10 August 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?

Written By news on Saturday, August 16, 2014 | 8/16/2014

రూ.5 లక్షల కోట్లు డిమాండ్ ఏమైంది?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికారం ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తన తొలి సంతకం రుణమాఫీకి అసలు విలువ ఏమైనా ఉందా?అని ప్రశ్నించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఇప్పటి వరకూ ఒక సంతకాన్ని అయినా అమలు చేయడంలో సఫలమైయ్యారని నిలదీశారు. రాజధానిపై కేంద్రం వేసిన కమిటీ నివేదిక ఇవ్వకుండానే గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని చేస్తామని ప్రకటన చేయడం వెనుక ఆంతర్య ఏమిటని అంబటి అడిగారు. చంద్రబాబు తనకు సంబంధించిన వ్యక్తుల భూముల రేట్లు పెంచడానికే అలాంటి ప్రకటనలు చేశారని ఎద్దేవా చేశారు.
 
రుణమాఫీపై కూడా బోగస్‌ ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  ఏ రాష్ట్రంలో కూడా పోలీసు వ్యవస్థను ప్రతిపక్ష పార్టీపై దాడులు చేసే విధంగా వాడుకోలేదన్ని విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు సింగపూర్ వెళ్లి అక్కడి అధికార్ని కలిసినంత మాత్రానా రాష్ట్రం సింగపూర్ లా తయారవుతుందా?అని అంబటి ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షల కోట్లు తెస్తామన్న డిమాండ్ ఏమైందన్నారు. కనీసం రూ.2 లక్షల కోట్లు అయినా తెస్తారా?అని అంబటి బాబుకు సవాల్ విసిరారు.

వైఎస్‌ను రైతులు మరువరు

ఎత్తిపోతల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈ ప్రాంత రైతులు ఎన్నటికీ మరవరని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో ఎత్తిపోతల పథకానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న నూతన భవన కార్యాలయానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన నిడమర్రు ఎత్తిపోతల పథకం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు మూడు వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్నారని చెప్పారు. రైతులు బాధలు తన కంటితో చూసిన వైఎస్సార్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంతోపాటు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు.

నేడు రైతులు గిట్టుబాటు ధరల్లేక పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం చేసేందుకు ఇబ్బం దులు పడుతుంటే అమలుకు సాధ్యం కాని వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు.. రుణమాఫీపై కాలయాపన చేస్తున్నారని విమర్శిం చారు. బ్యాంకుల నుంచి రైతులకు వస్తున్న నోటీసులకు ఏమని సమాధానం చెబుతారని ఆర్కే ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉపసర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమగుండ్ల నాగరత్నం, ఎత్తిపోతల పథకం ఛైర్మన్  శివన్నారాయణరెడ్డి, సభ్యులు గాదె వీరాంజనేయరెడ్డి, గాదె సాంబిరెడ్డి, మర్రెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాదె లక్ష్మారెడ్డి, నాయకులు భీమవరపు సాంబిరెడ్డి, కొల్లి శేషిరెడ్డి, కంఠం నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండు రాష్ట్రాల ప్రజలూ సుఖసంతోషాలతో ఉండాలి: వైఎస్ జగన్‌


* వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతి అవ్వా, తాతలకు, ప్రతి సోదరి, సోదరులకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సుఖ సంతోషాలనివ్వాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో గంటకుపైగా గడిపి వారందరితో ముచ్చటించారు.
 
 షారిఖ్‌కు అభినందన..
 అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో పీహెచ్‌డీ సీటు సాధించిన కర్నూలుకు చెందిన షారిఖ్ అహ్మద్‌ను జగన్ ఈ సందర్భంగా అభినందించారు. దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

బాక్సైట్ గనులపై బాబు గురి!

బాక్సైట్ గనులపై బాబు గురి!
 • కార్యాచరణ వేగవంతం చేసిన ప్రభుత్వం
 •   గిరిజనుల వ్యతిరేకత బేఖాతరు
 •   అస్మదీయులతోనే గ్రామసభల ఏర్పాటుకు వ్యూహం
 •   బాక్సైట్ తవ్వకాలకు అనుమతులే అసలు లక్ష్యం
 •   ఒడిశా ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని ప్రభుత్వం
 •   బాక్సైట్ తవ్వకాలతో ఏటా 3,600 కోట్ల ఆదాయం
 •   కానీ అందులో సర్కారుకు దక్కేది రూ.75కోట్ల రాయల్టీ మాత్రమే
 
 విశాఖ ఏజెన్సీలో మూడు గ్రూపుల కింద అరకు, చింతపల్లి ప్రాంతాల్లో 3,561  హెక్టార్లలో దాదాపు 564.9మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. 
 
 విశాఖ ఏజెన్సీలో తవ్వకాలు చేపట్టిన కంపెనీకి ఏడాదికి 3,600 కోట్ల రూపాయల నికరలాభం వస్తుందని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) అంచనా.  కానీ దీనిలో ప్రభుత్వానికి ఏడాదికి 75 కోట్ల రూపాయల రాయల్టీ మాత్రమే వస్తుంది. 
 
 బాక్సైట్ ఖనిజాన్ని అల్యూమినియం ఉత్పత్తిలో వాడతారు. ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తి చేయాలంటే 5.6 టన్నుల బాక్సైట్ ఖనిజం కావాలి. కానీ అల్యూమినియం ఉత్పత్తి క్రమంలో 1.2 టన్నుల అత్యంత విషపూరితమైన రెడ్‌మడ్ కూడా ఉత్పత్తి అవుతుంది. అందుకే దీనిపై గిరిజనులనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది... గిరిజన ప్రాంతాలు, గిరిజనుల హక్కుల పరిరక్షణకోసం పీసా చట్టం ఉంటే మాత్రం లెక్కేముంది... గిరిజనులు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గిరిజనుల చేతివేళ్లతోనే వారి కళ్లు పొడిచేందుకు ఆగమేఘాలమీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. 1998 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏనాడూ ఈ గ్రామసభల గురించి పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. ఐటీడీఏ, ఏపీఎండీసీ ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుపుతామని చెబుతున్నప్పటికీ, ఆ పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడమే లక్ష్యమని తెలుస్తోంది. అందులో భాగంగానే గిరిజన ప్రాంతాల్లో నెలరోజుల్లోనే గ్రామసభలు ఏర్పాటు చేయాలని ఈ నెల 8, 9 తేదీలలో విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. దీంతో పాడేరు ఐటీడీయే అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్‌ను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
 564.9 మిలియన్ టన్నులు
 విశాఖ ఏజెన్సీలో 564.9 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయని అంచనా. విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ నిల్వలను ఏడాదికి 4.5 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 75 సంవత్సరాలు తవ్వుకోవచ్చు. పీసా చట్టం ప్రకారం గ్రామ సభల ఆమోదం లేకుండా తవ్వకాలు సాధ్యంకాదు. దీంతో తమ పార్టీ నేతలు, సానుభూతిపరులతోనే గ్రామ సభలను ఏర్పాటు చేసి, అనంతరం ఆ సభల ద్వారా తవ్వకాలకు ఆమోదం పొందేలా సర్కారు అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 244 పంచాయతీలతోపాటు నాతవరం మండలంలోని నాలుగు పంచాయతీల పరిధిలో గ్రామసభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ పరిధిలో 3 నుంచి 7 వరకు గ్రామాలు ఉన్నాయి. అందుకే మొత్తం 288 పంచాయతీలలో సగటున పంచాయతీకి 3 చొప్పున దాదాపు 776 గ్రామసభలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆగస్టు 16న ఈ ప్రక్రియ ప్రారంభించి సెప్టెంబర్ 9నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశారు. 
 
