20 July 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్

Written By news on Saturday, July 26, 2014 | 7/26/2014

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్
హైదరాబాద్: రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ హెచ్.ఎ. రెహమాన్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందులో మతసామరస్యం వెల్లివిరిసింది. శుక్రవారం సాయంత్రం కింగ్‌కోఠిలోని ఈడెన్ గార్డెన్‌లో జరిగిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.  జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ముస్లిం మత పెద్దలు, హెచ్.ఎ. రెహమాన్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, విజయచందర్, నల్ల సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, ఉర్దూ అకాడమీ మాజీ అధ్యక్షుడు నూరుల్లా ఖాద్రీలు ఈ విందులో పాల్గొన్నారు.

అందరి సహకారంతో అభివృద్ధి

Written By news on Friday, July 25, 2014 | 7/25/2014

అందరి సహకారంతో అభివృద్ధి
 నెల్లూరు(పొగతోట): రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో 14వ చైర్మన్‌గా ఆయన  గురువారం ఉదయం 11.15 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. పండితులు వేదమంత్రాలు జపించి బొమ్మిరెడ్డిని ఆశీర్వదించారు.
 
 జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు. గతంలో తాను ఏఎస్‌పేట జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా పని చేశానని, జిల్లా పరిషత్ పాలనపై అవగాహన ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు, రోడ్లు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని బొమ్మిరెడ్డి చెప్పారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో తనకు సహకరించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయడంలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించే ధర్నా కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ఈ ఆందోళనల్లో ఎక్కువ మంది పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బొమ్మిరెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మంచి వ్యక్తి అన్నారు. జిల్లాలో సుపరిపాలన అందించగల సత్తా బొమ్మిరెడ్డికి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి పి. నారాయణ, 10 మంది ఎమ్మెల్యేలు కలసి పని చేయాలని పిలుపునిచ్చారు. రాగద్వేషాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు.
 
 గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ 23 మంది జెడ్పీటీసీ సభ్యులు తమ వెన్నంటి ఉండి అఖండ విజయాన్ని అందించారన్నారు. బెదిరిం పులకు భయపడక, ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా తమ వెన్నంటి ఉన్న జెడ్పీటీసీ సభ్యులు ఆణిముత్యాలన్నారు. నిరుపేదలైన బీసీ, ఎస్‌సీ, ఎస్ టీ జెడ్పీటీసీ సభ్యులు తమకు అండగా నిలిచారన్నారు. కోటీశ్వరులైన సభ్యులు ఏ విధంగా ప్రవర్తించారో ప్రజలకు తెలుసునన్నారు. నెల్లూరు నగర, సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల ఉద్యోగులు బొమ్మిరెడ్డికి అభినందనలు తెలిపారు.
 
 మొదటి సంతకం మహిళాభివృద్ధికే...
 జెడ్పీ సీఈఓ జితేంద్ర సమక్షంలో చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తన మొదటి సంతకం మహిళాభివృద్ధి కోసమే చేశారు. మహిళా ప్రాంగణంలోని భవనాల మరమ్మతుల కోసం రూ.5 లక్షల గ్రాంటు మంజూరు చేస్తూ సంతకం చేశారు.

చెవిరెడ్డి జోరు.. తమ్ముళ్ల బేజారు

చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎత్తుగడతో తెలుగుతమ్ముళ్లు నవ్వులపాలయ్యారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై ముఖ్యమంత్రి చంద్ర బాబు తీరుకు నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘నరకాసుర వధ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో దంద్రగిరి టవర్ క్లాక్ వద్ద గురువారం నిరసన చేపట్టారు. తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు ప్రయత్నించారు. దీనిని తెలుగు తమ్ముళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోటీగా వ్యతిరేక నినాదాలు చేశారు.

తమ్ముళ్లతోపాటు పోలీసులు దిష్టిబొమ్మను తగలబెట్టకుండా అడ్డుకున్నారు. ఇక్కడే చెవిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి టీడీపీ నేతలు వస్తారని భావించిన ఎమ్మెల్యే రైతులు, మహిళలు, పార్టీ నాయకులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ విషయం తెలీని తమ్ముళ్లు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల వెనక టీడీపీ జెండాలు పట్టుకుని చంద్రగిరిలో వీధులన్నీ తిరిగారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎక్కడికి వెళుతున్నారు? ఎందుకు వెళుతున్నారో తెలీక సుమారు రెండు గంటలపాటు వీధుల్లో ఆయన వెంట తమ్ముళ్లు, పోలీసులు తిరిగారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, టీడీపీ నేతలు కలిసి నిరసన తెలుపుతున్నారేమోనని స్థానికులు ఆసక్తిగా చూశారు. చివరకు టీడీపీలోని ఓవర్గం నాయకుడు చెవిరెడ్డి వ్యూహాన్ని గుర్తించాడు.

చెవిరెడ్డి మనచేత ర్యాలీ చేయిస్తున్నారంటూ ఆయన వెంట వెళ్లవద్దని చెప్పాడు. నువ్వెవడ్రా చెప్పేదని మరో వర్గం వీరిపై దాడికి దిగారు. దీంతో టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. చెవిరెడ్డి ఎత్తుగడలో పావులై నవ్వులపాలయ్యామని వారికి ఎప్పటికో అర్థమయింది. అప్పటికే సమయం మించిపోయింది.
 

ఊరూరా నరకాసుర వధ..

ఊరూరా నరకాసుర వధ..
సాక్షి యంత్రాంగం: రైతన్న ఆగ్రహించాడు. రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు...కమిటీలని కాలయాపన చేస్తూ... రోజుకో మాట మారుస్తుండటంపై అన్నదాత అగ్రహోదగ్రుడయ్యాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘నరకాసుర వధ’ నిర్వహించారు.

ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపుల నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణుల్ని, రైతుల్ని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్న వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకుని వీరంగం సృష్టించినా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ఎందరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా రైతులు మాత్రం భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

నిరసనల హోరు...
ఉత్తరాంధ్రలో రైతులు కదం తొక్కారు.  శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రం లోనూ ఈ ఆందోళనలు సాగాయి. శ్రీకాకుళం టౌన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాలకొండ, పాతపట్నం, రాజాంలో ఈ ఆందోళనలకు ఎమ్మెల్యేలు కళావతి, కలమట వెంకటరమణ, కంబాల జోగులు నాయకత్వం వహించారు. విజయనగరం జిల్లా సాలూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి బాబు దిష్టిబొమ్మ దహనం చేశారు.

కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి, చోడవరం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మల్ని ఊరేగించి, దహనం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమాశంకర్‌గణేష్, మాడుగుల ఎమ్మెల్యే  ముత్యాలనాయుడు, చింతపల్లి ఎమ్మెల్యే ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే బాబ్జీ వీటికి నేతృత్వం వహించారు. తూ.గో.జిల్లా ఆత్రేయపురంలో వందల మంది రైతులు పాల్గొన్న ధర్నాలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.

కోటనందూరు సెంటర్లో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అడ్డతీగల సెంటర్లో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, గొల్లప్రోలులో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దహనం చేశారు. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మినహా మిగిలిన 14 అసెంబ్లీ స్థానాల్లోనూ, గుంటూరు నగరంలోనూ రైతులు ఆందోళనబాట పట్టారు.

