24 August 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

బిపిన్ చంద్ర మృతిపై వైఎస్ జగన్ తీవ్ర సంతాపం

Written By news on Saturday, August 30, 2014 | 8/30/2014


బిపిన్ చంద్ర మృతిపై వైఎస్ జగన్ తీవ్ర సంతాపం
హైదరాబాద్: సుప్రసిద్ధ చరిత్రకారుడు బిపిన్ చంద్ర మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ చంద్ర మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో వైఎస్ జగన్ మాట్లాడుతూ... బిపిన్ చంద్ర మృతి తీరని లోటని అన్నారు. ఆయన రచనలు ఇతర చరిత్రకారులు, చరిత్ర అధ్యయనం చేసే విద్యార్థులకు చుక్కాని అని ఆయన అభివర్ణించారు. భారతదేశ చరిత్రపై బిపిన్ చంద్ర రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఆధునిక చరిత్రకారుడిగా ఖ్యాతి గడించిన బిపిన్ చంద్ర ఈ రోజు ఉదయం గుర్గావ్ లోని ఆయన స్వగృహాంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. 1928లలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వ్యాలీలో బిపిన్ చంద్ర జన్మించారు. 1983లో యూజీసీ సభ్యునిగా పని చేశారు. 2002 -2014 మధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గా విధులు నిర్వర్తించారు

రాజధానిపై బాబు నాటకం

Written By news on Friday, August 29, 2014 | 8/29/2014

రాజధానిపై బాబు నాటకం
  •      ‘రియల్’కు దన్ను
  •      చార్జీలు పెంచకుండా పాలన సాగించాలి
  •      రుణమాఫీ సంగతేంటి?
  •      స్పీకర్ తీరు గర్హనీయం
  •      వైఎస్సార్ సీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట : తన స్వార్థం కోసం...  అనుచరుల రియల్‌ఎస్టేట్ వ్యాపారాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై స్పష్టత ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను విమర్శించారు.  గురువారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ మూడు నెలల పాలనలోనే రాజధానిపై మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు.  దీంతో 13 జిల్లాల ప్రజలు అయోమయంలో పడుతున్నారని చెప్పారు.

అధికారంలో ఉండి కూడా రాజధానిపై నిర్ణయం తీసుకోలేని ముఖ్యమంత్రి మౌనంగా ఉండటానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను వివరిస్తుంటే వారికి మైక్‌లు  ఇవ్వడం లేదన్నారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంకెల గారడీ బడ్జెట్  మాత్రమే ప్రవేశపెడుతూ ప్రజలను వంచన చేస్తున్నరని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి  ఎన్నికల హామీలను నేటికీ నెరవేర్చకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ  చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా మాఫీకి సంబంధించిన స్పష్టమైన హామీ ఇవ్వకుండా రైతులను మరింత గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు.
 
మంచి పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు మండిపడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే స్పీకర్ మైక్  కట్‌చేస్తుండటం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరుగలేదన్నారు.   మున్సిపల్ చైర్మన్ తన్నీరునాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు పటాన్ ఫిరోజ్‌ఖాన్, న్యాయవాదులు పసుపులేటి శ్రీనివాసరావు, సామినేని రాము, ఆరోవార్డు కౌన్సెలర్ ఇంటూరి చిన్న తదితరులు పాల్గొన్నారు.

రైతులను మోసగించిన చంద్రబాబు

రైతులను మోసగించిన చంద్రబాబు
కడప అగ్రికల్చర్ : ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా రైతులు పంటల బీమా కోల్పోతున్నారని, రుణమాఫీ వర్తించడం లేదని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ నుంచి ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ పంటల బీమా వివరాలను తాను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. గాలివీడు మండలంలో హెక్టారుకు రూ.1,300 బీమా దక్కిందని, రామాపురం మండలానికి రూ.5,400 కేటాయించారని తెలిపారు. రాయచోటి పరిధిలో మరో నాలుగు మండలాలకు బీమా వర్తించలేదన్నారు.

పంటల బీమా లోప భూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. అరకొరగా ఆదుకోనున్న పంటల బీమా సైతం ఈ మారు రైతన్నలకు అవకాశం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న వారికి బీమా వర్తించేదని, రుణమాఫీ కారణంగా ఆ అవకాశాన్ని రైతులు చేజార్చుకున్నారని వివరించారు. రుణమాఫీ అయితే కొత్త రుణాలు తీసుకోవడంతో బీమా వర్తించేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతు రాజులా జీవించాడని తెలిపారు. ఇప్పటికైనా తక్షణమే రుణమాఫీ వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

స్పీకర్ హుందాగా ఉండాలి: మేకపాటి

Written By news on Thursday, August 28, 2014 | 8/28/2014

స్పీకర్ హుందాగా ఉండాలి: మేకపాటి
నెల్లూరు: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో రైతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు హుందాగా వ్యవహరించాలని సూచించారు. నిష్పక్షపాతంగా ఉండాలన్నారు.

ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని నెల్లూరులో గురువారం మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదే ఐరన్ లెగ్

'బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదే ఐరన్ లెగ్ '
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా మారిపోయారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా మండిపడ్డారు. ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ కార్యకర్తలు బెల్టు షాపుల్లోంచి తీసుకెళ్లి మరీ ఇస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆమె గురువారం మాట్లాడారు. మధ్యలో టీడీపీ సభ్యులు, మంత్రులు పదే పదే కలగజేసుకుని ఆమెకు అంతరాయాలు కలిగించగా దీటుగా సమాధానాలు ఇచ్చారు. 'నా నోటికి అసలే మంచిమాటలు రావు. నేను మాట్లాడేది జాగ్రత్తగా వినండి' అని గట్టిగా చురక అంటించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రోజాను 'ఐరన్ లెగ్' అని వ్యాఖ్యానించారు. దాంతో ఐరన్ లెగ్ తనది కాదని, గోపాలకృష్ణారెడ్డిదేనని ఆమె అన్నారు. చంద్రబాబు మీద బాంబుదాడి జరిగినప్పుడు ఆ కారులో ఆయనే ఉన్నారని, అలాగే వైఎస్ మరణానికి ముందు రోజు కూడా క్యాంపు కార్యాలయంలో బొకేతో వెళ్లినది ఆయనేనని మండిపడ్డారు.

అంతకుముందు రోజా సభలో మాట్లాడుతూ... ''టీడీపీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా అయిపోయారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మద్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లి మరీ ఇచ్చేంత స్థాయికి దిగిపోయారు. ఇది మహిళా సంక్షోభ ప్రభుత్వమని మొదటి బడ్జెట్ లోనే తెలిసిపోయింది. స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా గ్రూపుల రుణాలను అణాపైసలతో సహా తీసేస్తామన్నారు. ఇప్పుడు కుంటిసాకులు చూపించి, బడ్జెట్ లో డ్వాక్రా సంఘాల బలోపేతానికి లక్ష రూపాయలు ఇస్తామన్నారే తప్ప రుణాల గురించి చెప్పలేదు. రుణమాఫీ చేయాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలంలో మహిళలు ఐకేపీ అధికారుల మీద తిరగబడ్డారు. రుణాలు మాఫీ చేయాల్సిందేనని, తాము కట్టేది లేదని అంటున్నారు. డ్వాక్రా సంఘాలు తమ గొప్పేనంటున్నారు.. గతంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మహిళలకు గోరంత సాయం చేస్తే వాళ్లు కొండంత ఎదుగుతారని తెలుసుకోవాలి.

గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పి , ఆ తర్వాత ఇల్లరికపు అల్లుడిగా మారి అదే పార్టీని తన చంకలో పెట్టుకుని వెళ్లిపోయారు. అలాంటి పార్టీకి చెందినవాళ్లు మమ్మల్ని వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు.

ఏ పార్టీలో ఉంటామన్నది ముఖ్యం కాదు.. మహిళల సంక్షేమం కోసం పోరాడతాం. ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా మహిళల కోసం పోరాడిన చరిత్ర నాకుందని చెబుతున్నా. అప్పు మాత్రమే మహిళలు చెల్లిస్తే సరిపోతుందని, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఒక జీవో ఉంది. కానీ, ఈ ప్రభుత్వం వచ్చాక వడ్డీ కూడా కట్టాలంటూ సర్క్యులర్లు జారీచేశారు. ఇది మహిళలను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నా. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. తమకు వేతనాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించి, లాఠీ ఛార్జీ చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది. వైఎస్ హయాంలో రెండుసార్లు వేతనాలు పెంచారు. కేంద్రం ఇచ్చే వేతనాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వేతనాలిచ్చారు'' అన్నారు.

బషీర్ బాగ్ అమరులకు వైఎస్ జగన్ నివాళి


బషీర్ బాగ్ అమరులకు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్ : విద్యుత్‌ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గురువారం నివాళులు అర్పించారు. బషీర్‌బాగ్‌ కాల్పులకు 14 ఏళ్లు నిండిన సందర్భంగా షహీద్‌ చౌక్‌లో అమరులకు ఆయన ఈరోజు ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల స్ఫూర్తి తమకు ఆదర్శమన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ విద్యుత్ కోసం అవస్థలు పడుతున్న ప్రజలు, రైతులు, ప్రతిపక్షాలు ఏకమై బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే వారిని చంద్రబాబు పిట్లల్ని కాల్చినట్లు కాల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నాటి ఘటనకు గుర్తు చేసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుందన్నారు. వైఎస్  జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు స్థూపం దగ్గర నివాళులు అర్పించారు.

