16 November 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఇరు రాష్ట్రాల సమస్యలను సభలో ప్రస్తావించండి: వైఎస్ జగన్

Written By news on Saturday, November 22, 2014 | 11/22/2014


ఇరు రాష్ట్రాల సమస్యలను సభలో ప్రస్తావించండి: వైఎస్ జగన్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు సూచించారని ఆ పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాంపై వైఎస్ జగన్ అధ్యక్షతన శనివారం  లోటస్ పాండ్ లో సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాలలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసం సంబంధిత మంత్రులు, అధికారులను కలసి చర్చించాలని వైఎస్ జగన్  సూచించారన్నారు.
పెండింగ్ ప్రాజెక్ట్ లకు కేంద్రం తక్షణమే నిధులు విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా వ్యవహారించాలని వైఎస్ జగన్  తెలిపారని  ఆయన అన్నారు. అలాగే హుదూద్ తుపాను సాయం, రైతుల సమస్యలు, ముంపు మండలాలు తదితర అంశాలపై పార్లమెంట్ లో తమ గళంవినిపిస్తామని మేకపాటి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీతను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను మరోసారి కోరతామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ హాజరయ్యారు.

పార్టీ ఎంపీలతో నేడు వైఎస్ జగన్ సమావేశం

పార్టీ ఎంపీలతో నేడు వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ కార్యాలయంలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు సమావేశం కానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు తదితర అంశాలను చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

పాలమూరులో 5 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో పర్యటన

8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్ : పాలమూరులో 5 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో పర్యటన
వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి వెల్లడి
అనంతరం తెలంగాణలోని మిగతా జిల్లాల్లో యాత్ర

 
 సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల డిసెంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆమె జిల్లాలో 4 నుంచి 5 రోజుల పాటు షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, కొడంగల్, వనపర్తి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు.
 
 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన 16 కుటుంబాలను పరామర్శిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గతంలోనే ఓదార్పు యాత్ర చేపట్టారు. వివిధ కారణాల వల్ల ఆ తరువాత ఈ ప్రాంతంలో ఓదార్పు కార్యక్రమం సాగలేదు. దీంతో తాజాగా పరామర్శ యాత్రకు షర్మిల శ్రీకారం చుడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా యాత్ర పూర్తయ్యాక తెలంగాణలోని మిగతా ఎనిమిది జిల్లాల్లో కూడా షర్మిల పర్యటిస్తారు.

 
              మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి తదితరులు 
 
ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ  వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం యాత్రకు తుదిరూపునిచ్చింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో పాటు తెలంగాణ సీనియర్ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జనక్ ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో రైతుల ఆత్మహత్యలు, విష జ్వరాల వల్ల మరణాలు, ఇతర ముఖ్యమైన సమస్యలపైనా చర్చించారు.
 
 మనోధైర్యాన్ని కలిగిస్తారు: పొంగులేటి

 2009 సెప్టెంబర్ 25న కర్నూలు జిల్లా నల్లకాలువ సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడిందని... దీంతో డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లాలో ‘పరామర్శ యాత్ర’ను వైఎస్సార్ కుమార్తె షర్మిల ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు ఆమె మనోధైర్యాన్ని కలిగిస్తారని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో.. ఈ పరామర్శ యాత్రతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, విష జ్వరాల బారిన పడి గిరిజనులు, గిరిజనేతరులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 8నుంచి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Friday, November 21, 2014 | 11/21/2014


డిసెంబర్ 8నుంచి వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ తెలంగాణ కమిటీ నాయకురాలు వైఎస్ షర్మిల డిసెంబర్ 8వ తేదీ నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర చేస్తారని పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాల దగ్గరకు ఆమె వెళ్తారని, మొత్తం 16 కుటుంబాల వారిని పరామర్శిస్తారని చెప్పారు. వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వడమే వైఎస్ షర్మిల పర్యటన ప్రధానోద్దేశమన్నారు.

అనివార్య కారణాల వల్ల ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లోనూ ఓదార్పు యాత్ర జరగలేదని, ఆయన వెళ్లలేకపోయిన జిల్లాలకు వైఎస్ షర్మిల వెళ్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పాలమూరు మినమా మిగిలిన జిల్లాల్లో జనవరి నుంచి పరామర్శ యాత్ర ఉంటుందని ఆయన వివరించారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, విషజ్వరాలతో ప్రజలు మరణిస్తున్నారని , ఈ విషయంపై వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కమిటీ చర్చించిందని పొంగులేటి తెలిపారు. తాము అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా రాష్ట్ర కమిటీ చర్చించిందన్నారు.

విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష


విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతంపై ఆయన...జిల్లా నేతలతో చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనున్న విషయం తెలిసిందే.
 
కాగా ధర్నా అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష


నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ జిల్లా నేతలతో ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా ధర్నా అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు.

పంపుసెట్లకు ఎగనామం పెట్టడానికేనా ఆధార్?

Written By news on Thursday, November 20, 2014 | 11/20/2014

ఉచిత విద్యుత్తుకు కూడా ఆధార్ తో లింకు పెట్టడమంటే.. 40 శాతం పంపుసెట్లకు ఎగనామం పెట్టడమేనని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఆధార్ పై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు.. ఇప్పుడెందుకు ఇలా మారారని ఆమె ప్రశ్నించారు. అధికారంలో లేనప్పుడోమాట, ఉన్న తర్వాత మరో మాట ఎందుకని అడిగారు. ఆధార్ వంకతో లక్షలాది లబ్ధిదారుల పొట్ట కొడుతున్నారని, అసలు సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు వద్దని సుప్రీంకోర్టు చెప్పిన విషయం మీకు తెలియదా అని నిలదీశారు. మీ సౌకర్యాలకు లేని పిసినారితనం పేదల దగ్గరకు వచ్చేసరికి ఎందుకని అడిగారు. తక్షణం మీ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

దివంగత వైఎస్ఆర్ పై ఒక చానల్, పత్రిక విష ప్రచారం చేస్తున్నాయని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బతికుండగానే ఎన్టీఆర్ ను సమాధి చేసిన చేతుల్లో మీదీ ఒకటన్న విషయం గుర్తులేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణించినా మీ గుండెల్లో నిద్రపోతున్నారని, అందుకే ఈ ఉలికిపాటని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయం మార్చి కొన్ని రోజులు కూడా కాకముందే స్థలాభావం వల్ల పక్కన ఉంచిన వైఎస్ఆర్ విగ్రహంపై కథనాలు ప్రసారం చేశారని ఆమె అన్నారు.

ప్రభుగౌడ్ ను పరామర్శించిన వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మెదక్ జిల్లా పార్టీ నేత ప్రభుగౌడ్ ను పరామర్శించారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని...వైఎస్ జగన్ పరామర్శించి, ఆరోగ్యం గురించి ఆరా తీశారు.   ప్రభుగౌడ్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రజలను విస్మరిస్తే.. పోరాటమే

ప్రజలను విస్మరిస్తే.. పోరాటమే
నల్లగొండ/నల్లగొండ టుటౌన్ : పేదప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని...ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రభుత్వ పనితీరు ఎండగట్టడంతో పాటు..ప్రజలకు కొండంత అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. అర్హుల పేరుతో ఫించన్లలో కోత విధిస్తున్నారని, దీంతో పేదవారికి తీరని నష్టం జరుగుతోందన్నారు. ఫ్లోరైడ్ బాధితుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించేవిధంగా పింఛన్ నిబంధనల్లో సడలింపు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్యపరంగా వెనుకబడిన జిల్లాకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి నిమ్స్ ఆస్పత్రి మంజూరు చేశారన్నారు. అయితే ఈ ఆస్పత్రి పూర్తిచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిమ్స్ కోసం త్వరలో పార్టీ తరపున ఉద్యమిస్తామని తెలిపారు.

 పార్టీ బలోపేతం దిశగా
 ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చిందాలన్న వైఎస్ ఆశయాన్ని నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ పాటుపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా త్వరలో జిల్లా కమిటీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రక్షాళనలో భాగంగా కమిటీలో మార్పులు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారికి తప్పకు గుర్తింపు లభిస్తుంద ని పొంగులేటి చెప్పారు.

