12 October 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

టార్చిలైట్లు, లాంతర్ల వెలుగులో వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Saturday, October 18, 2014 | 10/18/2014

విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్షం, చీకటిని లెక్కచేయకుండా తుపాను ప్రభావ బాధితులను పరామర్శించారు. శనివారం రాత్రి వైఎస్ జగన్ టార్చ్ లైట్లు, లాంతర్ల వెలుగులో పాడేరులోని ఎరడవల్లి గిరిజనులను పరామర్శించారు. తుపాన్ కారణంగా సర్వం కోల్పోయామని, కొంతమందికి బియ్యం తప్ప మరే సహాయం అందలేదని గిరిజనులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అందరికీ సరైనా పరిహారం అందేలా పోరాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.


వైఎస్ జగన్ అంతకుముందు అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలల్లో తుపాను కారణంగా నష్టపోయిన బాధిత రైతులను  పరామర్శించారు. కాఫీ తోటల రైతులకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు మిరియాలు, కాఫీ తోటలతో ఎకరాకు లక్ష చొప్పున సంపాదిస్తున్నారని.. వారికి హెక్టారుకు రూ. 10 వేలు, రూ.15 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్నిప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ రూ.లక్ష చొప్పన పరిహారం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు అవుతుందని జగన్ స్పష్టం చేశారు. కాఫీ పంటకు ఆధారమైన సిల్వర్ ఓక్ చెట్లు భారీ ఎత్తున కూలిపోయాయని.. మళ్లీ చెట్లు పెరగాలంటే 15 సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
 
వర్షంలోనూ తన పర్యటన కొనసాగించిన జగన్ మోదపల్లి వద్ద దెబ్బతిన్న కాఫీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా  గిరిజనులు వైఎస్ జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో చెట్టూ పెరగాలంటే 20 సంవత్సరాల కాలం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు రూ. 1,50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని జగన్ కు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. మిరియాలు, కాఫీ పంటల రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చెట్లు లేకపోతే కాఫీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తెలిపారు.ఏ ఒక్క గిరిజనుడికి రెండు ఎకరాలు మించి లేదని జగన్ పేర్కొన్నారు.

కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి


కాఫీ తోటలకు రూ.లక్ష చొప్పున చెల్లించండి
విశాఖ: తుపాను ప్రభావంతో భారీగా నష్టపోయిన కాఫీ తోటల రైతులకు రూ.లక్ష చొప్పన చెల్లించాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గిరిజనులు మిరియాలు, కాఫీ తోటలతో ఎకరాకు లక్ష చొప్పున సంపాదిస్తున్నారని.. వారికి హెక్టారుకు రూ. 10 వేలు, రూ.15 వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయాన్నిప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎకరాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలన్నారు. ఒకవేళ రూ.లక్ష చొప్పన పరిహారం ఇవ్వకపోతే అన్యాయం చేసినట్లు అవుతుందని జగన్ స్పష్టం చేశారు. కాఫీ పంటకు ఆధారమైన సిల్వర్ ఓక్ చెట్లు భారీ ఎత్తున కూలిపోయాయని.. మళ్లీ చెట్లు పెరగాలంటే 15 సంవత్సరాలు పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. శనివారం అనకాపల్లి, చోడవరం, మాడుగుల మండలాలల్లో తుపాను కారణంగా నష్టపోయిన బాధిత రైతులను జగన్ పరామర్శించారు. అనంతరం అక్కడ్నుంచి పాడేరులో పర్యటించారు.
 
వర్షంలోనూ తన పర్యటన కొనసాగిస్తున్న జగన్ మోదపల్లి వద్ద దెబ్బతిన్న కాఫీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా  గిరిజనులు వైఎస్ జగన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పంటలు పూర్తిగా నష్టపోయాయని, ఒక్కో చెట్టూ పెరగాలంటే 20 సంవత్సరాల కాలం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఎకరాకు రూ. 1,50 లక్షల వరకూ ఆదాయం వస్తుందని జగన్ కు తెలిపారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. మిరియాలు, కాఫీ పంటల రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ చెట్లు లేకపోతే కాఫీ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని తెలిపారు.ఏ ఒక్క గిరిజనుడికి రెండు ఎకరాలు మించి లేదని జగన్ పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యం


అనంతపురం:మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దౌర్జన్యానికి పాల్పడింది.  జిల్లాలోని తాడిపత్రి మండలం వీరాపురంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పూనుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్న కారణంగానే టీడీపీ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన టీడీపీ మరోమారు అదే దౌర్జన్యానికి ఒడిగట్టింది.

షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్


షుగర్ ఫ్యాక్టరీలను అమ్మేయడం వీళ్లకు మామూలే: వైఎస్ జగన్
విశాఖపట్నం :
సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును వైఎస్ జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు.

తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు 6 కోట్ల రూపాయలు బకాయి పడితే ఇప్పటికి కేవలం 3 కోట్లే ఇచ్చారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏడు నెలల నుంచి కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, ఇప్పుడు  ఈ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా 4 కోట్ల రూపాయలకు ఈ ఫ్యాక్టరీని అమ్మేయడానికి ప్రయత్నాలు చేయగా, అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆయన గుర్తుచేశారు.

బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్


బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
విశాఖ : హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అనకాపల్లి నర్సింగరావు పేటలో ఆయన శనివారం ఉదయం పర్యటించారు. తుఫానుకు ధ్వంసమైన ఇళ్లను వైఎస్ జగన్ పరిశీలించారు. బాధితులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు.  తుఫాను వచ్చి ఏడు రోజులు అయినా ఏ అధికారి తమ వద్దకు రాలేదని ప్రజలు ఈ సందర్భంగా తమ గోడు వెలిబుచ్చారు. తమను పట్టించుకున్న వారే లేరని వారు ఫిర్యాదు చేశారు.

పార్టీని బలోపేతం చేయండి


పార్టీని బలోపేతం చేయండి
నిజామాబాద్ అర్బన్: గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు పార్టీ బాగా ఉండేదని, మళ్లీ ఆ స్థాయికి తెచ్చేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని అన్నారు. రాబోయే 5,6 నెలలలో పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావాలన్నారు.

శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల కేంద్రాలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పా రు. అందుకోసం జిల్లాలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు. గతంలో  పార్టీలో ఉండి ఇప్పుడు స్తబ్ధంగా ఉన్నవారిని, పాత నాయకులను తిరిగి పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించేలా చూస్తామన్నారు. ఇటువంటి నాయకుల జాబితాను  నియోజకవర్గాలవారీగా తయారు చేసి తనకు అందజేయాల ని జిల్లా నాయకులను కోరారు. ముందుగా ఈ నాయకులతో తాను మాట్లాడి, ఆ తర్వాత పార్టీ పెద్దలతో కూడా మాట్లాడిస్తానని చెప్పారు. నెలరోజులో జిల్లాస్థాయిలో ఒక సదస్సును నిర్వహించాలని సూచించారు.

ప్రజా సమస్యలపై స్పందించండి
కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కూలీల సమస్యలపై దృష్టి సారించాలని పొంగులేటి పేర్కొన్నారు. వారి వెన్నంటే ఉంటూ సమస్యల పరి ష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజల కు అందుబాటులో ఉండాలని, వారి అవసరాలను గుర్తించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై నిఘా ఉంచాలన్నారు. వెంటనే పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని, గ్రామగ్రామాన కమిటీలను వేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలోనే కమిటీలను నియమించాలన్నారు.

