21 September 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

తహశీల్దారుపై టీడీపీ కార్యకర్త దాడి

Written By news on Saturday, September 27, 2014 | 9/27/2014

తహశీల్దారుపై టీడీపీ కార్యకర్త దాడి
పుల్లంపేట: అధికారం ఉందని అధికార టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ కార్యకర్త తహశీల్దారును దుర్భాషలాడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తహశీల్దారు స్థానిక ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం రైల్వేకోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు ఎదుటే టీడీపీకి చెందిన కార్యకర్త తహశీల్దారు చంద్రశేఖర్‌ను దుర్భాషలాడుతూ ఆయనపైకి దూసుకెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన సంఘటన మండలకేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై తహశీల్దారు చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలపరిధిలోని ఎగువరామక్కపల్లెకు చెందిన పోతినేని సుబ్రమణ్యం(మణి) తనపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. గతంలో సుబ్రమణ్యం ఓ భూమికి సంబంధించి తప్పుడు వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని.. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో సరైన ఆధారాలు లేని కారణంగా సదరు భూమిని రీవోక్ చేశామని తెలిపారు. ఈ విషయంపై మణి పలుమార్లు ఫోన్‌లో కూడా బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నాగరాజు తన సిబ్బందితో కార్యాలయానికి వచ్చి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వీఆర్వోలు శనివారం మూకుమ్మడిగా ఆర్‌డిఓకు ఫిర్యాదు చేయనున్నారు. తహశీల్దారు దళితుడు కావడం వల్లనే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దూషించి దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.

ఎన్నికల్లో కష్టపడిన వారికి జిల్లా కమిటీల్లో స్థానం

బలమైన శక్తిగా ఎదగాలి
- ఎన్నికల్లో కష్టపడిన వారికి జిల్లా కమిటీల్లో స్థానం
- వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ధర్మాన
- రాష్ట్రంలో విజయనగరాన్ని ఆదర్శంగా తీసుకునేలా పనిచేయాలి: జ్యోతుల
- పార్టీ బలోపేతంలో కమిటీలు కీలక పాత్ర పోషించాలి :  సుజయ్
-  ఐక్యతతో ముందుకు సాగుతా : కోలగట్ల
విజయనగరం మున్సిపాలిటీ : 
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మనం ప్రజల పక్షాన నిరంత పోరాటం చేయాలన్నారు. తద్వారా ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం పెరగటంతో పాటు రాష్ట్రంలో శక్తివంతమైన పార్టీగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని  అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కోలగట్ల వీరభద్రస్వామి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి గా పట్టణ శివారులో శుక్రవారం జిల్లా పార్టీ విస్తృత స్థా యి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమావేశానికి ముఖ్యఅతిథిగా  హాజ రైన ధర్మాన మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్టీ  ఓడిపోలేదని, గతంలో అధికారంలోకి  ఉండి ఇప్పుడు రాకపోతే దానిని ఓటమి అంటారన్నారు. నాలుగేళ్ల క్రితం స్థాపించబడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  అంచెలంచెలుగా ఒక శాసనసభ స్థానం నుంచి 65 స్థానాలకు ఎది గిందన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అప్పుడు తప్పకుండా అధికారంలోకి వస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మనం ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం ప్రశ్నిస్తూ ఉండాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించటం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని, హమీల అమల్లో వెనుకంజలో ఉండే  అధికార పార్టీకి  ఆదరణ తగ్గుతుందని ఈ విషయాన్ని అవగతం చేసుకుని పార్టీ నాయకులు పని చేయాలన్నారు.

సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ శాసనాసభా పక్ష ఉప నేత  జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కోలగట్ల హయాంలో విజ యనగరం జిల్లా పార్టీ బలోపేతం అవుతుందని ఇది ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటినుంచే అడుగు లు వేయాలన్నారు. నాయకత్వ లోపాలను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు బాధ్యతగా పని చేస్తూ ప్రభుత్వ ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగు లు వేయాలన్నారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుజయ్‌కృష్ణారంగారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు పార్టీకి ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రను గౌరవంగా స్వీకరించటంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

పార్టీ కేంద్ర పాలక మం డలి సభ్యుడు  పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ గతం వరకు జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేశానని, తాజాగా నియమితులైన కోలగట్ల నాయకత్వంలో పార్టీ సేవలందిస్తానన్నారు. రుణమాఫీ విషయంలో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.  మరో కేంద్రపాలక మండలి సభ్యురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయడంతో పాటు పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు పని చేయాలన్నారు. పార్టీ విశాఖపట్నం  జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందన్న నిరుత్సాహం చెందవద్దని, నూతనోత్సాహంతో పని చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే నాయకత్వం బలపడుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అరుకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న మెసాలపై ప్రతిఘటించేందుకు ప్రతి కార్యకర్త సిద్దం కావాలన్నారు.  విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ తప్పుడు హమీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం 100 రోజుల పాలనలో కమిటీల పేరుతో కాలయాపన చేసిందన్నారు.  గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కోసం 24 గంటలు పని చేసే  కోలగట్ల వంటి నాయకుడు జిల్లా పగ్గాలుచేపట్టడం శుభసూచికంగా చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు మాట్లాడుతూ పది మంది పొట్టకొట్టి ఒక్కడికి కట్టబెట్టే విధంగా ప్రభుత్వం పింఛన్  మంజూరు విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు.  పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ మాట్లాడుతూ  అధికారంలోకి వస్తే జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రగడ్భాలు పలికిన టీడీపీ నాయకులు  బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు  అన్యాయం చేయటం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీ ప్రగతిని అడ్డుకునే వారిని పక్కన పెట్టి  పార్టీని అభివృద్ధి చేయాలన్నారు.
 
ఐక్యతతో ముందుగా సాగుతా : కోలగట్ల
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ జిల్లాలో పార్టీ అభివృద్ధికి ముందుకు సాగుతానని పార్టీ జిల్లా అధ్యక్షుడు  కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ పదవి తనదొక్కడిదీ కాదని, అందరూ ఈ పదవిలో భాగస్వాములేనని అన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించిన బాధ్యతలు మేరకు 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.  జిల్లాలో పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. బాధ్యతయుతంగా పార్టీ కోసం  సమయం కేటాయిస్తూ  పని చేసే వారికి జిల్లా,  మండలం, గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో స్థానం కల్పించటం జరుగుతుందన్నారు.  శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.

రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్ర   పార్టీ సూచన మేరకు వచ్చే నెల 16న  జిల్లాలో గల 34 మండలాల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట  ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడంతో పాటు ప్రతి మండలంలో, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఒకటేనంటూ అధికార  పార్టీ నాయకులు చెప్పుకు తిరుగుతున్నారని అటువంటి అనుమానాలను పార్టీ నాయకులు పారద్రోలి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించటం ద్వారా జిల్లాలో పార్టీ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

సమావేశంలో పార్టీ  కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు బి.ప్రశాంత్, శ్రీకాకుళం జిల్లా నాయకులు మామిడి శ్రీకాంత్, ఎం.వి.పద్మావతి, మాఫెడ్ డెరైక్టర్ పులిరాజు, విజయనగరం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్,  మాజీ ఎమ్మెల్యే టి.విజయ్‌కుమార్, నెల్లిమర్ల నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, జెడ్పీటీసీ గెదల సన్యాసినాయుడు,  మాజీ ఎంపీపీ వర్రి నర్సింహమూర్తి, అల్లు కేశవజోగినాయుడు, కందుల రఘుబాబు, వేచలపు చినరామునాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాస్, గొర్లె వెంకటరమణ, అంబళ్ల శ్రీరాములనాయుడు, చనుమళ్ల వెంకటరమణ, పతివాడ అప్పలనాయుడు, మామిడి అప్పలనాయుడు, మజ్జి వెంకటేష్, జరజాపు సూరిబాబు, యల్లపు దమయంతిదేవి, అవనాపు విక్రమ్, కేతల వీరన్న తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీల ఏర్పాటు

Written By news on Friday, September 26, 2014 | 9/26/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీల ఏర్పాటు
హైదరాబాద్: పార్టీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి కమిటీల నియామకం జరిగింది. పార్టీ ఉన్నత స్థాయి కమిటీల నియామకానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. పార్టీ బలోపేతానికి ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ, ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశారు. 
 
ఉన్నతస్థాయి సమన్వయ కమిటీ సభ్యులుగా పార్టీ పీఏసీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం. పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డిలను నియమించారు. 
 
ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటీ సభ్యులుగా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డిలను నియమించారు. 

ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు


'ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు'
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాప అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. పేద ప్రజలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. దొంగదారిలోనైనా అధికారంలోకి రావాలని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని విమర్శించారు.

రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి... ఇప్పటి వరకు మాఫీ చేయాలేదన్నారు. ఆహార సబ్సిడీల కింద దాదాపు రూ. 4200 కోట్లు అవసరం కాగా... రూ. 2318 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్లపై తీవ్రంగా కోత విధిస్తున్నారన్నారు. పెన్షన్లకు రౌడీషీటర్లనే ఎంపిక చేస్తున్నారని... అలాగే పచ్చచోక్కాలకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తరతమ భేదం లేకుండా పేదలందరికి సంక్షేమ పథకాలు వర్తింప చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అలాకాకుండా ఒకటి, రెండు కారణాలు సాకుగా చూపి లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు ఏరివేస్తున్నారని ఆరోపించారు.

గతంలో ఆధార్ కార్డు వద్దని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ లింకేజీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ఉండకూడదన్న అభిప్రాయం చంద్రబాబుకు స్పష్టంగా కనబడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మంగళం పలికే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుందన్నారు. రాష్ట్రంలో 5 నెలలుగా వేల టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని... ఆ స్మగ్లింగ్ లో టీడీపీ కార్యకర్తలు చాపకింద నీరులా పాలుపంచుకుంటున్నారన్నారు.
రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల ఎంపిక కమిటీల్లోకి సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీలు వస్తున్నారన్నారు. అలిపిరి కేసులో కోర్టు దోషులుగా పేర్కొన్న ముగ్గురిలో ఒకరు టీడీపీ కార్యకర్తే అని ఆయన వివరించారు. కోర్టు దోషిగా పేర్కొన్న నర్సింహారెడ్డి.... చంద్రబాబు ఫొటోలతో ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజుకు కూడా నరసింహారెడ్డి టీడీపీ కార్యకర్తగానే కొనసాగుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. 

ప్రజా సంక్షేమానికి చంద్రబాబు పూర్తి వ్యతిరేకని ఆరోపించారు. సంక్షేమానికి తాను వ్యతిరేకమంటూ చంద్రబాబు గతంలో రాసుకున్న మనసులోమాట పుస్తకంలో వివరించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రజలకు సబ్సిడీలు కూడా అవసరం లేదని ఆ పుస్తకంలోనే బాబు వివరించారని చెప్పారు. గతంలో ఆ రోజు చెప్పినట్టుగానే బాబు ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు.

ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Written By news on Thursday, September 25, 2014 | 9/25/2014

ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని భూమా శోభా నాగిరెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయినా, ఆమెను అభ్యర్థినిగానే పరిగణించి ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో దివంతగ శోభా నాగిరెడ్డి ఘన విజయం సాధించారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో మరణానంతరం గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు ఆమె సొంతం అయ్యింది.

ఆ తర్వాత దేశంలోని 33 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఇటీవల నిర్వహించినా, ఆళ్లగడ్డ స్థానం విషయం మాత్రం కోర్టులో ఉండటంతో అప్పట్లో నిర్వహించలేదు. ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అక్కడ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలను మాత్రం తుది తీర్పునకు లోబడి మాత్రమే వెల్లడించాలని హైకోర్టు తెలిపింది.

దయనీయ స్థితిలో అక్కాచెల్లెళ్లు: వైఎస్ జగన్

దయనీయ స్థితిలో అక్కాచెల్లెళ్లు: వైఎస్ జగన్

వేల్పుల(వైఎస్ఆర్ జిల్లా): డ్వాక్రా అక్కాచెల్లెళ్లు దయనీయ స్థితిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేల్పులలో డ్వాక్రా మహిళలు తమ బాధలను జగన్ కు చెప్పుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని మూడు, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించలేదని తెలిపారు. ఇప్పుడు వడ్డీల భారం మోయలేకపోతున్నామన్నారు. ఇప్పటివరకు చేసిన చెల్లింపులన్నీ వడ్డీలకే పోతున్నాయని మహిళలు వాపోయారు. ఇప్పుడు ఒకేసారి ఆరు కంతులు కట్టమని చెబుతున్నారని వారు చెప్పారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు డ్వాక్రా రుణాలు కట్టక్కరలేదని టిడిపి నాయకులు చెప్పారన్నారు. ఎన్నికల్లో కట్టుకథలు చెప్పారని వాపోయారు. చంద్రబాబు నాయుడు తమకు అన్యాయం చేశారని చెప్పారు. వృద్ధులు ఫించన్ల పోతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు.తమ తరపున పోరాడాలని డ్వాక్రా మహిళలు జగన్ ను కోరారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు డ్వాక్రా మహిళల బకాయిలు రద్దు చేయలేదన్నారు. దాంతో వారి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు.  రైతుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. వృద్ధులకు మూడు పూటలా భోజనం పెట్టే ఆలోచన కూడా చంద్రబాబు చేయడంలేదన్నారు. రేషన్ కార్డుల ఇవ్వడం అలా ఉంచితే, ఇప్పుడు అన్నీ బోగస్ అంటున్నారన్నారు. 17లక్షల రేషన్ కార్డులు కత్తిరించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  ఇక రేషన్ కార్డు కావాలంటే గగమే అన్నారు. గ్రామాలలో కమిటీలన్నిటిలో టిడిపి కార్యకర్తలే ఉన్నారని విమర్శించారు.

43 లక్షల మంది పెన్షనర్లకు వెయ్యి రూపాయల చొప్పున నెలకు 430 కోట్ల రూపాయలు కావాలి. సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్ లో 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని జగన్ వివరించారు. దీని అర్ధం బడ్జెట్ లోనే ఫించన్ల కోతకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లని అన్నారు

పరకాలకు చెవిరెడ్డి సవాల్!


