27 July 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

అబద్ధాల బాబును నిలదీయండి

Written By news on Saturday, August 2, 2014 | 8/02/2014

అబద్ధాల బాబును నిలదీయండివీడియోకి క్లిక్ చేయండి
ప్రజలకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు    

బాబు మాటలు నమ్మి రుణాలు కట్టని రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
రూ. లక్ష రుణానికి 13 వేలు వడ్డీ..
డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల నుంచి బ్యాంకులు సొమ్మును తీసుకుంటున్నాయి
బాబుపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా అని ప్రజలడుగుతున్నారు


గుంటూరు: పూటకో అబద్ధంతో రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిలదీయాలని ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ శుక్రవారం సమావేశమయ్యారు. పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై కర్తవ్యబోధ చేశారు. పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 ఇటీవలి ఎన్నికల్లో సంస్థాగతంగా మనం తప్పులు చేసి ఉంటే అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మన పార్టీకి కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి ఆశీర్వదించారు. చంద్రబాబునాయుడు కూటమికి సుమారు కోటీ ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు వేశారు. ఇద్దరి మధ్య తేడా 5.6 లక్షలు మాత్రమే. అది పెద్ద తేడా కాదు. నాకు పార్లమెంటు ఉప ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ 5.5 లక్షలు. ఆ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను పెంచింది. 14వ లోక్‌సభలో అగ్రగామిగా నిలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2.8 లక్షల ఓట్లు అటు వైపు నుంచి ఇటు వైపు వచ్చి ఉంటే మనం అధికార పక్షంలో ఉండేవాళ్లం. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చొని ఉండేవారు. ఆ తేడా ఎందుకు వచ్చిందో మనం విశ్లేషించుకోవాలి. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి నరేంద్రమోడీ గాలి పట్టణాల్లో పనిచేయడం. రెండో కారణం చంద్రబాబు అబద్ధాలు.

 చంద్రబాబు 87 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రజలను నమ్మించాడు. అది సాధ్యం కాదని తెలిసి మనం కూడా హామీలు ఇచ్చినా, ఆయన ఆడిన అబద్ధాలు మనం ఆడినా మూడు లక్షలు, అంతకన్నా ఎక్కువ ఓట్లు మనకు వచ్చేవి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఉండేవాడిని. రెండు, మూడు నెలలు తిరగకుండానే రాష్ట్రంలో ప్రతి రైతూ మనల్ని తిట్టుకునేవారు. మీరు కూడా వచ్చి నన్ను ప్రశ్నించేవారు. ఎందుకన్నా మోసం చేశావు అని నిలదీసేవారు.

 ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకని అబద్ధాలు ఆడి, మోసాలు చేసి గడ్డి తిని ఉంటే .. ప్రజలకు న్యాయం చేయగలమా? నాకూ గొప్ప ముఖ్యమంత్రిని కావాలనే కోరిక ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు నిజాయితీతో కూడిన పాలన ఇవ్వాలని ఉంది. 30 ఏళ్లు ఎంత మంచి చేయాలంటే ఆ మంచిని చూసి ప్రతి ఇంట్లోనూ నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాలనే తాపత్రయం ఉంది. ఆ తాపత్రయమే నన్ను ఈరోజు రాజకీయాల్లో నడిపిస్తోంది. అలాంటప్పుడు అబద్ధాలు చెప్పి, మోసం చేసి ఏదో ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ తరువాత ఐదేళ్లకే ఇంటికి పంపించేస్తారు. ఆ తరువాతి ఎన్నికల్లోనూ ప్రజలు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. అబద్ధాలు చెప్పేవారి ఫొటోలను ఎవ్వరూ ఇళ్లల్లో పెట్టుకోరు. అందుకే చంద్రబాబు మాదిరి అబద్ధాలు చెప్పలేదు. నిజాయితీగా రాజకీయాలు చేశా.

► చంద్రబాటు మాటలు నమ్మి రైతులు జూన్ 30వ తేదీలోపు రుణాలు కట్టలేదు. ఇప్పుడు 13 శాతం వడ్డీతో రుణం కట్టాలని రైతులకు బ్యాంకులు చెబుతున్నాయి. అంటే బాబు మాటలు నమ్మి రైతు ఒక లక్షకు రూ. 13 వేలు వడ్డీ కట్టాల్సివస్తోంది. ఓ పక్క కరువు ఛాయలున్నా, పంటలు వేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అయినా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడంలేదు. పాత రుణాలు కడితేగాని కొత్తవి ఇచ్చే పరిస్థితి లేదు. బకాయిలు కడితేగాని పంటల బీమా కూడా రాదు. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

► డ్వాక్రా అక్కా చెల్లెళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వారి పొదుపు ఖాతాల నుంచి వారికి చెప్పకుండానే సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. లక్ష రూపాయలకు రూ. 13 వేలు వడ్డీని బ్యాంకులు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. వీటిపై  బాబును అసెంబ్లీలో నిలదీశాను.

 ఇంటికో ఉద్యోగం, ‘బాబు వస్తాడు - జాబు తేస్తాడని’ ప్రకటనలిచ్చారు. ఈ రోజు బాబు వచ్చాడు.. ఉన్న జాబులు పోతున్నాయనే పరిస్థితి. 24 వేల మంది ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు. కోటీ యాభై లక్షల కుటుంబాలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాయి. నిరుద్యోగులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో యూ టర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని అసెంబ్లీలో పట్ట పగలే మాట మార్చారు. ప్రైవేటు ఉద్యోగాలు అయితే ఎవరైనా ఇస్తారు. దానికి బాబు ఎందుకు? నిరుద్యోగ భృతి గురించి బాబు అసలు మాట్లాడటమే లేదు.

► కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తానన్నారు. ప్రైవేటు స్కూళ్లలో యజమాన్యాలు రూ. 5 వేలు నుంచి రూ. 10 వేలు ఫీజు కట్టాలని అడుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు కట్టాల్సిన పనిలేదు. ప్రైవేటు పాఠశాలల ఫీజు కడతారన్న భరోసాతోనే ప్రజలు బాబుకు ఓట్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబును ప్రశ్నిస్తే నోట్లో నుంచి మాట రావటంలేదు.  