కమిటీలు చరుకుగా పని చేసేలా తగిన చర్యలు తీసుకోవాల న్నా రు. జిల్లాలోనివారికే పార్టీలో ప్రాధాన్యతనివ్వాల ని, చురుకుగా పనిచేసే వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా కొందరు నాయకులు కోరా రు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని రాష్ట్ర నాయకులు హామీనిచ్చారు. ఈ భేటీలో నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి నాయుడు ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితుడు గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్రపార్టీ నాయకులు కొండారాఘవరెడ్డి, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, నిజామాబాద్ రూరల్ నాయకులు గంగారెడ్డి,సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.


దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం


దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం
  • పురుగులు, రాళ్ల బియ్యం ఇస్తన్నారు
  •  వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ముందు బాధితుల రోదన
  •  కష్టాలు తీరేంతవరకూ పోరాడదామని భరోసా
  •  తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు పర్యటన
  •  మరమ్మతులకు రూ.50 వేలివ్వాలి
  •  కొత్త ఇళ్లు నిర్మించాలి  
  •  ప్రభుత్వానికి జగన్ డిమాండ్
 తల్లీ... మిమ్మల్ని చూసేందుకు ఎవరైనా వచ్చారా..
 ప్రభుత్వ ఉద్యోగి వచ్చి ఏమైనా రాసుకున్నారా?
 ఎవరూ రానేదు బాబూ.. దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం.
 మా బాధలు ఎవరూ పట్టించుకోట్లేదు.
 సాయం ఏదైనా చేశారా తల్లీలేదు బాబూ...అర్ధరాత్రి 12 గంటలప్పుడు పాలు, పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోనారంట. మాలో కొందరు తెచ్చుకున్నారు. కొందరికి దొరకనే లేదు. పురుగులు, రాళ్లతో ఉన్న బియ్యం ఇస్తన్నారు. ఎంత కష్టంలో ఉంటే మాత్రం అలాంటి బియ్యం ఎలా తినాల. మా బతుకులు కుక్కల కంటే హీనంగా ఉన్నాయ్.
 పాలు, పులిహోర బాగున్నాయా అమ్మా..
 అయ్యో.! బాబూ.. పాలు విరిగిపోనాయి..పసోళ్లు ఆకలితో ఏడుస్తుంటే అటూ ఇటూ వెళ్లి పాలు అడిగి తెచ్చుకుంటున్నాం. పులిహోర పాసికంపు కొడుతుంటే తినలేక పారేసినాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బాధితుల మధ్య జరిగిన సంభాషణ ఇది.

 
సాక్షి, విశాఖపట్నం: పెను విపత్తు వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కనీసం ఓదార్పునకు నోచుకోని అభాగ్యుల వద్దకు జగన్ వెళ్లారు. కూలిన ఇళ్లల్లోకి వెళ్లి పరిశీలించారు. వారి కష్టాలు చూసి కన్నీళ్లు తుడిచారు. ఉదయం గాంధీనగర్‌లో జగన్ పర్యటించారు. ‘ఎండలో అలోలచ్చనా అంటూ కాలం గడుపుతున్నాం బాబూ’ అంటూ లక్ష్మమ్మ జగన్‌ను చూడగానే బోరున విలపించింది. మీకు బియ్యం కార్డులు ఉన్నాయా, పింఛన్లు వస్తున్నాయా అని జగన్ ప్రశ్నించగా, కార్డులున్నా ఎవరికీ పింఛన్ రావడం లేదని అక్కడి వారు బదులిచ్చారు. తన భర్త చనిపోయి నెలరోజులు కాకుండానే ఉన్న గూడు కూడా తుపానుకు ఎగిరిపోయిందని, చీకట్లో బతుకుతున్నామని, పాములు వచ్చేస్తున్నాయని గొంతేని మహాలక్ష్మి వాపోయింది.
 
పురుగుల బియ్యం ఇచ్చారు

సాకేతపురం చేరుకున్న జగన్‌కు మాడుగుల అప్పలతల్లి తనకు ప్రభుత్వం ఇచ్చిన బియ్యం తీసుకొచ్చి ‘ఇదిగో బాబూ.. పురుగులు, రాళ్లు ఉన్న ఈ బియ్యం ఇచ్చారు. ఇష్టం లేదంటే పట్టికెళ్లడం మానేయమంటున్నారు. ఏం చేస్తాం.. తప్పని సరై తెచ్చుకుంటున్నాం.’ అని చూపించింది. పొట్నాల వరలక్ష్మి ఇంటికి వెళ్లి కూలిన స్లాబును జగన్ చూశారు. అక్కడి నుంచి స్టీల్‌ప్లాంట్ మీదుగా  ఇస్లాంపేట వెళ్తూ ప్లాంట్ ఉద్యోగులను పలకరించారు. ఇస్లాంపేట్‌లో తుపానుకు కూలిన 150 ఏళ్లనాటి జామియా మసీదును సందర్శించారు.
 
మినార్ పునర్నిర్మాణానికి జగన్ హామీ

మినార్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా తన వంతు సహకరిస్తానని ముస్లింలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మత పెద్దలు సర్ధార్ మాస్టర్, గఫూర్‌మాస్టర్‌లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం జగన్‌కు వినతి పత్రం అందజేశారు. కళాశాలలో శాశ్వత అధ్యాపకులను నియమించాలని, పక్కా ఇళ్లు, మసీదు నిర్మించాలని, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థల్లో స్థానిక ముస్లింలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని తమ తరపున కోరాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి బర్మాకాలనీకి చేరుకుని కాందశీకుల ఇళ్లను పరిశీలించారు.
 
పరామర్శకైనా ఎవరూ రాలేదు

‘తిండి పెట్టకపోయినా పర్లేదు. కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాలేరు. కనీసం పారలు, గునపాలు ఇస్తే మా ప్రాంతాన్ని మేమే శుభ్రం చేసుకుంటామని అడిగినా నగరపాలక సంస్థ వాళ్లు అవి లేవంటున్నారు.’ అని కర్రిరాజు, గోకరకొండ శ్యామల జగన్‌కు తమ పరిస్థితిని  వివరించారు. ముగ్గురు పిల్లలతో రేకుల షెడ్డులో ఉన్నామని, తుపానుకు అదీ పడిపోయిందని రీసు కనకరాజు, పూర్ణ దంపతులు తమ ఇంటిని చూపించారు. డెయిరీ కాలనీలో ప్రజలు తాము డ్రెయిన్ వల్ల పడుతున్న ఇబ్బందులను చూపించారు.

గాజువాక నుంచి సెప్టిక్ ట్యాంకుల్ని ఈ డ్రెయిన్‌లో వదులుతున్నారని, సముద్రం పోటెత్తితే పొంగి కాలనీ మునిగిపోతోందని ఎం.కె.ఎన్.మూర్తి వివరించారు. డ్రెయిన్‌లో ఏటా పూడిక తీయించి, ఇరువైపులా గోడ నిర్మిస్తే కాస్త ఊరట లభిస్తుందనగా, ఆ పని సాధనకు అవసరమైతే ప్రజలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాత్రివేళ 12 గంటలప్పుడు పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోకుండా ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి సాయం చేయాలన్నారు. రూ.పది విలువైన పులిహోర ఇచ్చి సాయం చేసేస్తున్నామనడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ఇంటి మరమ్మతులకు తక్షణమే రూ.50 వేలు ఇవ్వాలి.
 
