02 November 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

హుదుద్ తుఫాన్ బాధితులకు కువైట్ వైయస్సార్ సిపి చేయుత

Written By news on Saturday, November 8, 2014 | 11/08/2014

 
కువైట్: జన నేత జగన్ గారి పిలుపు మేరకు దాసారి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు తుపాకుల బాబు ,అధ్యక్షుడు గోవింద్ సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి గోవింద్ నాగరాజు. ఉపాధ్యక్షుడు కొప్పోలు మల్లికార్జున. మరియు సీనియరు సభ్యుడు కొప్పోలు వెంకటసుబ్బయ్యసభ్యుడు 20వేల. రూపాయల ఆర్ధిక సహాయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హుదుద్ బాధితుల సహాయ నిధికి పంపాలని కువైట్ వైయస్సార్ సి.పి. కో ఆర్డినేటర్ ఇలియాస్ బి.హెచ్, జాయింట్ కోఅర్డినేటర్ యం. బాలిరెడ్డి గార్లకు అందచేశారు. ఈ సందర్భముగా గోవింద్ నాగరాజ్ మాట్లాడుతూ కువైట్ లో బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో హుదుద్ తుఫాన్ బాధితులకు విరాళాలు సేకరించాలని ఇలియాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి దాసరి సంక్షేమ సంఘం తమవంతు సహాయము చేసిందన్నారు. ఇలియాస్ గారు మాట్లాడుతూ కువైట్ వైయస్సార్ సి.పి. సభ్యులు మరియు దాతల నుండి విరాళాలు సేకరిస్తున్నారని తెలుపుతూ హుదుద్ తుఫాన్ బాధితులకు స్వచ్చందంగా చేయుత ఇచ్చిన దాసరి సంక్షేమ. సంఘ సభ్యులకు అభినిందిస్తూ పార్టీ తరపున కృతఘ్ణతలు తెలిపారు కార్యక్రమములో రాగురుచిన్నగంగిశెట్టి , గోవిందు రాజేష్ ,తుపాకుల కుళ్ళయాప్ప, తన్నీరు రమా దేవి,గోవింద్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక మంత్రి ఆదుకుంటామన్నారు: వైఎస్ జగన్


ఆర్థిక మంత్రి ఆదుకుంటామన్నారు: వైఎస్ జగన్
న్యూఢిల్లీ : తుపాను బాధితులకు తప్పకుండా మంచి చేస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హుదూద్ తుఫాను బాధితులను ఆదుకుంటామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో తమ పార్టీకి చెందిన పలువురు ఎంపీలతో కలిసి ఆయన అరుణ్ జైట్లీని శనివారం సాయంత్రం కలిశారు. ఆయన చెప్పిన ప్రధానాంశాలు ఇవీ..
''నష్టానికి సంబంధించిన నివేదికలు ఇంకా తమ వద్దకు పూర్తిగా రాలేదని అరుణ్ జైట్లీ చెప్పారు. మేం చెప్పినదంతా సావధానంగా విన్నారు. విని మంచి చేస్తామని తెలిపారు. ప్రత్యేకహోదా గురించి చర్చ ఏమీ జరగలేదు. కేవలం హుదూద్ బాధితులను ఆదుకోవాలని మాత్రమే ఇప్పుడు అడిగాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయాన్ని రాబట్టడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పదిరోజుల పాటు అన్ని గ్రామాలు తిరిగి, ప్రభుత్వం వాళ్లకు ఏం చేసిందోనన్న విషయాన్ని అందరికీ చెప్పుకుంటూనే వచ్చాం. ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు విఫలమైందన్న విషయాన్ని నాతోపాటు తిరిగిన టీవీ ఛానళ్ల క్లిప్పింగులు చూస్తే, ప్రజలే ఏం చెప్పారో తెలుస్తుంది. వాళ్లకిచ్చేది 25 కిలోల బియ్యమట. మామూలుగా అయితే దాన్ని రేషన్ దుకాణాల్లో రూపాయికి ఇస్తారు. అదికూడా అన్ని గ్రామాల్లో ఇవ్వలేదు. అధికారులు ఎవరూ రాలేదు. ఆ పదిరోజులు ఎవరు ఏమన్నారో అందరికీ ప్రజలే చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన పని వల్ల పంటబీమాను కట్టకపోవడంతో కనీసం నష్టపోయిన పంటకు రైతులకు బీమా కూడా అందలేదు. ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లే ప్రధాన ప్రతిపక్షంగా మేం ఇక్కడకు వచ్చి, కేంద్ర ఆర్థికమంత్రికి వినతి పత్రం ఇచ్చాం'' అని ఆయన అన్నారు.

జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం


జైట్లీని కలిసిన వైఎస్ జగన్ బృందం
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కలిసింది. హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని జైట్లీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆర్థికమంత్రిని కలిసిన బృందంలో వైఎస్ జగన్ తో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుక, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ తదితర నాయకులున్నారు.

భూములు కొనుగోలుపై సీబీఐ విచారణకు సిద్ధమా: అంబటి


భూములు కొనుగోలుపై సీబీఐ విచారణకు సిద్ధమా: అంబటి
హైదరాబాద్ : హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఎన్ని భూములు కొన్నారో సీబీఐ విచారణకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.  ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాబు తాబేదార్లు కొన్న భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు.

రాజధాని నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంబటి స్పష్టం చేశారు. అయితే రాజధాని నిర్మాణానికి భూములివ్వడానికి రైతులు సుముఖంగా లేరన్నారు. భూముల సమీకరణపై రైతాంగం తీవ్ర ఒత్తిడి, భయాందోళనలకు లోనవుతోందన్నారు.  రైతులకున్న అనుమానాలు తీర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అంబటి అన్నారు.

టీడీపీ, బీజేపీ ప్రజా ప్రతినిధులు వందల ఎకరాలు భూములు కొన్నట్లు అక్కడి ప్రజలు పేర్లతో సహా చెబుతున్నారని....ఇది వాస్తవం కాదా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు ఇతరులపై నిందలు వేయటం సరికాదని, వాస్తవ దృక్పధంతో ఆలోచించాలని సూచించారు. రైతుల్లో నమ్మకం కలిగిస్తే వారే స్వచ్ఛందంగా భూములిస్తారని,  పంట భూముల్లో కాకుండా నిరూపయోగంగా ఉన్నభూముల్లో రాజధాని నిర్మాణం జరగాలని అంబటి అన్నారు.

