07 September 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రోజాను ఫోన్ లో పలకరించిన వైఎస్ జగన్

Written By news on Saturday, September 13, 2014 | 9/13/2014


రోజాను ఫోన్ లో పలకరించిన వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రోజాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఫోన్ లో పలకరించారు. చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి నేతలు, కార్యకర్తలు రోజాపై దాడి చేసిన విషయం తెలిసిందే. అమ్మవారి జాతరలో పాల్గొన్న రోజాపై వారు దౌర్జన్యంగా చేశారు.

జగన్ ఫోన్ లో రోజాతో మాట్లాడి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రోజాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలో ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి జరగడం దారుణం అని  జగన్  అన్నారు

చంద్రబాబు రోజాకు క్షమాపణ చెప్పాలి


చంద్రబాబు రోజాకు క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నగరి ఎమ్మెల్యే రోజాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు బేషరతుగా రోజాకు క్షమాపణలు చెప్పాలని పద్మ డిమాండ్ చేశారు. రోజాపై దాడి టీడీపీ అరాచకాలకు పరాకాష్టని అన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని, ఇలాగే వ్యవహరిస్తే పోలీసులు, న్యాయవ్యవస్థ ఎందుకని పద్మ ప్రశ్నించారు.

రోజాపై దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నగరిలో రోజాకు మద్దతుగా శనివారం వైఎస్ఆర్ సీపీ నాయకులు ధర్నాకు దిగారు. తిరుపతి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు, భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపారు. టీడీపీకి కొమ్ముకాస్తున్న డీఎస్పీని సస్పెండ్ చేయాలని, రోజాపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని భూమన డిమాండ్ చేశారు.

ముద్దుకృష్ణమనాయుడి అండతోనే దాడి: రోజా

వీడియోకి క్లిక్ చేయండి
నగరి : ఒక ఎమ్మెల్యేగా, మహిళగా దేవతకు హారతి ఇవ్వడానికి వెళ్తే దారుణంగా దాడి చేయటంపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధి అయిన తనకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ఈ దాడిని ఖండిస్తూ రోజాతో పాటు ఆమె మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నిరసన  తెలిపారు. పోలీసులు దాడి చేసిన వారిని పట్టుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై లాఠీచార్జ్‌ చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ జాతర జరుగుతోందని, ఎమ్మెల్యే కాక ముందు నుంచి నగరి నియోజకవర్గ ఆడబిడ్డగా ప్రతి సంవత్సరం వచ్చి జాతర చేస్తున్నామన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ గెలిచి... టీడీపీ ఓడిపోయిందన్న కసితో ముద్దుకృష్ణమ నాయుడు, ఆయన కుమారుడు భాను స్థానికుల్ని రెచ్చగొట్టారన్నారు. ప్రతి విషయాన్ని వారు సమస్య చేస్తున్నారని రోజా అన్నారు. ముద్దు కృష్ణమనాయుడు అండతో ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారన్నారు.

అ నేపథ్యంలో తాము శుక్రవారం జాతర చేసుకుంటామని ముందుగా కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. టీడీపీ నేతలు వస్తే గొడవలు జరుగుతాయని తాము వారిని రావద్దన్ని చెప్పామన్నారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నామని, కోర్టు ఆర్డర్ లో ఎవరు ఎవరూ రాకూడదనే వివరాలు స్పష్టంగా ఉన్నా. వారందర్నీ డీఎస్పీ కృష్ణ కిషోర్ రెడ్డి అనుమతి ఇచ్చారన్నారు. వాళ్లకు ఎందుకు డీఎస్పీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.

హారతి ఇస్తుంటే తన చేతిలో హారతి పళ్ళాన్ని వీఆర్ వో జ్యోతిరెడ్డి అలియాస్ సదాశివరెడ్డి లాక్కున్నారని, కింద పడేశారన్నారు. అదే సమయంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడుగా ఉన్న కొడిబాబు అలియాస్ బాబురెడ్డి అమ్మవారి పైకి ఎక్కేసి, తన చేతిని విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడని... అతని చేతిలో కత్తి ఉందో, బ్లేడ్ ఉందో తెలియలేదని, ఆ సమయంలోనే తన చెయ్యి తెగిందన్నారు.

అయినా కూడా అతడిని కిందకు దిగమని బతిమలాడుతున్నారే కానీ, ఒక ఎమ్మెల్యేకు  ప్రాణ హాని ఉందన్నా రక్షణ కల్పించలేదని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 'ఎమ్మెల్యేను లేపేయండిరా తర్వాత మనం అడ్డం ఉండదు' అని వీఆర్ వో వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారో అర్థం అవుతుందన్నారు.

వంద పడకల ఆస్పత్రి జీవోకు కృషి చేస్తా


వంద పడకల ఆస్పత్రి జీవోకు కృషి చేస్తా
చంద్రగిరి: చంద్రగిరిలోని ఏరియా ఆస్పత్రిని వందపడకల ఆస్పత్రిగా మార్చేందుకు అవసరమైన జీవో తీసుకురావడానికి కృషి చేస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏరియా ఆస్పత్రి చైర్మన్ హోదాలో బోర్డు కమిటీ సభ్యులను నియమించారు.

ఈ కమిటీలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి సభ్యులుగా చంద్రగిరి ఎంపీపీ, తిరుపతి రూరల్ ఎంపీపీ, పాకాల ఎంపీపీ, చంద్రగిరి జెడ్పీటీసీ, ఆర్‌సీ. పురం జెడ్పీటీసీ, తిరుపతి రూరల్ జెడ్పీటీసీ, చంద్రగిరి సర్పంచ్, తహశీల్దార్, వైద్యాధికారి, డీసీహెచ్‌ఎస్, మానవ హక్కుల సభ్యులు ఒకరు, స్థానిక సేవ సభ్యులు ఒకరిని నియమించారు. అలాగే చిన్నగొట్టిగల్లు ఏరియా ఆస్పత్రి కమిటీ సభ్యులుగా చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం, రామచంద్రాపురం, ఎంపీపీలు, చిన్నగొట్టిగళ్లు, యర్రావారిపాళెం, పాకాల జెడ్పీటీసీలు, వైధ్యాధికారి, స్థానిక సర్పంచ్, తహశీల్దార్, డీసీహెచ్‌ఎస్, ఐకేపీ, సేవా సంఘం తరఫున ఒకరిని నియమించారు.

అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ నియమించిన బోర్డు సభ్యుల పర్యవేక్షణలో అస్పత్రి వర్గాలు పనిచేస్తాయన్నారు. నియోజకవర్గానికి ఎంతో తలమానికంగా చంద్రగిరి ఆస్పత్రి ఉందన్నారు. 31 మంది సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉందని అయితే ఇద్దరు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం ఏరియా అస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా జీవో తీసుకురావాలని అధికారులు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రస్తావించానన్నారు.

ముఖ్యంగా 100 పడకల జీవోకు ప్రభుత్వం ఆమోదం తెలిపాలని కోరానన్నారు. దీనికి ప్రభుత్వం, సంబంధిత మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైద్యం అందంచగలిగే విధంగా ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు తమ సమస్యలను వివరించారు. స్పందించిన ఎంఎల్‌ఏ జిల్లా వైద్యాధికారితో ఫోన్‌తో మాట్లాడి చంద్రగిరి ఏఎన్‌ఎం నర్సులను కొనసాగించాలని తెలిపారు.  

ఎంపీపీ కుసుమ, వైఎస్ ఎంపీపీ వనజ, మండల కన్వీనర్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ, వేణుగోపాల్‌రెడ్డి, హేమేంద్రకుమార్‌రెడ్డి, ఎంపీటీసీలు బుజ్జి, నవనీతమ్మ, భారతి, జ్యోతి, నాగరాజు, మంగయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లం చంద్రమౌళిరెడ్డి, సర్పంచి ఉమామహేశ్వరి, తొండవాడ సర్పంచ్ సిద్దముని, నాయకులు అగరాల భాస్కర్‌రెడ్డి, బండారు హేమచంద్ర, ఒంటి శివశంకర్, కో ఆప్షన్ సభ్యులు మస్తాన్, మణి, ఫరూక్, జయకుమారి, అస్పత్రి సూపరింటెండెంట్ కె.శారద, డాక్టర్లు పద్మజ, ఆపర్ణ, దినే్‌ష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు

ఎమ్మెల్యే రోజాపై దాడి, చేతికి తీవ్ర గాయం

ఎమ్మెల్యే రోజాపై దాడి, చేతికి తీవ్ర గాయం
నగరి : చిత్తూరు జిల్లా నగరిలో టిడిపి నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడ్డారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను లక్ష్యంగా చేసుకుని నానా రభస సృష్టించారు.  నగరిలో ఏటా అమ్మవారి జాతర ఘనంగా జరుగుతుంది. చివరి రోజు ప్రోటో కాల్ ప్రకారం దేవతలకు ఎమ్మెల్యే ప్రధాన హారతి ఇవ్వడం ఆనవాయితీ.

అయితే ఇందుకు విరుద్ధంగా టిడిపి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.  జారత పెద్ద కుమరేశన్ మొదలియార్ ప్రధాన హారతి ఇవ్వకూడదని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఈ తోపులాటలో రోజా చేతిలోని హారతిపళ్లెంను మరోవర్గం వారు లాగేయటంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్న నేతలకు పోలీసులు కూడా సహకరించటం బాధాకరమని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి

Written By news on Friday, September 12, 2014 | 9/12/2014

బాబు మానసిక స్థితిని పరీక్ష చేయించండి
హైదరాబాద్ : ఆర్థిక సంఘం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన ప్రతిపాదనల్లో ఏమాత్రం పస లేదని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ప్రతిచోటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ నామస్మరణే సరిపోతోందని ఆయన అన్నారు. బహుశా చంద్రబాబుకు మతిస్థిమితం తప్పిందేమోనని, అందువల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడైనా మంచి ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. తాను కూడా గతంలో ఆయన వద్ద పనిచేసినవాడినే కాబట్టి, బాబు శ్రేయోభిలాషిగా ఈ మాట చెబుతున్నానన్నారు.

కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ చేస్తానని, మరికాసేపు ముంబై చేస్తానని ఆయన చెబుతున్నారని.. ఇప్పటికే సింగపూర్, ముంబై ఉన్నందున ఇప్పుడు ఆయన కొత్తగా చేయాల్సింది ఏమిటని తమ్మినేని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఆర్థిక సంఘం వద్ద తమకు ఏయే అవసరాలకు ఎంతెంత నిధులు కావాలన్న విషయాలను నిర్మాణాత్మకంగా చెప్పి నిధులు తెచ్చుకోవాలని, అంతేతప్ప గత ప్రభుత్వాల మీద బురద చల్లడానికి కూడా ఈ వేదికనే ఉపయోగించుకోవడం సరికాదని తమ్మినేని అన్నారు.

టీడీపీ మరో రాజకీయ హత్య

టీడీపీ మరో రాజకీయ హత్య
గుంటూరు జిల్లా చినగార్లపాడులో పట్టపగలే దారుణం
నడిరోడ్డుపై వైఎస్సార్ సీపీ నేతను నరికి చంపిన టీడీపీ వర్గీయులు
 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో టీడీపీ సాగిస్తున్న హత్యా రాజకీయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత బలయ్యాడు. గురువారం చినగార్లపాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు పట్టపగలు కత్తులు, బరిసెలు, వేట కొడవళ్లతో స్వైర విహారం చేసి, వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేసే వేంపాటి గోవిందరెడ్డి (45)ని హత్య చేశారు. ఆయన భార్యను, మరో ఇద్దరి పైన కూడా దాడిచేసి, తీవ్రంగా గాయపర్చారు. టీడీపీ వర్గీయుల దాడితో గ్రామం వణికిపోయింది. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అక్క లక్ష్మమ్మ, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఉదయం 11 గంటల సమయంలో 30 మంది టీడీపీ వర్గీయులు కత్తులు, బరిసెలు, వేటకొడవళ్లతో ఒక ట్రాక్టర్, రెండు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై పెద్దగా కేకలు వేస్తూ చినగార్లపాడు గ్రామ కూడలికి వచ్చారు.

వెంటనే సెంటర్‌లో నిల్చుని ఉన్న ఈవూరి శివారెడ్డిపై దాడి చేశారు. దీంతో అక్కడున్న వారు, దుకాణాల యజమానులు భయాందోళనకు లోనై పరుగులు తీశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని వైఎస్సార్‌సీపీ నేత వేంపాటి గోవిందరెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇది గమనించిన గోవిందరెడ్డి  పారిపోయేందుకు ప్రయత్నించగా అందరూ చూస్తుండగానే నడి బజారులో ఆయన్ని అతి కిరాతకంగా పొడిచి చంపారు. అడ్డు వచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మపై దాడి చేయగా తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డిని కూడా కత్తులు, బరిసెలతో విచక్షణారహితంగా పొడిచారు. అనంతరం నిందితులు గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే నరికేస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన కోటిరెడ్డి పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. అయితే, నిందితులందరి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు గ్రామానికి వెళ్లి, వివరాలు తెలుసుకున్నారు.

ఆధార్‌కు పథకాలను లింకు చేయొద్దన్న సుప్రీం ఆదేశాలూ బేఖాతరా?

నాడు వద్దన్న ఆధార్ నేడు ముద్దా?
* చంద్రబాబు ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
ఆధార్‌కు పథకాలను లింకు చేయొద్దన్న సుప్రీం ఆదేశాలూ బేఖాతరా?
అసలిది పేద ప్రజల ప్రభుత్వమా లేక కార్పొరేట్ల ప్రభుత్వమా?  

 
 సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డుతో పేదల సంక్షేమ పథకాలకు లింకు వద్దని ఎన్నికలకు ముందు విమర్శించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇపుడు అదే ఆధార్‌తో బడుగు వర్గాల పథకాలను అనుసంధానిస్తారని వార్తలు రావడం ఆందోళనకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... సంక్షేమ పథకాలను ఆధార్‌తో లింకు చేయడం వల్ల రూ.1089 కోట్లు ఆదా అవుతుందని టీడీపీ అనుకూల పత్రిక ఒకటి రాసిందని ఆమె ప్రస్తావిస్తూ... పేదల సంక్షేమంలో కోత విధిస్తున్నారంటే ఆ పత్రికకు ఎందుకంత సంతోషం, బడుగుల కడుపు కొడితే పత్రికలకు ఆనందమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
 
  ‘‘సంక్షేమ పథకాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయవద్దని ఈ ఏడాది మార్చి 3వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ చంద్రబాబు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయడయంలేదు. సబ్సిడీపై కోత విధించడమే సర్కారు ఉద్దేశమని స్పష్టమవుతోంది. అసలిది పేదల ప్రభుత్వమా, లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? ప్రజలు మనలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలని అని ఆలోచించిన ఒక రాజు గారు బాగా ఆలోచించి అన్నం పెడితే అరిగి పోతుంది...చీరలిస్తే చిరిగిపోతాయి, అందుకని కర్రు కాల్చి వాత పెడితే దానిని గుర్తుంచుకుంటారని అందరికీ వాతలు పెట్టారు. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితీ అలాగే ఉంది.’’ అంటూ ఆమె దుయ్యబట్టారు.

అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు

అధికారంలోకి రావడానికి వంద అబద్ధాలు
కడప కార్పొరేషన్: వంద అబద్దాలు ఆడి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మేయర్ కె. సురేష్‌బాబు, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి గురువారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ  వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, వైఎస్ జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని చర్చను పక్కదారి పట్టించిందన్నారు. తద్వారా  నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశంలేకుండా వ్యవహరించిందన్నారు.

కొత్త రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి అంశాల ప్రస్తావనే లేకుండా పదిహేను రోజులపాటు విమర్శలతోనే కాలం వెల్లబుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎదురుదాడితో ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాలన్నారు.  రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరునెలలకు చేస్తారా.. సంవత్సరానికి చేస్తారా.. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 5వేల కోట్లు ఇందుకు సరిపోతాయా... అని ఆయన ప్రశ్నించారు.  రుణాలు కట్టాలని లేనిపక్షంలో బంగారు వేలం వేస్తామని ఇప్పటికే రైతులకు బ్యాంకుల నుంచి  నోటీసులు వచ్చాయన్నారు.  వేలం వేస్తే ఆ అవమానాన్ని భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యత ఎవరిదని నిలదీశారు.

సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పకుండా ఎంతసేపు వైఎస్ హయాంలో నిధులు దుర్వినియోగమయ్యాయని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.  అసెంబ్లీలో రాజధాని రాజధాని విషయమై  అధికార పక్షం  అనుసరించిన విధానం చాలా నిరంకుశంగా ఉందని మండిపడ్డారు. మద్రాస్ నుంచి  విడిపోయినప్పుడు ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో రాజధానిపై  అసెంబ్లీలో ఐదురోజులపాటు చ ర్చ జరిగిందని, ఓటింగ్ కూడా నిర్వహించారన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం చర్చకు అనుమతించ కుండా, ప్రకటన చేసి చర్చించాలనడం అప్రజాస్వామికమన్నారు.

ఐదేళ్ల క్రితం రాష్ట్రాన్ని పాలించి, ఈలోకంలో లేకుండా పోయిన వ్యక్తిని పదేపదే విమర్శిస్తున్న అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత పాలించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను పల్లెత్తు మాట కూడా అన రని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించకుండా గొంతునొక్కడం దుర్మార్గమన్నారు.  సమావేశంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, పార్టీనాయకులు యానాదయ్య, కరీముల్లా పాల్గొన్నారు.

ఓ పార్టీ నేతల భద్రతనే ఎందుకు తొలగిస్తున్నారు..?

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న 
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్‌కుమార్‌లకు 2004 నుంచి కొనసాగుతూ వచ్చిన భద్రతను ఆకస్మికంగా తొలగించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారికి వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిం ది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశా రు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వం ఆయా వ్యక్తులకున్న ప్రాణహాని ఆధారంగా కాకుండా వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారనే విషయాన్ని బట్టి భద్రతను కల్పిస్తోందని వాదనల సందర్భంగా ఇటీవల ఓ న్యాయవాది చెప్పారు.
 