పరకాలకు చెవిరెడ్డి సవాల్!చెవిరెడ్డి భాస్కర రెడ్డి-పరకాల ప్రభాకర్
తిరుపతి: ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కిరాయి మనిషని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. భార్య  పేరు చెప్పుకొని పదవి పొందారన్నారు. గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు పకరాల కట్టుబడి ఉన్నారా? అని అడిగారు. డబ్బు కోసం పాలకొల్లులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో పరకాల జైలుకు వెళ్లారన్నారు. వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోలేక పరకాల శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

తన తండ్రి వృద్ధాప్య పింఛన్ పై బహిరంగ చర్చకు పరకాల సిద్ధమేనా? అని చెవిరెడ్డి సవాల్ విసిరారు. తన తండ్రి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. తన తండ్రి ఎక్కడైనా ఒక రూపాయి పెన్షన్ తీసుకున్నట్లు చెప్పగలరా? అని అడిగారు. తన తండ్రికి పెన్షన్ మంజూరులో ఆయన ప్రమేయంలేదని సంబంధిత అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా తన తండ్రి పేరుతో సృష్టించిన దొంగ కార్డని ఆయన అన్నారు. ఇవన్నీ చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి గెలిచినందువల్ల ఈర్ష్య, అసూయలతో చేస్తున్న కుట్రలు, కుతంత్రాలే అన్నారు. తాను పోరాటాల ద్వారా రాజకీయంగా ఎదిగానని చెప్పారు. పరకాల ప్రభాకర్ లాగా పైరవీలతో రాజకీయాలు చేసేవాడిని కాదని చెవిరెడ్డి చెప్పారు.

గెలిపించిన పార్టీని మోసం చేశారు


గెలిపించిన పార్టీని కొత్తపల్లి గీత మోసం చేశారు
హైదరాబాద్: అరకు ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేసి ... దమ్ముంటే తిరిగి అరకు ఎంపీగా గెలవాలని కొత్తపల్లి గీత కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ సవాల్ విసిరారు. ఎంపీటీసీగా కూడా గెలవలేని కొత్తపల్లి గీతను ఎంపీగా చేసిన ఘనత తమ పార్టీ అధ్యక్షుడు వైస్ జగన్ దేనని ఆయన స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాల్లో వాటాలు, కమీషన్ల కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని కొత్తపల్లి గీతను ప్రసాద్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబంపై తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే గిరిజనులే తగిన బుద్ధి చెబుతారని బొడ్డేడ ప్రసాద్ అన్నారు.
మహిళ అన్న ఉద్దేశంతో కొత్తపల్లి గీత ఇన్నాళ్లు ఏం మాట్లాడినా సహనంగా ఉన్నామన్నారు. గెలిపించిన పార్టీకి ద్రోహం చేయాలనుకునే ముందు అభాండాలు వేయడం సరికాదని గీతకు ఆయన హితవు పలికారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను మహిళలకు కేటాయించిన పార్టీ వైఎస్ఆర్ సీపీ అని ఆయన గుర్తు చేశారు.  అలాగే అరకు పార్లమెంట్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా మహిళలకే కేటాయించారని తెలిపారు. వ్యక్తి అజెండా కోసం గెలిపించిన పార్టీని కొత్తపల్లి మోసం చేశారని ఆరోపించారు. గెలిపించిన గిరిజనులను కూడా గీత మోసం చేస్తున్నారని విమర్శించారు. సొంత ఇమేజ్ తోనే గెలిచానని కొత్తపల్లి గీత భృ఼విస్తే తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని గీతకు హితవు పలికారు. గెలిచే సత్తా ఉందా అని కొత్తపల్లి గీతను ప్రసాద్ ప్రశ్నించారు.

ఇలాగే వదిలేస్తారా..!

ఇలాగే వదిలేస్తారా..!
సాక్షి కడప/పులివెందుల/లింగాల :
 వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి..  దిగుబడి పక్కనపెడితే.. పశువుల మేతకు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తోంది..  రైతు పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతోంది... వెంటనే ఇన్‌ఫుట్ సబ్సిడీని అందించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుధవారం సాయంత్రం మండల కేంద్రమైన లింగాలలో నాగేశ్వరరెడ్డి అనే రైతుకు  చెందిన వేరుశనగ పంట పొలాన్ని పరిశీలించారు.  దాదాపు 90రోజులైనా  ఎదుగూ.. బొదుగూ లేకుండాపోయిన పంటను చూసి వైఎస్ జగన్ ఒకింత ఆవేదనకు గురయ్యారు.  వేరుశనగ మొక్కలను పీకి పరిశీలిస్తే కనీసం ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడాన్ని చూసి చలించిపోయారు. కనీసం పెట్టుబడులు కూడా రావని .. బ్యాంకులకు వెళితే పంట రుణాలను రెన్యువల్ చేసుకున్నా.. ఇన్సూరెన్స్ వర్తించే పరిస్థితి లేదని రైతు నాగేశ్వరరెడ్డితోపాటు పలువురు రైతులు వైఎస్ జగన్‌కు వివరించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంటను తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుందామంటే అధికారులు అలా తొలగించవద్దని  ప్రకటనలు ఇచ్చారని.. దీంతో పంటలను తొలగించలేకపోతున్నామని..అయినా ఇంతవరకు ఏ అధికారి పంట పొలాలను చూడలేదని రైతులు వైఎస్ జగన్‌కు తెలిపారు. జిల్లాను కరువు కింద ప్రకటించి పంట నష్ట పరిహారమైనా అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను లింగాల జెడ్పీటీసీ అనసూయమ్మ, ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి తదితరులు కోరారు. అనంతరం  వర్షంలేక వాడిపోతున్న జొన్న పంటతోపాటు ప్రతాప్‌రెడ్డికి చెందిన చీనీ చెట్లను వైఎస్ జగన్  పరిశీలించారు.  వ్యవసాయ శాఖ ఏడీ జమ్మన్న వర్షపాతానికి సంబంధించిన వివరాలతోపాటు పంటల వివరాల నివేదికను వైఎస్ జగన్‌కు అందించారు.  2010 నుంచి ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిన్న అరటి పంటకు నష్టపరిహారం  అందించలేదని  రైతులు   వైఎస్ జగన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
 లింగాల కుడి కాలువ  పరిశీలన
 లింగాల కుడి కాలువను ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు.  కుడికాలువ పూర్తయినా.. మధ్యలో అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్న పనులను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.  ఇన్నేళ్లవుతున్నా ఎందుకు  కాలువ పని పెండింగ్ పెడుతున్నారని మైటాస్ సంస్థ ప్రతినిధిని ప్రశ్నించారు. త్వరలో చిత్రావతి నుంచి నీటిని విడుదల చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లింగాల కుడి కాలువలో అడ్డంకులు తొలగించేలా చర్యలు చేపట్టాలని లింగాల ఈఈ రవీంద్రనాథ గుప్తాను ఆదేశించారు. త్వరితగతిన కుడి కాలువ గట్లపై రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
 పీబీసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయండి :
 పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు సంబంధించి కేటాయించిన నీటిలో మొదటి విడతగా నీటిని విడుదల చేస్తున్నారని.. ఎగువ ప్రాంతాలలో వర్షాలు పడుతూ పరిస్థితి ఆశాజనకంగా ఉండి రెండవ విడతలో పూర్తిస్థాయిలో కోటా నీరు సీబీఆర్‌కు తీసుకురాగానే  పీబీసీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీబీసీ ఈఈ రాజశేఖర్‌ను ఆదేశించారు.  బుధవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌తో ఈఈ చర్చించారు. ప్రస్తుతం తుంపెర వద్ద ఎన్ని క్యూసెక్కుల నీరు రికార్డు అవుతోంది.. మిడ్‌పెన్నార్ వద్ద ఎన్ని క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.. సీబీఆర్‌లో ప్రస్తుతం నిల్వ ఎంత.. తాగునీటి పరిస్థితితోపాటు సాగునీటికి సంబంధించిన అనేక అంశాలపై వైఎస్ జగన్ ఈఈతో మాట్లాడారు.
 పులివెందుల ప్రాంత రైతులకు సంబంధించి సక్రమంగా పీబీసీ నీరు రాకపోవడంతో పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. సీబీఆర్‌లో నిల్వను బట్టి పీబీసీ ఆయకట్టుకు నీటిని  విడుదల చేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈఈను ఆదేశించారు.
 దసరా వేడుకలకు ఆహ్వానించిన ఆర్యవైశ్యులు :
 పులివెందులలోని అమ్మవారిశాలలో ఈనెల 25నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని.. సమయం అనుకూలిస్తే వేడుకలలో పాల్గొనాలని ఆర్యవైశ్యులు  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. దసరా ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నామని వైఎస్ జగన్‌కు తెలియజేశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రత్యేకంగా వైఎస్ జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన
 ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్,
 జిల్లా అధ్యక్షుడు :
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు కలిసి చర్చించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు కమలాపురం, బద్వేలు ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, జయరాములు, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, గండ్లూరు వీరప్రతాప్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు. పార్టీకి సంబంధించిన అంశాలతోపాటు జిల్లా రాజకీయాలపై వారు మాట్లాడుకున్నారు.
 అందరితో ఆప్యాయ పలకరింపు :
 ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బుధవారం తెల్లవారు జామున వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో ముద్దనూరులో దిగి పులివెందులకు చేరుకున్నారు. ఉదయం 8గంటలనుంచే క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజలతో ముచ్చటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటలవరకు నిరంతరాయంగా తరలివచ్చిన  ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి కూడా వైఎస్ జగన్ కార్యకర్తలతో చర్చించారు. పలువురిని పేరు పేరునా పిలుస్తూ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, తాలుకా అధికార ప్రతినిధి చవ్వా సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 వ్యక్తిగత కార్యదర్శిని
 పరామర్శించిన వైఎస్ జగన్ :
 పులివెందులలోని బాకరాపురంలో నివాసముంటున్న వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్‌ను ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. ఈ మధ్యనే రవి కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రవిని వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు

పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు

ఖమ్మం : తాను పార్టీ మారటం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి తనను ఎమ్మెల్యేను చేశారని, వారిని ఎన్నటికీ మోసగించనని ఆయన అన్నారు. బీఫాం ఇచ్చిన పార్టీని, వెన్నుదన్నుగా ప్రోత్సహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానాన్ని ఏ పార్టీకి తాకట్టు పెట్టే ప్రసక్తే లేదన్నారు. 'తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారు' అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కొన్ని మీడియా సంస్థల్లో ఇలాంటి వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.   తనపై ఈనెల 18న కుక్కునూరులో టీడీపీ నాయకుల దాడిపై సీఎం కేసీఆర్ కు వివరించానని, ఆయన స్పందించి పోలీస్ అధికారులతో మాట్లాడారని, రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు  మండలాల ప్రజలకు తానే ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలి: వైఎస్ జగన్

Written By news on Wednesday, September 24, 2014 | 9/24/2014


ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలి: వైఎస్ జగన్
కడప: వర్షాభావం కారణంగా పంటలు పశువులకు కూడా పనికిరాకుండా పోయాయని, ప్రభుత్వం పంటలను పరిశీలించి రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు.

లింగాల మండలంలో తీవ్ర వర్షాభావం కారణంగా రైతులు నష్టపోయిన పంటలను వైఎస్ జగన్ పరిశీలించారు. రైతులు రుణాలను రీషెడ్యూల్ చేసుకోలేని స్థితిలో ఉన్నారని, దీంతో రావాల్సిన పంటల బీమా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరటి పంట పరిహారంపై నిర్ణయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. 72 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తే పోతిరెడ్డిపాడు నుంచి గండికోటకు తాగునీరు వస్తుందని, దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతుల కష్టాలపై స్పందించాలని డిమాండ్ చేశారు.

సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు


సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు: వైఎస్ జగన్
పులివెందుల: అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష యుగంలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 
 
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో ఇదో మహాద్బుత చారిత్రక రోదసీ ఘట్టం అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మామ్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత శాస్త్రవేత్తల శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లయింది అని వైఎస్ జగన్ అన్నారు. 
 
అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది,

పేదోళ్ల పింఛన్ రద్దు చేస్తే ఉద్యమిస్తాం

పేదోళ్ల పింఛన్ రద్దు చేస్తే ఉద్యమిస్తాం
నిడదవోలు : జిల్లాలో ఏ ఒక్క పేదకైనా పింఛన్ తొలగిస్తే పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు  ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్  రాజశేఖరరెడ్డి జిల్లాలో 3.30 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశారని, ఇప్పుడు పింఛన్ల తనిఖీ పేరుతో టీడీపీ ప్రభుత్వం పింఛన్‌దారులను తగ్గించేందుకు కుట్ర పన్నుతోందని నాని ఆరోపించారు. పింఛన్‌దారులకు అన్యాయం జరిగిదే సహించేది లేదని, వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని నాని చెప్పారు.

  పట్టణంలోని రోటరీక్లబ్ ఆడిటోరియంలో మంగళవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పార్టీ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలను అడ్డుకుంటామన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి కార్యకర్త ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. తొలి సంతకంతో రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న బాబు నేడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను,

 డ్వాక్రా మహిళలను మోసం చేశాడన్నారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మాట్లాడుతూ నమ్మి ఓటేసిన ప్రజలను చంద్రబాబు మోసం చేశాడన్నారు. మొదటి సంతకానికి విలువ లేకుండా చేసిన ఘనత బాబుదేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 16న ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడదామని జీఎస్ రావు పిలుపునిచ్చారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందనే ప్రచారాన్ని నమ్మి యువత టీడీపీకి ఓట్లేశారని, నేడు బాబు ఉన్న జాబులను తొలగిస్తున్నారని విమర్శించారు.

