30 November 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

షర్మిల పరామర్శయాత్ర పెడ్యూల్ లో స్వల్ప మార్పులు

Written By news on Saturday, December 6, 2014 | 12/06/2014


షర్మిల పరామర్శయాత్ర పెడ్యూల్ లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో చేపట్టనున్నపరామర్శ యాత్ర షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల జరప తలపెట్టిన యాత్ర డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి  ప్రారంభం కానుంది.  దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి షర్మిల యాత్ర ఆరంభించనున్నారు. తొలుత కొత్త బ్రాహ్మణపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు ఇర్విన్, దేవుని వడ్కల్, వెలిజాలలో మూడు కుటంబాలను షర్మిల పరామర్శిస్తారు.
 
అనంతరం అదే రోజు సాయంత్రం కల్వకుర్తిలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. తొమ్మిదవ తేదీ ఉదయం అమ్రాబాద్ లో ఓ కుటుంబాన్ని పరామర్శించి తరువాత అచ్చంపేటలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. 10వ తేదీన పెంటవల్లి, చిట్యాల, రాణిపేట,  నందిన్నెలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఆ రోజు రాత్రికి దయార్ లో ఆమె బస చేస్తారు. 11వ తేదీ ఉదయం జూరాల నుంచి పరామర్శయాత్ర ఆరంభం కానుంది. కొన్నూరు, కోసి, అమీన్ కుంట, ఇండావూర్ లో ఐదు రైతు కుటుంబాలను షర్మిల పరామర్శించి.. సాయంత్రం కొడంగల్ లో బస చేస్తారు. 12 వ తేదీ పెద ఎర్కిచర్ల, గుండ పాటవల్లి, నర్సప్ప గూడ, మలావూర్ లో నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించడంతో మహబూబ్ నగర్ జిల్లా యాత్ర  ముగియనుంది. ఆరోజు సాయంత్రం షాద్ నగర్ మీదుగా షర్మిల హైదరాబాద్ కు చేరుకుంటారు.

బాబు సొంత మండలంలోనే పరిస్థితి ఇంత దారుణమా?


చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో రైతులు పంటలు నష్టపోయి మూడేళ్లు అవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ పరిహారం ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. శనివారం చిత్తూరులో వైఎస్ ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు సొంత మండలంలోనే రైతుల పరిస్థితి ఇంతా దారుణమా ? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. బాధితుల సమస్యను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం ప్రభుత్వంతో పోరాడుతామని వైఎస్ ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు.

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి


అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ జగన్.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

పోలీసుల ఆంక్షలను అధిగమించి..


దుర్నీతిపై దండయాత్ర
⇒ కదిలివచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
⇒ మద్దతుగా నిలిచిన ప్రజాదండు
⇒ పోలీసుల ఆంక్షలను అధిగమించి వేలాదిమంది హాజరు
⇒ శ్రీకాకుళంలో మహాధర్నా విజయవంతం
⇒ చంద్రబాబు పాలనను ఎండగట్టిన నేతలు, సామాన్యులు
⇒ ఇదే పరిస్థితి కొనసాగితే గుణపాఠం తప్పదని ెహ చ్చరిక
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బధిర సర్కారు చెవికి సోకని జనం బాధలు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన మహాధర్నాలో సామాన్యుల గుండెల నుంచి తన్నుకొచ్చిన కన్నీటి గాధలు ఎన్నెన్నో. రుణమాఫీ లేదు. ఫీజు రియింబర్స్‌మెంట్ రాదు. రుణాలు ఇవ్వరు. డ్వాక్రా సంఘాల మాటే మరిచారు. తుపాను బాధితుల్ని పక్కన పెట్టేశారు. సాయం పక్కదోవ పట్టింది. ఇసుకను బంగారంగా మార్చేశారు.  నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఉన్నవే ఊడగొడుతున్నారు. అంతా కార్పొరేట్ల పాలన.. ఆరునెలలైనా కాకముందే టీడీపీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు వైఎస్‌ఆర్‌సీపీ మహాధర్నా వేదికగా నిలిచింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ మహాధర్నా అడుగడుగునా పోలీసుల ప్రతిబంధకాలను ఛేదించి మరీ విజయవంతమైంది. రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, విద్యార్థులు, ఇసుక బళ్ల యజమానులు, సోంపేట బీల ప్రాంత వాసులు, తాపీ మేస్త్రీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున హాజరై చంద్రబాబు దుర్మార్గ పాలనను ఎండగట్టారు. ప్రధాన ప్రతిపక్షం చేపట్టిన ఆందోళన కార్యక్రమం తమదే అన్నట్లు వ్యవహరించారు.
 
ఇలా జరిగింది
⇒ ఉదయం ఆరు గంటల నుంచే జిల్లా నలువైపుల నుంచి నేతలు జిల్లా కేంద్రానికి బయల్దేరారు.
⇒ ఏడుగంటల నుంచి పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ధర్నాకు వస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పెద్ద వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలనూ నిబంధనల పేరిట అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతల ఒత్తిళ్లతో ఎక్కడికక్కడ భారీ బందోబస్తు పేరుతో ఆటంకాలు సృష్టించారు.
⇒ 8 గంటల నుంచే ధర్నా వేదిక వద్ద ప్లకార్డులు, హోర్డింగ్‌లు, పోస్టర్లు వెలిశాయి. వైఎస్సార్‌సీపీ జెండాలు రెపరెపలాడాయి.
⇒ 9 గంటలకే ధర్నా ప్రాంగణానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు రావడం మొదలెట్టారు.
⇒ 11 గంటలకు కార్యక్రమం మొదలైంది. నాయకులు చంద్రబాబు దుర్నీతిని ఎండగట్టారు. బాధిత ప్రజలకు బాసటగా ఉంటామని ప్రసంగాలతో భరోసా ఇచ్చారు.  
⇒ ఎండ సుర్రున మండుతున్నా ఎవరూ వెరవలేదు. వేలాది జనం వేదిక వద్దే ఉండిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఓ అవ్వ, ఓ వృద్ధుడు, ఓ భవన నిర్మాణ కార్మికుడు, ఓ ఇసుక బండి యజమాని, ఓ డ్వాక్రా సంఘం సభ్యురాలు తమ మాటల్లో వివరించారు.
⇒ మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు జేసీ వివేక్ యాదవ్‌కు విజ్ఞాపన పత్రం అందించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు..ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ఇబ్బందుల్ని విడమర్చి చెప్పారు.
⇒ అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించినా, వాహనాలను అడ్డుకున్నా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తామంతా నడుస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.

దద్దరిల్లిన అనంత


దద్దరిల్లిన అనంత
రుణమాఫీపై ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది రైతులు భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. సర్కారు తీరును ముక్త కంఠంతో ఖండించారు. ఇచ్చిన హామీ మేరకు రైతులు, డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసి తీరాల్సిందేనని నినదించారు. చంద్రబాబు ఎన్ని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకోవాలని చూసినా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతులకు తాము అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నేతలు భరోసా ఇచ్చారు. తొందర పడి ఆత్మహత్యలకు తెగించొద్దని విన్నవించారు.
 
  సాక్షిప్రతినిధి, అనంతపురం :  రైతు, డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి సీఎం పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఆరు నెలలైనా ఇచ్చిన హామీ నెరవేర్చక పోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాతో జిల్లా కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తారుు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన మహాధర్నాను నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకూ నివాళులర్పించారు. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ రైతులు ధర్నాలో కూర్చున్నారు. రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తోన్న మోసపూరిత విధానాలు, రైతు ఆత్మహత్యలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడంపై నేతలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నారుు.
 
