విడగొట్టించిన చంద్రబాబు రెండు రాష్ట్రాలకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేసి రుణమాఫీ చేస్తానన్నారని గుర్తు చేశారు.  పిక్‌పాకెట్ చేస్తేనో, దొంగతనం చేస్తేనో 420 కేసు పెడతారని, మరి ప్రజల్ని మోసం చేసి సీఎం అయిన చంద్రబాబుపై..
420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? అని అడుగుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 11న ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన బాబు రాష్ట్రంలోని వనరులపై తనకు అవగాహన ఉందని, రుణమాఫీ అమలు చేస్తానన్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత 40, 50 సమావేశాల్లోనూ తనకు చాలా అనుభవం ఉందని, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చాలా మాటలు చెప్పారని, రుణాలు కట్టవద్దని ఆయన మనుషులు ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పారన్నారు. రుణమాఫీ కష్టమని తెలిసినా అంతా తెలిసే ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అలాంటి బాబుపై 420 కేసు పెట్టాలో, 840 కేసు పెట్టాలో ఆయన మనస్సాక్షినే అడగాలన్నారు.

ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు... ఉద్యోగం లేనివారికి నెలకు రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆ హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు అడుగుతుంటే... ఇప్పుడు జాబంటే ప్రభుత్వ ఉద్యోగమనలేదని మాట తప్పుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారిని ఆదుకునే వారే కనిపించడం లేదన్నారు.

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంపై తాను గర్వపడుతున్నానని, ఇచ్చే భావన, మంచి ఆలోచన లేనప్పుడు పథకాలు ఎత్తివేసే కార్యక్రమంలోనే భాగంగా ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.

సంగోరు రాత్రేళ.. మృత్యు హేల!

సంగోరు రాత్రేళ.. మృత్యు హేల!
బూర్జ, ఆమదాలవలస: సంగోరు రాత్రి గడిసింది. అంతలోనే పెద్ద శబ్దంతో గోడ కూలిపోనాది. మా బతుకులను కూల్చేసినాది. అని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన సెలగల పెంటయ్య కుటుంబ సభ్యులు విలపించారు. గురువారం వారిని పరామర్శించేందుకు కొల్లివలస వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంఘటన వివరాలు తెలుసుకుని వారి తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు, జగన్ మధ్య సంభాషణ ఇలా సాగింది.

 జగన్: ప్రమాదం ఎలా జరిగింది?
   నాగరాజు: (పెంటయ్య కుమారుడు, ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు) శనివారం పనిచేశాం. పేమెంట్ అందుకున్నాం. అన్నం తినేసాం. గుడిసెల్లోకి ఎళ్లి పడుకున్నాం. సంగోరు రాత్రిలో 20 అడుగుల గోడ ఒక్కసారి పెద్ద శబ్డంతో కూలిపోయింది.

 జగన్: అప్పుడు ఎంత మంది ఉన్నారు?
 నాగరాజు: మొత్తం 12 మందిపైన పడింది. అందరూ
 సనిపోయారు. నేనే మిగిలాను. బుర్రకు దెబ్బ తగలడంతో 5 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను.

 జగన్: చెన్నైకే ఎందుకు పనికి వెళ్తున్నారు?
 పెంటమ్మ(మృతుని భార్య): నాకు ఇద్దరు పిల్లలు బాబు. సిన్నోడు మూడు చదివినాడు, పెద్దోడు సదవలేదు. మేస్త్రీ పనిచేస్తున్నాడు. మండలంలో ఉపాధి పనులు జరగడంలేదు. రెండు పూటలా పనికెళ్తే వందలోపే వస్తాంది. ఎటుకీ చాలడంలేదు. అందుకే ఏటా పనికెల్తాం. ఈసారి అదే కొంప ముంచింది. భర్తను మృత్యువు తీసుకుపోరుుందంటూ కన్నీరు పెట్టింది.

 జగన్: గోడ ఓనరుపై కేసు వేయగలరేమో కనుక్కోండి. పార్టీ తరఫున తమ్మినేని సీతారాం మీ వెంట ఉంటారు. ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడి యజమాని నుంచి మీకేమైనా వచ్చేందుకు మా ప్రయత్నం చేస్తాం?
 పెంటమ్మ: అలాగే బాబూ, అక్కడ చేసిన పనికి స్లిప్పులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇవ్వలేదు.

 జగన్: నాగరాజూ చదువుకుంటావా?
 నాగరాజు: చదవలేను.

 పెంటమ్మ: విడో పింఛన్ ఇప్పించండి బాబూ..
 జగన్: వచ్చేలా చూస్తానమ్మా. కొత్తగా పింఛన్లు ఏమైనా ఇస్తున్నారా?
 బాధితులు: లేవు బాబూ.. అన్నీ నాన్న వై.ఎస్. పెట్టినవే ఉన్నాయి.
 

నేటి జగన్‌ పర్యటన ఇలా..

నేటి పర్యటన ఇలా..
   రెండు రోజుల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల్లో చెన్నై బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షడు ధర్మాన కృష్ణదాస్, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం పేర్కొన్నారు.   ఉదయం శ్రీకాకుళం నుంచి బయలుదేరి నరసన్నపేట మండలం బాలసీమ, సారవకోట మండలం సత్రాం గ్రామాలకు చెందిన బాధితులను పరామర్శిస్తారు.  అక్కడి నుంచి టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో చుట్టిగుండం, పాకివలస గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను ఓదారుస్తారు. అనంతరం భామిని మండలం కొరమ వెళ్తారు.