 ఎవరెవరు ఏమన్నారంటే....
 కోదాడ నియోజకవర్గ నేత ఎర్నేని వెంకటరత్నంబాబు మాట్లాడుతూ వైఎస్ మరణం తరువాత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు తగ్గిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ నియోజకవర్గ నాయకుడు నకిరేకంటి స్వామి మాట్లాడుతూ వైఎస్ పింఛన్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం తొలగిస్తూ 100 మందికి ఇచ్చే వాటిని 10 మందికే ఇవ్వడంతో బెంగతో వృద్ధులు రాలిపొతున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గూడూరు జయపాల్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ ఎండి. సలీం, మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు శ్యామ్‌సుందర్‌రెడ్డి, రవీందర్, ఎస్సీసెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు బెదరకోట భాస్కర్, మేడిశెట్టి యాదయ్య, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు, ఎండీ.ఫయాజ్, చింత నవీన్, లక్ష్మికాంత్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

 ప్రాజెక్టులు పూర్తి చేయాలి
 - వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకోకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నది. డిండి, నక్కలగండి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రజలకు సాగు, తాగు నీరివ్వాలి. శ్రీ రాంసాగర్ మూడవ దశ పనులు పూర్తిచేస్తే తుంగతుర్తి ప్రాంతానికి నీరు అందుతుంది. జిల్లాలో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా లేకపోవడం శోచనీయం. ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తున్నా ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదు. రైతులకు రుణమాఫీ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.  రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకున్నా ప్రభుత్వం పట్టంచుకోవడం లేదు.  జిల్లాలో 650 గ్రామాలకు కృష్ణా జలాలు అందించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌కే దక్కింది.

 ఫాంహౌస్‌పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదు : తాటి
 వైఎస్సార్ సీపీ శాసన సభానేత తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలోనే ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఈ జిల్లాలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదన్నారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్‌ను అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని విస్మరించారని, ఫాంహౌజ్‌పై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ సింగపూర్ జపం చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పింఛన్లు తొలగించి పేద ప్రజల పొట్ట గొడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రభుత్వంలోనే తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పింఛన్ల కోతలపై ధర్నా చేశారని, ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వెళ్లే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకోవడం నీచ రాజకీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలు అసెంబ్లీలో చర్యకు రాకుండా మంత్రులు పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 పాలకులకు ఫ్లోరైడ్ సమస్య కనిపించడం లేదా..
 - మాజీ ఎమ్మెల్సీ రెహమాన్
 పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలను పట్టి పీడుస్తున్న ఫ్లోరైడ్ సమస్య పాలకులకు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు తనకు మిత్రులేనని వారికి ఫ్లోరైడ్ సమస్య పట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ నిలదీస్తన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల్ ఇచ్చిన మహానేత వైఎస్సార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి ఒకే పింఛన్ అంటే పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు.

 వైఎస్ మరణం తర్వాత రాష్ట్రం రావణకాష్టం
 - శివకుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు
 పార్టీ రాష్ట్ర నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రం రావణ కాష్టంలా తయారైందని, ఆయన ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలను నీరు గార్తున్నారని ఆరోపించారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. కేసీఆర్ చెబుతున్న పిట్టల దొర మాటలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

 వైఎస్సార్ సీపీపై విషప్రచారం
 - సూర్యప్రకాశ్‌రావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్‌రావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై టీడీపీ విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఎన్‌టీఆర్, వైఎస్సార్‌లు జనరంజక సీఎంలు అని, చంద్రబాబు వెన్నుపోటు పొడిచే సీఎం అన్నారు. 100 అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల కోసం
 పోరాడే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అండగా ఉండి పార్టీని
 పటిష్టపర్చాలన్నారు.
 

కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి

Written By news on Wednesday, November 19, 2014 | 11/19/2014


కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి
హైదరాబాద్ :
చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలకకు ప్రాణసంకటం అన్నట్లుందని చెప్పారు.

భూములిచ్చి తాము ఏమైపోవాలన్న దిగులుతో రైతులు కుంగిపోతున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపి, రైతులను అర్థం చేసుకోవాలన్నారు. ఆయనను రైతుద్రోహిగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్ సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?


మంత్రులూ.. లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రులు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజధాని భూసేకరణకు రైతులు అంగీకారం తెలిపారంటున్న మంత్రుల ప్రకటనలు వాస్తవ విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

ఇదే విషయంపై మంత్రులకు లై డిటెక్టర్ పరీక్షలు చేయిద్దామని ఆయన అన్నారు. వాళ్లతో పాటు రైతులకు, తమకు కూడా ఈ పరీక్షలు చేయించాలని, అప్పుడు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తేలిపోతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

వచ్చే నెల 5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా


వచ్చే నెల 5న విశాఖలో వైఎస్ జగన్ మహాధర్నా
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు డిసెంబర్ 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుంది. విశాఖపట్నంలో జరిగే మహాధర్నాలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా నేతలతో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాజధాని భూముల వ్యవహారంపై రైతుల అభిప్రాయాలను వైఎస్ జగన్ కు వివరించినట్టు ఆయన తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించిందని తెలిపారు. మిగిలిన గ్రామాల పర్యటన పూర్తైన తర్వాత వైఎస్ జగన్ కు నివేదిక ఇస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసే విషయం కూడా చర్చించామన్నారు

నిత్యానందరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన వైఎస్ జగన్

తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఆయన క్షేమ సమాచారంతో పాటు, సంఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ...నిత్యానందరెడ్డిని పరామర్శించారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఘటనపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో  ప్రకటన చేస్తామని తెలిపారు.  బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆగంతకుడు ....నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.

జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి

జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయూలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య మంగళవారం సాయంత్రం కలెక్టర్ సిహెచ్.విజయ్ మోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణకు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం దారుణమైన విషయమన్నారు. కేసులో నిందితుడిగా ఉండి కూడా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అరుునా అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ కూడా ఆయనను అరెస్టు చేయూలని కోరుతోందన్నారు.

ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు జెడ్పీ చైర్మన్‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి నిలదీశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న సీఎం ఈ విషయంపై స్పందించకపోవడం సరికాదన్నారు.

మొన్నటి దాకా అజ్ఞాతంలో ఉన్న చైర్మన్ సోమవారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని బట్టి ఉన్నత స్థాయిలో మ్యానేజ్ చేసుకొని వచ్చినట్లుగా తెలుస్తోందన్నారు. తక్షణం అరెస్టు చేయకపోతే డీజీపీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులను కలుస్తామని, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉన్నత స్థాయి నుండి వచ్చిన ఆదేశాలకు లొంగి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎమ్మెల్యేలు గౌరుచరిత, ఐజయ్య ఆరోపించారు. ఇప్పటికైనా అరెస్టు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

నేడు గుంటూరు నేతలతో జగన్ భేటీ

నేడు గుంటూరు నేతలతో జగన్ భేటీ
21న విశాఖ జిల్లా నేతలతో సమావేశం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19న(బుధవారం) గుంటూరు, 21న(శుక్రవారం) విశాఖపట్టణం జిల్లాల నేతలతో సమావేశమవ్వనున్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్‌పాండ్‌లో ఈ సమావేశాలు జరుగుతాయి. అలాగే త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ఈ నెల 22న పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 24, 25 తేదీల్లో ఒంగోలులో ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయి. జగన్ ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.

ప్రభుత్వానికే స్పష్టత లేకుంటే రైతులు భూములు ఎందుకిస్తారు

ప్రభుత్వం చెప్పేది చెవిలో పూలు పెట్టుకుని వినాలా ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై చంద్రబాబు ప్రభుత్వానికి స్పష్టత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ప్రభుత్వానికే స్పష్టత లేకుంటే రైతులు భూములు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ లో సాక్షి హెడ్ లైన్ షోలో పాల్గొన్న ఆమె  మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం విషయంలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏం చెబితే అది చెవిలో పూలు పెట్టుకుని వినాలా అని ప్రభుత్వాన్ని వాసిరెడ్డి పద్మ మరోసారి ప్రశ్నించారు. ల్యాండ్ మాఫియాకు ప్రభుత్వం ఆశీస్సులున్నాయని ఆమె తెలిపారు.
రాజధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆమె గుర్తు చేశారు. ఆ కమిటీ ఈ అంశంపై చర్చ జరపాలని సూచించిందని.... ఆ విషయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం విస్మరించారని ఆమె విమర్శించారు. .