  మధ్య మధ్యలో చంద్రబాబు తీరును నిరసిస్తూ..‘చంద్రబాబు డౌన్‌డౌన్’ అంటూ నినదించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, సాగిస్తున్న పాలనపై ఫ్లకార్డులు ప్రదర్శించారు. జిల్లాలో 42 మంది రైతుల ఆత్మహత్యలకు పూర్తి కారకుడు చంద్రబాబే అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను పూర్తిగా మాఫీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ‘అనంత’లో 10.24 లక్షల ఖాతాల్లో 6,817కోట్ల రూపాయల రుణాలున్నాయని వీరంద రి రుణాలు మాఫీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
  సీఎం చేసిన విధాన ప్రకటన మేరకు జిల్లాలో కేవలం 3 లక్షల మంది మాత్రమే రుణమాఫీ కిందకు వస్తారని, తక్కిన 6.50 లక్షల రైతుల పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. రుణాలు మాఫీ కావని ఇప్పుడు చెబితే వాటిపై 14 శాతం వడ్డీని వసూలు చేస్తారని, దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికే జిల్లాపై 955 కోట్ల రూపాయల వడ్డీ భారం పడిందన్నారు. బంగారు రుణాలపై 3నెలలుగా నోటీసులు వస్తున్నాయని, ఈ ఒత్తిళ్లను తాళలేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఒత్తిడితోనే పాక్షికంగా అయినా రుణమాఫీ చేసేందుకు చంద్రబాబు కొంత మేరకు సిద్ధమవుతున్నారన్నారు. తక్కిన రుణాల మాఫీ కూడా ముక్కు పిండి చేరుుస్తామన్నారు. రైతులు ైధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని విన్నవించారు.
 
  ఏ పల్లెకు వెళ్లినా రైతులు, మహిళలు రుణమాఫీపైనే చర్చించుకుంటున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 20 శాతం రుణమాఫీ చేసి, తక్కిన 80 శాతానికి బాండ్లు ఇస్తానని చెబుతున్నారని, వీటి ఆధారంగా బ్యాంకర్లు రుణాలు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిస్సిగ్గుగా మోసపూరిత మాటలు చెబుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణం అవుతున్నారని ఆరోపించారు. జిల్లాలో 42 మంది ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చంద్రబాబు చెప్పడం అతని బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ మృతుల కుటుంబాలపై విచారణ చేస్తోందని, ఈక్రమంలో సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తే అధికారులు ధైర్యంగా వాస్తవాలను ఎలా రిపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ ఏడాది 5 లక్షల హెక్టార్లలో పంట తుడిచి పెట్టుకుపోయిందని, రైతులు బ్యాంకు మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేకపోవడంతో బీమా వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గతేడాదికి సంబంధించి రూ.226 కోట్ల పంటల బీమాను పాత బకాయిల కింద జమ చేసుకుంటుంటే జిల్లాలోని అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
 
 రూ.674 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదన్నారు. చంద్రబాబు వల్ల జిల్లాలోని ఏ ఆడబిడ్డ మెడలోనూ బంగారు గొలుసు కనిపించకుండా పుస్తెల తాడు కన్పిస్తోందన్నారు. జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించారని, అందులో స్థానికేతరుడైన బాలకృష్ణను కూడా గెలిపించారని, ఇలాంటి జిల్లాకు ఏం చేశావని చంద్రబాబును ప్రశ్నించారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సయ్యద్‌ఖాజామెహిద్దన్‌కు వినతిపత్రం అందజేశారు.
 
  రైతు ఆత్మహత్యలపై చిత్తశుద్ధితో రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఏజేసీకి విజయసాయిరెడ్డి విన్నవించారు. దీనిపై ఏజేసీ సానుకూలంగా స్పందించారు. ధర్నాలో జిల్లా నేతలు ఎర్రిస్వామిరెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి,అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, పార్టీ నేత నదీమ్ అహ్మద్, ట్రేడ్‌యూనియన్ నాయకులు కొర్రపాటి హుస్సేన్‌పీరా, విద్యార్థి నేతలు సోమశేఖర్, బండిపరశురాం, కృష్ణవేణి, ప్రమీల, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మారుతీనాయుడు, మిద్దె భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాఫీ వంచనపై మహాగ్రహం !


మాఫీ వంచనపై మహాగ్రహం !
సాక్షి, విజయనగరం:  బంగారం లాంటి పంటలు నష్టపోయినా... ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న రైతులు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తే కుటుంబ పోషణకు ఆసరా అవుతుందని సంబరపడ్డ మహిళలు, పింఛను ఐదింతలు పెరిగితే రెండు పూటలా కడుపునింపుకోవచ్చనుకున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, బాబు వస్తే జాబు వస్తుందని నమ్మి వీధి పాలైన యువకులు..హుద్ హుద్ తుపాను మిగిల్చిన కష్టంలో ఉన్న వారు.. ఇలా ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా చంద్రబాబు చేతిలో వంచనకు గురైన ప్రజలందరూ ఒక్క సారిగా తమ గెండెల్లోని బాధను బయటపెట్టారు. పచ్చి మోసాలకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిన దించారు.  వైస్సార్(వైఎస్సార్) కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన మహాధర్నాలో దుమ్మెత్తిపోశారు.
     
పార్టీ పిలుపు మేరకు   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జన సమూహం పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ట వీరభద్రస్వామి ఇంటి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి రెండు వేల  ద్విచక్రవాహనాలతో 11.40 గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలు దేరారు. కోట జంక్షన్, గంట స్తంభం, వైఎస్సార్ జంక్షన్, ఆర్‌అండ్‌బీ, పోలీస్ బ్యారెక్స్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. అప్పటికే కలెక్టరేట్ వద్దకు వేలాది మంది ప్రజలు చేరుకుని వేచి ఉన్నారు . కళాకారులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గళమెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను ఎండగట్టారు. ‘ఎన్నికల  మేనిఫెస్టో’పై  చంద్రబాబు లేదా విజయనగరం జిల్లా టీడీపీ నేతలెవరైనా బహిరంగ చర్చకు వస్తారా?’అని సవాలు విసిరారు. ఎన్నికల హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిన చంద్రబాబు మాటలను ఆ పార్టీ వారే నమ్మలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి అర్హులకు పింఛన్లు ఇవ్వకపోయినా, అనర్హులకు ఇచ్చినా ప్రజల తరఫున న్యాయస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రకటించారు. ఈ మహా ధర్నా ఆరంభం మాత్రమేనని, ఎన్నికల హామీలు  నెరవేర్చేంతవరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. ధర్నా అనంతరం   కలెక్టర్‌కు వినతిపత్రం అంధించాలని ప్రయత్నించగా ఆయన   అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ బి.రామారావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు వినతి పత్రాన్ని అందజేశారు.
 
అడుగడుగునా అవాంతరాలు:  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా విజయవంతం కాకుండా ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది.    అధికారాన్ని ఉపయోగించి అడ్డుకోవాలని చూసింది. ఓ వైపు ధర్నాకు అనుమతిస్తూనే మరోవైపు పట్టణంలోకి వచ్చే జన ప్రవాహానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేసింది. జనం  ధర్నాకు రాకుండా చేసి,  కార్యక్రమాన్ని విఫలం చేయాలని భావించింది. దానిలో భాగంగా నగరానికి వచ్చే అన్ని దారుల్లోనూ పోలీసు సిబ్బంది  భారీగా మోహరించారు. జనం వచ్చే వాహనాలను నిలిపివేసి ఆ పత్రాలు, ఈ పత్రాలు అంటూ హడావుడి చేశారు. పలు   వాహనాలకు జరిమానాలు విధించారు. కొన్నింటిని వెనక్కు పంపించేశారు. మరికొన్నింటిని  శివారుల్లోనే  నిలిపివేశారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అదరలేదు, బెదరలేదు. ప్రభుత్వ కుట్రలను ముందే ఊహించి కొన్ని వాహనాలతో జనాలు ఉదయమే పట్టణంలోకి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్న వాహనాల్లోని జనం కాలినడకన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నప్పటికీ సంయమనం పాటించి శాంతి యుతంగా ధర్నా నిర్వహించి విజ్ఞతను చాటుకున్నారు.
   