కాగా విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన బషీర్‌బాగ్‌ కాల్పుల దుర్ఘటన జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆనాడు వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు... బషీర్‌బాగ్‌ చౌరస్తాలో గుమికూడిన ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పాయారు.

వామపక్ష నేతలు సురవరం సుధాకరరెడ్డి, బీవీ రాఘవులు, కె.నారాయణ, గాదె దివాకర్‌ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నమోదైన కేసులు సైతం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. విద్యుత్‌ ఉద్యమంలో అసువులు బాసిన వారి గుర్తుగా బషీర్‌బాగ్‌ చౌరస్తాలో స్థూపం నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనుమతించారు. ఉద్యమంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ఆర్థికసాయం అందించారు

పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు

పంట రుణాల మాఫీకి..సవా‘లక్షన్నర’ తిరకాసులు
పంట రుణాల మాఫీకి ప్రభుత్వం సవా‘లక్షన్నర’ తిరకాసులు పెట్టింది. నిబంధనల పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టి.. మాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. సహకార బ్యాంకుల్లో మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేయరాదని పెట్టిన నిబంధనతో జిల్లాలో 65 వేల మంది రైతులకు రూ.200 కోట్ల మేర మాఫీ చేయకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు వేస్తోంది. మార్చిలోపు రుణాలు చెల్లించిన రైతులకు మాఫీ చేయబోమని స్పష్టీకరించింది. ఓటు దాటాక రుణమాఫీకి షరతులు పెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై రైతులు మండిపడుతున్నారు.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో చంద్రబాబు హామీలవర్షం కురిపించారు. ఒక్క పంట రుణాల మాఫీ హామీనే టీడీపీని అధికారంలో కూర్చోబెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు జిల్లాలో 8.7లక్షల మంది రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి. కానీ.. ఆ హామీ అమలు భారాన్ని కనిష్ట స్థాయికి చేర్చేందుకు చంద్రబాబు తనదైన శైలిలో మెలికలు పెడుతున్నారు.

మార్చి 31, 2014లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ మాఫీ వర్తింపజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలో అదే ప్రకటనను పునరుద్ఘాటించారు. కానీ.. ఈనెల 14న పంట రుణాల మాఫీకి జారీచేసిన మార్గదర్శకాల్లో మాత్రం సవాలక్షన్నర మెలికలు పెట్టారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్షన్నరకు మించకుండా రుణామఫీ చేస్తామని షరతు పెట్టారు. పోనీ.. ఆ ఒక్క షరతుకైనా పరిమితమయ్యారా అంటే అదీ లేదు. ఆ రూ.లక్షన్నర మాఫీకి కూడా మెలికలు పెట్టారు.
 
సహకార రుణాల మాఫీ లేనట్లే..

జిల్లాలో సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల్లో 65 వేల మంది రైతులు రూ.200 కోట్ల మేర పంట రుణాలు తీసుకున్నారు. గడువులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుందన్న నెపంతో సహకార అధికారులు రైతుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే రెన్యువల్ చేశారు. మార్చిలోపు రెన్యువల్ చేసుకున్న రుణాలను మాఫీ చేసేది లేదని ప్రభుత్వం స్పష్టీకరించడంతో 65 వేల మంది రైతులు నష్టపోనున్నారు.

ఈ నిబంధనపై రైతులు, సహకారశాఖ అధికారులు మండిపడుతున్నారు. ఆ నిబంధనను సడలించాలని ఇటీవల డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి సీఎం చంద్రబాబును కోరినట్లు సమాచారం. ఇక మార్చి లోపు రుణాలు చెల్లించిన రైతులకు కూడా మాఫీ చేసేది లేదని ప్రభుత్వం మెలిక పెట్టింది. సకాలంలో చెల్లించిన రైతులకూ రుణ మాఫీ వర్తింపజేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. రుణ మాఫీ కటాఫ్ డేట్‌ను మార్చి 31, 2014 నుంచి డిసెంబర్ 31, 2013కు తగ్గించడంపై కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
రైతన్నను అష్టకష్టాలు పెడుతోన్న వైనం..
 
రుణ మాఫీకి ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాలోని నిబంధనలకు రైతులు ఆధారాలు చూపించాల్సి ఉంది. ఇందులో ప్రధానమైనది మీ సేవా కేంద్రాల నుంచి అడంగల్ తీసుకోవడం. రెవెన్యూ రికార్డులను కంప్యూటరీకరించడంలో తప్పులు దొర్లాయి. పట్టాదారు పాసు పుస్తకంలో ఒక సర్వే నెంబర్ ఉంటే.. మీ సేవా రికార్డుల్లో మరొక నెంబరు ఉంది. దీనివల్ల అడంగల్ తీసుకోవడం రైతులకు తలనొప్పిగా మారింది.

ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, సెల్ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సు కాపీలను అటు బ్యాంకు.. ఇటు రెవెన్యూ అధికారులకు అందించాల్సి వస్తోంది.  అందులో ఏ ఒక్క కార్డు లేకపోయినా రుణ మాఫీ వర్తించదంటూ హెచ్చరిస్తున్నారు. ఒక రైతు కుటుంబంలో ఎంత మంది సభ్యులుంటే అందరి ఆధార్‌కార్డులనూ అందించాల్సి వస్తోంది.

కుటుంబంలో ఏ ఒక్కరి ఆధార్‌కార్డు సమర్పించకపోయినా మాఫీకి లబ్ధిదారులుగా ఎంపిక చేయకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టడం రైతులను ఇరకాటంలోకి నెట్టింది. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పరిశీలిస్తోన్న బ్యాంకర్లు.. ‘జిల్లాలో రైతులు తీసుకున్న రూ.11,180.25 కోట్లలో రూ.1100 కోట్ల మేర కూడా మాఫీ అయ్యే అవకాశం లేదు’ అని అంచనా వేస్తోండటం గమనార్హం.
 
రైతుల నోట్లో మట్టి కొట్టిన వైనం..
 
గత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుశెనగ రైతులకు వాతావరణ బీమా పరిహారం కింద రూ.102 కోట్ల పరిహారం అందాల్సి ఉంది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు రూ.108 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ.. పంట రుణాల మాఫీ మార్గదర్శకాల్లో మాత్రం రుణాల మాఫీ నేపథ్యంలో బీమా పరిహారం రైతులకు ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం వల్ల రైతులు రూ.102 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోంది.

ఈనెల 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్‌పుట్ సబ్సిడీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. అంటే.. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం మంజూరు చేయదన్న మాట. ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో రూ.108 కోట్ల మేర రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క రుణ మాఫీ పేరుతో రూ.210 కోట్ల బీమా పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీని రైతులకు ఎగ్గొట్టినట్లు స్పష్టమవుతోంది. రుణమాఫీ పేరుతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వంచిస్తుండడంతో దీనికి నిరసనగా రైతులు కదంతొక్కేందుకు సిద్ధమవుతున్నారు.
 
సొసైటీ బ్యాంకులో బంగారు రుణాలు మాఫీ లేదంట
 
నా భార్య ముంతాజ్ పేరిట పీటీఎంలోని సొసైటీ బ్యాంకులో రెండేళ్ల క్రితం బంగారాన్ని కుదువ పెట్టి రూ.20 వేలు రుణం తీసుకున్నాము. ఎన్నికల టైంలో నాయకులు వచ్చి ఏ బ్యాంకులోనైనా బంగారు లోన్లు వున్నా అన్నీ మాఫీ చేస్తామని మభ్యబెట్టినారు. కష్టకాలంలో మాకు ఎవరు ఆదుకుంటే ఏం అని వాళ్లను నమ్మి ఓట్లు వేసాం. ఇప్పుడేమో సొసైటీ బ్యాంకులో ఉన్న బంగారు రుణాలు మాఫీ కావని చెబుతావుండారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. నమ్మినోళ్లను నట్టేట ముంచుతారని ఎవరికి తెలుసు ?
 -మహబూబ్‌బాషా,  పీటీఎం మండలం

చెప్పేదొకటి చేసేదొకటి
 
నాకు ఐదెకరాల పొలం వుంది. నా పట్టాదార్ పాసుబుక్కును కందుకూరు సప్తగిరి గ్రామీణ బ్యాంకులో కుదువ బెట్టి  గతంలో రూ.30 వేల పంట రుణం తీసుకున్నాను. గత ఏడాది వడ్డీతో కలిపి రూ.37 వేలు చెల్లించేసా. ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తే బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను గత ఏడాదిలో చెల్లించినా కూడా ఆ సొమ్ము రైతుల ఖాతాలోకి జమ చేస్తామని హామీ ఇస్తే పోయిన ప్రాణం లేచివచ్చినట్లైంది. ఇప్పుడే మో పూటకోమాట మాట్లాడుతున్నారు. మాటమీద నిలబడని నాయకులు చెప్పేదొకటి, చేసేదొకటా ?
-కనకంటి వెంకట్రమణ, పట్టెంవాండ్లపల్లి, పీటీఎం
 