కృష్ణాజిల్లా పామర్రులో... అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన నేతత్వంలో ధర్నా నిర్వహించగా టీడీపీ అడ్డుకుంది. విజయవాడ శివారు కండ్రికలో రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా నిరసన తెలపగా దీనికి వైఎస్సార్ పార్టీ నేత గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, టీపీ గూడూరు, ముత్తుకూరు మండలాల్లో తొలిరోజు ‘నరకాసుర వధ’ నిర్వహించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గురువారం తీవ్రస్థాయిలో ‘నరకాసుర వధ’ నిర్వహించారు.  కదిరి అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే చాంద్ బాషాతోపాటు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పీవీ సిద్ధారెడ్డి తదితరుల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

వైఎస్సార్ కడప జిల్లాలో ఎమ్మెల్యే అంజద్‌బాషా సారథ్యంలో ఏడురోడ్ల వద్ద ఆందోళనకు దిగిన రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ నేత ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డికి, పోలీసులకు తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. పులివెందుల నియోజకవర్గం లింగాలలోని పెద్దకూడాలలో ఎంపీపీ, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు.

బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఆధ్వర్యంలో నరకాసుర వధ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనను, టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగుకాళ్ల మంటపం వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని రైతులు, మహిళలు ధర్నాలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వాలైనా రైల్వేగేట్లు పెట్టించాలి: వైఎస్ జగన్

Written By news on Thursday, July 24, 2014 | 7/24/2014

రాష్ట్ర ప్రభుత్వాలైనా రైల్వేగేట్లు పెట్టించాలి: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
మెదక్ : మెదక్ జిల్లాలో స్కూలుబస్సును రైలు ఢీకొన్న ప్రాంతంలో రైల్వే గేటు కావాలని అక్కడి ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా రైల్వేశాఖ, వాళ్లు చేయకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా ముందుకొచ్చి కాపలా లేని రైల్వేక్రాసింగులు ఉన్నచోటల్లా కాపలాతో కూడిన గేట్లు పెట్టించాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దాదాపు 20 మంది చిన్నారులు మరణించిన సంఘటన స్థలం వద్దకు ఆయన గురువారం ఉదయమే వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

''ఇది చాలా బాధాకరం. 20 మంది పిల్లలు మరణించారు. అక్కడకు వెళ్లి చూసినప్పుడు వాళ్ల పుస్తకాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. ఒక పుస్తకం చూస్తే, ఆ పిల్లాడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంతమంది పిల్లలు చనిపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. అక్కడ గేటు కావాలని స్థానికులు మూడుసార్లు ధర్నాలు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి గేటులేని క్రాసింగులు చూస్తే, ఆ ఒక్క సెక్షన్ లోనే మూడున్నాయి. రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా చూడాలి. గేటులేని ప్రతిచోటా గేట్లు పెట్టించే కార్యక్రమాలు రైల్వేశాఖ చేస్తుందో లేదో తెలీదు గానీ.. వాళ్లు చేయాలి. లేనిపక్షంలో మనం మన పిల్లలని మనసులో పెట్టుకుని.. అవసరమైతే రెండువేల కోట్లో.. లేదంటే ఎంతోకొంత బడ్జెట్ కేటాయించి ప్రతిచోటా మ్యాన్డ్ గేట్లు పెట్టించాలని, నాలుగు అడుగులు ముందుకేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇక్కడ ఎవరినో విమర్శిస్తే ఏమీ లాభం లేదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనమేం చేయాలో ఆలోచించాలి. అక్కడ ఆరేడేళ్ల వయసున్న పిల్లలున్నారు. వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండాప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ భయపడే స్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలి. ఇందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చినట్లు విన్నాను. దాంతో సరిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా నష్టపరిహారం కోసం ప్రయత్నించాలి. ఇక్కడ కూడా పెద్దలైతే 5 లక్షలు సరిపోవచ్చేమో గానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు మరణించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాను. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ప్రభుత్వం కూడా మానవత్వం ప్రదర్శిస్తే మంచిది. పార్టీ తరఫున కూడా చేయాల్సిందంతా చేస్తాం'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు వైఎస్ జగన్ పరామర్శ

కన్నబిడ్డలను పోగొట్టుకుని దుఃఖసాగరంలో ముగినిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న వారిని జగన్ ఓదార్చారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు గురువారం ఉదయం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును ఢీకొన్న విషయం తెలిసిందే.

చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యం.. ఉద్రిక్తత

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరిలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రుణ మాఫీ చేయాలంటూ తహసిల్దార్ కిరణ్ కుమార్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో కొంతమంది నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. అయితే, వైఎస్ఆర్ సీపీ నాయకుల నుంచి వినతిపత్రం తీసుకుంటారా అంటూ తహసిల్దార్ పై తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు చెయ్యి చేసుకున్నారు. అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.

దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులపై చర్య తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. వారికి పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. పోటాపోటీ ధర్నాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

రాజధాని నడిమధ్యన ఉండాలి: వైఎస్ జగన్‌

రాజధాని నడిమధ్యన ఉండాలి: వైఎస్ జగన్‌
 కనీసం 30,000 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండే చోటే నిర్మించాలని ఏపీ ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన
► సమృద్ధిగా మంచి నీటి లభ్యత అవసరం
► విశాలమైన నగరం అయితేనే అందరికీ గృహ వసతి కల్పించగలం
► రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేస్తోంది
► కృష్ణా-గుంటూరు మధ్యన నెలకొల్పినా వివాదాస్పదమే అవుతుంది
► రోడ్ల విస్తరణ కోసం ప్రజల విలువైన స్థలాన్ని తక్కువ పరిహారంతో సేకరిస్తోంది

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాష్ట్రం నడి మధ్యన ఉండాలని, కనీసం 30 వేల ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండే చోటే నిర్మించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్ బుధవారం పలు జాతీయ టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి ప్రధానంగా మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రం నడిమధ్యన రాజధాని ఉండాలి. 30 వేల ఎకరాల ఖాళీ స్థలం ఉండే చోట నిర్మించాలి. సమృద్ధిగా మంచి నీటి లభ్యత ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ అంశాలనే ప్రధానంగా చూసుకోవాలి’ అని చెప్పారు. సీఎం చంద్రబాబు మాత్రం ఒక నిర్దేశిత ప్రాంతంలోనే రాజధాని రావాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఆయనే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
 
‘రాజధాని ఎక్కడైనా పెట్టండి. మాకు అభ్యంతరం లేదు, అయితే కచ్చితంగా రాష్ట్రం నడిమధ్యన ఉండేలా చూడండి. కనీసం 6 కిలోమీటర్ల వ్యాసార్థం గల ప్రదేశంలో ఎటు చూసినా ఆరు కిలోమీటర్ల పొడవున రాజధాని విస్తరించి ఉండాలి. ఎందుకంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి ముఖ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి. 12 కిలోమీటర్ల పొడవు అంటే 144 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని నగరం నిర్మించే విధంగా ఉండాలి. దీన్ని ఎకరాల్లోకి మారిస్తే కనీసం 30 వేల ఎకరాలవుతాయి. విశాలమైన నగరం ఉంటే గానీ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ(పేదలు) నివాస వసతి కల్పించలేం. స్థలం లేకుంటే ఇరుకైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ లేక ఇబ్బందులు పడతాం. అందుకే తగినంత భూమి లేని చోట రాజధాని నిర్మించడం ఏమాత్రం సమంజసం కాదు’ అని జగన్ పేర్కొన్నారు.
 