 అప్పుడు దీనిని నేను నమ్మలేదు. కాని ఇప్పుడు ఈ వ్యాజ్యాలను (విజయమ్మ తదితరులు దాఖలు చేసినవి), అందులో లేవనెత్తిన అంశాలను చూస్తుంటే ఆ న్యాయవాది చెప్పిన మాట ల్లో నిజముందని భావించాల్సి వస్తోంది. రాజకీయ పార్టీలు, ఆ పార్టీలతో వ్యక్తులకున్న సంబంధాలను బట్టి భద్రత కల్పించడమన్నది ఓ రకంగా వివక్ష చూపడమే అవుతుంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇటువంటి చర్యలు బాధితులకు ఎంతో ఇబ్బందిని కలిగి స్తాయి. వ్యక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించడమన్నది ప్రభుత్వ రాజ్యాంగ విధి. ప్రభుత్వం కేవలం ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలకు మాత్రమే ఎందుకు భద్రత తొలగిస్తోంది..?’’ అంటూ జస్టిస్ రామ్మోహన్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
 అనర్హులకు భద్రత కల్పిస్తే తీవ్రంగా స్పందిస్తా...
తమకు 2004 నుంచి ఉన్న భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయమ్మ, షర్మిల, అనిల్‌కుమార్‌లు బుధవారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరికన్నా ముందు జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు కూడా తమకున్న భద్రతను తొలగించడాన్ని, కుదించడాన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరికి భద్రతను పునరుద్ధరించాలని ఇటీవలే న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
 
  గురువారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా, వీటిని కూడా విజయమ్మ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలతో కలిపి విచారించారు. విజయమ్మ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ... ముందస్తు నోటీసు జారీ చేయకుండానే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందని, ప్రభుత్వ ఏకపక్ష చర్యలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. విజయమ్మ, ఆమె కుటుంబ సభ్యులకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉందని, అందులో భాగంగానే వారికి 2004 నుంచి భద్రతను కొనసాగిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావడంతో వీరి భద్రతను అకస్మాత్తుగా తొలగించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
 
  రాజకీయ దురుద్దేశాలతోనే ఇదంతా జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ‘‘పిటిషనర్లు చెబుతున్నట్లు జంట హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొని, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన నేతకున్న భద్రతను 1+1 నుంచి 2+2కు పెంచుతారు. అతనిపై గెలిచిన అభ్యర్థికి మాత్రం భద్రతను 1+1కు తగ్గిస్తారా! ఈ విషయాలన్నింటినీ మీ అడ్వొకేట్ జనరల్‌కు చెప్పండి. ఈ కేసులన్నింటినీ నేను తదుపరి విచారణ నిమిత్తం సోమవారానికి వాయిదా వేస్తున్నా. అప్పుడు నేను పిటిషనర్ల భద్రత విషయంలో రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తా. ప్రస్తుతం భద్రత పొందుతున్న వారిలో అర్హులు లేరని తేలితే, దానిని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలకు ఉపక్రమిస్తా’’ అని ప్రభుత్వం తరఫున హాజరైన సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆ అనుమానాలు నిజమయ్యాయి!: వైఎస్ జగన్

ఆ అనుమానాలు నిజమయ్యాయి!: వైఎస్ జగన్
బడ్జెట్ సమావేశాల్లోనే కత్తిరింపుల్ని ఎత్తిచూపిన జగన్

సాక్షి, హైదరాబాద్: నిరుపేదల సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడానికి ప్రభుత్వం పలు ఎత్తుగడులు వేస్తోందంటూ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 43,11,688 మం ది వివిధ రకాల పింఛన్లు పొందుతుండగా వీరికి నెలకు రూ.130 కోట్లు చెల్లిస్తున్నారు. అక్టోబర్ నుంచి వృద్ధులు, వికలాంగుల పింఛన్ రూ.వెయ్యికి పెంచిన నేపథ్యంలో ఇప్పటికే పింఛన్ల కోసం పెండింగ్‌లో ఉన్న 15 లక్షల అదనపు దరఖాస్తుల్ని జగన్ ప్రస్తావించారు.

‘‘అక్టోబర్ నుంచి పింఛన్లకు రూ. 431 కోట్లు కావాలి. ఇవికాక 5,36,837 వికలాంగుల పెన్షన్లు రూ.1,500 చొప్పున  పెంచితే మరో  రూ.10 కోట్లు కావాలి. మొత్తం గా నెలకు రూ.441 కోట్లు చొప్పున వచ్చే ఏడు నెలలకు 3,080 కోట్లు కావాలి. గడిచిన 5 నెలలతో కలిసి మొత్తం రూ. 3,730 కోట్లు కావాల్సి ఉంటే బడ్జెట్లో రూ.1,338 కోట్లు కేటాయించారు. మరి మిగిలిన 2,392 కోట్ల మేరకు కోత పెడతారా? ఆ మేరకు పింఛన్లు ఎగ్గొడతారా?’’ అంటూ అప్పట్లోనే ఆయన ప్రశ్నించారు.
 
1.4 కోట్ల తెల్లకార్డులకు అమ్మహస్తానికి, అక్టోబర్ నుంచి వచ్చే కొత్త ఫుడ్ పాలసీ అమలుకు రూ.4,671 కోట్లు అవస రం ఉండగా బడ్జెట్లో మాత్రం రూ.2,318 కోట్లు మాత్రమే కేటాయించారు. 2013-14 సంవత్సరానికి  స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంటు కోసం  రూ.2,487 కోట్లు అవసరం. గతేడాది బకాయిలు రూ.990 కోట్లు. 

హైదరాబాద్‌లో చదివే విద్యార్థులకు మరో 200 కోట్లు కావాలి. మొత్తంగా రూ. 3,700 కోట్లు అవసరం ఉండగా బడ్జె ట్లో రూ.2,100 కోట్లే కేటాయించారు.  కోతలకు సర్కారు సిద్ధమైందని జగన్ విమర్శించారు. పథకాలన్నిటినీ ఆధార్‌కు లింక్ చేస్తున్నామనే పేరుతో కోతలకు దిగుతుండటంతో ప్రతిపక్ష నేత అనుమానాలన్నీ నిజమవుతున్నాయనేది రాజకీయ వర్గాల మాట.

భ్రదత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Written By news on Thursday, September 11, 2014 | 9/11/2014

వైఎస్ విజయమ్మకు హైకోర్టులో ఊరటవిజయమ్మ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు భ్రదత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా భద్రత కొనసాగించాలని కోర్టు దేశించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది.

 వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  ఈ నిర్ణయంపై  విజయమ్మ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో ఆమె కోరారు. ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్ఆర్  జిల్లా ఎస్ పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్ లో విజయమ్మ తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ  ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆమె ఆరోపించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి  సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా తమ భద్రత ఉపసంహరణపై వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడింటిని విచారించిన కోర్టు వారికి భద్రత కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

బాబు... తన ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇవ్వాలి


'బాబు... తన ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇవ్వాలి'
విజయనగరం: 14వ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు బాధాకరమని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు రాజన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయనగరంలో మీడియా సమావేశంలో రాజన్న దొర మాట్లాడుతూ... ఇటీవల ముగిసిన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహారించిన తీరుపై రాజన్న దొర తీవ్ర ఆక్షేపణ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు.
అందుకు అవసరమైతే వారికి తగిన శిక్షణ ఇప్పించాలని బాబుకు హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షంపై అధికారపక్షం దాడి చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఏవైనా ప్రశ్నలు లేవనెత్తితే .... జవాబులు చెప్పకుండా ప్రతిపక్ష సభ్యుల వ్యక్తిగత అంశాల్లోకి జోక్యం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని రాజన్న దొర ఈ సందర్బంగా అధికార పక్ష సభ్యులను ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు.

మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య

 గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవిందరెడ్డిపై పచ్చపార్టీ కార్యకర్తలు కత్తులు, గోడ్డళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో గోవిందరెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారైయ్యారు.
ఈ ఘటన గోవిందరెడ్డి ఇంటి ముందే చోటు చేసుకుంది. దాంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గోవిందరెడ్డి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ఎవ్వరూ అటు వైపునకు రాకపోవడం గమనార్హం. గోవిందరెడ్డి హత్యతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యల సంఖ్య ఆరుకు చేరుకుంది.

భద్రత ఉపసంహరణ అన్యాయం

భద్రత ఉపసంహరణ అన్యాయం
రాజకీయ దురుద్దేశాలతో  నిర్ణయం
 
భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
హైకోర్టులో వై.ఎస్.విజయమ్మ పిటిషన్

 
హైదరాబాద్: 2004 నుంచి ఉన్న భద్రతను గత నెల 22న ఉపసంహరిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకున్న 2+2 భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆమె బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్సార్ కడప జిల్లా ఎస్‌పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భద్రత ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఉపసంహరణకు ముందు ఎటువంటి నోటీసు కూడా జారీ చేయలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నాకున్న ప్రాణహానిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా భద్రతను ఉపసంహరించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా సామాన్యుల సమస్యలను తీర్చేందుకు ఇరు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుంది. నాకున్న ప్రాణహానిని వివరిస్తూ గత నెల 31న ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం సమర్పించి, భద్రతను పునరుద్దరించాలని కోరడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. 2004 నుంచి ఉన్న భద్రతను అధికారలోకొచ్చిన మూడు నెలల్లో తొలగించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశాలున్నాయి’ అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వెంటనే తనకు భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు.

 ఎస్‌పీ ఉత్తర్వులను రద్దు చేయండి: షర్మిల, అనిల్‌కుమార్ పిటిషన్లు

తమకున్న భద్రతను ఉపసంహరిస్తూ కడప జిల్లా ఎస్‌పీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్‌కుమార్ కూడా వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తమకున్న ప్రాణహానిని పట్టించుకోకుండా రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పేర్కొంటూ జిల్లా ఎస్‌పీ గత నెల 11న ఉత్తర్వులు జారీ చేశారని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని వారిద్దరూ కోర్టును కోరారు.  విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లు గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
 

అన్ని కేసులను తిరగదోడి విచారణకు ఆదేశించే సత్తా టీడీపీ ప్రభుత్వానికి ఉందా ?

రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలు
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా
సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు.

బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. రంగా హత్య కేసు కొట్టేసినంత మాత్రానా దోషులు నిర్దోషులు కారన్నారు. శాసనసభలో చర్చను దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ పదేపదే సభలో పరిటాల రవి హత్య కేసును తెరపైకి తీసుకువచ్చి జగన్‌ను ముద్దాయి అనడం సరికాదని ఆయన మండిపడ్డారు.

రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలో ఉంటారని, ఆయితే.. ఆయనకు గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదన్నారు. పరిటాల హత్య కేసులో ముద్దాయిలుగా టీడీపీ నేతలు ఆరోపించిన జేసీ బ్రదర్స్‌కు క్లీన్‌చిట్ ఇచ్చి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారని ముందుగా మంత్రి పరిటాల సునీత.. చంద్రబాబు ప్రశ్నించాలన్నారు. గతంలో విపక్షంలో ఉన్న టీడీపీ.. జేసీ బ్రదర్స్ దోషులని బల్లగుద్ది మరీ వాదించిందని, ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మరిచిపోయిందని రాధా ప్రశ్నించారు.