 గతంలో బోల్తాపడ్డ ఒడిశా ప్రభుత్వం
 
 ఒడిశాలోని నియోమగిరి పర్వతాల్లో అపారంగా ఉన్న  బాక్సైట్ నిక్షేపాల తవ్వకాల కోసం ఒడిశా ప్రభుత్వం కూడా గ్రామసభలను మేనేజ్ చేసింది. తమ పార్టీ సానుభూతిపరులతో ఏర్పాటు చేసిన గ్రామసభల ఆమోదాన్ని పొంది వేదాంత సంస్థకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చేసింది. కానీ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన గిరిజనులు సుప్రీంకోర్డును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్డు ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో మళ్లీ గ్రామసభలు నిర్వహించగా అసలు వ్యవహారం బట్టబయలైంది. దాంతో బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాల్సి వచ్చింది. మన రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడ వేస్తే అలాంటి పరిణామమే పునరావృతమవుతుందని ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయమూర్తి సమక్షంలోనే పారదర్శకంగా గ్రామసభలు తీర్మానం చేసేలా తాము ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నాయి. 
 
 ఆనాడే చంద్రబాబు దొంగాట
 కాంగ్రెస్ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాల అంశాన్ని పరిశీలిస్తున్న సమయంలో గిరిజనులు, ప్రజాసంఘాలు ఉద్యమించాయి. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఓ ప్రజాసంఘాల నేతకు ఫోన్ చేసి తాను బాక్సైట్ తవ్వకాల వ్యతిరేక ఉద్యమంలో కలసి పనిచేస్తానని చెప్పారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘‘మీరు అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలు చేపట్టమని హామీ ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని మాతో ఉద్యమంలో కలుపుకుని వెళతాం’’అని ఆయన షరతు విధించారు. ఆ వెంటనే చంద్రబాబు మాటమార్చేసి అంతటితో ఆ ఫోన్ సంభాషణను అర్ధంతరంగా ముగించేశారు. ఆ ఉదంతాన్నే ఆ సామాజిక కార్యకర్త చెబుతూ చంద్రబాబు వైఖరి మొదటి నుంచీ అంతేనని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఒడిశాలో మాదిరిగానే ఇక్కడ కూడా తాము న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేస్తామని చెప్పారు. 
 
 పీసా చట్టం ఏం చెప్తోంది?
 కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా 1996లో పంచాయతీ(షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరీకరణ) చట్టాన్ని రూపొందించింది. దీన్నే పీసా చట్టం అంటారు. అందుకు అనుగుణంగా 1998లో మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ (సవరణ) చట్టం చేసింది. ఆ ప్రకారం గ్రామసభలకు విశేష అధికారాలు అప్పగించింది. తదనుగుణంగా 2011లో ప్రభుత్వం ఈ విషయాన్ని గెజిట్‌లో కూడా పొందుపరిచింది. ఈ పీసా చట్టం ప్రకారం గ్రామసభకు సంబంధిత పంచాయతీ సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కొందరు సభ్యులు ఉంటారు. గ్రామానికి ఒకరుచొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలపై ఈ గ్రామసభలకే విశేష అధికారాలు ఇచ్చారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజికవనరులు, చిన్న తరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్యం-విక్రయం తదితర అన్నింటిపైనా గ్రామసభలదే అంతిమ నిర్ణయం. గిరిజన ప్రాంతాల్లో  ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాల పనితీరు, మద్యం దుకాణాల ఏర్పాటు, గనుల తవ్వకాలు, భూసేకరణ తదితర అన్నింటిపైనా  నిర్ణయాధికారం గ్రామసభలదే. ఈ గ్రామసభల అనుమతి లేకుండా ఏదీ చేయడానికి వీల్లేదు.

జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్

Written By news on Friday, August 15, 2014 | 8/15/2014


జెండావిష్కరణ చేసిన వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 68వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలతోపాటు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళుల్పించారు.
ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి 68వ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


బాబుపై ప్రజలు తిరగబడడం ఖాయం

బాబుపై ప్రజలు తిరగబడడం ఖాయం
పశుపోషణ శిబిరాలు ఏర్పాటు చేసి
పాడి రైతులను ఆదుకోండి


మదనపల్లె: సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఆరు నెలల్లో తిరగబడడం ఖాయమని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో శుష్క వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి బాబు ప్రజలను తీవ్రంగా మోసం చేశారన్నారు. రుణమాఫీకి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించకపోవడంతో ఇక అది అసాధ్యమని తేలిపోయిందని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయిందని, మరో నాలుగు నెలలు చూసి ప్రజలు తిరగబడడం తథ్యమని అన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకతీతంగా పోరాటం చేస్తోందన్నారు. కొత్త రాజధాని ఏర్పాటు కూడా కలగానే మిగలనుందని, ఇందుకు నిధుల లేమి ప్రధాన కారణమని అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడిందని, మూగజీవాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పశుపోషణ శిబిరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ నిధులను రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికే ఖర్చు చేయనున్నామని వివరించారు.