250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా కొత్త ఇళ్లు నిర్మించాలి. దానికి ఎంత ఖర్చయినా ఎస్టిమేషన్ వేసి కట్టించాలి.’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి అశోక్‌నగర్ చేరుకొని బాధితులను పరామర్శించారు. జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, తలసిల రఘురామ్, సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కోలా గురువులు, చొక్కాకుల వెంకటరావు, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారామ్, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, భాస్కర్‌రెడ్డి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉన్నారు.
 
 లారీ వెనక పరుగు తీశామన్నా
 ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామన్నా. పిల్లలు, ముసలోళ్ల పరిస్థితైతే మరీ దారుణంగా ఉందన్నా. ఎవరైనా వస్తారేమో, సాయం చేస్తారేమో అని ఎదురుచూసినా ఎవరూ రాలేదన్నా. బ్రిడ్జి కింద అది కట్టకముందు నుంచీ ఉన్నాం. మేమెలా ఉన్నామని ఎవరూ పట్టించుకోవట్లేదు. బ్రిడ్జి మీద బియ్యం లారీ వెళ్తుంటే ఆపమని లారీ వెనక పరుగెత్తినా ఆపలేదు.
 -ఆసనాల గౌరి, గాంధీనగర్
 
 ఈ బియ్యం కుక్కలు కూడా ముట్టవు
 మంచి బియ్యం ఇస్తామని గవర్నమెంటోళ్లు ఈ బియ్యం ఇచ్చారు. పురుగులు పట్టేసున్నాయ్. ఇవి ఎవరు తింటారు. వండి పెడితే కుక్కలు కూడా ముట్టుకోవడం లేదు. ఎప్పుడూ ఇవే ఇస్తున్నారు. మా బాధలు వినడానికి నువ్వొక్కడివే వచ్చావ్.
 -బంగారి రాజ్యలక్ష్మి, సాకేతపురం

నేడు జగన్ పర్యటన


నేడు జిల్లాలో జగన్ పర్యటన
విశాఖపట్నం సిటీ: హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శనివారం అనకాపల్లి దరి తుంపాల గ్రామంలో తుపాను బీభత్సానికి పాడైన చెరకు తోటలను సందర్శిస్తారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

పాడేరు దరి మోదపల్లి, ఇరడాపల్లిలోని కాఫీ తోట లు, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని నందివలస ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తారు. తుపాను వల్ల గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని, జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 

5 రోజులుగా చెట్టుకిందే ఉంటున్నాం


* విశాఖ గాంధీనగర్‌లో 100 కుటుంబాల గోడు
* జగన్‌కు మొరపెట్టుకున్న హుదూద్ బాధితులు
* లక్ష కోట్ల బడ్జెటున్నా సాయానికి చెయ్యి రాలేదా?
* టీడీపీ సర్కారు తీరుపై ధ్వజమెత్తిన జగన్
 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ‘‘ఐదు రోజులుగా 100 కుటుంబాల వాళ్లం రోడ్డు పక్కన ఈ చెట్టు కిందే పడి ఉన్నాం. పగలు ఎండలో, రాత్రి చీకట్లో చస్తూ బతుకుతున్నాం. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పక్కనున్న అపార్టుమెంట్లకు వెళ్లి అడుక్కుని వచ్చి పిల్లలకు పెడుతున్నాం. పెద్దలమైతే పస్తులే ఉంటున్నాం. పక్కనున్న ఈ రోడ్డు మీద నుంచే మినిస్టర్లు, అధికారులు వెళ్తున్నారు. మా దగ్గరికి ఒక్కరూ రాలేదు. మేం బతికున్నామో చచ్చామో కూడా చూడటం లేదు. జగన్‌బాబూ! నువ్వైనా వచ్చావు. మాకు కాస్త న్యాయం చెయ్ బాబూ... నీకు పుణ్యం ఉంటుంది’’ ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో విశాఖలోని హుదూద్ తుపాను బాధితులు వ్యక్తం చేసిన ఆవేదన!
 
వై.ఎస్.జగన్ శుక్రవారం విశాఖ ఉత్తర, పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని కంచరపాలెం మెట్టులోని గాంధీనగర్, సాకేతపురం కాలనీ, స్టీల్‌ప్లాంట్, ఇస్లాంపేట, బర్మాకాలనీ, దయాళ్ నగర్  ప్రాంతాల్లో పర్యటించారు.కాలినడకన కలియదిరిగి బాధితులందరినీ పరామర్శించారు. ఈ సందర్భంగా కంచరపాలెం గాంధీనగర్‌కు చెందిన కోలా కాసులమ్మ, ఆసనాల గౌరి తమ గోడును ఆయనతో వెళ్లబోసుకున్నారు. వారి దీనస్థితి చూసి జగన్ చలించిపోయారు.

ప్రభుత్వం వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా బాధితులకు సహాయం చేయడానికి చేయి రావ డం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు. తాత్కాలికంగా పార్టీ తరఫున సాయం చేస్తామంటూ భరోసానిచ్చి వారికి ధైర్యం చెప్పారు. తాగునీటికి కూడా అల్లాడుతున్న మురికివాడలు, రాజకీయ కక్షసాధింపుతో సర్కారు సహాయం నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలోపడిపోయిన ముస్లిం మైనార్టీలు తదితర వేలాదిమంది బాధితులను కూడా జగన్ పలకరించారు. ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడారంటే...
 
బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వెయ్యి కుటుంబాలు ఉన్న కాలనీలోకి రాత్రిపూట లారీల్లో వచ్చి 200 పులిహోర ప్యాకెట్లు విసిరేసి వెళ్లిపోతున్నారు. అది కూడా పాచిపోయి తినేందుకు పనికిరావడం లేదు. రూ.10పులిహోర, రూ.14 అర లీటరు పాలు ఇచ్చేసి... ఏదో సహాయం చేశామన్నట్టుగా ప్రభుత్వం మీడియా స్టంట్లు చేస్తోంది.
 
లక్షలాదిమంది రోడ్డున పడ్డారు. తిండి లేదు. ఇల్లు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పనికీ దిక్కు లేదు.  అల్లాడుతున్నా ఇంతవరకూ ఒక్కరూ పలకరించింది లేదు, దమ్మిడీ సాయం చేసిందీ లేదు. ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ బాధితులు ఇదే మాట చెబుతున్నారు.
 
* ప్రభుత్వం మేల్కోవాలి. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేలివ్వాలి. స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వాలి. బాగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలి. గంటకు 250 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకునేలా అధునాతన పరిజ్ఞానంతో ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఒక్కో ఇంటికి రూ.1.5 అయినా, రూ.2.5 లక్షలైనా భరించాలి.

అచ్చం అమ్మలాగే. ..


అచ్చం అమ్మలాగే. ..
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి వచ్చిన తర్వాత నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్ని అఖిలప్రియ కొనసాగించారు.

ముందుగా ఆమె పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్న నివాసగృహం నుంచి తండ్రి భూమా నాగిరెడ్డి, సోదరి మౌనికారెడ్డి, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డి, మహేశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిశోర్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శోభా ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చే శారు. ఆ సమయంలో భూమా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యూరు.

అనంతరం పట్టణంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయూల్లో అఖిల ప్రియ ప్రత్యేక పూజలు చేశారు. లింగమయ్య వీధిలోని పాత నివాసగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ సోదరి మౌనికారెడ్డి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

కార్యక్రమంలో  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, జయరాం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, భూమా నారాయణరెడ్డి, న్యాయవాది సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 అమ్మ ఆశయాలు నెరవేర్చడానికే...
 అమ్మ దివంగత శోభా నాగిరెడ్డి ఆశయాలు నెరవెర్చడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘అమ్మ లేని లోటు మా కుటుంబానికి, నియోజకవర్గానికి తీర్చలేనిది. ఆమె స్థానంలో పోటీ చేయాల్సి రావడం చాలా బాధాకరం. నన్ను అమ్మ ఆశీర్వాదం, నాన్న, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల బలమే నడిపిస్తుంది.  ఆళ్లగడ్డ ప్రజలు ‘మన అఖిల’ అని అనుకునేలా పనిచేస్తా.