హామీ ఇచ్చి మాఫీ మరిచారు
అధికారం కోసం చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ అధికారం వచ్చాక మరిచారు. ఇప్పుడు ఒక్కో కుటుంబానికి రూ.1.50లక్షల మాఫీ అంటున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడంలో జాప్యం చేస్తూ మాలాంటి రైతులను మోసం చేయడం తగదు.
 -వెంకటరమణ, రైతు, మేడుపల్లె, మదనపల్లె రూరల్

నిధి పేరుతో ఏమార్చారు
పొదుపు, గ్రూపు సంఘాల మహిళలకు అన్ని విధాలా తోడుంటానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గ్రూపునకు రూ.లక్ష చొప్పున నిధి పేరుతో ఏమార్చుతున్నారు. అప్పు రూపాయి కూడా పోయేలాలేదు. మహిళలకు ఇచ్చిన హామీనెరవేర్చలేని సీఎం ఇక ప్రజల కష్టాలు గురించి ఏం పట్టించుకుంటారు. -సుభద్రమ్మ, మొరాలు, మదనపల్లె రూరల్
 
నిర్ధిష్ట ప్రకటన చేయాలి
రుణమాఫీపై ప్రభుత్వం రోజుకు విధంగా ప్రకటన చేస్తూ రైతులను తికమకపెట్టి మనోవేదనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి 2014 మార్చి నెల 31వ తేది లోపు తీసుకున్న అప్పులకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటన చేశారు. ఆర్థికమంత్రి యనమల రామక్రిష్ణుడు 2013 డిసెంబర్ 31 లోపు రుణాలకే మాఫీ వర్తిస్తుందనడం సరికాదు. నేను కౌలు రైతును. బ్యాంకులో రూ.18వేలు పంట రుణం తీసుకున్నాను. వడ్డీతో కలిపి రూ.24వేలకు పైగా చెల్లించాలని లాయర్ ద్వారా నాకు, జామీన్‌దారునికి నోటీసులు పంపారు. అవమానభారంతో రెన్యూవల్ చేశాం. ఇప్పుడు ఆ లోను వర్తిస్తుందా? లేదా? అనే అనుమానం కలుగుతోంది.
  -రవీంద్ర, కౌలు రైతు, మూలపల్లె, తంబళ్లపల్లె మండలం
 
రుణాలు మొత్తం మాఫీ చేయాలి
రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలి. చంద్రబాబు ఎన్నికల ముందు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇం కోమాట చెప్పడం మంచిది కా దు. వ్యవసాయ రుణాలు పూర్తి గా మాఫీ చేస్తారని రైతులు ఆశతో ఓటు వేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రకాల రుణాలు మాఫీ చేయా లి లేకుంటే రైతులు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది.
 -ఈ.వెంకటాచలం నాయుడు, జిల్లా రైతు ఉద్యమ నేత, పెనుమూరు మండలం.
 
చంద్రబాబుకు రాజకీయ సన్యాసమే
చంద్రబాబు  నాయుడు రైతులను మోసంచేసి అధికారంలో వచ్చారు. రుణమాఫీ చేస్తానని చెప్పి తప్పించుకోడానికి రోజు కో మెలిక పెడుతూ రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాదిలో తీసుకొన్న రుణా లు మాఫీలేదని చెప్పడం దారుణం. రైతులకు  ఆత్మహత్యలు తప్ప గత్యంతరం లేదు. రైతులు ఇక చంద్రబాబుని నమ్మరు. ప్రజలు తిరగబడే సమయం వస్తుంది.
-పార్థసారథిరెడ్డి, తిప్పనపల్లె, పూతలపట్టు మండలం

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌పై జగన్ నిప్పులు
ఉచిత విద్యుత్‌కు రూ. 4,580 కోట్లు అవసరం.. కేటాయింపు రూ. 3,185 కోట్లు
వడ్డీ లేని రుణాలకు రూ. 2,560 కోట్లు కావాలి.. కేటాయించింది రూ. 599 కోట్లు
సామాజిక పెన్షన్లకు రూ. 3,730 కోట్లు అవసరం.. ఇచ్చింది రూ. 1,338 కోట్లు
రైతుల రుణాలే రూ. 87,612 కోట్లున్నాయి.. మాఫీకి ఇచ్చింది రూ. 5 వేల కోట్లు
ఈ రుణాలపై వడ్డీ, అపరాధ వడ్డీ లక్షకు రూ. 24 వేలవుతోంది.. ఆ ఊసే లేదు
రూ. 14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాల మాఫీ గురించి మాట్లాడడమే లేదు
నిరుద్యోగ భృతికి ఏడాదికి రూ. 36,000 కోటు ్లఅవసరం... కానీ ఇచ్చింది సున్నా
బీసీలకు రూ. 10 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ అన్నారు.. కేటాయింపు రూ. 993 కోట్లు
రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. బడ్జెట్‌లో ఆ హామీ ఊసే లేదు
రూ. 5,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి అన్న హామీ ప్రస్తావనా లేదు
చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్ల ప్రత్యేక నిధీ లేదు.. చేనేత రుణాల మాఫీ లేదీ
కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 1,000 కోట్లు ఇస్తామని.. 50 కోట్లకే సరిపెట్టారు
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 500 కోట్లు అన్నారు.. రూ. 25 కోట్లే విదిలించారు
అర్హులందరికీ ఇళ్ల కోసం రూ. 15,000 కోట్లు కావాలి.. కేటాయింపు రూ. 808 కోట్లు
ఆహార సబ్సిడీకి రూ. 4,671 కోట్లు అవసరం.. బడ్జెట్లో ఇచ్చింది రూ. 2,318 కోట్లు
ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు రూ. 3,700 కోట్లు కావాలి.. కేటాయింపు రూ. 2,100 కోట్లే
ఎన్‌టీఆర్ సుజల స్రవంతి’ కోసం రూ. 250 కోట్లు కావాలి.. ఇచ్చింది రూ. 5 కోట్లు
ప్రణాళిక బడ్జెట్‌ను తగ్గించివేయడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ భారీగా తగ్గిపోయింది
ఉద్యోగాల నియామకాల ఊసు లేదు.. పీఆర్‌సీ అమలుకు కేటాయింపులూ లేవు

 
 రాష్ట్ర బడ్జెట్‌పై శాసనసభలో సాధారణ చర్చలో మాట్లాడటానికి, ఏకైక ప్రతిపక్షంగా తమ పార్టీ అభిప్రాయాన్ని చెప్పి ముగించడానికి మరికొంత సమయం ఇవ్వాలని గత రెండు రోజులుగా కోరినప్పటికీ సమయం ఇవ్వలేదని.. దీంతో ప్రజల పక్షాన బడ్జెట్‌కు సంబంధించి ప్రజా సమస్యలను మీడియా ముందు వినిపించాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆర్థికమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు.. ఆ పార్టీ ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేదని.. హామీలు, వాటికి చేసిన కేటాయింపుల గణాంకాలతో విడమరిచి చెప్పారు. హామీలు నెరవేర్చాలంటే ఎంతమేరకు నిధులు అవసరమవుతాయో చెప్తూ.. వాస్తవంగా బడ్జెట్‌లో ఎంత కేటాయించిందీ పేర్కొంటూ.. అవసరమైన మేరకు కేటాయించకపోవడాన్ని ఎత్తిచూపారు. నిధులు కేటాయించకుండా, హామీలను నెరవేర్చకుండా కాకి లెక్కలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వైనంపై జగన్ నిప్పులు చెరిగారు. సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా తమ గొంతు నొక్కుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే...
 
 ‘‘బడ్జెట్‌పై చర్చలో సరైన చర్చ లేకుండానే ఆర్థికమంత్రి సమాధానం ఇచ్చారు. చర్చలో ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే సమయం కేటాయించారు.  బహుశా అసెంబ్లీ చరిత్రలోనే ఇలా జరగడం మొదటిసారి. మామూలుగా బడ్జెట్‌పై చర్చ ఆరు రోజులు జరగాలి. కానీ నాలుగు రోజులకే కుదించారు. గత పదిహేనేళ్ల నుంచీ చూస్తే బడ్జెట్‌పై ఏ ప్రతిపక్ష నాయకుడైనా కనీసం రెండు, రెండున్నర గంటలు ప్రతి కేటాయింపుపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రోజు అసెంబ్లీలో రెండే పార్టీలున్నాయి. ఒకటి అధికార పక్షం.. రెండోది ప్రతిపక్షం. వేరే సభ్యులు లేరు. అధికార పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, కేటాయింపులపై నిజంగా మాట్లాడేది ప్రతిపక్షమైన మేము తప్ప వేరే పార్టీ లేదు. అయినా బడ్జెట్ చర్చలో ‘ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే ఇస్తాం.. అంతకన్నా ఎక్కువ సమయం ఇచ్చేది లేదు’ అనే నియంత పోకడ మొట్టమొదటిసారిగా ఈరోజే చూస్తున్నాం. మొన్న బడ్జెట్‌పై మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్ కట్‌చేశారు. ఆ రోజు 11.08 నిమిషాలకు ప్రారంభిస్తే అంతరాయాల మధ్య చివరికి 1.40కి మైక్ కట్ చేశారు. రెండున్నరగంటల సమయంలో గంట ఆరు నిమిషాలు అంతరాయాలు కల్పించారు.
 