మదనపల్లె నీటి సమస్యపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో చర్చించానని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం తన సొంత జిల్లాపై శీతకన్ను వేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. జిల్లా కు రూ.100 కోట్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. ఎంపీపీలు సుజన, జరీనాహైదర్, సర్పంచ్ శరత్‌రెడ్డి, నేతలు మాధవరెడ్డి, మెట్రో బాబ్‌జాన్, హర్షవర్ధన్‌రెడ్డి, రెడ్డిశేఖర్‌రెడ్డి, తట్టినాగరాజరెడ్డి, నవాజ్, రఫీ పాల్గొన్నారు.

హత్యా రాజకీయాలొద్దు

హత్యా రాజకీయాలొద్దు
కంచికచర్ల : నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే రాజకీయ నాయకులు హత్యలను ప్రోత్సహించవద్దని, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని వైఎస్సార్‌సీపీ  విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు కోనేరు రాజేంద్రప్రసాద్ సూచించారు. మండలంలోని గొట్టుముక్కలలో ఆదివారం అర్థరాత్రి హత్యకు గురయిన ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను గురువారం కలుసుకుని ప్రగాడ సానుభూతి తెలిపారు. హత్య జరిగిన తీరుపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు.

నిద్రపోతున్న కృష్ణారావును లేపి రాడ్లతో, కర్రలతో కొట్టి రెండు పెడరెక్కలు విరిచి లాక్కుంటూ కాళ్లతో తన్నుకుంటూ బయటకు తీసుకువెళ్లి చంపి రోడ్డుపై పడేశారని కృష్ణారావు భార్య ముత్తమ్మ, కుమార్తె వాసిరెడ్డి నాగమణి  చెప్పారు.  కుంటుంబానికి పెద్దదిక్కు పోయిందని కోనేరు ముందు బోరున విలపించారు. తమను దిక్కులేని వారిని చేసిన  హత్యను ప్రోత్సహించిన వారిని శిక్షించాలని అన్నారు.

కోనేరు మాట్లాడుతూ  ఈ విషయాలన్నీ జిల్లా ఎస్పీ విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లి హత్యకు సహకరించిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తానని అన్నారు. పచ్చని గ్రామాల్లో జీవించే వారిపై రాజకీయాల కోసం దాడులు చేసి హత్యలు చేయడం సరికాదని హితవు పలికారు. గ్రామాల్లో అందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధికోసం పాటుపడాలని, కక్షలు పెంచుకుంటూపోతే ప్రజలు గ్రామాల్లో ఎవరూ మిగలరని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధికారంలో ఉన్నంత మాత్రాన హత్యలు చేస్తే చట్టం ఊరుకోదని తెలిపారు.

అనంతరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపై రాళ్లు రువ్వి కిటికీ అద్దాలను పగులకొట్టారని, బయటకు వస్తే చంపుతామని  నానా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారని కోనేరుకు తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమయం నుంచి టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అయినా ఊరుకుంటున్నామని దీంతో పోలీసు వర్గాలన్నీ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కోనేరుతో పార్టీ నేతలు వాపోయారు.

కోవెలమూడి వెంకటనారాయణ, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట మున్సిపల్‌చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు షేక్ షహనాజ్‌బేగం, మహ్మద్ గౌస్, గుదే రంగారావు, అక్కారావు, తాటుకూరి గంగాధరరావు, కోటేరు సూర్యనారాయణరెడ్డి, ములకలపల్లి శేషగిరిరావు, వాసిరెడ్డి విజయకుమార్, జొన్నలగడ్డ సుబ్బారావు, ఆలోకం శ్రీనివాసరావు, గుదే సాంబశివరావు, తాటుకూరి అమ్మారావు, బండి వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

బిజీబిజీగా..

బిజీబిజీగా..
- బంధువులు,స్నేహితులతో కలివిడిగా జగన్
- కుటుంబ సభ్యులతో కలిసి పలు వివాహాలకు హాజరు
- వేంపల్లెలో మూడు కుటుంబాలకు పరామర్శ
 సాక్షి కడప/కార్పొరేషన్/వేంపల్లె/ముద్దనూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఒకపక్క వివాహ కార్యక్రమాలకు హాజరవుతూనే.. మరోపక్క తనను కలవడానికి వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7గంటలవరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలు, రైతులతో గడిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.  
 
వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
ఒకరోజు జిల్లా పర్యటనకు హైదరాబాదునుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ముద్దనూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ,సతీమణి భారతీరెడ్డితో కలసి రైలు దిగిన జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌నెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి,సంబటూరు ప్రసాద్‌రెడ్డి,రాయచోటి మదన్‌మోహన్‌రెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి రవి ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్ళారు.

పులివెందులలోని వీజే కళ్యాణ మండపంలో జరిగిన  వైఎస్ జోసఫ్‌రెడ్డి కుమార్తె వీణా, పవన్‌కుమార్‌రెడ్డి వివాహానికి గురువారం ఉదయాన్నే  వైఎస్ జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సాయంత్రం పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనుమడు, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు వైఎస్ అభినవ్‌రెడ్డి, కృష్ణచైతన్యల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం అంబకపల్లె లక్ష్మినారాయణరెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి, సుమతి వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి సోదరుడు చంద్రమోహన్‌రెడ్డి, కవితల వివాహానికి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత కడపకు వెళ్లి సోమశేఖరరెడ్డి కుమార్తె శివతేజ, మనో వికాస్‌లను ఆశీర్వదించారు. శిల్పారామంలో ఇందుకూరు రమణారెడ్డి కుమార్తె ప్రశాంతి, సునీల్ రిసెప్షన్ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించారు.
 
మూడు కుటుంబాలకు పరామర్శ :
మండల కేంద్రమైన వేంపల్లెకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త బొమ్మిరెడ్డి రామిరెడ్డి 10రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్ వేంపల్లెకు వెళ్లి రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కొరివి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వేంపల్లెకు చెందిన కొండయ్య ఈ మధ్యనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కొండయ్య భార్య ఈశ్వరమ్మను పరామర్శించారు. ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్ వల్లీ ఆయన వెంట ఉన్నారు. అంతకు ముందు వేంపల్లెకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు :
పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌ను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు తదితరులు కలిసి అనేక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.
రాజన్న పాలన కోసం ఎదురు  చూస్తున్నాం

రాజన్న పాలన కోసం తాము ఎదురు చూస్తున్నామని కడపలోని రవీంద్రనగర్ మహిళలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో అన్నారు. గురువారం ఆయన కొమ్మా సోమశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్తుండగా కొందరు మహిళలు ఆయన కాన్వాయ్‌కి అడ్డుపడి దిగాలని పట్టుబట్టారు. ఎన్నికల్లో మీ ప్రభుత్వమే వస్తుందని ఆశపడ్డామని   పరిస్థితి తారుమారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

నెల్లూరు మేయర్ అజీజ్ పై అనర్హత వేటు వేయండి

Written By news on Thursday, August 14, 2014 | 8/14/2014

'నెల్లూరు మేయర్ అజీజ్ పై అనర్హత వేటు వేయండి'
నెల్లూరు: నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తోపాటు 12 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ పై చర్య తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు వైస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. 
 