ప్రజలందరూ మా  కుటుంబం వెంట నడుస్తారనే నమ్మకముంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగివున్నాను. అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోని సమస్యలను డెయిరీలో రాసింది. వాటిని పరిష్కరించినప్పుడే అమ్మకు నిజమైన నివాళి. అప్పట్లో అమ్మ ఇచ్చిన హామీలను నెరవెర్చడమే నా ప్రథమ కర్తవ్యం. ఆమె మాదిరే పార్టీ శ్రేణులకు,ప్రజలకు అందుబాటులో ఉంటా’’నని అన్నారు. టీడీపీ పోటీపై విలేకరులు అఖిలను ప్రశ్నించగా... ‘నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతాదృక్పథంతో పోటీ పెట్టలేదు. ఇక్కడ కూడా టీడీపీ పోటీ పెట్టదని భావిస్తున్నాం. పార్టీ తరఫున వేసిన కమిటీ ఈ విషయంపై చర్చిస్తుంద’ని చెప్పారు.

 అఖిల ప్రజల మద్దతు సంపాదిస్తుంది..
  అఖిలప్రియ తప్పకుండా ప్రజల మద్దతు సంపాదిస్తుందనే విశ్వాసం ఉందని ఆమె తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ‘దివంగత శోభా నాగిరెడ్డి తరహాలోనే అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందుతుంది. శోభాలాగానే నియోజకవర్గ ప్రజలకు ‘అమ్మ’ అరుు్య.. ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుంద’ని విశ్వాసం వ్యక్తం చేశారు. మెజార్టీ ఎంత రావచ్చని అనుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘దాని గురించి ఎప్పుడూ ఆలోచించము. ఎంత సేవ చేశామని మాత్రమే ఆలోచిస్తాం. అఖిల ప్రియ ప్రజా సమస్యలను  దగ్గర నుంచి చూసింది. కాబట్టి వాటిని తప్పక పరిష్కరిస్తుంద’ని అన్నారు.

అమ్మానాన్న, ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోటీ..

Written By news on Friday, October 17, 2014 | 10/17/2014

అమ్మ లేని లోటు తీరనిది
హైదరాబాద్: అమ్మ లేని లోటు తీరనిదని భూమా శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ కంటతడి పెట్టారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అఖిల ప్రియ తన తల్లి శోభా నాగిరెడ్డిని స్మరించుకున్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల కోసం పాటుపడతానని, ప్రజల్లోనే ఉంటానని చెప్పారు.

అమ్మానాన్న, ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోటీ చేస్తున్నానని అఖిల ప్రియ అన్నారు. అమ్మ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని చెప్పారు. శోభ మరణంతో ఎన్నిక జరుగుతుండటం బాధాకరమని ఆమె భర్త భూమా నాగిరెడ్డి అన్నారు.  శోభ లేని లోటు భర్తీ చేయడం సులభం కాదని చెప్పారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా అఖిల పనిచేస్తుందని భూమా నాగిరెడ్డి చెప్పారు.

గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.  అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

విశాఖ స్టీలుప్లాంటును సందర్శించిన వైఎస్ జగన్


విశాఖ స్టీలుప్లాంటును సందర్శించిన వైఎస్ జగన్
విశాఖపట్నం : హుదూద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. తుఫాను వల్ల స్టీల్ ప్లాంటుకు జరిగిన నష్టం గురించి అక్కడ పనిచేసే కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అక్కడి నుంచి తుఫాను వల్ల నష్టపోయిన ఇస్లాంపేటను వైఎస్ జగన్ సందర్శించారు. ఆ ప్రాంతంలో తుఫాను కారణంగా కూలిపోయిన మసీదును సందర్శించి, ముస్లిం సోదరులకు ఆయన భరోసా ఇచ్చారు.

సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్


సాకేతపురంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖపట్నం: హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగోరోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని సాకేతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్బంగా వైఎస్ జగన్ కు స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ గాజువాక, స్టీల్ ప్లాంట్, బర్మా కాలనీ, హైస్కూల్ రోడ్డు, అశోక్ నగర్, దయాళ్ నగర్ లలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.

నేడు భూమా అఖిలప్రియ నామినేషన్


నేడు భూమా అఖిలప్రియ నామినేషన్
ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించగా, అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియను అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో అఖిలప్రియ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. కాగా ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు.


ఎన్నికల షెడ్యూలు :
నామినేషన్లు        -  ఈ నెల 14 నుంచి  21వ తేదీ వరకు
పరిశీలన             -   ఈనెల 22న
ఉపసంహరణ       -  ఈనెల 24న
పోలింగ్               -   నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు      -   నవంబర్ 12న

వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం..


వైఎస్సార్ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం..
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోని పది జిల్లాల్లో రెపరెపలాడిద్దాం. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చెద్దాం. ఈ రోజు నుంచి కసిగా పని చేద్దాం. నెంబర్ వన్ పార్టీ స్థాయికి తీసుకెళ్దాం. గతం వదిలెద్దాం. మనలో మనకు విమర్శలు వద్దు. పార్టీ పదవులు తీసుకొద్దాం. ప్రజలకు మద్దతుగా ఉద్యం మిద్దాం. వాటిని అలంకారప్రాయం కానివ్వకుండా పనిచేసుకెళ్దాం. పార్టీ పదవితో ప్రజలు గుర్తించే నాయకులుగా స్థిరపడదాం.

వరంగల్ గడ్డ నమ్మకానికి ప్రతిరూపం అని తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు. అది వమ్ముకాకుండా చూసుకొద్దాం. కష్టాల్లో ఉన్న ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి తమకు అండగా ఉందనే భరోసా నిద్దామని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ సీపీ సమావేశాలు జిల్లా ముఖ్యనాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి.

గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తొలిరోజు వరంగల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. దీనికి వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు జిల్లా నేతలు తమ అభిప్రాయాలను నిర్భయంగా నేతల ముందు ఉంచారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన సూచనల, ఆలోచన ప్రకారమే రాబోయే రోజుల్లో పార్టీ నడుచుకొంటుందన్నారు.

పార్టీలో పదవులు భర్తీ చేయక గుర్తింపులేదని భావించే పక్షంలో ఆ బాధలేకుండా చేస్తాం. త్వరలో జిల్లా పార్టీ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేస్తామన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలో ఎందుకు సక్సెస్ అయ్యాం. మిగతా తెలంగాణ జిల్లాల్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయాం ఆలోచించాలి. గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్నట్లేనని చెప్పారు.

ఖమ్మం జిల్లా పార్టీ చూచి వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు కసిగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలు పట్టుదల పడితే సాధించలేనిది లేదన్నారు. గ్రామం సర్పంచ్‌గా గెలవాలంటే వార్డు మెంబర్‌గా గెలవాలి. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా నెగ్గితే ఎమ్మెల్యే స్థానం నెగ్గటం సులువు అని తెలిపారు. ఖమ్మం 206 గ్రామ పంచాయతీల్లో గెలిచాం. ఆ ప్రభావంతో ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలల్లో నెగ్గాం. జగనన్న ఎంత కష్ట పడిన గ్రామ స్థాయిలో కష్టపడే వ్యక్తులు లేనప్పుడు పార్టీ బిల్డప్ చేయటం కష్టమౌతుందని చెప్పారు.