 రానున్న రోజుల్లో పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై పక్షపాత దోరణితో వ్యవహరిస్తే కార్యకర్తలు వారికి అండగా నిలిచి వెలుగులోకి తీసుకురావాలని కోరారు.  రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ పింఛన్ల తనిఖీలో ఎవరికైనా అన్యాయం జరిగితే పోరాటం చేస్తామన్నారు. టీడీపీ పాలన ప్రజావ్యతిరేకంగా సాగుతుందని మరో నేత జీఎస్ నాయుడు అన్నారు. సమావేశంలో   మహిళా నాయకురాలు పి.శ్రీలక్ష్మి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు వజీరుద్దీన్, జెడ్పీటీసీ ముళ్లపూడి సత్యకృష్ణ, ఎంపీపీ మన్యం సూరిబాబు,  ఆత్కూరి దొరయ్య, ఉదయభాస్కర్, ముళ్లపూడి శ్రీనివాసచౌదరి, పువ్వల రతీదేవి, యాళ్ల రామారావు, నందిగం భాస్కరరావు, కంచర్ల ప్రసాద్, బూరుగుపల్లి సుబ్బారావు, మేడపాటి లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగరి డీఎస్పీని సస్పెండ్ చేయాలి

నగరి డీఎస్పీని సస్పెండ్ చేయాలి
చిత్తూరు(సెంట్రల్): పుత్తూరు డీఎస్పీ కృష్ణమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఇటీవల నగరిలో జాతర సందర్భంగా జరిగిన గొడవకు ఆయన వ్యవహారశైలే కారణమని ఆమె తెలిపారు. జాతరలో తనపై జరిగిన గొడవకు కారణమైన మాజీ శాసనసభ్యుని అనుచరులు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని, మంగళవారం నగరి మున్సిపల్ చైర్‌పర్సన్,మాజీ చైర్మన్‌తో కలిసి వెళ్లి జిల్లాకలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను కోరినట్లు ఆమె విలేకరులకు చెప్పారు.

గొడవ జరిగే అవకాశం ఉందని తాను ముందుగానే డీఎస్పీకి వివరించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరినా ఆయన పట్టించుకోకపోగా ఉద్దేశపూర్వకంగానే అధికారపార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకరించారని తెలిపారు. నగరి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

నగరిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినందున డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, దీని నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నగరికి మంజూరైన నీటి శుద్ధి ప్లాంటు ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీని ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.భరత్‌గుప్తాను ఆయన కార్యాలయంలో కలసి నగరి వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలసినవారిలో వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రి, నగరి మున్సిపల్ చైర్‌పర్సన్, మాజీ చైర్మన్ ఉన్నారు.

జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ

పెన్షన్లకు కత్తెర అమానుషం
పేదల పొట్టకొట్టే చంద్రబాబు సర్కారు కుట్రలో భాగస్వాములు కావద్దు పెన్షన్ల పరిశీలన కమిటీలకు ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ
 
హైదరాబాద్: అర్హులైన వారి ఫించన్లను కత్తిరించేందుకు..పేదల పొట్టగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కత్తిదూయ టం అమానుషం, దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల ఆంక్షలు పెడుతూ అర్హులైన వారి పింఛన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రలో భాగస్వాములు కావద్దని.. పింఛన్ల పరిశీలన కోసం నియమించిన కమిటీల అధ్యక్షులు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుల , మత, వర్గాలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులందరికీ పింఛన్లు లభించేలా చూడాలని, పేదల పక్షాన నిలబడాలని వారిని కోరుతూ జగన్ మంగళవారం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది...

‘పెన్షన్లకు కత్తెర అమానుషం.
ప్రభుత్వ ఎజెండా దుర్మార్గం.
పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలబడండి..


ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్లను ఏరి వేయడానికి ప్రభుత్వం తరఫున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షన్ల పరి శీలన కమిటీ అధ్యక్షులకు, సభ్యులకు ప్రతిపక్ష నాయకుడిగా, మహానేత తనయుడిగా, పేదల పక్షపాతిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు గ్రామగ్రామానా తిరుగుతూ రెండు వందల రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలు చేస్తానని, రూ.500 పింఛన్‌ను 1,250 నుంచి రూ.1,500 చేస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా పింఛన్‌దార్ల మీద కక్షగట్టినట్లు, పగబట్టినట్లు ప్రవర్తిస్తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలూ, గీతన్నల పింఛన్లను కత్తిరించే కార్యక్రమం ప్రారంభించింది. నిన్నటి వరకూ పింఛన్లు అందుకున్న వృద్ధు లు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు.. పింఛన్లు తొలగిస్తే ఇక వారంతా ఎలా బతుకుతారన్న ఆలోచన లేకుండా చంద్రబాబు ఖర్చు తగ్గించుకునే కార్యక్రమం ప్రాంభించారు. ఏపీలో 43,11,688 పింఛన్ల కోసం ఈ ఏడాది కేటాయింపు కనీసంగా 3,730 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.1,338 కోట్లు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో ప్రస్తుతం 43,11,688 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో...

 ► వృద్ధాప్య పింఛన్లు: 20,30,131 (వీరికి ప్రస్తు తం నెలకు రూ.200 ఇస్తుండగా అక్టోబర్ 2వ తేదీ నుంచి రూ.1,000 ఇవ్వాలి).

 ► వితంతు పింఛన్లు: 13,21,986 (వీరికి కూడా ప్రస్తుతం నెలకు రూ.200 ఇస్తుండగా అక్టోబర్ 2 నుంచి రూ.1,000 ఇవ్వాలి).

 ► వికలాంగుల పింఛన్లు: 5,36,837 (ప్రస్తుతం రూ.500 ఇస్తుండగా అక్టోబర్ 2 నుంచి రూ.1,500 ఇవ్వాలి).

 ► అభయహస్తం పింఛన్లు: 2,87,897 (ప్రస్తు తం రూ.500 ఇస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి వీరికి రూ.1,000 ఇవ్వాలి).

 ► ఇతర కేటగిరీ: దాదాపు 90 వేలు (వీటికి కూడా ప్రస్తుతం రూ.200 ఇస్తుంటే అక్టోబర్ 2 నుంచి రూ.1,000 ఇవ్వాల్సి ఉంటుంది).

 ► ఈ మొత్తం 42,11,688 మంది పింఛనుదారులకు ఇప్పటి వరకు నెలకు చెల్లిస్తున్న మొత్తం: రూ. 130 కోట్లు (అంటే - ఏప్రిల్ నుంచి ఆగ స్టు వరకు రూ.650 కోట్లు చెల్లించాలి.)

 ► సెప్టెంబర్ నుంచి (చంద్రబాబు చేసిన వాగ్దా నం మేరకు) 43,11,688 మంది పింఛనుదారులకు నెలకు రూ. 431 కోట్లు చెల్లించాలి. వీరిలో వికలాంగులకు పింఛన్ల కింద నెలకు రూ. 1,500 ఇవ్వాలి.

 ► ఈ లెక్కన మిగిలిన ఏడు నెలల్లో (ఏప్రిల్ వరకూ): నెలకు రూ. 440 కోట్లు చొప్పున 7 నెల లకు మొత్తం రూ. 3,080 కోట్లు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో సామాజిక పింఛన్లకు కేటాయించాల్సిన మొత్తం రూ.650 కోట్లు ప్లస్ రూ. 3,080 కోట్లు.మొత్తం 3,730 కోట్లు.

 ► కానీ బడ్జెట్‌లో కేటాయించింది: రూ 1,338 కోట్లు మాత్రమే.

 ► లోటు (తేడా): 2,400 కోట్ల రూపాయలు.