 ఈ రోజు (బుధవారం) కూడా చర్చలో మైక్ కట్‌చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తాను.. అరగంట సమయం ఇవ్వాలని, అధికారపక్షానికి ఎలా అంటే అలా సహకరిస్తామని చెప్పాము. కానీ ఫలితం లేదు. సమయం ఇవ్వలేదు. సభలో ఇప్పటివరకు జరిగిన చర్చను చూస్తే ఏ ఒక్కరూ కూడా.. బడ్జెట్ కేటాయింపులు ఎంత చేశారు.. అసలు ప్రజలకు ఎంత అవసరం అనేది చెప్పలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిట్టడమే అధికారపక్ష సభ్యులు పనిగా పెట్టుకున్నారు. ఆయన చనిపోయి ఐదేళ్లు అవుతోంది.. కానీ ఇంకా ఆయనే సీఎం అన్నట్లు తిట్టడమే తప్ప.. ప్రజలకు ఏమి కావాలి? ఏ స్కీముకు ఎంత కేటాయించాలి? అన్నది చెప్పలేదు. ప్రజలకు తెలియాల్సిన అంశాలను తెలియనీయకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. అక్కడ ప్రసంగాన్ని ముగించడానికి అవకాశం చిక్కనందున ఆ అంశాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించదల్చుకున్నాను. ఏది సబబో, ఏది సరైనదో ప్రజలే నిర్ణయిస్తారు.
 
 రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఎలా ?
 రైతులకు వడ్డీ లేని పంట రుణాల కింద రూ. 56,000 కోట్లు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ పుస్తకంలో పొందుపర్చారు. కానీ.. రైతులకు ప్రస్తుత రుణ బకాయిలున్నాయి. డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంది. వీరికి నాలుగు శాతం వరకు వడ్డీ రాయితీ కల్పించాలంటే ఆ నాలుగు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు కట్టాలి. అప్పుడే రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అవుతుంది. ఈ లెక్కన రైతులు, డ్వాక్రా మహిళల రుణాలపై నాలుగు శాతం చొప్పున మొత్తం రూ. 2,560 కోట్లు వడ్డీ కింద బడ్జెట్లో కేటాయించాలి. అపుడే రైతులు, మహిళలకు మంచి జరుగుతుంది. కానీ బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది రూ. 599 కోట్లు మాత్రమే. ఇది ఎంతవరకు సరైనది?
 
 దీనర్థం.. సామాజిక పెన్షన్లను ఊడబెరుకుతారనే కదా?
 గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్‌సైట్ ప్రకారం రాష్ట్రంలో 43,11,688 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 130 కోట్లు చెల్లిస్తున్నారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్‌ను రూ. 1,000 కి పెంచుతున్నట్లు చెప్పారు. ఈ ఐదు నెలలకు రూ. 650 కోట్లు అవసరం. ఇదంతా ఇపుడున్న పెన్షన్‌దారుల విషయం మాత్రమే. కొత్తగా పెన్షన్ల కోసం 15 లక్షల దరఖాస్తులున్నాయి. వాటి  గురించి నేను చెప్పడం లేదు. అక్టోబర్ నుంచి రూ. వేయి చొప్పున పెంచాల్సి ఉన్నందున.. ఆ ప్రకారం లెక్కవేస్తే అదనంగా రూ. 431 కోట్లు కావాలి. ఇవి కాకుండా 5,36,837 వికలాంగుల పెన్షన్లు రూ. 1,500 చొప్పున వేస్తే మరో రూ. 10 కోట్లు ఉండాలి. మొత్తం కలిపితే దాదాపు రూ. 441 కోట్లు ప్రతి నెల అవసరం. రానున్న ఏడు నెలలకు 3,080 కోట్లు అవసరం. ఇప్పటివరకు ఉన్న ఐదు నెలలకు కావలసిన రూ. 650 కలిపితే మొత్తం రూ. 3,730 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో రూ. 1,338 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఇంకా రూ. 2,392 కోట్లు అంతరం ఉంది. దానర్థం ఉన్న పెన్షన్లు ఊడబెరుకుతారనే కదా?
 
 వ్యవసాయానికి 7 గంటల కరెంటూ ఇవ్వరు...
 రాష్ట్రంలో 14.54 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. వీటిలో 3 హార్స్ పవర్ నుంచి 10 హార్స్ పవర్ వరకు వినియోగించేవి ఉన్నాయి. సరాసరి ఒక్కో పంపు సెట్టు ఐదు హార్స్ పవర్ ఉంటుంది. ఉచిత విద్యుత్తు 9 గంటలు కాకున్నా కనీసం 7 గంటలు చొప్పున ఇస్తే గంటకు ఒక హార్స్‌పవర్‌కు 0.75  యూనిట్లు అవుతుంది. ఏడు గంటల పాటు పంపు నడిస్తే గంటకు ఒక హెచ్‌పీకి 5.25 యూనిట్లు ఖర్చవుతుంది. 5 హెచ్‌పీకీ రోజుకు 26.25 యూనిట్లు అవసరం. ఏడాదికి 7,875 యూనిట్లు ఒక్కో పంపు సెట్‌కు కావాలి. రాష్ట్రంలోని 14.54 లక్షల పంపు సెట్లకు ఏడాదికి 1,145 కోట్ల యూనిట్లు విద్యుత్తు అవసరం. దీన్ని యూనిట్‌కు రూ. 4 చొప్పున కొనుగోలు ధర వేస్తే రూ. 4,580 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో రూ. 3,188 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే వ్యవసాయానికి 7గంటలు కూడా కరెంటు ఇవ్వరని అర్థమవుతోంది.
 
 రూ. 5 వేల కోట్లతో రైతుల రుణ మాఫీనా?
 అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. అందుకు రూ. 87,612 కోట్లు అవసరం. ఎస్‌ఎల్‌బీసీలో బ్యాంకర్లే ఈ విషయం ప్రభుత్వానికి చెప్పారు. బడ్జెట్లో కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే పెట్టారు. మీ మాటలు నమ్మి డబ్బులు కట్టని కారణంగా ప్రతి లక్షకు రూ. 12 వేలు చొప్పున రైతులు వడ్డీ కట్టాలి. ఈ ఏడాది కూడా మీరు కట్టకపోవడంతో మరో రూ. 12 వేలు వడ్డీ పడుతోంది. ఈ రూ. 24 వేల వడ్డీ ఎవరు కడతారో బడ్జెట్లో ప్రస్తావనే లేదు. రూ.14,204 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇపుడు మాఫీ గురించి మాట్లాడడడం లేదు.
 
 రూ. 808 కోట్లతో ఇంటి స్థలం, ఇల్లు ఎలా ఇస్తారు?
 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి లక్షన్నర రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. గుడిసెలనేవి లేకుండా చేస్తామన్నారు. అలా చేయాలంటే 10 లక్షల ఇళ్లు కట్టాలి. ఇందుకు రూ. 15,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులు చేసింది రూ. 808 కోట్లు మాత్రమే. ఇళ్ల లబ్ధిదారులపై పిడుగుపాటుగా ఇటీవల యూఓ నోట్ విడుదల చేశారు. గృహనిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకునే వరకు బిల్లుల చెల్లింపులు ఆపాలని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 5.5 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 450 కోట్లు బకాయిలున్నాయి. తాజా ఆదేశాలతో బిల్లులు రాక ఈ 5.5 లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోపక్క ఇప్పటికే మంజూరై పనులు మధ్యలో ఉన్న  7.95 లక్షల ఇళ్లు రద్దుచేస్తున్నట్లు ఆ నోట్‌లో పేర్కొన్నారు.
 
 ఆహార సబ్సిడీకి రూ. 1,853 కోట్ల లోటు
 రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డులు, అన్నపూర్ణ, అంత్యోదయ, రచ్చబండలో ఇచ్చినవి ఇలా అన్నీ కలిపి.. కోటి నలభై లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఇవి కాకుండా పింక్ కార్డులు 14.86 లక్షలున్నాయి. తెల్లకార్డులకు ప్రతి నెలా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాలి. ఇందుకు రూ. 1,223 కోట్లు అవసరం. ఇది కాకుండా అమ్మహస్తం కింద తొమ్మిది సరుకులు రూ. 185 ధరకి ఇస్తున్నారు. రూ. 292 అయ్యే ఈ మొత్తంలో సబ్సిడీ 107 రూపాయలు ప్రభుత్వం భరిస్తోంది. కోటి నలభై లక్షల తెల్లకార్డులకు ఈ అమ్మహస్తానికి ప్రతి నెలా రూ. 1,788 కోట్లు అవసరం. ఇక అక్టోబర్ నుంచి కేంద్రం ప్రవేశపెట్టే కొత్త ఆహార విధానం వస్తుంది. ఇందుకు సంబంధించి మరో రూ. 1,000 కోట్లకు పైగా రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. ఈ అన్నిటికీ కలిపి రూ. 4,671 కోట్లు అవసరం. బడ్జెట్లో రూ. 2,318 కోట్లు మాత్రమే చూపెట్టారు. అంటే 1,853 కోట్లు లోటు. దీనర్థం ఏమిటి? పైగా ఆరు నెలలుగా గోధుమలు, పామాయిల్ కూడా రేషన్ కార్డులపై ఇవ్వడం లేదు.
 