దివంగత సీఎం వైఎస్సార్ పథకాలను ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటున్నారని తెలిపారు. ఆయన పాలనను నేటి పాలకుల పాలనతో పోల్చుకుంటున్నారని చెప్పారు. గ్రామీణ జనం వైఎస్సార్‌ని దేవుడిగా చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ పై జనంలో ఉన్న అభిమానం, ప్రేమ అందరం కలిసి సోమ్ము చేసుకుందామన్నారు. జిల్లాలోని మెజార్టీ  నియోజక వర్గాల్లో గెలుద్దామని చెప్పారు. పార్టీ కష్టపడే నాయకులది. నాయకులు కష్టపడితే పార్టీ అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు.

మనం మంచి పోరాటాలు చేసి ప్రజల మధ్యలో ఉంటే ఓటరు మంచిగా స్పందిస్తాడు. లక్షల మంది ఖమ్మం ప్రజల్లో నమ్మకాన్ని కల్గించాం. అందుకే నెగ్గామన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యంతో ప్రజల్లో ముద్ర వేసుకోవటంతో అధికారంలోకి రాగలిగాడని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పదవులన్నింటి భర్తీ చేస్తామన్నారు. అవి అలంకారప్రాయం కాకుండా చూచుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ అత్యంత బలం గా ఉంది. వరంగల్ జిల్లా పార్టీ కోహినూర్ వజ్రం లాగా తీర్చిదిద్దుదామని చెప్పారు.

మహబూబ్‌నగర్ నుంచే షర్మిల పరమార్శ యాత్ర చేస్తుందని తెలిపారు. తెలంగాణలో వైసీపీ లేదు అనే వారి ప్రచారాలను తిప్పికొడదామన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని తెలి పారు. సమష్ఠిగా పని చేద్దామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేద్దామని తెలిపారు. విద్యుత్తు సమస్యతో పంటలు ఎండి ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతాంగానికి అండగా నిలుద్దామన్నారు.

మనస్సులో పార్టీ అభివృద్ధే ధ్యాసగా పెట్టుకోవాలని చెప్పారు. ఐక్యతో పని చేసి మహబూబ్‌నగర్ దెబ్బ ఇదని చూపిద్దామన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలు తీసుకొని ఎక్కడిక్కడ పని చేద్దామన్నారు. రాష్ట్ర పార్టీ అన్ని విధాలా అడ్డగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా వైసీపీ నాయకులు సుధీర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, రాజ్‌కుమార్ యాదవ్, విలియం, ఎన్ శాంతకుమార్, బంగిలాల్ నాయక్, రాజయ్య, శంకరాచారి, జె. మహేందర్ రెడ్డి, ఎ.కిషన్, వైసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, గట్టు రామచంద్రరావు, గట్టు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

కొండంత అండ


కొండంత అండ
  • కూలిన ఇళ్లల్లో చితికిన బతుకులకు జగన్ భరోసా
  •  పేరు పేరునా పలకరింపు
  •  కష్టాలు చెప్పుకున్న బాధితులు
  •  తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మూడోరోజు పర్యటన
  •  ప్రభుత్వ అసమర్థతపై ధ్వజం
సాక్షి, విశాఖపట్నం: భవంతులను కూల్చేసే పెను గాలులు.. మునుపెన్నడూ చూడని ప్రకృతి ప్రకోపాన్ని చూసిన ప్రజలు ఆ భీకర భయానక సంఘటన నుంచి తేరుకోలేకపోతున్నారు. ఇళ్లు కూలిపోయి, సర్వస్వం కోల్పోయి, తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లాను హుదూద్ చిగురుటాకులా వణికించి ఐదు రోజులు కావస్తున్నా ఇంత వరకూ కనీసం మంచినీటికి కూడా నోచుకోక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

ఇంతటి కష్టంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించి కాస్త ఓదార్పు నివ్వడానికే ప్రభుత్వానికి, పాలకులకు సమయం సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో తమ బాధలు వినడానికి జగన్ వచ్చాడని తెలిసి జనం తండోపతండాలుగా వీధుల్లోకి వస్తున్నారు. ‘బాబూ మా ఇంటికి రా బాబూ..మా కష్టం ఒక్కసారి చూడు బాబూ’అని అడుగుతున్నారు. కూలిన ప్రతి ఇంటినీ, కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటూ, భాధలు తీరుస్తానని భరోసా ఇస్తూ జగన్ పర్యటన సాగిస్తున్నారు.

హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పర్యటించారు. ఉదయం 9.30 గంటలకు గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి  బయల్దేరిన జగన్ సమీప ప్రాంత ప్రజలతో మాట్లాడారు. తాగడానికి నీరు లేదనివారు చెప్పుకున్నారు. అక్కడి నుంచి వైఎస్సార్ కాలనీకి చేరుకుని కూలిన దోకి అనంతరావు ఇంటిని పరిశీలించారు. మీకు సాయమేదైనా అందిందా అని అక్కడి బాధితులను అడిగారు. ఎవరూ రాలేదని, ఏమీ ఇవ్వలేదని, పనికిరాని పులిహోర ప్యాకెట్లు విసిరేసిపోయారని అక్కడి వారు తమ బాధలు చెప్పుకున్నారు.

ఇల్లుకూలిపోయి కష్టాలు పడుతున్న దేవిపాటి ఉమావతి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించారు. అక్కడి నుంచి  ధర్మాన నగర్ వెళ్లారు. ప్రమాదంలో కాలు పూర్తిగా కోల్పోయిన సుండి భాస్కరరావును పలకరించారు. ఇల్లు కూలి గూడు కోల్పోయిన ధేబుయేన్ దుర్గను చూసిన జగన్ ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. బీఎన్‌ఐటీఎన్ కాలనీ(రైల్వే కాలనీ)కి వెళ్లి కేంద్ర ప్రభుత్వం కూడా బాధితులను పట్టించుకోకపోవడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి సీతమ్మధార వచ్చారు. తిరిగి కాసేపు విరామం అనంతరం తిరిగి పర్యటన ప్రారంభించి బాలయ్యశాస్త్రి లేఅవుట్ వద్ద ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
 
అనంతరం రాజీవ్‌కాలనీ, ఏకేసీ కాలనీల్లో బాధితులను పరామర్శించారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీవీల్లో ప్రసంగాలు ఇవ్వడంతో సరిపెట్టకుండా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రతి ఇంటికి వచ్చి అవసరమైన సరకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘మేం ప్రతిపక్షంలోనే ఉన్నాం తల్లీ..మన ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ ఒక్క నెలలోనే తీర్చుకుందాం. మీకు పక్కా భవనాలు నిర్మించుకుందాం.

ఈలోగా మీకు మంచి జరిగేలా ప్రభుత్వం మెడలు వంచేలా గట్టి ప్రయత్నం చేద్దాం.’అని జగన్ భరోసా ఇచ్చారు. కనీసం నష్టం ఎంతో రాసుకోవడానికి కూడా ప్రభుత్వాధికారులెవరూ రాకపోవడం దారుణమన్నారు. పది రూపాయల పులిహోర ప్యాకెట్లు విసిరేస్తే అవి కూడా తినడానికి పనికిరాకుండా పోతే జనం ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితుల కష్టాలను  వారినే వేదికపై చెప్పమని తెలసుకున్నారు. డి. వెంకటలక్ష్మి అనే డిగ్రీ విద్యార్థిని తమ ఇల్లు నరకానికి నకళ్లుగా ఉన్నాయని జగన్ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో జగన్ వెళ్లి ఆ ఇళ్లను పరిశీలించారు.