 ► అంటే ఈ రూ. 2,400 కోట్ల మేరకు సామాజిక పింఛన్లు క త్తిరించి, కొందరికి మాత్రమే పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారని ఎవరికైనా అర్థం అవుతుం ది. అందుకే పేదలకు అన్యాయం చేసే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎజెండాకు సహకరించకుండా అర్హులందరికీ పార్టీలకు, ప్రాం తాలకు, కుల మతాలకు అతీతంగా పింఛన్లు అందించేలా గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఉన్న నాయకులు, కమిటీ సభ్యులంతా మానవతా దృక్పథంతో ప్రవర్తిం చాలని.. ఈ కత్తెర కార్యక్రమానికి సహకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

మహానేత సాచ్యురేషన్ విధానాన్ని అవలంభించారు...

మహానేత వైఎస్సార్ మరణం తరువాత, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో 7 లక్షల సామాజిక పింఛన్లకు పరిశీలనల పేరిట కోత పెట్టింది. నిజానికి మరో 15 లక్షల మంది సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ అందించటానికి వీలుగా మహానేత సాచ్యురేషన్ (సంతృప్త స్థాయి) విధానాన్ని అవలంభించారు. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు వంటివి పరిగణనలోకి తీసుకోకుండా, అవసరం - అర్హత అనే ప్రాతిపదికలపై అందరికీ పింఛన్లు అందించారు. కాబట్టే వైఎస్సా ర్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు 17 లక్షలు మాత్రమే ఉన్న పింఛన్లకు అదనంగా 55 లక్షల కొత్త పింఛన్లు అందించారు. పింఛన్ మొత్తాన్ని రూ.75 నుంచి రూ. 200కు పెంచారు. గ్రామంలో ఏదో పది, ఇరవై మందికి మాత్రమే పింఛన్ అందేది. పింఛన్‌దారు మరణిస్తే తప్ప ఆ తరువాతి వారికి పింఛన్ అందించే దుస్థితి నుంచి బయటకు తీసుకువచ్చారు.

అర్హులందరినీ పింఛన్ల జాబితాలో చేర్చాలి..

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పాత పద్ధతులకు పదును పెట్టి రకరకాల ఆంక్షలతో ఇంటికి ఒక్క టే పింఛన్ అంటున్నారు. గ్రామానికి ఇన్ని పింఛన్లు అనే విధంగా రేషనింగ్ పెట్టే వ్యవహారాన్ని, కొందరికే పింఛన్లు అందించే కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఆధార్‌కార్డును ఉపయోగించి రేషన్ ఇవ్వకుండా ఆపుతారా.. ఖబడ్దార్ అన్న చంద్రబాబు ఇప్పుడు ఈ పింఛన్లకూ ఆధార్ ప్రాతిపదికగా ఆంక్షలు పెడుతూ అర్హుల పొట్టగొట్టేందుకు కత్తి దూస్తున్నారు. ఈ అమానుషమైన తొలగింపు కార్యక్రమంలో ప్రభుత్వానికి సహకరించవద్దని, అర్హులైన అందరినీ పింఛన్ల జాబితాలో చేర్చటానికి సహకరించాలని సర్పంచులకు, మండల అధ్యక్షులకు, మున్సిపల్ చైర్మన్లకు, వార్డ్ మెంబర్లకు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్లకు.. కార్పొరేటర్లకు, వీరి నేతృత్వం లోని కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను.  

 - వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు’ 

పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్

పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఆయన బుధవారం ఉదయం ముద్దనూరు చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ లో వైఎస్ జగన్ కు ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పులివెందుల బయలుదేరి వెళ్లారు.  ఈ రోజు, రేపు ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్

Written By news on Tuesday, September 23, 2014 | 9/23/2014


ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్వైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: పింఛన్లకు కోత విధించడం అమానుషం అని,  ప్రభుత్వ అజెండా దుర్మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలవాలని ఆయన బహిరంగ లేక రాశారు.

రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ఏరివేయడానికి ప్రభుత్వం తరపున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షనర్ల పరిశీలన కమిటీ అధ్యక్షునికి, సభ్యులకు ప్రతిపక్ష నేతగా విజ్ఞప్తి చేశారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

కార్యకర్తలకు అండగా ఉంటాం
కొవ్వూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తే ఉపేక్షించేది లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) హెచ్చరించారు. బాధితులకు తమతోపాటు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వైసీపీ కొవ్వూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక జీఎస్ రావు కాపు కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు.

నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అధ్యక్షతన నిర్వహించిన  సమావేశంలో నాని మాట్లాడుతూ అసత్య హామీలతో గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం, ఆ హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు కార్యకర్తలు పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రుణమాఫీ పేరు చెప్పి రైతుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డుకీడ్చారని విమర్శించారు. జోలెపట్టి బిచ్చమెత్తి ఎంత మంది రైతులకు రుణమాఫీ చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో 3 లక్షలకు పైగా పింఛన్‌దారులు ఉన్నారని, ఏ ఒక్క పింఛన్‌దారుడిని తొలగించినా వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పోరాటం సాగిస్తుందన్నారు.

చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు
పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపునిస్తామని నాని అన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మండల, గ్రామ స్థాయి సమావేశాలు  నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీస్తున్నారని, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గం అంకన్నగూడెంలో మాదిరిగా కార్యకర్తలపై అక్రమ కేసులు బనారుుంచటం పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి వారికి బాసటగా నిలుస్తాయన్నారు. ఆళ్ల నానిని పెద్దేవం పార్టీ నాయకుల తరఫున జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పట్టాభి రామారావు గజమాలతో సత్కరించారు.

తానేటి వనిత, జీఎస్ రావు, బొడ్డు అనంతవెంకటరమణ చౌదరిలను పూలమాలలతో సత్కరించారు.నిడదవోలు, గోపాలపు రం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త లు ఎస్.రాజీవ్‌కృష్ణ, తలారి వెంకట్రా వు, నిడదవోలు నియోజకవర్గ నాయకుడు జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరిచరణ్, ముదునూరి నాగరాజు, గూడా విజయరాజు, వర్రే శ్రీనివాస్, కాకర్ల నారాయుడు, దళిత విభాగం నాయకుడు ముప్పిడి విజయరావు, మాజీ ఎంపీపీ పీకే రంగారావు, గారపాటి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండల పార్టీ కన్వీనర్లు ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, బొర్రా కృష్ణారావు, పట్టణ కన్వీనర్ మైపాల విజయరామ్మోహన్ (రాంబాబు), నాయకులు యండపల్లి రమేష్‌బాబు, దేవగుప్తాపు లక్ష్మణరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ప్రజల తరఫున పోరాటం సాగిద్దాం.. జీఎస్ రావు
గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు అసత్య హామీలతో అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జీఎస్ రావు విమర్శించారు. అక్టోబర్ 16 నుంచి తహసిల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తించారని, త్వరలోనే ప్రభుత్వంపై తిరగబడతారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలను చేపడుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు.