 బాబు ప్రతి విషయంలోనూ ఇలాంటి అబద్ధాలే చెబుతున్నారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవడానికి వంద అబద్ధాలు. రోజుకో అబద్ధం, పూటకో అబద్ధం. అందుకే చంద్రబాబును ప్రజలు రాళ్లతో తరిమి కొడతారు.

 ఇసుక క్వారీలను సెక్యూరిటైజ్ చేసి రుణాలు తెస్తున్నానంటున్నాడు. ఇసుక తవ్వకాలపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో బ్యాన్ ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు థాయిలాండ్ నుంచి ఇసుకను తెచ్చుకుంటున్నాయి.

► ఎర్రచందనం అమ్మి రుణ మాఫీ చేస్తామంటున్నారు. ఓ మంత్రేమో 8 వేల టన్నుల ఎర్రచందనం వేలం వేస్తే టన్నుకు రూ. 10 లక్షలు చొప్పున రూ. 800 కోట్లు వస్తుందన్నారు. కానీ, చంద్రబాబు 15 వేల టన్నులు అంటున్నారు. పోనీ 15వేల టన్నులే అనుకుందాం. దాన్ని వేలం వేస్తే టన్నుకు రూ. 10 లక్షలు చొప్పున రూ. 1,500 కోట్లు వస్తుంది. ఈ 1,500 కోట్ల రూపాయలతో 1.02 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని బాబు అబద్ధాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా.. అడవిలో కోయని ఎర్రచందనం చెట్లను బ్యాంకుల్లో తాకట్టు పెడతానని ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 ఇన్ని అబద్ధాలతో చంద్రబాబు ప్రజలను నమ్మించాడంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఒక్కటవడమే కారణం. ఎన్నికల ముందు రోజుకో కట్టుకథ, పూటకో అభాండం.. నిజంగా వీళ్లు మనుషులేనా అనిపించేలా చంద్రబాబు దారుణాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

మనకున్నది, చంద్రబాబుకు లేనిది దేవుడి దయ, ప్రజల గుండెల్లో స్థానం. రాబోయే రోజుల్లో ప్రజలను, దేవుడిని నమ్ముకుని వాళ్లు చేస్తున్న మోసాలను, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ప్రజలతో కలిసి చంద్రబాబును ప్రశ్నించాలి.

 ఈమధ్య కాలంలో చాలా మంది నా దగ్గరకు వచ్చారు. ‘అన్నా ఎవరైనా పిక్‌పాకెట్ చేస్తే పోలీసులు 420 కేసు పెడతారు. ఎవరైనా చిట్‌ఫండ్ మోసం, లేకపోతే డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేస్తే వెంటనే 420 కేసు పెడతారన్న. దేశంలో ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే అతనిపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా’ అని అడుగుతున్నారు.
 చంద్రబాబు రాబోయే రోజుల్లో ప్రజల వేడిని, ఆక్రోశాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. మళ్లీ జరగబోయే ధర్మపోరాటంలో మనం ప్రజల్లోకి వెళ్లి చెప్పబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇందుకోసం పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలి’ అని జగన్ కార్యకర్తల్ని కోరారు. సమీక్ష సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.  

2వ రోజు వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ప్రారంభం

Written By news on Friday, August 1, 2014 | 8/01/2014

2వ రోజు వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ప్రారంభం
గుంటూరు: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశంలో రెండవ రోజు శుక్రవారం గుంటూరులో ప్రారంభమైంది. గుంటూరు నగరంలోని బండ్లమూడి గార్డెన్స్ లో ప్రారంభమైన ఆ సమీక్ష సమావేశానికి నర్సారావుపట, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నేతలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
అంతకుముందు బండ్లమూడి గార్డెన్స్ వరకు వైఎస్ జగన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికలపై గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపడమే సమీక్షల ఉద్దేశమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం  ఉదయం రెండోరోజు సమీక్ష సమావేశాలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా సరిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. సూచనలు, సలహాలు పార్టీకి ఎంతో అవసరమని వైఎస్ జగన్ అన్నారు. ధర్మపోరాటంలో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

'చంద్రబాబులా అబద్ధం చెప్పి ఉంటే అధికారం మనదే ...నేను కూడా ఆయనలా సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే..మీరంతా ఇప్పుడు నన్ను ప్రశ్నించేవారని' వైఎస్ జగన్ అన్నారు. అబద్దాలు, మోసం చేసి సీఎం పదవి చేపట్టి ఉంటే అయిదేళ్లకే ప్రజలు ఇంటికి పంపేవారన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తున్నాడు...జాబు వస్తుందన్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే బాబు నోరు మెదపలేదని ఆయన అన్నారు.  మనం నిత్యం ప్రజల్లోనే ఉందాం... ప్రజా సమస్యలపై ముందుండి పోరాడదాం, బాబు మోసాలను ప్రశ్నిద్దాం... ప్రజల్లోకి వెళ్లి నిలదీద్దామని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆక్రోశాన్ని త్వరలోనే చవి చూస్తుందని ఆయన అన్నారు.

మోసాలను ఎండగడదాం.. ప్రజల తరఫున ఉద్యమిద్దాం

 చంద్రబాబు రోజుకో అబద్ధంతో ప్రజలను మోసం చేస్తున్నారు
 రుణ మాఫీపై దగాతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు
► రైతులు, డ్వాక్రా మహిళలు లక్షకు రూ. 13 వేల వడ్డీ కట్టాల్సి వస్తోంది
► వారి పొదుపు సొమ్మునూ లాగేసుకుంటున్నారు
► బాబు మోసాలను ఎండగడదాం.. ప్రజల తరఫున ఉద్యమిద్దాం
► పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత పిలుపు


సాక్షి, గుంటూరు:
 ‘‘ప్రతి అడుగులో మోసం.. నోరు తెరిస్తే అబద్ధం.. పూటకో అబద్ధం చెప్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనాన్ని నిలువునా దగా చేస్తున్న చంద్రబాబును రాబోయే రోజుల్లో అదే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బాబు మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణాలు తిరిగి చెల్లించాల్సిన గడువు ముగియటంతో లక్ష రూపాయలపై ఏకంగా రూ.13 వేలు వడ్డీగా కట్టాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఖరీఫ్ వ్యవసాయానికి కొత్త రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులతో పాటు, డ్వాక్రా మహిళలపైనా ఇంతే మొత్తంలో భారం పడుతోందని చెప్పారు.
 