ఎన్నికల నియమావళి, నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన అజీజ్ కు మేయర్ గా కొనసాగే హక్కులేదని కోటంరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి నెల్లూరు మేయర్ గా ఎంపికైన అబ్దుల్ అజీజ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

చిన్నాన్న కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్


చిన్నాన్న కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డి
కడప: వైఎస్ఆర్ జిల్లా  పులివెందులలో ఈ ఉదయం జరిగిన తన చిన్నాన్న వైఎస్ జోసఫ్‌ రెడ్డి కుమార్తె వీణ, పవన్‌ కుమార్‌ రెడ్డిల వివాహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు.   నూతన  వధూవరులను ఆశీర్వదించారు.  విజె ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఈ వివాహానికి  వైఎస్ జగన్ తల్లి విజయమ్మ,  భార్య  వైఎస్‌ భారతి,  సోదరి షర్మిల,  మరో చిన్నాన్న వివేకానంద రెడ్డితోపాటు  అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

వైఎస్ పాల్ రెడ్డి ఫంక్షన్ హాలులో ఈ రాత్రికి జరిగే మరో వివాహానికి కూడా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో సహా హాజరవుతారు. ఈ రాత్రికి జగన్ పెదనాన్న, పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ మధురెడ్డి చిన్న కుమారుడు అభినవ్ రెడ్డి, వధువు కృష్ణచైతన్యల వివాహం జరుగుతుంది. ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. రాత్రికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైలులో జగన్  హైదరాబాద్ బయలుదేరతారు.

టీడీపీ 3 నెలల పాలనలో 19 హత్యలు


టీడీపీ 3 నెలల పాలనలో 19 హత్యలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజం
     
గ్రామాల్లో చిచ్చుపెట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు
చంద్రబాబుకు మానవత్వం ఉందా?
టీడీపీకి ఓటు వేయలేదన్న ఒకే కారణంతో కృష్ణారావును చంపారు
సీబీఐ విచారణ కోసం కోర్టును ఆశ్రయిస్తాం
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం


విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 19 హత్యలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మానవత్వం ఉందా అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత, గ్రామ ఉప సర్పంచి ఆలోకం కృష్ణారావు కుటుంబ సభ్యులను జగన్ బుధవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గొట్టుముక్కల ఘటనపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. జగన్ మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..
‘‘ఆదివారం రాత్రి గ్రామంలో అందరూ చూస్తుండగా కృష్ణారావును దారుణంగా హతమార్చారు. చంపొద్దని ఆయన భార్య కాళ్లావేళ్లా పడ్డా లెక్కచేయలేదు. ఇది నిజంగా సమాజం సిగ్గుపడాల్సిన ఘటన. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న ఒకే కారణంతో ఉప సర్పంచిని, గతంలో ఏ తప్పూ చేయని వ్యక్తిని, ఒక్క కేసూ లేని వ్యక్తిని హతమార్చారు. ఇతర పార్టీలకు ఓట్లు వేసే వారు ఉండకూడదన్న దౌర్భాగ్య ఆలోచనతో గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆరోజు పొద్దున్నే గ్రామంలో యర్రంరెడ్డి సీతయ్యను కొట్టారు. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు అవహేళన చేశారు. మళ్లీ రాత్రి 9 గంటలకు గ్రామంలో సెల్వరాజు అనే వ్యక్తి తల పగులగొట్టారు. రక్తం కారుతున్న సెల్వరాజు ఫోన్‌చేసి పోలీసులను బతిమిలాడినా, చివరకు సర్పంచి ఫోను చేసినా పోలీసులు స్పందించలేదు. అదే రోజు రాత్రి 11.30 గంటలకు సెల్వరాజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసులు పెట్టమని అడిగినా పట్టించుకోలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. రాత్రి 11.50 గంటలకు గ్రామంలో యథేచ్ఛగా దాడిచేశారు. 20 మంది ఇంటి బయట ఎవ్వరూ రాకుండా కాపు కాస్తుండగా ఆరుగురు కృష్ణారావు ఇంట్లోకి చొరబడి అతి కిరాతకంగా చంపేశారు. పోలీసులను ఇంత దారుణంగా వాడుకోవడం సరైన పద్ధతా? చంద్రబాబు అధికారంలో ఉండొచ్చు. కానీ ఇది శాశ్వతం కాదు. ఇవ్వాళ వారు ఉండొచ్చు. రేప్పొద్దున మనం ఉంటాం. సాక్షాత్తూ పోలీసులకు సహకరించండి అంటూ సిగ్నల్స్ ఇచ్చి, వారి డ్యూటీని చేయనీయకుండా చేస్తున్నారు. హింసను ప్రోత్సహించేలా, పోలీసులను కూడా భాగస్వాములను చేసేలా ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరించటం ఎంతవరకు సమంజసం? హత్య జరిగి రెండు రోజులైనా నిందితులను అరెస్టు చేయలేదు. వారే వచ్చి లొంగిపోయేదాకా అరెస్టు చేయలేదంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది.’’

రెండున్నర నెలల క్రితం కూడా ఇంతే...

‘‘ఇదే జిల్లాలో రెండున్నర నెలల క్రితం ఇటువంటి కిరాతక హత్య జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గంలో మే 16న బాణాసంచా కాలుస్తుంటే పిల్లలు భయపడతారని, పక్కన కాల్చండి అని చెప్పినందుకు రేపల్లె సురేష్ అనే వ్యక్తి నెత్తి పైనే బాంబు పెట్టి  చంపేస్తే దిక్కుదివాణం లేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. చంద్రబాబును అడుగుతున్నా.. నువ్వు నిజంగా మనిషివేనా?’’ ఓటు వేయలేదనే కారణంతో మనుషులను చంపటం మానవత్వం కాదని చంద్రబాబుకి చెబుతున్నాను.