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ పరిశీలకుడు ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు ( బేబినాయన), విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, మార్క్‌ఫెడ్ డెరైక్టరు కేవీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, సవరపు జయమణి, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు,  పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్,  నెల్లిమర్ల సమన్వయకర్త డాక్టరు పెనుమత్స సురేష్‌బాబు, ఎస్‌కోట సమన్వయకర్త నెక్కలి నాయుడుబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎస్సీ సెల్ విభాగం నాయకుడు  జైహిందుకుమార్, రైతు విభాగం నాయకుడు సింగుబాబు, యువజన నాయకులు అవనాపు విజయ్, జెడ్పీ మాజీ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావు, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ మామిడి అప్పలనాయుడు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

బాబుకు జగన్ భయం


బాబుకు జగన్ భయం
 ప్రతి మాటకూ ఉలిక్కిపడుతున్నాడు
 పది లక్షల పింఛన్లు తొలగించడం సమర్థపాలనా?
 హామీలు అమలయ్యేవరకు నిరంతర ఉద్యమాలు
 వైఎస్సార్ సీపీ నేత ధర్మాన ప్రసాదరావు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబునాయుడుకు మాట తప్పని, మడమ తిప్పని జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భయం పట్టుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయగోదావరి జిల్లాల ఇన్‌చార్జి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాటకు బాబు ఉలిక్కిపడి స్పందిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయితే ఆ స్పందనతో ప్రజలకు మేలు జరిగితే అందరూ సంతోషిస్తారని, కానీ బాబు కేవలం తప్పులు కప్పిపుచ్చుకోవడానికే పడరాని పాట్లు పడుతున్నారని ధర్మాన విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లాలోని ప్రజలు, రైతులు, మహిళలు పెద్ద ఎత్తున సహకరించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు వారిని విస్మరించారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం 10 లక్షల పింఛన్లు తొలగించిందని ఇది సమర్థపాలనా అని ధర్మాన నిప్పులు చెరిగారు. వ్యవసాయం పండుగ, మట్టిని బంగారం చేస్తానంటే ప్రజలు ఏమో అనుకున్నారని, కానీ నేడు ఇసుకను కేజీ రూ.2 చొప్పున కొనాల్సి రావడంతో బాబు మాటల్లోని ఆంతర్యం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు. సీఎం అనుసరిస్తున్న ఇసుక విధానం కారణంగానే గృహ నిర్మాణ కూలీలు, పెయింటర్లు, తాపీ మేస్త్రిలు, కార్పెంటర్లు ఉపాధి కోల్పోయారని ధర్మాన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అస్తవ్యస్త పరిపాలన సాగుతోందనీ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఏ అధికారికీ అవగాహన లేకపోవడం విచారకరమన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల మీద తెలుగుదేశం చెంచాలు పెత్తనం చేస్తూ వందల కోట్లు దోచుకుతింటున్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి మహిళల ఓట్లు పొందిన చంద్రబాబును అదే మహిళలు వచ్చే ఎన్నికల్లో ఓటు పోటుతో ఇంటికి  పంపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అనంతరం చంద్రబాబు కళ్లకు పొరలు కప్పాయని, ఆయనకు విదేశాలు తప్ప రాష్ట్ర ప్రజలు కనపడటం లేదని ధర్మాన విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికలేవీ జరగడం లేదని, తాము ఓట్లు అడగడం కోసం రాలేదని, ప్రజల తరఫున పోరాటం చేయడానికే వచ్చామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నోరువిప్పి అడగలేని పేద ప్రజలకు సైతం పింఛన్లు అందించారని, చంద్రబాబు ఉన్న పింఛన్లు తొలగించి పుణ్యం కట్టుకున్నారన్నారని ఎద్దేవా చేశారు.

ఇది ఆరంభమే


* ఇది ఆరంభమే: జగన్‌మోహన్‌రెడ్డి
ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను బాధితులకు బాబు చేసింది సున్నానే
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయైనా విదల్చలేదు
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అవెక్కడ? అంటూ అవహేళన చేస్తున్నారు
మాటపై నిలబడలేని బాబుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  ‘‘ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కేస్తున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలి అని చెప్పారు. మంగళసూత్రాలు నిలవాలం టే బాబు రావాలన్నారు. టీవీల్లో ఒకటే ఊదరగొట్టారు. జాబు కావాలి అనే లక్షల మంది ఓట్లేశారు. లక్షల మంది పిల్లలు ఓట్లేశారు. రుణాలు మాఫీ కావాలని రైతులు ఓట్లేశారు. అక్కచెల్లెమ్మ లు ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కచెల్లెమ్మలతో పనైపోయింది. రైతులతో పనైపోయింది. పిల్లలతో, చదువుకుంటున్న విద్యార్థులతో పనైపోయింది. అంతే బాబు అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గాలికొదిలేశారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును, టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.

రాష్ట్రంలో 87వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఉంటే చంద్రబాబు కేవలం రూ. 5 వేల కోట్లు విదిల్చి దబాయిస్తున్నారని.. రైతులకు కోటి పైచిలుకు బ్యాంకు అకౌంట్లు ఉంటే కేవలం 22 లక్షల మంది ని మాత్రమే లెక్కతేల్చారని దుయ్యబట్టారు. డ్వాక్రా రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంటే.. వాటి మాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇంటికి ఒక ఉద్యోగమిస్తానని చెప్పిన చంద్రబాబును తాను అసెంబ్లీలో అడిగితే.. గవర్నమెంటు ఉద్యోగాలు కాదు ప్రైవేటు ఉద్యోగాలు అంటూ ఆయన మాటమార్చారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు ప్రజలతో పని ఉన్నప్పుడు.. ప్రజల ఓట్లు కావల్సినప్పుడు.. తాను సీఎం కుర్చీలో కుర్చోవాలనుకున్నప్పుడు ఒక మాట చెప్తారు. ఎన్నికలు అయిపోయాక ప్రజలతో పని తీరిపోయాక ఓట్లు వచ్చేశాక చంద్రబాబు మరో మాట చెప్తారు. బాకై్సట్ తవ్వకాలు అయినా పీసీపీఐఆర్ అయినా చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేసేది మరొకటి’’ అంటూ విరుచుకుపడ్డారు.

‘‘ఎన్నికల హామీలను తుంగలో తొక్కేసిన టీడీపీ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇది ఆరం భం మాత్రమే.. చంద్రబాబు తన హామీలను నెరవేర్చేకపోతే జనవరి 6, 7 తేదీల్లో నేనే నిరాహారదీక్ష చేస్తా. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆత్మహత్యలు ఎక్కడ జరిగా యి ఎప్పుడు జరిగాయని ఆయన హేళనగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు గట్టిగా బుద్ధి వచ్చేలా చెప్తున్నా.. ఆత్మహత్యలు చేసుకున్న ఆ 86 మంది రైతుల కుటుంబాలను వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాను. సంక్రాంతి పండుగ తరువాత వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి ఓదారుస్తాను. అప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతుంది’’ అని వై.ఎస్.జగన్ ప్రకటించారు.