 వారు పైసా పైసా చొప్పున పొదుపు చేసుకున్న సొమ్మును సైతం చంద్రబాబు మోసపూరిత వైఖరి ఫలితంగా బ్యాంకులు బకాయిల కింద తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రకంగా చంద్రబాబు సర్కారు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని.. ప్రజల తరఫున ఉద్యమించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంటూరులో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అన్నీ పాటిస్తామని.. కానీ అధికార కాంక్షతో చంద్రబాబులా అబద్ధాలు మాత్రం ఆడనని స్పష్టంచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ...

 పదవి కోసం బాబు ఏ గడ్డి తినటానికైనా సిద్ధం...

 ‘‘సంస్థాగతంగా మనం తప్పులు చేసి ఉంటే అవి పునరావృతం కాకూడదు. ఇటీవలి ఎన్నికల్లో బాబు కూటమికి, మనకి తేడా 5.6 లక్షల ఓట్లు మాత్రమే. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడడానికి, ఎన్ని మోసాలైనా చేయడానికి, ఏ గడ్డి అయినా తినడానికి బాబు వెనుకాడలేదు. మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజలకు న్యాయం చేయగలమా? రాష్ట్రంలోని ప్రతి రైతు మనల్ని తిట్టుకునేవాడు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తరువాత 30 ఏళ్ల పాటు ఎంత మంచి చేయాలంటే.. నేను చేసిన మంచి చూసి చనిపోయిన తరువాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో ఉండాలి.

 పొదుపు సొమ్మునూ లాగేసుకుంటున్నారు...

 చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీలు ఒక్కటై ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. ఇప్పుడు బాబు మోసం ప్రజలకు కనిపిస్తోంది. ఆయన ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. గ్రామాల్లోకి వెళితే రైతులు రుణ మాఫీ గురించి అడుగుతున్నారు. రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాత రుణాలు కడితే గానీ, కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. జూన్ 30వ తేదీ లోపు రుణాలు కట్టలేదు కాబట్టి 13 శాతం వడ్డీ సహా బకాయిలు చెల్లించాలని రైతులకు బ్యాంకులు చెప్తున్నాయి. కొత్త రుణాలు ఇవ్వడం లేదు.
 
పంట బీమా కట్టడం లేదు. ఇంత దారుణంగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడు. డ్వాక్రా మహిళల పొదుపు నుంచి సొమ్మును బ్యాంకులు తీసుకుంటున్నాయి. రూ. లక్షకు రూ. 13,000 వడ్డీ కడితేగానీ రుణం రెన్యువల్ కాని పరిస్థితి నెలకొంది. అలాంటి బాబును రక్షించేందుకు టీవీ9, ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఈ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. మనకున్నది చంద్రబాబుకు లేనిది దేవుడి దయ, ప్రజల గుండెల్లో స్థానం. చంద్రబాబు, టీడీపీ సర్కారు చేస్తున్న మోసాలను, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. బాబును నిలదీయాలి.
 
 బాబు నిజం చెప్తే తల వెయ్యి వక్కలవుతుంది...
 ‘పొరపాటుగా అయినా చంద్రబాబు నోట్లో నుంచి నిజం చెప్తే తల వెయ్యి ముక్కలవుతుంది’ అని చంద్రబాబుకు ఓ ముని శాపం ఉంది. అందుకే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారు. ఇంటికో ఉద్యోగం.. ‘బాబు వస్తాడు - జాబు తెస్తాడని’ ప్రచారం చేశారు. నిరుద్యోగులకు రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని మాట మార్చుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు అయితే ఎవరైనా ఇస్తారు.. దానికి బాబు ఎందుకు? నిరుద్యోగ భృతి గురించి బాబు అసలు మాట్లాడటం లేదు. ఇలా అడుగడుగునా ప్రజలను మోసం చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్బోధించారు. ఈ సమీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

‘బియాస్’లో కొట్టుకుపోయిన బాబు హామీ

పరిహారంపై మాట మార్చారంటూ బాధితుల ఆవేదన
 
సాక్షి, హైదరాబాద్: కన్న బిడ్డలను కోల్పోయి దుఃఖంలో ఉన్న తమతో చంద్రబాబు రాజకీయ ఆటలు ఆడారని ‘బియాస్’ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. హైదరాబాద్‌కు చెందిన విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 2న జరిగిన ఈ దుర్ఘటనలో ఓ టూర్ ఆపరేటర్‌తోపాటు 24 మంది విద్యార్థులు మృతి చెందారు.
 
హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన రూ.1.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సచివాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాల సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఇస్తామన్న పరిహారం విషయంలో ఆయన మాట మార్చారని విమర్శించారు. మృతుల కుటుంబాలు ఏ ప్రాంతంవారని ఇప్పటివరకు ఎవరూ తమను అడగలేదని.. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలా అడిగారని రిథిమ తండ్రి శ్రీనివాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.
 
చంద్రబాబు పట్టించుకోవడంలేదు
‘‘తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు పరిహారం ప్రకటించింది.  24 మంది విద్యార్థుల తల్లిదండ్రులం ఏపీ సీఎం చంద్రబాబును సోమవారం పార్టీ కార్యాలయంలో కలి శాం. ఇప్పుడు ఆయన మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాళ్లకు ఇచ్చుకోవాలి. ఒక ప్రభుత్వం ఇచ్చింది కదా.. మేం ఇవ్వకూడదు అని చెబుతున్నారు’’
- రాంబాబు తండ్రి శేఖర్‌నాయక్, నల్లగొండ  

రూల్స్ వర్తిస్తాయా.. అని అన్నరు

‘‘ఒక రాష్ట్రం ఇచ్చింది.. మరో రాష్ట్రం ఇవ్వడానికి రూల్ వర్తిస్తుందో లేదో చూస్తాం అని చంద్రబాబు చెప్పారు. ఆంధ్ర సైడ్ పిల్లలకు కూడా ఇచ్చారా? అని అడిగారు. కేసీఆర్ సార్ అందరికీ ఇచ్చారని చెప్పాం. మేము కూడా ఇవ్వవచ్చునా అని మమ్మల్ని అడిగారు. మాకేం తెలుస్తుంది.’’    - రిథిమ తండ్రి పి.శ్రీనివాస్, చిత్తూరు
http://www.sakshi.com/news/hyderabad/nayani-narsimha-reddy-gives-rs-1-50-lakh-compensation-for-the-families-of-the-victim-153699?pfrom=home-top-story

ఓట్లు, సీట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే ...