అక్కడి నుంచి మల్కాపురం వెళ్లి కాకల్లోవ, జయేంద్రకాలనీ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల్లో పర్యటించారు. అప్పటికే చీకటి పడినప్పటికీ చింతల్లోవలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉంటారని, తమ తరపున చేయాల్సినవన్నీ చేస్తామని అన్నారు. కొత్తగాజువాకలో తుపానుకు దెబ్బతిన్న మసీదును పరిశీలించారు. ముస్లిం సోదరులకు తామెల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.

అక్కడి నుంచి రాత్రి బసకు నగరానికి చేరుకున్నారు. జగన్ పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు,  మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, పిరియా సాయిరాజ్, పార్టీ నేతలు  చొక్కాకుల వెంకటరావు, కోలాగురువులు, తిప్పల నాగిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఐ.హెచ్.ఫరూఖీ, కొయ్య ప్రసాదరెడ్డి, కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
 
నేటి పర్యటన ఇలా
హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శుక్రవారం నగరంలోని సాకేత పురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్‌నగర్, హై స్కూల్ రోడ్, గాజువాక ఏరియాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి పర్యటన ఇలా

హుదూద్ తుపాన్ బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన శుక్రవారం నగరంలోని సాకేత పురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్‌నగర్, హై స్కూల్ రోడ్, గాజువాక ఏరియాల్లో పర్యటించనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(కార్యక్రమాలు) తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రూ.10 పులిహోరతో సరిపెడతారా?


* ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన జగన్
* సాయం చేశామని చెప్పుకొనే ధైర్యం ప్రభుత్వానికి లేదు
* నేడు సాకేతపురం, గాజువాక ప్రాంతాల్లో జగన్ పర్యటన

సాక్షి, విశాఖపట్నం: ‘‘పెద్ద పెద్ద గాలులొచ్చా యి, ఇళ్లు కూలిపోయాయి, సర్వస్వం కోల్పోయి జనం వీధిన పడ్డారు... అయినా వారెలా ఉన్నారని పట్టించుకోవడానికి, ఎంత నష్టంజరిగిందని నష్టం రాసుకోవడానికి కూడా ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. సీఎం చంద్రబాబు మాత్రం పొద్దున్నే టీవీల్లో కనిపించి అదిచేస్తాం.. ఇది చేస్తాం.. అని మాయమాటలు చెబుతున్నారు. నిజానికి ఎక్కడో ఒక లారీలో రూ.10 పులిహోర పాకెట్లు కొన్ని తెచ్చి, దూరం నుంచి విసిరేసి అంతా చేసేశామన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదేనా చిత్తశుద్ధి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై, పాలకులపై ధ్వజమెత్తారు.

మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రతీ ఇంటి దగ్గరకు వచ్చి ఏమేమి ఇస్తారో ఇచ్చి అప్పుడు సగర్వంగా ఎందుకు చెప్పుకోరని ప్రశ్నించారు. ప్రభుత్వం నిజాయితీగా సాయం చేయాలనుకుంటే రూ.లక్షల కోట్లు ఉన్నాయని, కానీ మంచి చేయాలనే ఉద్దేశం ఎవరిలోనూ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏదో చేసేస్తున్నామని ఊరికే కలర్ పూసేసి చెప్పుకుంటున్నారని, ఇలాగే వదిలేస్తే ఎప్పటికీ సాయం అందదని ఆందోళన వ్యక్తంచేశారు. హుదూద్ తుపాను ధాటికి కకావికలమైన విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆయన గురువారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి కొండంత ధైర్యమిచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్నా సహాయం చేయడానికి ముందుంటామని, ప్రతీ కాలనీలోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడతారని చెప్పారు. కొన్ని రోజులు సమయం ఇచ్చి అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే బాధితులందరితో కలిసి రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచయినా మంచి జరిగేలా ప్రయత్నిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ఉదయం గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి ప్రారంభమైన జగన్‌పర్యటన వైఎస్సార్ కాలనీ, ధర్మానగర్, బీఎన్‌ఐటీఎన్ కాలనీ, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఔట్, రాజీవ్ కాలనీ, ఏకేపీ కాలనీ, మల్కాపురం జయేంద్రకాలనీ, కాకర్లలోవ, చింతల్లోవ, కొత్త గాజువాక ప్రాంతాల మీదుగా సాగింది. ఆయన శుక్రవారం సాకేతపురం, స్టీల్‌ప్లాంట్, బర్మా కాలనీ, అశోక్‌నగర్, దయాళ్ నగర్, హైస్కూల్ రోడ్డు, గాజువాక ల్లో  పర్యటిస్తారు.

అడుగడుగునా కష్టాలు తెలుసుకుంటూ...
వైఎస్సార్ కాలనీలో ప్రజల అవస్థలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. గండి రాములమ్మ, మీసాల రాజేశ్వరి, నారాయణమ్మ అనే మహిళలు తమ పాకలు ఎగిరిపోయాయని, ఇంతవరకూ ఎవరూ తమని చూడడానికి కూడా రాలేదని విలపించారు. ఏమైనా ఇచ్చారా తల్లీ? అని జగన్ ప్రశ్నించగా... పనికిరాని పులిహోర ప్యాకెట్లు ఇచ్చారని వారు బదులిచ్చారు.

ఇళ్లు కూలిపోయి నడిరోడ్డున పడ్డ నాస రామయ్య, నడిపూడి చంద్రరావు, నాగేశ్వరరావులను జగన్ పరామర్శించారు. అన్నయ్యా... ఇల్లు పోయింది, పిల్లలతో దిక్కులేని వాళ్లమయ్యామని సియాద్రి మాధురి తన గోడు చెప్పుకుంది. ఇల్లు మొత్తం పడిపోయిందని, పింఛను కూడా రావడం లేద ని, పోలియో వచ్చిన కొడుకుతో అవస్థలు పడుతున్నానని గొడ్డు అప్పారావు తన దుస్థితిని వివరించారు. నిరాశ్రయులైన వారందరినీ జగన్ పేరు పేరునా పలకరించి ఓదార్పునిచ్చారు. అక్కడనుంచి రైల్వే కాలనీలో క్వార్టర్స్ దుస్థితిని పరిశీలించి... ‘సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్ల పరిస్థితే ఇట్లుంది’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ప్రతీ చోట ఓపిగ్గా గంటల తరబడి జనం కష్టాలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ జగన్ ముందుకు కదిలారు. వెళ్లిన ప్రతీచోట ఎవరైనా వచ్చారా?  సాయమేదైనా చేశారా? అని ఆరా తీశారు. ఇంతవరకూ తామున్నామో పోయామో పట్టించుకోవడానికి కూడా ఎవరూ రాకపోయినా మీరు మాత్రమే వచ్చారని ప్రజలు బదులిచ్చారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు బాధితులకు సాయమందించడానికి వైఎస్సార్ పార్టీ శ్రేణులు ఆహార సరుకులు టన్నుల కొద్దీ తీసుకువచ్చి జగన్ సమక్షంలోనే పంచిపెట్టారు. కొత్త గాజువాక చేరుకొనే సరికి రాత్రి ఎనిమిది గంటలు కావస్తున్నా జగన్ అక్కడ కూలిపోయిన మసీదును సైతం పరిశీలించి ముస్లిం సోదరులకు అండగాఉంటానని ధైర్యమిచ్చారు.