24, 25 తేదీల్లో ఒంగోలులో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Tuesday, November 18, 2014 | 11/18/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గుంటూరు, విశాఖ జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. ఈనెల 19న (బుధవారం) గుంటూరు జిల్లా నేతలు, 21న విశాఖ జిల్లా నేతలతో ఆయన హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అవుతారు. 

అలాగే రానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 22న లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ ...పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. కాగా ఈనెల 24, 25 తేదీలలో ఒంగోలులో జరిగే ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొంటారు.

Land deniers not invited to meet N Chandrababu Naidu

Hyderabad: The proposed meeting between AP Chief Minister N. Chandrababu Naidu and the farmers of 29 villages of the capital on Tuesday will not be attended by those opposed to the government’s land pooling proposal.
Farmers of around 11 villages do not want to give their land for construction of the new capital. On being contacted, they said that they had no information about the meeting in Hyderabad. According to them, the proposed meeting of the farmers with Mr Naidu would turn out to be a TD party meeting.
The main purpose of the meeting is for Mr Naidu to explain the advantages and benefits of the land pooling scheme to the farmers.
However, the local TD leaders have selected five farmers from each village, who are willing to give their lands, but not anyone who is opposed to it.
The meeting will be attended by some TD ZPTC, MPTC members and sarpanches along with farmers, who are pro-land pooling.
M. Seshagiri Rao, a farmer of Rayipudi village in Guntur district, said that the farmers of 11 villages were not ready to give up their lands. He added that no one had invited them to attend the meeting at Hyderabad with the CM.
“The meeting will be attended by the TD leaders and those, who are willing to give their lands…what is the use of that meeting? The Chief Minister has to convince the farmers, who are not willing to give their lands,” he said.
Another farmer, Srinivasa Reddy of Nidumarru in Guntur district said that only pro-TD and pro-land pooling farmers had been selected for the meeting and added that no body from his village had been selected.
He questioned the need to convince those farmers, who were already willing to give their land for the construction of the capital.

వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం

వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తాం
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న పరిస్థితుల్లో తాను ఖమ్మం ఎంపీగా విజయం సాధించడంతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించామని, ఈ స్ఫూర్తితో రాష్ర్టంలో వైఎస్‌ఆర్ సీపీకి పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

సోమవారం జిల్లాకేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన వైఎస్‌ఆర్ సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వలసలకు పేరొందిన పాలమూర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం అధికారంలో ఉన్న పాలకులు వాటిని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు.

తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశించారని, కానీ ఆర్నెళ్ల కాలవ్యవధిలోనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు. 8 గంటలపాటు కరెంట్ ఇస్తామని ప్రజలను నమ్మించిన కేసీఆర్, మరో మూడేళ్లదాకా కరెంట్ కష్టాలు ఇలాగే ఉంటాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

 పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశాం
 పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచీ జిల్లాలో చురుగ్గా పనిచేస్తున్నామని, రాష్ట్ర పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేశామని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సీజీసీ సభ్యుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. షర్మిలమ్మ జిల్లాలో చేపట్టిన మరోప్రస్థానం పాదయాత్రను చరిత్రలో కనివినీఎరుగని రీతిలో జయప్రదం చేశామని, కల్వకుర్తి నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో చనిపోయిన ఓ రైతు కుటుంబానికి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను పిలిపించి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించామని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోకపోతే ప్రజలపక్షాల పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. అదే సందర్భంలో అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.
 -ఎడ్మ కిష్టారెడ్డి

 ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్
 పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నారని విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సమావేశానికి వచ్చిన జనాన్ని చూస్తే ప్రజల గుండెల్లో వైఎస్ ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకాశ్‌రావు అన్నారు. జిల్లాను చంద్రబాబు దత్తత తీసుకుని ఒరగబెట్టిందేమిలేదన్నారు. ఇక్కడినుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా జిల్లా అభివృద్ధికి ఏమీచేయడం ఏదన్నారు.         -సూర్యప్రకాశ్‌రావు

 జిల్లాలో పార్టీ బలంగా ఉంది
 వేలాదిమంది అ భిమానులు సమావేశంలో పాల్గొనడాన్ని చూస్తే జిల్లాలో పార్టీ బలంగా ఉందనే విష యం తెలుస్తుందని పార్టీ రాష్ట్ర నేత జనక్‌ప్రసాద్ అన్నారు. ప్రజల కష్టాలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం వల్లే పార్టీ చెక్కుచెదరలేదన్నారు. ప్రజాసమస్యలపై చర్చించడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని, సీఎంకు ఇవ్వడానికి వెళ్తే అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. సీఎంను మరోసారి కలవడానికి ప్రయత్నిస్తామని అప్పటికీ స్పందించకపోతే ఆయన క్యాంపు ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని తేల్చిచెప్పారు.                                  -జనక్‌ప్రసాద్

 ఎలక్షన్లు, కలెక్షన్లే కేసీఆర్ ధ్యేయం
 మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచిన కేసీఆర్ కనిపించడం లేదని జిల్లా ప్రజలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎ.రహెమాన్ అత్తాస్ గుర్తుచేశారు. ఎలక్షన్లు, కలెక్షన్లు, కన్‌స్ట్రక్షన్లు ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.  ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన బూటకమన్నారు.                 -రహ్మాన్

 ప్రత్యర్థి పార్టీల నోళ్లు మూతపడక తప్పదు
 జిల్లాలో వైఎస్‌ఆర్ సీపీ లేదని పలుపార్టీల నాయకులు విమర్శించారని,  సమావేశానికి వచ్చిన జనాన్ని చూసి వారి నోళ్లు మూతపడక తప్పదని రాష్ట్ర నేత గట్టు రాంచందర్‌రావు అన్నారు. స్వార్థం కోసం కొంతమంది లీడర్లు పార్టీని వీడినప్పటికీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరకుండా ఉందన్నారు. జిల్లాలో 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 157 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జిల్లా పార్టీకి, కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డికే దక్కిందన్నారు.    అభద్రతా భావంతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు తిరిగి  పార్టీలోకి రావాలన్నారు.       -గట్టు రాంచందర్‌రావు

 సమావేశంలో తీర్మానాలివే..
వ్యవసాయ అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు
రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేయాలి.
వర్షాభావ పరిస్థితులు సక్రమంగా లేనందున కరువు జిల్లాగా
ప్రకటించి పంట నష్టపరిహారం, కరువు సహాయం
అందించాలి.
రబీసీజన్‌లో ఏడుగంటలపాటు కరెంట్‌ను సరఫరా చేసిఙ
రైతులను ఆదుకోవాలి.
కబేళాలకు తరలిపోతున్న పశుసంపదను ఆదుకోవడానికి
{పభుత్వం ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలి.
వృద్ధాప్య పింఛన్ల వయస్సును 60 ఏళ్లకు కుదించాలి.
ఉపాధి హామీ పథకాన్ని అమలుచేసి గ్రామీణప్రాంతాల్లో
రైతు కూలీలకు పని కల్పించాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించి విద్యార్థుల్లో
ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టాలి.
జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు సమకూర్చి
వాటిని వెంటనే పూర్తిచేయాలి
జిల్లాను ఎడారిగా మార్చే జూరాల-పాకాల పథకాన్ని
రద్దు చేయాలి

రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉన్నాయా?

రాజధానిపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
* నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఎందుకు
* రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన ఉన్నాయా?
* వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర రాజధాని నిర్మాణం, భూముల సేకరణపై అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ప్రధాన రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని భూ సేకరణపై కృష్ణా తీరంలోని గుంటూరు జిల్లా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చట్టాలను ప్రయోగించైనా సరే భూములు సేకరిస్తామని  బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ప్రజా ప్రయోజనాలకే చట్టాలను వినియోగించాలి కానీ ప్రజా హక్కులను ఉల్లఘించేందుకు కాదని బాబు గుర్తించాలని ధర్మాన సూచించారు. రాజధాని నిర్మాణానికి ఏకంగా 30 వేల ఎకరాలు అవసరమవుతాయని టీడీపీ నేతలు వాదిస్తుండటం అనుమానాలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వేలాది ఎకరాల భూములు సేకరించి రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెబుతోందని, ఆ భూములను నమ్ముకున్న కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా అక్కడ ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ కుల వృత్తులను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటన్నారు. రాజ ధాని నిర్మాణం కోసం భూ సేకరణ చట్టబద్ధంగా జరగాలని, ఇందుకోసమే తాము అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
 
రాష్ర్టంలో పాలన ఉందా
రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే  ప్రభుత్వం ఉన్నట్టు గానీ.. పరిపాలన సాగుతున్నట్టు గానీ కనిపించడం లేదని ధర్మాన వ్యాఖ్యానించారు. పరిపాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు రాష్ట్రాన్ని భూతల స్వర్గం చేస్తానంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నారన్నారు.
 