ఢిల్లీకి వైఎస్ జగన్, సాయంత్రం జైట్లీతో భేటీ


ఢిల్లీకి వైఎస్ జగన్, సాయంత్రం జైట్లీతో భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన హుదూద్ బాధితులు,  ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవాలని ఆయన జగన్‌ కేంద్రాన్ని కోరనున్నారు.
తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో కలసి ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలవనున్నారు.  తుపాను నష్టాన్ని వివరించడంతోపాటు తక్షణ సహాయం అందించాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోరనున్నారు. అలాగే తుఫాను వల్ల  ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారు.

వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలి

వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలి
పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

నల్లగొండ టుటౌన్: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ముఖ్య నాయకులందరూ కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల ముఖ్య నేతలతో పార్టీ బలోపేతంపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీని గ్రామాల లో పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందు కు నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈనెల 13న నల్లగొండలో నిర్వహించాల్సిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని 19వ తేదీకి వాయిదా వేశామన్నారు. 19న జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆశయసాధన కోసం ప్రజల తరఫున పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలయ్యేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునిల్‌కుమార్, మైనార్టీసెల్ జిల్లా కన్వీనర్ ఎండి. సలీం, ఎంపీటీసీ సభ్యుడు కట్టెబోయిన నాగరాజు, నేతలు మేడిశెట్టి యాదయ్య, రామానుజం, యూసుఫ్, భాస్కర్, ఫయాజ్, లక్ష్మీకాంత్, వంగాల వెంకటరెడ్డి, జహంగీర్, అతీఖ్‌అహమద్, చింత నవీన్, ఎండి. సిరాజ్, శ్రీను, గాదరి రమేష్ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్


వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్
 హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మరో ఇద్దరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని, తెలంగాణ రాష్ట్రం నుంచి హెచ్‌ఏ రెహమాన్‌ను నియమించారు. ఇదిలా ఉండగా విశాఖపట్నానికి చెందిన బీ జాన్ వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన గొట్టిపాటి.

తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్


తుపాను సాయం కోసం నేడు ఢిల్లీకి జగన్
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నాన్ని ముంచెత్తిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం విడుదల చేయాలని కోరేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఢిల్లీ వెళుతున్నారు. పార్టీకి చెందిన ఎంపీలతో కలసి ఆయన శనివారం ఢిల్లీ వెళ్లి సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలసి తుపాను నష్టాన్ని వివరించడంతోపాటు తక్షణ సహాయం అందించాలని కోరనున్నారు. 
 
ఈ సందర్భంగా హుద్‌హుద్ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి తుపాను నష్టాన్ని వివరించి తక్షణ సహాయం కోరాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే శనివారం  ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలసి తక్షణ సహాయ ఆవశ్యకతను వివరించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

కేంద్ర ఆర్థిక మంత్రిని కలవనున్న వైఎస్ జగన్

Written By news on Friday, November 7, 2014 | 11/07/2014

కేంద్ర ఆర్థిక మంత్రిని కలవనున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నారు. హుద్ హుద్ తుపాను కారణంగా నష్టపోయిన ప్రాంతాలకు తక్షణ ఆర్థికసాయం ప్రకటించాలని ఆర్థిక మంత్రిని వైఎస్ జగన్ కోరనున్నారు. 

హుద్ హుద్ తుపాను ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు ఇస్తామని విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్ లను మరియు  గొట్టిపాటి భారత్ ను ప్రకాశం జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమించారు 

ప్రజా సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?


ప్రజా సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలపై ప్రజల తరపున ఎవరైతే పోరాడుతున్నారో వారిని నిర్వీర్యం చేసే విధంగా దొంగ కేసులు పెట్టే స్థాయికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి పోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టిన వారిలో భూమా నాగిరెడ్డి నాలుగో ఎమ్మెల్యే అని చెప్పారు. నంద్యాల పోలీసుల అక్రమ కేసులకు గురై రిమాండ్ ఖైదీగా ఉంటూ ‘నిమ్స్’లో చికిత్స పొందుతున్న పీఏసీ చైర్మన్  భూమా నాగిరెడ్డిని జగన్ గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి ఆసుపత్రికి వచ్చిన జగన్ కొద్దిసేపు భూమాతో గడిపి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన నిమ్స్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు.
 
ప్రజల తరఫున పోరాడుతున్న తమ ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా(నగరి), సునీల్ (పూతలపట్టు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)పై వరుసగా తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో పట్టణంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యే హోదాలో భూమా నాగిరెడ్డి ప్రస్తావించకుండా అధికారపక్షం వారు అడ్డుకుని గొడవ సృష్టించారని చెప్పారు. ఆ చిన్న గొడవను హత్యాయత్నం వంటి దారుణమైన కేసుగా మలిచారంటే ఎలాంటి పరిస్థితుల్లోకి వ్యవస్థను తీసుకెళుతున్నారో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇదే అంశంపై విలేకరులకు అన్ని విషయాలు చెబుతారని కూతురు లాంటి ఆమె ఆవేదన విన్న తరువాతనైనా బాబుకు బుద్ధి వస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భూమాపై రౌడీ షీటుకు సంబంధించి కోర్టులో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

రైతు హక్కుల పరిరక్షణ కమిటీ

పార్టీపరంగా ఏర్పాటు చేసిన జగన్
 ఏపీ రాజధాని నిర్మాణం పేరిట అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆగడాలను, బెదిరింపు రాజకీయాలను, రైతులకు అన్యాయం చేసే కార్యక్రమాలను, భూ దందాలను ఎదుర్కొనడంతో పాటుగా రైతుల పక్షాన నిలిచేందుకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ పరంగా రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఎనిమిది మందితో కూడిన ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, గొట్టిపాటి రవికుమార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉంటారు. త్వరలో ఈ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించనుందని పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత

మా కుటుంబానికి ఏదైనా జరిగితే సీఎం చంద్రబాబుదే బాధ్యత
 • ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హెచ్చరిక
 •  నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని కర్నూలు టీడీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తున్నారు
 •  భూమాను కేసులో ఇరికించేందుకు డీజీపీ, సీఎంలతో చర్చించామని చెబుతున్నారు
 •  పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి నాతండ్రిపై తప్పుడు కేసులు నమోదు చేశారు
 •  మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, ఎంతదూరమైనా పోరాడుతాం
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డికి, తన కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక వస్తుందంటూ టీడీపీ నేతలు బాహాటంగా చేస్తున్న ప్రకటనల తర్వాత, ఈ విషయంలో తన భయం తనకున్నందునే తానీమాట చెప్తున్నానన్నారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తన తండ్రి భూమా నాగిరెడ్డిపై కేసులు నమోదు చేశారని తప్పుబట్టారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పు లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఎంతదూరమైనా పోరాడుతామన్నారు.