టీడీపీకి నిజంగా హత్యా రాజకీయాలపై మాట్లాడాలని చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో జర్నలిస్టు పింగళి దశరథరాం, ఐఎఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు మొదలుకొని 1988లో జరిగిన రంగా హత్య వరకు అన్ని కేసులను తిరగదోడి విచారణకు ఆదేశించే సత్తా టీడీపీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ నగర టీడీపీ నేత కాట్రగడ్డ బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం ఎవరు చేశారో.. వారు ఏ పార్టీ వారో, దానికి ఎవరు డబ్బు సమకూర్చారో అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం వారంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని రాధా గుర్తుచేశారు.

హత్యా రాజకీయాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి అధికార పక్షం సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ కుల రాజకీయలను ప్రోత్సహించటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కుల రాజకీయాలను తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సహించదని అన్ని వర్గాల ప్రజలను కలుపుకు వెళ్లే పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అని రాధా చెప్పారు. పదేపదే టీడీపీ నేతలు జగన్‌ను విమర్శిస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో టీడీపీ వ్యక్తులు దోషులు కాదా అని ప్రశ్నించారు. కేవలం అసెంబ్లీలో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.. చర్చ మొదలు కాగానే పరిటాల హత్యను ప్రస్తావించి సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయే అందరికీ తెలుసునన్నారు. ప్రతిపక్షంగా తాము నిర్మాణాత్మకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని ఆయన చెప్పారు.
 

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి

Written By news on Wednesday, September 10, 2014 | 9/10/2014

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడిగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతి, కార్యదర్శిగా వి.అశోక్‌బాబును నియమించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

జేసీ బ్రదర్స్ విషయం.. చంద్రబాబును అడగాలి


జేసీ బ్రదర్స్ విషయం.. చంద్రబాబును అడగాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో అధికారిక తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ విమర్శించారు. హామీలు నెరవేర్చకుండా టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ సీపీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.


వంగవీటి మోహన రంగా, తదితరులపై జరిగిన హత్య కేసుల్లో టీడీపీ నేతలే ముద్దాయిలుగా ఉన్నారని వంగవీటీ రాధా అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలున్న జేసీ దివాకర రెడ్డి సోదరులను ఎలా టీడీపీలోకి చేర్చుకున్నారో చంద్రబాబు నాయుడును అడగాలని మంత్రి పరిటాల సునీతకు సూచించారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలపై న్యాయ, సీబీఐ విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు హత్యారాజకీయాలు మాని ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వంగవీటి రాధా హితవు పలికారు.s

వంగవీటి హత్య కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి

'వంగవీటి హత్య కేసులో చంద్రబాబే మొదటి ముద్దాయి'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికల్లోనూ దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.  అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతల గురించి మాట్లాడితే పరిటాల రవి హత్య గురించి ప్రస్తావించడం సరికాదని హితవుపలికారు. పరిటాల కేసును విచారిస్తే, టీడీపీ హయాంలో హత్యకు గురైన వంగవీటి మోహన రంగా హత్య కేసును కూడా విచారించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వంగవీటి కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మొదటి ముద్దాయి అవుతారని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని, ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మేలు జరిగేలా చేస్తామని హెచ్చరించారు.

పరిటాల రవి హత్యను తిరగదోడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి అవుతారని మంత్రి పరిటాల సునీత ఆరోపించడాన్ని అంబటి రాంబాబు ఖండించారు. ఈ కేసు గురించి అప్పట్లో అసెంబ్లీలో చర్చించారని, వైఎస్ జగన్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని గుర్తు చేశారు. వంగవీటి రంగా హత్య తిరగదోడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయి, స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండో ముద్దాయి అవుతారని చెప్పారు. వంగవీటి హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్, చంద్రబాబు, కోడెలపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఇలాంటి రాజకీయ ఆరోపణలు రుజువు కాకపోవడం వల్లే వారు పదవుల్లో ఉన్నారని చెప్పారు. పరిటాల రవి హత్య కేసు తిరగదోడుతామని చెబుతున్న టీడీపీ నాయకులు వంగవీటి రంగా హత్య కేసుపై మళ్లీ విచారణకు సిద్ధమా అని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. వంగవీటి హత్యతో పాటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇతర రాజకీయ హత్య కేసులను కూడా తిరగదోడేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిజాలు మాట్లాడితే మంచిదని అంబటి హితవు పలికారు.
 

పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు

రుణమాఫీ కోసం ఆందోళనలు
జగన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం
   
 రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ధ్వజం
► రుణాల మాఫీ కోరుతూ ముందుగా మండల కార్యాలయాల వద్ద ఆందోళన.. తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద...
 {పభుత్వం దిగిరాకపోతే ప్రత్యక్ష కార్యాచరణలోకి జగన్..
► త్వరలోనే ఆందోళన తేదీల ఖరారు
 పార్టీ పటిష్టతకు జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కమిటీలు
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో గొప్పగా ప్రచారం చేసుకున్న టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చిందని ఆ పార్టీ ధ్వజమెత్తింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా షరతులేమీ లేకుండా మొత్తం రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో భారీ ఎత్తున ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు వచ్చే నెలలో మొదట మండల కార్యాలయాల ముందు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతి దశలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగుతారు. ప్రభుత్వం అప్పటికీ దిగిరాకపోతే పార్టీ అధ్యక్షుడు జగనే స్వయంగా ఏదో ఒక జిల్లాలో ఆందోళనకు నాయకత్వం వహిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారు.

ఈమేరకు త్వరలోనే ఆందోళన తేదీలను ఖరారు చేస్తారు. మంగళవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ముఖ్య నేతలు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజకీయ కార్యదర్శులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో సహా పలువురు ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు వచ్చేసరికి మాట తప్పడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. రుణాల మాఫీపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని పార్టీ విమర్శించింది. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని నిర్ణయించింది. జిల్లా స్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణను జగన్ ఈ సమావేశంలో వివరించారు. సమావేశం ముగిసిన అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలను పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పీఏసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాకు వె ల్లడించారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల తరఫున తమ పార్టీ ప్రజాపక్షంగా నిలబడి పోరాడుతుందని వాసిరెడ్డి పద్మ చెప్పారు. రుణాల మఫీ హామీని అమలు చేయాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినా ప్రయోజనం కనిపించలేదన్నారు.

దున్నపోతుపై వర్షం కురిసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో కేవలం 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం రుణాల మాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించినా సమాధానం రాలేదని అన్నారు. మండల, జిల్లాస్థాయిలో తాము చేపట్టే ఆందోళన లను చూసైనా టీడీపీ ప్రభుత్వం దిగి వచ్చి రుణాలన్నింటినీ మాఫీ చేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంలో చలనం లేకపోతే జగన్  ఆందోళనకు స్వీకారం చుడతారని తెలిపారు.

ఇక జిల్లా, మండల సమావేశాలు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్తగా ఏర్పడిన క మిటీల్లో అనుభవజ్ఞులైన సీనియర్ నేతలను అధ్యక్షుడు జగన్ నియమించారని, పోలింగ్ బూత్, గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను వారికి అప్పగించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. రాష్ట్రస్థాయి సమావేశం పూర్తయింది కనుక ఇక జిల్లా స్థాయి విసృ్తత సమావేశాలు, ఆ తరువాత మండలస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును 3, 4 రోజుల్లో పార్టీ విడుదల చేస్తుందన్నారు. జిల్లా స్థాయి విసృ్తత సమావేశాలకు ఒక ప్రధాన కార్యదర్శి, ఆ జిల్లా పరిధిలోని లోక్‌సభ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు. జిల్లా కమిటీలో ఎన్ని పదవులుండాలనేది ఇప్పటికే తెలియజేశామని, ఆ ప్రకారం సమావేశాల్లో జిల్లా కమిటీల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. మండలస్థాయి సమావేశాల్లో కూడా మండల కమిటీల ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆయా మండలాలకు పక్కనే ఉన్న మండలానికి చెందిన ముగ్గురు నేతలను ఎన్నికల కమిటీ మాదిరిగా పంపి వారి సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మండల సమావేశాలకు అక్కడి ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన నాయకులు, లోక్‌సభ సభ్యుడు లేదా లోక్‌సభకు పోటీ చేసిన వారు పాల్గొంటారన్నారు. ఆ తరువాత గ్రామాల్లో కూడా గ్రామ కమిటీల ఎన్నిక జరుగుతుందన్నారు. ఇక్కడ కూడా పొరుగు గ్రామాల నుంచి ముగ్గురేసి సభ్యులను ఎన్నికల నిర్వహణకు పంపుతామన్నారు. వీటితోపాటు పార్టీ అనుబంధ సంఘాల జిల్లా, మండల, గ్రామ, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలూ జరుగుతాయని తెలిపారు. పట్టణ, నగర కమిటీల ఎన్నికలు కూడా ఇదే పద్ధతిలో జరుగుతాయని వివరించారు. ఇవి కాక వలంటీర్ల కమిటీలు కూడా ఉంటాయన్నారు.
 

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర

Written By news on Tuesday, September 9, 2014 | 9/09/2014

వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులుగా కల్పన, దొర
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యులుగా ఉప్పులేటి కల్పన, రాజన్నదొరను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకులుగా ముక్కు కాశిరెడ్డిని నియమించారు.