పచ్చ చొక్కాలకే పింఛన్లు
రేషన్‌లో కిలో బియ్యం రూపాయికే అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను మాత్రం టన్ను రూ.2 వేలకు పెంచిందని, అంటే కిలో రూ.2 పడుతోందని ధర్మాన అన్నారు. ఆ ఘనత బాబు ప్రభుత్వానిదేనని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పసుపు చొక్కా వేసుకున్న వారికే పింఛను, తెలుగుదేశం జెండా కట్టినవాడికే ఇల్లు అన్నట్లుగా పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెందేలా చర్యలు తీసుకోవడంతో అసలు లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.

మోదీ..భారత్ అంటుంటే...చంద్రబాబు మాత్రం...

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రహస్య అజెండా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ఉదయం 'సాక్షి' హెడ్ లైన్ షోలో మాట్లాడుతూ మోదీ భారత్...భారత్ అంటుంటే... చంద్రబాబు మాత్రం సింగపూర్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
 

త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర: పొంగులేటి

Written By news on Monday, November 17, 2014 | 11/17/2014


త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల యాత్ర: పొంగులేటి
మహబూబ్ నగర్: త్వరలో తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లాలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని పొంగులేటి వెల్లడించారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందని ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
 
రైతుల ఆత్మహత్యలకు సంబంధించి జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, శివకుమార్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు సభ నివాళులర్పించింది. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో చాలా అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను వైఎస్సార్ ప్రారంభించారని.. తర్వాత ఏ నాయకుడికీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచన కూడా లేదని విమర్శించారు. తగిన విద్యుత్ లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు.
 
రైతులకు పరిహారం అందుంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావని పొంగులేటి తెలిపారు. ఆత్మహత్యల చేసుకున్న రైతులను తిరిగి బతికించగలుగుతామా?అని ప్రశ్నించారు. ఎండిన ప్రతి ఎకరాకు రూ. 25 వేల చొప్పున పరిహారం ప్రకటించాలన్నారు. తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని.. ప్రజల కష్టాలపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేపట్టనున్నట్లు పొంగులేటి తెలిపారు.

ఒత్తిళ్లకు తలొగ్గవద్దు


ఒత్తిళ్లకు తలొగ్గవద్దు
ఆళ్లగడ్డ: అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో ఆదివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలాల వారీగా అర్హత ఉన్నవారి పింఛన్‌లను తిరిగి పునరుద్ధరించాలని సూచించారు. ఆరు మండలాలకు మంజూరైన ఎస్సీ కార్పొరేషన్ నిధుల వివరాలను తెలుసుకున్నారు.

ఉపాధి హామీ కింద ఉపయోగకరమైన పనులను గుర్తించాలని చెప్పారు. దొర్నిపాడు మండలంలోని అర్జునాపురం, ఆళ్లగడ్డ మండలంలోని శాంతినగరం గ్రామాల్లో రెండు నెలల నుంచి పింఛన్‌లు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు. కొటకందుకూరు గ్రామంలో 200కుపైగా పింఛన్‌లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. శిరివెల్ల మండలంలోని కప్పలకుంటలో తాగునీటి కోసం శోభానాగిరెడ్డి హయూంలో విడుదలైన రూ.29 లక్షల నిధులకు సంబంధించి టెండర్‌లు జరిగాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలుంటే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేశారు.

ప్రజలకు బాబు పంగనామాలు: వైఎస్ జగన్‌

Written By news on Sunday, November 16, 2014 | 11/16/2014

ప్రజలకు బాబు పంగనామాలు: వైఎస్ జగన్‌
* ధ్వజమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటన
పాలగిరిలో వైఎస్ విగ్రహావిష్కరణ
పసుపు రైతుల దీనస్థితిపై అసెంబ్లీలో చర్చిస్తానని హామీ

 
సాక్షి ప్రతినిధి, కడప: అధికారమే లక్ష్యంగా అలవికాని హామీలు గుప్పించిన చంద్రబాబు  అధికారంలోకి రాగానే ప్రజలకు పంగనామాలు పెట్టారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. కమలాపురం నియోజకవర్గంలోని పాలగిరిలో ప్రతిభ బయోటెక్ ఎండీ ఐ.రాజశేఖర్‌రెడ్డి నెలకొల్పిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఓబులాపురంలో వెంకటరమణ, గురివిరెడ్డి, తిరుపాలయ్య పొలాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రాజకీయాలు చూశాం... ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం.
 
 అప్పట్లో మాట ఇస్తే ఆ మాట కోసం పరితపించేవారు. ఇవాళ అధికారం కోస మే దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఏవే వో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు’’ అని విమర్శించారు. రాజకీయాల్లో ఒక మాటంటూ ఇస్తే, ఆ మాటకోసం ఎందాకైనా వెళ్లాలన్నారు. ఆ మాటే శిలా శాసనంగా ఉండాలన్నారు. ‘‘ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి పెట్టి మైదుకూరు వెరైటీ రకం పసుపు సాగు చేశాం. ఇటీవల కలుపు నివారణకు ఓడీసీ మందు, సీడ్ మందు పిచికారీ చేశాం. పదిరోజుల తర్వాత ఎండిపోతూ పంట క్షీణించింది.
 
 మాకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తే పోలీసులతో తరిమారు. లాఠీ చార్జి చేయించారు. ఆదుకోవాలయ్యా...’’అని రైతు ప్రతినిధులు లెక్కల వెంకటరెడ్డి, పోలు కొండారెడ్డిలు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు.  పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ దక్కకపోవడానికి కేవలం సీఎంవైఖరే కారణమని ధ్వజమెత్తారు. పంట రుణాలు రెన్య్సూవల్స్ చేసి ఉంటే బీమా వర్తించేదని, రుణమాఫీ కారణంగా రైతులెవరూ రుణాలు రెన్సూవల్స్ చేసుకోకపోవడంతో ఈరోజు బీమా కోల్పోయారని చెప్పారు. ఇదే విషయంపై మరోమారు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు రైతు ప్రతినిధులు బృందంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.

మూడు రోజుల పర్యటన విజయవంతం

నీరాజనం
సాక్షి కడప/పులివెందుల/కమలాపురం/వీఎన్ పల్లె: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పులివెందుల నుంచి మైదుకూరు వరకు గ్రామగ్రామాన అఖండ స్వాగతం లభించింది. పులివెందుల నుంచి బయలు దేరిన వైఎస్ జగన్‌రెడ్డిని ప్రతి గ్రామం వద్ద అభిమానులు కాన్వాయ్‌ని ఆపి కరచాలనం చేస్తూ వచ్చారు.

ఎర్రిపల్లి, గోటూరు, ముతుకూరు, రామిరెడ్డిపల్లె, పాలగిరి, వీఎన్‌పల్లె, గంగిరెడ్డిపల్లె, అయ్యవారిపల్లె, కీర్తిపల్లె, పాయసంపల్లె, బయనపల్లె, చిన్నచెప్పలి, పెద్దచెప్పలి, కొండాయపల్లె, జంగంపల్లె, కమలాపురం వరకు ప్రతిచోటా జనాలు రోడ్డుపైకి వచ్చి జగన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ వచ్చారు. వైఎస్ జగన్‌రెడ్డితో కరచాలనం చేసిన తరవాతనే సాగనంపుతూ వచ్చారు.

 ఏమమ్మా... పంటలు ఎలా ఉన్నాయి
 పులివెందుల-కొండ్రెడ్డిపల్లె రహదారి మధ్యలో ఒక చోట కాన్వాయ్‌ని ఆపి వైఎస్ జగన్‌రెడ్డి పంటను పరిశీలించారు. సాగులో ఉన్న పత్తి పంటను తిలకించారు. మహిళా రైతు ఈశ్వరమ్మతో మాట్లాడారు. ఏమమ్మా.. పంటలు ఎలా ఉన్నాయి. పెట్టుబడి ఎంత.. అని వైఎస్ జగన్ ప్రశ్నించగానే ఈశ్వరమ్మ దాదాపు రూ.50వేలకు పైగా పెట్టుబడి అయిందని వివరించారు.

