26 October 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు: మిథున్ రెడ్డి

Written By news on Saturday, November 1, 2014 | 11/01/2014


రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు: మిథున్ రెడ్డి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. భూటకపు హామీలతో రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. రుణాలు మాఫీ కాకపోవడంతో ఇప్పటికే చాలా మంది రైతులు డీఫాల్టర్స్ అయ్యారని మీడియాతో మిథున్ రెడ్డి అన్నారు. 

బ్లాక్ మెయిల్ కు పాల్పడేది ఎవరో ప్రజలకు తెలుసు


విశాఖపట్నం: కోల్డ్ స్టోరేజి, డార్క్ రూమ్ లో ఉండే నాయకులు ఎవరో జిల్లా ప్రజలకు తెలుసునని విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందే నాయకులు ఎవరో కూడా ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. 
 
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. రాష్ట్రంలో ఏ నాయకుడు తిరగని, వెళ్లని ప్రాంతాలకు వైఎస్ జగన్ వెళ్లారు. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అని అమర్నాథ్ అన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి విముక్తి చేయడంతో జిల్లాలో పార్టీకి మంచి రోజుల వచ్చాయని కార్యకర్తలు చెబుతున్నారని ఆయన తెలిపారు. 
 
వైఎస్ విజయమ్మను విశాఖ నుంచి నిలబెడితే మూడు జిల్లాలో పార్టీ విజయవకాశాలు పెరుగుతాయని అన్నవారిలో మీరు కూడా ఉన్నారనే విషయం మర్చిపోయారా అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు. 

బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం


బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం
హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. శనివారం హైదరాబాద్ లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ...  ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయాత్నంలో భాగంగానే భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. మీ తప్పులను వేలేత్తి చూపిన మా పార్టీ వారిపై అక్రమకేసులు బనాయిస్తారా?  ఇది రాక్షసపాలన కాక మరేమంటారని వెల్లడించాలని అధికార టీడీపీని డిమాండ్ చేశారు.
ఒక విద్యార్థి మృతికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు సిద్దార్ద కారకుడంటూ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా అని జ్యోతుల నెహ్రు సూటిగా ప్రశ్నించారు. అయినా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదని చంద్రబాబును ఉద్దేశించి జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు.

తప్పుడు కేసులెన్ని పెట్టినా బెదరను: భూమా


తప్పుడు కేసులెన్ని పెట్టినా బెదరను: భూమా
నంద్యాల: పోలీసులపై తెలుగుదేశ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు మాత్రం స్వచ్ఛందంగా కేసు నమోదు చేశామని కొత్త వాదన వినిపిస్తున్నారని భూమా అన్నారు.

తనను, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసులు బనాయించారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా.. నేను బెదరను అని నాగిరెడ్డి అన్నారు. ప్రజలు, అభివృద్ధి కోసం ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా..ధైర్యంగా ఎదుర్కొంటానని భూమా నాగిరెడ్డి అన్నారు.

ఈ నెల 5న నిరసన కార్యక్రమాలు


కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 5న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొన్నాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం కర్నూలులో విజయసాయిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... టీడీపీ ఎన్నికల ముందు ప్రజలకు హమీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక... ఆ హమీలను తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో టీడీపీ పాలనను ఎండగడతామని తెలిపారు. నంద్యాలలో స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు.
 

హిస్టరీని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలి

హిస్టరీ అన్నది ఎంత అవసరమో చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన జాతీయ పతాకావిష్కరణ చేసి ప్రసంగించారు. త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఆయన ఏమన్నారంటే..

''రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందరో త్యాగాలు చేయడంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అప్పటినుంచి ఇప్పటివరకు నవంబర్ 1 అనే తేదీ ఎప్పుడొచ్చినా ఎందరో త్యాగమూర్తులు గుర్తుకొస్తారు. వాళ్ల త్యాగాలు గుర్తుకొస్తాయి. తెలుగువాళ్లు ఎక్కడున్నా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన విషయం గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది. తెలంగాణ మాత్రమే జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దానికి జూన్ 2 అవతరణ దినోత్సవం అంటే అర్థం ఉంది. కానీ, ఆరోజే ఆంధ్రప్రదేశ్ అవతరించింది అనడం అర్థరహితం. మధ్యప్రదేశ్, బీహార్, యూపీ రాష్ట్రాలలో ఎవరూ అవి ఏర్పడిన తేదీలను మార్చలేదు. కానీ ఇక్కడ మాత్రం చంద్రబాబు ఏ ఉద్దేశంతో చేశారో తెలియట్లేదు.

హిస్టరీ అనవసరమైన సబ్జెక్టని చంద్రబాబు అంటూ ఉంటారు. కానీ హిస్టరీ అన్నది ఎంత అవసరమో ఆయన ఇప్పటికైనీ గమనిస్తే త్యాగాలు చేసినవారిని గుర్తించినట్లు అవుతుంది. చంద్రబాబు తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి. నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యాన్ని గుర్తించాలి. లేదంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినంగా ప్రకటిస్తాం'' అని వైఎస్ జగన్ చెప్పారు.

పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు


నవంబర్ 1నే రాష్ట్రావతరణ వేడుకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నేతల స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర సాధనకు అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించడమే సముచితమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రావతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించడం దురదృష్టకరమని, దీనిని పార్టీ ఖండిస్తోందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. తమ పార్టీ రాష్ట్రావతరణ వేడుకలను నవంబర్ ఒకటవ తేదీనే జరుపుకుంటుందని చెప్పారు.

ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ వేరుపడినప్పటికీ మధ్యప్రదేశ్ అంతకు మునుపు జరుపుకునే తేదీనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. జార్ఖండ్ నుంచి వేరు పడిన  బీహార్, ఉత్తరాఖండ్ నుంచి వేరుపడిన ఉత్తరప్రదేశ్ అంతకుముందు జరుపుకున్న తేదీలనే రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటున్నాయని తెలిపారు.

ఈ సంప్రదాయాలనే ఏపీ పాటించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ రెండో తేదీన రాష్ట్రావతరణ వేడుకలు జరపాలన్న నిర్ణయం చేయడమంటే వారు రాష్ట్ర విభజనకు అంగీకరించారని భావించాలన్నారు. సమైక్యంగా ఉండాలని కోరుకున్న తమ పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో శనివారం రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు.