వైఎస్సార్‌సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో ఉప ఎన్నిక వస్తుందంటూ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. భూమాను కేసులో ఎలా ఇరికించాలనే విషయమై డీజీపీ,సీఎంలతో చర్చించామని వెంకటేశ్వర్లు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో తన తండ్రికి గాని, తన కుటుంబానికి గాని  ఇబ్బంది జరిగితే సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆమె ఇంకా ఏం చెప్పారంటే...
 
నంద్యాల మున్సిపల్ సమావేశంలో ఏం జరిగిందనే విషయమై కొన్ని టీవీ చానెళ్లు ఏకపక్షంగా చూపిస్తున్నాయి. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నాగిరెడ్డికి ఎమ్మెల్యేగా మాట్లాడే హక్కు ఉన్నా చైర్‌పర్సన్ సులోచన గౌరవించలేదు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నపుడు ప్రొటోకాల్‌నూ పాటించకుండా ఎజెండా ముగిసిందంటూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘తలుపులు వేయండ్రా...’ అని నా తండ్రి చెప్పిన ఒక్క మాటను పట్టుకుని ఆయనపై మూడు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారు.

పథకం ప్రకారం హత్యాయత్నం చేయాలనుకుంటే పోలీసులు, మీడియా వాళ్లు అందరూ ఉండగా చేస్తారా? పోలీసులకు కేసు పెట్టేటపుడు  ఆ ఆలోచన కూడా రాలేదా? రెండు పార్టీలు కొట్టుకున్నపుడు ఇద్దరిపైనా కేసులు పెట్టాలి కదా?  నాగిరెడ్డిపైనే కేసు ఎలా పెట్టారు? అసెంబ్లీ, లోక్‌సభలో అధికార ప్రతిపక్షాలు వాగ్వాదాలకు, గొడవ పడుతున్నపుడు కూడా స్పీకర్, సీఎం, ప్రతిపక్ష నేతలపై ఇలాగే కేసులు పెట్టి, రౌడీషీట్లు తెరుస్తారా?
 
టీడీపీ వారిపై మేము ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు తీసుకోవడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే చేతులు పెకైత్తి ‘పై నుంచి ఒత్తిడులు వస్తున్నాయి’ అని సమాధానమిస్తున్నారు.

నా తల్లిదండ్రులు ఏనాడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదు. రౌడీయిజం, గూండాయిజం చేసి ఉంటే నా తండ్రి నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపీగా, నా తల్లి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారే కాదు. నా తల్లి చనిపోయిన షాక్‌నుంచి మేము తేరుకోకముందే నాన్నను మానసికంగా బలహీనుడిని చేయాలనే కేసు మోపారు.
 
జిల్లా ఎస్పీకి బుద్ధి లేదా?: మైసూరారెడ్డి

నాగిరెడ్డిపై రౌడీషీటు తెరవడం అనేది దుర్మార్గమైన చర్య. ఐపీఎస్ చదువుకున్న జిల్లా ఎస్పీ అధికారపక్షం ఒత్తిడులకు తలొగ్గి బుద్ధి లేకుండా వ్యవహరించారు. ఒక వ్యక్తిపై రౌడీ షీటుకు అవకాశం కల్పిస్తూ జారీ అయిన 743 స్టాండింగ్ ఆర్డర్‌కు ఎలాంటి రాజ్యాంగ బద్ధత లేదని, వాటికి ఎలాంటి నియమ నిబంధనల స్వభావం లేదని 1999, మార్చి 30వ తేదీన ‘మహ్మద్ ఖదీర్ వర్సెస్ హైదరాబాద్ పోలీసు కమిషనర్’ కేసులో హైకోర్టు తీర్పునిచ్చింది. ఐపీఎస్ అధికారికి ఇది తెలియదా?

స్థానిక ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీటీసీలు సమావేశానికి వెళ్తుంటే ముస్లిం ఎమ్మెల్యేపైనా, అంబటి రాంబాబుపైనా  దాడి చేసిన వారిపై ఇప్పటికీ కేసులు పెట్టలేదు?వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రోజా, సునీల్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారు. ‘సరస్వతీ’ భూముల విషయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్‌పై అకారణంగా రౌడీషీటు పెట్టారు.
 

మాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత

Written By news on Thursday, November 6, 2014 | 11/06/2014


మాకు ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అఖిలప్రియ
హైదరాబాద్ : తమ కుటుంబానికి ఏమైనా జరిగితే దానికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మండిపడ్డారు. అనుక్షణం ప్రజాసంక్షేమం కోసమే పనిచేసే తమ తండ్రి భూమా నాగిరెడ్డి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టి, అనవసరంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని అన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాల్లో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి..