కష్టాలు చెప్పుకున్న మహిళలు,రైతులు

పులకించిన పల్లె
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తమ వారిని పోగొట్టుకొని పుట్టెడు బాధలో ఉన్న చెన్నై బాధిత కుటుంబాలకు తానున్నానని హామీలభిం చింది. తమ కష్టాలను ఎవరితో చెప్పుకుం దామా అని ఎదురుచూస్తున్న సమయంలో ఒక ఆశా దీపం వారి కళ్లల్లో కనిపిం చడంతో వారి మోము లు వికసించాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కు చేరుకున్న వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నై బాధిత కుటుంబా ల్లో ఆనందం నింపారు. బుధవారం రాత్రి జిల్లాసరిహద్దులో ప్రవేశించిన ఆయన గురువారం ఉదయం ఆమదాలవలస, పాల కొండ, పాతపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి వారిని ఓదార్చారు. బూర్జ, పాలకొండ, ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో పర్యటించారు. జగన్‌ను చూసిన గ్రామీణ ప్రాంత ప్రజలు పులకించిపోయారు.

 చాన్నాళ్ల తర్వాత తమ నాయకుడు రావడం తో పల్లె ప్రజలు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూశారు. ఇటీవల చెన్నైలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు దుర్ఘటనలో జిల్లాకు చెందిన 24 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం ఉదయం ఆమదాలవలసలో పార్టీ నేత తమ్మినేని సీతారాం నివాసగృహం నుంచి బూర్జ మండలం వైపు బయలుదేరి ఆ మండలంలో మూడు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం పాల కొండలో ఊల రవి కుటుంబాన్ని పరామర్శించారు.

 అనంతరం ఎల్.ఎన్.పేట, కొత్తూరు, హిరమండలం మండలాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కష్టాలను ఓపిగ్గా విన్నారు. సంఘటన ఎలా జరిగింది, కుటుంబ సభ్యు ల వివరాలు, భవిష్యత్తులో వారికి ఏమైనా అండ లభిస్తుందా, ప్రభుత్వం ప్రోత్సాహం ఏమైనా ఇచ్చిందా అని ఆరా తీశారు. భవిష్యత్తులో పార్టీ తరఫున, తమ కుటుం బం తరఫున పూర్తి సహకారం లభిస్తుందని హామీనిచ్చారు. సాక్షాత్తూ జగనే తమ ఇళ్లకు రావడంతో బాధిత కుటుంబాలు హర్షిం చాయి. తమవాడేనన్న భావన కల్పించడంతో మరింత ఉప్పొం గిపోయారు. తమ కష్టాలను ఆయనకు చెప్పుకున్నారు.

 కష్టాలు చెప్పుకున్న మహిళలు..
 జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ రైతులు, మహిళలు తమ కష్టాలను చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ రుణమాఫీ అం టూ గద్దెనెక్కి ఇప్పుడు రీషెడ్యూల్ అంటూ తప్పుడు ప్రకటనలు చేయడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాల పట్ల ప్రభుత్వం ఉదాసీనత వ్యక్తం చేయడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నామని, రానున్న రెండు నెలల్లో అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల కష్టాలపై గట్టిగా వాదిస్తానని జగన్ వారికి హామీనిచ్చారు. పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జగన్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ఆయన మోములో చిరు నవ్వును చూసి అచ్చం నాన్నలాగే ఉన్నావంటూ ఆనంద పడ్డారు. మా కష్టాలు నువ్వే చూడాలంటూ సమస్యలు వివరించే ప్రయత్నం చేశారు. జగన్ పర్యటించిన అన్ని ప్రాంతాల్లోనూ అటు పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉత్సాహం కల్పించింది.

 రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నరసన్నపేటతో పాటు పలు మండలాల్లో జగన్ పర్యటన కొనసాగనున్నట్టు నేతలు తెలిపారు.  జగన్ రాకను తెలుసుకున్న గ్రామస్తులు రోడ్డుకిరువైపులా నిలబడి ఆశగా ఎదురుచూశారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలతో రహదారులు నింపేశారు. వయస్సు తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వారు జగనన్నకు హారతులు పట్టారు. హాస్టల్ విద్యార్థులు తాము తింటున్న భోజనం ఇదేనంటూ రుచి చూపించారు. జగన్ బాధపడుతూ ఇలాంటి అన్నం తింటున్నారా అంటూ ఆవేదన చెందారు. వృద్ధుల తల నిమిరారు.

 అక్క, చెల్లెళ్లను ఓదార్చారు. కొన్ని ప్రాం తాల్లో వర్షం వస్తున్నా లెక్క చేయకుండా జిల్లా ప్రజలు జగన్ కోసం ఎదురుచూశా రు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా క్యూ కట్టారు. మొత్తానికి జగన్ పర్యటన చెన్నై బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపింది.  జగన్ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, కలమట వెంకటరమణ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా స్థాయి నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, పిరియా సాయిరాజ్, అంధవరపు సూరిబాబు, వరుదు కల్యాణి, మామిడి శ్రీకాంత్,  పాలవలస విక్రాంత్, కరణం ధర్మశ్రీ, విశాఖ, విజయనగరం జిల్లాల నేతలు పాల్గొన్నారు.  జగన్ పర్యటించిన చోట ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఘనంగా స్వాగతించారు.

 శ్రీకాకుళం చేరుకున్న జగన్
  తొలిరోజు పర్యటన ముగించుకున్న జగన్‌గురువారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో శ్రీకాకుళం చేరుకున్నారు.

ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే

 ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే కనిపించాయి. కష్టాల బతుకులే తారస పడ్డాయి.బతుకు తెరువు కోసం వలస వెళ్లి  చెన్నైలో ఇటీవల జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో తమవారిని పోగొట్టుకున్న కుటుంబాలు విషణ్ణవదనంలో మునిగిపోయూయి. ఆయూ కుటుంబాను వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఓదార్చారు. ప్రమాద వివరాలు, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. కష్టాల జీవనం తెలుసుకుని తల్లడిల్లారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూసేందుకు పార్టీ ప్రతినిధుల బృందాన్ని చెన్నై పంపిస్తాన ంటూ భరోసా ఇచ్చారు.

 టీఆర్ రాజుపేటలో  కొయ్యాన జయమ్మ కుటుంబ సభ్యులతో...
 జగన్: మృతురాలు జయమ్మ కుమార్తె బొట్ట రామకుమారిని ఓదార్చారు. ప్రమాద తీరుపై ప్రశ్నించారు.
 అక్కడే ఉన్న రామకుమారి భర్త శ్రీనివాసరావు కలుగజేసుకుని జయమ్మ అల్లుడ్ని నేను. ముగ్గురు పిల్లలు నాకు. మేము ప్రమాదాన్ని చూడలేదు. మా అత్త తిలువులూరుజిల్లా యదపాలెంలో పనిచేస్తుండగా, మేము 20 కిలోమీటర్ల దూరంలోని చెన్నైసిటీలోని రెడ్ ఏరియా మాధవరం బ్రిడ్జి వద్ద పనిచేస్తున్నాం.

 జగన్:  ప్రమాదవార్త మీకెలా తెలిసింది.
 శ్రీనివాసరావు: మా అత్త తలవద్ద ఉన్న బ్యాగ్‌లో ఒక పుస్తకం తమిళనాడు పోలీసులకు దొరికింది. అందులోని బూర్జ మండలంలోని లక్కుపురం గ్రామంలో ఉన్న మా చెల్లి ఫోన్ నంబర్‌కు కాల్‌చే శారు. మా చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పడం తో వెంటనే నేను అక్కడకు వెళ్లాను.

 జగన్: మీరు వెళ్లేసరికి మృతదేహాలు అక్కడే ఉన్నాయా?
 శ్రీనివాసరావు: లేవు. ఆస్పత్రిలో ఉన్నాయని చెప్పారు. అక్కడకు వెళ్లి చూశాను. మా అత్తతో పాటు కోటబొమ్మాళి మండలంలోని చుట్టిగుండం గ్రామానికి చెందిన చిన్నత్త, చిన్నమామ, వారి కుమారుడు శవాలే కనిపించారుు. వీటిని చూసి అక్కడే కుమిలిపోయూను.

 జగన్: ఆ గోడ ఎలా కూలిపోయింది.
 శ్రీనివాసరావు: ఆ గోడ పాతదే. గోడ కలి సొస్తాదని దానికి ఆనుకొని పాక వేశారు. వర్షానికి అది కూలిపోరుుంది.

 జగన్: ఓనురుపై కేసు పెట్టండి
 శ్రీనివాసరావు: అలాగే బాబూ..

 జగన్: మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. మీకు మన బొబ్బిలి రాజు, ఎమ్మెల్యే సృజయకృష్ణ రంగారావుతో మాట్లాడించి మంచి లాయర్‌ను ఏర్పాటు చేసి మీ ఆవేదన వినిపించేలా చేస్తాను. జరిగినది జరిగినట్టుగా వివరాలు చెప్పండి, ఎల్లుండి మా పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతిలు  మీతో మాట్లాడతారు.
 జగన్: శ్రీనివాసరావు పిల్లల పేర్లు తెలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. వారి చదువులపై ఆరా తీశారు. బాగా చదువుకోవాలంటూ దీవించారు.

 కొల్లివలసలో కర్రి సింహాచలం కుటుంబ సభ్యులతో...
   జగన్: ప్రమాదం ఎలా జరిగిందమ్మా? చెన్నై ఎప్పుడు వెళ్లారు?
 సింహాచలం భార్య రాజులమ్మ: పిల్లలకు వేసవిసెలవులు ఇచ్చినప్పుడు అందరమూ కలసి చెన్నై వెళ్లిపోనాం. తిరిగిబడులు పెడతారని అందరూ కలసి మా ఊరు వచ్చాం.  మా పెద్దోడిని తోటాడ బడిలో వేసి గత నెల 18న నా భర్త చెన్నై వెళ్లారు. ప్రమాదంలో చనిపోయూరు.

 జగన్: మీ గ్రామం నుంచి ఎంత మంది వలస వెళ్లారు?
 -మృతుడు సింహాచలం చిన్నాన్న కర్రి పెంటయ్య కల్పించుకొని వంద మంది వరకు వెళ్లినారు బాబు... వేర్వేరు చోట్ల పనిచేస్తున్నారు. సింహాచలం మేస్త్రీగా పనిచేస్తున్నారు.

 జగన్: కూలి ఎంత ఇచ్చేవారు?
 రాజులమ్మ : కూలీలకు రూ. 200, మేస్త్రీకి రూ. 500 ఇచ్చేవారు.

 జగన్: గోడ ఎలా కూలిపోయింది?
 రాజులమ్మ: వర్షం గట్టిగా కురవడంతో గోడ కూలిపోరుుందట. ముందురోజు రాత్రి ఎనిమిది గంటలకు నా భర్తతో ఫోన్‌లో మాట్లాడాను. మన ఊరిలో వర్షాలు కురిస్తే స్వగ్రామానికే వచ్చేస్తానని చెప్పి కనిపించని లోకాలకు వెళ్లిపోయూరంటూ భోరున విలపించింది.

 జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు సాయమందించిందా?
 భార్య: ఈ రోజే చెక్కులు ఇస్తామని శ్రీకాకుళం రమ్మని కబురెట్టారు. మీరు వస్తారని మేము వెళ్లకుండా ఉండిపోయినాం. నా మరిదిని శ్రీకాకుళం పంపినాను.

 పాలకొండలో ఊళ్ల రవి కుటుంబ సభ్యులతో...
 జగన్: రవి ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధగా ఉందమ్మా..
 రవి తల్లి పార్వతి: పుట్టెడు శోకంలో ఉన్నాం బాబు. రవిపైనే కుటుంబమంతా ఆధారపడి ఉంది. ఇంటిలో అందరివీ కూలి బతుకులే. దూరం వెళ్లి డబ్బు పంపుతున్న చెట్టంత కొడుకు ప్రమాదంలో మృతిచెందాడంటూ భోరున విలపించింది. (ఆమెను జగన్ ఓదార్చారు)
 రవి తమ్ముడు చిన్నారావు: రవితో పాటు నేను కూడా పనిలోకి వెళ్లా. పక్కనే పనిచేస్తున్నా. హఠాత్తుగా బిల్డింగ్ కూలి రవి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరూ అక్కడ లేరు. సాయం లేదు. పోస్టుమార్టంలో వేరొకరి మృతదేహం అప్పజెప్పే ప్రయత్నం చేశారు. పాలకొండ ఆర్డీవో సాయంతో రవి మృతదేహాన్ని గుర్తించి తెచ్చుకోగలిగాం.

 జగన్: బిల్డర్‌పై కేసు వేద్దాం... అప్పుడు అతడే దారిలోకి వస్తాడు. లేకపోతే చట్టపరంగా పరిహారం కోసం పోరాడతాం. బిల్డర్‌ను విడిచిపెట్టేది లేదు. భయపడకండి. ప్రస్తుతం జీవనం ఎలా?
 రవి అన్న శ్రీను, చిన్నాన్న సూర్యనారాయణ:  కొంత సొంత భూమి ఉంది. కొంత కౌలుకు తీసుకొని పండిస్తున్నాం. నాలుగేళ్ల నుంచి పంటలు లేవు. బతుకు బాగోలేదు. అందుకే తమ్ముడు రవి వలస వెళ్లాడు. సగంలో నిలిచిపోయిన ఇంటిని పూర్తి చేయడానికి డబ్బులు సంపాదించేందుకు వెళ్లాడు. పెళ్లి కూడా చేయాలనుకున్నాం. ఇంతలోగా ఘోరం జరిగిపోయింది. జగన్నాథరథాయాత్రకు వస్తానని చెప్పిన మని షి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు.

 జగన్: మీకు వైఎస్సార్ సీపీ తరఫున అండగా ఉంటాం. ఎమ్మెల్యేలు కళావతమ్మ, కలమట వెంకటరమణ, బొబ్బిలి రాజులు మీకు సాయమందిస్తారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ గతంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేశారు. వీరందరినీ ఒక బృందంగా ఏర్పాటు చేసి బిల్డర్ నుంచి పరిహారం రప్పిస్తాం.

 ఎల్‌ఎన్.పేటలో తాన్ని అప్పలనరసమ్మ కుటుంబీకులను ఓదార్చుతూ..
 జగన్: ప్రమాదం ఎలా జరిగింది?
 లక్ష్మీనారాయణ (మృతురాలు అప్పలనరసమ్మ భర్త): అప్పుడు నేను మరో దగ్గర పనికి వెళ్తున్నాను. నా భార్య మాత్రం వంట కోసం బియ్యం తేవడానికి ఆ భవనానికి వెళ్లింది. అంతే.. ఒక్కసారిగా భవనమంతా కూలిపోయింది. ఇంటి దీపం ఆరిపోరుుంది.

 జగన్: ఎంత మంది ఉంటున్నారు ఇక్కడ?
 లక్ష్మీనారాయణ: నేను, నా భార్య పనిలోకి వెళ్తే, పిల్లలు ఇద్దరినీ మా పెద్దోళ్లు చూసుకుంటున్నారు. ఏటా పనిలోకి వెళ్తేనే మాకు, మా పిల్లలకు కాసింత కూడు దొరికేది.

 జగన్: ఎంతిస్తారు..అక్కడ?
 లక్ష్మీనారాయణ: ఇద్దరికీ రూ.350 చొప్పున ఇచ్చేవారు. పని మాత్రం దొరికేది. ఒక కూలి ఖర్చుకు సరిపోయేది. మరో కూలి డబ్బులు దాచుకుని ఇక్కడికి వచ్చేవాళ్లం.

 జగన్: బిల్డింగ్ వారు ఏమైనా పరిహారం కింద డబ్బులు ఇచ్చారా.. కనీసం మాట్లాడారా?
 లక్ష్మీనారాయణ: అసలు ఎవరో తెలియదు. ఇంతవరకు ఏమీ ఈయలేదు.

 జగన్: భవనం యజమాని నుంచి పరిహారం అందేలా వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు బొబ్బిలి రాజు సుజయ్, రాజన్నదొర, శ్రీదేవమ్మ (కురుపాం ఎమ్మెల్యే)లతో ప్రత్యేక కమిటీ వేసి అక్కడికి పంపిస్తాను. మీ కోసం పోరాడేలా చేస్తాను. ధైర్యంగా ఉండండి..