 ఫీజు రీయింబర్స్‌మెంటుకు సగమే ఇచ్చారు...
 సాంఘిక సంక్షేమ వెబ్‌సైట్లో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చూపుతున్నారు. అందులో 9.54 లక్షలు మంజూరు కాగా మిగతావి చేయాల్సి ఉంది. 2013-14 సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంటు కోసం ఖర్చు చేసినది రూ. 4,286 కోట్లు. దానిలో 60 శాతం సీమాంధ్ర అనుకుంటే రూ. 2,487 కోట్లు అవుతుంది. గత ఏడాదికి సంబంధించి బకాయిలు రూ. 990 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ రెండూ కలిపితే రూ. 3,500 కోట్ల వరకు అవుతుంది. ఇది కాక సీమాంధ్ర పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఫీజులు కట్టకుంటే ఈ ప్రభుత్వమైనా కట్టాలి. లేకపోతే పిల్లల జీవితాలు నాశనమవుతాయి. దాదాపు 40 వేల మంది తెలంగాణలో చదువుతున్న సీమాంధ్ర విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్లు అవసరం. ఈ లెక్కన ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పుల కింద మొత్తం రూ. 3,700 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో రూ. 2,100 మాత్రమే కేటాయింపు చూపారు. రూ. 1,600 కోట్ల మేర కోతపెట్టారు. దీంతో పిల్లల భవిష్యత్తేమి కానుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఇవన్నీ చూస్తే రూ. 15,000 కోట్ల పైచిలుకే లోటు పెడుతున్నట్లు అర్థమవుతుంది.
 
 బీసీలకు, మైనారిటీలకూ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి...
 మైనారిటీలకు సంబంధించి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోక ముందు బడ్జెట్లో రూ. వేయి కోట్లు పెట్టారు. తరువాతి ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని తగ్గించే ధైర్యం చేయలేదు. అందులో 60 శాతం అంటే దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాలి. కానీ బడ్జెట్లో రూ. 371 కోట్లు కేటాయించారు. దీనినిబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైనారిటీలపై ఎంత ప్రేముందో అర్థమవుతుంది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు, మైనారిటీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుచేయాలి. అప్పుడే వారికి మంచి జరుగుతుంది.
 
 రూ. 5 కోట్లతో ఐదు వేల గ్రామాలకు మినరల్ వాటర్ ఇస్తారా?
 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ (మంచినీరు) ఇస్తామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీన్ని ఐదు వేల గ్రామాలకు విస్తరిస్తామన్నారు. ఐదు వేల గ్రామాల్లో ఒక్కో గ్రామంలో బోరు, మోటారు. షెడ్డు, మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 5 లక్షలు అవసరం. ఇలా ఐదు వేల గ్రామాలకు రూ. 250 కోట్లు కావలసి ఉండగా బడ్జెట్లో కేటాయించింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే.
 
 బాబు వస్తే జాబన్నారు.. నియామకాలు నిలిపేశారు..
 ‘బాబు వస్తాడు -  జాబు వస్తుంద’ని ఎన్నికల ముందు రకరకాలుగా హామీలు ఇచ్చారు. కానీ జూన్ 24వ తేదీన చంద్రబాబునాయుడు కింద ఉండే జీఏడీ విభాగం.. కొత్తగా నియామకాలు నిలిపేయాలని ఏపీపీఎస్‌సీకి ప్రత్యేకంగా లేఖ రాసింది. నియామకాలపై సమగ్ర విధానం  రూపొందించే వరకు నియామకాలు ఆపేయాలని అందులో ఆదేశించారు. రాష్ట్రంలో 1.60 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా అధికారంలోకి వచ్చి భర్తీ చేయాల్సింది పోయి ఆపేయాలంటుండడం విచారకరం.
 
 ఉద్యోగుల పీఆర్‌సీ అమలు ఏమైనట్లు?
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పదో పీఆర్‌సీ అమలు విషయాన్ని బడ్జెట్‌లో కేవలం ప్రస్తావన చేసి వదిలేశారు. పదో పీఆర్సీ గత ఏడాది 2013 జూలై నుంచి అమలు కావలసి ఉంది. అధికారంలోకి రాగానే పీఆర్సీ అమలు చేస్తామన్నారు. ఇప్పటికి సీఎంకు ఆ నివేదిక ఇచ్చి రెండు నెలలవుతున్నా 4 లక్షల మంది ఉద్యోగులు, 3.58 లక్షల మంది పెన్షనర్ల గురించి చర్యలు లేవు, బడ్జెట్‌లో కేటాయింపులు లేవు.
 
 నాడు ఉద్యమాలు చేసి.. నేడు బాక్సైట్ తవ్వకాలేమిటి?
 వైఎస్సార్, ఆ తరువాత ముఖ్యమంత్రులు ఎవరూ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ మైనింగ్ చేపట్టలేదు. వీరెవ్వరూ ప్రజాభిప్రాయాన్ని బుల్డోజ్ చేయలేదు. ప్రజల దగ్గరకు వెళ్లి మీకు కావాలా? వద్దా? అని అడిగి.. కావాలంటేనే చేయాలి. లేదంటే మానుకోవాలి. అంతే తప్ప వద్దంటున్నా మైనింగ్‌కు ముందుకు వెళ్లడమేమిటి? గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోయినా ఉద్యమాలు చేయించారు. ఇపుడు అధికారం వచ్చాక ప్రజాభిప్రాయానికి భిన్నంగా మైనింగ్‌కు ముందుకు వెళ్లడమెందుకు? దీనివల్ల అక్కడ నక్సలైట్ల సమస్య వస్తోంది. శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. ప్రజలకు ఇష్టం లేనపుడు వదిలేయాలి తప్ప ముందుకు వెళ్లడమెందుకు?
 
 ‘ప్రణాళిక’ తగ్గింపుతో ఎస్సీ, ఎస్టీ  సబ్‌ప్లాన్‌లో భారీగా తగ్గుదల
 ఇక ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ గురించి చెప్పాలి. ఎవరు మైకు పట్టుకున్నా సగం తెలిసీ, తెలియని విధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ను దుమ్మెత్తిపోయడం తప్ప మరే పనీలేదు. అయినా ఓపిగ్గా విన్నాం. 2012 డిసెంబర్ 12న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వచ్చింది. దాని ప్రకారం ప్రతి ఏటా ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్లాన్ బడ్జెట్లో కేటాయింపులు చేయా ల్సి ఉంది. ఈ సబ్‌ప్లాన్ రాకముం దు 2012 దాకా చాలా మంది సీఎంలు నిధులు మళ్లిం చారు. ఇది అందరూ చేశారు. చట్టం వచ్చాక మళ్లింపు కాకుం డా కేటాయింపులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఎవ రి హయాం లో ఎంతమేర కేటాయింపులు జరిగాయో చూ స్తే ఒక్క వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే ఎక్కువ కేటాయింపులతో వారికి మేలు చేకూరినట్లు గర్వంగా చెప్పగలం.
 
 ఈ రకంగా 2013-14 సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్‌ను ఇవ్వాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. రివైజ్డ్ బడ్జెట్ లేని దుస్థితిలో బడ్జెట్‌పై చర్చించుకోవలసి వస్తోంది. సబ్‌ప్లాన్‌కు ప్రధాన భాగం ప్రణాళిక కేటాయింపులు మాత్రమే. ప్రణాళిక కేటాయింపుల్లో ఎక్కువ ఉంటే సబ్‌ప్లాన్ ఎక్కువ వస్తుంది. ప్రణాళిక బడ్జెట్ రూ. 35,000 కోట్లుంటే అందులో 23 శాతం కేటాయింపు ఎస్సీ, ఎస్టీలకు నిధులు అందుతాయి. అదింకా పెరిగితే ఆ మేరకు సబ్‌ప్లాన్ నిధులు పెరుగుతాయి. గత పదిహేనేళ్ల బడ్జెట్లు చూస్తే ప్రణాళిక బడ్జెట్ 35 శాతానికి తగ్గకుండా కనిపిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటిసారి ఈ ప్రణాళిక బడ్జెట్‌ను 35 శాతం నుంచి 23 శాతానికి పడేసింది. ప్రణాళిక బడ్జెట్ 23 శాతానికి తగ్గినందున ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులూ తగ్గిపోతాయి. ప్రణాళిక బడ్జెట్‌కు, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌కు సంబంధముంటుంది. ప్రణాళిక బడ్జెట్ ప్రకారమే గ్రాంట్సు వస్తాయి. కానీ ప్రణాళిక తగ్గించి గ్రాంట్లు పెంచారు. ఇది అర్థం కాని విషయం.