ఎన్నికల హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. విశాఖ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో జగన్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబు ఎన్నికల హామీలను ఎలా తుంగలో తొక్కేసిందీ గణాంకాలతో వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ప్రజలతో పనైపోయాక హామీలు తుంగలో తొక్కారు...
‘‘ఇన్ని వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కదలివచ్చి నడిరోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. కారణమేమిటని ఆలోచించే పరిస్థితిలో ఈ నాయకులు, పాలకులు లేరు. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారు? ప్రజలతో పని ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడారు? ప్రజలతో పని అయిపోయాక ఏం మాట్లాడుతున్నారు? అనేది ఒక్కసారి గుండెల మీద చేయివేసుకుని గుర్తుచేసుకొని చెప్పాలని ఈ నాయకులను, ఈ పాలకులను ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలకు ముందు ఆ వేళ ఇదే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టి హైదరాబాద్‌కు వచ్చాడు. మేమే రాష్ట్రాన్ని విడగొట్టామని ఢిల్లీలో చెప్పి ఎంపీలతో చేతులు పెకైత్తించారు. హైదరాబాద్ వచ్చిన తరువాత ఎన్నికల వస్తున్నాయి కదాని రెండు మేనిఫెస్టోలు విడుదల చేశాడు. సీమాంధ్ర మేనిఫెస్టో అని చెప్పి బుక్ పైకి ఎత్తారు. తెలంగాణ మానిఫెస్టో అని చెప్పి ఇలా బుక్కు పెకైత్తారు. బుక్ పేపర్లు తిరగేస్తే అందులో ఊదరగొటే హామీలే ఉన్నాయి. వస్తూనే మొట్టమొదటి సంతకం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తున్నానని చెప్పి ఊదరగొట్టారు.

రెండో సంతకం డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి. మంగళసూత్రాలు నిలవాలంటే బాబు రావాలి. రైతులకు రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి’ అని టీవీల్లో ఊదరగొట్టారు. బాబు రావాలి జాబు కావాలి అనే లక్షల మంది ఓట్లేశారు. బాబు రావాలి రైతుల రుణాలు మాఫీ కావాలని రైతులు ఓట్లేశారు. లక్షల మంది పిల్లలు ఓట్లేశారు. లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కచెల్లెమ్మలతో పనైపోయింది. రైతులతో పనైపోయింది. పిల్లలతో, చదువుకుంటున్న విద్యార్థులతో పనైపోయింది. అంతే బాబు అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గాలికొదిలేశారు.

రైతు రుణాలపైనా, ఖాతాల లెక్క పైనా ప్లేటు ఫిరాయింపే...
ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలుసు.. రైతుల రుణాలు రూ.87 వేల కోట్ల ఉన్నాయని తెలుసు. జగన్‌మోహన్‌రెడ్డికి తెలు సు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అందరికీ తెలు సు. ఇవాళ 87 వేల కోట్ల రూపాయల రైతు రుణాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటున్నారో తెలుసా..? ‘నేనెప్పుడు చెప్పాను రైతుల వ్యవసాయ రుణాలని? నేను క్రాప్ రుణాలని చెప్పాను’ అని మళ్లీ రుణాల విషయంలో ప్లేటు ఫిరాయిం చారు. మరోవైపు 87 వేల కోట్ల రుణాలకు గాను రాష్ట్రంలో దాదాపు కోటి పైచిలుకు రైతుల అకౌంట్లు ఉన్నాయి.

మొన్న చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి 22 లక్షల మంది రైతులు అని తేల్చేశారు. అదికూ డా.. ఇవాళ విశాఖపట్నానికి జగన్ వస్తున్నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయని.. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి ఏదో చేస్తున్నట్లు చెప్పారు. కోటి పైచిలుకు అకౌంట్లు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే అలా బిస్కట్లు వేసినట్లుగా కాస్తో కూస్తో ఇస్తానంటున్నారు. ఆ 22 లక్షల మంది రైతులకయినా ఎంత ఇస్తారో అంటే.. ‘అది మాత్రం నన్ను అడగొద్దు ఇప్పుడు చెప్పను’ అంటా రు. ఎంత ఇస్తారో చెప్పరు. ఎంత మందికి ఇస్తారో చెప్పరు. కానీ రోజూ బుకాయిస్తూ పోతారు. ఇలా చంద్రబాబు కోటి పైచిలుకు రైతులకు సంబంధించిన రూ. 87 వేల కోట్ల రుణాల సంగతిని పక్కనపెట్టేశారు.

నమ్మినందుకు రూ. 14 వేల కోట్ల అపరాధ వడ్డీ భారం...
డ్వాక్రా అక్కచెల్లమ్మలకు మాత్రం దాదాపు రూ. 14 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. ఆ రూ. 14 వేల కోట్లు మాఫీ అవుతాయని డ్వాక్రా అక్కచెల్లమ్మలు కోటి ఆశలతో ఎదురుచూశారు. ఈ రూ. 14 వేల కోట్లు.. రైతులకు సంబంధించి రూ. 87 వేల కోట్లు కలిపితే లక్షా ఒక్కవేల కోట్ల అప్పులున్నాయి. ఈ డ్వాక్రా అక్కచెల్లమ్మలకు, రైతులకు ఎన్నికల వేళ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన పెద్దమనిషి మాటలు నమ్మి అప్పులు కట్టనందుకు అపరాధ వడ్డీ రూ. 14 వేల కోట్లు కడుతున్నారు. ఈ లక్ష కోట్ల అప్పు మీద ఒక్క అపరాధ వడ్డీ భారమే 14 వేల కోట్ల రూపాయలు అయితే.. చంద్రబాబు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించి ‘20 శాతం మాఫీ అయిపోయింది’ అని చెప్తున్నాడు. మాట మీద నిలబడని ఇటువంటి పెద్దమనిషి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? అని చంద్రబాబును అడుగుతున్నాను.

ప్రయివేటు ఉద్యోగాలైతే నీతో పనేమిటి బాబూ?
‘ప్రతి పిల్లాడికి ఉద్యోగమిస్తాను. నాకు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నాకు దేశానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉంది. నాకు ప్రపంచానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉంది’ అని ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చాలెంజ్ చేశాడు. ఇవాళ రాష్ట్రంలో కోటి 75 లక్షల ఇళ్లున్నాయి. కోటి 75 లక్షల ఇళ్లకు రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావని చంద్రబాబును కాలర్ పట్టుకుని నిలదీయడానికి పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇదే చంద్రబాబును అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఆయన నిస్సిగ్గుగా అంటాడు.. ‘గవర్నమెంటు ఉద్యోగాలు ఇస్తానని నేను ఎప్పుడు చెప్పాను?’ అని అంటాడు. బాధనిపించింది. చంద్రబాబును అడిగాను అయ్యా గవర్నమెంటు ఉద్యోగాలు అయితే నీతో పని. ప్రైవేటు ఉద్యోగాలు అయితే నీతో పనేందయ్యా? ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు పోవాలి కదా? అన్నాను. ఇలా పూటకొక మాట రోజుకొక అబద్ధం చెప్తున్నాడు.

అవ్వాతాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారు...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున రాష్ట్రంలో 43,11,686 పెన్షన్లు ఉన్నాయి. ఆ పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలకు ఆ డబ్బులు రాకపోతే కడుపునిండా అన్నం తినడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి. అలాంటి అవ్వాతాతల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నాడు. పెన్షన్ వెయ్యి రూపాయలు ఇస్తామన్నాడు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఉన్న 43,11,686 పెన్షన్లకు వెయ్యి రూపాయలు అంటే నెలకు 431 కోట్ల రూపాయలు. అక్టోబరు ఒకటి నుంచి ఇస్తామన్నాడు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ లెక్కేస్తే ఏడు నెలలు. ఏడు నెలలకు 431 కోటి రూపాయలు చొప్పున మూడు వేల కోట్ల రూపాయలు.

అక్టోబర్‌కు ముందున్న ఐదు నెలలకు ఇప్పుడు ఇస్తున్న 200 పెన్షన్ ప్రకారం నెలకు రూ. 130 కోట్లు చొప్పున 650 కోట్లు. రెండూ కలిపితే 3,700 కోట్లు. అవ్వాతాతల కోసం నిజంగా కత్తిరింపులు లేకుండా ఇస్తున్న పెన్షన్లు. కొత్త పెన్షన్ల గురించి నేను మాట్లాడటం లేదు సుమా. ఉన్న పెన్షన్లకు బడ్జెట్‌లో రూ. 3,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాల్సి ఉంటే.. ఈ పెద్ద మనిషి బడ్జెట్‌లో కేవలం రూ. 1,350 కోట్లు మాత్రమే  కేటాయించి.. మిగతా రూ. 2,400 కోట్ల మేర పెన్షన్‌దార్లను కత్తిరించడానికి సిద్ధపడ్డాడు. ఈ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్లపై కమిటీలు వేశాడు. ఆ కమిటీలలో ఉన్నదంతా టీడీపీకి చెందిన కార్యకర్తలు. వాళ్లు కత్తిరింపులకే ఉన్నారు అన్న రీతిలో వ్యవహరించారు. ఇటువంటి దారుణమైన పరిపాలన సాగుతోంది.

రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయీ ఇవ్వలేదు...
ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అని చెప్పి ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి.. ప్రతి పిల్లాడిని గొప్ప గా చదివించాలి, చదువుల కోసం పేదరికం అడ్డురాకూడదు, ప్రతి పిల్లాడు ఇంజినీరు కావాలి, డాక్టర్ కావాలి అని.. ఆ దివంగత నేత కలలు కన్నాడు. ఆ నేత మన మధ్య నుంచి వెళ్లిపోయాడు. ఇవాళ చంద్రబాబు వచ్చాడు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించి ఈ సంవత్సరం 2,400 కోట్ల రూపాయలు కావల్సి వస్తే.. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరానికి చెందిన రూ. 2,400 కోట్లు పక్కనపెట్టండి. నిరుటి సంవత్సరం బకాయిలూ చంద్రబాబు ఇంతవరకు తీర్చలేదు. ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడారు. ఎన్నికలు అయిపోయాక ప్రజలతో పని అయిపోయాక మరో మాదిరిగా చేస్తున్నారు. ఇవాళ అందుకనే ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. నవంబర్ 5న ప్రతి మండల కేంద్రంలోనూ ధర్నాలు చేశాం. దాని కొనసాగింపులో భాగంగా ఇవాళ డిసెంబర్ 5వ తారీఖున జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నాం.

కుక్కలకు వేసినట్లు పొట్లాలు వేయడమే తుపాను సాయమా?
విశాఖలో, ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను వచ్చింది. ఆ తుపా ను వచ్చినప్పుడు 10 రోజుల పాటు ప్రతి ప్రాంతంలోనూ తిరి గాను. ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు భయానకమైన వాతావరణం కనిపించింది.బాబు ఏమైనా చేశారా అని అడిగాను. చంద్రబాబు ఏం చేశారంటే.. ఇలా ఒక వ్యాన్ కాలనీలోకి వచ్చేది ఒక కాలనీలో దాదాపు వెయ్యి మంది నివాసం ఉంటారు. ఆ కాలనీ లోకి ఎప్పు డు వచ్చిందో తెలియదుగానీ ఒక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్‌లో పులిహోర పొట్లాలు, పాలప్యాకెట్లు ఉండేటివి. వెయ్యి మంది నివాసం ఉంటా ఉంటే ఆ వ్యాన్‌లో మాత్రం కేవలం 200 300 మందికి సరిపోయే పొట్లాలు ఉంటాయి. ఆ పోట్లాలు విసిరేసేవారు. ఇలా ఇలా కుక్కలకు విసిరేసినట్లు విసిరేసేవారు. చూసినప్పుడు బాధ అనిపించింది. నిజంగా నీకు మానవత్వం ఉంటే ఎం దుకు ప్రతి ఇంటికి వెళ్లి తలుపుకొట్టి మరీ ‘నేను ఈ సహాయం చేస్తున్నాను’అని చెప్పి ఆ పాలప్యాకట్లో ఆ బిరియానీ ప్యాకట్లో వాళ్ల ఇం టి దగ్గరకు వెళ్లి ఎందుకు ఇవ్వలేకపోయారు? అని అడుగుతున్నా.

 పాతిక రూకలిచ్చి చేతులు దులుపుకున్నారు
ఇదే చంద్రబాబు ఆ రోజు హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఇక్కడే ఉండి చేసిందేమిటంటే.. సున్నా. ఇక్కడే తాను ఉన్నాడు. ఇక్కడే ఊదరగొట్టాడు తుపాను గురించి. ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూ పోయాడు. అంత చేశాను ఇంత చేశాను అని చెప్పాడు. ఇవాళ నేను అడుగుతున్నాను. చంద్రబాబు చేసిందేమిటి? మామూలుగా ప్రతి నెల కేజీ రేషన్ బియ్యం రూపాయికి కొనుక్కునేవాళ్లం. 20 కేజీల బియ్యం 20 రూపాయలకు వచ్చేవి. ఈ చంద్రబాబు చేసిందేమిటంటే ఆ 20 రూపాయలు డిస్కౌంటు ఇచ్చి 25 కేజీల బియ్యం మాత్రం రేషన్ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ ఒక్క పైసా చేయలేదు. ఇదీ ఈ పెద్ద మనిషి చేసింది.

మత్స్యకారులకైతే  50 రూపాయాలు ఇచ్చాడు. మిగిలిన వారికి 25 రూపాయలు ఇచ్చాడు. ఇదీ ఈ పెద్దమనిషి చేసింది. తుపాను వచ్చినప్పుడు ఇళ్లు నాశనమైపోయాయి. ప్రతి ఇంటి వాళ్లకు కనీసం బతకడానికి పని లేదు. తినడానికి తిండి లేదు. వారం రోజులు రెండు వారాల పాటు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో బతికారు. పొలాలకు పోవాలన్నా పనులు చేసుకోవాలన్నా కరెంటు లేదు. అటువంటి పరిస్థితిలో వాళ్లను ఆదుకునేందుకు ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇవ్వండయ్యా అంటే.. ‘నేను ఇవ్వను పో’ అన్నారు ఇదే చంద్రబాబు. తుపాను వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 3 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. చంద్రబాబు ఇంతవరకూ ఏమైనా ఇచ్చారా? అని అడుగుతున్నాను (దీనికి జనం స్పందిస్తూ ‘లేదు లేదు’ అని గట్టిగా చెప్పారు).

పంట నష్టానికి ఒక్క రూపాయి ఇచ్చారా?
హుద్‌హుద్ తుపాను వల్ల 5 లక్షల 94 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టొద్దంటే కట్టని కారణంగా పంటల బీమా కూడా రాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ 5 లక్షల 94 వేల ఎకరాల్లో రైతులకు చంద్రబాబు కనీసం రూపాయి అయినా ఇచ్చారా? అని అడుగుతున్నాను (లేదు లేదు అని జనం గట్టిగా చెప్పారు. ‘రెండు చేతులు పెకైత్తి గట్టిగా చెప్పాలి’ అని జగన్ కోరినప్పుడు జనం మరింత గట్టిగా ‘లేదు ఇవ్వలేదు’ అని బదులిచ్చారు).  

దెబ్బతిన్న బోట్లకు ఒక్క రూపాయి ఇచ్చారా?
హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు వచ్చారు. హార్బర్ ప్రాంతం నాకూ గుర్తింది. అక్కడ 400 బోట్లు పోయాయి. 64 బోట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇదే చంద్రబాబు ఏమైనా బోట్లకు రూపాయి అని ఇచ్చారా? అని అడుగుతున్నాను (లేదు లేదు అని జనం గట్టిగా బదులిచ్చారు). ఏమీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపుగా మూడు నాలుగు వేల ఫైబర్ బోట్లు పోయాయి. మోటారు బోటు ఒకొక్కటి రూ.4 లక్షలు. సోనా బోటు అయితే ఒక్కొక్క బోటు 30 లక్షల రూపాయలు. ఫైబర్ బోట్లు అయితే ఒక్కొక్క బోటు 3 - 4 లక్షలు రూపాయలు. వల ఒక్కొక్కటి లక్ష రూపాయలు. వాళ్ల కోసం ఇదే చంద్రబాబు ఏమైనా చేశారా? అని అడుగుతున్నాను (లేదు లేదు అని జనం బిగ్గరగా అరిచారు). ఒక్కటంటే ఒక్కటీ చేయలేదు.