 జగన్: ఏమ్మా..ఏం చదువుతున్నారు..
 మృతురాలు పెద్దమ్మాయి రమాదేవి: నేను ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మా  చెల్లి మాధవి 3వ తరగతి చదువుతోంది.

 జగన్: ఏమ్మా.. మీ స్కూల్‌లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు ఉన్నాయా..

 రమా: ఏమీ లేవు సార్..
 జగన్: (పక్కనే ఉన్న రెడ్డి శాంతితో) అమ్మా శాంతి.. చూడమ్మా..అమ్మాయి 8వ తరగతి చదువుతోంది.

 అక్కడ బాత్‌రూమ్స్ లేవట..ఏదోలా కట్టేలా చెయ్..ట్రస్టులతో మాట్లాడు. నారాయణ అన్నా భార్యను కోల్పోవడం దారుణం.. ధైర్యంగా ఉండు .పిల్లల్ని పెద్ద చెయ్.. ఎప్పుడూ పనుల్లోకి పంపకు.. పిల్లలూ బాగా చదవండి.. ఉంటాను.

 గొట్ట గ్రామ బాధితులతో...
 జగన్: అయ్యా మీకు పెద్ద కష్టం వచ్చి పడింది?
 సింహాచలం (జ్యోతి భర్త): అవునన్నా. పక్క బిల్డింగ్‌లో పనిచేస్తున్నాం. వర్షం పడుతుందని ఆరేసిన బట్టలు తీసేం దుకు వెళ్లిన నా భార్య జ్యోతి శిథిలాల్లో చిక్కుకుంది. మాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మౌనిక రెండో తరగతి చదువుతోంది. అబ్బాయి శ్రీను చేతిపిల్లాడు.

 జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి  పరిహారం అందిందా?
 సింహాచలం: మొత్తం రూ.7,25,000 అందాయి. పిల్లల పేరున డిపాజిట్ చేశామన్నా.

 జగన్: మంచిది. పిల్లలను బాగా చది వించు. ఏకష్టమోచ్చినా నేను ఆదుకుంటా..
 కొంగరాపు శ్రీను తండ్రి రాములు: అయ్యా, మమ్మలను ఓదార్చేందుకు వచ్చావా.. చెన్నైలో నాకొడుకు భవనం కూలిన ఘటనలో చనిపోయాడు. మా కోడలు కూడా చావుబతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భగవంతుడు మా ఇంటికి అన్యాయం చేశాడు నాయనా..

 జగన్: ఈ పిల్లలెవరు..?
 రాములు: చనిపోయిన మా శ్రీను పిల్లలు. బాబు పేరు సాయి, పాప పేరు సుస్మిత.
 జగన్:  వారిని జగన్ అక్కున చేర్చుకు న్నారు. బాగా చదువుకోవాలంటూ సూచించారు.

 అక్కడే ఉన్న మీసాల శ్రీను భార్య సావిత్రి మాట్లాడుతూ ఈ మధ్యనే చెన్నైలో పనులకు వెళ్లాం. ఇంతలో భవనం రూపంలో మృత్యువు మా ఇంటి పెద్దదిక్కును తీసుకుపోయిందంటూ భోరున విలపించింది.

పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబును నిలదీసిన మహిళలు

హామీలిచ్చి డబ్బుల్లేవంటే ఎలా?
* పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబును నిలదీసిన మహిళలు
* నా వద్ద మంత్రదండం లేదు.. అయినా రుణమాఫీకి కట్టుబడి ఉన్నానన్న బాబు
* డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని వెల్లడి
* రైతులతో ముఖాముఖిలోనూ రుణ మాఫీపై ప్రశ్నించిన అన్నదాతలు
* డబ్బులు చెట్లకు కాయడంలేదు. సమస్య పరిష్కారానికి చూస్తా’ అంటూ సీఎం అసహనం


సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘మీరే కదా రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవంటే ఎలా’ అని పశ్చిమగోదావరి జిల్లాలో పలువురు మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. గురువారం నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం గ్రామాల్లో రైతులు, మహిళలతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. ఆయన ఆగిన ప్రతిచోట గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. సీతంపేటలో అనిశెట్టి పుణ్యవతి, మంగరాజు గంగారత్నం, తోటవరపు సీత తదితరులు బాబు కాన్వాయ్‌కు ఎదురుపడి రుణ మాఫీపై ప్రశ్నిం చారు. ‘కొంచెం సమయం ఇవ్వండి. ప్రస్తుతానికి రీషెడ్యూల్ చేస్తున్నాం.

ఇప్పుడైతే ఆదాయం లేదు. అప్పులే ఉన్నాయ్. నావద్ద మంత్రదండం లేదు’ అని అన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో జరిగిన ముఖాముఖిలో కూడా మహిళలు రుణ మాఫీపైనే ప్రశ్నించారు. వారికి బాబు సమాధానమిస్తూ.. ‘మీ కష్టాలు మీకుంటే నా కష్టాలు నాకున్నాయ్. అందరికీ న్యాయం చేద్దాంలే’ అని అన్నారు. ‘ఎన్నికల సమయంలో మీరే కదా హామీలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లేవం టే ఎలా’ అని నోముల దుర్గమ్మ గట్టిగా నిలదీసింది. కొయ్యలగూడెంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ డ్వాక్రా రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే కట్టిన వారికి, కట్టని వారికి మాఫీ చేస్తానని, అయితే టైం పడుతుందని చెప్పారు.