రాష్ట్ర కార్యదర్శులుగా చాంద్ బాషా, డాక్టర్ నన్నపనేని సుధ, వరుదు కల్యాణి, ఎ.వరప్రసాద్‌రెడ్డి, జి.వెంకట రమణ, వై.మధుసూదన్‌రెడ్డి, నజీర్‌ అహ్మద్‌, పేరిరెడ్డి, జీవీ సుధాకర్‌రెడ్డి, గంపా గిరిధర్‌ నియమితులైనట్టు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశం

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల పునర్‌వ్యస్థీకరించిన ఆ పార్టీ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. 2014 ఎన్నికల తరువాత జరుగనున్న తొలి విస్తృత స్థాయి సమావేశం అయినందున దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీల్లో చాలా మందికి అవకాశం కల్పించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం, మండలాలు, జిల్లాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అదే విధంగా సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికపుడు స్పందించేందుకు వీలుగా పార్టీ అధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు.

ఇంత మోసమా చంద్రబాబూ?

రుణాలు మాఫీకాకపోవడంపై దుమ్మెత్తిపోసిన డ్వాక్రా మహిళలు
 
తూ.గో., అనంతపురం జిల్లాల్లో ధర్నాలు
షరతులు లేని రుణమాఫీ అమలుకు డిమాండ్

 
మామిడికుదురు/గుత్తి/బుక్కపట్నం: తమ రుణాల రద్దుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విస్మరించడంపై డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోశారు. షరతులు లేని రుణ మాఫీ కోసం సోమవారం ఉద్యమించారు. రుణాలు పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో టీడీపీ మహిళా నాయకులు సైతం పాల్గొనడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన 40 డ్వాక్రా గ్రూపులకు చెందిన దాదాపు 300 మంది మహిళలు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద బైఠాయించారు. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘రుణాలు రద్దు చేయమని మేము మిమ్మల్ని అడిగామా? రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది మీరే. తీరా అధికారంలోకి వచ్చాక మాట మారుస్తారా?’ అంటూ మండిపడ్డారు. సక్రమంగా సాగుతున్న డ్వాక్రా గ్రూపుల లావాదేవీలు నిలిచిపోవడానికి రుణమాఫీ హామీ కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్నా అనంతరం రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ ఎంపీడీఓ ధనలక్ష్మీదేవికి వినతిపత్రం ఇచ్చారు. టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు మొల్లేటి పార్వతి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొల్లేటి అలివేలు మంగతో పాటు కంచి విజయలక్ష్మి, గుబ్బల వరలక్ష్మి, జక్కంపూడి శాంతమ్మ, కంచి లక్ష్మీకుమారి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూడా మహిళలు రుణమాఫీ అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్లలోని 28 డ్వాక్రా సంఘాల మహిళలు గుత్తిలోని సిండికేట్ బ్యాంకును గంటన్నరపాటు ముట్టడించారు. రాస్తారోకో, తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జానకంపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు బుక్కపట్నం మండల కేంద్రంలో ర్యాలీగా వెళ్లి ఐకేపీ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. ఇలా చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు.

వైఎస్సార్‌సీపీ కమిటీల సమావేశం నేడు

వైఎస్సార్‌సీపీ కమిటీల సమావేశం నేడు
పార్టీ పటిష్టత దిశగా చర్యలు
ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి విస్తృత స్థాయి సమావేశం

 
హైదరాబాద్: పార్టీని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ఇటీవల పునర్‌వ్యస్థీకరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం మంగళవారం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించే ఈ సమావేశం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 2014 ఎన్నికల తరువాత జరుగనున్న తొలి విసృ్తత స్థాయి సమావేశం అయినందున దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని అన్ని విధాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీల్లో చాలా మందికి అవకాశం కల్పించారు. గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం, మండలాలు, జిల్లాల కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. అదే విధంగా సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికపుడు స్పందించేందుకు వీలుగా పార్టీ అధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. కొత్తగా నియమితులైన వారికి పార్టీ పరంగా నిర్మాణపరమైన బాధ్యతలు అప్పగించే అంశం కూడా చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మూడు రోజుల క్రితం ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతల రుణాల మాఫీ, నిరుద్యోగులకు భృతి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన గట్టిగా ప్రభుత్వంపై పోరాడింది. అయితే ప్రభుత్వం ఈ అంశాలు వేటిపైనా స్పష్టతనివ్వకుండా ప్రజలను గందరగోళంలో పడేసింది. ఈ నేపథ్యంలో ప్రజలకు టీడీపీ ఇచ్చిన హామీలు, వాటిపై మాట తప్పిన విషయాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాలని కూడా జగన్ ఈ సమావేశంలో కోరే అవకాశం ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల ప్రతినిధులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు.
 
 
వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నియామకం

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన అనంతర పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం 11మందితో తెలంగాణ రాష్ట్ర కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాష్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్, బి.జనక్‌ప్రసాద్ ఉన్నారు. ఈ కమిటీ తెలంగాణలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి వరకు వైఎస్సార్‌సీపీని పటిష్టం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వైఎస్సార్‌సీపీ కమిటీల్లో మరికొందరి నియామకం

వైఎస్సార్ సీపీ ఇటీవలి కాలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో మరి కొందరిని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(ప్రకాశం, నెల్లూరు), కార్యదర్శులుగా వంశీ కృష్ణ శ్రీనివాస్, కె.మోషేన్ రాజు, సీజీసీ సభ్యులుగా కుడిపూడి చిట్టబ్బాయి, పాలపర్తి డేవిడ్‌రాజు, అధికార ప్రతినిధిగా పాలపర్తి డేవిడ్‌రాజు నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ

Written By news on Monday, September 8, 2014 | 9/08/2014

తెలంగాణకు వైఎస్ఆర్ సీపీ ప్రత్యేక కమిటీ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్టు వైఎస్ఆర్ సీపీ వెల్లడించింది.

ఈ కమిటీలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్మ క్రిష్ణారెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాశ్, కె శివకుమార్‌, గట్టు రాంచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, అబ్దుల్ రెహమాన్‌, జనక్ ప్రసాద్ లను సభ్యులుగా నియమించినట్టు తెలిపింది.

వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం

Written By news on Sunday, September 7, 2014 | 9/07/2014

వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం
ఒకే ఏడాది 23 లక్షల కొత్త పెన్షన్లు.. కాగ్ నివేదికలో వెల్లడి
ఇందిరమ్మ, రచ్చబండ కార్యక్రమాల ద్వారా కొత్తవారికి అవకాశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 72.36 లక్షల మంది పింఛనుదారులు
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 23 లక్షల మందికి ఒకే ఏడాదిలో కొత్త పింఛన్లు మంజూరయ్యాయని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2007-08తో పోల్చితే 2008-09 సంవత్సరంలో ఇలా ఇన్ని లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాది అంతకు ముందు ఏడాదికన్నా ఈ రంగానికి 80 శాతం మేర అదనంగా బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపినట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసింది.

2006లో ఇందిరమ్మ పథకాన్ని అప్పటి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టడం.. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు దరఖాస్తులు నేరుగా తీసుకోవడమే పింఛనుదారుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు కాగ్ పేర్కొంది. 2008 -13 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్లపై కాగ్ పరిశీలన జరిపి తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయగా.. సంబంధిత నివేదికను 13 జిల్లాల ఏపీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
 
పేదలకు 39.15 లక్షల ఇళ్లు
వైఎస్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మూడేళ్లలోనే సాధ్యం

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలందరికీ గూడు కల్పించేందుకు చేపట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే ఏకంగా 39.15 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ వాస్తవాన్ని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సామాన్య-సామాజిక రంగాలపై కాగ్ నిర్వహించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించింది.

ఆ నివేదికలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వాస్తవ ప్రగతిని పట్టిక రూపంలో వివరించారు. రాజశేఖరరెడ్డి హయాంలో 2006-07, 2007-08, 2008-09 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా పేదల కోసం ఇందిరమ్మ పథకం కింద 44.98 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిలో ఆ మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 39.15 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశారని కాగ్ పేర్కొంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించినట్లు స్పష్టం చేసింది.

గణపవరంలో విజయమ్మ

గణపవరంలో విజయమ్మ
  • బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరు
మైలవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ శనివారం గణపవరం జమీందారు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు. మైలవరం మండలం గణపవరం జమిందారు బొల్లారెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.

పెద్ద కుమారుడు కుమార కోటిరెడ్డితో దివంగత ముఖ్యమంత్రి  వైఎస్.రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ  వివాహం జరగడంతో వీరికి   బంధుత్వమేర్పడింది. మరో కుమారుడు బిమల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం జగతి పబ్లికేషన్స్‌కు వైస్ ప్రసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ, వైఎస్. వివేకానందరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు.

పలువురు పార్టీ  నాయకులు ఆమెను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విజయమ్మను  కలిసిన వారిలో తలశిల రఘురామ్, జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్, కాజా రాజకుమార్, అప్పిడి కిరణ్ కుమార్‌రెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులున్నారు. అలాగే జగన్ అభిమానులు,  కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున వచ్చి విజయమ్మను కలుసుకుని అభిమానం చాటుకున్నారు.

33 శాతం అసెంబ్లీ సీట్లు మనమే ఇద్దాం.. సిద్ధమేనా?