* నంద్యాల అభివృద్ధికి నాన్నగారు సొంత డబ్బు చాలా ఖర్చు చేశారు. ప్రతి ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు పెట్టించి, దాని పర్యవేక్షణను పోలీసులకు అప్పగించారు.
* మున్సిపల్ ఛైర్మన్ సులోచన అసలు ఛైర్మన్ లా కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకూడదన్న విషయం కూడా ఆమెకు తెలియదు. ప్రోటోకాల్ ను పట్టించుకోలేదు.
* వేరే ఫ్లోర్ లీడర్ ముందు కూర్చున్నారన్న చిన్న విషయానికి ఆమె బెల్లుకొట్టి వెళ్లపోతుంటే, నాన్న లేచి.. తాను మాట్లాడాలని చెప్పారు. అయినా ఆమె పట్టించుకోలేదు.
* డోర్లు వేయండిరా అన్న ఒక్క మాటకు ఇన్ని కేసులు పెట్టారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కుంది. సులోచన ఎవరి మద్దతుతో ఇవన్నీ చేస్తున్నారో అందరూ గమనిస్తారు. ప్రజలు తప్పకుండా వాళ్లకు బుద్ధి చెబుతారు
* నిజంగా హత్యాయత్నం చేయాలంటే మీడియా ముందు, పోలీసుల ముందు ఎందుకు చేస్తారు?
* రెండు పార్టీలు కొట్టుకున్నప్పుడు భూమా నాగిరెడ్డి మీద కేసులు పెట్టినవాళ్లు.. అటు సులోచన మీద మేం కేసులిస్తే ఎందుకు తీసుకోవట్లేదు?
* రెండు రోజుల్లోనే మూడు కేసులు పెట్టి, రౌడీషీట్ కూడా తెరిచారు. ఇంతే వేగంతో ఇతర కేసులు కూడా డీల్ చేస్తే, ఈపాటికి కర్నూలు జిల్లాలో సగం కేసులు పరిష్కారం అయిపోయేవి.
* కేసులు ఎందుకు పెట్టారంటే.. పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. టీడీపీ వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నా.. పోలీసులను వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వండి.
* అసెంబ్లీలో రెండు పార్టీల వాళ్లు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చాలాసార్లు ఇలా జరిగాయి. ఇప్పటివరకు ఎక్కడైనా ఎవరిమీదైనా కేసులు పెట్టారా?
* రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు హత్యాయత్నం కేసు పెట్టారు. అసలు నేరచరిత్ర లేని కౌన్సిలర్లమీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద నిజానిజాలు చూడకుండా, ఇలా వరుసపెట్టి మూడు కేసులు, రౌడీషీట్ తెరవడం తగునా?
* మేం టీడీపీ వాళ్లమీద కేసులు పెడితే ఒక్కటీ తీసుకోలేదు. వాళ్ల మీద విచారణ లేదు, అరెస్టులు లేవు. కేవలం వైఎస్ఆర్ సీపీ వాళ్లమీదే కేసులు పెడుతున్నారు
* ఫ్యాక్షనిజం ఒకప్పుడు ఉండేదేమోగానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలో లేదు. ఆ పేరుచెప్పి భయపెట్టడానికి ప్రయత్నించకండి. ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటివాటిని మేం ప్రోత్సహించేది లేదు.
* నాన్నగారు ఎన్ని త్యాగాలు చేశారో ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలకు తెలుసు. ఆయన నిజంగానే రౌడీయిజం చేసి ఉంటే ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆయన వెంట అంతమంది వచ్చేవారు కారు.
* అమ్మను కోల్పోయిన షాక్ లోంచి మా కుటుంబం ఇంకా బయటకు రాలేదు. నాన్న ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకుండా ప్రజల కోసమే తిరుగుతున్నారు. అంత బిజీలో ఉండి.. ఇలా ఎందుకు చేస్తారు?
* మీరు భయపెడితే భయపడటానికి మేమేం తప్పులు చేయడంలేదు. దాన్ని గుర్తుంచుకోండి.
* ఈ కేసులు ఏవీ లేకముందే.. నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తాయని, భూమా నాగిరెడ్డి మీద కేసులు ఎలా పెట్టాలో మాకు తెలుసని టీడీపీ జిల్లా ఇన్ఛార్జి సంగిశెట్టి చెబుతున్నారు. ఆయన ఎవరి అండతో ఇలా చెబుతున్నారో అందరికీ తెలుసు.
* మా కుటుంబానికి ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా దానికి బాధ్యత చంద్రబాబుదే. ఆయన మద్దతు లేకుండా ఇలా.. అది కూడా రౌడీషీట్ పెట్టకముందే చెప్పడం సాధ్యం కాదు.
* టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను చాలామందిని చంపేశారు. తప్పుడు కేసుల్లో బుక్ చేస్తున్నారు. ఒక్క కేసు మీద కూడా స్పష్టత లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేల మీద పడుతున్నారు. ప్రజలంతా చూస్తున్నారు.. మీరు జాగ్రత్తగా ఉండాలి.
* పోలీసులకు నేను చెప్పదలచుకున్నది ఒకటే. ఒత్తిడి ఉందని ఒకవైపు మాత్రమే పనిచేయడం తగదు. ఇలా అన్యాయం చేయొద్దు.
* నాన్నగారి మీద మూడు కేసులు పెడితే.. వాటిలో ఒక కేసు మీదే రిమాండుకు పంపారు. అంటే మిగిలినవి తప్పని వాళ్లకు కూడా తెలుసు. ఈ గొడవ జరిగినప్పుడు నలుగురికి గాయాలయ్యాయి. ఆ నలుగురిలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కేవలం ఛైర్ పర్సన్ సులోచన మాత్రమే ఫిర్యాదు చేశారు.
* న్యాయవ్యవవస్థ మీద మాకు నమ్మకం ఉంది. క్లీన్ చిట్ తో నాన్న బయటకు వస్తారన్న విశ్వాసం మాకుంది. ఆయన వచ్చాక ఛైర్మన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత సరైన విచారణ చేయకుండా కేసు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తాం.

అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు


'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
హైదరాబాద్ : అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై కేసులు బనాయిస్తున్నారని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల తరపున పోరాడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి...తాజాగా భూమా నాగిరెడ్డిపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు.

నిమ్స్ లో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారారో భూమా నాగిరెడ్డి అరెస్ట్ వ్యవహారంతో అర్థం అవుతోందన్నారు. భూమా సహా నలుగురు ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సమస్యలపై భూమా మున్సిపల్ సమావేశంలో మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవ సృష్టించారన్నారు. భూమాపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా అన్యాయంపై తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

భూమా నాగిరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్


భూమా నాగిరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : నిమ్స్ లో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైఎస్ జగన్ ఆరా తీశారు. భూమా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
 
టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన  భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి  హైదరాబాద్‌లోని  నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

అంకెల్లోనే బంగారు తెలంగాణ

అంకెల్లోనే బంగారు తెలంగాణ
బడ్జెట్‌పై తెలంగాణ వైఎస్సార్‌సీపీ మండిపాటు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలిబడ్జెట్ పూర్తిగా అంకెల గారిడీయే తప్ప ఆ అంకెల్లో ఎంత మాత్రమూ వాస్తవికత లేదని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రూ.లక్ష కోట్ల ముసుగు లో ప్రజలను మభ్యపెట్టే యత్నమే తప్ప, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పట్టంచుకోలేదని ఆరోపించింది. వాస్తవ ఆదాయానికి, ప్రభుత్వ లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదని, ఒకవేళ ఆ లెక్కలు నిజమైతే శాఖల వారీగా ఆదాయాన్ని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించింది.

పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో కలసి  వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని, రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో డొల్లతనం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పొంగులేటి అన్నారు. ‘ప్రణాళికా వ్యయంలో రూ.48,648 కోట్లు చూపారు. సమైక్యరాష్ట్రంలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.47,712కోట్లను ప్రణాళిక వ్యయంలో కేటాయించారు. 2013-14 ఏడాదికి ఆ మొత్తం ఇంకా తగ్గి రూ.42,185 కోట్లుగా పేర్కొన్నారు.

అలాంటిది రాష్ట్రం విడిపోయాక తెలంగాణకు మాత్రమే రూ.48,648 కోట్లుగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. అదికూడా పదినెలల కాలానికి చెందిన బడ్జెట్‌లోనే. ఈ లెక్కన 12 నెలలకు కలుపుకుంటే రూ. 52 వేల కోట్ల పై మాటే. వీటన్నింటికి ఆదాయం ఎలా వస్తుందన్నదానిపై ప్రభుత్వం ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. సమైక్య రాష్ట్రంలో కేవలం 45శాతం ఆదాయం మాత్రమే ఉన్న తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన 5నెలల్లోనే ఇంత ఆదాయం పెరిగిందా? ఒకవేళ పెరి గితే ఆ ఆదాయం, పద్దులు ఎందుకు వివరించలేదు?’’ అని పొంగులేటి నిలదీశారు. ‘ఇక కేంద్ర గ్రాంట్లు రూ. 21,720 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2012-13 ఏడాదిలో 12 నెలల బడ్జెట్‌కు గాను రూ.7,412 కోట్లు, 2013-14లో రూ. 8,990 కోట్లు కేంద్ర గ్రాంట్లు వచ్చాయి.

మరి ఇప్పుడు రూ. 21,720 కోట్లు కేంద్ర గ్రాంట్లు ఎలా సాధ్యం’ అని ప్రశ్నించారు. ఇంతకంటే ఆశ్చర్యకరంగా తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 93,150గా బడ్జెట్‌ల లెక్కల ద్వారా ప్రభుత్వం చెప్పిం దని, ఇది దేశంలో ఆదాయ సూచిలో ముందున్నామని చెప్పుకుంటున్న గుజరాత్ తలసరి ఆదాయం కంటే కూడా రూ.20వేలు ఎక్కువని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితుల ప్రకారం తెలంగాణ బడ్జెట్ రూ. 60-65 వేల కోట్లకు మించి పోయే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు లక్ష్యంగా ప్రజలను మోసం చేయచూడటం  బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.

అంకెల గారడీతో ప్రభుత్వం అన్నివర్గాలను మోసం చేయడం దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేతతాటి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ధోరణిని అసెంబ్లీ లోపల, బయట ఎండగడుతామని హెచ్చరించారు. ఈ బడ్జెట్ కొత్తసీసాలో పాత సారాలా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. శాఖల వారీగా లెక్కలు చూపమంటే అధికార పక్షం జావగారిపోతోందన్నారు.

నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా


నేడు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ధర్నా
యాదమరి : అక్రమ కేసు నమోదును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంట లకు ధర్నా చేయనున్నట్లు పూతలపట్టు  శాసనసభ్యుడు డాక్టర్ సునీల్‌కుమార్ తెలిపారు.  బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాదమరి మండలం మోర్థనపల్లె  సబ్‌స్టేషన్‌లో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ అకారణంగా  తమను తొలగించారని  అక్కడ విధులు నిర్వహిస్తున్న మొగలీష్, సతీష్, భాగ్యరాజ్  తెలియజేశారని తెలిపారు.

వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో సోమవారం సబ్‌స్టేషన్ వద్దకు వెళ్లాలని, ఆ సమయంలో అక్కడ షిఫ్ట్ ఆపరేటర్ తప్ప  అధికారులెవ్వరూ లేరని తెలి పారు.  రికార్డులను పరిశీలిం చి ఎప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నారని అడిగానే తప్ప మరేమీ మాట్లాడలేదన్నారు. దీనిపై అదేరోజు ఆ గ్రామంలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన టీడీపీ నాయకులు రాద్ధాం తం చేశారని, అధికారులపై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలు చేసి కేసు నమోదు చేరుుంచారని ఆరోపించా రు. మాజీ ఎంపీపీ ధనంజయులురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మనోహరన్ మాట్లాడుతూ ధర్నా కార్య క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

నయవంచన పాలనపై జనాగ్రహం

నయవంచన పాలనపై జనాగ్రహం
* ‘జన్మభూమి- మా ఊరు’లో జిల్లాపై వరాల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
* రూ.4,500 కోట్లు వెచ్చించి ఏడాదిలోగా హంద్రీ-నీవా పూర్తిచేస్తానంటూ ప్రకటన
* బెంగళూరు-అనంతపురం-పలమనేరు-కుప్పం మధ్య రింగ్‌రోడ్డు ఏర్పాటు చేస్తానని హామీ
* ప్రతి గ్రామంలోనూ పశువుల హాస్టల్, మిల్క్‌జిల్లాగా అభివృద్ధి చేస్తానని ప్రతిన
* తంబళ్లపల్లె నియోజకవర్గంలో రూ.50 కోట్లతో రోడ్లను నిర్మిస్తామని వాగ్దానం

సాక్షి,చిత్తూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను నిరసిస్తూ బుధవారం జిల్లాలో వైఎస్సార్ సీపీ కదం తొక్కింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయూల ఎదుట రైతులు,మహిళలు నిరసన గళం వినిపించారు.  ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

పార్టీలకతీతంగా రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్‌దారులు స్వచ్ఛం దంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు.  చంద్రబాబు వంచ న పాలనపై దుమ్మెత్తి పోశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన బాబుకు పుట్టగతులుండవంటూ ధ్వజ మెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తహశీల్దారు కార్యాల యాల ఎదుట ఆందోళనలు కొనసాగాయి. రైతు, డ్వాక్రా రుణ మాఫీని తుంగలో తొక్కడంతో పాటు అర్హులైన వారి పింఛన్లలో కోతపెట్టడంపై నాయకులు మండిపడ్డారు. ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి ఓట్లేయించుకుని ఏరుదాటాగ బోడిమల్లన్న అన్న సామెతగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
వైఎస్సార్ సీపీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో పుంగనూరులో  భారీ  నిరసన కార్యక్రమం జరి గింది. తిరుపతిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమ న కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు,  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో నగరిలో భారీ ర్యాలీ, ధర్నా జరిగింది. ఎమ్మెల్యే నారాయణస్వామి గంగాధరనెల్లూరు నియోజకవర్గం లోని పెనుమూరు, గంగాధరనెల్లూరులో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీ ప్రజాసేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రగిరి, పలు మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పీలేరులో, సదుంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి పలమనేరు,పెద్దపంజాణి, బెరైడ్డిపల్లె తహశీల్దార్ కార్యాలయాల వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ బంగారుపాళెం, తవణంపల్లెలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది.

తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో  పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. చిత్తూరు తహశీల్దారు కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి  శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ నాయకురాలు సామాన్యకిరణ్, మహిళా నాయకురాలు గాయత్రీదేవి పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరిగిన ఆందోళనల్లో పార్టీ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

బాబుది ప్రచార ఆర్భాటమే

బాబుది ప్రచార ఆర్భాటమే
వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరించింది. రైతు, డ్వాక్రా రుణ మాఫీ హామీ అమలు చేయలేదంటూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హుదూద్ తుపాను సహాయక చర్యల్లో విఫలమైందంటూ ధ్వజమెత్తింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల వద్ద పార్టీ భారీ ధర్నాలతో హోరెత్తించింది. పార్టీ నాయకులు,భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు.
 
* సర్కారు వైఫల్యాలపై ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ నాయకులు
* చంద్రబాబువి మోసపూరిత  హామీలంటూ ఆగ్రహం
* ప్రజాపక్షాన మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరిక
* మండల కేంద్రాలలో హోరెత్తిన ధర్నాలు
* కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

సాక్షి ప్రతినిధి..విశాఖపట్నం:  తుపాను నష్టం అంచనాలపై పూర్తి నివేదికలు రూపొందించకుండా కేవలం ప్రచారార్భాటలకే సర్కారు పరిమితమవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని(సీతమ్మధార) అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ బుధవారం భారీ ధర్నా నిర్వహిం చింది. నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ప్రధాని తక్షణం రూ. వెయ్యికోట్లు నష్టపరిహారం ప్రకటించినప్పటికి కేవలం రూ. 400 కోట్లు విడదల చేసిందంటే తుపాన్ నష్టంపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు ఎంత అసమగ్రంగా  ఉన్నాయో తెలుస్తోందన్నారు.

తుపాన్ సందర్భంగా నిత్యావసర వస్తువులలో ఎక్కువశాతం పచ్చాచొక్కాల నాయకుల గోదాములకే చేరాయని విమర్శించారు. నేటికి గ్రామీణ, గిరిజన గ్రామాల ప్రజలు విద్యుత్, నిత్యావసరాలు ఆశించినంత మేర అందక ఇబ్బందులు పడుతున్నారన్నారని విమర్శించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు మట్లాడుతూ ఎన్నికల సమయంలో రూ. లక్షలాది హామీలు గుప్పించిన చంద్రబాబు వాటి అమలుగురించి మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

తుపాను బాధితులను ఆదుకోవడం కంటే కూడా నిధులు కొల్లగొట్టడం మీదే చంద్రబాబు దృష్టి సారించారని విమర్శించారు. బాబు దుష్టపాలనకు ప్రజలు బుద్ది చెప్పేందుకు జగన్ సారథ్యంలో ఉద్యమించనున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలపై తొలి సంతకాలు చేయడమేకాకుండ వాటిని చిత్తశుద్దితో ప్రజలకు అంధించిన ఘనత సాదించిన ప్రజానాయకుడయ్యారన్నారు. నేడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఒకటి, మంత్రివర్గ తీర్మానం మరొకటి, జీవో ఇంకొకటిగా చేస్తూ ప్రజలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కమిటీలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.  
 
పార్టీ  రాష్ట్ర కార్యదర్శి వంశీకష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో  శుష్కవాగ్ధానాలతో ప్రజలను మోసగించిన చంద్రబాబు ప్రస్తుతం తన నిజస్వరూపం చూపిస్తున్నారని విమర్శించారు. పార్టీ  రాష్ట్ర కార్యదర్శి తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ తుపాన్‌ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు, జేబులు నింపుకోవడానికి చంద్రబాబు అవకాశంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు.   మాజీ ఎమ్మెల్యే బలిరెడ్డి సత్యారావు, ద క్షిణ నియోజకవర్గ సమన్వయకర్త  కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి కంపాహనోక్, నగర మహిళా అద్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రతినిధి ఫరూఖ్, కొయ్య ప్రసాదరెడ్డి ప్రసంగించారు.

కార్యక్రమంలో పార్టీ మీడియా సెల్ కన్వీనర్ జి.రవిరెడ్డి,  పక్కి దివాకర్, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు విల్లూరి భాస్కరరావు,  రాష్ట్ర బీసీ సెల్ ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, ఎస్సీసెల్ ప్రతినిధి రెయ్యి వెంకటరమణ, మాజీ కార్పోరేటర్లు నడింపల్లి కష్ణరాజు, జి.వి.రమణి, పీతల పోలారావు, జియ్యాని శ్రీధర్, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, వివిధ వార్డుల ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గున్నారు.  గాజువాక ధర్నాలో సమన్వయకర్త తిప్పలనాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితమంతా మోసపూరితమేనని దుయ్యబట్టారు.

భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, భీమిలిలలో పార్టీ భారీ ధర్నాలు నిర్వహించింది.  సమన్వయకర్త కర్రి సీతారాం మాట్లాడుతూ చంద్రబాబుకు రైతులు, పేదలు బుద్ధిచెప్పే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరించారు. పార్టీ నేతలు కోరాడ రాజబాబు, అక్రమాన వెంకటరావు, ఎస్.కరుణాకర్‌రెడ్డి, జీరు వెంకటరెడ్డిలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి ధర్నాలో  అమర్‌నాథ్‌తోపాటు పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సుబ్బారావు, భూపతిరాజు, పీతల విష్ణుమూర్తి, రాపర్తి మాధవరావులతోపాటు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
హోరెత్తిన గ్రామీణ జిల్లా
జీవీఎంసీతోపాటు, జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలు కూడా వైఎస్సార్‌సీపీ ధర్నాలతో దద్దరిల్లాయి. పాడేరు నియోజకవర్గంలో విస్తతంగా పార్టీ నేతలు ధర్నాలు చేశారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరు, జి.మాడుగుల మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల వద్ద  ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాడుగుల,కె.కోటపాడులలో ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. జెడ్పీటీసీ సభ్యురాలు జి.ప్రభావతి, మాజీ ఎంపీపీలు సన్యాసినాయుడు, డి.కొండబాబులతోపాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి, కశింకోటలలో పార్టీ నేతలు భారీ ధర్నాలు నిర్వహించారు. అనకాపల్లిలో అమర్‌నాథ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తిప్పల గురుమూర్తిరెడ్డి, ఆర్‌ఈసీఎస్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.. యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పార్టీ నేతలు భారీ ధర్నాలు నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సంసిద్ధమవుతున్నారన్నారు.