 పాలగిరిలో వైఎస్‌ఆర్ విగ్రహావిష్కరణ
 వీఎన్ పల్లె మండలం పాలగిరిలో ప్రతిభ బయోటిక్ ఎండీ ఇసుకపల్లె రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించగా, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎంఎల్‌ఏ పి.రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమీపంలో ఉన్న నూతన చర్చిని వైఎస్ జగన్ ప్రారంభించి ప్రార్థనలు చేశారు.

 కమలాపురం పెద్ద దర్గా..
 అమ్మవారిశాలలో ప్రత్యేక ప్రార్థనలు
 కమలాపురంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్‌గఫార్ షా ఖాద్రి, జహీరియా దర్గాలో వైఎస్ జగన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గఫార్ స్వామి జగన్‌మోహన్‌రెడ్డికి శాలువకప్పి సన్మానించారు. అలాగే పట్టణంలోని అమ్మవారు శాలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. పెద్దచెప్పలిలో వెలసిన హేలాంబ ఆలయంలో జగన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

 మైదుకూరు సెగ్మెంట్‌లోనూ అదే ఆదరణ  
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మైదుకూరు సెగ్మెంట్‌లోనూ అదే ఆదరణ లభించింది. కమలాపురం నుంచి మైదుకూరుకు వెళుతుండగా మార్గమధ్యలో తవ్వారిపల్లె, సుంకేసుల, ఖాజీపేట, మైదుకూరు, వనిపెంట తదితర గ్రామాల వద్ద మహిళలు వచ్చి వైఎస్ జగన్‌కు హారతి పట్టారు.

 పొలాన్ని పరిశీలించిన ప్రతిపక్ష నేత
 మైదుకూరు పరిధిలోని ఓబులాపురం పంచాయతీలోని మద్దుపల్లెకి చెందిన రామకృష్ణారెడ్డి పొలాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. పొలంలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయగా, పొలాలన్నీ ఎండిపోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు.

 నూతన జంటకు ఆశీర్వాదం
 ఇటీవలే వివాహమైన మైదుకూరు వైఎస్సార్ సీపీ నాయకుడు మదీనా దస్తగిరి కుమార్తె, అల్లుడులను వైఎస్ జగన్ శనివారం రాత్రి వారి ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు. అలాగే మైదుకూరు మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా వెళ్లి కలిశారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షులు అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 పలువురి కుటుంబాలకు పరామర్శ
 వేముల మండల మాజీ ఎంపీపీ ఆర్.జనార్ధన్‌రెడ్డి గుండెకు సంబంధిత ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో శనివారం ఉదయం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్లచెరువుపల్లెకు వెళ్లి పరామర్శించారు. ఇంతలోనే జనార్ధన్‌రెడ్డి తండ్రి సిద్ధారెడ్డి బాధపడుతుండటాన్ని చూసి వైఎస్ జగన్‌రెడ్డి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఓదార్చారు. అదే గ్రామానికి చెందిన ఆర్‌కే జనార్ధన్‌రెడ్డికి ఆరోగ్యం బాగాలేని నేపథ్యంలో ఆయనను కూడా వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు.

గొందిపల్లెకు చెందిన రాజారెడ్డి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. కమలాపురం వైఎస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు హిదాయత్ తండ్రి ఎస్‌ఆర్‌టీ ఇటీవల మృతి చెందారు. వైఎస్ జగన్‌రెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి ఎస్‌ఆర్‌టీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే చిన్నచెప్పలి ఎంపీటీసీ సభ్యుడు బుజ్జన్న సోదరుడు దాదాగారి దాదావలి కూడా ఇటీవల మృతిచెందారు. అలాగే దాదావలి కుటుంబాన్ని కూడా వైఎస్ జగన్‌రెడ్డి పరామర్శించారు. తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

 వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
 ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌రెడ్డిని పలువురు వైఎస్‌ఆర్ సీపీ నేతలు కలిసి చర్చించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు కలిసి చర్చించారు.

 మూడు రోజుల పర్యటన విజయవంతం
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 13వ తేదీన పులివెందులకు వచ్చిన ఆయన వేంపల్లె మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పులివెందుల ప్రజలతో కలసి పోయారు. అలాగే శనివారం పులివెందుల, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

 కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి   వైఎస్‌ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించునకుని శనివారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

ఐకేపీ యానిమేటర్ల గోడు పట్టదా?

ఐకేపీ యానిమేటర్ల గోడు పట్టదా?
సీఎం చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ విమర్శ
వారి ఆందోళనను వెటకారం చేస్తారా!

 
సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) యానిమేటర్లు గత రెండు నెలలుగా తమ కోర్కెల సాధనకు సమ్మె చేస్తోంటే ఏపీ ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. యానిమేటర్ల ఆందోళనను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాల్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. పద్మ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం సభల్లో ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ‘కొన్ని పనికిమాలిన పార్టీలు వారిని రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నాయి’ అని చంద్రబాబు  వెటకారం చేయడం దారుణమని ఆమె అన్నారు. డ్వాక్రా గ్రూపులను సమన్వయపర్చడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో 17 రకాల విధులను నిర్వర్తిస్తూ గొడ్డు చాకిరీ చేస్తున్న యానిమేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారనడ మేమిటని  పద్మ ప్రశ్నించారు.
 
 కాళ్లు పట్టుకున్న వారికి విలువ ఉంటుందా!
 పాలెం వద్ద బస్సు దుర్ఘటనలో 40 మంది సజీవ దహనం అయిన కేసు నుంచి తప్పించుకోవడానికి అధికారపక్షం కాళ్లు పట్టుకున్న అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు.. వైఎస్ జగన్‌పై చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని వాసిరెడ్డి పద్మ అన్నారు.

కష్టాలు వింటూ...

కష్టాలు వింటూ...
పౌరుషానికి పుట్టినిల్లు, చరిత్రాత్మక బొబ్బిలి పట్టణ శివారున 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇందిరమ్మ  కాలనీ. 2004లో ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా మొదటి సారి ఎన్నికైన తరువాత పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇక్కడ మూడు విడతల్లో  ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు.  రెండు విడతల్లో 20 వార్డులకు చెందిన నిరుపేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు. 2006లో వారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ప్రస్తుతం 18 వందల మంది వరకూ ఇక్కడ నివాసముంటున్నారు..  కాలనీ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా  ఇక్కడ సరైన రహదారులు, వీధి లైట్లు, తాగునీటి వంటి కనీస సదుపాయాలు లేవు.   చీకటి పడితే ఒకవైపు పాములు, మరో వైపు దొంగల భయంతో కాలనీవాసులు అల్లాడిపోతున్నారు.  నిత్యావసర సరుకుల కోసం చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి.   ఈ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకునేందుకు  బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయకృష్ణ రంగారావు ‘సాక్షి’ తరఫున వీఐపీ విలేకరిగా మారారు. కాలనీ ప్రజలతో మాట్లాడి,  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

  ఇందిరమ్మ కాలనీని మోడల్ కాలనీగా చేయడానికి ఎంతో ప్రయత్నించాను కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ నీటి సమస్య తీర్చడానికి  రక్షిత పథకం నిర్మించాలని ప్రతిపాదించినా  ప్రభుత్వం ముందుకు రాలేదు.  పర్యటనలో నా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు పరిష్కరిస్తాను. ఇక్కడ కాలనీ వాసుల కోసం ప్రత్యేక రేషన్ డిపో  ఏర్పాటు చేస్తాను. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాను. రహదారులు, వీధిలైట్లు, కాలువల నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తాను. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ఫ్లోర్‌లీడరు, కౌన్సిలర్లు ద్వారా తెలియపరిచి  కాలనీవాసులకు అన్ని  సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాను.

 ఎమ్మెల్యే  ఇచ్చిన హామీలు

 సుజయ్: నేను సుజయ్ కృష్ణ రంగారావు, బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాను.. మీ కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి విలేకరిగా వచ్చాను..

 ఏం బాబూ బాగున్నావా... నీ పేరేంటి.. ఏమిటీ నీ ఇబ్బంది?
 నా పేరు పాపారావు బాబు.. నాకు రెండు కాళ్లు రావు.. సైకిల్ అయితే ఉంది గానీ ప్రభుత్వం నుంచి ఏ సాయం అందడం లేదు..

 సుజయ్: ఎన్ని ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నావు
 పాపారావు: అయిదేళ్లుగా ఉంటున్నాను బాబు.. ఉండడానికి స్థలం లేదు.. ఇద్దరు పిల్లలున్నారు.