 చంద్రబాబు ఇవన్నీ చెప్పకుండా ఇష్టమొచ్చినట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మాట్లాడించారు. గృహ నిర్మాణాల్లోనూ మంజూరు మధ్యలో ఉన్న 7.94 లక్షల ఇళ్లను రద్దుచేశారు. దానిలో అత్యధిక ఇళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలవి కావా? రెండోది బిల్లుల చెల్లింపులు ఆపేయాలని చెప్పారు. దాదాపు 5.5 లక్షల మంది ఇళ్ల లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా ఉన్నారు. వీరికి రూ. 450 కోట్లు బకాయి ఉంది. ఈ బకాయిలు ఇవ్వకుండా నిలిపేశారు. ఇంకా దారుణమేమంటే.. రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందడం లేదు. నూటికి మూడు, నాలుగు రూపాయల చొప్పున వడ్డీ చెల్లించి బయట అప్పు తెచ్చుకుంటున్నారు. వీరిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలే. వర్షాలు లేనందున పనుల కోసం వెళ్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. కానీ వారికి పనులు కూడా దొరక్కుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు నిలిపేయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాదా? వీరి పరిస్థితి ఏమిటి?
 
నిరుద్యోగ భృతికి కేటాయింపులేవీ?
 ఇంటికో ఉద్యోగమిస్తామన్నారు. లేనిపక్షంలో రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కోటిన్నర ఇళ్లున్నాయి. ఇంటికి 2,000 చొప్పున నెలకు రూ. 3,000 కోట్లు, ఏడాదికి రూ. 36,000 కోటు ్లఅవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులు సున్నా.
 -    బీసీలకు రూ. 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పారు. బడ్జెట్లో కేటాయించింది రూ. 993 కోట్లే.
 -    రూ. 1,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామని చెప్పారు. మార్కెట్లో ధరలు మండిపోతున్నా బడ్జెట్‌లో ఆ నిధి ఊసే లేదు.
 -    రూ. 5,000 కోట్లతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెడతామన్నారు. వ్యవసాయ బడ్జెట్ అంటూ ఆడంబరంగా ప్రత్యేక బడ్జెట్ పెట్టారు.. కానీ ఈ నిధి గురించి మాట్లాడలేదు.
 -    చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామన్నారు. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. చేనేత రుణాల మాఫీ అన్నారు. అదీ కనిపించలేదు. చేనేత రుణాలు రూ. 300 కోట్లు ఉన్నాయి. ధర్మవరం, ఉరవకొండలో చేనేత కార్మికులకు నోటీసులు వస్తున్నాయి. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నా వారికి సహాయానికి నిధి ఊసే లేదు.
 -    కాపుల సంక్షేమం కోసం ఏటా రూ. 1,000 కోట్లు, ఐదేళ్లకు రూ. 5,000 కోట్లు కేటాయిస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. బడ్జెట్లో రూ. 50 కోట్లకే సరిపెట్టారు.
 -    బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ. 25 కోట్లు మాత్రమే విదిలించారు.

పొంతనలేని లెక్కలు!

* ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జగన్
* బడ్జెట్‌పై శాసనసభలో తన ప్రసంగం ముగించకుండానే మైక్ కట్ చేశారని ఆవేదన
* ముగించే అవకాశం ఇవ్వాలని సభలో 20 నిమిషాలపాటు వేడుకున్న విపక్షనేత
* అవకాశం ఇవ్వకపోవడంతో వాకౌట్
* తర్వాత విలేకరుల సమావేశంలో ప్రభుత్వ బడ్జెట్‌ను ఎండగట్టిన ప్రతిపక్షనేత
* మీరైనా ప్రజలకు తమ వాదన వినిపించాలని మీడియాకు విజ్ఞప్తి
* సహనం కోల్పోయే పరిస్థితులు వస్తే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తప్పదని స్పష్టీకరణ
 
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొంతనలేని లెక్కలపై ప్రతిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు నిధులు ఏ మేరకు అవసరం? బడ్జెట్‌లో కేటాయింపు చేసిందెంతో సవివరంగా చెబుతూ ప్రభుత్వ తీరును తూర్పార పట్టారు. అంశాలవారీగా ఒక్కొక్కటీ విడమరుస్తూ అధికారపక్షాన్ని ఎండగట్టారు.

బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా జగన్ తన ప్రసంగం ముగియలేదని, మరో అరగంట సమయమిస్తే ముగిస్తానని స్పీకర్‌ను కోరారు. ఆ రకంగా 20 నిమిషాల పాటు వేడుకున్నా ఫలితం లేకపోగా మైక్ కట్ చేశారు. దీంతో సభనుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షనేత మీడియా సమావేశంలో బడ్జెట్‌లోని ప్రభుత్వ అంకెల గారడీని బట్టబయలుచేశారు. ఏ ఒక్క అంశంలోనూ అవసరమైన నిధులు కేటాయించకపోవడాన్ని నిలదీశారు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ప్రతిపక్షం లేకుండా చేయాలన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీరైనా ప్రజల వాదన వినిపించాలని ఆయన మీడియాను కోరారు. దాదాపు గంటంపావు సేపు బడ్జెట్‌లోని లొసుగులను చెండాడుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ తీరును తీవ్రంగా నిరసించారు. స్పీకర్ తీరు ఇదే మాదిరిగా కొనసాగితే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని స్పష్టంచేశారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధిలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై దూషణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

వైఎస్సార్‌లా పాలించగల దమ్ముందా?
*  పొద్దున లేస్తే చాలు వైఎస్సార్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నా... వైఎస్ మాదిరిగా మీరు  ఒక్కరూపాయి కరెంటు ఛార్జీ పెంచబోమని చెప్పగలరా? ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ఛార్జీలు వేయమని చెప్పగలరా?, వ్యాట్ పెంచబోమనగలరా? వాటర్ చార్జీలు, మున్సిపల్ పన్నులు పెంచబోమని ఆయన మాదిరిగా సభలో చెప్పగలరా? ఉద్యోగస్థులకు అండగా ఉంటూ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మబోమని చెప్పగలరా? ఆయన మాదిరిగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ (శాచురేషన్ పద్ధతిలో)సంక్షేమ పథకాలు అందించగలరా? అలా చెప్పగల దమ్మూ ధైర్యం చంద్రబాబుకు ఉందా?

 పాలన అన్నది ప్రజలు హర్షించేదిగా ఉండాలి. అందుకు మొదట ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నెరవేర్చాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. రైతులకు కొత్త రుణాలు అందడం లేదు. బకాయిలు కట్టనిదే బ్యాంకులు ఇవ్వడం లేదు. రెండు మూడు రూపాయల వడ్డీలకు బయటనుంచి తెచ్చుకుంటున్నారు. డ్వాక్రా మహిళల పరిస్థితీ అంతే. రైతుల పంటల బీమా కూడా అగమ్యగోచరంగా మారింది. ఇపుడు మీ రుణాలు మీరే కట్టుకోండని రైతులకు చెబుతున్నారు. ఇదేనా రైతులకు మీరిచ్చే భరోసా? ఇదేనా హామీలు నెరవేర్చే పద్ధతి? ఈ మూడునెలల్లో ఒక్కటన్నా మంచి పనిచేశారా?

11 మంది వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజకీయంగా హత్యలకు గురై శాంతిభద్రతలపై చర్చకు మేము పట్టుబడితే దాన్నీ పక్కదోవ పట్టించేలా వ్యవహరించారు. చర్చ జరుగుతుండగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మరో ముగ్గురిని చంపేశారు. చంద్రబాబూ... గుండెల మీద చేతులేసి ప్రశ్నించుకోండి. ప్రజలకు మంచి చేస్తున్నారా? మా గొంతు నొక్కుతున్నారా? అధికారంలో నేడు మీరున్నారు. రేపు మేముంటాం. ఎవరున్నా మన పాలన చూసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మంచి పాలన అందిస్తే వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. వారు చనిపోయాక కూడా బతికిన వారవుతారు. ఈరోజు మీ పాలన ఎలా ఉందో మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి.

సహనం నశించేలా చేస్తే స్పీకర్‌పై అవిశ్వాసం తప్పదు
చరిత్రలో ఎన్నడూ లేని మాదిరిగా ప్రతిపక్షానికి బడ్జెట్ చర్చలో గంటన్నర మాత్రమే ఇస్తామని, అంతకుమించి ఇచ్చేది లేదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెబుతున్నారు. ఇంతకన్నా నియంతృత్వ పోకడలు ఎక్కడుంటాయి? స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలని భావించినా దానిపై మళ్లీ చర్చ అవసరం. ఇప్పటికే మాకు చర్చలో తక్కువ సమయం ఇచ్చారు. కటింగ్‌లు మీద కటింగ్‌లు పెట్టారు. ఇలాంటి సమయంలో అవిశ్వాసం ఎందుకని ఓపికతో ఉంటున్నాం. ఓపిక నశించేలా వ్యవహరిస్తే మాత్రం అవిశ్వాసం పెట్టక తప్పదు.