వారికి లభించే పరిహారం పిసరంతే!: ‘చంద్రబాబు స్వయంగా సింగపూర్‌లాంటి రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. సింగపూర్ 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరం 960 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. నూతన రాజధాని నిర్మించుకోవడానికి కనీసం 144 చదరపు కిలోమీటర్లయినా కావాలి కదా?’ అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ ఏమీ అడగలేదని.. అంతా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ప్రతిపాదనలపై ప్రశ్నించగా.. ‘అక్కడ పెట్టినా వివాదాస్పదమే అవుతుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా అక్కడి వారు తమ ఇళ్లను కోల్పోవాల్సి ఉంటుంది. రోడ్లను వెడ ల్పు చేసే కార్యక్రమంలో భాగంగా వారి అనుమతి లేకుండానే ప్రజల ఖరీదైన స్థలాలను ప్రభుత్వం తీసుకోవచ్చు. దానికి బదులుగా వారికి లభించే పరిహారం పిసరంతే ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
 
ఇళ్లు కోల్పోయిన వారు ఇంకొక చోట కొనాలన్నా సాధ్యమయ్యే పనికాదు. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యన రాజధాని ఏర్పాటు చేయాలన్నా కనీసం 30 వేల ఎకరాల ఖాళీ స్థలంతో ముందుకు వస్తే మంచిది. రాష్ట్రం నడిమధ్యన లేకుంటే మాత్రం అది రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. ఈ విషయంలో ఇప్పుడేదో తొందరలో చేసేసి.. ఆ తరువాత చింతించినా ప్రయోజనం ఉండదు’ అని జగన్ చెప్పారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నూతన రాజధానికి అవసరమైతే నిర్దేశించిన స్థలాలను డీనోటిఫై చేయడానికి కూడా అవకాశం కల్పించారు కనుక దీన్ని సైతం ఉపయోగించుకోవాలని సూచించారు.

 జగన్ గుంటూరు పర్యటన రద్దు

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే రుణమాఫీపై సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ 24 నుంచి మూడు రోజులపాటు గ్రామాల్లో బాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు.

జగన్ గుంటూరు పర్యటన రద్దు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే రుణమాఫీపై సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ 24 నుంచి మూడు రోజులపాటు గ్రామాల్లో బాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు.

దొంగలను పట్టించిన 'లవ్ సింబల్స్'

  • దళితులపై టీడీపీ నేతల కక్ష
  • కమ్యూనిటీ భవనానికి తాళాలు
చిలకపాడు, (సంతనూతలపాడు): టీడీపీకి  కాకుండా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే నెపంతో తమపై వివక్ష చూపుతున్నారని..దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..చిలకపాడులో దళిత విద్యార్థులు చదువుకునేందుకు 2011లో పనబాకలక్ష్మి ఎంపీ నిధులతో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతానికి చెందిన దళితులు వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారనే కారణంతో టీడీపీ నాయకులు సహించలేకపోయారు. అంబేద్కర్ భవనాన్ని ఖాళీ చేయించాలని పన్నాగం పన్నారు. అధికారులను అడ్డుపెట్టుకుని ఆ భవనం అంగన్‌వాడీ కేంద్రానికి కావాలంటూ పంచాయతీలో తీర్మానం చేశామని..ఆ భవనంలోని దళిత విద్యార్థులు వెంటనే ఖాళీ చేయాలని పట్టుబట్టారు. స్థానిక టీడీపీ నాయకులు బుధవారం అకస్మాత్తుగా వచ్చి తాళాలు వేసుకునే క్రమంలో కొంతసేపు దళితులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

దళితులను బెదిరించి..భవనానికి తాళాలు వేసుకుని ఎవరైనా తాళాలు పగులగొడితే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయిస్తామని హుకుం జారీ చేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి గొడవలు పెంచుకోవద్దని, ఏవైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి వె ళ్లారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో విద్యార్థుల మెటీరియ ల్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని దళిత విద్యార్థులు వాపోయారు. ఈ విషయం చెప్పినా..టీడీపీ నాయకులు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దళిత విద్యార్థులు మాట్లాడుతూ మంగళవారం తహసీల్దార్‌కు, ఎంపీడీవోకు టీడీపీ వారు చేస్తున్న దారుణాలపై వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫ్యాక్స్ చేశామని, గురువారం కలెక్టర్‌కు, ఎస్పీకి టీడీపీవారి అక్రమాలపై వినతిపత్రం ఇస్తామని తెలిపారు. కమ్యూనిటీ భవనం ముందు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు.  దీనిపై మద్దిపాడు సీడీపీవో విజయలక్ష్మిని సాక్షి సంప్రదించగా..గ్రామంలో అంగనవాడీ కేంద్రానికి గది ఎక్కడ కేటాయించినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని, అంబేద్కర్ భవనాన్నే ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పలేదని అన్నారు.

స్కూల్ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి!

స్కూల్ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి!
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం మసాయి పేట రైలు ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనాస్థలంలో పార్టీ నేతలు సహాయచర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్‌ ఆదేశించారు. 
 
వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26మంది విద్యార్థులు మృతి చెందారు. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లందరూ మరణించినట్టు సమాచారం.  రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది.  వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద  ఓ  ప్రయివేట్ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26మంది విద్యార్థులు మృతి చెందారు. రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ పాఠశాలకు చెందిన బస్సును ఓ రైలు ఢీకొంది ఈ ప్రమాదం జరిగినప్పుడు  బస్సులో మొత్తం 30మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

 కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.  రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు

బాబు దగాపై దండెత్తుదాం: ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
 చంద్రబాబు రుణమాఫీ మోసంపై ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
► నేటి నుంచి మూడు రోజులపాటు అన్ని గ్రామాల్లో బాబు దిష్టి బొమ్మల దహనం
రైతన్నలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం అన్ని పార్టీలూ ముందుకు రావాలని విజ్ఞప్తి
రైతులు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని బాబు రెండు రాష్ట్రాల్లోనూ హామీ ఇచ్చారు
రెండు రుణాలూ కలిపి ఏపీలోనే 1,01,816 కోట్లు ఉన్నట్లు బ్యాంకర్లు బాబుకే చెప్పారు
బాబేమో రూ.30, 35 వేల కోట్లే మాఫీ అంటున్నారు..     అదీ ఎప్పుడో చెప్పడం లేదు
 సకాలంలో రుణం చెల్లించకపోతే రైతులపై పడే రూ.13 వేల కోట్ల వడ్డీ ఎవరు కడతారు?
► బాబు పుణ్యామా అని రైతులు పంటల బీమానూ కోల్పోతున్నారు


చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రతి మీటింగులో ‘రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను.    బాబు వస్తాడు.. జాబు వస్తుంది’ అని మాట్లాడారు. ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనేముంది అని చెప్పి.. ఇవాళ కొత్త రుణాలు కావాలంటే పాత రుణాలు చెల్లించండి.. చెల్లించకపోతే మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. మీరే ఇవాళ రుణాలు చెల్లించండి.. ఆ తర్వాత కుదిరితే మేం ఇస్తామంటున్నారు. అంటే కుదరకపోతే మీరివ్వరనేగా దానర్థం.  సీఎం అయ్యాక  బాబు అధ్యక్షతన ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్ జరిగింది. దీనిలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లని, డ్వాక్రా రుణాలు 14,204 కోట్లని బ్యాంకర్లు నివేదికిచ్చారు. రెండూ కలిపితే మాఫీ చేయాల్సిన రుణాలు 1,01,816 కోట్లు ఉంటే.. మీరేమో రూ.30-35 వేల కోట్లే మాఫీ చేస్తాననడం మోసం కాదా?
- వైఎస్ జగన్


సాక్షి, హైదరాబాద్ : రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వంచనకు పాల్పడుతున్న చంద్రబాబునాయుడుపై ఉద్యమించాలని, రుణాలన్నింటినీ మాఫీ చేసేలా ఆయనపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘నరకాసుర వధ’ పేరుతో చంద్రబాబునాయుడి దిష్టి బొమ్మలను దహనం చేయనున్నట్లు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతన్నలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం అన్ని పార్టీలూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తున్నదొకటి అని ధ్వజమెత్తారు. రుణ మాఫీపై రోజుకో విధంగా అబద్ధాలాడుతూ రైతులు, బ్యాంకుల చెవుల్లో పూలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
(రుణమాఫీపై చంద్రబాబు చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగ్‌లను బుధవారం హైదరాబాద్‌లో మీడియాకు చూపుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు సత్యారావు, సోమయాజులు) 