33 శాతం అసెంబ్లీ సీట్లు  మనమే ఇద్దాం.. సిద్ధమేనా?వీడియోకి క్లిక్ చేయండి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత జగన్ సవాల్
 
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే వెనుకబడిన తరగతుల వారికి (బీసీలకు) రాష్ట్ర శాసనసభలో 33 శాతం సీట్లు ఇవ్వడానికి సిద్ధం కావాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం కొత్తేమీ కాదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇపుడు కూడా అసెంబ్లీలో అదే తీర్మానం చేశారు. ఇలా చేస్తే వచ్చే లాభమేంటి? నిజంగా బీసీలకు మేలు జరగాలంటే నేనొక సలహా ఇస్తా.. తెలుగుదేశం పార్టీ వారికి దమ్మూ ధైర్యం ఉంటే చెప్పమనండి. తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు (టీడీపీ), మేము (వైఎస్సార్ సీపీ) రెండే పార్టీలు ఉన్నాయి. బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వారే పోటీ చేసే విధంగా 33 శాతం సీట్లు ఇచ్చేద్దాం. పార్టీ పరంగా నేను అలా చేయడానికి రెడీగా ఉన్నా.. వాళ్లు కూడా సిద్ధమేనేమో చెప్పమనండి. పోటీ బీసీ వర్సెస్ బీసీ (బీసీ అభ్యర్థిపై బీసీ అభ్యర్థే) గానే ఉండాలి. బీసీ అభ్యర్థుల మీద బాగా డబ్బున్న షావుకార్లను తెచ్చి పోటీకి పెట్టకూడదు. అంతేగానీ.. ఇలా ఊరికే రాసి కేంద్రానికి పంపితే వచ్చే ప్రయోజనమేంటి?’’ అని జగన్ ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో బీసీ తీర్మానంపై ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, వెంటనే సభ వాయిదా పడటంతో.. ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు నిజంగా బీసీలపై ప్రేమ లేదని.. ఎన్నికలు వచ్చినపుడల్లా బీసీలకు వంద సీట్లు ఇస్తానని ఆయన మాటలు చెప్పడం తప్ప ఆచరణలో అమలు చేయలేదని జగన్ తూర్పారబట్టారు.

జగన్ ఎమన్నారో ఆయన మాటల్లోనే...

‘‘ప్రతిసారీ ఎన్నికలకు ముందు బీసీలకు వంద సీట్లు అని చంద్రబాబు చెప్తున్నారు. 2004, 2009 చివరకు 2014 ఎన్నికల ముందు కూడా ఈ మాటలు నేను విన్నాను. అయితే ఆయన ఎపుడూ వారికి అన్ని స్థానాలివ్వలేదు. 2008లో వరంగల్‌లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ గర్జన సభలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని తీర్మానం చేశారు. ఈ సభలో ఏకంగా 93 బీసీ కులాల పేర్లు చదివి తమకు (టీడీపీ) తప్ప మరెవ్వరికీ బీసీల మీద పేటెంట్ లేదన్నట్లుగా ఆ రోజు చంద్రబాబు మాట్లాడారు. 2009 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో జరిగిన చేతి వృత్తుల వారి సదస్సులో కూడా సీపీఎం నేత బి.వి.రాఘవులు, సీపీఐ నేత కె.నారాయణ, టీఆర్‌ఎస్ నాయకుడు నాయిని నరసింహారెడ్డిల సమక్షంలో బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ తీరా ఎన్నికల్లో టీడీపీ బీసీలకు ఇచ్చిన సీట్లు కేవలం 44 మాత్రమే. టీడీపీ మిత్రపక్షాలను కూడా కలుపుకొని 66 మంది బీసీలకే టికెట్లు ఇచ్చారు. అదే ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒక్కరే బీసీలకు 73 సీట్లు ఇచ్చారు. 2004లో కూడా చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 59 సీట్లే. 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు ఏ రోజూ బీసీలకు 50, 60 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఎన్నికలొచ్చిన ప్రతిసారీ వంద సీట్లని అంటారు. బీసీలకు తానే పేటెంట్ అని కూడా అంటారు’’ అని జగన్ ఎండగట్టారు. తన తల్లి విజయమ్మ గత అసెంబ్లీలో వంద సీట్లు బీసీలకు కేటాయిద్దామని ప్రతిపాదించినా చంద్రబాబు అప్పట్లో స్పందించలేదని గుర్తుచేశారు. మొన్నటి (2014) ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున 54 మంది బీసీలకు టికెట్లు ఇస్తే టీడీపీ మాత్రం 58 సీట్లు ఇచ్చిందని జగన్ వివరించారు. ‘‘చంద్రబాబు మా కన్నా నాలుగు సీట్లు ఎందుకు ఎక్కువ ఇచ్చారు అంటే దానికి కారణం మా అభ్యర్థుల జాబితా ముందుగా విడుదలైంది కాబట్టి. మా జాబితాను ఆయన (చంద్రబాబు) చూసుకుని, మేమెంత మందికి ఇచ్చామో చూసుకుని, మా కన్నా నాలుగు సీట్లు ఎక్కువగా ఉండాలని అలా చేశారు. ఒకవేళ మేం కనుక అభ్యర్థుల జాబితాను తరువాత ఇచ్చి ఉంటే ఆయన ఇంకా నాలుగు తగ్గించి ఉండేవారు. ఇలా బీసీలను రాజకీయావసరాలకు వాడుకోవడం నెనెక్కడా చూడలేదు’’

స్పీకర్‌గారు వాళ్ల మనిషి అన్నట్లుగా...

శాసనసభ నిబంధన పుస్తకాన్ని జగన్ చూపుతూ.. ‘‘సాధారణంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి అంటే.. ఒక శాసనసభ్యుడు గాని, మంత్రి గాని ఒక అంశంపై తీర్మానం సభలో పెట్టాలి అంటే.. పది రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలి. అయితే స్పీకర్ గారు వాళ్ల (టీడీపీ) మనిషి అన్నట్లుగానే ఆయన ద్వారానే ‘బుల్‌డోజ్’ చేయించారు. స్పీకర్ తల్చుకుంటే తన విచక్షణతో తీర్మానాన్ని పది రోజుల వ్యవధి కన్నా తక్కువ నోటీసుతోనే అనుమతించవచ్చన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని హడావుడిగా పొద్దున పెట్టి గంటలోపు తీర్మానం తీసుకొచ్చారు. తీర్మానం అంటే చర్చ తరువాత ఓటింగ్ జరగాలి. అలాంటిది.. ఈ రోజు (శనివారం) బీసీల అంశంపై చర్చ జరుగుతుందని పొద్దున పదకొండు గంటల వరకూ తెలియదు అనంటే.. అసెంబ్లీ ఏ తీరులో నడుస్తోంది? నిజంగా బీసీల సంక్షేమం మీద మాట్లాడాలనా? మాట్లాడకూడదనా? కేవలం వాళ్లు మాత్రమే బీసీ సంక్షేమం గురించి నాలుగు మాటలు మాట్లాడుకుని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారిని తిట్టి.. అంతే ఇక, బీసీ సంక్షేమం అయిపోయిందని చెప్పడమేనా!’’

ప్రతిపక్ష నేతగా నాకు అవకాశం ఇవ్వరా?

‘‘తీర్మానంపై చర్చ జరుగుతున్నపుడు గంటన్నర సేపు నేనక్కడే కూర్చుని ఉన్నా... చంద్రబాబు ఒక్కరే సుదీర్ఘంగా 45 నిమిషాలు మాట్లాడారు. ఆయన టీడీపీ మొత్తం మేనిఫెస్టోను అక్కడ చదివారు. ఆ తరువాత తన పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో తిట్టించారు. మా పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులను మాత్రమే వాళ్లు మాట్లాడమన్నారు. వాళ్లు కాస్తో కూస్తో మాట్లాడారు. ఆ తరువాత నేను చేతిని పెకైత్తి.. నేను మాట్లాడతానని అడుగుతున్నా.. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వేలెత్తి చూపినా అవకాశం ఇవ్వరు. బటన్ నొక్కితే గ్రీన్ బల్బ్ వెలుగుతుంది. ఎన్నిసార్లు నేను బటన్ నొక్కినా కూడా ఆ వైపు చూడరు. కావాలనే నిర్లక్ష్యం, అసలు పట్టించుకోరు. వాళ్లే మాట్లాడేసుకుని తీర్మానం ఆమోదం పొందింది అని ప్రకటించుకోవడం చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ప్రతిపక్ష నాయకుడు బీసీ సంక్షేమం మీద మాట్లాడాలనుకుంటే కూడా వీళ్లు వినే పరిస్థితిలో లేరు. బీసీ సంక్షేమం కోసం గతంలో ఏం జరిగింది.. మీరేం చేశారు.. ఏం చేస్తే బీసీలకు మేలు జరుగుతుంది.. అనేది ప్రతిపక్షం చెప్పాలనుకున్నా అనుమతించరు. ఆవేదనతో ఇవాళ నిజంగా తొలిసారిగా నేనీ మాట చెప్తున్నా.. కౌరవసభ ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ ఈ అసెంబ్లీ మాత్రం కౌరవ సభను మరిపించింది. వారి (అధికారపక్షం) సంఖ్య కూడా సరిగ్గా 101 మందే.. కౌరవులతో సమానంగానే ఉంది. నిజంగా వీళ్లు మనుషులా..? వీళ్లలో మానవత్వం ఉందా..? లేదా..? అనేది కూడా ఒకసారి నాకనిపిస్తుంది’’

వైఎస్ బీసీలకు చేసినవేవీ సభలో చెప్పరు...