నేడు వేడుకలో జగన్‌మోహన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించే రాష్ట్రావతరణ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ తెలియజేసింది.

జీవితాంతం వైఎస్ కుటుంబం వెంటే


విష ప్రచారానికి స్వస్తి పలకాలి
సాక్షి, కడప :
 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో స్వయాన అధ్యక్షుడే కార్యకర్తలపై దాడికి దిగబడే సంసృ్కతి కొనససాగడం.....కుర్చీలతో సమావేశాల్లో కొట్టుకోవడం లాంటి సంఘటనలు కొదవ లేదని...కానీ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ  కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని....అలాంటి వైఎస్సార్ జిల్లాలో ఉన్న నాయకులపై టీడీపీ, కొన్ని పత్రికలు పనిగట్టుకుని విష ప్రచారాన్ని చేస్తున్నాయని, ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ది చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, మైదుకూరు ఎమ్మెల్యే  రఘురామిరెడ్డి కుమారుడు నాగిరెడ్డి సమక్షంలో అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గురువారం కడపలో కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగితే సమావేశానికి రాలేదని కొందరి పేర్లను ఎత్తి చూపుతూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించడం దురదృష్టకరమన్నారు.

ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అనారోగ్య కారణంగా సమావేశానికి రాలేక పోతున్నానని...మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా గొంతులో సమస్య ఏర్పడిందని ముందే చెప్పినట్లు అమర్ వెల్లడించారు. అంతేకాకుండా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అమెరికాలో ఉన్న ఫలితంగా రాలేకపోయారని ఆయన వివరించారు. అంతేకాకుండా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి సౌత్ ఆఫ్రికాకు వెళ్లారని, ఈ నేపధ్యంలోనే రాలేదని అమర్‌నాథ్‌రెడ్డి వివరించారు. చిత్తూరులో కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని మిథున్‌రెడ్డికి సంబంధించిన కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయడంతోపాటు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విషయం మీడియాకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగినా పార్టీ మారుతున్నట్లు దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేవలం మైండ్ గేమ్ ఆడుతూ....పార్టీని దెబ్బతీయడానికి కొన్ని దుష్టశక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు వరుస కట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో అక్కడ టీడీపీ ఖాళీ అవుతోందని ఆయన జోస్యం చెప్పారు., ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డి, అల్లుడు జయసింహారెడ్డిలు సమావేశానికి హాజరైనా ఆ మీడియాకు ఎందుకు కనబడలేదని ఆయన ప్రశ్నించారు.

అలాగే రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు వారివారి నియోజకవర్గాల్లో అత్యవసర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ముందుగానే ఆలస్యంగా వస్తామని సమాచారం ఇచ్చారని, ఇంతలోపే టీవీలలో స్కోరింగ్‌లు పెట్టి దుష్ర్పచారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ర్ట కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  వైఎస్ జగన్ దయవల్లే పదవి....జీవితాంతం రుణపడి ఉంటా! : జెడ్పీ చైర్మన్
 వైఎస్సార్‌జిల్లాలో ఎవ్వరికీ తెలియని తనను ఈరోజు జిల్లాలో ప్రథమ పౌరుడిగా నిలబెట్టి...జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి పదవిని కట్టబెట్టి హోదా కల్పించిన అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం వెంటే నడుస్తానని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి స్పష్టం చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోసేందుకు కొన్ని పత్రికలు, నాయకులు అదే పనిగా పనిచేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సమావేశానికి రాలేక పోతున్నానని ముందే అధ్యక్షులకు ఫోన్ చేసి చెప్పినట్లు గూడూరు రవి తెలియజేశారు.

జీవితాంతం వైఎస్ కుటుంబం వెంటే తన రాజకీయప్రయాణమని, వార్తను రాసేముందు యాజమాన్యాలు ఆలోచించి ప్రచురించాలని సూచించారు. భారీ వర్షాల రాకతో పంటను విత్తుతున్నానని, అయితే మీడియా చేసిన దుష్ర్పచారంతోనే విత్తనాన్ని సైతం వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీని వదిలిపెట్టి వలస పోతున్నట్లు పత్రికల్లో రాయడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు.
 
 అమెరికాలో రఘురామిరెడ్డి :
 కుమారుడు నాగిరెడ్డి

 మైదుకూరు ఎమ్మెల్యే, తండ్రి అయిన రఘురామిరెడ్డి అమెరికాకు వెళ్లారని, అందువల్ల సమావేశానికి రాలేక పోయినట్లు కుమారుడు శెట్టిపల్లె నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదని మీడియా ప్రతినిధులు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్‌జగన్ నాయకత్వంపై పూర్తి స్థాయి నమ్మకముందని, ఎప్పుడూ కూడా వైఎస్ కుటుంబం వెంటే నడుస్తానని ఆయన వివరించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు తమ కుటుంబానికి చాలా బాధ కలిగించాయని, ఏదైనా రాసేముందు ఒకసారి వివరణ తీసుకుంటే బాగుంటుందని ఆయన వివరించారు.

ఆ పాపం ఇద్దరిదీ : మైసూరారెడ్డి


ఆ పాపం ఇద్దరిదీ : మైసూరారెడ్డి
టీ, ఏపీ ప్రభుత్వాలపై మైసూరా ధ్వజం

సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోవడంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాపమూ ఉందని  మైసూరారెడ్డి శుక్రవారం దుయ్యబట్టారు. రాయలసీమకు కేటారుుంచిన నికర జ లాలు వచ్చేలా చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రాజెక్టు నీటిమట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే రాయలసీమకు నీటి విడుదల సాధ్యం కాదని తెలిసీ.. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 నుంచి 860 అడుగులకు పడిపోయేంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిందని చెప్పారు. రాయలసీమ పేరుతో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్న మాటలన్నీ చిత్తశుద్ధి లేనివేనని మైసూరారెడ్డి విమర్శించారు.

రేపు ప్రాజెక్టు సందర్శన
వాస్తవాలు బహిర్గతం చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళుతుందని మైసూరారెడ్డి చెప్పారు.