బాబూ ముందు హామీలు నిలుపుకో..

‘‘బాబు ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. రైతులు రుణాల మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. పంటల బీమా కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. డ్వాక్రా అక్కచెల్లెళ్లకు తోడుగా ఉండండి. ఇంటి కో ఉద్యోగం ఇవ్వండి’’.

అండగా ఉంటాం: కృష్ణారావు కుటుంబానికి భరోసా

 
విజయవాడ: ఆలోకం కృష్ణారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జిల్లా నేతలు కృష్ణారావు కుటుంబానికి అందుబాటులో ఉంటూ అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ మనోధైర్యం కోల్పోకుండా పనిచేయాలని చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా గొట్టుముక్కలకు చేరుకుని కృష్ణారావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గంటన్నరకు పైగా కృష్ణారావు సతీమణి ముత్తమ్మ, పెద్ద కుమార్తె వాసిరెడ్డి నాగమణి, చిన్న కుమార్తె చనుమోలు పాపాయమ్మ, కుమారుడు శ్రీనివాస్‌లతో మాట్లాడారు. ‘నేనున్నాను.. అధైర్యపడొద్ద’ని వారికి భరోసా ఇచ్చారు.   

డీజీపీకి జగన్ ఫిర్యాదు

కృష్ణారావు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తరువాత జగన్ అక్కడి నుంచే నేరుగా ఏపీ డీజీపీ జేవీ రాముడుతో ఫోన్లో మాట్లాడారు. గొట్టుముక్కల ఘటనపై ఫిర్యాదు చేశారు. గ్రామ ఉప సర్పంచిని  చంపినా పోలీసులు స్పందించలేదని, మరో ఐదుగురిని చంపుతామని టీడీపీ కార్యకర్తలు గ్రామంలో అందరినీ బెదిరిస్తున్నారని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. టీడీపీ ఆగడాలపై పలువురు గ్రామస్తులు, కార్యకర్తలు, మహిళలు జగన్‌కు ఫిర్యాదు చేశారు.

అందరికీ అండగా ఉంటాం


కొండంత భరోసా
అందరికీ అండగా ఉంటాం    

గొట్టుముక్కల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటన
హత్యకు గురైన ఉపసర్పంచి కృష్ణారావు కుటుంబానికి ఓదార్పు
వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపిన అధినాయకుడు

 
నందిగామ : కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ ఉపసర్పంచి కృష్ణారావు హత్యానంతరం.. వైఎస్సార్ సీపీ  అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహ న్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపారు. బుధవారం ఆయన కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి వచ్చారు.  వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆగడాలు సాగిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజాపోరాటాల ద్వారా ఎండగడతామని హెచ్చరించారు. బహిరంగ వేదికల నుంచి అసెంబ్లీ వరకు ప్రతిచోట టీడీపీ చేస్తున్న దౌర్జన్యాలపై పోరు సాగిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.  పర్యటనతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడ్నుంచి రోడ్డుమార్గాన గొట్టుముక్కల గ్రామం చేరుకున్నారు.

ఎస్సీ కాలనీలో పలువురు యువతులు, మహిళలు వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. అనంతరం ఆయన గత ఆదివారం రాత్రి హత్యకు గురైన ఆలోకం కృష్ణారావు నివాసానికి  వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఉదయం 10.20 గంటల నుంచి 11.50 వరకు అక్కడే గడిపి కుటుంబసభ్యులందరినీ పేరుపేరునా పలకరించి మాట్లాడారు. అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. తొలుత కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణారావు భార్య ముత్తమ్మతో మాట్లాడారు. ఆమెతోపాటు కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తెలు నాగమణి, పాపాయమ్మ హత్య జరిగిన తీరును, గ్రామంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. ఆయన అంతా విని అక్కడినుంచే డీజీపీకి ఫోన్ చేసి టీడీపీ కేడర్ ఆగడాలపై ఫిర్యాదు చేసి హతుడు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అక్కడ్నుంచి బయల్దేరి టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు నివాసానికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ధైర్యం కోల్పోవద్దని, పార్టీ కేడర్‌కు అండగా నిలవాలని అక్కారావుకు చెప్పారు. పార్టీ నేతలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా వారికి తెలియజేయాలని సూచించారు.

హత్య కేసులో దోషులతో పాటు హత్యను ప్రేరిపించిన కుట్రదారులను గుర్తించి అరెస్టు చేసే వరకు పోరాటం చేయాలని పార్టీ ముఖ్యులను ఆదేశించారు. అక్కడ్నుంచి పయనమైన వైఎస్ జగన్ కంచికచర్ల, నందిగామ మీదుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్‌మహ్మద్‌పేట గ్రామం సెంటర్‌కు చేరుకున్నారు.  అక్కడ స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలతో కొంతసేపు మాట్లాడి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు.
 
అధినేత వెంట..

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కొడాలి నాని (గుడివాడ), ఉప్పులేటి కల్పన (పామర్రు), రక్షణనిధి (తిరువూరు), మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి, నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు (నందిగామ), పేర్ని నాని (మచిలీపట్నం), పి.గౌతమ్‌రెడ్డి (విజయవాడ సెంట్రల్), దుట్టా రామచంద్రరావు (గన్నవరం), పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, బండి జానకిరామారావు, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్యచౌదరి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, పాటిబండ్ల హరిజగన్నాథరావు, కోవెలమూడి వెంకటనారాయణ, బొగ్గవరపు శ్రీశైలవాసుతోపాటు మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
 

ఎవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్
దు..  ఆధైర్యపడాల్సిన పని లేదు.. ఏ ఒక్కరికి కష్టమొచ్చినా మేం చూస్తూ ఊరుకోం.. ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది.. పార్టీకి పట్టుకొమ్మలైన  కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుని అండగా నిలుస్తాం..    - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 

నా జీతం అంతా ప్రజా సంక్షేమానికే!

Written By news on Wednesday, August 13, 2014 | 8/13/2014


నా జీతం అంతా ప్రజా సంక్షేమానికే!కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి
నెల్లూరు: తన జీతం అంతా ప్రజాసంక్షేమానికే ఉపయోగిస్తానని నెల్లూరు రూరల్‌ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చెప్పారు. జీతం నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోనన్నారు. ఐదేళ్లలో తనకు ప్రభుత్వం ద్వారా వచ్చే 60 లక్షల రూపాయల జీతం మొత్తం  ప్రజలకే ఉపయోగిస్తానని చెప్పారు.

పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తానన్నారు.  తాగునీటి పునరుద్దరణకు ఖర్చు చేస్తానని తెలిపారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం అందిస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు

వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో వేసిన పునాది రాయి

విజయవాడ : నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో వేసిన పునాది రాయి నేడు ఆంధ్ర రాజధాని ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. గన్నవరం ప్రాంత అభివృద్ధి కోసం 2006లో కేసరపల్లి వద్ద ఐటీ పార్కు(మేధ) నిర్మాణానికి వైఎస్ శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి గన్నవరం ప్రాంతం దశ తిరిగింది. బీడు భూములు బంగారు గనులుగా మారాయి.

 ఇప్పుడు తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న మేధా టవర్‌లో రాష్ట్రస్థాయి కార్యాలయాలు కొన్ని కొలువుదీరనున్నాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి కార్యాలయాలు  ఐటీ పార్కులో ఖాళీగా ఉన్న టవర్లలో ఏర్పాటుచేయడం వల్ల గన్నవరం ప్రాంతానికి మహర్దశ పట్టనుంది.

దీంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐటీ పార్కుకు వేసిన పునాదిరాయితో గన్నవరం ప్రాంతం దినదినాభివృద్ధి చెందిందని ప్రజలు ఆయన్ను స్మరించుకుంటున్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన సెంట్రల్ జైలు నిర్మాణాన్ని నిలిపివేసి వైఎస్ ఐటీపార్కు నిర్మించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఐటీ పార్కు వల్ల వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని శంకుస్థాపన సమయంలో వైఎస్సార్ చెప్పారని,  ఆయన మాటలు నిజమవుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు.

 బంగారు గనులుగా గన్నవరం భూములు  
 ఐటీ పార్కు ఏర్పాటుకు ముందు గన్నవరం ప్రాంతంలో భూములు తొండ గుడ్లు పెట్టేందుకు కూడా పనికిరాకుండా మరుగున పడి ఉండేవి. అయితే 2006 నుంచి భూముల విలువలు అమాంతం పెరిగాయి. గన్నవరం, కేసరపల్లి, సావారిగూడెం, కొండపావులూరు, గోపవరపుగూడెం, ముస్తాబాద, సూరంపల్లి గ్రామాల్లో భూముల ధరలు వంద రెట్లు పెరిగాయి. గన్నవరం నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు భూముల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సన్న, చిన్నకారు రైతులు తమ పొలాలను, స్థలాలను అధిక రే ట్లకు విక్రయించి అప్పుల ఊబి నుంచి బయటపడ్డామని సంబరపడుతున్నారు.

అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం

అది కృష్ణా జిల్లా గొట్టిముక్కల గ్రామం. ఇప్పుడు అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడూ పదిమంది నోళ్లలో నాలుకలా మెలుగుతూ పనే దైవంగా భావించే ఆ గ్రామ ఉప సర్పంచి ఎ.కృష్ణారావు దారుణహత్యకు గురికావడం ఆ ఊరు మొత్తాన్ని మూగనోము పట్టేలా చేసింది.

అదివారం రాత్రిపూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన కృష్ణారావు ఇంట్లోకి కొంతమంది దుండగులు కృష్ణారావు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. ఆయనను బయటకు లాక్కొచ్చి, పొడిచి పొడిచి చంపేశారు. తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని అంతకుముందే కృష్ణారావు పోలీసులకు పదే పదే విజ్ఞప్తులు చేసినా వాళ్లు పెడచెవిన పెట్టారు. ఇక దాడి జరుగుతున్న సమయంలో ఆయన భార్య, పిల్లలు చంపొద్దు.. వదిలేయాలని కాళ్లా వేళ్లా పడి బతిమాలినా ఆ దుండగులు ఏమాత్రం కనికరించలేదు. ఇంత దారుణ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం స్పందించలేదు. హత్యకు పాల్పడినట్లు చెబుతున్న నిందితులు తమంతట తాము లొంగిపోయేవరకు పోలీసులు నిష్క్రియాపరత్వంతో వ్యవహరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల పక్షపాతం స్పష్టంగా తెలుస్తోందని, వాళ్లు కావాలనే ఊరుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్త ఒకరు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో ఎలాగైనా వాళ్లను అణగదొక్కాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ దారుణమైన హత్యారాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 19 మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బత్తాయి తోటలు, బొప్పాయి తోటలు.. అన్నింటినీ విచ్చలవిడిగా నరికేశారు. ప్రధానంగా టీడీపీ ఓటమి పాలైన ప్రాంతాల్లోనే ఈ తరహా దాడులు ఎక్కువగా జరిగాయి. గ్రామ పంచాయతీల నుంచి జిల్లా పరిషత్తుల వరకు ప్రతిదాన్నీ సొంతం చేసుకోడానికి టీడీపీ సామ దాన భేద దండోపాయాలు అన్నింటినీ ప్రదర్శించింది.

గొట్టిముక్కలలో కూడా కృష్ణారావు హత్య తర్వాత సీతయ్య, సెల్వరాజ్ అనే మరో ఇద్దరు కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఇప్పుడక్కడ అంతా భయమే రాజ్యమేలుతోంది. దివిసీమ ప్రాంతంలోని అవనిగడ్డలో.. టీడీపీ గూండాలు మందుగుండు సామగ్రి పేలుస్తుంటే, పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారు! అతడు చేసిన పాపమల్లా.. టీడీపీ గూండాల ఆదేశాలు కాదని తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడమే. ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నా పోలీసులు మాత్రం మౌన ప్రేక్షక పాత్రనే పోషిస్తున్నారు. పాలకపక్షం ఊదుతున్న బూరాలకు బుట్టలోని పాముల్లా ఆడుతున్నారు.

కృష్ణారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

కృష్ణారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణారావు కుటుంబాన్ని బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భోరోసా ఇచ్చారు. వారిని ఓదార్చి మనోధైర్యం నింపారు. వైఎస్ జగన్ రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, గ్రామస్తులకు కొండంత ధైర్యం లభించినట్టయ్యింది.  కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో కృష్ణారావును ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెలిసిందే.