‘‘దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 2008లో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపారు. ఆ విషయాలు మాత్రం ఎపుడూ చెప్పను కూడా చెప్పరు. వైఎస్ హయాంలో బీసీలకు ఎలాంటి మేళ్లు జరిగాయో రెండు మూడు విషయాలు చెప్తాను. ఎవరూ ఊహించని విధంగా ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల సంవత్సరానికి దాదాపుగా 27 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదవాలి అనంటే 35 వేల రూపాయలు ఫీజు కట్టాల్సిన పరిస్థితి. డాక్టర్ చదవాలి అనంటే వైఎస్ హయాంలోనే అప్పట్లోనే 50 వేల రూపాయల ఫీజు ఉండేది. అంత సొమ్ము కట్టి చదివించలేని పరిస్థితుల్లో చాలా మంది చదువుకోలేక పనులు చూసుకునే పరిస్థితి ఉండేది. ఆ చదువుల కోసం అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లించి.. బీసీలకు అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖరరెడ్డే అని గర్వంగా చెప్పొచ్చు. 27 లక్షల మందిలో దాదాపు 14 లక్షల మంది ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థులే ఫీజు రీఇంబర్స్‌మెంట్ వల్ల ప్రయోజనం పొందింది. చంద్రబాబుకు ఏ రోజూ ఇలాంటి ఆలోచన తట్టలేదు’’  

ఇళ్ల నిర్మాణంలోనూ

‘‘బీసీ సంక్షేమానికి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వైఎస్ హయాం నుంచి ఇళ్ల విషయాలు కూడా చెప్పాలి. 1984 నుంచి 2004 వరకూ అంటే 20 ఏళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వాలు పేదల కోసం మొత్తం నిర్మించి ఇచ్చిన ఇళ్లు 27.5 లక్షలైతే.. అందులో బీసీలకు కేవలం 6.32 లక్షల ఇళ్లు.. అంటే 32 శాతం మాత్రమే లభించాయి. వైఎస్ ప్రభుత్వం ఐదేళ్లలో దేశం మొత్తం 48 లక్షల ఇళ్లు కడితే ఆ దివంగత నేత మన ఒక్క రాష్ట్రంలో 47 లక్షల ఇళ్లు నిర్మించారు. అందులో 19.88 లక్షల ఇళ్లు అంటే 42 శాతం బీసీలకే వెళ్లాయి. ఇలాంటివేవీ చెప్పాలన్న ఆలోచన చంద్రబాబుకు రాదు.

గొర్రెల కాపరులకు బీమా పథకం తెచ్చింది కూడా రాజశేఖరరెడ్డే. ఏ రోజూ ఇలాంటిది చంద్రబాబునాయుడు చేయలేదు.  అంతెందుకు? అట్టడుగు స్థాయిలో ఉన్న ఎస్సీలు, బీసీల కోసం ఎన్.టి.రామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తెచ్చారు. ఎన్‌టీఆర్ ఆ పథకం తెచ్చినపుడు ఆ రోజు (1983) ఇచ్చిన సబ్సిడీ కేజీకి 63 పైసలు మాత్రమే. అప్పట్లో బహిరంగ మార్కెట్‌లో కేజీ ధర 2.63 రూపాయలుంటే ఎన్‌టీఆర్ 2 రూపాయలకు ఇచ్చారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు రూపాయలకే బియ్యం ఇచ్చేటపుడు మార్కెట్‌లో ధర 25 రూపాయలుండేది. అంటే 23 రూపాయల సబ్సిడీని ఇచ్చారు.

ఇక ఆరోగ్యశ్రీ పథకం అయితే ఎవరూ ఊహించనిది. ఆలోచించనిది. ప్రతి పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో శ్రీమంతులతో సమానంగా గర్వంగా వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఒక్క వైఎస్ వల్లనే సాధ్యమైందని గర్వంగా చెప్తున్నా. ఇవేవీ ఆయన (బాబు) చెప్పడు.
  చంద్రబాబు జమానాలో నెలకు 70 రూపాయలు ముష్టి వేసినట్లు పెన్షన్ వేసేవారు. అప్పట్లో కేవలం 17 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చి అందరికీ ఇచ్చామని చెప్పేవారు. వైఎస్ పెన్షన్లను ఏకంగా 78 లక్షలకు పెంచి ప్రతి ఒక్కరికీ 200 రూపాయలు ఇచ్చారు. ఈ ఘనత కూడా చంద్రబాబు ఎన్నడూ చెప్పే పరిస్థితి లేదు.

సమాజంలో యాభై శాతంగా ఉన్న బీసీలను ఏ రాజకీయ పార్టీ అయినా దగ్గరికి తీసుకోవాల్సిందే. వారికి కచ్చితంగా టికెట్లు ఇవ్వాల్సిందే. అది చాలా అవసరం. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడాలేదు. కానీ మనం బీసీలకు నిజంగా ఏం చేస్తున్నామనేది మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి. బీసీలు, ఎస్సీలు, అట్టడుగు వర్గాలకు చెందిన వారికి ఏం చేస్తున్నామనేది ఆలోచించాలి’’

మేం నిక్కర్లు వేసుకున్నా.. నిజాలే చెప్తాం

‘‘అసెంబ్లీ సమావేశాల్లో మాకెవ్వరికీ ఏమీ తెలియదని వీళ్లంతా (టీడీపీ) అంటూ ఉన్నారు. అంతా కొత్త వాళ్లు, మీరంతా నిక్కర్లేసుకున్నోళ్లు అంటున్నారు. వాస్తవమే.. మేం నిక్కర్లు వేసుకున్న వాళ్లమే.. కానీ ఈ జెనరేషన్‌లో (ఈ తరానికి చెందిన) ఉన్న వాళ్లం అనేది గుర్తుంచుకోవాలి. బాగా చదువుకునే అసెంబ్లీకి వస్తాం. ఏం జరుగుతుందన్నది తెలుసుకుని వస్తాం. వాళ్ల (టీడీపీ) మాదిరిగా అబద్ధాలు చెప్పం. వాళ్ల మాదిరిగా మోసాలు చేయం. జరుగుతూ ఉన్నదే చెప్తాం.. చూపిస్తాం. ఇవాళ కూడా అదే చెప్పాలనుకున్నాం. కానీ ఇవాళ సభ జరిగిన తీరే భయానకంగా ఉంది.

బాబు అబద్ధాలతో తప్పుదోవపట్టిస్తున్నారు?

‘‘శాసనసభ మీద చంద్రబాబుకు ఎక్కువ అవగాహన ఉందా? లేకుంటే మాలాంటి ఏమీ తెలియని వాళ్లకు ఎక్కువ అవగాహన ఉందా? అనేది ఎవరినో అడగాల్సిన పనిలేదు. నిన్న, ఈ రోజు చంద్రబాబు తీరును ఒక్కసారి గమనించండి. 1953లో ఆంధ్ర రాష్ట్ర రాజధానిపై ఎలాంటి చర్చ, ఓటింగ్ జరుగలేదని చంద్రబాబు చెప్పారు. ఒక రూంలో కూర్చుని, ఒక ఇంట్లో కూర్చుని రాసేసుకున్నారని చెప్పి సభను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. (7.6.1953 తేదీన అప్పటి ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్తలను చూపిస్తూ) ఇవన్నీ ఆనాటి న్యూస్ పేపర్ కటింగ్స్. మీరే చూడండి. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్ కూడా జరిగింది. చంద్రబాబు ఎందుకీ అబద్ధాలు చెప్పాలి? తెలిసి చెబుతున్నారా? లేక కావాలనే తప్పుదోవ పట్టించాలని చెబుతున్నారా? హిట్లర్ మాదిరిగా చర్చే లేకుండా తాను మొట్టమొదటిగా ప్రకటన చేసేసి తరువాత చర్చించేసి తాను హిట్లర్‌గా చేసిన తీరును సమర్థించుకునేందుకు సభను దగ్గరుండి తప్పుదోవ పట్టించడం ఎంత వరకు న్యాయం?’’ అని విపక్ష నేత నిలదీశారు. ‘‘ఇవాళ కూడా అంతే.. బీసీలపై తీర్మానం కూడా అలాగే ఆమోదింపజేసుకున్నారు. అదేమంటే స్టేట్‌మెంట్ ఇచ్చామనిచంద్రబాబు చెప్పారు. అది ప్రకటనో, తీర్మామో ఆయనకే తెలియదు. ప్రతి తీర్మానం చివరిలో ప్రతిపక్ష నేత మాట్లాడతాడు. ఆ తరువాతనే ప్రతిపక్షం కూడా ఓటు వేయాలి. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతకు అవకాశమే ఇవ్వలేదు. ప్రతిపక్ష నేత బీసీల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బండారం బయటపడుతుందనుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లులో రుణాల మాఫీ మీద పక్కదోవ పట్టిస్తున్నారు. అలాంటివన్నీ బయటకు వస్తాయి. బీసీలపై ఆయనకున్న దొంగ ప్రేమ బయటకు వస్తుంది. అందుకే అడ్డుపడ్డారు. ఇదా చదువుకోవడం అంటే..? ఇదా అనుభవం అంటే..?’’

వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం
http://img.sakshi.net/images/cms/2014-09/41410031852_Unknown.jpg
 
‘చంద్రబాబు రైతుల రుణాల మాఫీకి ఎగనామం పెట్టారు.. డాక్రా, చేనేత రుణాల రద్దును పూర్తిగా పక్కనపెట్టేశారు. ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని.. అలా ఇవ్వలేక పోతే ఇంటింటికీ 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఆయన హామీని నమ్మిన ఆంధ్రప్రదేశ్‌లోని కోటి యాభై లక్షల కుటుంబాలు నిరుద్యోగ భృతి వస్తుందని ఎదురు చూస్తున్నాయి. ఈ కుటుంబాల వారందరికీ చంద్రబాబు ఎగనామం పెట్టాడు. తన వైఫల్యాలన్నీ మరోసారి బయటకు వస్తాయని ఇవన్నీ ‘హైలెట్’ (బహుళ ప్రాచుర్యం) కాకుండా ఉండేందుకే హఠాత్తుగా ఇవాళ, తనకేదో బీసీలపై ప్రేమ ఉన్నట్లుగా బీసీ తీర్మానం అని తెరమీదకు తీసుకొచ్చారు’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబును, టీడీపీని నేను అడగదల్చుకున్నది ఒక్కటే.. నిజంగా మీకు బీసీల మీద ఇంత ప్రేమే ఉంటే ముందే ఎందుకు బీసీలకు సంబంధించిన తీర్మానం తీసుకురాలేదు? అసెంబ్లీలో కనీసం రెండు రోజుల పాటు బీసీ సంక్షేమంపై చర్చ జరిగేలా ఎందుకు కార్యక్రమం రూపొందించలేదు? కారణం మీకు అసలు బీసీల మీద ప్రేమ లేదు. అది నామ్‌కే వాస్తే.. నామ్‌కే వాస్తేగా తీర్మానం తేవాలి.. రుణాల మాఫీ, డ్వాక్రా, చేనేత రుణాలకు ఎగనామం పెట్టారనేది బయటకు రాకూడదని, ఆ వైఫల్యానికి తక్కువ పబ్లిసిటీ రావాలనే ఈ తీర్మానం తెచ్చారు’’
 