ప్రజాస్వామ్యం.. అపహాస్యం

ప్రజాస్వామ్యం.. అపహాస్యం
అధికార పార్టీ నైజం మరోసారి బయటపడింది. ఓ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను వినిపించే ప్రయత్నం చేయడమే ఆయన తప్పయింది. నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజలు పట్టం కట్టినా.. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందనే అండతో టీడీపీ దౌర్జన్యకాండకు తెగబడింది. ఎమ్మెల్యే మాట్లాడితే వినాల్సిన పని లేదన్నారు.. మున్సిపల్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగిసిందని ప్రకటించేశారు.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించబోయిన వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్లు ఒంటికాలిపై లేచారు.

రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటి.. పర స్పరం కొట్టుకునే వరకు వెళ్లడంతో ఇరు పార్టీలకు చెందిన నలుగురు కౌన్సిలర్లు గాయపడ్డారు. గొడవకు కారణమైన టీడీపీ నేతలే.. పరిస్థితిని అదుపు చేయబోయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. మరి నంద్యాలలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా.. లేనట్టా? టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి.
 

 సాక్షి ప్రతినిధి, కర్నూలు:
     ఒకవైపు తెల్లారితే వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం!
     పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ వచ్చి జిల్లా కమిటీని ప్రకటించడంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతుండటం!!
     మరోవైపు జిల్లావ్యాప్తంగా లక్షలాది ఫించన్లు, తెల్లరేషన్ కార్డుల తొలగింపుతో ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత!
     }Oశెలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854కు చేరుకుంటుండటంతో జిల్లాలో ఏకంగా లక్షా 20 వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయే దుస్థితి!!
     అధికారం అండతో రెచ్చిపోతున్న తెలుగు ‘తమ్ముళ్ల’ దెబ్బకు రోజురోజుకీ క్షీణిస్తున్న పార్టీ ప్రతిష్ట!!!

 వెరసి ఎలాగైనా జిల్లాలో రోజురోజుకీ బలపడుతున్న వైఎస్సార్‌పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటున్న భూమా నాగిరెడ్డిని అరెస్టు చేయడం ద్వారా మానసికంగా వైఎస్సార్ శ్రేణులను కుంగదీసేందుకు నంద్యాల పురపాలక సంఘం సమావేశాన్ని అధికార పార్టీ వేదిక చేసుకుంది. ఇందుకోసం మొదటి నుంచీ ప్రణాళిక బద్ధంగా, పక్కాగా స్కెచ్ వేసి పావులు కదిపింది. ఏకంగా ఎమ్మెల్యేపై హత్యాయత్నం, దాడి కేసులను పెట్టి అరెస్టుకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అధికార పార్టీ నంద్యాలలో హైడ్రామాను నడిపించింది.

 స్కెచ్ నడిపారిలా...!
 నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో ఎజెండాలోని అంశాలను చైర్‌పర్సన్ సులోచన చదివి వినిపించి మమ అనిపించారు. ఇదేసమయంలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రయత్నించగానే తమ పథకాన్ని అమలు చేయడం అధికార పార్టీ షురూ చేసింది. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదంటూ టీడీపీ సభ్యులు దూకుడు ప్రదర్శించారు. ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.... గేట్లు వేయాలని టీడీపీ సభ్యులను ఉద్దేశించి సైగ చేశారు.

ఇదే సమయంలో ఇరు పార్టీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇక్కడే అధికార పార్టీ తన కుటిల నీతిని ప్రదర్శించింది. భూమా సైగ చేసినందువల్లే గొడవ జరిగిందంటూ ఏకంగా ఆయనపై హత్యాయత్నం, దాడి కేసు బనాయించింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను ఉసిగొల్పింది. ఇందులో భాగంగానే ఎస్పీ, నంద్యాలలో ఉన్న అడిషనల్ ఎస్పీ రంగంలోని దిగారు. ఘటన జరిగిన రెండు గంటల్లోగా ఏకంగా ఎస్పీ నంద్యాలకు వెళ్లారంటే అధికారబలాన్ని ఇట్టే అర్థమవుతోంది.

ఏకంగా అరెస్టు వారెంట్‌తో ఏదో యుద్ధానికి దిగుతున్నట్టు 300 మంది పోలీసులతో రాత్రి భూమా నాగిరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో... ఇంట్లోకి ప్రవేశించి అణువణువూ గాలించారు. ఆయన ఇంట్లో లేకపోయినప్పటికీ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఆయన ఇంటి వద్దే శుక్రవారం రాత్రి పొద్దుపోయేదాకా ఉండటాన్ని గమనిస్తే... పోలీసులపై అధికార పార్టీ ఎంత ఒత్తిడి తెస్తుందో అర్థమవుతోంది.

 

http://www.sakshi.com/news/andhra-pradesh/made-a-mockery-of-democracy-180742?pfrom=home-latest-story

మీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోండి

Written By news on Friday, October 31, 2014 | 10/31/2014


మీ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోండి
కదిరి: ‘ముందు మీ పార్టీ ఎమ్మెల్యేలు జారి పోకుండా చూసుకోండి. ఇప్పటికే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. మీరు ఎన్నికలకు మునుపు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరు. మీరు మా పార్టీ ఎమ్మెల్యేలను, మా పార్టీని విమర్శించడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ    కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గురువారం ఆయన కదిరిలో తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి వంత పాడే కొన్ని పత్రికలు చేసే గోబెల్స్ ప్రచారాన్ని ఆయన ఖండించారు. తమకు పార్టీలో పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో తామెంతో చనువుగా మాట్లాడతామన్నారు.  ప్రాణమున్నంత వరకూ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.

తాము అధికారంలోకి రాగానే ఆధార్ అనే పదమే లేకుండా చేస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇప్పుడు అదే ఆధార్ పేరుతో అనేక మందికి సామాజిక పింఛన్లు అందకుండా చేశారన్నారు.  తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, ఈ స్థానంలో వైఎస్ విజయమ్మ పోటీ చేయాలని ఉన్నారని కదిరిలో కొందరు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం మా పార్టీలో ఏ రోజూ చర్చకు రాలేదన్నారు.   కదిరిలో తెలుగుదేశం పార్టీని  ఓడించిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు.  తెలుగుదేశం పార్టీ తరపున కదిరిలో ఓడిపోయిన మొదటి వ్యక్తిగా కందికుంట వెంకట ప్రసాద్ నిలిచిపోతారన్నారు.