Written By news on Thursday, July 31, 2014 | 7/31/2014

ఓట్లు, సీట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి ఉండేదని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావడానికి ఏ గడ్డయినా తినేరకం చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు తప్పుడు వాగ్గానాలకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఒక్కటై ప్రచారం చేసి ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లో టీడీపీ నేతలు తిరిగే పరిస్థితి లేదన్నారు. రుణాల విషయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందన్నారు. బాబు పూటకో అబద్ధం, రోజుకో మాట చెబుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరి సలహాలు, సూచనలు అవసరమని వైఎస్ జగన్  అన్నారు. పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించాలని ఆయన సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ  సమీక్షా సమావేశంలో జిల్లా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. తొలి రోజు సమావేశానికి  గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలపై నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ కు స్వాగతం

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ కు స్వాగతం
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ప్రతాప్ అప్పారావు, కొడాలి నాని, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాఘగం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా బయల్దేరారు.

కాగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు, పార్టీ పరిస్థితులను వైస్ జగన్ సమీక్షించనున్నారు. అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో రెండు రోజులపాటు నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై సమీక్ష జరుగుతుంది.

నేడు గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె నేతలతో వైఎస్ జగన్ సమీక్ష జరుపుతారు. శుక్రవారం నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, బాపట్ల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమీక్షా సమావేశాలు జరుగుతాయి.

నేనున్నానంటూ... భరోసా

నేనున్నానంటూ... భరోసా
నేడు జిల్లాకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాక
రెండు రోజులపాటు నియోజకవర్గాల వారీగా పార్టీపై సమీక్ష
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేయత్నం
 
వేదిక : గుంటూరు- అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపడంతోపాటు, పార్టీ పరిస్థితులను సమీక్షించేందుకు ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంటూరు రానున్నారు. అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్‌లో రెండు రోజులపాటు నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలపై సమీక్ష జరుగుతుంది.
     
పూర్తిస్థాయిలో నియోజకవర్గ నేతలతో సమీక్షించి శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఎన్నికల సమయంలో జరిగిన లోటుపాట్లు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టనున్నారు.
పార్టీ పటిష్టత కోసం అవసరమైన ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, బాధ్యతలు, కమిటీల ఏర్పాటు, విధివిధానాలను చర్చిస్తారు.
పార్టీ కార్యకర్తలు, నాయకుల సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తారు.
ఎన్నికల ఫలితాల తరువాత అధికార పార్టీ నేతలు చేస్తున్న దాడులు, వేధింపులకు సంబంధించి పార్టీ శ్రేణులు ఐధైర్యపడాల్సిన పని లేదని, మీకు అండగా ఉంటాననే  భరోసాను జగన్ ఈ సమీక్ష సమావేశాల ద్వారా కార్యకర్తలకు కల్పించనున్నారు.
ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు విధానలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రజలతో పార్టీ కార్యకర్తలు మమేకం కావాలని ఆయన సూచించనున్నారు.
రుణమాఫీ అమలు తీరుకు వ్యతిరేకంగా నరకాసురవధ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిర్వహించిన విషయం విధితమే.
 ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు కార్యకర్తలు, నాయకులు గ్రామాల బాట పట్టాలని జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
రెండు రోజుల సమీక్ష అనంతరం, ఆగస్టు రెండో తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ వెళతారు.
 ఈ సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతోపాటు జిల్లా, నియోజక వర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరు కావాలని జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి కోరారు

ప్రభుత్వంపై ఒత్తిడి తెండి

Written By news on Wednesday, July 30, 2014 | 7/30/2014

ప్రభుత్వంపై ఒత్తిడి తెండి: వైఎస్ జగన్
హైదరాబాద్ : అధికార తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ సమీక్ష సమావేశంలో ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు.

పార్టీనేతలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన చెప్పారు. వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైఎస్ జగన్ కు చంద్రబాబుకు తేడా ?

వైఎస్ జగన్ కు చంద్రబాబుకు తేడా ఏమిటి?చంద్రబాబు నాయుడు - వైఎస్ జగన్
ఆంధ్ర్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు మధ్య తేడా ఏమిటా? అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరిగిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఉభయకమ్యూనీస్టులు ఒక్క శాసనసభా స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. మెజార్టీ స్థానాలను గెలుచుకొని అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలను ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. రుణాలు మాఫీ చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రుణాల మాఫీపై తొలి సంతకం అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు అతీగతీలేదు. అంటే తొలి సంతకం హామీకే దిక్కులేదంటే, ఆ తరువాత సంతకాల పరిస్థితి ఏమిటి?

 రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. రుణాలు మాఫీ గురించి గానీ, రాష్ట్ర రాజధాని ఏర్పాటు గురించి గానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను ఆయోమయంలో పడేస్తున్నారు. ఇక విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్ పరిస్థితి ఏమిటో అర్థంకాని పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనేది అర్ధం కావడంలేదు. ప్రభుత్వం దివాళా తీసిందని గత ప్రభుత్వాలను విమర్శించడమే చంద్రబాబు నాయుడు  ధ్యేయంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నిక ప్రచారంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలి రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. పరిపాలన మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హామీల అమలు విషయంలో ఇప్పుడు వనరుల సమీకరణ ఏమిటని అడుగుతున్నారు. 9 ఏళ్లు పరిపాలన చేసిన చంద్రబాబుకు వనరుల విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరి నేతల మధ్య తేడా విషయమై ప్రజలు చర్చించుకుంటున్న  ముఖ్యమైన అంశాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు:
1.అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. (గతానుభవాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు)
2. అధికారంలోకి రావడం కోసం ముందు వెనక ఆలోచనలేకుండా హామీలు గుప్పించారు.
3.రుణ మాఫీ సాధ్యం కాదని తెలిసి కూడా రైతులను, మహిళలను నమ్మించారు.
4. అధికారం దక్కించుకోవడానికే  ప్రధాన్యత ఇచ్చి ఎన్నికల వ్యూహం పన్నారు.
5.రాజకీయ అనుభవంతో ప్రజలను మోసం చేశారు.
6.అమలు చేయడం సాధ్యం కాని హామీలు ఇచ్చారు.
7. 9 ఏళ్ల అనుభవం ఉన్నా పాలనపైన, వనరులపైన స్పష్టతలేదు.
8. రైతులను మోసం చేయడానికి వెనుకాడలేదు.
9. వ్యసాయ బంగారు రుణాలు, డ్వాక్రా రుణాల విషయంలో మహిళలను మోసం చేశారు.
10. ఏరకంగానైనా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని అంతకు ముందు తీవ్రంగా విమర్శించిన బిజెపితో పొత్తు, పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టుకున్నారు.