‘‘ఈ మధ్య కాలంలో చంద్రబాబునాయుడు గారు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. తీర్మానానికి, స్టేట్‌మెంట్ (ప్రకటన)కు తేడా కూడా ఆయనకు తెలియదు. అవతలి వాళ్లను మాత్రం చిన్నచూపు చూసే విధంగా.. ‘మీకేమీ తెలియదు, మీకు అనుభవం లేదు..’ అని బురద జల్లే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప.. తన వీపు తనకు కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఇద్దరినీ నేనొకటే అడగదల్చుకున్నా.. అయ్యా మీ నాయకుడు ఎన్.టి.రామారావు 1983లో రాజకీయాల్లోకి వచ్చినపుడు, ఆయన సినిమాల నుంచి వచ్చాడు. మరి ఆయనకు ఏం తెలుసని చెప్పి ఆయన ఇవాళ గొప్ప నాయకుడు అని పొగుడుతూ ఉన్నారు? ఇవాళ మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమని చెప్పి అవతలి వాళ్లకు ఏమీ తెలియదని చెప్పి రోజూ ఒక బండేయడం తప్ప మీరు చేస్తున్నదేమిటి? తీర్మానానికి, స్టేట్‌మెంట్‌కు కూడా తేడా ఏమిటో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు’’  
 
 
బడ్జెట్ పత్రాలూ తప్పుదోవ పట్టించేవే...
 
‘‘బడ్జెట్ పత్రాలు చూస్తే అన్నీ తప్పుదోవ పట్టించేవే. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఉండవు, సవరించిన అంచాలన్నీ తప్పులే. వాటితోనే బడ్జెట్‌ను పెట్టడం అంటే పునాదులు లేకుండానే భవనాలు కడతామని చెప్పడమే. గతంలో ఏముందో ప్రజలకు చెప్పకుండా నీ ఇష్టమొచ్చిన కేటాయింపులు చేసేయడం. ఇది మోసం కాక మరేమిటి? మేము గట్టిగా విమర్శిస్తే, గడ్డి పెడితేనే ఇవాళ  సవరించి బడ్జెట్ అంచనాల పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టారు. అందులోనూ తప్పులే. బడ్జెట్ ఇస్తున్నారు గానీ.. గత ఏడాదికి సంబంధించిన సవరించిన అంచనాలు లేకుండానే ఈ సంవత్సరంలో నాలుగు నెలలు గడిచి పోయాయి. అవి లేకుండానే ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై మనం మాట్లాడుతున్నాం. అయ్యా పునాదులేమీ తెలియకుండా భవనం ఎలా కడతారయ్యా? అని అడగడం జరిగింది. అపుడు అడిగినందుకు ఈ రోజే కొన్ని పుస్తకాలు ఇచ్చారు. దీంట్లో సవరించిన అంచనాలు అని చెప్పి ఒక చిన్న కాలమ్ పెట్టారు. ఇంతకన్నా అన్యాయం ఇక ఉండదనుకుంటా. ఇవే సవరించిన అంచనాలు చూస్తే మొన్న ఏ విధంగా ఉన్నాయో ఇపుడు అదే విధంగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు అని వేరుగా శీర్షికలు పెట్టారంతే.. అక్కడున్నవే ఇక్కడ రాశారు. మరి ఎందుకిలా ఎవరికీ తెలియకుండా చేస్తున్నారో అర్థం కావడం లేదు గానీ బడ్జెట్‌లో ఇదే చేశారు. ప్రొవిజనల్ స్టేట్‌మెంట్స్ అంటే బడ్జెటెడ్ స్టేట్‌మెంట్స్.. ఇక ఆడిటర్ సంతకం పెట్టడానికి ముందు ప్రొవిజనల్ స్టేట్‌మెంట్స్ అంటారు. అవి కూడా వచ్చి ఉండాలి. అవి వచ్చి ఉన్నా కూడా ఏమీ చూపించలేదు. ఈ సవరించిన అంచనాలు చూపించారు. అవి కూడా అన్నీ తప్పుల తడకలే. ఇక్కడి నుంచి కాపీ కొట్టి (రెండు పుస్తకాలుచూపుతూ) మళ్లీ అక్కడికి వేశారు. ఎంట్రీలు చూస్తే ఇందులో ఉన్న అంకెలే మళ్లీ అక్కడా ఉన్నాయి. ఓ చిన్న ఉదాహరణ చెప్పాలంటే రెవెన్యూ రాబడులు బడ్జెట్‌లో 1,27,772 కోట్లయితే సవరించిన అంచనాల్లో కూడా కరెక్ట్‌గా అదే 1,27,772 కోట్ల సంఖ్యే చూపించారు. బడ్జెట్ అదే సవరించిన అంచనాలు అవే. ఎందుకిలా మోసం చేస్తూ పోతున్నారో అర్థం కాని విషయంగా ఉంది. రెవెన్యూ మిగులు అంశం కూడా బడ్జెట్‌లో 1,022 కోట్లు పెడితే సవరించిన అంచనాల్లో కూడా 1022 కోట్లే ఉన్నాయి.  

ఇక రాష్ట్ర తొలి బడ్జెట్ రెవెన్యూ లోటు ఎంతో తెలియకుండా, ద్రవ్య లోటు ఎంతో తెలియకుండా బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. తొలి బడ్జెట్‌లో దేశంలో ఇలా ఎక్కడా జరిగి ఉండదు. బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ. 6 వేల కోట్లా లేక 25 వేల కోట్లా కూడా తెలియదు. ద్రవ్యలోటు రూ. 12 వేల కోట్లా లేక రూ. 37,910 కోట్లా తెలియదు.  

ప్రణాళికా వ్యయం కాస్తో కూస్తో తగ్గిందనంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. అది తగ్గించుకోవచ్చు. పెంచొచ్చు. కానీ ప్రణాళికేతర వ్యయం అనేది జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యయం. అలాంటిది, ఒక్క వృద్ధాప్య పెన్షన్లు తప్పనిచ్చి మిగతావన్నీ కేటాయింపులు తక్కువగానే చూపిస్తూ వచ్చారు. ఇంతకు ముందు బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా 23 వేల కోట్ల ప్రణాళికేతర వ్యయం ఎక్కువ చేసి చూపించారు. ఇది నిజంగా తప్పుల తడక, తప్పుదోవ పట్టించే పత్రాలు. ప్రజలకు ఏది వాస్తవం? ఎందుకీ మోసం జరుగుతా ఉంది? ఎవరు మోసం చేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? అనేది తెలియాలి’’    

కాగ్‌కు, కేంద్రానికి లేఖలు రాస్తాం...


‘‘ఈ వివరాలన్నింటితో మేం కాగ్‌కు,  కేంద్ర ప్రభుత్వానికి, ప్రణాళికాసంఘానికి కూడా లేఖలు రాస్తాం. ‘ఈ లెక్కలు సరైనవా? లేక మేం చెప్తున్నవి సరైనవా? ఎవరు చెప్పేది సరైనవి? ఏది నిజం మీరు చెప్పండి? మొత్తం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. వాళ్లందరికీ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది’ అని విజ్ఞప్తి చేస్తాం. వీళ్లకు అపుడైనా బుద్ధొస్తుందేమో చూస్తాం. రైతు రుణాల మాఫీ మొత్తం రూ.87,612 కోట్లుంటే బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ. 5 వేల కోట్లే. రెండేళ్లకు కలిపి లక్షకు రూ.24 వేల అపరాధ వడ్డీ అయితే దాని గురించిన ఊసే లేదు. డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లుంటే కేటాయింపులు సున్నాగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏడాదికి రూ.36,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే దానికి అసలు కేటాయింపులే లేవు. ఇక అక్టోబర్ 1 నుంచి వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని లెక్కలైతే వేశారు గానీ సరిపడ కేటాయింపులులేవు. ఇవేవీ ప్రజల దృష్టికి రాకూడదని.. కుటిల రాజకీయాలు చేస్తున్నారు. నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసెంబ్లీలో మాట్లాడటానికి మాకు న్యాయం జరుగలేదు. అందుకే మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఈ అన్యాయాన్ని ప్రజల దగ్గరకు తీసుకు వెళ్లండి. మీరంతా విజ్ఞత కలిగిన వాళ్లు.. ఈ లెక్కలన్నీ నేను సృష్టించినవి కావు, ఇవన్నీ నగ్న సత్యాలు. మీరు కూడా ఒకసారి అధ్యయనం చేయండి. ఈ ప్రభుత్వానికి మీద్వారా కూడా బుద్ధి వచ్చేట్లు చేయండి. అందరమూ కూడా ఈ కార్యక్రమం చేయాలి. అప్పటికన్నా ఈ దుర్యోధన సభ, ఈ కౌరవ సభలో కాస్తో కూస్తో మార్పు వస్తుందని మనవి చేస్తున్నాను. అసెంబ్లీలో మాట్లాడలేక పోయిన అంశాలను మీ ద్వారా ప్రజల వద్దకు తీసుకె వెళుతున్నాను. గతంలో కూడా నా వాణిని ప్రజలకు వినిపించినందుకు నేను మీడియా సోదరులకు పత్రికా సోదరులకూ ధన్యవాదాలు తెలుపుతున్నాను’’
 

Popular Posts

Topics :