ఓటమిని జీర్నించుకోలేక మాట్లాడే మాటలివి. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు లేనిపోని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకుంటే మంచిదన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వజ్రభాస్కర్‌రెడ్డి, ఆ పార్టీ కౌన్సిలర్లు రాజశేఖర్‌రెడ్డి, కిన్నెర కళ్యాణ్, ఖాదర్‌బాషా, జిలాన్, మైనుద్దీన్, శివశంకర్‌నాయక్, కిరణ్ షౌకత్, ఆల్ఫా ముస్తఫా, మండల కన్వీనర్ లింగాల లోకే శ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మిరంగారెడ్డి, కుర్లిశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా అలా విసుక్కున్న దాఖలాలు ఉన్నాయా ?


పథకం ప్రకారమే దుష్ర్పచారం
కడప కార్పొరేషన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక పథకం ప్రకారం దుష్ర్పచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి సమావే శానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడని, ఎదురుప్రశ్న వేస్తారన్నారు. కొన్నిసార్లు విసుక్కుంటాడని తెలిపారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా అలా విసుక్కున్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఫల్యాలను అధికారులపైకి నెట్టేయగల సమర్థుడన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో సుమారు 200 వాగ్ధానాలు గుిప్పించారని, వాటిలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించుకుని సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జిల్లా కార్యవర్గాన్ని, అనుబంధ సంఘాల కార్యవర్గాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. పభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రైతులు, మహిళలు, పౌరులకు కలుగుతున్న నష్టాన్ని విశదీక రించాలన్నారు.

అన్ని నియోజకవర్గాలు తిరిగి నవంబర్ 5న తలపెట్టే ధర్నాలను  విజయవంతం చేయడానికి ఒకరికి బాధ్యతలు అప్పగించాలన్నారు.  పర్యవేక్షణ కమిటీ సభ్యులు  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను నమ్మి దగాపడిన వర్గాలకు ప్రభుత్వ విధానాలను విడమరిచి చెప్పాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ఉందన్నారు. చంద్రబాబు  రైతులకు రుణమాఫీ చేస్తానని భ్రమ క ల్పించారని, తొలి సంతకానికి అర్థం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు 5 సంతకాలు, మూడు గ్రిడ్‌లు, 7 శ్వేతపత్రాలు, 12 కారిడార్లు అంటూ వరాల జల్లు కురిపించారన్నారు. ఆ వరాల అమలుకు 36 కమిటీలు వేశారన్నారు.

అయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. వాగ్ధానాల వైఫల్యాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రకెక్కడం ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం రైతుల నోటికి పాలపీక, చేతికి బాండ్లు, చెవిలో పూలు పెడుతోందని విమర్శించారు. జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా రైతు రుణమాఫీ వాగ్దానంతో అధికారంలోకి వచ్చారన్నారు.  వైఎస్ జగన్ పడిన బాధలు, ప్రజలకోసం ఆయన చేసిన ఉద్యమాలు ఎవరూ చేయలేదని తెలిపారు.  అంతకుముందు  వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, హుధూద్ తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కోసం రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ కె. సురేష్‌బాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, డీసీసీబీ  ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఛైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, డిప్యూటీ మేయర్ ఆరీఫుల్లా, నాయకులు ముక్తియార్, మునెయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు పత్తిరాజేశ్వరి, పులి సునీల్, కరీముల్లా, బి. అమర్‌నాథ్‌రెడ్డి, టీపీ  వెంకటసుబ్బమ్మ, ఎస్‌ఎండీ షఫీ, నారు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబు హామీల మాఫీకే దుష్ర్పచారం!


బాబు హామీల మాఫీకే దుష్ర్పచారం!
అదే పనిలో రామోజీ... తోక పత్రిక వారి ఏకైక లక్ష్యం
వైఎస్సార్‌సీపీపై బురద జల్లడమే
వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి

 
కడప: అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో 200 పైగా హామీలు గుప్పించి అధికారాన్ని దక్కించుకుని, ఇప్పుడు వాటిని మరిపించేం దుకు ప్రతిపక్ష పార్టీనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజగురువు రామోజీరావు, తోకపత్రిక దుష్ర్పచారం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ జిల్లా కడపలోని ఒక కళ్యాణ మండపంలో గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ప్రధానకార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా  విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని చంద్రబాబుకు ఆత్మంటూ ఉంటే పరిశీలన చేసుకోవాలన్నారు. రూ.87వేల కోట్లు రైతుల రుణాలు, రూ.14వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాననీ, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఉచితంగా 9గంటల విద్యుత్, రైతుల స్థిరీకరణ నిధి, అర్హులందరికీ పక్కా గృహాలు, మౌలిక వసతుల కల్పన, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందిస్తామని చేసిన వాగ్దానాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న మండల కేంద్రాల్లో నిర్వహించ తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేసేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
 
అరచేతిలో వైకుంఠం చూపుతున్నారు: ఉమ్మారెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు చేయకపోగా అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. రాజధాని ప్రకటన చేసిన నాడు 12 కారిడార్లు ప్రకటించారని, ఇప్పటివరకూ 36 కమిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు.
 

టీడీపీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలు

'టీడీపీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలు'
కడప : ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ పార్టీలో చేరే కంటే శ్మశానంలో చేరడం మేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు టీడీపీలో చేరుతున్నారంటూ పచ్చ పత్రికలు, టీడీపీతో కలసి మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. గురువారం కడపలో రాచమల్లు ప్రసాద్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమ పార్టీ ఎమ్మెల్యేలందరికి అత్యంత అభిమానం, విశ్వాసం ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరూ పార్టీని వీడేది లేదని రాచమల్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు.

http://www.sakshi.com/news/andhra-pradesh/rachamallu-prasad-reddy-takes-on-tdp-party-180263

కేసులకు, బెదిరింపులకు భయపడం

Written By news on Thursday, October 30, 2014 | 10/30/2014


బాబు నైజాన్ని ఎండగడదాం
  •  వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వక్తలు
  •  ఆయన సీఎంగా ఉంటే సీమకు ఎప్పుడూ అన్యాయమే : పెద్దిరెడ్డి
  •  ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్నాడు : భూమన
  •  ఇబ్బంది సృష్టించే వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టండి : చెవిరెడ్డి
చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం బుధవారం తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.     
 