 సుజయ్: నీకు రేషను కార్డు ఉందా?
 పాపారావు: ఉందండీ

 సుజయ్: సరే నీకు ఇంటి స్థలం వచ్చేలా చేస్తాను..

 సుజయ్: ఏమ్మా! నీ పేరేంటి. ఏమిటీ సమస్య
  లక్ష్మి :  నాపేరు లక్ష్మి నాయన.. మాది పక్క
 ఊరు గున్నతోటవలస. మా ఇళ్లు కాలిపోయింది. అయినా ఇప్పటివరకూ ఇల్లు లేదు బాబు
 సుజయ్: ఎన్నాళ్లు అయ్యింది కాలిపోయి?
 లక్ష్మి: రెండు సంవత్సరాలు అయ్యింది.. ఎన్ని కాగితాలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు.

 సుజయ్: నేను అధికారులతో మాట్లాడతాను.. నీకు ఇళ్లు ఇచ్చేలా చేస్తాను...
 సుజయ్: మీ పేరేమిటి... కాలనీలో  సమస్యలు ఏమిటో చెప్పు?
 శ్రీరాములు: నా పేరు శ్రీరాములు సార్.. తమరు   మాకు కాలనీ ఇచ్చారు, కానీ సమస్యలు మాత్రం వదలడం లేదు..

 సుజయ్: ఏమేమి సమస్యలున్నాయి.?
 శ్రీరాములు: ఈ కాలనీకి బొబ్బిలి నుంచి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది.  కోడి చెరువు పక్కనుంచి మధ్యాహ్నం రాలేకపోతున్నాం.. అసాంఘిక కార్యక్రమాలన్నీ ఆ రోడ్డులోనే జరుగుతున్నాయి సార్

 సుజయ్: పోలీసులు ఎవరూ రారా అటువైపు..?
 ఎల్లంనాయుడు: ఎప్పుడో ఫిర్యాదు ఇస్తే ఒకసారి అలా వచ్చి వెళ్లిపోతారు.. అంతే మళ్లీ మామూలే.

 సుజయ్: కాలనీలో వీధిలైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి?
 బొంతు శ్రీరాములునాయుడు: లైట్లు ఇలా వేస్తే వారం రోజుల్లోనే అవి పోతున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు..

 సుజయ్: నీ పేరేంటింటి తాతా?
 చిన్నంనాయుడు: నా పేరు చిన్నంనాయుడు బాబు.. మీరు దయ ఉంచి కాలనీలో వీధిలైట్లు వెలిగేటట్టు చేయండి
 సుజయ్: ఎక్కడా లైట్లు వెలగడం లేదా..అసలు వేయలేదా?..

 చిన్నంనాయుడు: మెయిన్ రోడ్డు తప్పించి ఎక్కడా లైట్లు లేవు.. చీకటి పడితే పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి.
 అల్లు సింగమ్మ: పాములే కాదు బాబు.. దొంగల భయం కూడా ఉంది.. బళ్లు, బక్కలు   ఏవీ వీధిలో  ఉంచుకోలేక పోతున్నాం

 సుజయ్: నీ పేరేంటమ్మ..
 రత్నం: నా పేరు రెడ్డి రత్నం నాయన..

 సుజయ్: ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు..
 రత్నం:   కాలనీ కట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం బాబు.. కుళాయిలు లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది

 సుజయ్: మరి మీకు నీరు ఎలా?
  రత్నం: ట్యాంకరు వస్తుంది. అది కూడా రెండు రోజులకొకసారి. ఆ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి

 సుజయ్: కాలనీలో బోర్లు ఉన్నాయి కదా. బాగోవా?
  రత్నం:  ఆ నీరు మట్టివాసన కొడుతున్నాయి బాబు..

 సుజయ్: నీపేరేమిటి  పాప (అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో)
  స్రవంతి: నా పేరు స్రవంతి
 సుజయ్: ఏం నేర్చుకుంటున్నావు.. పాటలు పాడడం వచ్చా.. ఏమైందీ ఈ పాపకు ?
  కార్యకర్త:  పుట్టిన దగ్గర నుంచి ఈ పాపకు రెండు కాళ్లు, చేతులు  ఇలాగే ఉన్నాయి.

 సుజయ్: ఈ పాప పేరు ఏమిటి?
  కార్యకర్త: అలేఖ్య.. ఈయనే తండ్రి తాతారావు
 తాతారావు: పుట్టినప్పటి నుంచి  కాళ్లు చేతులు ఇలాగే ఉండిపోయాయి. ఏమి చేయాలో అర్థం కావడం లేదు..

  సుజయ్: పాప ఏ పనీ చేసుకోలేదా?
 తాతారావు: ఏ పనీ చేయలేదు..దేనికీ సహకరించవు కూడా...

 సుజయ్: వయసు ఎంత ఉంటుంది?
 తాతారావు: అయిదేళ్లు సార్
  సుజయ్: ఈ పాపకు సరైన న్యాయం చేస్తాను.. సరేనా..

 సుజయ్ :  నీ పేరేంటమ్మ..?
  శారద: నా పేరు శారద బాబు.. ఈ ఇంటి పక్కనే నలుగురు నడిచిన రోడ్డు ఉంది..అక్కడ విద్యుత్తు వైర్లు ఎలాడుతున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు..

 సుజయ్: ఎన్నాళ్లు నుంచి ఉంది ఇది?
 శారద: చాలా కాలం నుంచి ఉంది మధ్యలో స్తంభాలు వేసి వైర్లను మీదకు పెట్టాలి బాబు

 సుజయ్: ఇక్కడ ఇళ్లన్నీ పునాదులు వేసి వదిలేశారు ఎవరూ కట్టరా..?
 శారద: కట్టడానికి రెడీ అవుతున్న టైంలో ఇసుక ధరలు పెరిగిపోవడం వల్ల ఎవ్వరూ కట్టడానికి ముందుకు రావడం లేదు..

 షేక్ షకీలా: బాబు..మేం కాలనీలో మొదటి విడతలో ఇళ్లు వచ్చిన వాళ్లం... మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..
 సుజయ్: ఏమిటీ మీ సమస్య?

 షకీలా: ఎవరు ఏ పని చేసినా మొదట్లోనే చేస్తున్నారు గానీ ఇటువైపు ఎవరూ రావడం లేదు. నీళ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాం
 సుజయ్: మీకు బోరింగు లేదా.. ట్యాంకరు రావడం లేదా?

 షకీలా: బోరింగు ఆరు వీధుల తరువాత ఉంది.. ట్యాంకరు ఒక సారి వస్తే మరో  సారి రాదు..
 సుజయ్: నీ సమస్య ఏంటమ్మా?

 రామలక్ష్మి: నా పేరు రామలక్ష్మి.. బాడంగి గూడేపువలస మాది. ఇక్కడకు వచ్చి ఉంటున్నాం. మా ఆయన మూగోడు, కొడుకు పరిస్థితి కూడా అంతే, అయినా పింఛను ఇవ్వడం లేదు..

 సుజయ్: వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఉంటే పింఛను ఇస్తారు కదా..?
 రామలక్ష్మి: ఉన్నా ఇవ్వడం లేదు.. అద్దె ఇంట్లో ఉంటున్నాం.. చాలా ఇబ్బందిగా ఉంది.

 సుజయ్: ఏం బాబు.. ఏం పేరు.. ఏం చేస్తున్నావు..?
 శ్రీనివాసరావు: నా పేరు శ్రీనివాసరావు సార్.. నేను వృత్తివిద్యాకోర్సు చేస్తున్నాను. బొబ్బిలి పట్టణంలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది

 సుజయ్: ఏమైంది..సమస్యేంటి?
 శ్రీనివాసరావు: ఎప్పుడో వేసిన పాత రోడ్లే ఇంకా ఉన్నాయి. వాటిని విస్తరించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

 సుజయ్: అవును.. వాటి వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. రోడ్ల విస్తరణ కోసం మా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.
 బబ్బులు: సార్ నా పేరు బబ్బులు.. ఇక్కడ మైయిన్ రోడ్డు తప్పించి మిగతా రోడ్లన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయి. పాములు తిరుగుతున్నాయి.