బాబు మెడలు వంచేవరకూ పోరాటం...
ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒకమాట చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తరువాత మరో మాట చెప్తారు. చంద్రబాబును కడిగేయడానికి.. రాబోయే రోజుల్లో చంద్రబాబు మెడలు వంచేందుకు.. జగన్‌కు తోడుగా మీ అందరి సహాయసహకారాలు కావాలని కోరుతున్నా. ఇందులో భాగంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న దారుణాల గురించి, హుద్‌హుద్ తుపాను నష్టాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గురించి డ్వాక్రా అక్కచెల్లమ్మల గురించి అవ్వాతాతల పెన్షన్ల గురించి చదువుకున్న పిల్లలు గురించి కలెక్టర్ దగ్గరకు వెళ్లి అర్జీ ఇస్తాం. ఇవాళ మొట్టమొదటి అర్జీ ఇది. ఇది చివరి అర్జీ కాదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం ఇంతటితో మొదలవుతుందని చంద్రబాబును హెచ్చరిస్తున్నా.’’

సంక్రాంతి తర్వాత ఆ రైతు కుటుంబాలను పరామర్శిస్తా
‘‘ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. జనవరి 6, 7 తేదీల్లో నేనే నిరాహారదీక్ష చేస్తూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. ఇంతటితో కూడా పోరాటం ఆగిపోదు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయి ఇప్పటికే 86 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 86 మంది రైతుల ఆత్మహత్యల గురించి ప్రశ్నిస్తే.. ‘ఎప్పుడు జరిగాయి? ఎక్కడ జరిగాయి? అని చంద్రబాబు బుకాయిస్తున్నారు. రైతుల జీవితాలను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు.

చంద్రబాబుకు గట్టిగా బుద్ధి వచ్చేలా చెప్తున్నా.. ఆ 86 మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను సంక్రాంతి పండుగ తరువాత వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాను. వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి ఓదారుస్తాను. జగన్‌మోహన్‌రెడ్డి చూపిస్తాడు నీ పాలనలో ఎంతమంది రైతులు చనిపోయారనేది. అప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతుంది రైతుల జీవితాలతో చెలగాటాలాడకూడదని. డ్వాక్రా అక్కచెల్లమ్మల జీవితాలతో చెలగాటాలాడకూడదని. చదువుకుంటున్న పిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని. అవ్వాతాతల జీవితాలతో చెలగాటాలు ఆడకూడదని. అప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతుంది.’’

బాకై్సట్ మైన్ల రద్దు మాట ఏమైంది.. బాబూ?
ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒకటి చెబుతారు. ఎన్నికలు అయిపోయాక ఇంకొకటి  చేస్తారు. ఇదే చంద్రబాబు విశాఖ జిల్లాలో బాకై్సట్ మైన్ల గురించి ఆ రోజు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ‘బాకై్సట్ మైన్లను రద్దు చేస్తాను’ అని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఇదే బాకై్సట్ మైన్ల కోసం పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి.. ఇచ్చిన మాటను గాలికొదిలేస్తున్నారు.

నాడు భూమి అడిగితే చెట్టుకు కట్టేసి కొట్టమన్నారుగా?
ఇదే చంద్రబాబు పాయకరావుపేట నియోజకవర్గానకి వెళ్లినప్పుడు ‘పీసీపీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ జరుగుతుందా? ఎవరైనా అధికారులు వస్తే చెట్టుకు కట్టేసి కొట్టండి’ అని పిలుపునిచ్చారు. ఇవాళ అదే పీసీపీఐఆర్ భూములకు సంబంధించి చంద్రబాబు ఏమంటున్నారంటే.. ‘భూములు ఇవ్వాలి. ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకుంటాం’ అని చెప్తున్నారు.

2రోజుల్లో రద్దు చేస్తానన్న ప్లాంటును రెట్టింపు చేశారు
ఇదే చంద్రబాబు  శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలప్పుడు సోంపేటకు వెళ్లి.. ‘నేను రెండ్రోజుల్లో ఇక్కడ పవర్ ప్లాంటు జీవోను క్యాన్సిల్ చేస్తాను’ అన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత అదే సోంపేటకు 4 కిలోమీటర్ల దూరంలోనే ఆ రోజు 2,400 మెగావాట్ల ప్లాంటు ఉంటే ఇవాళ 4,000 మెగావాట్ల ప్లాంట్ కోసం జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు.

Jagan exposes Naidus doublespeak

Written By news on Friday, December 5, 2014 | 12/05/2014

YS Jagan speech at YSRCP Maha Dharna in Vizag

ఆ 24 ప్రశ్నలకు గంటా సమాధానం చెప్పాలి



హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ సీపీ మహాధర్నాలు విజయవంతమయ్యాయని, ప్రజలనుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. రుణమాఫీపై చంద్రబాబు విధాన ప్రకటన చేసిన 24 గంటల్లోపే ధర్నాలు విజయవంతమయ్యాయన్నారు. దీని బట్టి ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అన్నిజిల్లాల్లో ఆంక్షలు పెట్టినా ప్రజాస్పందన వెల్లివెత్తిందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు అమర్నాథ్ వేసిన 24 ప్రశ్నలకు మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న టీడీపీ సిగ్గుతో తలదించుకోవాలని  ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్ సీపీ తలపెట్టిన మహాధర్నాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వాసిరెడ్డి పద్మ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు 420 కేసుకు అర్హుడే

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో 86మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటానికి బాబు విధానాలే కారణమని విమర్శించారు. అందుకు బేషరతుగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. 

చంద్రబాబు అబద్దాల బాబుగా మారిపోయారని విమర్శించారు. భారత చట్టాల ప్రకారం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు 420 కేసుకు అర్హుడేనన్నారు. బినామీ ఆస్తుల పరిరక్షణకే చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని ఆయన విమర్శించారు.  జనవరిలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండు రోజుల దీక్ష చేయనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు.

వైఎస్ షర్మిల మొదట విడత పర్యటన షెడ్యూల్ ఖరారు


వైఎస్ షర్మిల మొదట విడత పర్యటన షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టనున్నపరామర్శ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. దివంగత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల జరప తలపెట్టిన యాత్ర డిసెంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి  ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీ సోమవారం ఉదయం లోటస్ పాండ్ నుంచి షర్మిల యాత్ర ఆరంభించనున్నారు.
 
తొలుత బ్రాహ్మణపల్లిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించిన అనంతరం పరామర్శ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు ఇర్విన్, దేవుని వడ్కల్, వెలాలలో మూడు కుటంబాలను షర్మిల పరామర్శిస్తారు. అనంతరం 9వ తేదీ ఉదయం అమ్రాబాద్ లో ఓ కుటుంబాన్ని పరామర్శించిన తరువాత అచ్చంపేటలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ పిదప కౌలావూర్ లో రెండు కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
 
10వ తేదీన పెంటవల్లి, చిట్యాల, రాణిపేట,  నందిన్నెలో మూడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. ఆ రోజు రాత్రికి దయార్ లో ఆమె బస చేస్తారు. 11వ తేదీ ఉదయం జూరాల నుంచి పరామర్శయాత్ర ఆరంభం కానుంది. కొన్నూరు, కోసి, అమీన్ కుంట, ఇండావూర్ లో ఐదు రైతు కుటుంబాలను షర్మిల పరామర్శించి.. సాయంత్రం కౌడంగల్ లో బస చేస్తారు. 12 వ తేదీ పెద ఎర్కిచర, గుండ పాటవల్లి, నర్సప్ప గూడ, మలావూర్ లో నాలుగు కుటుంబాలను షర్మిల పరామర్శించడంతో మహబూబ్ నగర్ జిల్లా యాత్ర  ముగియనుంది. ఆరోజు సాయంత్రం షాద్ నగర్ మీదుగా షర్మిల హైదరాబాద్ కు చేరుకుంటారు.