తిరుపతి తుడా: చంద్రబాబు నిజస్వరూపం, నైజం, మోసపూరిత వైఖరిని ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచే వెన్నుపోటు నైజాన్ని ఒంటబట్టించుకున్న బాబును ప్రజలు మరోసారి అసహ్యించుకుంటున్నారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం బుధవారం తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిందని తెలిసి, నిధులు లేవని చెబుతూనే చంద్రబాబు ఎన్నికల్లో సాధ్యం కాని హామీలను ఇవ్వడం అతని నమ్మక ద్రోహ వైఖరికి నిదర్శనమన్నారు. రైతులు, మహిళలను మోసం చేయకూడదనే జగన్ రుణమాఫీపై నిజమైన హామీలు ఇచ్చారన్నారు. జగన్ ఒక్క అబద్ధం చెప్పున్నా అధికారం వైఎస్‌ఆర్‌సీపీదే అన్నారు. బాబు దుర్బుద్ధితో హామీలు గుప్పించి అధికారం చేపట్టారన్నారు.

గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా బాబు వెనుకపడ్డ రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. ఇప్పుడూ అదే పంథాలో వ్యవహరించడం అన్యాయమన్నారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ, రైతు విభాగాల అధ్యక్షులు వేమూరు నాగార్జున, నాగిరెడ్డి, సామాన్యకిరణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్‌ఆర్‌సీపీ వైపున్నారని కక్షకట్టిన చంద్రబాబు వారికి చేరాల్సిన నిధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కులాలు ఐక్యంగా ఉంటే టీడీపీకి ఇబ్బందని భావించి కులాలను చీల్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైతుల కడుపు, నమ్మకంపై కొట్టారని, బాబుకు ఈ పాపం ఊరికేపోదని హెచ్చరించారు.

నియోజకవర్గ కన్వీనర్లు జంగాలపల్లి శ్రీనివాసులు, బియ్యపు మధుసూదన్, ఆదిమూలం మాట్లాడుతూ టీడీపీ నేతలు కబ్జాకోరులుగా అవతరిస్తున్నారన్నారు. హామీల అమలుకు పోరా టం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి గాంధీ, వైఎస్‌ఆర్‌సీపీ వివిధ విభాగాల నాయకులు దామినేటి కేశవులు, గాయత్రీదేవి, యుగంధర్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, హరి, రాజు, ఖాద్రీ, గుణశేఖర్‌నాయుడు, ఆదికేశవులరెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు,  జిల్లా నలుమూలల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు.
 
కార్యకర్తల్లో నూతనోత్తేజం
తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారికి ఏ కష్టమొచ్చినా నాయకత్వం ముందుం టుందని అతిథులు చెప్పడంతో కార్యకర్తల్లో మనోధైర్యం రెట్టింపైంది. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్యకర్తల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు చెప్పారు.
 
రైతులను మోసం చేస్తే పుట్టగతులుండవు
రైతులను మోసగించిన చంద్రబాబుకు పుట్టగతులుండవు. అధికార వాంఛతో చంద్రబాబు రైతులకు, ఆడపడుచులకు రుణమాఫీ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆశచూపి మోసగించి, నీతి మాలిన రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారు. నేను మారిపోయానని సభల్లో చెప్పుకున్న బాబు కుక్కతోక వంకరలా అధికారం వచ్చేసరికి తన బుద్ధి, నైజం ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబులా జగనన్న ఒక్క అబద్ధం చెప్పుంటే అధికారం మనదే. మంచి మనసున్న వ్యక్తి సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో అందుకు వైఎస్‌ఆర్ పాలనే  నిదర్శనం.
 -రోజా,  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే
 
బాబు మెడలు వంచాలి
ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం బాబు మెడలు వంచేం దుకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి. ప్రజా పోరాటాలతో తప్ప ఇది సాధ్యం కాదు. ఇందుకు ప్రజలను కలుపుకుని నాయకులు ఉద్యమాలకు సిద్ధం కావాలి.
 -కే.నారాయణస్వామి, పార్టీ జిల్లా అధ్యక్షుడు
 
న్యాయస్థానం ముందు నిలబెడతాం
కార్యకర్తల జోలికి వస్తే ఎంతటి వారైనా చూస్తూ ఊరుకునేది లేదు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే అధికార నేతలైనా, అధికారులైనా, పోలీసులైనా సరే.. అలాంటి వారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం. నిత్యం కార్యకర్తలకు అండగా ఉంటాం.
 - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే, చంద్రగిరి
 
దళితులను దగా చేస్తున్న టీడీపీ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీడీపీ ప్రభుత్వం దళితుల హక్కులను సైతం కాలరాస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీలకు రావాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరిగింది. దళితుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ కోసం నిధులు వెచ్చించింది. ఈ నిధులు 40 శాతం దళితులున్న ప్రాంతాల్లో ఖర్చు చేయాలన్న నిర్ణయంతో అలాగే నిలిచిపోయాయి. వీటిని టీడీపీ కార్యకర్తల పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  అనంతపురంలో దళితుల్ని ఐదుగురిని నరికి చంపిన ఘనత టీడీపీదే. ఎవరైనా ఎదిరిస్తే వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. గుంటూరులో టీడీపీ నేతలు సరస్వతి భూములను ఆక్రమిస్తుంటే అడ్డుపడిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.           
 - నాగార్జున, వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 
బాబు అంటేనే మోసం
బాబు అంటేనే మోసం. మోసం చేయడంలో ఆయనకు పీహెచ్‌డీ ఇవ్వాలి. నేను మారుతాను మారుతాను.. అని చెప్పడంతో ప్రజలు ఇకనైనా మారుతాడేమోనని ఓట్లేస్తే, నా బుద్ధింతే నేను మారను అని తన నైజాన్ని ప్రదర్శించారు.
 -అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే, పలమనేరు
 
ధర్నాను విజయవంతం చేద్దాం
బాబు నిజ స్వరూపాన్ని బయటపెడదాం. రుణ మాఫీ, ప్రజల సమస్యలపై జగనన్న పిలుపునిచ్చిన మేరకు నవంబర్ 5న చేపట్టే ధర్నాను విజయవంతం చేద్దాం. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలి.
 -జంగా కృష్ణమూర్తి, పార్టీ జిల్లా పరిశీలకులు
 