మంచి చేస్తే మద్దతు


* వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మంచి చేస్తే తమ పార్టీ తరఫున బేషరతుగా మద్దతు ఇస్తామని కానీ, వారికి నష్టం చేసే కార్యక్రమాలు చేపడితే మాత్రం ఉద్యమిస్తామని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.

ప్రజలను ప్రభుత్వం కష్టాలపాలు చేస్తే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని హెచ్చరించారు. కేంద్ర కార్యాలయంలో గురువారం నుంచి పార్టీ తెలంగాణ జిల్లాల సమావేశాలు ప్రారంభమయ్యాయని, తొలిరోజు మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల సమావేశాలు జరిగాయన్నారు. పార్టీ బలోపేతంపై నేతలు, కార్యకర్తలతో చర్చించామన్నారు. ప్రజలను కేసీఆర్ మోసపూరిత మాటలతో నమ్మించడం వల్లే 2014 ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఓడిపోయిందన్నారు.

వంద రోజుల పాలనలో ఏమీ చేయలేకపోయానని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, జూన్ 2న ప్రమాణస్వీకారం చేసిననాడే పంటలకు 7 గంటల విద్యుత్ ఇవ్వలేనని చెప్పి ఉంటే రైతులు ఇంతగా నష్టపోయేవారు కాదని, దాదాపు 250 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడేవారు కాదని పొంగులేటి పేర్కొన్నారు.
 
షర్మిల స్టార్ కాంపెయినర్
మీడియాలో షర్మిలపై వస్తున్న వార్తలు నిజంకాదని, ఆమె పార్టీ స్టార్ కాంపెయినర్ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. 2 ప్రాంతాలకు ఆమె సేవలు ఉపయోగపడతాయని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు సందర్భానుసారం ప్రజల్లోకి వస్తారన్నారు. జిల్లా టూర్ పూర్తిచేసి పార్టీకి ఓ రూపు వచ్చిన తర్వాత షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు.

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం

Written By news on Thursday, October 16, 2014 | 10/16/2014

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చారు. ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు వారీ నిర్ణయం తీసుకున్నారు.

హుదూద్ తుపాను బాధితులకు సహాయం అందించేందుకు వైఎస్సార్ ఫౌండేషన్, ‘సాక్షి’ సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తొలి విరాళాన్ని ప్రకటించారు. తన వంతుగా ఆయన రూ. 50 లక్షల విరాళాన్ని బుధవారం ప్రకటించారు.

బాబు పదేపదే టీవీల్లో కనిపించడానికే చూస్తున్నారు

'బాబు పదేపదే టీవీల్లో కనిపించడానికే చూస్తున్నారు'
విశాఖ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం విశాఖలోని ఏకేసీ, ఏఎస్సీసీ కాలనీల్లో హుదూద్ తుపాన్ బాధితుల్ని పరామర్శించిన జగన్.. చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పదే పదే టీవీల్లో కనిపించడానికే పరిమితం అవుతున్నారని విమర్శించారు. బాధితులకు ఏమీ చేయకుండా ఏదో చేసినట్లు కలర్ పూసి మాయ చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. తమ వద్దకు ఎవరూ రాలేదని తుపాను బాధితులు ఏకరువు పెట్టడంపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపొట్లాలను పంచే క్రమంలో బాధితులంతా లారీ దగ్గరకు వెళితే.. ఆ పొట్లాలను విసిరివేయడాన్ని తప్పుబట్టారు. అసలు బాధితులను ఆదుకోవాలంటే ఎంతైనా చేయొచ్చని జగన్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లతో నడుస్తున్నప్పుడు తుపాను బాధితులపై శ్రద్ద వహించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇళ్లు పైకప్పులన్నీ ఎగిరిపోయి నిరాశ్రయులగా ఉన్న తమ వద్దకు ఎవరూ రాలేదని బాధితుల గోడు వెళ్లబోసుకున్నారని జగన్ పేర్కొన్నారు. బాధితులకు నిజంగా చేయాలనే ఉద్దేశం ఎవ్వరికీ కనిపించడం లేదన్నారు.తుపాను ప్రభావంతో నష్టపోయిన వారికి పూర్తి స్థాయి పరిహారం అందజేయాలని.. అప్పటివరకూ తమ పోరాటాన్ని విశ్రమించమని స్పష్టం చేశారు. 

ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు

ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదువీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలు మాని బాధల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు విలువైన సమయాన్నంతా సమీక్షలు, మీడియా ముందు ఉపన్యాసాలకే కేటాయిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని, ప్రధాని మోడీ ఫోన్ చేసేవరకూ చంద్రబాబు విశాఖ ఎందుకు వెళ్లలేదని అంబటి ప్రశ్నించారు.

హుదూద్ తుఫాను బాధితుల కోసం వైఎస్ఆర్ ఫౌండేషన్ , సాక్షి సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిధికి అందరూ విరాళాలు అందించాలని అంబటి కోరారు. వైఎస్ఆర్ సీపీని ఉద్దేశించి ఓ పత్రిక సంబంధం లేని కథనాలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ పత్రిక ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనాలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అంబటి స్పష్టం చేశారు.

వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ


వరద బాధితులకు వైఎస్ జగన్ సాయం పంపిణీ
విశాఖపట్నం :
హుదూద్ తుఫానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖపట్నంలోని ధర్మానగర్ ప్రాంతంలో తుఫాను బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో సేకరించిన సహాయ సామగ్రి విశాఖపట్నానికి చేరుకుంది.

ఆ సామగ్రిని బాధితులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. గత రెండు రోజులుగా విశాఖలోనే ఉండి, తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న వైఎస్ జగన్, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏవేం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ మేరకు వారందరికీ సహాయం అందేలా ఇటు పార్టీ వర్గాలతోను, అటు స్వచ్ఛంద సంస్థలతోను సమన్వయం చేస్తున్నారు.

తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్


తాటిచెట్లపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్
విశాఖ : విశాఖలో హుదూద్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడోరోజూ పర్యటిస్తున్నారు. ఆయన గురువారం ఉదయం తాటిచెట్లపాలెంలో పర్యటించిన బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.అలాగే ధర్మనగర్ లో తుఫాను బాధితులను ఆయన పరామర్శించారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని వైఎస్ఆర్‌ సీపీ శ్రేణులకు వైఎస్ జగన్  పిలుపునిచ్చారు.

తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం

ప్రజలతో కలసి రోడ్లపైకొస్తాంబుధవారం విశాఖపట్నం పెదజాలరి పేటలో జగన్ కు గోడు చెప్పుకుంటున్న మహిళలు
తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేవరకు పోరాడతాం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి
 
తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి
తుపాను వచ్చి నాలుగు రోజులైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో
ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు
సమీక్షలతో కాలయాపన తప్ప సహాయ చర్యలు చేపట్టనే లేదు
చిత్రాన్నం పెట్టి పేదలను గాలికి వదిలేశారు..
ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?
విశాఖపట్నంలో తుపాను బాధితులకు జగన్ పరామర్శ
మత్య్యకారులతో మమేకం.. కొండలు ఎక్కిమరీ బాధితులకు భరోసా

 
విశాఖపట్నం : తుపాను బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని, లేదంటే ప్రజలతో కలిసి రోడ్ల పైకొచ్చి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హెచ్చరించారు. ‘‘తుపానుతో ఛిన్నాభిన్నమైన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. లక్షలాదిమంది మత్స్యకారులకు బతుకుదెరువైన ఈ వృత్తిని కాపాడాలి. తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి. సోనా బోటుకు రూ.25 లక్షలు, ఫైబర్ బోట్‌కు రూ. 2.50 లక్షలు పరిహారం ఇవ్వాలి.  దెబ్బతిన్న బోట్ల మరమ్మతులకు రూ.50 వేలు, వలలకు రూ.25 వేలు ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హుదూద్ తుపానుతో అల్లకల్లోలమైన విశాఖపట్నంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించారు. తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ఫిషింగ్ హార్బర్, జాలరిపేట, చినగదిలి, పెదగదిలిలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. సర్వం కోల్పోయిన మత్స్యకారులు, పేదల బాధలను చూసి చలించిపోయారు. ప్రభుత్వ సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని బాధితులు వివరించారు. జగన్‌ను పట్టుకొని కన్నీటిపర్యంతమయ్యారు. దాంతో జగన్ తీవ్ర ఆవేదన చెందారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. ‘తుపాను వచ్చి నాలుగు రోజులైంది.