వైఎస్ జగన్మోహన రెడ్డి:
1.నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.(మాటమీద నిలబడే తత్వం తండ్రి నుంచే సంక్రమించింది)
2. ప్రజలే దేవుళ్లు. ప్రజా సంక్షేమమే లక్ష్యం.
3.రుణ మాఫీ సాధ్యం కాదని తెలిసి పార్టీలో కొందరు నేతలు హామీ ఇవ్వమని చెప్పినా హామీ ఇవ్వలేదు.
4.అధికారం కంటే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రధాన్యత ఇచ్చారు.
5.రాజకీయ అనుభవం లేకపోయినా నిజాయితీగా వ్యవహరించారు.
6.అమలు కాని హామీలు ఇవ్వలేదు.
7. పరిపాలన, వనరులకు సంబంధించి అన్ని అంశాలలో స్పష్టత ఉంది.
8.రైతులను మోసం చేయడం ఇష్టంలేదు.
9. మహిళలను మోసం చేయడం ఇష్టంలేక అమ్మ ఒడి వంటి ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఇచ్చారు.
10. ప్రజలతోనే పొత్తు ముఖ్యం అని ఒంటరిగానే పోటీ చేశారు.
- ఎస్ఎన్ఆర్

జగన్ అండగా ఉంటారు..

ఈ బాధ ఎవ్వరికీ వద్దు
తూప్రాన్:  ‘సార్.. మా ఇద్దరు బిడ్డలను మాయదారి రైలు పొట్టనబెట్టుకుంది.. కన్నబిడ్డలు ఇద్దరు పోయి నిత్యం క్షోభకు గురవుతున్నాం.. ఈ గుండెకోత మరే తల్లిదండ్రులకూ రావొద్దు..’ అంటూ ఇస్లాంపూర్‌కు చెందిన తుమ్మ వీరబాబు వైఎస్సార్ సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పట్టుకుని బోరున విలపించారు. దీంతో ఎంపీ కళ్లు చెమర్చాయి.. పక్కనే ఉన్న పార్టీ రాష్ట్రనేతలు నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ చలించిపోయారు.

రైలు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలిసి పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటన మేరకు.. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.50 వేల చొప్పున, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ భిక్షపతి, క్లీనర్ రమేశ్ కుటుంబాలకూ వైఎస్సార్‌సీపీ ఆర్థిక చేయూతనిచ్చింది. గుండ్రెడ్డిపల్లిలో తరుణ్ ఇంటివద్దకు చేరుకున్న ఎంపీ శ్రీనివాస్‌రెడ్డిని మహిళలు ఏడుస్తూ చుట్టుముట్టారు.

తరుణ్ తల్లి బాలమణిని ఎంపీ ఓదార్చారు. ‘అమ్మా అన్న ఎక్కడపోయాడు.. నేను టాటా చెప్పకుండా ఎటెళ్లాడు.. అంటూ నా బిడ్డ నన్ను అడుగుతోంది. తనకు ఏం చెప్పాలే.. అంటూ  విలపించింది. అక్కా..ధైర్యం తెచ్చుకో నీకు మేమున్నామంటూ చెమర్చిన కళ్లతో శ్రీనివాస్‌రెడ్డి ఓదార్చారు. ఇస్లాపూర్‌లో చిన్నారి వైష్ణవి కుటుంబ సభ్యులను శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పరామర్శించారు. వైష్ణవి మేనమామ భూషణంగౌడ్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

వైఎస్ జగన్ అండగా ఉంటారు..
మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందిన 18 మంది చిన్నారుల కుటుంబాలను ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితుల కుటుంబాల ఇళ్లలోకి వెళ్లి ఘటన వివరాలు తెలుసుకున్నారు. తమ ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులను సముదాయిస్తూ మీరు అధైర్యపడవద్దు.. మీకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు.

డ్రైవింగ్‌లో నా భర్తకు 30 ఏళ్ల అనుభవం ఉంది
తన భర్త భిక్షపతిగౌడ్‌కు డ్రైవింగ్‌లో 30 ఏళ్ల అనుభవం ఉందని, ప్రమాదంలో ఆయన తప్పిదం ఉండకపోవచ్చని భార్య శివలక్ష్మి అన్నారు. వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్, రైలు ప్రమాదంలో మృతి చెందిన భిక్షపతిగౌడ్ కుటుంబాన్ని ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. శివలక్ష్మికి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి రూ.50 వేలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త 30 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారని, ఆయన తప్పు చేయకపోవచ్చని తెలిపారు. అయితే ప్రమాదంలో చిన్నారులు చనిపోయిన విషయం గుర్తుకు వస్తే గుండె తరుక్కుపోతోందని విలపించారు. అలాగే రైలు ప్రమాదంలో మృతి చెందిన బస్సు క్లీనర్ రమేశ్ కుటుంబ సభ్యులను ఘనాపూర్ గ్రామంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.

రైలు ప్రమాద స్థలంలో నివాళి

రైలు ప్రమాదం చోటు చేసుకున్న మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద ఎంపీతో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు మృతి చెందిన చిన్నారులకు నివాళులర్పించారు. మృతిచెందిన విద్యార్థుల చిత్రపటం వద్ద ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు సంజీవరావు, క్రీస్తుదాస్, జగదీశ్వర్‌గుప్తా, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు సంతోష్‌రెడ్డి, యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, జిల్లా నాయకులు రాంరెడ్డి, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, శివశంకర్‌పాటిల్, మశ్చేందర్, నర్సింలు, సుధాకర్‌గౌడ్, పరశురాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సిద్ధిరాములుగౌడ్, రఘునందన్‌రావు, టీఆర్‌ఎస్ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

సుష్మాస్వరాజ్ కు వైఎస్ జగన్ లేఖ

Written By news on Tuesday, July 29, 2014 | 7/29/2014

సుష్మాస్వరాజ్ కు వైఎస్ జగన్ లేఖ
హైదరాబాద్: లిబియాలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి  లేఖ రాశారు. లిబియాలో చిక్కుకుపోయిన తెలుగువారిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బతుకుతెరువు కరవైనవారు లిబియాకు వెళ్ళారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది తెలుగు ప్రజలు లిబియాలో చిక్కుకుపోయినట్లు సమాచారం ఉన్నట్లు తెలిపారు. వారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖలో జగన్ కోరారు.