ఎన్నికలు జరిగినప్పుడు నేను పదే పదే అంటూ వచ్చాను. ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగే ఎన్నికలని చెప్పాను. నిన్న మొన్న జరిగిన పరిస్థితులను గమనిస్తే, చంద్రబాబునాయుడుగారి నోటి నుంచి వచ్చిన మాటలను ఒక్కసారి వింటే.. ఇది నిజమని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరంలేదు. చంద్రబాబునాయుడుగారు మాటిమాటికీ అంటున్నారు.. రాష్ట్రం విడిపోయిందని, ఆర్థిక సంక్షోభం ఉందని, కాబట్టి తాను రుణాలు మాఫీ చేయలేకపోతున్నాడు అన్నట్టుగా రకరకాల సంజాయిషీలు, మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం విడగొడుతున్నప్పుడు, అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా దగ్గరుండి మరీ ఎందుకు ఓటు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టాడని అడుగుతున్నా. చంద్రబాబులాంటి వ్యక్తి, జగన్‌లాంటి వ్యక్తి రాష్ట్ర పరిస్థితులెలా ఉంటోయో తెలియని వారు కాదు. చంద్రబాబుగారికి బాగా తెలుసు రాష్ట్ర పరిస్థితి ఏమిటని. తెలిసిన తర్వాతే, పార్లమెంటులో తాను స్వయంగా ఓటేసి రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత చంద్రబాబుగారు రెండు రాష్ట్రాలకు విడివిడిగా రెండు మేనిఫెస్టోలు విడుదల చేశారు. పూర్తిగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని రెండింట్లోనూ చెప్పారు. ఏ మేనిఫెస్టోలోను, ఏ సందర్భంలోనూ ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఈ మేనిఫెస్టోలు విడుదల తర్వాత చంద్రబాబు ఏప్రిల్ 11న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఈ హామీలను నెరవేరుస్తానని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వనరుల మీద పూర్తి అవగాహన ఉందని ఆ లేఖలో చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడుగారు తన మనుషులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లేట్టు చేశారు. ‘అమ్మా మీకెంత రుణాలున్నాయమ్మా... మీ ఇంట్లో డ్వాక్రా రుణాలున్నాయా.. వ్యవసాయ రుణాలున్నాయా.. బంగారు రుణాలు తెచ్చి పెట్టుకున్నారామ్మా.. లేకపోతే బంగారం పెట్టి రుణాలు తెచ్చుకోండమ్మా.. మీకింకా రుణాలు వస్తాయమ్మా.. మీ ఇంట్లో ఇంత మందున్నారా.. 4 లక్షలు రుణాలు మాఫీ అవుతాయమ్మా.. చంద్రబుబునాయుడుగార్ని తెచ్చుకోండమ్మా.. మీ రుణాలన్నీ మాఫీ చేస్తారమ్మా’ అని చెప్పి ఇంటింటికీ  చంద్రబాబు సంతకం చేసిన కరపత్రం ఇచ్చారు. ఆ కరపత్రంలో ఆయనన్నారు.. ‘రైతుల రుణాలు మాఫీపైన నా మొట్టమొదటి సంతకం చేస్తాను. 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తాను. ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్కచెల్లెమ్మలు బాగుండాలి. అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను అని. ఇంకా.. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తాను.. ఇవ్వలేకపోతే 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని దాంట్లో అన్నాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈనాడు దినపత్రికలో వచ్చి పెద్ద ప్రకటనలో కూడా చంద్రబాబునాయుడుగారు ఇవే చెప్పారు.

రుణాల లెక్కలు బ్యాంకర్లు చెప్పారుగా..
వ్యవసాయ రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు అనే మాటలకు వస్తే.. చంద్రబాబుగారికి, జగన్‌మోహన్‌రెడ్డిగారికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పడానికి అవకాశం లేదు. కారణమేమిటంటే ప్రతి మూడు నెలలకోసారి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) మీటింగులు జరుగుతుంటాయి. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రే అధ్యక్షత వహిస్తారు. అక్కడ రుణాలపై నివేదికలు ఇస్తారు. నెట్‌లో ఉంటాయి. డౌన్‌లోడ్ చేస్తే వస్తాయి. (181, 184 ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల నివేదికలను జగన్ చూపారు.) ఇవన్నీ తెలిసే చంద్రబాబుగారు ఎన్నికల వేళ తానివ్వాల్సిన హామీలన్నీ ఇచ్చారు. అదొక్కటే జరగలేదు.. చంద్రబాబునాయుడుగారు ఎన్నికలప్పుడు ఓ 50 మీటింగుల్లో మాట్లాడారు. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పారు. బాబు వస్తాడు రుణాలన్నీ మాఫీ చేస్తాడు, బాబు వస్తాడు జాబు వస్తుందని ప్రచారం చేశారు. (బాబు ప్రచారం డీవీడీ కాపీలను జగన్ విలేకరులకు ప్రదర్శించారు). ఇక 184వ ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబే అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్‌లో రుణాలపై బ్యాంకర్లు చాలా స్పష్టంగా చెప్పారు. వ్యవసాయ రుణాలు 87,612 కోట్ల రూపాయలని, డ్వాక్రా రుణాలు  14,204 కోట్లు చెప్పారు. రెండూ కలిపితే 1,01,816 కోట్ల రూపాయలు. రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి రైతులకు పంటల బీమా వర్తించదని అదే మీటింగ్‌లో బ్యాంకర్లు చెప్పారు.

రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇంతవరకు పావలా వడ్డీకే రుణాలున్న పరిస్థితి నుంచి 12.5 శాతం నుంచి 13 శాతం వడ్డీలు కట్టవలసిన పరిస్థితిలోకి ఇవాళ రైతాంగం పోతోంది అని చెప్పారు. నేనడగదల్చుకున్నా చంద్రబాబునాయుడుగార్ని.. అయ్యా.. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మొత్తంగా 1,01,816 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు 184వ ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో మీకే చెప్పారు. దీన్ని మీరెందుకు తగ్గిస్తున్నారు అని నేను అడగదల్చుకున్నా. మీరెందుకయ్యా కోటయ్య కమిటీ వేశారు? మీ ఎజెండాని కోటయ్య కమిటీ చేత చెప్పించే ప్రయత్నం చేసి, ఎందుకు ఇవాళ మీరు పరిమితులు పెట్టి ఎందుకు రుణాలను తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ఈ రకంగానే తాను చేయాల్సింది చేయకుండా.. కేవలం 2012-13లో తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ఒక మంత్రి చెప్పేసరికి.. ప్రతి గ్రామంలో దిష్టిబొమ్మలు దహనం చేశారు. దిష్టి బొమ్మలు దహనం చేసిన వారిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమూ ఉన్నాం. బీజేపీ ఉంది. కాంగ్రెస్ ఉంది. అన్నీ పార్టీలూ ఉన్నాయి. వెంటనే కేసీఆర్‌గారే వచ్చి.. మాట తప్పడంలేదని చెప్పారు. 2012-13లో తీసుకున్న రుణాలనే మాఫీ చేస్తామన్న మాట వెనక్కి తీసుకున్నారు. అక్కడ కేసీఆర్‌గారు మాట తప్పినప్పుడు.. మాట తప్పితే ఒప్పుకొనేది లేదు అన్చెప్పి మీరు అన్నారు. బీజేపీ అంది, మేమన్నాం.. ప్రతి ప్రతిపక్ష పార్టీ అంది. మరి మీ దాకా వచ్చేసరికి.. పట్టపగలు ఈ మాదిరిగా మీరు మోసం చేస్తుంటే.. దాదాపు లక్షా రెండు వేల కోట్లు ఉన్న రుణాలను 30, 35 వేల కోట్లకు తగ్గిస్తామని నిస్సిగ్గుగా మీరు చెప్తుంటే మీకు ఇది వర్తించదా?