ప్రయివేటీకరణను వ్యతిరేకిద్దాం
బాబు 420,  మోసగాడని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే చెబుతారు. గతం లో ప్రభుత్వ సంస్థలను మూయించిన బాబు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు, ఆర్‌టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు కుట్ర పన్నారు. ప్రయివేటీకరణను వ్యతిరేకించేందుకు సిద్ధం కావాలి.
 - గౌతంరెడ్డి, గోపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు
 
కేసులకు, బెదిరింపులకు భయపడం
ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బాబు భజన బృందాలు, ప్రచార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. లక్ష కోట్లకు పైగా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు ఇస్తానని చెప్పిన బాబు, అత్తింటిని మోసం చేసినట్టే అన్నివర్గాల ప్రజలను మోసం చేశారు. రైతులను మోసం చేసిన వ్యక్తులెవ్వరూ బాగుపడింది లేదని బాబు గుర్తుంచుకోవాలి. అనతి కాలంలోనే టీడీపీలా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న పార్టీ మరొకటి లేదు. అధికారంలో ఉన్నామని అడ్డదిడ్డమైన కేసు లు, బెదిరింపులకు దిగితే సహించేది లేదు.
 -భూమన కరుణాకరరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
సీమ కరువు బాబుకు కనిపించలేదా?
గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవాలి. కార్యకర్తలకు అండగా ఉండి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయా లి. సీమ కరువుతో అల్లాడుతుంటే బాబుకు కనిపించక పోవడం దుర్మార్గమైన విషయం.
 -రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం
 
మోసగాడు కాబట్టే..
రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, చంద్రబాబు వెన్నుపోటుదారుడు, మోసగాడు కాబట్టే రాష్ట్రం అప్పుడు అనావృష్టి ఇప్పుడు అతివృష్టితో అల్లాడుతోంది. ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం బా బు నైజమని ప్రజలు మరోసారి రుచి చూశారు. అన్నీ గమనిస్తున్నారు. టీడీపీకి తగి న సమయంలో బుద్ధి చెప్పేం దుకు సిద్ధంగా ఉన్నారు.
 -డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి (మదనపల్లె ఎమ్మెల్యే), డాక్టర్ సునీల్‌కుమార్  (పూతలపట్టు ఎమ్మెల్యే)

ప్రజల కష్టాలు తీర్చకుంటే ఉద్యమ బాట


ప్రజల కష్టాలు తీర్చకుంటే ఉద్యమ బాట
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరిక
రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం

 
హైదరాబాద్: తెలంగాణ ప్రజల కష్టాలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వినతి పత్రం అందజేశారు. రైతుల ఆత్మహత్యలు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాలని, సంక్షేమాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రాజ్‌భవన్ ఎదుట ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి సమస్యలను పాలకపక్షం పట్టించుకోనప్పుడు బాధ్యత కల్గిన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తుందన్నారు. అందులో భాగంగానే గవర్నర్‌ను కలిశామన్నారు.

విద్యుత్తు కోతల ఫలితంగా వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాలు కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగామని, సమయం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ తెలంగాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె. శివకుమార్, డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, హెచ్‌ఏ. రహమాన్, బి.జనక్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
 

హామీలు మాఫీ చేస్తున్నావా బాబూ?


హామీలు మాఫీ చేస్తున్నావా బాబూ?
విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి ఎద్దేవా
 
తిరుపతి: ‘‘ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయాల్సిన సీఎం చంద్రబా బు.. ఆ హామీలను మాఫీ చేస్తున్నారు. ఒక్క సంతకంతో రూ.87 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు రైతు సాధికార సంస్థ ద్వారా ఐదు విడతల్లో రుణ విముక్తి కల్పిస్తామంటున్నారు. రూ. 15 వేల కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఆడపడుచుల ఓట్లను దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ఒక్కో సంఘానికి ఐదు విడతల్లో రూ.లక్షను మూలధనంగా ఇస్తామంటున్నారు. ఇచ్చిన మాటపై నిలబడకపోవడం చంద్రబాబు నైజం.. ఐదు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందంటే చంద్రబాబు పనితీరు ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. వాస్తవాలిలా ఉండ గా టీడీపీకి తాబేదారులుగా మారిన కొన్ని మీడి యా సంస్థలు చంద్రబాబు హామీలన్నీ అమలుచేస్తున్నట్లు కథనాలను ప్రచురించడం విడ్డూరం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తాం.. బాబు తీరును ఎండగడతాం’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి అధ్యక్షతన బుధవారం తిరుపతిలో పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలోనూ, ఆ తర్వాత విలేకరులో సమావేశంలోనూ వారిద్దరూ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 43 లక్షల వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లలో కోత వేస్తున్నారు. తెల్లకార్డుల లబ్ధిదారుల పొట్టకొట్టేందుకు కుట్ర లు చేస్తున్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తా.. లేదంటే నిరుద్యోగులకు నెలకు రూ.రెండు వేల చొప్పున భృతి ఇస్తానంటూ ఇచ్చిన హామీలు మరిచారు. కానీ ఇవేవీ ఎల్లో మీడియాకు కనిపించవేం? చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించిన సొమ్మును బినామీలతో పెట్టుబడి పెట్టించి సింగపూర్‌లో హోటల్ కట్టారు. ఆ హోటల్ విలువ ఇప్పు డు రూ.25 వేల కోట్లు ఉంటుంది. ఆ హోటల్ అమ్మి ఆ సొమ్మును రైతు సాధికార సంస్థలో డిపాజిట్ చేస్తే రుణ మాఫీ చేయొచ్చని మీడియా వారే చంద్రబాబుకు సలహా ఇవ్వండి. హామీలను అమలుచేయకపోవడం వల్ల టీడీపీ గ్రాఫ్ పడిపోతోంది. ఆచరణ సాధ్యమైన హామీ లు మాత్రమే ఇచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యం. వైఎస్సార్‌సీపీని వీడి వెళ్లేవారు.. పోతూ పోతూ ఏదో ఒక రాయి వేయాలనే వేస్తున్నారు తప్ప జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం లేదు’’అని అన్నారు.