లిబియాలో అంతర్యుద్ధం కారణంగా ఉపాధి కోసం  అక్కడకు వెళ్లిన భారతీయులు నానా కష్టాలు పడుతున్నారు. అక్కడ ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యతిరేక దళాలకు మధ్య  అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భోజనం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు.  హింస చెలరేగిన నేపథ్యంలో లిబియా నుంచి వెళ్లిపోవాలని భారతీయులకు అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. లిబియా నుంచి వెళ్లిపోవడానికి అన్ని మార్గాలను వినియోగించుకోవాలని, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని కోరింది

ఉపేక్షిస్తే ఊరుకోం

ఉపేక్షిస్తే ఊరుకోం
సాక్షి, కడప : ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న  జిల్లాలో అధికారులు ప్రోటోకాల్‌ను పాటించకుండా వ్యవహరిస్తున్నారని... ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అల్టిమేటం ఇచ్చారు.  సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కేవీ రమణను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,  ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి,  గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాష, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ కె.సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు కలిశారు.

 ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం చైర్మన్ పక్కన ఎమ్మెల్యేను ఎందుకు కూర్చోబెట్టలేదని ఎంపీ, ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను గట్టిగా ప్రశ్నించారు. కౌన్సిలర్ల మధ్య కుర్చీ వేసి ఎమ్మెల్యేను కూర్చోమనడం సబబుగా లేదని... గతంలో వరదరాజులురెడ్డి, లింగారెడ్డిలను పక్కన కూర్చొబెట్టిన అధికారులు ప్రస్తుతం అలా చేయకుండా  ఎందుకు పక్షపాతం చూపుతున్నారని ప్రశ్నించారు.

టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలను తుంగలో తొక్కితే చూస్తూ ఊరుకునేది లేదని, అవసరమైతే ఆందోళనలు చేయడానికి కూడా సిద్ధమని వారు హెచ్చరించారు. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీలు నిర్వహిస్తున్న వారిపై పార్టీ రంగు పులుముతూ ఇబ్బందులకు గురి చేయడం తగదని... రేషన్‌షాపు డీలర్లను  వేధింపులతోపాటు బెదిరింపులకు గురిచేయడం సహేతుకం కాదని కలెక్టర్‌కు వివరించారు.

జిల్లా అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం
జిల్లాలో అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరిస్తామని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు స్పష్టం చేశారు. జిల్లాకు ఎయిమ్స్‌తోపాటు సెయిల్, సెంట్రల్ యూనివర్శిటీలను తీసుకు రావాలని... ఈ విషయంలో ఎలాంటి అవసరం వచ్చినా తాము ముందుంటామని వారు తేల్చి చెప్పారు. పెద్ద పెద్ద పరిశ్రమలతోపాటు ప్రాజెక్టులు జిల్లాకు తీసుకువస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో ప్రాజెక్టులతోపాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.

నూతన ఎస్పీ గులాఠీతో కాసేపు....
 నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కడపకు వచ్చిన జిల్లా ఎస్పీ గులాఠీని వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కలిశారు. పోలీసు అతిథి గృహంలో ఉన్న ఎస్పీ గులాఠీని మర్యాద పూర్వకంగా కలిసి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్పీకి వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.

జేసీ, జెడ్పీ సీఈఓలతో  చర్చలు
కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్, జెడ్పీ చైర్మన్ తదితరులు జేసీ రామారావును కలిశారు. టీడీపీ ఛోటా నేతల వేధింపులు, ఇతరఅంశాలపై వారు రామారావుతో చర్చించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలోసీఈఓ మాల్యాద్రితో కూడా భేటీ అయ్యారు. జెడ్పీ అభివృద్దికి సంబంధించిన అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. జిల్లా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ముందుండాలని, ఇందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

రుణమాఫీపై సర్కారు మాయ

రుణమాఫీపై సర్కారు మాయ
బెళుగుప్ప : తెలుగుదేశం ప్రభుత్వం రుణ మా ఫీపై రైతులను మాయ చేస్తోందని ఎమ్మె ల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన బెళుగుప్పలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస కల్యాణమంట పంలో సర్పంచ్ రామేశ్వరరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దుద్దేకుంట రామాంజనేయులు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రైతులకు రూ.5000 కోట్ల రుణాలు ఉన్నాయన్నారు.

ఇవన్నీ మాఫీ అవుతాయన్న ఆశ తో వారు ఎదురు చూస్తున్నారన్నారు. అయితే ప్రస్తుత ం ప్రభుత్వం చెబుతున్న నిబంధనల మేరకు రూ. 1200 కోట్లు మాత్రమే మాఫీ అవుతాయని అన్నారు. అనంతపురాన్ని రెండవ రాజధాని ఏర్పా టు చేసే విషయం, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, కొత్త రుణాలు, డ్వాక్రా రుణా లు మాఫీ పక్కనపెట్టి రాజధాని నిర్మాణం కోసం అంటూ విరాళాల రూపంలో రూ.కోట్లు తీసుకెళ్లారని సీఎం చంద్రబాబునాయుడును విమర్శించారు. జిల్లాకు గత ఏడాదికి వచ్చిన రూ.678 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీలో కేంద్రం వాటా 57 శాతం ఇప్పటికే ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను రైతుల ఖాతాలకు జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నా రు.

ఖరీప్ సమయం పూర్తవుతున్నా రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయకుం డా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల కు మద్దతుగా ఉండి ఎన్నికల హామీలు అమలు చేసేవరకు పోరాడుమని తెలిపా రు.

కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ లాల్యానాయక్, పార్టీ జిల్లా అధికార ప్రతి నిది వీరన్న, సర్పంచ్‌లు అనిత, గోవిం దప్ప, ఎర్రిస్వామి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేశులు, సాలాబాయి, పార్టీ మండ ల మహిళా కన్వీనర్ యశోదమ్మ, సీనియ ర్ నాయకులు జక్కన్నగారి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్రిస్వామి, మాజీ సర్పం చ్ నక్కలపల్లి భాస్కర్‌రెడ్డి, పురుషోత్తం రాజు, లక్ష్మన్న, చౌదరి, నరిగన్న తదితరులు పాల్గొన్నారు. 

31నుంచి గుంటూరు జిల్లా నియోజకవర్గాల వారీగా 3 రోజులపాటు సమీక్షలు

31నుంచి వైఎస్సార్‌సీపీ సమీక్షలువీడియోకి క్లిక్ చేయండి
జిల్లాకు రానున్న వైఎస్సార్‌సీపీ అదినేత జగన్
►పార్టీ పరిస్థితులపై కార్యకర్తలతో చర్చ
►నియోజకవర్గాల వారీగా మూడు రోజులపాటు సమీక్షలు
► పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడి
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31వ తేదీనుంచి మూడు రోజులపాటు మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. నియోజకవర్గాలవారీగా అమరావతి రోడ్‌లోని బండ్లమూడి గార్డెన్స్‌లో జరిగే సమీక్షలకు పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పోటీ చేసిన ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని అన్ని విభాగాల నాయకులు హాజరు కావాల్సి ఉంటుదన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం హాజరుకావాలన్నారు. అధినేత జగన్‌మోహన్‌రెడ్డి 31వ తేదీ ఉదయం 9గంటలకు నగరానికి చేరుకుంటారన్నారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 సమీక్షల షెడ్యూల్
 తేదీ                               సమయం             నియోజకవర్గాలు
 31-07-14                  10గం.లకు            గుంటూరు తూర్పు, పశ్చిమ
                                    12గం.లకు             ప్రత్తిపాడు, తాడికొండ
                                    2.30గం.లకు         పొన్నూరు, తెనాలి
                                    5గం.లకు              వేమూరు, రేపల్లె
 01-08-14                  9 గం.లకు             నరసరావుపేట,చిలకలూరిపేట,
                                   1.00గం.లకు          గురజాల, మాచర్ల,
                                   4.00గం.లకు           వినుకొండ, సత్తెనపల్లి
                                    6.00గం.లకు           పెదకూరపాడు, బాపట్ల
 02-08-14                  9గం.లకు                చీరాల, పరుచూరు
                                 11గం.లకు                సంతనూతలపాడు, అద్దంకి

రంజాన్ శుభాకాంక్షలు

Written By news on Monday, July 28, 2014 | 7/28/2014


రంజాన్  పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడం ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత . నెలపాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా ఐకమత్యంతో మెలగడం, క్ర మశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశo.

టీడీపీ మంత్రులది దిగజారుడుతనం

టీడీపీ మంత్రులది దిగజారుడుతనం
  • ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఎర్రచంద్రనం డబ్బుతోనే వైఎస్సార్‌సీపీ గెలిచిందనడం టీడీపీ మంత్రుల దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అదే చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలిచిన 6 సీట్లు ఎర్రచందనం డబ్బుతోనే గెలిచారా అంటూ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఆదివారం వైఎస్‌ఆర్ సీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి స్పందించారు. తుమ్మలగుంటలోని తన స్వగృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

 ‘చిత్తూరు నగరానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్, టీడీపీ నేత బుల్లెట్ సురేష్ పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయ్యారు. చిత్తూరు కార్పొరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బుల్లెట్ సురేష్ అందించిన డబ్బుతోనే గెలిచారా ? చంద్రబాబు, సీఎం రమేష్ అనుచరులు రెడ్డి నారాయణ, మహేష్ నాయుడు ఎర్రచందనం కేసులో అరెస్టు అయ్యారు. అప్పుడు రెడ్డి నారాయణ, మహేష్‌నాయుడుల ఎర్రచందనం స్మగ్లింగ్ దందాతో చంద్రబాబు, సీఎం రమేష్‌కు సంబంధం ఉందని అనుకోవాలా ? దేవినేని ఉమా సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

పాలన చేతగాక, ఏం చేయాలో తెలియక ప్రతిపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేయడం టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీకి ప్రజలే ప్రతిపక్షం అయ్యేరోజులు ఎంతో దూరం లేవన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలే తప్ప ప్రతిపక్షంపై నిరాధార అరోపణలు చేయడం మంచిది కాదన్నారు. 9 ఏళ్ల బాబు పాలనలో లక్ష మంది రైతులపై కేసులు పెట్టించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ చంద్రబాబుకు మోసం చేయడం తప్ప ప్రజలకు మంచిచేసే గుణం లేదన్నారు.

ఎస్‌ఎల్‌ఎల్బీసీ లెక్కల ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఏటా 60 నుంచి 70 శాతం మంది రైతులు రుణాలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఖరీఫ్‌లో ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే దేశ చరిత్రలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు చేసిన రుణ మాఫీ ఓ బూటకమన్నారు. బాబు తొలి సంతకమే ఓ మాయ అని విమర్శించారు.

రుణ మాఫీపై ఇప్పటికీ తలాతోకలేని లేని ప్రకటన చేసి తమ్ముళ్ల చేత బలవంతంగా సంబరాలు చేయించడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. అడ్డగోలు రాష్ట్ర విభజనకు చంద్రబాబు కారణమన్నారు. రెండుకళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. ఆ పాపమే ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. టీడీపీలో 420లను పెట్టుకుని ప్రతిపక్షంపై బురద చల్లడం బాధాకరమన్నారు. దెయ్యాలే వేదాలు వల్లించినట్టు చంద్రబాబు, టీడీపీ నేతలు వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి

‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి
  • పెద్దమోదుగపల్లిగ్రామంలో టీడీపీ నేతల అరాచకం
  •  మృతుడు మధుసూదనరావు మాజీ సర్పంచి
  •  వివాదం వద్దని సర్ది  చెబుతుండగా దాడి
వత్సవాయి : టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఆదివారం మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామ మాజీ సర్పంచి కల్యాణం మధుసూదనరావు(61)కు గ్రామ శివారున మామిడితోట ఉంది. అక్కడ ఆయన కుమారుడు విద్యాసాగర్ జేసీబీతో కాలువ తీయిస్తున్నాడు. తోట పక్కన నివాసం ఉంటున్న వారు కట్టెలను తీసి గట్టుపై ఉంచారు. జేసీబీకి అడ్డు వస్తున్నాయి.. వాటిని తీయాలని విద్యాసాగర్ చెప్పారు.