రాజధాని సంగతి తర్వాత.. రైతుల విషయం చూడండి
జంగారెడ్డిగూడెంలో జిల్లా అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష అనంతరం చంద్రబాబు నరసన్నపాలెంలో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. హైదరాబాద్ వంటి నగరాలు మూడు, నాలుగు నిర్మించే శక్తి ఉందంటూ సీఎం చెప్తుండగా.. టిడిపికే చెందిన మాజీ ఎంపీటీసీ కట్టా సత్యనారాయణ, మరికొందరు రైతులు కల్పించుకొని.. ‘రాజధాని సంగతి తర్వాత. ముందు మీరన్న రుణ మాఫీ, పొగాకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి’ అని అన్నారు.
 

హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా..

నరసన్నపాలెంలో రైతులతో జరిగిన ముఖాముఖిలో గంగరాజు అనే రైతు కరెంటు సమస్యను ప్రస్తావించారు. ‘గవర్నర్ పాలనలోనే 4 గంటలు కరెంట్ వచ్చేది. మీరు వచ్చిన తర్వాత రోజుకు 2 గంటలే ఉంటోంది’ అని ప్రశ్నించారు. దీంతో బాబు ఆగ్రహిం చారు. ‘ఏం మాట్లాడుతున్నావ్. కథలు చెప్పొద్దు’ అంటూ గదమాయించారు. ‘సార్ నేను చెబుతోంది నిజమే’ అని ఆ రైతు అనగా.. బాబుకు ఆగ్రహం మరింత పెరిగింది. ‘ఏయ్ నువ్ ఊరికే అరవొద్దు. నేను ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడతా. నీకు సమస్యలు వస్తాయ్.

నీ అడ్రస్ కనుక్కుని హైదరాబాద్ రప్పించి ఫైన్ వేస్తా’ అని ఒకింత బెదిరింపు ధోరణితో మాట్లాడారు. గంగరాజు మళ్లీ స్పందిస్తూ.. ‘రెండు రోజులుగా కరెంట్ సరఫరా సరిగా లేదు. మంగళవారం అయితే గంట కూడా రాలేదు’ అని తెగేసి చెప్పారు. ఇందుకు సంఘీభావంగా పక్కనున్న రైతులు పెద్దఎత్తున చప్పట్లు కొట్టారు. దీంతో బాబు ‘సరే.. నాకు పనుంది. డ్వాక్రా మహిళలతో కొయ్యలగూడెంలో సమావేశం ఉంది. నువ్వు అక్కడికి రా. నీ విషయం అక్కడ తేలుస్తా’ అంటూ ముందుకు సాగారు.

టీడీపీకి పోలీసుల వత్తాసు

టీడీపీకి పోలీసుల వత్తాసు
- మా జెడ్పీటీసీ అరెస్టు అక్రమం
- ఎమ్మెల్యేలపై కేసులు అన్యాయం
- పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని

 ఒంగోలు అర్బన్ : జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆరోపించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుట్ర కోణంలో భాగంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక రోజే తమ పార్టీ మార్కాపురం జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డిని డీఎస్పీ రామాంజనేయులుతో తెలుగు తమ్ముళ్లు అరెస్టు చేయించారని ధ్వజమెత్తారు.

వైఎస్సార్ సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నా జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు టీడీపీ ఎన్నో ఎత్తులు వేయగా పోలీసు యంత్రాంగం వాటికి సహకరించిందని నూకసాని విమర్శించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. టీడీపీ నాయకుల అండతో వైఎస్సార్ సీపీ నాయకులపై దౌర్జన్యాలకు దిగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
టీడీపీ కుట్రలకు వైఎస్సార్ సీపీ బ్రేక్
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయిందని బాలాజీ వ్యంగ్యంగా అన్నారు. తనను టీడీపీలో అణగదొక్కుతున్నారని, ఈ సారికి సహకరించాలని ఈదర హరిబాబు కోరినందునే వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఆయనకు అండగా నిలిచారని వివరణ ఇచ్చారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న ఉద్దేశంతోనే ఈదర కోరికను వైఎస్సార్ సీపీ అంగీకరించిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ సభ్యులు తన మాయలో పడ్డారని ఈదర హరిబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ఈదర మాటలు ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు ఉన్నాయని, సీనియర్ నాయకునిగా అలా మాట్లాడటం సరికాదని బాలాజీ హితవు పలికారు.

ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తోందని చెప్పారు. టీడీపీ దౌర్జన్యాలు, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం మానుకోకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలాజీ హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ ఉన్నారు.

రుణ మాఫీపై సర్కారుకు నెల గడువు

రుణ మాఫీపై సర్కారుకు నెల గడువు
ఆ తర్వాత రైతులతో కలసి ఆందోళన చేపడతాం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం
* రుణాల రీషెడ్యూల్ చేయడం పెద్దగొప్పా?.. ఆ పని ఏ ప్రభుత్వమైనా చేస్తుంది
* ప్రజలను మోసం చేసిన బాబూ మీపై 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా?


సాక్షి, శ్రీకాకుళం:
 ‘‘రుణ మాఫీ అనే అబద్ధపు హామీతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు ఇప్పుడు రైతులు, డ్వాక్రా సంఘాలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాఫీ ఊసెత్తకుండా రుణాలు రీషెడ్యూల్ చేస్తామని చెబుతున్నారు. రీషెడ్యూల్ చేయడం గొప్ప విషయమా? పదేళ్లుగా ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పుడు వరదలొచ్చినా, కరువులొచ్చినా రొటీన్‌గా రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నాయి. కానీ ఇదేదో గొప్ప అన్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో కాలయాపన చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులను బ్యాంకులు నోటీసులతో వేధిస్తున్నాయి. ప్రభుత్వం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.