 సుజయ్ : అవును.. అదే చూస్తున్నాను..
 బబ్బులు: మొదట వేసిన రోడ్లును అలాగే వదిలేశారు. మున్సిపాలిటీ అసలు పట్టించుకోవడం లేదు..చైర్‌పర్సన్‌ను చూడడానికి రమ్మంటే ఈ చివరకు అసలు రానేలేదు..

 సుజయ్: నీ సమస్య ఏంటమ్మా?
 రామలక్ష్మి: నా సమస్య కాదు సార్.. ఈ కు ర్రోడు వికలాంగుడు..ఎవరూ లేరు. సర్టిఫికెట్ ఉన్నా ఫించను ఇవ్వడం లేదు సార్

 సుజయ్: ఎన్నాళ్లుగా రావడం లేదు..
 రామలక్ష్మి: అయిదేళ్లుగా రావడం లేదు.

 సుజయ్ : సరే చూస్తాను... ఏమండీ సర్పంచ్ గారు, మీ సమస్యేంటి?
 ఈశ్వరరావు: మా గున్నతోటవలస గ్రామానికి చెందిన 25 ఇళ్లు ఈ కాలనీ శివారున ఉన్నాయి సార్.. వాటికి విద్యుత్ సమస్య, రోడ్డు ఇబ్బంది ఉంది..

 సుజయ్: విద్యుత్ సమస్య ఏంటి?
 ఈశ్వరరావు: ఊర్లోంచి వచ్చే  మెయిన్  విద్యుత్ వైరుకు ఎక్కడా స్తంభాలు వేయలేదు. దాంతో  మధ్యలో ఇళ్ల మీద నుంచి వైర్లు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది.

 సుజయ్: సరే...మధ్యలో స్తంభాలు వేసేలా చూస్తా..
  నీ పేరు ఏంటి మామ్మా?

 శాంత: నా పేరు పిట్ల శాంత బాబు..
 సుజయ్: చెప్పు నీ సమస్యేంటో?

 శాంత: ఈ మధ్యను నాకు రెండు నెలల పింఛ ను ఇచ్చారు బాబు.. దానిలో 5 వందలు ఇరుపుకొంటున్నారు.. ఇలాగైతే మేం ఎలా బతకాలి
 సుజయ్: ఎవరు తీసుకుంటున్నారు... ఎందుకు తీసుకుంటున్నారో అడగలేదా..?

 శాంత: పెన్సన్ ఇచ్చిన రామారావే  ఇరిపేశారు.. ఎందుకో చెప్పడం లేదు..
 సుజయ్: పింఛను తీసుకుంటున్నవారు ఎవరికి డబ్బులు ఇవ్వక్కరలేదు.. అలా అడిగితే మీ కౌన్సిలర్లకు చెప్పండి.. వెయ్యి ఇస్తేగాని వేలి ముద్ర వేయకండి

 ఇందిర: సార్.. నా పేరు ఇందిర..నేను ఐద్వా జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నాను..
 సుజయ్: చెప్పండమ్మా....

 ఇందిర : ఈ కాలనీ ఉన్న వాళ్లకు టౌన్‌లో రేషను సరుకులు  ఇస్తున్నారు.. అవి విడిపించడానికంటే వాటికి కాలనీకి తీసుకురావడానికే ఎక్కువ ఖర్చు అవుతోంది.

 సుజయ్: సరుకుల కోసం ఎక్కడెక్కడకు వెళతారు ?
 ఇందిర: గతంలో ఈ కాలనీకి రాకముందు ఎక్కడున్నారో ఆ వీధుల్లోకే వెళ్లి తెచ్చుకోవాలి సార్,  వీళ్లు వెళ్లేసరికి డిపో తీయకపోతే తిరుగుతుండడమే పని. ఈ కాలనీకి ప్రత్యేకమైన డిపోను ఏర్పాటు చేయించాలి సార్.

 సుజయ్: తప్పకుండా అలాగే ఏర్పాటు చేయిస్తాను. నీ పేరేంటమ్మా?
 భారతి: వియ్యపు భారతి సార్.. నా భర్త చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా పింఛను మంజూరు చేయలేదు.. సార్
 అప్పారావు: సార్ .. నాకు భూములున్నాయని పింఛను తీసేశార్ సార్.

 సుజయ్: ఎన్నాళ్లు నుంచి పింఛను తీసుకుంటన్నారు. ?
 అప్పారావు: 20 ఏళ్లుగా పింఛను తీసుకుంటున్నాను. సెంటు భూమి లేదు..ఎవరు చెప్పారో తీసేశారు. సార్..

 సుజయ్: ఏమైందయ్యా నీకు..ఏం పేరు నీ పేరు?
 సత్యారావు: కోట సత్యారావు సార్.నేను ఒకటో వార్డుకు చెందిన వాడిని. నాకు వికలాంగుడి ధ్రువీకరణ పత్రం  ఉన్నా ఫించను మాత్రం ఇవ్వడం లేదు..
 సుజయ్: ఏమంటున్నారు..ఎందుకు ఇవ్వడం లేదు.?

 సత్యారావు: ఏమీ చెప్పడం లేదు..  ఈ సర్టిఫికెట్ చేయించుకోవడానికే నాలుగు వేలు ఖర్చు పెట్టాను..
 సుజయ్: సరే నేను చూస్తాను.

 అక్కడ నుంచి కొత్తగా పెట్టిన పాఠశాలకు వెళ్లారు.. మాస్టారు ఇక్కడ ఎంత మంది చదువుతున్నారు?

 సత్యనారాయణ: ఇక్కడ ప్రస్తుతం 25 మంది ఉన్నారండీ.. కానీ ఈ కాలనీలో సుమారు 50 మందికి పైగా పిల్లలున్నారు..

 సుజయ్: ఇక్కడకు ఎప్పుడు వచ్చారు.. మీరు డెప్యుటేషన్‌పై వచ్చారా.?

 సంతోష్‌కుమార్: ఆగస్టు నెలలో ఇక్కడ స్కూలు పెట్టారు సార్.. టౌన్‌లో రెండు స్కూళ్లు మూసేసి ఇక్కడ పెట్టారు. మమ్మల్ని బదిలీపై వేశారు..

 సుజయ్: అదేంటి ఇక్కడ గతంలో స్కూలు లేకుండా బదిలీపై ఎలా వేశారు?
 సత్యనారాయణ: ఏమో సార్ ఆర్డర్ అలా ఇచ్చారు..

 సునీత: నమస్తే సార్, నేను ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని నడుపుతున్నాను..
 సుజయ్: చెప్పమ్మా! నీ సమస్య ఏంటో..?
 సునీత: స్కూలు ఇక్కడ పెట్టినా వంటకు ఇక్కడ స్టవ్, గ్యాస్, వంట పాత్రలు వంటివి ఇవ్వలేదు. రోజూ ఇంటి దగ్గర వండి తెస్తున్నాను.

 సుజయ్: బిల్లులు ఇచ్చేస్తున్నారా..?
 సునీత : రెండు మాసాలుగా అదీ లేదండీ

 ధనలక్ష్మి: సార్ నమస్తే సార్.. నా పేరు ధనలక్ష్మి.. నేను ఇందిరా గాంధీ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను.
 సుజయ్: నమస్తే చెప్పమ్మా! ఏం చదువుతున్నావు
 ధన లక్ష్మి: బీకాం ఫస్ట్ ఇయర్ సార్..మాకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం.
 సుజయ్: నీ పేరేంటమ్మా

 తులసి: నా పేరు తులసి., మేం నక్కలోల్లం సార్.. మమ్మల్ని ఎస్టీలో కలపాలని ఎన్ని సార్లు కోరుతున్నా అది జరగడం లేదు. సార్

 సుజయ్: గతంలో ఎక్కడైనా ఎస్టీలో చేర్చినట్లు ఇచ్చారా?
 తులసి: చోడవరంలో ఇచ్చారు సార్.. అది చూపించినా ఇక్కడ ఇవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..
 సుజయ్: దీనిని గవర్నమెంటు దృష్టికి తీసుకెళ్తాను.. ఏమ్మా: పిల్లల్ని బడికి పంపుతున్నారా..
 మర్రి ఉమ: లేదండీ...
 సుజయ్:   పంపకుండా ఏమి చేస్తున్నారు..?
 ఉమ: వాళ్లు పనికి వెళితే మా  కడుపులు ఎలా నిండుతాయి. బాబు..

 సుజయ్: మీ కడుపులు నిండడానికి,  వాళ్లని పనిలో పెడతారా... ఇక్కడే ఉన్న స్కూలుకు పంపండి అక్కడ భోజనాలు పెడతారు..చదువులు చెబుతారు సరేనా..
 నారాయణమ్మ: బాబూ ఇక్కడ ఉన్న బావి ప్రమాదకరంగా ఉంది.