గొట్టుముక్కలలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణారావు హత్యను తీవ్రంగా ఖండించారు. ఓటు వేయలేదనే కారణంతో ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి హత్య చేయడం దారుణమని అన్నారు. కృష్ణారావును చంపవద్దని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డా హంతకులు కనికరం లేకుండా చంపడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుటే దారుణాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోనే ఇంతకుముందు వైసీపీ కార్యకర్త సురేష్ నెత్తిన బాంబు పెట్టి దారుణంగా చంపారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు హత్యకు, దాడికి గురైన సంఘటనల గురించి ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించడం, నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని వైఎస్ జగన్ చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. దాడుల గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, చంద్రబాబును నిలదీస్తామని వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ వెంట కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

రేపు విజయవాడ వెళ్లనున్న వైఎస్ జగన్

Written By news on Tuesday, August 12, 2014 | 8/12/2014


రేపు విజయవాడ వెళ్లనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడ వెళ్లనున్నారు. గొట్టిముక్కలలో హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు.

సోమవారం కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును ప్రత్యర్థులు హత్య చేశారు. దుండగులు కృష్ణారావు ఇంటిపై దాడి చేసి నరికి చంపారు. టీడీపీకి చెందినవారే ఈ హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి


'ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'
కడప: రాష్టానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏ మేరకు ఖర్చు చేస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని ఎంపిక విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

రాయలసీమకు జరగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అంతకుముందు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ ఇప్పటివరకు నెరవేర్చలేదని తెలిపారు.

డొల్లతనం తేటతెల్లం: జ్యోతుల నెహ్రూ


డొల్లతనం తేటతెల్లం: జ్యోతుల నెహ్రూ
ఏపీ మంత్రివర్గ భేటీపై వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ ధ్వజం
రీషెడ్యూల్ అంటూ ఆర్బీఐపై నెపమా?


సాక్షి, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగిన తీరు ప్రభుత్వ డొల్లతనానికి, బేలతనానికి అద్దం పడుతోందని వైఎస్సార్ సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలేవీ చర్చించకుండా భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
 
జ్యోతుల నెహ్రూ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ముఖ్యంగా రైతులకు సంబంధించి రుణమాఫీపై ప్రభుత్వం ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని, వ్యవసాయ రుణాల మాఫీ కోసం కేటాయింపులను ప్రస్తావిస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదన్నారు. రుణమాఫీ గురించి చెప్పకుండా రీషెడ్యూలు అంటూ రిజర్వ్ బ్యాంక్‌పై నెపం వేస్తున్నారని విమర్శించారు. గృహావసరాలకు 24 గంటలు, సేద్యానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.  
 
 -    రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇవ్వకపోగా మరింత గందరగోళం సృష్టించారు. మంత్రులు ఎవరిష్టం వచ్చినట్లు వారు విశాఖపట్టణం, ఒంగోలు, నెల్లూరులో రాజధాని ఉండాలని మాట్లాడుతున్నారు.
 -    వృద్ధులు, వితంతువులకు పింఛన్లు రూ.వెయ్యి, రూ.1500కి పెంచుతూ మంత్రివర్గం భేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశించినా అదేమీ జరగలేదు. అక్టోబర్ 2 నుంచి మీరు పెంచినా, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నెల నుంచే పెరిగిన మొత్తాన్ని బకాయిలతో లబ్ధిదారులకు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తోంది.
 -    పార్టీ విప్‌ను ధిక్కరించారని ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుపై జిల్లా కలెక్టర్ అనర్హత వేటు వేశారు. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికై, ప్రలోభాలకు గురై ఓట్లేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీలపై అనర్హత వేటు వేయరా? హరిబాబుకు ఓ న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా? వైఎస్సార్ సీపీ విప్‌ను ధిక్కరించిన వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకూ అనర్హులను చేయలేదు. ప్రకాశం జడ్పీ ఎన్నిక కంటే 20 రోజుల మందే ఇవి జరిగాయి. ఇదీ చంద్రబాబు దుర్నీతి.

పార్టీ అండగా ఉంటుంది

మనోధైర్యం కోల్పోవద్దు : వైఎస్ జగన్
 •    పార్టీ అండగా ఉంటుంది
 •   వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అధినేత వైఎస్ జగన్ భరోసా
 •   బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి
 •   మొండితోక జగన్మోహనరావుకు సూచన
నందిగామ : కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు ఆ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తనకు ఫోన్‌చేసి గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కృష్ణారావు హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

టీడీపీ నాయకులు పథకం ప్రకారం కృష్ణారావును తుదముట్టించారని చెప్పినట్లు ఆయన వివరించారు. రెండు నెలలుగా గ్రామంలో టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతుంటే పోలీసులు పట్టించుకోలేదని, వారి వైఫల్యంవల్లే ఈ ఘాతుకం జరిగిందని వివరించినట్లు ఆయన తెలిపారు. నిందితులను అరెస్టుచేసే వరకు ఉద్యమించాలని వైఎస్ జగన్ సూచించారని చెప్పారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ దాడులను ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాలని కోరారని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని సూచించారని తెలిపారు. కృష్ణారావు కుటుం బానికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూ డాలని జగన్ చెప్పారని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోంది

Written By news on Monday, August 11, 2014 | 8/11/2014

టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోంది: వైఎస్ఆర్సీపీ
కంచికచర్ల: టీడీపీ హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే రక్షణనిధి, పార్థసారధి, ఉదయభాను ఆరోపించారు.  హత్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలకు మంత్రి దేవినేని ఉమ అండగా ఉంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులు సరైన సమయంలో స్పందిస్తే కృష్ణారావు హత్య జరిగేదే కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రత్యర్ధుల దాడిలో మరణించిన గొట్టిముక్కల గ్రామ ఉపసర్పంచ్ కృష్ణారావు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే రక్షణనిధి, పార్థసారధి, ఉదయభాను పరామర్శించారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావును సోమవారం తెల్లవారు జామున ప్రత్యర్థులు దాడిలో దారుణ హత్యకు గురయ్యారైన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య

'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'
విజయవాడ :  గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా కలిసి  చేసిన హత్య అని ఆయన ఆరోపించారు.

డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు

Written By news on Sunday, August 10, 2014 | 8/10/2014

'డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారు'
శ్రీకాకుళం: డ్వాక్రా మహిళలను మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేయడానికి సిద్దమవుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. 
 