కానీ మేం రైతుల వెంట ఉన్నాం. ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తాం. అప్పటికీ పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం. రైతులతో కలసి ఉద్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. ‘‘పిక్‌పాకెటింగ్ చేస్తే కేసు పెడతారు. చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడితే 420 కేసు పెడతారు.

మరి ఏకంగా ప్రజలను మోసం చేసి సీఎం సీటులో కూర్చున్న మీపై 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? అని రైతుల తరఫున మేం ప్రశ్నిస్తున్నాం’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రుణాల మాఫీపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

రూ.90 వేల కోట్ల రుణాల మాటేమిటి?
‘‘ఎన్నికల సంఘానికి ఏప్రిల్ 11న రాసిన లేఖలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అబద్ధమే ఆయన్ని సీఎంని చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణాలు మాఫీ చేయకుండా దారులు వెదుకుతున్నారు. మాఫీని పక్కనబెట్టి రుణాలు రీషెడ్యూల్ చేస్తామంటున్నారు. అదీ.. రూ. 10 వేల కోట్ల రుణాలు మాత్రమే రీషెడ్యూల్ అంటున్నారు.  మిగిలిన రూ.90 వేల కోట్ల గురించి ఏం చెబుతారు’’ అని జగన్ నిలదీశారు. మరోనెల చూస్తామని, ఆ తర్వాత రైతులమంతా ఏకమవుతామని, రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని చెప్పారు.

‘కూలి’న బతుకులను నిలబెట్టండి

సాక్షి,శ్రీకాకుళం: ‘‘మా బతుకులు బాగు చేయండి. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన మాకు అండగా నిలబడండి. ఇంటాయన పోయాక పిల్లలు అనాథలుగా మారారు. మాకు న్యాయం చేయండి. ఇక్కడ కూలి దొరక్క చెన్నైకి వలసపోయాం. రాష్ట్రంలో ఉపాధి జాబ్ కార్డులు ఇచ్చినా పని కల్పించడంలేదు.

అందుకే దిక్కులేక పరాయి ప్రాంతాలకు వలసపోతున్నాం’’ అని చెన్నైలో బహుళ అంతస్తుల భవనం, ఆ తర్వాత తిరువళ్లూరులో గోడ కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమయ్యాయి. వారి ఆవేదనకు జగన్ చలించిపోయారు. వారికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చెన్నై, తిరువళ్లూరు ఘటనల్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి కుటుంబాలను జగన్ గురువారం పరామర్శించారు.

సింహాచలం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ!

Written By news on Thursday, July 17, 2014 | 7/17/2014

సింహాచలం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ!
శ్రీకాకుళం: కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేందుకు.. బాధితుల బతుకు బాధలు తెలుసుకునేందుకు.. అండగా నేనున్నాంటూ తమిళనాడులోని చెన్నై భవనం కూలిన ఘటనలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి  శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.
 
తమిళనాడులోని చెన్నై సమీపంలో చోటు చేసుకున్న భవనం కూలిన దుర్ఘటనల్లో మృతి చెందిన జిల్లావాసుల కుటుంబాలను గురువారం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. 
 
శ్రీకాకుళం జిల్లాలోని పొల్లివలసలో సింహాచలం కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ  నియోజకవర్గాల పరిధిలో పొట్టకూటి కోసం వలస చెన్నై ప్రాంతానికి వెళ్లిన వారిలో 14 మంది భవనం కూలిన ఘటనలో చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
 
కొద్ది రోజుల వ్యవధిలోనే తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన దుర్ఘటనలో మరో 9మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. వీరి కుటుంబాలను జగన్ తన పర్యటనలో పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు.

ఒక్కొక్కరు ఒక్కోరకంగా...

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలని మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. రుణమాఫీపై మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేస్తుంటూ చంద్రబాబు మాత్రం సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ధర్మాన విమర్శించారు.  కాగా వ్యవసాయ రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతానికి రీషెడ్యూల్ మాత్రమే చేస్తామని, రుణమాఫీ గురించి తర్వాతే ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబుపై కుప్పం మహిళల ఆగ్రహం!

చంద్రబాబుపై కుప్పం మహిళల ఆగ్రహం!
కుప్పం: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను వూఫీ చేస్తావున్న చంద్రబాబునాయుడు ప్రకటన అమలు కాకపోవడంతో కుప్పం నియోజకవర్గంలోని మహిళలు ఆందోళన చెందుతున్నారు. రుణాలిచ్చిన బ్యాంకర్లు వసూళ్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారు. అసలుకు వడ్డీ వేసి కట్టాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారు. నిన్న మాఫీ చేస్తామని చెప్పి నేడు కట్టమంటే ఎలా అంటూ డ్వాక్రా మహిళలు సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకర్లు,  ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సిబ్బంది నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక లబోదిబోమంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మా నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు సీఎం అయినందుకు సంతోషించామని, రుణమాఫీపై ఎటూ తేల్చకుండా ఇలా ఏడిపిస్తున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. 
 
 చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా డ్వాక్రా సంఘాలకు  రూ. 133.33 కోట్ల రుణాలు ఇచ్చారు.  ఐకేపీలో బ్యాంకు లింకేజ్ ద్వారా రూ. 67.42 కోట్లు, గ్రావు సవూఖ్య ద్వారా రూ. 6.44 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ. 59.42 కోట్లను 3,705 సంఘాలకు పంపిణీ చేశారు. అయితే చంద్రబాబు ప్రకటనతో ఈ రుణాలన్నీ వూఫీ అవుతాయున్న ఆశతోనే నాలుగు నెలలుగా మహిళలు రుణాలు చెల్లించడం లేదు. రుణాల వూఫీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయుం రాకపోవడంతో రుణాలు వసూలు  చేసేందుకు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిళ్లు తెస్తున్నారు. 
 
 డ్వాక్రా వుహిళలు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు వూత్రమే రుణవూఫీకి వర్తిస్తాయుని మిగిలిన స్త్రీనిధి, గ్రావు సవూఖ్యల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాల్సిందేనంటూ ఐకేపీ అధికారులు గ్రామాలలో తిరుగుతూ హెచ్చరిస్తున్నారు.  ఓ వైపు అధికారుల ఒత్తిళ్లు, వురోవైపు పెరిగిన అప్పు, వడ్డీలు డ్వాక్రా వుహిళలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో ఏర్పడిన కరువు కారణంగా రుణాలు చెల్లించడం సాధ్యం కాదంటూ వుహిళలు తేల్చి చెబుతున్నారు. 
 
 చెల్లించకుంటే పంచాయుతీ పెడతావున్నారు
 డ్వాక్రా సంఘంలో రూ. 50 వేలు రుణం తీసుకున్నాను. అందులో రూ. 10 వేలు కట్టేశాను. రుణవూఫీ అవుతుందని వుూడు నెలలుగా చెల్లించలేదు. ఇప్పుడు అప్పును వడ్డీతో సహా కట్టాలని వూ ఊర్లోని వీవో లీడరు చెబుతోంది. కూలీ చేసుకుని జీవిస్తున్న తవుకు ఒక్కసారిగా అంత డబ్బు కట్టవుంటే కష్టమే. డబ్బు కట్టకుంటే పంచాయుతీ పెడతావుని చెబుతున్నారు. పంచాయుతీ పెడితే అవవూనవుని పెద్దోళ్లకు చెబుతావుని ఇక్కడకు వచ్చాను.
 - రాజవ్ము, డ్వాక్రా వుహిళ, గుండ్లవుడుగు, కుప్పం
 
 అధికారులు దయ చూపాలి
 తీసుకున్న రుణం రెండు రోజుల్లో చెల్లించాలంటూ ఊర్లోకి అధికారులంతా వస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. అసలే కరువు కాలంలో ఇప్పటికిప్పుడు చెల్లించమంటే ఎక్కడనుంచి తెచ్చేది. పంచాయుతీ పెట్టి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా వసూలు చేస్తావుని చెబుతున్నారు. కూలీ చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఒకేసారి అంతమొత్తం చెల్లించలేని పరిస్థితి వూది. అధికారులు వూపై దయు చూపాలి.
 - అలివేలు, డ్వాక్రా వుహిళ, గుండ్లవుడుగు, కుప్పం
 
 ఒకేసారి మొత్తం చెలించవుంటే ఎలా?
 ఎన్నికలప్పుడు రుణవూఫీ చేస్తావుని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో అధికారులు వుూడు నెలలుగా అసలుకు వడ్డీ వేసి ఒకేసారి కట్టవుంటున్నారు. ఇలా అరుుతే వేలాది రూపాయులు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు. రుణవూఫీ వువ్ముల్ని చివరకు రోడ్డుపాలు చేసింది.  ఇప్పుడు ఏ రుణాన్ని వూఫీ చేస్తారో తెలియుడం లేదు. బ్యాంకు లింకేజా, స్త్రీ నిధా, గ్రావు సవూఖ్యదా అనేది తెలియుడం లేదు. అధికారులనుంచి ఒత్తిళ్లు పెరిగారుు.
 -సుజాత, డ్వాక్రా వుహిళ, శాంతిపురం

ఉన్న ఉద్యోగాల్ని తీసివేస్తున్నారంటూ ఆవేదన

'..ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తున్నారు'
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం వెంకంపేటగోరీలు వద్ద స్థానిక రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు పంటల పంటల రుణమాఫీ చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలపై జగన్‌తో మహిళలు మాట్లాడారు.

పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్ జగన్‌ను ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు కలిశారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాల్ని తీసివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తమను ఎస్టీల్లో చేర్చాలంటూ జగన్ ను రజకులు కోరారు.

టీడీపీ అరాచకాలకు అడ్డు లేదా?

Written By news on Wednesday, July 16, 2014 | 7/16/2014

టీడీపీ అరాచకాలకు అడ్డు లేదా?
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండాపోతోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నిక జరుగుతున్న తీరుపై హైకోర్టులో కేసు దాఖలు చేసిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై నెల్లూరు పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం నాడు ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయవాదినే అపహరించే స్థాయికి దిగజారితే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. టీడీపీ అక్రమాలపై కేసులు వేయడమే సుధాకర్‌రెడ్డి చేసిన తప్పా అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని జిల్లాల పర్యటన చేస్తున్నారని, ఆయన చేసిన ఐదు సంతకాలు ఐదు అబద్ధాలుగా మారాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ కరువు వస్తుందని ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీలు చిత్తశుద్దితో అమలు చేయాలని చంద్రబాబుకు సూచించారు.

Popular Posts

Topics :