అరకు లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ  దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాదిరిగానే ప్రస్తుతం వై.ఎస్.జగన్ ప్రజల పక్షాన నిలిచి చంద్రబాబు మోసాలను ఎండగడతారన్నారు. చోడవరం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ పార్టీ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ జగన్ పోరాటానికి ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోందన్నారు.  నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు వైఎస్సార్‌సీపీ ధర్నాలతో హోరెత్తాయి. సమన్వయకర్త  పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ దివంగత సీఎం వై.ఎస్. మాదిరిగా రైతుసంక్షేమ పాలన అందించగల సత్త వై.ఎస్.జగన్‌కు మాత్రమే ఉందన్నారు.
 
ధర్నాలతో పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు దద్దరిల్లాయి. ఈ సందర్భంగా సమన్వయకర్త చెంగల వెంకట్రావు మాట్లాడుతూ మోసంతో అధికారం చేపట్టిన చంద్రబాబు ఈ ఐదేళ్లూ  ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం నాడు వై.ఎస్.లోనూ నేడు వై.ఎస్.జగన్‌లోనే ఉన్నాయన్నారు. అరకు నియోజకవర్గంలోని హకుంపేట, పెద్దబయలు మండల కేంద్రాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నాలు నిర్వహించారు.  
 
హామీలు మరిచిన టీడీపీ
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కింది. ఐదు నెలలవుతున్నా రైతు, డ్వాక్రా రుణాలను రద్దు చేయలేదు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఇప్పుడు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. హుదూద్ తుపాను పరిహారాన్ని పెంచాలి. తుపాను పరిహారం పూర్తిగా చెల్లించేంత వరకు పోరాటం తప్పదు.      - గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు.
 
మోసగించడం బాబు నైజం
రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసపూరిత ప్రకటనలు చేయడం సీఎంకు తగదు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా ఒక్క రైతు రుణాన్ని కూడా మాఫీ చేయలేదు.  సర్వేలు, కమిటీల పేరిట తొలగించిన తెల్లరేషన్ కార్డులను, పింఛన్లను పునరుద్ధరించాలి. 80 ఏళ్ల వృద్ధుల పింఛన్లు తొలగించడం దారుణం. నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలి.  
 - బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల
 
ప్రభుత్వంపై పోరాటం
బూటకపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. డ్వాక్రా మహిళలు, రైతులను నిలువునా ముంచేశారు. అక్టోబర్ నుంచి కోతలేని విద్యుత్ సరఫరా ఇస్తామన్నారు. తుఫాన్‌కు విరిగిపోయిన విద్యుత్ స్తంభాలనే పునరుద్ధరించలేదు. తాగునీటికి ఇబ్బందిపడే పరిస్థితి. ప్రభుత్వం మెడలు వంచైనా హామీలు నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. ప్రజల పక్షాన నిలుస్తుంది.
- డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్సీ

ఇది వంచన, ప్రజాద్రోహం కాదా!

బాబుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది
 • వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై ఈ ఐదు నెలల్లోనే ప్రజాగ్రహం  వ్యక్తమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ధర్నాలు విజయవంతమవడమే ఇందుకు నిదర్శనమని తెలి పారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల నిరసన వెల్లువెత్తిందన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నాలు చేసి ప్రభుత్వంపై నిరసనను తెలియజేశారని వివరించారు. రుణాల మాఫీ జరగకపోవడంవల్ల నష్టపోతున్న రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, మరమగ్గాల వారు, పింఛన్ల తొలగింపునకు గురైన నిరుపేదలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీల్లో, ధర్నాల్లో పాల్గొన్నారని వివరించారు. మొత్తం 663 మండలాల్లో ఎమ్మార్వో కార్యాలయాల ముందు ధర్నాలు జరి గాయని, ఆ తరువాత అధికారులకు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారని తెలిపారు. బుధవారంనాటి ధర్నాలు ఒక హెచ్చరిక మాత్రమేనని చెప్పారు. నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు అభినందనలు తెలిపారు.
 
ఇది వంచన, ప్రజాద్రోహం కాదా!

అనంతపురం జిల్లాలో 2012లో పాదయాత్ర  చేసినప్పుడు రుణాలు, వడ్డీలు చెల్లించవద్దని రైతులు, మహిళలకు బాబు చెప్పారని.. అధికారంలోకి వచ్చాక  కాలం వెళ్లబుచ్చుతున్నారని ఉమ్మారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పేద అరుపులు అరవడం వంచన, ద్రోహం కాదా అని ప్రశ్నించారు.
 

తిరగబడ్డ రైతుబిడ్డ


 • 661 మండల కేంద్రాల్లో కదం తొక్కిన పార్టీ శ్రేణులు
 •  తహశీల్దార్ కార్యాలయాల ముట్టడి, ధర్నాలు
 •  భారీ ర్యాలీలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు
 •  దద్దరిల్లిన మండల కేంద్రాలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు
 •  స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ప్రకటించిన ప్రజలు
 •  ముందుండి నడిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు
సాక్షి నెట్‌వర్క్: మాట తప్పిన ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడ్డారు... మాయ మాటలు చెబుతున్న చంద్రబాబుపై మండిపడ్డారు... సర్కారు ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఉద్యమించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను వెంటనే మాఫీ చేయూలని నినదించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 661మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు.
ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో మండల కేంద్రాలన్నీ దద్దరిల్లాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించారు. పలు జిల్లాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో సోంపేటలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ను అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో  తహశీల్దార్ కార్యాల యానికి తాళాలు వేసి పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయూలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతపురం జిల్లా పాదయాత్రలో రైతు రుణాలను మాఫీ చేస్తానని బాబు ప్రకటించారని, ఇప్పుడు షరతులు విధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు గురునాథరెడ్డి దుయ్యబట్టారు.