వంచన అంటే చంద్రబాబే: ఉమ్మారెడ్డి

వంచనలో చంద్రబాబును మించిన వారు లేరని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.

వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు


వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదు
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టీకరణ
 
నెల్లూరు: ‘‘నేను నైతిక విలువలు పాటించే వ్యక్తిని. పార్టీ సమావేశానికి రాకపోతే బీజేపీలో చేరుతున్నట్టా? నేను వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. ఓ పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరే తత్వం కాదు నాది. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేతగా ఉంటూ వేరే పార్టీలో చేరాల్సిన అవసరం నాకు లేదు’’ అని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఎంపీ మేకపాటి వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉన్నారంటూ, పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై బుధవారం ఆయన ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తమని తేల్చేశారు. తనకు, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందిపెడుతున్న తరుణంలో తాను వైఎస్ జగన్‌కు మద్దతు ఇచ్చానని, ఎంపీ పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.

తన రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు పార్లమెంట్‌లో ఆరునెలల పాటు పోరాడిన చరిత్ర తనదేనని చెప్పారు. ఎవరైనా మంచి చేస్తే మంచి అనడంలో తప్పులేదని, అందులో భాగంగానే ప్రధాని నరేంద్రమోదీని అభినందించానని మేకపాటి చెప్పారు. స్వచ్ఛభారత్ వంటివి చేపట్టడం అభినందనీయమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనటం తప్పుకాదని, ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగస్వాములేనని వెల్లడించారు. పార్టీ మారుతున్నారనే వార్త రాసే సమయంలో తన వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీరు నైతిక విలువలు పాటిం చరా? అని ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతినిధులను ప్రశ్నించారు.

ఆ వార్తలు అవాస్తవం: కల్పన

Written By news on Wednesday, October 29, 2014 | 10/29/2014

ఆ వార్తలు అవాస్తవం: కల్పన
విజయవాడ: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవని వైఎస్సార్ సీపీ నాయకురాలు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. కొన్ని పత్రికలు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా తనపై వార్తలు ప్రచురించిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన హెచ్చరించారు. తాను ఎప్పటికీ వైఎస్సార్ సీపీలో ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు.

టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారథి అన్నారు. వైఎస్సార్ సీపీని ఎవరూ వీడడటం లేదని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తన కొడుకుపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దు


'విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దు'
హైదరాబాద్: తమ పార్టీపై ఓ రెండు పత్రికలు అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విలువలేని వార్తలు రాసి అభాసుపాలు కావొద్దని హితవు పలికారు. వాస్తవాలు రాయలేకపోయినా కనీసం వాస్తవానికి దగ్గరవుండే వార్తలు రాయాలన్నారు. విషప్రచారం ద్వారా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బురద చల్లడం మానుకోవాలని సూచించారు. వైఎస్సార్ సీపీ బలోపేతంగా ఉందని, ఎవరూ పార్టీ వదిలి వెళ్లడం లేదని  స్పష్టం చేశారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
 
చంద్రబాబులా అద్భుతమైన అబద్దాలు ఆడిన నేత ప్రపంచంలో ఎక్కడా ఉండరని అంబటి రాంబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఐదు సంతకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దపు వాగ్దానాలు నమ్మి జనం ఓట్లు వేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసి పొరపాటు చేశామని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్వతం కాదన్నారు.

బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి

  తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలను ఆయన బుధవారమిక్కడ తీవ్రంగా ఖండించారు.  కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న తనపై కూడా తప్పుడు ప్రచారం  చేయటం శోచనీయమన్నారు. మరోసారి ఇటువంటి వార్తలు పునరావృతమైతే ఆ సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం సరికాదని మేకపాటి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం వల్లే జన్మభూమిలో పాల్గొంటున్నామని ఆయన తెలిపారు.  ఏ ప్రభుత్వం మంచి చేసిన సమర్థిస్తామని మేకపాటి వెల్లడించారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎండగడతామన్నారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మే 19న ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేసే పనులకు మద్దతు ఇస్తామని జగన్ కూడా చెప్పారన్నారు.

తాను వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నానని, తాను నెరవేర్చాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయని మేకపాటి అన్నారు.  ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో వైఎస్ జగన్ కు తెలుసునని, తనకు కూడా చాలా బాధ్యతలు అప్పగించారన్నారు. ఎంపీ కొత్తపల్లి గీతపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని మేకపాటి తెలిపారు.

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట
సాక్షి ప్రతినిధి, నెల్లూరు
 ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. అందుకు గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. సీఎం అయ్యాక అమల్లోకి వచ్చేసరికి చేస్తున్న గందరగోళ ప్రకటనలను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో రోజుకో ప్రకటనతో మభ్యపెడుతూ.. హామీలను జనం మరచిపోయేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు మెడలు వంచాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంగళవారం నెల్లూరులో సర్వసభ్య సమావేశం నిర్వహించి ఉత్తేజ పరిచారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలను ఎండగట్టాలని నిర్ణయించారు. అదే విధంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా తొలగించిన పింఛన్లు, తెల్లరేషన్‌కార్డులను పునరుద్ధరించేలా కృషి చేయాలని నిర్ణయించారు.

తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో అందిస్తానన్న శుద్ధి జలం ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు వచ్చేనెల 5న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు హామీలను విస్మరిస్తున్న వైనాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు క్షుణ్ణంగా వివరించారు.

మొదట వ్యవసాయ రుణాలని చెప్పి ఆ తర్వాత పంట రుణాలే మాఫీ అంటూ.. కుటుంబంలో ఒకరికిలక్షన్నర రూపాయలకు పరిమితం చేసిన తీరును ఎండగట్టారు. వ్యవసాయ సాధికారత కమిషన్ ఏర్పాటు చేయటం వల్ల రైతులకు వడ్డీ భారం తప్ప మరొకటి లేదని పార్టీ శ్రేణులకు అర్థం అయ్యేలా వివరించారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబు బండారాన్ని బయటపెట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వచ్చే నెల 5న తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

చంద్రబాబు అబద్ధాల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి కార్యకర్తకు పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ సేవాదళాన్ని ప్రతి నియోజక వర్గంలో ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా  రూపొందిస్తున్నారు.