రుణాల మాఫీపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఇసుక అమ్మకాలు, సోలార్ ప్రాజెక్టులంటూ డ్వాక్రా మహిళలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల ముసుగులో ఇసుక అమ్మకాలను టీడీపీ కార్యకర్తలకు అప్పగించాలన్నదే చంద్రబాబు ఎత్తుగడ అని తమ్మినేని సీతారాం విమర్శించారు. 

రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!


రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!
హైదరాబాద్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి చిహ్నమైన రాఖీ పండుగను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలు ప్రేమానురాగాల మధ్య జరుపుకున్నారు. 
లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మ వెంట ఉండగా తన అన్న వైఎస్ జగన్ కు సోదరి షర్మిల రాఖీ కట్టారు. రాఖీ కట్టిన తన సోదరి షర్మిలకు బతికున్నంత కాలం తాను భరోసాగా ఉంటానని వైస్ జగన్ తన ప్రేమను చాటుకున్నారు. 
ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకునే రాఖీ పండుగను వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకున్నారు.   


జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది

'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది'
నెల్లూరు:జూపూడి ప్రభాకర రావుకి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దళితులకు వైఎస్సార్ కుటుంబం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణ స్వామిలు తెలిపారు. తన ఓటమికి సుబ్బారెడ్డే కారణమని జూపూడి చెప్పడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలోమాట్లాడిన పార్టీ నేతలు.. ఇప్పటికైనా జూపూడి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ తరుపునే అధిక సీట్లను దళితులే గెలిచారని వారు తెలిపారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపానని జూపూడి చెప్పారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా

వైఎస్‌ జగన్‌ కు రాఖీ కట్టిన రోజా
హైదరాబాద్: లోటస్‌పాండ్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి నగరి ఎమ్మెల్యే రోజా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రోజాకు స్వీటు తినిపించి ఆశీస్సులు అందజేశారు జగన్.

మహిళలు, పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జగనన్నకు రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన అందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

రుణమాఫీ చేయలేక వైఎస్ జగన్ పై దాడా?

రుణమాఫీ చేయలేక వైఎస్ జగన్ పై దాడా?
హైదరాబాద్: రైతుల రుణాలు మాఫీ చేయలేక వైఎస్ జగన్మోహన రెడ్డి  నివేదికలు పంపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత పార్థసారధి మండిపడ్డారు. మంత్రి దేవినేని ఉమపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను అమలు చేయలేక ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. దమ్ముంటే 10 రోజుల్లో ఏ ఏజెన్సీతోనైనా విచారణ చేయించుకోండన్నారు.   వాస్తవాలు బయటపెట్టండని కూడా  సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సీపీపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మీరు పదవి వదులు కోవడానికి సిద్ధమా? అని ఆయన ఉమను ప్రశ్నించారు.

రీ షెడ్యూల్‌కు, రుణమాఫీకి సంబంధం ఏంటని ఆయన అడిగారు. బీజేపీపై రుణమాఫీ కోసం ఎందుకు ఒత్తిడి చేయరు? అని ప్రశ్నించారు. ఆర్ బిఐపై  నెపం వేసి రుణమాఫీని వాయిదా వేయడం తగదన్నారు. తక్షణమే రైతులకు కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అప్పులు కట్టొద్దు అన్నారు, మీ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వైఎస్ జగన్మోహన రెడ్డి  దిష్టిబొమ్మల దహనానికి చంద్రదండు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేయమని వైఎస్ జగన్ అడగటమే తప్పా అని ప్రశ్నించారు. అబద్ధాలను కట్టిపెట్టి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు.

విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన

అందరితో ఆప్యాయంగా...
 - పలు అంశాలపై చర్చించిన ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్
- కడపలో అంజాద్.. బద్వేలులో జయరాములు మాటామంతి
- మూడు రోజుల పర్యటన విజయవంతం

 సాక్షి, కడప : ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందలు, వేలల్లో  కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చినా ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేయకుండా ఆప్యాయంగా పలుకరిస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు  వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్ జిల్లా మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 7వ తేదీన పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్ తొలి రోజు నాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. 8వ తేదీ పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించిన వైఎస్ జగన్‌రెడ్డి అనంతరం ప్రజలతో కలిసిపోయి సమస్యలు తెలుసుకున్నారు.

పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్‌రెడ్డిని శనివారం ఉదయం ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన అంశాలతోపాటు పలు సమస్యలపై వారు మాట్లాడుకున్నారు.  పలువురు ఎమ్మెల్యేలు కూడా జగన్‌ను ఈ సందర్భంగా  కలుసుకున్నారు. పులివెందుల నుంచి నెల్లూరుకు బయలుదేరిన వైఎస్ జగన్‌ను మార్గమధ్యలో కడప వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా కలుసుకుని  చర్చించారు. బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు తదితరులు జగన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

నూతన జంటకు ఆశీర్వాదం :
పులివెందులలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం ఉదయం అంకాలమ్మ గూడూరుకు చెందిన కక్కిరెడ్డి పురుషోత్తమరెడ్డి కుమార్తె నవ్యత, రాఘవేంద్రారెడ్డి వివాహానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
 
విజయవంతంగా వైఎస్ జగన్ పర్యటన :
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పర్యటన జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. పులివెందుల క్యాంపు కార్యాలయంలో దాదాపు మూడు రోజులపాటు ఉండి కార్యకర్తలు, నాయకుల సమస్యలకు పరిష్కారం చూపడంతో వారిలో నూతనోత్సాహం  నెలకొంది. అండగా ఉంటానని.. ధైర్యంగా ముందుకు సాగాలని.. పార్టీపరంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని వైఎస్ జగన్ హితబోధ చేశారు.
 
అధైర్య పడవద్దు.. అండగా ఉంటా..
బద్వేలు : ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని బద్వేలు మీదుగా శనివారం నెల్లూరుకు బయలుదేరిన వైఎస్ జగన్‌ను ఎమ్మెల్యే జయరాములుతో పాటు పలువురు నాయకులు మండలంలోని బయనపల్లె సమీపంలో కలిశారు. ముఖ్యనేతలను ఎమ్మెల్యే జయరాములు జగన్‌కు పరిచయం చేశాడు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారన్నారు. మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ సింగసాని గురుమోహన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంబవరం వెంకటేశ్వరరెడ్డి పలువురు సర్పంచులు జయసుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, విజయభాస్కరరెడ్డి తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Popular Posts

Topics :