సంస్థాగతంగా పార్టీని  బలోపేతం చేద్దాం : వనిత
త్వరలో చేపట్టబోయే పార్టీ కమిటీల నియామకం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్టు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చే పిలుపు మేరకు చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తలంతా భాగస్వాములు కావాలని కోరారు. నూతనంగా నియమించే అన్ని కమిటీల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని వనిత పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచాలి : వెంకటరమణ చౌదరి
నాయకుల కంటే పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరిగినప్పుడు విజయాన్ని ఆ పడం ఎవరితరం కాదని పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయర్త బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి నేడు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని విమర్శించారు. 3 నెలలకే చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిం దన్నారు. పింఛన్ కమిటీల పేరుతో అర్హులైన పింఛన్ లబ్ధిదారులను తొల గిస్తున్నారని, వారందరికి పార్టీ శ్రేణు లు అండగా నిలవాలని సూచించారు.

జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ

జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలుసుకున్నారు. సోమవారమిక్కడ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.

పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించినప్పుడు ఆయనపై టీడీపీ నాయకులు జరిపిన దాడి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడిని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి  ఖండించారని, తాటి వెంకటేశ్వర్లుకు ఆయన సానుభూతిని తెలియజేసి పరామర్శించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు.

పెను సంక్షోభంలో ఏపీ రైతులు

Written By news on Monday, September 22, 2014 | 9/22/2014

పెను సంక్షోభంలో ఏపీ రైతులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నా, ఇప్పటికీ లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రుణమాఫీ జరగలేదని, కనీసం రీషెడ్యూల్ కూడా అవ్వలేదని అన్నారు.

రైతులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులు పండగ చేసుకుంటున్నారని మంత్రులు అనడం దారుణమని మండిపడ్డారు. ఆత్మవంచన వద్దు.. ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు నాగిరెడ్డి సూచించారు.

పార్టీ నాయకులతో కమిటీలా?

పార్టీ నాయకులతో కమిటీలా?
చిత్తూరు: టీడీపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోగా, అన్నింటికీ పార్టీ నాయకులతో కమిటీలు వేస్తోందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి విమర్శించారు. ఎలాంటి నిబంధనలు లేకుండా మహిళలు, రైతుల రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఫించన్లు బాగా తగ్గించి లబ్దిదారులను ఇబ్బందుల పాల్జేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇన్ని సమస్యలతో జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి వెళ్తే ప్రజలే తిరస్కరిస్తారని అమర్నాథరెడ్డి హెచ్చరించారు.

టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లా?

అనంతపురం:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ వారికి మాత్రమే పింఛన్లు వచ్చేలా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. దీనికి సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్ ను వైఎస్సార్ సీపీ నేతలు విశ్వేశ్వర రెడ్డి, వెంకట్రామి రెడ్డి, శంకర్ నారాయణ తదితరులు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వృద్ధులు, వికలాంగులకు  పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇచ్చారని ఈ సందర్భంగా కలెక్టర్ కు స్పష్టం చేశారు. కాగా, చంద్రబాబు మాత్రం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లు వచ్చేలా చూస్తున్నారన్నారు.
 
ఒకవేళ పింఛన్ల తొలగింపులో ఇబ్బందులుంటే ఆ జాబితాను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యమా..? లేక టీడీపీ నియంత రాజ్యమా..?

ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయ్
అనంతపురం అర్బన్:
 ‘అధికారంలోకి వచ్చామని అహంకారం.. మేం ఏం చేసినా ప్రశ్నించేవారులేరనే అహంభావం.. ఇది ప్రజాస్వామ్యమా..? లేక టీడీపీ నియంత రాజ్యమా..? మిమ్మల్ని ప్రజలు నిలదీసే రోజులు దగ్గర పడ్డాయ్’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నేతలను హెచ్చరించారు. స్థానిక రెండో రోడ్డులోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం శంకరనారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, జిల్లా నాయకుడు ఎర్రిస్వామిరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పింఛన్ల జాబితా తయారీలో టీడీపీ నాయకులు చేస్తున్న నిర్వాకాన్ని బట్టబయలు చేస్తారనే భయంతో ఆ పార్టీ కార్యకర్తలు సాక్షి ఫొటోగ్రాఫర్ వీరేష్, పాత్రికేయుడు రమణారెడ్డిపై దాడి చేయడం అమానుషమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కులాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారని, అయితే ప్రస్తుతం టీడీపీ నాయకులు వారి సానుభూతిపరులకు మాత్రం పింఛన్లు మంజూరుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమిష్టిగా పింఛన్ల జాబితా తయారు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తలు తయారు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన 135 జీఓ కేవలం పచ్చచొక్కాల కోసమేనా అని ఘాటుగా విమర్శించారు.  పింఛన్ల జాబితాల తయారీ పూర్తిగా అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని, అర్హత ఉన్న వారికి అన్యాయం జరిగితే ప్రజలే వారిని నిలదీస్తారన్నారు. 50శాతం పింఛన్లు కోత విధించేందుకు ఇలాంటి సమావేశం నిర్వహించారని, వారి నిర్వాకాన్ని బట్టబయలు చేసేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధులపై ఎమ్మెల్సీ శమంతకమణి సమక్షంలో ఆమె కుమారుడి ఆధ్వర్యంలో దాడులు జరగడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో సామాన్యులకు ఇక రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నించారు. పాత్రికేయులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఎంపీ జేసీ దివాకరరెడ్డి టీడీపీలో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు నిత్యం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతుంటే... జీడిపల్లి రిజర్వాయర్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ ప్రభుత్వం భావించడం మూర్ఖత్వమేనన్నారు. సమావేశంలో జిల్లా ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాలరెడ్డి, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు పెన్న ఓబిలేసు, నగర యువజన నాయకులు మారుతినాయుడు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, ముక్తాపురం శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

జన్మభూమి ఉపయోగంలేని పథకం

జన్మభూమి ఉపయోగంలేని పథకం
సదుం: సీఎం చంద్రబాబునాయుడు అమలు చేయాలనుకుంటున్న జన్మభూమి పథకంతో టీడీపీ కార్యకర్తలకు తప్పా ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించా రు. సదుం మండలం చెరుకువారిపల్లెలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంతో తెలుగు తమ్ముళ్లకే అధిక ప్రయోజనం చేకూరిందన్నారు.

ప్రజలకు మేలు చేకూర్చేదానికన్నా చంద్రబాబు తన కుర్చీని కాపాడుకోవడంతో పాటు తనయుడు లోకేష్‌ను సీఎం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలతో కమిటీలు వేసి పేదలు అందుకునే పింఛన్లను రద్దుచేసి, టీడీపీ కార్యకర్తలకు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్ చిరస్మరణీయుడిగా మిగిలారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన జలయజ్ఞం పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగు నీరందేదన్నారు.

జలయజ్ఞం ద్వారా తెలంగాణలో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని సీఎం కేసీఆర్ చెబుతుండగా ఆంధ్ర మంత్రులు దాన్ని తప్పుపట్టడం శోచనీయమన్నారు. దొనకొండలో రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉండేదని, చంద్రబాబు ఏకపక్షంగా విజయవాడను ప్రకటించారని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమలు సాధ్యంకాని హామీలు ఇవ్వలేదని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆయన నిర్ణయమే సరైందన్నారు.

వంద రోజుల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఐదేళ్ల తర్వాత వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుబ్రమణ్యం, సర్పంచ్‌లు వెంకటరమణ, నారాయణరెడ్డి, వెంకటరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తిమ్మారెడ్డి, పాపిరెడ్డి పాల్గొన్నారు.