 పార్టీ పటిష్టతపైనా దృష్టి
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అధినేత దృష్టి సారించారు. ఇందు కోసం నియమించిన కమిటీ సభ్యులు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా పార్టీ అనుబంధ సంఘాలను సైతం కార్యవర్గంలో కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయించారు.

అలాగే ప్రతి కార్యకర్త, అభిమానితో అధినేత వైఎస్ జగనమోహన్‌రెడ్డి నేరుగా సంప్రదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మేరకు వారి పేర్లు, ఫోన్ నంబర్, అడ్రస్‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో మాస పత్రిక, నెట్ టీవీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు నేరుగా అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడేందుకు వీలుగా వీడియో కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓరియంటేషన్ కార్యక్రమం పేరుతో కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది

కార్యకర్తలకు అండగా నిలుస్తాం

కార్యకర్తలకు అండగా నిలుస్తాం
 తణుకు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పిలుపునిచ్చారు. మండలంలోని పైడిపర్రులో గల పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

 పార్టీ కోసం పనిచేసి కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తను వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. ప్రతీ కార్యకర్త సూచనను పరిగణలోకి తీసుకొని వైఎస్‌ఆర్ సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. తణుకు నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తి చీర్ల రాధయ్య అని, మనమంతా ఆయనకు అండగా నిలుద్దామన్నారు. మోసపూరిత వాగ్దానాలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గద్దెనెక్కారని, రుణమాఫీ తీరు ఎలా ఉందో ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు.

 ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఉందన్నారు.  మహిళలు, రైతుల తరఫున వచ్చే నెల 5వ తేదీ నుంచి మండల కార్యాలయాల వద్ద చేపట్టే ధర్నాలను విజయవంతం చేయాలన్నారు. నరసాపురం పార్లమెంటరీ నాయకులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో జరిగే అవకతవకలను అరికట్టి ప్రజలకు సక్రమంగా పథకాలు అందేలా కార్యకర్తలు సమీక్షించాలన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల నుంచి ప్రజలను కాపాడాలని పిలుపునిచ్చారు. తణుకు నియోజకవర్గ కన్వీనర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ రాజన్న బిడ్డ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్ సీపీని ప్రజలు ఆదరించాలని భావించినా, చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు.

 నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు చల్లబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు అండగా కార్యకర్తలు నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ బీసీ సంఘ నాయకుడు గంటా ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు మాటకు నిలబడే వ్యక్తి కాదని, జన్మభూమి వలన ప్రచారమే తప్ప ప్రజలకు ఒరిగిందే మీ లేదన్నారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, తణుకు నియోజకవర్గ నాయకులు నార్గన సత్యనారాయణ, వెలగల అమ్మిరెడ్డి, గంధం బాబ్జి, కరుటూరి సర్వేశ్వరరావు, చుక్కా లివింగ్ స్టన్, కొండే నాగవేణి, కేతా గౌరీ పార్వతి, మెహర్ అన్సారీ, మద్దిరాల రాంసతీష్, చింతలపూడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్

పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్
 సాక్షి, హైదరాబాద్ : తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తల్లో  నిజం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టంచేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిం చారు. ఏ పత్రికగాని, టీవీ చానల్ గాని తమపై ఒక వార్తను ఇచ్చే ముందు అందు లో వాస్తవం ఎంత ఉందో నిర్థారించుకోవడానికి తమను సంప్రదించాల్సి ఉందని.. కానీ తనపై వార్త ప్రచురించిన పత్రిక ఆ పని చేయలేదని ఆయన తప్పుపట్టారు.

ఐదునెలల్లో ఒక్క హామీనైనా నెరవేర్చినట్లు నిరూపించగలవా?

* వైఎస్సార్‌సీపీ నేతలు
విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి ధ్వజం


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘అధికారం కోసం సాధ్యంకాని హామీలను గుప్పించారు. ఏ వర్గాన్నీ వదలకుండా వాన కురిసినట్లు వరాలు కురిపిం చారు. ప్రభుత్వం ఏర్పడిన ఐదునెలల్లో ఒక్క హామీనైనా నెరవేర్చినట్లు నిరూపించగలవా? ఒక్క రైతుకైనా.. ఒక్క సంఘానికైనా రుణం మాఫీ చేశావా?’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. నెల్లూరులో మంగళవారం వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ  జిల్లా అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డిలతో పాటు రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, రాష్ట్ర వాలంటీర్ల విభాగం అధ్యక్షుడు, చం ద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు, జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్, కిలివేటి సంజీవ య్య, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అనితమ్మ హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాల న్నీ మాఫీ చేస్తానన్న బాబు మాట మార్చి పంట రుణాలు మాఫీ అని చెబుతున్నారన్నారు. బ్యాం కర్ల సమావేశంలో రోజుకోమాట చెబుతూ కాల యాపన చేస్తున్నారన్నారు.
 
 బాబు నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వచ్చేనెల 5న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు విజయసారుురెడ్డి ప్రకటించారు.  రైతు లు, బ్యాంకర్ల మధ్య మంచి సంబంధాలు ఉండేవని, బాబు వచ్చాక ఆ సంబంధాలు తెగిపోయాయని ఉమ్మారెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్‌ఆర్‌ని టార్గెట్ చేస్తూ 7 శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తాను ఇచ్చిన హామీలు, రుణాల మాఫీపై క్యాలెండర్ విడుదల చేయాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశా రు. నాటి వైఎస్ పాలన.. నేటి బాబు పాలనను బేరీజు వేసుకుంటే ఎవరు ఎటువంటి వారో ప్రజ లకు అర్థమవుతుందన్నారు. వైఎస్ పాలనలో లబ్ధి పొందని కుటుంబం అంటూ లేదని గుర్తుచేశారు. టీడీపీకి ఓటేసిన వారంతా తప్పుచేశామని బాధపడుతున్నారని, వారికివే చివరి ఎన్నికలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. పల్లెల్లో టీడీపీకి చెందిన చోటా నాయకుడు కూడా ప్రజలకు అడ్డంకిగా మారారని, అందువల్ల ఈసారి వారికి గూబ గుయ్యిమనేలా బుద్ధి చెప్పాలని అన్నారు.  సమావేశంలో మేరుగ నాగార్జున, గౌతంరెడ్డి కూడా ప్రసంగించారు.

Popular Posts

Topics :