* ప్రజలు ఏమీ వినరాదు. కనరాదు. వారిచ్చిన హామీలు, చేస్తున్న  కేటాయింపులు కనిపించకూడదన్న కుట్ర చేస్తున్నారు. ఇలాంటివారికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెబుతారు. ప్రజలకు ఏ మేరకు అవసరమో, బడ్జెట్లో ఏమేరకు  కేటాయింపులు చేశారో ప్రజలకు తెలియాలి. మీడియా ప్రజల తరఫున పోరాడాలి. వారికి వాస్తవాలు వివరించాలి.

కాంగ్రెస్‌ను మేము తొలినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయాలని మేము అవిశ్వాసం పెడితే చంద్రబాబునాయుడే కూలిపోకుండా మద్దతు ఇచ్చి నడిపించుకుంటూ వచ్చారు.

అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్సీఎల్పీ నాయకులు జ్యోతుల నెహ్రూ, పీడిక రాజన్నదొర, ఉప్పులేటి కల్పన, అమర్‌నాధ్‌రెడ్డి, కొడాలినాని, శ్రీకాంత్‌రెడ్డి, గిడ్డి ఈశ్వరి, జోగులు,విశ్వేశ్వరరెడ్డి గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, జంకె వెంకట్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీకి కొత్తరూపు


సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కొత్త రూపునిచ్చారు. సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గొల్ల బాబూరావులను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతం బాధ్యతలు అప్పగించారు. 14 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. అనుబంధ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఒక్కొక్క పరిశీలకుడిని నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి పార్టీ గ్రామ కమిటీల నిర్మాణం, యువజన, మహిళా, విద్యార్థి విభాగాలను బలోపేతం చేయడంతో పాటు సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను పార్టీ సమర్ధవంతంగా వినియోగించుకునేలా చూసే బాధ్యతలను అప్పగించారు. పీఎన్వీ ప్రసాద్‌కు పార్టీ నిర్వహణ బాధ్యతలు (అడ్మినిస్ట్రేషన్) అప్పజెప్పారు.
 
 ప్రధాన కార్యదర్శులు.. అప్పగించిన బాధ్యతలు
 సుజయ్‌కృష్ణ రంగారావు - ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు; ధర్మాన ప్రసాదరావు - ఉభయ గోదావరి జిల్లాలు; మోపిదేవి వెంకటరమణ- కృష్ణా, గుంటూరు జిల్లాలు; జంగా కృష్ణమూర్తి- చిత్తూ రు, వైఎస్సార్ జిల్లాలు; ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -ప్రకాశం జిల్లా; భూమన కరుణాకర్‌రెడ్డి - అనంతపురం, కర్నూలు జిల్లాలు.
- అనుబంధ శాఖల రాష్ట్ర అధ్యక్షులు
 
 మహిళా విభాగం- ఆర్‌కే రోజా; యువజన విభాగం- వంగవీటి రాధా; రైతు విభాగం- ఎమ్వీఎస్ నాగిరెడ్డి; ఎస్సీ సెల్ - మేరుగ నాగార్జున; బీసీ సెల్- ధర్మాన కృష్ణదాసు; లీగల్ సెల్ - పోన్నవోలు సుధాకర్‌రెడ్డి; మైనార్టీ సెల్- అంజాద్ బాషా; ఎస్టీ సెల్- తెల్లం బాలరాజు; ట్రేడ్ యూనియన్- గౌతంరెడ్డి
 రాష్ట్ర పార్టీ కార్యదర్శులుమేడపాటి వెంకట్, రాజీవ్ కృష్ణ, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తలశిల రఘురాం, జక్కంపూడి రాజా, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా మధుసూధన్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ముద్దునూరి ప్రసాదరాజు, అనిల్‌యాదవ్, మేకతోటి సుచరిత, వై.నాగిరెడ్డి

వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి

Written By news on Wednesday, August 27, 2014 | 8/27/2014

వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి నియమితులయ్యారు. ఆయనకు గ్రామ కమిటీలు, యువత, మహిళ, విద్యార్థి, సామాజిక అనుసంధాన బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నియమించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ప్రధాన కార్యదర్శులు
గొల్ల బాబూరావు, సుజయకృష్ణ రంగారావు(ఉత్తరాంధ్ర), ధర్మాన ప్రసాదరావు(తూర్పు, పశ్చిమగోదావరి), మోపిదేవి వెంకటరమణ(కృష్ణా, గుంటూరు), జంగా కృష్ణమూర్తి(చిత్తూరు, వైఎస్సార్), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(ప్రకాశం), భూమన కరుణాకర్ రెడ్డి(అనంతపురం, కర్నూలు), పీఎన్వీ ప్రసాద్(పరిపాలన).

కార్యదర్శులు
మేడపాటి వెంకట్, రాజీవ్ కృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తలశిల రఘురాం, జక్కంపూడి రాజా, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ముదునూరి ప్రసాద్ రాజు, అనిల్ యాదవ్, మేకతోటి సుచరిత, వై నాగిరెడ్డి.

వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడిగా వంగవీటి రాధ

వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడిగా వంగవీటి రాధ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆర్ కే రోజా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి. ఎస్సీ సెల్ కు మేరుగ నాగార్జున, బీసీ సెల్ కు ధర్మాన కృష్ణదాస్, లీగల్ సెల్ కు పొన్నవేలు సుధాకర్ రెడ్డి, మైనారిటీ సెల్ కు అంజాద్ బాషా, ఎస్టీ సెల్ కు తెల్లం బాలరాజు అధ్యక్షులుగా నియమితులయ్యారు.

వైఎస్ఆర్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా వంగవీటి రాధను నియమించారు. రైతు విభాగానికి ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ ను గౌతంరెడ్డి అధ్యక్షులుగా నియమితులయ్యారు.

వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే

హైదరాబాద్: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

వైఎస్సార్ సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
శ్రీకాకుళం- బేబీ నయిన
విజయనగరం- బి.చంద్రశేఖర్
అరకు- బి. ప్రసాద్
విశాఖ- దాడిశెట్టి రాజా
అనకాపల్లి- ఆదిరెడ్డి అప్పారావు
కాకినాడ- ముత్యాలనాయుడు
రాజమండ్రి- పేర్ని నాని
అమలాపురం- కరణం ధర్మశ్రీ
నరసాపురం- వేణుగోపాల్
ఏలూరు- పిల్లి సుభాష్ చంద్రబోస్
విజయవాడ- ఆదిశేషగిరిరావు
మచిలిపట్నం- ఉమ్మారెడ్డి రమణ
తిరుపతి- ఎల్లసిరి గోపాల్ రెడ్డి
చిత్తూరు-పి. రవీంద్రనాథ్ రెడ్డి
అనంతపురం- డీసీ గోవిందరెడ్డి
హిందూపూర్- మిథున్ రెడ్డి
 కర్నూలు- సురేష్ బాబు
నంద్యాల- గుర్నాథరెడ్డి
కడప- వైఎస్ అవినాశ్ రెడ్డి
రాజంపేట- దేవగుడి నారాయణరెడ్డి

బడ్జెట్ లో కేటాయింపులన్నీ తక్కువే: వైఎస్ జగన్

బడ్జెట్ లో కేటాయింపులన్నీ తక్కువే: వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: బడ్జెట్ లో కేటాయింపులన్నీ తక్కువే చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడటానికి సమయం ఇవ్వలేదని తెలిపారు. ఆరు రోజులు జరుగవలసిన అసెంబ్లీ సమావేశాలను 4 రోజులకు తగ్గించారని చెప్పారు. శాసనసభలో బడ్జెట్ పై మాట్లాడటానికి ప్రతిపక్షానికి గంటన్నర మాత్రమే సమయం  ఇస్తామన్నారని తెలిపారు. గతంలో ప్రతిపక్ష నాయకుడు రెండున్నర గంటలు మాట్లాడినట్లు గుర్తు చేశారు. సభలో ఎంతసేపటికీ రాజశేఖర రెడ్డిని తిట్టడం తప్ప మరొకటి లేదన్నారు. అయినా ఓపిక పట్టినట్లు తెలిపారు.

వైఎస్ జగన్ తెలిపినవాటిలో ముఖ్యమైన అంశాలు:

* ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో తెలిపిన ప్రకారం వ్యవసాయ రుణాలు 56 వేల కోట్ల రూపాయలను బ్యాంకులు రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించాయి.
* వ్యవసాయ రుణాలు కనీసం 50 వేల కోట్ల రూపాయలు.  డ్వాక్రా రుణాలు 14 వేల కోట్ల రూపాయలు.
మొత్తం కావలసినది 64వేల  కోట్ల రూపాయలు.
* 4 శాతం వడ్డీ చొప్పున  రెండు వేల 560 కోట్ల రూపాయలు కావాలి.  బడ్జెట్ లో కేటాయించినది 599 కోట్ల రూపాయలు  మాత్రమే.
* ప్రస్తుతం 43 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారు. అయిదు నెలలకు లెక్కిస్తే 650 కోట్ల రూపాయలు కావాలి. కానీ 130 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.
* ఫీజు రీయింబర్స్ మెంట్ కు  2013-14లో 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 9 లక్షల దరఖాస్తులకు మంజూరు చేశారు. 430 కోట్లకు  1338 కోట్లు మాత్రమే కేటాయించారు.