మనకు వైఎస్ జగనే అండ

మనకు వైఎస్ జగనే అండ
 సాక్షి, ఏలూరు : ‘అధికార మదంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న అరాచకాలకు భయపడాల్సిన పనిలేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి.. సమస్యల్లో వెన్నుదన్నుగా నిలిచేదెవరు అనే సందేహాలకు తావులేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం అంకన్నగూడెం ఘటన. అకారణంగా ఆ గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, వారి ఇళ్లపైన దాడులు చేసి.. వారిని నేటికీ ఊరిలో అడుగుపెట్టలేనంతగా భయబ్రాంతులకు గురి చేశారు. ఆ రోజు విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూడమన్నా రు.

 అవసరమైతే తానే స్వయంగా వచ్చి వారి తరఫున పోరాటం చేస్తానన్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలకు కొండంత ధైర్యాన్నిచ్చారు. దెందులూరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మాట్లాడుతూ.. ‘అన్నదాతల అప్పులన్నీ తీర్చేస్తామని అసత్య హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చలేక జోలెపట్టి విరాళాలు అడుగుతూ రైతుల్ని బిచ్చగాళ్లగా చూడకండి. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. డ్వా క్రా రుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు గ్రూపు లీడర్లనే మొత్తం రుణం కట్టమని డ్వాక్రా మహిళల్ని మోసం చేయకండి.

 ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం వస్తుంది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించడానికి కేటాయిస్తున్న సమయాన్ని ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి వెచ్చించాలని జిల్లా మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌కు ఆళ్ల నాని సూచించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చంద్రబాబు కళ్లు తెరిపించండని వారికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు యువతను మోసం చేశారన్నారు. త్వరలోనే గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ అన్ని కమిటీలు వేస్తామని, పార్టీ కోసం త్యాగాలు, ప్రజల కోసం పోరాటాలు చేసే వారికి కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.

 అంత కండకావరమా : పార్టీ పరిశీలకులు బోస్
 ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తికి కండకావరం ఉండకూడదని, నాయకుడనేవాడు నోరులేని వారికి మాటలా, ఆపన్నులకు అండగా ఉండాలని.. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని మాజీ మం త్రి, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ పరిశీ లకులు పిల్లి సుభాష్‌చంద్రబోస్ హితవు పలికారు. అక్రమ కేసులకు భయపడవద్దని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జీఎస్ రావు మాట్లాడుతూ రాష్టాన్ని  సింగపూర్ చేస్తానంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీకి డబ్బులు లేవంటూ చంద్రబాబు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

 ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే ఖ్యాతినార్జించారని, ఆయన ఆశయాలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు మారని మనిషి అనే విషయూన్ని ఆ పార్టీ వారే గుర్తించారని చెప్పారు. బాధల్లో ఉన్న వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే ఓదార్చాలని పిలుపునిచ్చారు. పార్టీ దెందులూరు నియోజకవర్గ నేతలు కొఠారు రామచంద్రరావు, చలుమోలు అశోక్‌గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ చేయలేని పనులను ప్రజలకు మనం చేద్దామని, టీడీపీ వేధింపులను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. సమావేశానికి దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.

 అధికారపక్షం బలహీనపడుతోంది : ధర్మాన
 అధికారంలోకి రాలేకపోయినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినట్టు కాదని మాజీ మంత్రి, పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమస్వయకర్త ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన వైఎస్సార్ సీపీ ప్రస్థానం తర్వాత 18కి చేరిందని, గత ఎన్నికల్లో 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని బలాన్ని మరింతగా పెంచుకుందని వివరించారు. గడచిన వంద రోజుల్లో అధికార పార్టీ బలహీనపడుతుంటే ప్రతిపక్ష పార్టీ బలపడుతోందన్నారు. సంస్థాగత నిర్మాణ లోపం వల్లే ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని, 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు ఏకపక్షంగా వైఎస్సార్ సీపీకి రావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు రుణమాఫీ హామీని నెరవేర్చలేక రోజుకో సాకు చెబుతున్నారని, మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, మహిళల పక్షాన తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం అన్యాయం చేసినా తమ ప్రభుత్వం వచ్చాక రైతులకు అండగా ఉంటామని ధర్మాన అభయం ఇచ్చారు.

వాళ్ల జేజమ్మ దిగిరావాలి: సుబ్బారెడ్డి

Written By news on Sunday, September 21, 2014 | 9/21/2014


వాళ్ల జేజమ్మ దిగిరావాలి: సుబ్బారెడ్డి
ఒంగోలు: టీడీపీ ప్రభుత్వం నైతికంగా ఎప్పుడో పతనమైందని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 100 రోజుల పండగ చేసుకోవడానికి టీడీపీ నాయకులకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు.
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవుతుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ క్లోజ్ కావాలంటే టీడీపీ నాయకుల జేజమ్మ దిగిరావాలని అన్నారు.

స్పష్టత లేని కార్యక్రమాలెందుకు?

స్పష్టత లేని కార్యక్రమాలెందుకు?
బాబు కార్యక్రమాలపై వైఎస్సార్ సీపీ 
 సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెడుతున్న జన్మభూమి కార్యక్రమం ఆయన కేబినెట్‌లోని మంత్రులకే అర్థం కావడంలేదని, అవి ప్రజలకేమి అర్థమవుతాయని, వాటి వల్ల కలిగే ప్రయోజనమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. శనివారం డ్వాక్రా మహిళలతో బాబు ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులు స్పష్టత కోరడం, వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేయడం చూస్తే వాటిపై ప్రభుత్వంలోని పెద్దలకే స్పష్టత లేదని తెలిసిపోతోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఉప్పులేటి కల్పన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలపై మంత్రులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏకంగా ఒక దళిత మంత్రి పైనే నోరు పారేసుకున్నారు. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు ప్రవేశపెట్టే పథకాలపై ఆయనకే స్పష్టత లేదని అర్థమవుతుంది’ అని ఎద్దేవా చేశారు.

విచారణ జరిపి న్యాయం చేయండి

విచారణ జరిపి న్యాయం చేయండి
ఎమ్మెల్యే తాటిపై జరిగిన దాడిపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: అశ్వారావుపేట వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు నేతృత్వంలోని టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిపై సమగ్ర విచారణ జరిపి, తగిన న్యాయం చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు.. మళ్లీ ఇలాంటి హింసాయుత చర్యలకు పాల్పడకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీకి సలహా ఇవ్వాలని కోరింది.
 
 ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వినతిపత్రాన్ని సమర్పించారు. వీరితోపాటు సీపీఎం ఎమ్మెల్యే  రాజయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ తదితరులున్నారు.  ప్రాం తీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. హింసాయుత పద్ధతులకు దిగుతోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా వైఎస్సార్‌సీపీ బృందం కలిసింది.  
 
 గవర్నర్ న్యాయం చేస్తానన్నారు: ఎంపీ
 తమ వినతిని స్వీకరించిన గవర్నర్ నరసింహన్ తాము చెప్పిన విషయాలను విన్నారని తమకు న్యాయం చేస్తారని ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి మీడియాకు తెలిపారు.

Popular Posts

Topics :