ఏ కేసు పెట్టాలో మీ మనస్సాక్షిని అడగండి బాబూ
మొన్న శ్రీకాకుళం, ఇంకా పలు చోట్లకు వెళ్లినప్పుడు కార్యకర్తలు చెబుతున్నారు.. ఎవరైనా పిక్‌పాకెట్, మోసం చేస్తే 420 కేసు పెడ్తారన్నా.. మరి ఏకంగా చంద్రబాబునాయుడుగారు ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే ఆయన మీద 420 కేసు పెట్టాలా.. లేక 840 కేసు పెట్టాలా అన్చెప్పి ప్రజలడుగుతున్నారని. చంద్రబాబునాయుడుగారి మీద ఏ కేసు పెట్టాలా అని చంద్రబాబునాయుడుగారే ఆయన గుండెల మీద చెయ్యేసి తన మనస్సాక్షిని అడగాలని నేను అడుగుతున్నాను.

కుదిరితేనే రుణాలు కడతామనడంలో అర్థమేమిటి?
ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే.. లక్షా రెండు వేల కోట్ల రూపాయల రుణాలను 30, 35 వేల కోట్లకు తగ్గిస్తున్నారు. అంటే.. 30, 35 శాతానికి తగ్గిస్తున్నారు. ఆ తగ్గించిన సొమ్ము కూడా ఎప్పుడిస్తున్నారు అంటే అదీ చెప్పరు. ఎలా ఇస్తారంటే దాని మీదా స్పష్టత ఉండదు. గతంలో మీరే రుణాలు చెల్లించవద్దు అని చెప్పారు. మొన్నటి దాకా బాబొస్తాడు.. రుణాలు చెల్లిస్తాడు అని చెప్పారు. ఆశ్చర్యమేమంటే రుణాలు చెల్లించండి అని ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఎన్నికలయిపోయాయి ప్రజలతో పనేముంది అని చెప్పి.. ఇవాళ కొత్త రుణాలు కావాలంటే రుణాలు చెల్లించండి.. చెల్లించకపోతే మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. మీరే ఇవాళ రుణాలు చెల్లించండి.. ఆ తర్వాత కుదిరితే మేం ఇస్తామంటున్నారు. అంటే కుదరకపోతే మీరివ్వరనేగా దానర్థం. ఆ 30, 35 వేల కోట్లకు కూడా కుదిరినప్పుడు ఇస్తాం.. కుదరకపోతే మీ అగచాట్లు మీరు పడండి అని చెప్పకనే చెప్తున్నట్టే కదా! ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే.. రైతులకు కొత్త రుణాలు అందాలంటే పాతవి వడ్డీతో సహా కడితే తప్ప రెన్యువల్ కావు. మరి మీ మాట నమ్మి రుణాలు కట్టకుండా ఉన్న రైతులను ఆదుకోవాల్సిన మీరే రుణాల కట్టండి లేదా మీ తిప్పలు మీరు పడండి అనడం ఎంతమటుకు సమంజసం అని నేను అడుగుతున్నా. మభ్య పెట్టే కార్యక్రమం ఎంత దారుణంగా జరుగుతోందంటే.. ఒక వైపు డబ్బుల్లేవంటారు. 
రాజధాని కోసం హుండీలు పెడతారు. అంతటితో ఆగరు.. అడవుల్లో పెరుగుతున్న కోయని చెట్లను అమ్మడానికి వీల్లేదని తెలిసి కూడా అవి కూడా తాకట్టు పెట్టి రుణాలు తీరుస్తామంటారు. ఎక్కడైనా కూడా అడవిలో ఎర్ర చందనం చెట్టుంటే ఆ పెరుగుతున్న చెట్లు.. కోయని ఆ చెట్లను కూడా మార్కింగులు పెట్టి అవి కూడా తాకట్టు పెట్టి బ్యాంకులకు అమ్మేస్తామంటున్నారు. బ్యాంకర్లు ఏమైనా చెవిలో పూలు పెట్టుకున్నారా? లేకపోతే బ్యాంకులకు, ప్రజలకు చెవిలో పూలు సులభంగా పెట్టొచ్చని మీరు అనుకుంటున్నారా? ఒక వైపు చెట్లను కోస్తే అది స్మగ్లింగు, ఇల్లీగలని కేసులు పెడతాం. అటువంటిది బ్యాంకులకు కోయని చెట్లను మార్కింగులు చేసి రుణాలు కోసం పెట్టేస్తామని, సెక్యూరిటైజేషన్ అని అంటున్నారు. ఏమి అన్యాయం? ప్రజలకు ఇంత దారుణంగా చెవుల్లో పూలు పెట్టడమన్నది ఎంతవరకు సమంజసం? రోజుకొక అబద్ధం. పూటకొక అబద్ధం.. ఇలా ప్రజలను మభ్యపెడుతూ పోవడం ఎంతవరకు సమంజసం అని నేను చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నా.

ఈ 13 వేల కోట్ల బాధ్యత ఎవరిది?
మీ మోసం వల్ల ఇవాళ రైతులకు జరుగుతున్న నష్టమేమిటో తెలుసా? ఇవాళ రైతులు, డ్వాక్రా రుణాలు కలిపితే రాష్ట్రంలో దాదాపు లక్షా రెండు వేల కోట్లు. దీనిమీద ఇంతకుముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం వడ్డీ కట్టే పరిస్థితి నుంచి ఇవాళ 12.5 నుంచి 13 శాతం వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చింది. 13 శాతం వడ్డీ అంటే దాదాపు 13 వేల కోట్ల రూపాయలు. ఈ 13 వేల కోట్లను ఇవాళ రైతుల నుంచి పిండి వసూలు చేయబోతున్నాయి బ్యాంకులు. లక్షా రెండు వేల కోట్లు అసలైతే ఈ సంవత్సరం వడ్డీ కింద రైతులు 13 వేల కోట్లు కట్టాలి. ఈ వడ్డీ కట్టవలసిన బాధ్యత ఎవరిదీ అని చంద్రబాబునాయుడుగారిని అడుగుతున్నా. మీ పుణ్యాన ఇవాళ రైతులకు పంటల బీమా పోయింది. బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్ చేస్తేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇవాళ రైతులు రుణాలు రెన్యువల్ చేసే పరిస్థితిలో లేరు. మీరేమో రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పరు. దానివల్ల రైతులకు ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితి.

కొత్త రుణాలు రావడంలేదు. ఇప్పుడు రైతులకు మీరే రుణాలు కట్టండి.. లేదంటే మీ తిప్పలు మీరు పడండి అని  చెప్తున్నారు. ఈ ఏడాది వ్యవసాయం ఎలా చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు మీ పుణ్యాన. మీ మోసాల వల్ల ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, రైతన్నలు ఇద్దరూ కూడా అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నారంటే దీనికి కారణం కేవలం చంద్రబాబునాయుడుగారే. మీ చేత కొత్త రుణాలు వచ్చేట్టుగా చేసేందుకు, పాత రుణాల మీద వడ్డీ భారం 13 వేల కోట్ల రూపాయలు కూడా మీ చేత కట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. గురువారం నుంచి మూడు రోజులపాటు ప్రతి గ్రామంలోనూ చంద్రబాబునాయుడు గారి దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాలు చేపడతామని పిలుపునిస్తున్నాం. దీనికి ‘నరకాసుర వధ’ అని నామకరణం చేస్తున్నాం. ప్రతిపక్షంలోని పార్టీలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నా. బీజేపీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.  రైతులు, అక్కచెల్లెమ్మలు దీన్లో పూర్తిగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. రైతన్నలు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ సీపీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్తున్నాం. మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు.. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ఇందులో పాల్గొనాలని కోరుతున్నాం.