ఇది పోరంబోకు స్థలం తియ్యమని చెప్పడానికి నీవెవరు అంటూ అతడిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న మధుసూదనరావు తోట దగ్గరకు వెళ్లగా, అప్పటికే వివాదం ముదిరింది. ఘర్షణ వద్దని మధుసూదనరావు సర్ది చెబుతుండగా, టీడీపీ నేతలై న గ్రామ ఉప సర్పంచి నందమూరి శ్రీను, రాము, కనగాల గణపతిలు దాడికి దిగారు. ఈ ఘటనలోమధుసూదనరావు అక్కడిక్కడే కుప్పకూలారు. గ్రామస్తులు ఆటోలో జగ్గయ్యపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
గ్రామస్తుల ఆందోళన
 
మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని  సీఐ వీరయ్యగౌడ్ హామీతో  శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదనరావు మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముందస్తుగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
 
ఉదయభాను  పరామర్శ
 
తెలుగుదేశం నాయకుల దౌర్జన్యానికి బలైన గ్రామ మాజీ సర్పంచి మధుసూదనరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు కనపర్తి శేషగిరిరావు, మారెళ్ల పుల్లారెడ్డి, ఇంటూరి చిన్నా, మున్సిపల్ మాజీ  చైర్మన్ ఎంవీ చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నంబూరి రవి, చౌడవరపు జగదీష్ తదితరులు వసందర్శించి నివాళులర్పించారు. మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు

రైతులను మభ్యపెడుతున్న చంద్రబాబు
సాక్షి, నెల్లూరు : రుణమాఫీపై రోజుకో తప్పుడు ప్రకటన చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో రైతు రుణాలతో పాటు డ్వాక్రా రుణాలన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబు పదేపదే హామీలు ఇచ్చారన్నారు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దంటూ ఆయన రైతులను రెచ్చగొట్టిన సందర్భాలున్నాయన్నారు. బాబు హామీలను నమ్మి జనం ఓట్లేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలను, డ్వాక్రా మహిళలను వంచిస్తున్నారని మేరిగ మండిపడ్డారు. జూన్ ప్రారంభానికి రైతులకు ఖరీఫ్ ప్రారంభమైందన్నారు.
 
 అప్పటికే పాతబకాయిలు చెల్లించి బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు పొందాల్సి ఉందన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారన్నారు. అయినా బాబు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మేరిగ విమర్శించారు.  ఇప్పుడు చంద్రబాబు రీ షెడ్యూల్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారని మేరిగ విమర్శించాడు. చంద్రబాబు చెప్పినట్టు రీషెడ్యూల్ ద్వారా రుణాలు అందించే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయన్నారు. ఇక డ్వాక్రా రుణాల పరిస్థితి ఇంతకు తక్కువేమీ కాదన్నారు. పేరుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పినా దీనిపై కూడా స్పష్టత లేదన్నారు.
 
 డ్వాక్రా రుణాలు రీ షెడ్యూల్ చేసే పరిస్థితి లేదని మేరిగ చెప్పారు. ఈ నెల చివరకు పంటల బీమా గడువు ముగుస్తుందన్నారు. ఇంతలోపు రైతులు రుణాలు పొందకపోతే భవిష్యత్‌లో పంటలు నష్టపోయినా బీమా వర్తించదన్నారు. ఇప్పటికైనా బాబు అబద్ధాలు మాని చిత్తశుద్ధితో అన్నదాతను ఆదుకునేందుకు ప్రయత్నించాలని మేరిగ మురళీధర్ హితవు పలికారు. రైతులకు అన్యాయం జరగకూడదని తమ పార్టీ ఆందోళనలకు దిగిందని మేరిగ చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రుణమాఫీ ఎక్కడుంది?

Written By news on Sunday, July 27, 2014 | 7/27/2014

   రైతుల రుణమాఫీపై క్యాబినేట్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. కానీ ఎప్పుడు, ఎలా చేస్తారనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంతా అయోమయం, గందరగోళంగా ఉంది.

 2    రుణమాఫీపై అబద్ధపు ప్రచారాలెందుకు? ఎర్రచందనం చెట్లను తాకట్టు పెడతామని, నదుల్లో ఇసుక తవ్వకాలపై సెస్ వేస్తామని.. ఇలా ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదనలు తెరమీదకు తెచ్చి ఎందుకు మభ్యపెట్టాలనుకుంటున్నారు?

 3    పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని మంత్రులే చెబుతున్నారు. బ్యాంకర్లు మాత్రం కొత్త రుణాలు ఇవ్వడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రుణమాఫీ ఎక్కడుంది?

 4    మీ హామీలు నమ్మి పాత రుణాలను బ్యాంకులకు చెల్లించలేదు. జూన్ 30వ తేదీలోపు చెల్లిస్తే పావలా వడ్డీతో సరిపోయేది. ఇప్పుడు 13 శాతం వడ్డీ కట్టాలంటున్నారు. ఉదాహరణకు అప్పట్లో రూ. 3,000 కడితే సరిపోయేది. ఇప్పుడు రూ.13,000 చెల్లించాలి. అదనంగా ఈ వడ్డీ ఎవరు కట్టాలి? మేమా.. లేక ప్రభుత్వం భరిస్తుందా? దయ చేసి స్పష్టత ఇవ్వండి.

 5    రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పంటల బీమాకు మేము అనర్హులమవుతున్నాం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు?

 6    రుణమాఫీ అమలు అయిపోయినట్లే టీడీపీ సంబరాలు చేసుకుంది.  సీఎంగా మిమ్మల్ని అభనందించడానికి పోటీపడ్డారు. కానీ బ్యాంకులు రుణాలు కట్టాలని నోటీసులు ఇస్తున్నాయి. బంగారం వేలం వేస్తామని నిక్కచ్చిగా చెబుతున్నాయి. ఇది న్యాయమా?

Popular Posts

Topics :