ఇది ఆరంభం మాత్రమేనని, చంద్రబాబు సర్కారు గద్దెదిగే దాకా ఉద్యమిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. మాట తప్పిన బాబును ప్రశ్నించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగడం కష్టమేనని, ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేసులు, రౌడీషీట్లకు భయపడి ఇళ్లలో కూర్చోమని, వైఎస్సార్ రాజకీయ వారసులుగా ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో చెప్పారు.

కొత్త రుణాలు లభించక పొదుపు మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆవేదన వ్యక్తంచేశారు.ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిందేనని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించి మోసగించాలని చూస్తే సహించేది లేదని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శాసనసభలో ఆ పార్టీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. చంద్రబాబు సర్కారు మెడలు వంచైనా రుణమాఫీ అమలు చేయించే వరకు తమ పార్టీ నిద్రపోదని జగ్గంపేటలో అసెంబ్లీలో శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యేల ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు తెలిపారు.
 
అన్ని జిల్లాల్లోనూ అదే హోరు...

ఎన్నికల హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను తక్షణం మాఫీ చేయూలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఆందోళనలు అన్ని జిల్లాల్లోనూ విజయవంతమయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్లు, నేతలు, పార్టీ శ్రేణులతో పాటు రైతులు, డ్వాకా మహిళలు భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల కార్యాలయాలను ముట్టడించడంతో పాటు వాటి ఎదుట ధర్నాకు దిగారు.అన్ని మండలాల్లోనూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి సమస్యను తేవాలని కోరారు.

ఏపీలో 'పోరుబాట' విజయవంతం

Written By news on Wednesday, November 5, 2014 | 11/05/2014


ఏపీలో 'పోరుబాట' విజయవంతం: ఉమ్మారెడ్డి
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'పోరుబాట' ధర్నాలు బుధవారం విజయవంతం అయ్యాయని వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నివర్గాలనుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారని ఆయన ఎద్దేవా చేశారు. 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. ఆత్మవంచన మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రజా ద్రోహానికి పాల్పడుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రజాగ్రహానికి గురికావద్దని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న అన్నివర్గాల ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ: పొంగులేటి


తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ: పొంగులేటి
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ అంటూ పొంతన లేని అంకెలతో గారడీ చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను లక్ష కోట్ల  బడ్జెట్ అనడం హాస్యాస్పదంగా ఉందని పొంగులేటి అన్నారు.

తెలంగాణ బడ్జెట్ అంతా అస్పష్టతగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్ లెక్కలు ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నాయన్నారు.

పోరుబాటకు పోటెత్తిన జనం

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాలు విజయవంతం అయ్యాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రుణమాఫీపై రోజుకో మాట చెబుతున్న టీడీపీ సర్కారుపై ఆందోళనకారులు మండిపడ్డారు. ఫించన్ల కోతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హుద్‌హుద్ తుపాను బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ధర్నాల్లో పాల్గొన్నవారందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. వచ్చే నెల 5వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

ప్రజల పక్షాన పోరాటం

ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాటం
సాక్షి, ఖమ్మం: బడుగు, బలహీన వర్గాలు, రైతులు, ప్రజల పక్షాన అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ గళం విప్పుతుందని పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శిం చారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి అప్పుల పాలైన రైతులు ఇప్పటికే 230 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవే శపెట్టిన సంక్షేమ పథకాల కొనసాగింపుపై వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్షనేత, అశ్వారావుపేట ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు, గిరిజన వర్సిటీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం తదితర అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.

టీడీపీ మైండ్ గేమ్

టీడీపీకి అపఖ్యాతి మిగిలింది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి

 ప్రొద్దుటూరు:
 అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లకు టీడీపీ అపఖ్యాతి తెచ్చుకుంటుందనుకుంటే ఆరు నెలలకే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ వాస్తవానికి వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్పాయన్నారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు  రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ,  ఇంటికో ఉద్యోగం, ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు ఇలా ప్రతి వర్గానికి సంబంధించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ ఆ హామీలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని అన్ని మండలాల్లో జరపతలపెట్టిన ధర్నా కార్యక్రమాలను
విజయవంతం చేయాలని కోరారు.

 సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, ప్రొద్దుటూరు, రాజుపాళెం మండల కన్వీనర్‌లు కల్లూరు నాగేంద్రారెడ్డి, ఎస్‌ఏ నారాయణరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, 17వ వార్డు కౌన్సిలర్ అనసూయ, గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్ ప్రసంగించారు.

 మాట మరచిన బాబు
 మైదుకూరు టౌన్: ఎన్నికల ముందు ఆల్ ఫ్రీ అంటూ మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేక రోజుకో మాట మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు.

మంగళవారం మైదుకూరులో వైఎస్సార్‌సీపీ యువనాయకుడు శెట్టిపల్లె నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆ హామీలను నెరవేర్చలేక తన ఇష్టానుసారంగా పాలన సాగిస్తుంటే ఊరుకుండే ప్రసక్తే లేదన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

 టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది : ఎమ్మెల్యే రాచమల్లు
 కార్యకర్తలతో ప్రచారం చేయిం చడం  ద్వారా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ముందు గా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద ప్రచారం చేస్తున్నారన్నారు.

ముందుగా తాను రాజీనామా చేస్తున్నానని, తర్వాత జమ్మలమడుగు, రాయచోటి ఇలా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబంపై తనకు అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, జగన్‌మోహన్‌రెడ్డి అడిగితే ఎమ్మెల్యే పదవే కాదు తన ప్రాణాలను అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చె ప్పారు. ఈ జీవితం ఉన్నంత వరకు తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని తెలిపారు. ఇలాంటి విష ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు.

కలిచెర్లకు జగన్ పరామర్శ

కలిచెర్లకు జగన్ పరామర్శ
పంజగుట్ట: కర్నూలు వద్ద మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. నిమ్స్ మిలీనియం బ్లాక్ 124 రూంలో చికిత్స పొందుతున్న ఆయనను జగన్ పరామర్శించి ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

కలిచెర్లకు నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రూపమ్ వైద్యం అందిస్తున్నారు.  నిమ్స్‌కు వచ్చిన జగన్‌ను చూసేందుకు రోగుల బంధువులు పోటీ పడ్డారు. నల్లగొండ జిల్లా మోత్కూర్‌కు చెందిన పార్వతమ్మ జగన్ వద్దకు వచ్చి తన కొడుకు నరేష్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడని చెప్పడంతో జగన్ అక్కడ ఉన్న జూనియర్ వైద్యులకు డా.శేషగిరిరావుతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Popular Posts

Topics :