రైతుల కోసం కలసి పోరాడుదాం రండి.. కమ్యూనిస్టులను కోరిన వైఎస్ జగన్

Written By news on Wednesday, July 23, 2014 | 7/23/2014

రైతుల కోసం కలసి పోరాడుదాం రండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఐ, సీపీఎం నాయకులను కోరారు. ఆంధ్రప్రదేశ్ సీపీఐ, సీపీఎం కార్యదర్శులు  రామకృష్ణ, మధులతో జగన్ మాట్లాడారు.

ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ సీపీ ఆందోళనలను నిర్వహించనుంది. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలపుడు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలో వచ్చాక షరతులు పెట్టిన సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబంలో ఎన్ని రుణాలున్నా లక్షన్నర వరకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేయాలని వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు నిర్వహిస్తోంది.

మూడు రోజుల పాటు నరకాసుర వధ.. బాబు దిష్టిబొమ్మల దహనం

మూడు రోజుల పాటు నరకాసుర వధ.. బాబు దిష్టిబొమ్మల దహనం
హైదరాబాద్: రైతుల రుణమాఫీ విషయంలో టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి నిరసనగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోను మూడు రోజుల పాటు 'నరకాసుర వధ' పేరిట చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, మొత్తం 13 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోనూ ఇది జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. అడవుల్లో చెట్లను కూడా బ్యాంకులకు తాకట్టు పెడతామని ఆయన అంటున్నారని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని బాబు ఇప్పుడు కల్లబొల్లి కారణాలు చెబుతున్నారన్నారు. విశ్వసనీయతకు, వంచనకు జరుగుతున్న ఎన్నికలని తాము ముందే చెప్పామన్నారు.
 
తనకు అనుకూలంగానే కోటయ్య కమిటీతో చంద్రబాబు చెప్పించారని, ఆ మేరకే ఆయన కూడా నివేదిక ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసునని, అన్నీ తెలిసి విభజనకు ఆయన అనుకూలంగా ఓటేశారని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోల్లో రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వనరులపై పూర్తి అవగాహనతోనే రుణమాఫీ హామీ ఇచ్చానని చంద్రబాబు ...ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారన్నారు.

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు భృతి, రైతు, డ్వాక్రా రుణాలమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను వీడియో క్లిప్పింగ్స్ ను ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రూ.87,612వేల కోట్లు రైతుల రుణాలు, రూ.14,204 కోట్ల డ్వాక్రా రుణాలున్నాయన్నారు. అయితే చంద్రబాబు మాఫీ చేస్తానన్న రుణాల మొత్తం రూ.1,01,816 కోట్లు అని జగన్ అన్నారు. మరి రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు...కోటయ్య కమిటీ ఎందుకు వేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కమిటీల పేరుతో బాబు కాలయాపన చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
తెలంగాణ, ఏపీ మేనిఫెస్టోల్లో రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, వనరులపై పూర్తి అవగాహనతోనే రుణమాఫీ హామీ ఇచ్చానంటూ చంద్రబాబు ఈసీకి కూడా లేఖ రాశారని జగన్ మోహన్ రెడ్డి గుర్తుచేశారు. రుణమాఫీపై ఎందుకు పరిమితులు విధించారని ప్రశ్నించారు. తెలంగాణలో రుణమాఫీపై ఓ మంత్రి పరిమితులు విధిస్తే కేసీఆర్ మాట తప్పారంటూ ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎలా పరిమితి విధిస్తారని నిలదీశారు.

పాకెట్‌ కొట్టేసిన వారిపై 420కేసు పెట్టినప్పుడు చంద్రబాబుపై ఏకేసుపెట్టాలంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని, మీ మాట నమ్మి రుణం కట్టని రైతుల పరిస్థితేంటని అడిగారు. రుణమాఫీకి డబ్బుల్లేవంటారు గానీ, అడవుల్లో చెట్లను బ్యాంకులకు తాకట్టు పెడతామంటున్నారని, హైకోర్టు ఆదేశాలున్నా ఇసుక రీచ్‌లను అమ్మేస్తామంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పుణ్యంతో రైతులు పంటల బీమా నష్టపోయారని, అందుకే చంద్రబాబు తీరుకు నిరసనగా రేపటి నుంచి మూడురోజులపాటు 13 జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఆందోళనలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు మభ్యపెట్టిన తీరును గ్రామగ్రామాన ప్రజలందరికీ వివరిస్తామని, నరకాసురవధ పేరుతో దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం చేపడతామని వివరించారు.
ఇంగ్లీష్ కథనం కోసం 

రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసు

చంద్రబాబు తెలిసి ప్రజల్ని మోసం చేశారు
హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని బాబు ఇప్పుడు కల్లబొల్లి కారణాలు చెబుతున్నారన్నారు. విశ్వసనీయతకు, వంచనకు జరుగుతున్న ఎన్నికలని తాము ముందే చెప్పామన్నారు.

రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసునని, అన్నీ తెలిసి విభజనకు ఆయన అనుకూలంగా ఓటేశారని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోల్లో రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

డ్వాక్రా మహిళల ఆందోళన

విజయవాడ: ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష లోపు రుణ మాఫీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించడం పట్ల డ్వాక్రా మహిళలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ బుధవారం విజయవాడ నగరంలో డ్వాక్రా మహిళలు కదంతొక్కారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వాగ్దానాలకు... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ బుధవారం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు.

Live YSRCP TV

రేపు జగన్ రాక

రేపు జగన్ రాక
విజయవాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో గుంటూరు బయలుదేరి వెళ్తారు. గుంటూరు జిల్లాలో మూడురోజులపాటు నియోజకవర్గాల వారీగా జరిగే సమీక్షా సమావేశాల్లో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని రఘురాం వివరించారు.

కప్పదాటు ధోరణి

రుణమాఫీపై చంద్రబాబుది కప్పదాటు ధోరణి
తిరుపతి : రుణమాఫీపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కప్పదాటు ధోరణి ప్రదర్శిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా విమర్శిం చారు. నగరిలో ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  వైఎస్సార్ సీపీ కార్యకర్త గణేష్‌ను పరామర్శించేందుకు ఆమె మంగళవారం తిరుపతికి వచ్చారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు రాష్ట్రంలో వ్యవసాయ, చేనేత, డ్వాక్రా రుణాలు ఏమేర ఉన్నాయో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. రుణ బకాయిలు ఏ మేర ఉన్నాయో తనకు ముఖ్యమంత్రి అయ్యాకే తెలిసిందని చెప్పడం ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు.

కమిటీల పేరుతో కాలయాపన చేసి, రుణమాఫీలో షరతులు పెట్టి చంద్రబాబు ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అన్ని రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మాట మార్చి పరిమితులు విధించడం కుటిల రాజనీతికి నిదర్శనమని విమర్శించారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చంద్రబాబు భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్నారని, స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడానికి టీడీపీ లెక్కలేనన్ని అరాచకాలకు పాల్పడిందని అన్నారు. చివరకు న్యాయం, ధర్మం గెలుస్తాయన్న వాస్తవం జమ్మలమడుగు, నెల్లూరు మున్సిపల్, జెడ్పీ చైర్మన్‌ల ఎన్నికల్లో తేటతెల్లమైందని పేర్కొన్నారు.

హామీలతో పాటు మాఫీలు చేయాల్సిందే

Written By news on Tuesday, July 22, 2014 | 7/22/2014

'హామీలతో పాటు మాఫీలు చేయాల్సిందే'
విజయవాడ: టీడీపీ ఎన్నికల హామీలతో పాటు ప్రభుత్వం అధికారికంగా చెప్పిన రుణమాఫీ, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్.నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందంటూ రూ.35 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామంటున్నారని అన్నారు. రైతులను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలకు చెప్పినవన్నీ వైఎస్ఆర్,ఎన్టీఆర్‌ చేశారని గుర్తు చేశారు.

చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతూ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రైతులు వ్యవసాయ రుణాలు చెల్లించద్దు.. అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పించారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తానంటూ రైతుల్ని, ప్రజల్ని నమ్మించారని విమర్శించారు. ఇప్పుడు రిటైర్డ్ బ్యాంకు అధికారులతో కూడిన కోటయ్య కమిటీని రుణమాఫీ కోసం వేసి తత్సారం చేస్తున్నరని ఆక్షేపించారు. రైతులకిచ్చిన హామీలను కేసీఆర్, చంద్రబాబు తీర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.

బెదిరింపులకు భయపడను

బెదిరింపులకు భయపడను
► జెడ్పీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంతో గ్రామాల్లో పండగ వాతావరణం
► కావలి జెడ్పీటీసీ మత్స్యకారుల ఆత్మగౌరవం కాపాడుతుందనుకున్నాం
► ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి : తనకు సంబంధంలేని మద్యం కేసును అంటకడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషపు రాతలతో చేస్తున్న బెదిరింపులకు తాను భయపడేది లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం పుల్లారెడ్డినగర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను 28 ఏళ్ల పాటు వ్యాపార రంగంలో ఉన్నానన్నారు. తన స్నేహితులు ఎందరికో మద్యం అలవాటు ఉ న్నా.. తాను మాత్రం దానికి దూరమన్నారు. మద్యం తాగేవాళ్లను కూడా తాగొద్దని ఎన్నోసార్లు చెబుతుం టానన్నారు. అలాంటి  తనపై ఎన్నికల మద్యం కేసంటూ తప్పుడు కథనాలతో అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయన్నారు.

అసలు ఆ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గెలవడంతో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ ధర్మం, న్యాయం ఈ ఎన్నికల్లో గెలిచాయని, దేవుడు ఉన్నాడంటూ ఉద్వేగంతో చెబుతున్నారన్నారు.  నీచ రాజకీయాలతో కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో టీడీపీ ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు.

అదే పంథాను జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అవలంబించిందన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన కావలిరూరల్ జెడ్పీటీసీ ఎస్.పెంచలమ్మ మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థికి ఓటు వేస్తుందని తాను అనుకున్నానన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసే జాబితాలో ముందు వరుసలో ఆమె చేయి ఎత్తడం చూసి తనకు ఎంతో బాధ వేసిందన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు విప్ ధిక్కారణపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం తప్పకుండా ఆమెపై అనర్హత వేటు పడుతుందన్నారు. తర్వాత జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తాను మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారినే  పోటీలో నిలుపుతామన్నారు.  
 
అందరి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి
అన్ని రాజకీయ పార్టీల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కావలికి చెందిన బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకట సత్యనారాయణతో పాటు రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహామండలి సభ్యుడిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సహకారాన్ని తాను తీసుకుంటానన్నారు.

గుంటూరు సమీక్ష సమావేశాల షెడ్యూల్

24న గుంటూరుకు జగన్
► మూడు రోజులపాటు పార్టీ సమావేశాలు
 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు
► వైఎస్సార్ సీపీ నాయకులు, విభాగాల సభ్యులు హాజరు కావాలని జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు
సమీక్ష సమావేశాల షెడ్యూల్ ఇలా...
24వ తేదీ...
ఉదయం 9 గంటలకు: గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు
మధ్యాహ్నం 12 గంటలకు : పొన్నూరు, ప్రత్తిపాడు
మధ్యాహ్నం 2 గంటలకు : తాడికొండ, మంగళగిరి
 
25వ తేదీ ..
ఉదయం 9 గంటలకు : తెనాలి, చిలకలూరిపేట
మధ్యాహ్నం 12 గంటలకు : సత్తెనపల్లి, పెదకూరపాడు
మధ్యాహ్నం 2 గంటలకు : మాచర్ల, గురజాల
సాయంత్రం 5 గంటలకు : వినుకొండ, నరసరావుపేట
రాత్రి 7 గంటలకు : రేపల్లె

26వ తేదీ..
ఉదయం 9 గంటలకు : 
బాపట్ల, వేమూరు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 24న గుంటూరు రానున్నారు. ఆయన అధ్యక్షతన  24, 25, 26 తేదీల్లో పార్టీ సమీక్ష సమావేశాలు వరసగా మూడు రోజుల పాటు గుంటూరులో జరగనున్నాయి. ఇందుకు పలకలూరు రోడ్డులోని ‘రమణీయం’ కల్యాణ మండపాన్ని వేదిక నిర్ణయించారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు..
► జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల  మూడు పార్లమెంటు స్థానాలతో పాటు, 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సమీక్ష జరుగుతుంది.
► పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్య ర్థులు, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి.
► వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని, అన్ని విభాగాల సభ్యులు హాజరు కావాలి. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా హాజరు కావాలి.
ఈ సమావేశాలకు పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.మైసూరారెడ్డి హాజరు కానున్నారు.
► పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీ ఉదయం గుంటూరు చేరుకుంటారు. నియోజకవర్గ సమీక్షల్లో నేతలు తప్పక పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సూచించారు.
► విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), లేళ్ల
అప్పిరెడ్డి, కత్తెర సురేష్‌కుమార్, కొత్త చినపరెడ్డి, పురుషోత్తం, నూనె ఉమామహేశ్వరరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ మద్దుల రాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల నోట్లో మట్టి

రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై మాట మార్చిన చంద్రబాబు
రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టి


హైదరాబాద్: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం భయపడుతున్నదే జరిగింది. అధికారంలోకి వచ్చీ రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన తొలి సంతకంతోనే రైతాంగాన్ని నిండా ముంచారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి గడిచిన 45 రోజులుగా రుణ మాఫీపై రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేసిన చంద్రబాబు సోమవారం అడ్డంగా మాటమార్చారు. రైతులను నిలువునా ముంచారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీసుకున్న రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ రికార్డులు చెబుతున్న అధికారిక లెక్కలే. అలాగే రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలున్నాయి. రెండూ కలిపి 1 లక్షా 1816 కోట్ల రూపాయలు ఉండగా వాటన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన క్షణం నుంచి మాట మార్చుతూ వచ్చారు. తీరా సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతులను నిలువునా ముంచే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో రుణ మాఫీపై చర్చించిన అనంతరం సీఎం స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు కలిపి రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రతి సభలోనూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఊరూవాడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షల గురించి చెప్పకపోగా, వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ హామీ ఏదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చింది కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేరువేరుగా టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న వాగ్దానాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం మొత్తం ఎన్ని రుణాలు తీసుకున్నారో ఇంతకాలం తెలియదనుకోవడం కూడా పొరపాటే. రాష్ట్ర స్థాయి బ్యాంక ర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికల్లో రైతాంగం తీసుకున్న రుణాలె న్ని? అందులో వ్యవసాయ రుణాలెన్ని? బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలెన్ని? టర్మ్ రుణాలెన్ని? డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలెన్ని? వంటి మొత్తం వివరాలున్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడానికి ముందున్న లెక్కలే ఇవి. అన్నీ తెలిసే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అరుుతే అధికారం చేపట్టిన తర్వాత ఈ విషయంలో ఆయన రూటు మార్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినరోజు రుణ మాఫీ ఫైలుమీదే తొలి సంతకం చేస్తానన్న వాగ్దానం నెరవేర్చకుండా, రుణమాఫీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికంటూ నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేయడానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఒక్కసారిగా విమర్శల దాడి మొదలైంది. అయినప్పటికీ కమిటీ సూచనలు, సిఫారసుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ రైతులు తీసుకున్న రుణాలెన్ని అన్న విషయూన్ని బ్యాంకర్ల కమిటీ చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించింది. ఇన్ని వాస్తవాలు ప్రత్యక్షంగా కనబడుతున్నప్పటికీ చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు నిన్నమొన్నటి వరకు కూడా రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ పచ్చిగా నమ్మిస్తూ వచ్చారు. ఒక్కో దశలో ఒక్కో పరిమితి విధిస్తూ, ఆంక్షలు పెడుతూ సాకులు చెబుతున్న సమయంలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నుంచి విమర్శలు వ స్తున్న సమయంలోనూ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. దాదాపు నెలన్నర నుంచి ఇలా కాలం వెళ్లబుచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సోమవారం తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. వ్యవసాయం కోసం కోటి మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వారిలో 90 శాతం మందికి లబ్ది చేకూర్చుతున్నామని బుకాయించే ప్రయత్నం చేయడం పట్ల రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.87,612.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలు కలిపి మొత్తం లక్ష కోట్లకు పైగా రుణాలుంటే.. అందులో రూ.30 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల మేరకు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వమే..