 సుజయ్: దీని గురించి అధికారులకు చెప్పలేదా..?
 నారాయణమ్మ: చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఈ బావి నీరు తోడేసి రాతికట్టు కట్టి గట్టు ఎత్తు చేయాలి. అలాగే ప్లాట్‌పారం కట్టాలి బాబు..

 సుజయ్: సరే చూద్దాం.. మీకు రుణమాఫీ అందుతుందా?
 నారాయణమ్మ: ఏం అందడం సార్.. చంద్రబాబు అసలు కట్టవద్దంటే మానేశాం. ఇపుపడు వడ్డీల కింద బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఇరుపుకుంటున్నారు.

 సుజయ్: ఇప్పటివరకూ ఎంత జమచేశారు?
 నారాయణమ్మ: 5 లక్షలు తెచ్చాం సార్... నెలకు పది వేలు చొప్పున ఆరుమాసాలకు 60 వేలు ఇరిపేశారు.
 సుజయ్: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు..?
 నారాయణమ్మ: రుణమాఫీ సంగతి దేవుడెరుగు వడ్డీలు పడకుండా ప్రతీ నెలా కట్టేస్తున్నాం.
 సరే వస్తానమ్మా...
 

చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి

చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి
 పోలీస్‌స్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఫిర్యాదు

 అనంతపురం క్రైం : ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు దాదాపు 50 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆరు నెలలు గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా మో సం చేస్తున్నారన్నారు.

రైతులకు రుణ మాఫీ చేయక పోవడమే కాకుండా బీమా కూడా దక్కకుండా చేసి కడుపు కొట్టారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమని ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని విమర్శించారు. పింఛన్లు నాలుగు రెట్లు పెంచుతామని చెప్పి ఉన్న వాటిని కూడా తొలగిస్తున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు ఎత్తివేస్తామని చెప్పారని, కానీ ఎక్కడ చూసినా అమ్మకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్య, ఉన్నత విద్య కోసం ప్రవేశ పెట్టిన పథకాలను నిబంధనల పేరుతో ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారన్నారు. ఇలా అన్ని విధాలా హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబుపై 420 కేసు నమోదు చేసి ఆయా వర్గాల ప్రజలు పడుతున్న మనోవేదనకు కాసింత ఊరట కల్గించాలని కోరారు.

వైఎఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతీ నాయుడు, విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి పరుశురాం, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు ఖాదర్ బాషా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్ పీరా, బీసీ సెల్ నగర అధ్యక్షుడు గవ్వల వెంకటేష్, జంగాలపల్లి రఫి, యూపీ నాగిరెడ్డి, మంజునాథ్, చింతకుంట మధు, ముక్తియార్, చాంద్‌బాషా, మణి, పెద్దన్న, జయపాల్ పాల్గొన్నారు.  

కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ!

కన్నీళ్లు తుడుస్తూ.. ఓదార్పునిస్తూ!
నంద్యాల టౌన్: టీడీపీ బనాయించిన అక్రమ కేసులో జైలు పాలైన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, అభిమానుల కుటుంబ సభ్యులకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కొండంత ఓదార్పునిచ్చారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం ఇలాంటి కుట్రలు కొట్టుకుపోతాయని.. న్యాయం తప్పక గెలుస్తుందనే భరోసానిచ్చారు. అత్యంత చిన్న వయస్సులో శాసనసభ్యురాలుగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత ఎమ్మెల్యే, తన తల్లి శోభా నాగిరెడ్డిని తలపిస్తూ బాధిత కుటుంబాల్లో సభ్యురాలిగా కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు.

రాజకీయాల్లోనే కాకుండా ప్రజల మనిషిగా తనదైన శైలిని కనబరిచే నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డి బాటలో అఖిలప్రియ అందరికీ అండగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడం విశేషం. శనివారం సాయంత్రం ఆమె నంద్యాల సబ్‌జైలులోని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు శివశంకర్, దిలీప్‌కుమార్, కరీముల్లా, పార్టీ నేతలు ఏవీఆర్ ప్రసాద్, వడ్డె శీను, వడ్డెమనోజ్, దేవనగర్ మధు, చంటి, అజ్మీర్‌బాషా తదితరులను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఇళ్ల వద్ద కలుసుకుని ఓదార్చారు.

 భూమాపై కేసు సులోచన అహంకారానికి నిదర్శనం
 సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన భూమా నాగిరెడ్డిపై బనాయించిన కేసు మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అహంకారానికి నిదర్శనమని కౌన్సిలర్ శివశంకర్‌యాదవ్ తల్లి శివమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల ప్రియ.. శివశంకర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా శివమ్మ పైవిధంగా స్పందించారు. భూమాతో కలిసి తన కుమారుడు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా జైలుకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. భూమాను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసు బనాయించారన్నారు.

 అక్కా.. నాన్నను చూపించవా
 ‘అక్కా.. నాన్నను చూసి చాలా రోజులైంది. ఒక్కసారి చూపించవా..’ అంటూ దేవనగర్ మధు కుమారుడు శ్రీనివాస్ ఏడుస్తూ అఖిల ప్రియను హత్తుకున్నాడు. జైలులో ఉన్న దేవనగర్ మధు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ఆమె వారింటికి వెళ్లారు. తండ్రిని చూడాలనిపిస్తుందంటూ శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె చలించిపోయారు. వీలైనంత త్వరగా మీ నాన్నను మీ వద్దకు తీసుకొస్తానంటూ అఖిలప్రియ భరోసానిచ్చారు. మధు భార్యకు కూడా ధైర్యం చెప్పారు.

 ప్రజల కోసమే జైలుకు వెళ్లారు
 సబ్‌జైలులోని దిలీప్‌కుమార్ కుటుంబ సభ్యులను అఖిల ప్రియ పరామర్శిస్తూ.. ప్రజల కోసమే తన తండ్రితో పాటు మరికొందరు జైలుకు వెళ్లారన్నారు. అధికార పార్టీ కక్ష సాధింపుతో అక్రమ కేసులు బనాయించిందన్నారు. అయితే ఈ కేసులు కోర్టులో నిలబడవన్నారు. నాలుగైదు రోజుల్లో బెయిల్ వస్తుందని.. అంతా ధైర్యంగా ఉండాలని చెప్పారు.

 కంటతడి పెట్టిన శశిరేఖ
 వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఏవీఆర్ ప్రసాద్ భార్య, కౌన్సిలర్ శశిరేఖ కంటతడి పెట్టారు. భూమా అఖిలప్రియ ఆమెను ఓదార్చేందుకు ఇంటికి వెళ్లగా.. ‘‘తన భర్త ప్రసాద్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారని, ఎవరినీ దూషించేవారు కాదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల ప్రియ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని.. ప్రజల మద్దతుతో అధికార పార్టీ కుట్రలను తిప్పికొడదామన్నారు.

 అచ్చం అమ్మలాగే ఉన్నావ్..
 ‘‘అమ్మా.. నీవు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావ్..’’ అంటూ అఖిల ప్రియను శోభానాగిరెడ్డితో పోల్చారు కొండారెడ్డి కుటుంబ సభ్యులు. కొండారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వెళ్లిన సమయంలో వారు ఆవిధంగా స్పందించారు. నిన్ను చూస్తే మాకెంతో ధైర్యం వస్తోందని చెప్పడం విశేషం.

 చట్టపరంగా పోరాటం
 అధికార పార్టీ నేతలు బనాయించిన అక్రమ కేసులకు భయపడబోమని భూమా అఖిల ప్రియ అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న రోడ్ల విస్తరణ, పందుల నిర్మూలన ఇతరత్రా సమస్యలపై భూమా నాగిరెడ్డి రాజీలేని పోరాటం సాగిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గత నెల 31న కౌన్సిల్ హాల్‌లో ప్రజల సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా.. చైర్మన్ దేశం సులోచన అడ్డుకుని వివాదానికి తెర తీశారన్నారు.

తన తండ్రి ప్రమేయం లేకపోయినా అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇదే సమయంలో చైర్మన్‌పై అట్రాసిటీ కేసు నమోదైనా పోలీసులు అరెస్టుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెగా నంద్యాల ప్రజలకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి పోరాటం సాగిస్తానన్నారు.

Popular Posts

Topics :