కానీ  క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్నది ప్రభుత్వం ఇంతవరకు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. సమీక్షలతో కాలయాపన తప్ప సహాయ చర్యలు చేపట్టనే లేదు. అసలు ఎంత నష్టం వచ్చింది? ఎన్ని బోట్లు మునిగిపోయాయి? ఎన్ని దెబ్బతిన్నాయి? ఎన్ని ఇళ్లు కూలిపోయాయి? ఎంతమంది రోడ్డున పడ్డారు అని తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా రాలేదు. ఏదో చిత్రాన్నం పెట్టి పేదలను గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. ‘‘కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఆ బాధ్యతను ప్రభుత్వం నెరవేర్చడంలేదు. బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. ప్రభుత్వం పనిచేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. ప్రజలతోపాటు ప్రభుత్వాన్ని మేమూ నిలదీస్తాం. అవసరమైతే ప్రజలతో కలసి రోడ్లపైకి వస్తాం. ధర్నాలు చేస్తాం. ప్రతి బాధితుడికీ న్యాయం జరిగేవరకు గట్టిగా  పోరాడతాం’’ అని చెప్పారు.

కాలి నడకన.. కొండలు ఎక్కి..

జగన్ బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకార గ్రామాల్లో కాలినడకన బాధితుల వద్దకు వెళ్లారు. పెద జాలరిపేటలో ఇసుకలో నడిచి వెళ్లారు. చిన గదిలి, పెద గదిలిలో కొండలెక్కి మరీ బాధితుల చెంతకు వెళ్లారు. హుదూద్ తుపానుకు దెబ్బతిన్న బోట్లు, పడవలు, వలలు, ఇళ్లు, చెల్లాచెదురైన సామాన్యుల జీవితాన్ని దగ్గరకు వెళ్లి మరీ చూశారు. దాదాపు 40 వేల మంది మత్స్యకారులకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్ మొత్తం కలియదిరిగారు. అక్కడ ఎండుచేపలు విక్రయించే అప్పాయమ్మ, సత్యవతి, కుశలమ్మలను పలకరించి వారి బాధను తెలుసుకున్నారు.

ఫిషింగ్ హార్బర్ జంక్షన్ వద్ద భారీగా చేరిన మత్స్యకారులతో మాట్లాడారు. అక్కడి నుంచి నేరుగా పెద్ద జాలరిపేటకు చేరుకున్నారు. జాలరిపేట ముఖద్వారం వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన మహిళల వద్దకు వెళ్లి  ఆప్యాయంగా పలకరించారు. కూలిన ప్రతి ఇంటిని చూశారు. ప్రతి బాధిత కుటుంబాన్ని పలకరించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. జగన్ అక్కడి నుంచి సముద్రతీరం వరకు దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అక్కడ కుప్పకూలిన ఇళ్లు, పాడైపోయిన బోట్లు, వలలు, మోటారు ఇంజన్లు వరుసగా పడి ఉండటం ఆయన మనసును కలచివేసింది.

ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి దాదాపు 3 వేల మంది బాధితులతో మాట్లాడారు. వారి బాధలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జగన్ జాలరిపేటలోనే గడిపి బాధితులకు సాంత్వన చేకూర్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సాయంత్రం ఆయన పెదగదిలి, చినగదిలిలోని కొండ ప్రాంతాల్లో పర్యటించారు. కాలినడకన కొండలను ఎక్కి మరీ బాధితుల చెంతకు వెళ్లారు. ఏటవాలు ప్రాంతాల్లో, కొండ చరియల్లో ఉన్న ఇళ్లకు కూడా వెళ్లి తుపాను మిగిల్చిన నష్టాన్ని కళ్లారా చూశారు. తుపాను వచ్చి నాలుగు రోజులైనా తమ వద్దకు ఏ ఒక్క ప్రజాప్రతినిధిగానీ అధికారిగానీ రాలేదని అక్కడివారు చెప్పారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని తెలుసుకుని జగన్ ఆవేదనకు గురయ్యారు. వారి తరపున పోరాడతానని చెప్పారు. బధిరులైన కర్రి భవాని, కందెల లక్ష్మిలను పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, గొల్ల బాబూరావు, తలశిల రఘురాం, విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ నేతలు కోలా గురువులు, వంశీకృష్ణ, చొక్కాకుల వెంకటరావు, కర్రి సీతారాం, ఉమాశంకర్ గణేష్, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజ య్‌ప్రసాద్, పిరియా సాయిరాజ్,  సత్తి రామకృష్ణారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి ఉన్నారు.
 
ఇప్పుడు మాకేం మిగల్లేదు
‘ఈ సోనా బోట్లే మా బోటోల్లకి బతుకుదెరువు. ఇలాంటివి 58 బోట్లు మునిగిపోనాయి. మరో 400 బోట్లు దెబ్బతిన్నాయి. మొత్తం నష్టపోనాం. ఒక్కో బోటు పాతిక లక్షలు చేస్తాది. ఒక్కో బోటు మీద పది కుటుంబాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు మాకేం మిగల్లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని మత్స్యకారుడు, సోనా బోట్ యజమానుల అసోషియేషన్ అధ్యక్షుడు పీసు అప్పారావు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘మీ కు అండగా నేనుంటాను. మీ తరపున పోరాడతాను. న్యాయం జరిగే వరకు తోడుంటా ను’ అని జగన్ వారికి భరోసా ఇచ్చారు.

మమ్మల్ని గాలికొదిలేశారు

‘ చూడు బాబు నా ఇల్లు ఎలా కూలిపోనాదో. మాయదారి గాలివానతో నాలుగు రోజులుగా బయటే పడున్నా. ఎవ్వరూ రాలేదు. ఓట్లు అడకగానికి ఆరోజు అంతా వచ్చారు. ఈరోజు అధికారం వచ్చాక మమ్మల్ని గాలికొదిలేశారు’ అని జాలరిపేటలోని తెడ్డమ్మ అనే మత్స్యకార మహిళ జగన్‌తో తన బాధను చెప్పుకుని గొల్లుమం ది. ఆమె ఆవేదన విన్న జగన్.. ‘అమ్మా! అధికారంలో ఉన్నవాళ్లు వారి బాధ్యత నెరవేర్చడంలేదు. వాళ్లను అడిగే హక్కు మీకుంది. మీతో కలిసి నేనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాను. మీకు కొత్త ఇళ్లు వచ్చేవరకు పోరాడతాను’ అంటూ ధైర్యం చెప్పారు.

Popular Posts

Topics :