మళ్లీ 90 శాతం రైతులకు మేలు కలిగిస్తున్నామని చెప్పడం పట్ల రైతు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. డ్వాక్రా రుణాలతో కలిపి లక్ష కోట్ల రుణాలుంటే అందులో కనీసం 30 శాతం రుణాలను మాఫీ చేయలేనప్పుడు ఏ విధంగా 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలిగించినట్టు అవుతుందని ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి కోటికి పైగా బ్యాంకుల్లో ఖాతాలున్నాయని కేవలం రూ.30 వేల కోట్లు మాఫీ చేసి 90 శాతం లబ్ది చేకూర్చామని చెప్పడం మరో మోసమని పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన తతంగం చూస్తుంటే ఆ రూ.30 వేల కోట్లను కూడా తగ్గించేలా ప్రభుత్వ వ్యవహారం కనబడుతోందని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..

Written By news on Monday, July 21, 2014 | 7/21/2014

తొలి సంతకానికి చంద్రబాబు విలువ తీసేశారు..
గుంటూరు: కోటయ్య కమిటీ నివేదిక రుణమాఫీని నీరుగార్చేలా ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. రుణమాఫీపై  కోటయ్య ఇచ్చిన రిపోర్టు కాదు.. అది టీడీపీ నేతలు రాయించిన కోటయ్యకు ఇచ్చిన రిపోర్టు మాత్రమేనని ఉమారెడ్డి అన్నారు. 
 
అధికారంలోకి వచ్చిన తొలి సంతకానికి విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన తీవ్రంగా స్పందించారు. బాగా పనిచేసే కార్పొరేషన్లను తాకట్టు పెట్టే యోచనను విరమించుకోవాలని చంద్రబాబుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హితవు పలికారు. 

రైతు నోట్లో మట్టి కొట్టాలనేది చంద్రబాబు ఆలోచన


'రైతు నోట్లో మట్టి కొట్టాలనేది చంద్రబాబు ఆలోచన'
హైదరాబాద్: చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే రాజధానిపై కమిటీ ఏర్పాటు చేసిందని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోటయ్య కమిటీ రిపోర్టు ప్రకారం రైతు నోట్లో ఏ విధంగా మట్టికొట్టాలన్నది చంద్రబాబు ఆలోచన అని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఎస్ఎల్ బీసీ రిపోర్టు, కోటయ్య కమిటీ రిపోర్టుల రెండింటికీ చాలా తేడాలున్నాయని ఆయన తెలిపారు. 
 
కోటయ్య కమిటీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. రుణమాఫీని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టడానికే ఈ డ్రామానా అంటూ ఆయన ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని జ్యోతుల నెహ్రూ సూచించారు. 
 
తన సొంతమనుషుల ఆస్తులు పెంచడమే లక్ష్యంగా. చంద్రబాబు రాజధాని కమిటీ వేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎవరబ్బ సొత్తు కాదని,  అందరికీ భాగస్వామ్యం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. 

వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ అభినందనలు

వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ అభినందనలు
  వైఎస్సార్‌సీపీ నెల్లూరు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్నందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలకు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుని ఎట్టకేలకు పార్టీ విజయానికి కృషి చేసిన నేతలను ఆదివారం ఆయన ప్రశంసించారు.
 
 ముఖ్యంగా నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి సాయంత్రం వైఎస్ జగన్ ఫోన్ చేసి అభినందించారు. వీరితో పాటు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నెల్లూరు మేయర్‌ను, చైర్మన్‌గా ఎన్నికైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి కూడా జగన్ అభినందనలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతను పెంచాలని ఆయన సూచించారు.

చెన్నై బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ చేయూత

చెన్నై బాధితులకు వైఎస్‌ఆర్‌సీపీ చేయూత
 శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వెళ్లి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, తిరువళ్లూరులలో భవ నం, గోడ కూలిన ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి రెండు రోజుల క్రితం జిల్లాలో పర్యటించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకున్న జగన్‌మోహనరెడ్డి పార్టీ తరపున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా నాయకులు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్, రెడ్డి శాంతి, ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, విశ్వసరాయి కళావతిలు శని, ఆదివారాల్లో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు.  మృతుల కుటుంబ సభ్యులతో పాటు క్షతగాత్రులకు కూడా పార్టీ తరపున సాయం అందించారు.

 ఆదివారం  బూర్జ మండలం కొల్లివలసకు చెందిన కర్రి సింహాచలం, సెనగల పెంటయ్య, ఇదే మండలంలోని టీఆర్ రాజు పేటకు చెందిన కొయ్యాన జయమ్మ, హిరమండలం మండలం గొట్ట గ్రామానికి చెందిన  కొంగరాపు శ్రీనివాస్, మీసాల శ్రీనివాసరావు, మీసాల భవానీ, పెసైక్కి జ్యోతి, ఎల్‌ఎన్‌పేట మండలం ఎల్.ఎన్‌పేట గ్రామానికి చెందిన తాన్ని అప్పలనర్సమ్మ, మోదుగులవలస గ్రామానికి చెందిన దుక్క తవుడు, కొత్తూరు మండలం ఇరపాడు గ్రామానికి చెందిన అమలాపురం రాజేష్, అమలాపురం రమేష్, కిమిడి సుబ్బారావుల కుటుంబ సభ్యులకు రూ.75 వేలు చొప్పున, హిరమండలం మండలం గొట్టా గ్రామానికి చెందిన  క్షతగాత్రులైన  కొంగరాపు కృష్ణవేణి, బూర్జ మండలం కొల్లివలసకు చెందిన సెలగల నాగరాజులకు రూ.20 వేలు చొప్పున అందించారు.

 మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన సవర భీమారావుకు ప్రమాదంలో నడుం విరిగిపోయిందని, కొత్తూరు మండలం ఇరపాడుకు చెందిన అనుపోజు దివ్య  అనే చిన్నారి అనాథగా మిగిలిందని బంధువులు జగన్‌మోహనరెడ్డి దృష్టికి తేవడంతో ఆయన ఆదేశాల మేరకు వారికి కూడా రూ. 20వేలు చొప్పున అందజేశారు. కాగా శనివారం కోటబొమ్మాళి మండలం పాకివలసకు చెందిన ముద్దపు శ్రీనివాసరావు, చుట్టిగుండం గ్రామానికి చెందిన దేవర సిమ్మయ్య, దేవర లక్ష్మీకాంతం, దేవర అప్పయ్య, దేవర లక్ష్మి, దేవర జగదీష్‌లకు, నరసన్నపేట మండలం బాలసీమకు చెందిన దువ్వారపు పద్మ, సారవకోట మండలం సత్రాం గ్రామానికి చెందిన ఇద్దుబోయిన రాము కుటుంబ సభ్యులకు రూ.75వేలు చొప్పున అందజేశారు. సోమవారం భామిని మండలం కొరమ గ్రామానికి చెందిన దాసరి కళావతి, దాసరి రాము, పాలకొండ కు చెందిన ఊల రవి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Popular Posts

Topics :