* 14 లక్షల 54వేల  వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. గంటకు 5.25 యూనిట్ల విద్యుత్  కావాలి. కనీసం 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే 26.25 యూనిట్లు కావాలి. అంటే మొత్తం 7875 యూనిట్లు కావాలి.యూనిట్ కు 4 రూపాయల చొప్పున కొనుగోలు రేటు వేసుకుంటే 4 వేల500 కోట్లు రూపాయలు కావాలి. కేటాయింపులు ఆ స్థాయిలో లేవు. అంటే కనీసం ఏడు గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు.

* కొత్త పిఆర్ సి కోసం ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. దానిపై ఎటువంటి ప్రకటనలేదు. 3.58 లక్షల పెన్షనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది.
* వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు.  87 వేల 612 కోట్ల రూపాయలు కావాలి. బడ్జెట్ లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించాలి.
* ప్రతి రైతు 12వేల రూపాయల వడ్డీ చెల్లించాలి. ఆ ప్రస్తావనలేదు.
* డ్వాక్రా మహిళల రుణాలు 14 వేల204 కోట్ల రూపాయలు ఉన్నాయి.
*ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడ్జెట్ లో ఆ ప్రస్తావనలేదు. కోటి 50 లక్షల ఇళ్లు ఉన్నాయి.  మూడు వేల కోట్ల రూపాయలు  కావాలి.
* బిసిలకు  పది వేల కోట్ల రూపాయలతో  ప్రత్యేక బడ్జెట్ అన్నారు. 993 కోట్ల రూపాయలు  మాత్రమే కేటాయించారు.
* వెయ్యి కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. బడ్జెట్ లో కేటాయింపులు లేవు.
*వ్యవసాయ బడ్జెట్ లో  వ్యవసాయ ధరల స్థిరీకరణ లేదు.
* చేనేత కార్మికులకు వెయ్యి కోట్లతో నిధి అన్నారు. బడ్జెట్ లో ప్రస్తావనలేదు.
* చేనేత కార్మికులకు 300 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. కేటాయింపులు లేవు.
* కాపుల సంక్షేమ నిధికి వెయ్యి కోట్లు అన్నారు. 300 కోట్లు రూపాయలు కేటాయించారు.
* బ్రాహ్మణలుకు 25 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.
* పది లక్షల ఇళ్లు కావాలి. 15వేల కోట్ల రూపాయలు కేటాయించాలి. 808 కోట్లు మాత్రమే కేటాయించారు.
* రెండు రూపాయలకు 20 లీటర్ల నీరు అన్నారు. 5వేల గ్రామాలకు ఇస్తామన్నారు. కనీసం 250 కోట్ల రూపాయలు కావాలి. 5 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు

వైఎస్‌ఆర్ సీపీని మరింత బలోపేతం చేయండి


వైఎస్‌ఆర్ సీపీని  మరింత బలోపేతం చేయండి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కలిసికట్టుగా పని చేసి పార్టీని మరింత పటిష్ట పరచాలని జిల్లా నాయకులకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్భోదించారు.  క్షేత్రస్థాయిలో కార్యకర్తలను, నాయకులను సమన్వయపరిచి పార్టీని ముందుకు న డిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియూమితులైన కోలగట్ల వీరభద్రస్వామికి సూచించారు.  కమిటీలు వేసి రానున్న రోజుల్లో పార్టీ విషయానికి కృషి చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడిగా కోలగట్ల వీరభద్రస్వామి నియామకం ఖరారు చేసిన సందర్భంగా జిల్లా పార్టీ నాయకులంతా మంగళవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసారు. కోలగట్లను అభినందించిన జగన్‌మోహన్‌రెడ్డి, అందరినీ కలుపుకొని జిల్లాలో పార్టీని మరింత పటిష్టపరచాలని సూచించారు.

 ఈ సందర్భంగా కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేరుస్తానని, పదవికి న్యాయం చేస్తూ జిల్లాలో నాయకులు, కార్యకర్తల సహకారంతో, సమన్వయంతో పనిచేస్తానని  చెప్పారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని వారికి ప్రతి విషయంలో అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేవిధంగా, పార్టీ జెండా జిల్లాలో రెపరెపలాడే విధంగా కృషి చేస్తానన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణా రంగారావు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి బెల్లాన చంద్రశేఖర్, జమ్మాన ప్రసన్నకుమార్, అంబళ్ల శ్రీరాములనాయుడు, నెక్కల నాయుడుబాబు, పతివాడ అప్పలనాయుడు, అవనాపు విజయ్, చనుమల్ల వెంకటరమణ, కోలగట్ల ప్రతాప్ తదితరులున్నారు.

 రేపు జిల్లాకు రానున్న కోలగట్ల :
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియూమితులైనకోలగట్ల వీరభద్రస్వామి ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కోలగట్లకు ఘనంగా స్వాగతం పలికేందుకు   పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఏర్పాట్లు చేస్తున్నారు.

జనానికి దాహం.. బాబుకు ఆర్భాటం!


జనానికి దాహం.. బాబుకు ఆర్భాటం!
చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయగానే కుప్పంలో ఆర్‌అండ్‌బీ  అతిథిగృహానికి ముస్తాబు
అదే అతిథిగృహానికి  మరమ్మతులకు రూ.47 లక్షలు  కేటాయిస్తూ ఉత్తర్వులు
ఆ బంగ్లాలో అదనపు గదులు, ఫర్నీచర్ కోసం తాజాగా రూ.60 లక్షలు మంజూరు
కుప్పం నియోజకవర్గంలో 280 గ్రామాల్లో  తీవ్ర తాగునీటి ఎద్దడి
సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించని వైనం

 
ప్రజాభ్యుదయం మాటేమోగానీ..విలాసాలకూ ఆడంబరాలకూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం తగలేస్తోంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులే అందుకు తార్కాణం. కుప్పం నియోజకవర్గంలో 280 గ్రామాల ప్రజలు తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రజల దాహార్తి తీర్చడానికి నిధులు కేటాయించని సీఎం.. కుప్పంలో అద్దంలా మెరిసిపోతున్న ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి నగిషీలు అద్దడానికి, అదనపు గదుల నిర్మాణానికి, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.1.07 కోట్లు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది.

వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. కుప్పం నియోజకవర్గంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. తాగునీటి పథకాల బోరు బావులు ఎండిపోయాయి. కుప్పం నియోజకవర్గంలోని 280 గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. ఇది కుప్పం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియంది కాదు. తాగునీటి ఎద్దడి నివారణకు నిధులు కేటాయించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పొలాల్లో వ్యవసాయ బోరు బావుల వద్ద బిందెడు నీళ్లు తెచ్చుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇదో పార్శ్వం.. మరో పార్శ్వం ఏమిటంటే 1995లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కుప్పంలో నాలుగు సూట్ల, అధునాతన సదుపాయాలతో కూడిన ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని నిర్మిం చారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా ఇక్కడే బస చేస్తారు. జూన్ 8న చంద్రబాబు సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. 16, 17 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు.

చంద్రబాబు పర్యటనకు ముందుగానే ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి మరమ్మతులు చేశారు. పెయింటింగ్ చేయించి.. నగిషీలు అద్దారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా ఫర్నీచర్‌ను అప్పటికే సిద్ధం చేశారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని అద్దంలా మెరిసేలా చేయడంలో ఆశాఖ అధికారులు కృతకృత్యులయ్యారు. ఇంతవరకూ బాగానే ఉంది. అద్దంలా మెరిసిపోతున్న కుప్పం  ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి మరమ్మతులు చేయడానికి రూ.47 లక్షలు కేటాయిస్తూ ఈనెల 21న ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం:638) జారీచేశారు. ఆ ఉత్తర్వులు జారీ అయి నాలుగు రోజులు కూడా తిరక్క ముందే ఆ అతిథిగృహంలో అదనపు గదుల నిర్మాణానికి రూ.40 లక్షలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ.20 లక్షలు మంజూరు చేస్తూ ఈనెల 25న ఆదేశాలు(జీవో ఎంఎస్ నెం: 647) జారీచేశారు. అంటే.. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి హంగులు, ఆర్భాటాలు అద్దడానికి రూ.1.07 కోట్లు మంజూరు చేశారన్న మాట. ఓ వైపు ఆర్థిక పరిస్థితులు అనుకూలించని స్థితిలో ఖర్చులు తగ్గించుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశిస్తూనే.. మరో వైపు తన సొంత నియోజకవర్గంలో అతిథిగృహానికి నగిషీలు అద్దేందుకు ఆడంబరాల కోసం రూ.1.07 కోట్లను తగలేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడంబరాల కోసం వెచ్చిస్తోన్న రూ.1.07 కోట్లను కుప్పం నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఖర్చు చేస్తే వేలాది మంది ప్రజల దాహార్తి తీరుతుందని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం కొసమెరుపు.

Popular Posts

Topics :