జనవరి 6,7 తేదీల్లో వైఎస్ జగన్ నిరాహార దీక్ష


విశాఖ : చంద్రబాబు నాయుడు సర్కార్‌ మోసపూరిత విధానాలపై తాము చేసే పోరాటం ఆరంభం మాత్రమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం విశాఖ మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ జనవరి 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు చెప్పారు.  రాబోయే రోజుల్లో చంద్రబాబు మెడలు వచ్చేందుకు ప్రజలందరు సహకరించాలని వైఎస్ జగన్ కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా వేలమంది చేస్తున్న ధర్నాలకు కారణం ఏమిటనే ఆలోచన చేసే స్థితిలో పాలకులు, నాయకులు లేరని వైఎస్ జగన్ అన్నారు. ప్రజలతో పనైపోయిన తర్వాత ఇప్పుడేమంటున్నారని ఆయన వారిని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల సంగతి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

సంక్రాంతి తర్వాత రైతు కుటుంబాలకు పరామర్శ: వైఎస్ జగన్


విశాఖ : రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ఓటు వేసిన రైతులు...మాఫీ కాని రుణభారంతో ఇప్పటివరకూ 86మంది రైతులు ఆత్మహత్యలు  చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ప్రశ్నిస్తే...ఆత్మహత్యలు, ఎప్పుడు..ఎక్కడ జరిగాయంటూ బాబు బుకాయిస్తున్నారంటూ అన్నారు. మృతి చెందిన 86మంది రైతు కుటుంబాలను సంక్రాంతి తర్వాత పరామర్శించబోతున్నానని వైఎస్ జగన్ తెలిపారు.


87 వేల కోట్ల రైతు రుణాలు వున్న విషయం ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు ప్రతి ఒక్కరికీ తెలుసునని వైఎస్‌ జగన్ అన్నారు. అయితే ఇప్పుడు తాను చెప్పింది రైతు రుణాల గురించి కాదని క్రాప్‌ లోన్‌ల గురించని చంద్రబాబు మాట మార్చారని ధ్వజమెత్తారు. తాను విశాఖను వస్తున్నానని, ధర్నాలో పాల్గొంటానని తెలిసీ నిన్న మీటింగ్‌ పెట్టిన చంద్రబాబు..కోటి మందికి పైగా రైతులుంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే..బిస్కెట్లు వేసినట్టుగా కాస్తోకూస్తో ఇస్తానని ప్రకటించారని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విమర్శించారు.

ప్రతి పిల్లాడికీ ఉద్యోగం ఇస్తాం, సిఎంగా చేసిన తొమ్మిదేళ్ల అనుభవం వుంది, ప్రపంచానికి ట్యూషన్‌ చెప్పిన అనుభవమూ వుందని ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారన్నారు. అయితే నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావ్‌ అంటూ బాబును కాలర్‌ పట్టుకునే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. పింఛన్ల విషయంలో అవ్వాతాతల జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని వైఎస్‌ జగన్ అన్నారు.  

కొత్త పెన్షన్ల గురించి సరేసరి, వున్న వాటిపై కోత విధిస్తున్నారని అన్నారు. వేసిన కమిటీల్లో అంతా టిడిపి కార్యకర్తలేనని ఆయన విమర్శించారు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు విశాఖలో ఉన్న చంద్రబాబు ...ప్రజలకు చేసింది శూన్యమన్నారు. బాధితులకు పులిహోరా, పాల ప్యాకెట్లు...కుక్కలకు విసిరేసినట్లు విసిరేశారని ఆవేదన చెందారు

ఎండలు తీక్షణంగా ఉన్నా...


దేశానికి ట్యూషన్లు చెప్పారట...
విశాఖ : 'ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా లెక్కచేయటం లేదు.దాదాపుగా మూడు గంటలపాటు నిల్చొనే ఉన్నారు. అయినా లెక్కపెట్టడం లేదు. రోడ్డుమీదే నిలబడి ఉన్నారు. ఇవేమీ లెక్కచేయటం లేదు. ముఖంలో మాత్రం చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చిందిస్తూ ఉన్నారు. ఇంతటి ఆప్యాయత, ప్రేమానురాగాలు చూపుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరసు వంచి నమస్కరిస్తున్నా'నంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహాధర్నాకు వచ్చిన ప్రజానీకాన్ని పలకరించారు.

ముఖ్యమంత్రి కావాలనే ఆశతో చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారని వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన ఆయన ...ప్రజలతో ఇంకా పనేముందనుకొని...మాట మార్చారన్నారు. ప్రపంచానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉందని టీవీల్లో ఊదరగొట్టిన చంద్రబాబు...  హామీల అమల్లో రిక్తహస్తం చూపారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని బాబు తుంగలో తొక్కారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

బాబుపై రాయలసీమ రైతన్న కన్నెర్ర


హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలపై రైతన్న కన్నెర్ర చేశాడు. రుణమాఫీ అమలుపై మాటమార్చినందుకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన గళం విప్పారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో రైతులు, డ్వాక్రా మహిళలు  రోడ్డెక్కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద చేపట్టిన మహాధర్నాకు రైతులు, డ్వాక్రా మహిళలు సంఘీభావం ప్రకటించారు.

రాయలసీమలోని నాలుగు జిల్లాలో వైఎస్ఆర్ మహాధర్నాకు భారీ స్పందన వస్తోంది. ధర్నా అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించినా జనం ఖాతరు చేయకుండా వచ్చి మద్దతు తెలియజేశారు.  వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు తరలివచ్చారు.  జిల్లాల వారీగా సమాచారం..


కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా ఆరంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అనంతపురంలో వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధర్నా ప్రారంభించారు. కలెక్టరేట్ దగ్గర జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, రైతులు, డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో రైతులు కదంతొక్కారు. ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యువకులు, మహిళలు మద్దతు తెలియజేశారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 25 వాహనాల్లో ప్రజలు తరలివచ్చారు.

చిత్తూరు జిల్లా ధర్నాకు పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. పార్టీ నాయకులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబు తోక పత్రికలు విష ప్రచారం: ద్వారంపూడి


బాబు తోక పత్రికలు విష ప్రచారం: ద్వారంపూడి
కాకినాడ : చంద్రబాబు నాయుడు రుణమాఫీపై తొలి సంతకానికి విలువ లేకుండా చేశారని వైఎస్ఆర్ సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు.  తొలి సంతకం చేసి మాట నిలుపుకున్న నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్‌ మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

మహాధర్నాలో పాల్గొన్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై చంద్రబాబు తోక పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఇంటింటికి పంచిపెట్టి బాబు మోసాలను మరోసారి ప్రజలకు తెలియ చేస్తామన్నారు.

ఉత్తరాంధ్రలో కదంతొక్కిన జనం


ఉత్తరాంధ్రలో కదంతొక్కిన జనం
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలపై రైతులు, డ్వాక్రా మహిళలు  పోరుబాటపట్టారు. రుణమాఫీ అమలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో రైతులు, మహిళలు నిరసన తెలియజేస్తున్నారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో  పెద్ద ఎత్తున రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో జనం కదంతొక్కారు. ధర్నా విశేషాలు..

విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ధర్నా అడ్డుకునేందుకు  పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా ప్రజలు ఖాతరు చేయకుండా వచ్చారు. విశాఖపట్నం రోడ్లు జనసంద్రంగా మారాయి.

శ్రీకాకుళం జిల్లా ధర్నాకు రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.

విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు అద్భుత స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే గాక అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు.

భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ సీపీ మహాధర్నా


భారీ జనసందోహం మధ్య వైఎస్ఆర్ సీపీ మహాధర్నా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఆరంభమైంది. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా చేపడుతున్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ధర్నా అడ్డుకునేందుకు  పోలీసులను పెద్ద ఎత్తున మోహరించినా ప్రజలు ఖాతరు చేయకుండా వచ్చారు. విశాఖపట్నం రోడ్లు జనసంద్రంగా మారాయి. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ధర్నాలో పాల్గొనేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలలా అన్ని ప్రాంతాల నుంచి ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్దకు జనం చేరుకున్నారు.  వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువకులు, డ్వాక్రా సంఘాల వారు తరలివచ్చారు.  మహాధర్నాను అడ్డుకునేందుకు పోలీసులను భారీ సంఖ్యలో మోహరించినా జనం స్వచ్ఛంధంగా వచ్చారు. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా ప్రజలు ఖాతరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పూటకో మాట.. రోజుకో విధానం


‘చంద్ర’మోసం
⇒ రుణమాఫీ హామీపై పూటకో మాట.. రోజుకో విధానం
⇒ పంట రుణాల మాఫీ లబ్ధిదారుల జాబితాలో సగానికిపైగా కోత
⇒ తొలిదశలో 1.98 లక్షల మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందంటున్న బ్యాంకర్లు
⇒ ఉద్యానవన పంట రుణాలపై మాటమార్చిన చంద్రబాబు.. ఎకరానికి రూ.పది వేల వంతున మాఫీ
⇒ డ్వాక్రా రుణ మాఫీపై స్పష్టత ఇవ్వని సర్కారు.. సంఘంలో ఒక్కొక్కరికి రూ.పది వేల వంతున సహాయం
⇒ మాట మార్చడంతో ఆరు నెలల్లో రైతులపై రూ.939 కోట్లు,  మహిళలపై రూ.210 కోట్ల వడ్డీ భారం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రైతులు, మహిళలనూ సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేసి రైతులను, మహిళలనూ రుణ విముక్తులను చేస్తానని వాగ్దానం చేశారు. అధికారం చేపట్టాక పూటకో తిరకాసు. రోజుకో కొర్రీ వేస్తూ ఆ హామీని నీరుగార్చారు. రైతులకూ మహిళలకూ దన్నుగా, చంద్రబాబు మోసానికి నిరసనగా గత నెల 5న జిల్లా వ్యాప్తంగా 66 మండల కేంద్రాల్లోనూ ధర్నాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం చిత్తూరులో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు ఉపక్రమించింది. మహిళలూ, రైతులు భారీ ఎత్తున చిత్తూరుకు కదలివచ్చి వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో కదంతొక్కుతారన్న ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సంతకంతో వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసి అటు రైతులనూ ఇటు మహిళలను ఆదుకుంటామని చంద్రబాబు ఊరూవాడ ఊదరగొట్టారు. చంద్రబాబు మాటలను నమ్మిన రైతులు, మహిళలు టీడీపీకి అధికారం దక్కడానికి దోహదం చేశారని రాజకీయ పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. రుణమాఫీ హామీ ఒక్కటే తమను అధికారపీఠంపై కూర్చోబెట్టిందని చంద్రబాబు సహా టీడీపీ నేతలు బాహాటంగా అంగీకరించారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు రోజుకో మాట, పూటకో విధానంతో రుణమాఫీ హామీని నీరుగార్చేం దుకు చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు.

ఇదిగో తిరకాసు.. అదిగో కోత..

చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు జిల్లాలో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,321 మంది రైతులు రూ.11,180.25 కోట్లు బ్యాంకులకు బకాయిపడ్డారు. ఒక్క సంతకంతో ఆ రుణాలను మాఫీ చేయాల్సిన చంద్రబాబు, తొలి సంతకంతోనూ రైతులను వంచించారు. రుణ మాఫీకి విధి విధానాలు రూపొందించడానికి కోటయ్య కమిటీని నియమిస్తూ జూన్ 8న చంద్రబాబు తొలి సంతకం చేశారు. చేశా రు. కోటయ్య కమిటీ నివేదిక మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.5 లక్షలు(రూ.లక్ష పంట రు ణం, రూ.50 వేలు బంగారు రుణం) మాఫీ చేస్తామ ని ప్రకటించారు.

ఆ మేరకు లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి ఆగస్టు 2 మార్గదర్శకాలు జారీచేశారు. 30 అంశాల ప్రాతిపదికగా చేసుకుని బ్యాంకర్లు లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. ఆధార్‌కా ర్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుపుస్తకం, పంట సాగు వివరాలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం ఇచ్చారా లేదా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.

స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం తీసుకోని రైతులను అనర్హులుగా ప్రకటించాలని సూచించారు. ఈ తిరకాసులతో లబ్ధిదారుల జాబితాలో భారీగా కోత పడింది. 4.73 లక్షల మంది రైతులు మాత్రమే రుణ మాఫీకి అర్హులుగా బ్యాంకర్లు తేల్చారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఆ జాబితాలో కూడా భారీగా కోత వేస్తూ గురువారం సీఎం చంద్రబాబు రుణ విముక్తి పథకం మార్గదర్శకాలు జారీచేశారు.
     
⇒ తొలుత రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీని వర్తింపచేయాలని నిర్ణయించారు. ఈనెల 10 నుంచి జనవరి 14లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్దేశించారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 6న ప్రకటిస్తామని సీఎం చెప్పారు.
⇒ రెండో విడత రూ.50 వేల కన్నా ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు తొలుత రూ.50 వేలు.. తక్కిన మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించేలా రైతు సాధికార సంస్థ ద్వారా బాండ్లను జారీచేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ జనవరి 22 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
⇒ సీఎం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం తొలి వి డత 1.98 లక్షల మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ వర్తించే అవకాశం ఉందని బ్యాంకర్లు అం చనావేస్తున్నారు. రైతుసాధికార సంస్థకు రూ.ఐదు వేల కోట్లు కేటాయించిన నేపథ్యంలో ఆ రైతులకు కూడా రూ.50 వేల వంతున ఖాతాల్లో జమ చేయ డం సాధ్యం కాదని బ్యాంకర్లు చెబుతున్నారు.
⇒ ఉద్యానవన పంటల రైతుల రుణమాఫీని పరిశీలిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎకరానికి రూ.పది వేల వంతున మాఫీని వర్తింపజేస్తామని మాట మార్చడం గమనార్హం.
⇒ రుణమాఫీ అమలు ఆర్నెల్లు జాప్యం చేయడం వల్ల రైతులపై బ్యాంకులు 14 శాతం వడ్డీ విధించాయి. దీని వల్ల రైతులపై రూ.939.14 కోట్ల భారం పడింది. ఇప్పుడు ప్రభుత్వం తొలి విడత విడుదల చేసే మొత్తం వడ్డీకి కూడా సరిపోదని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు.
 
డ్వాక్రా మహిళలకూ టోపీ..
జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాల్లో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 31, 2013 నాటికి 52,433 డ్వాక్రా సంఘాల మహిళలు  రూ.1,611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మేరకు ఒక్క సంతకంతో ఆ రుణాలను మాఫీ చేయాలి. కానీ.. అధికారం చేపట్టగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేమని చేతులెత్తేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష లేదా ఒక్కో మహిళకు రూ.పది వేల వంతున పెట్టుబడి నిధిగా అందిస్తామని మాట మార్చారు.

చంద్రబాబు రుణాలను మాఫీ చేస్తారనే ఆశతో ఆర్నెళ్లుగా డ్వాక్రా మహిళలు అప్పులను చెల్లించడం లేదు. దీనివల్ల ఆ మహిళలపై 14 శాతం వడ్డీని బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. దీని వల్ల మహిళలపై రూ.135.32 కోట్ల మేర వడ్డీ భారం పడింది. సకాలంలో రుణం చెల్లించిన మహిళలకు ప్రభుత్వం వడ్డీని రీయింబర్స్‌మెంట్ చేస్తుంది. మాఫీపై ఆశతో మహిళలు రుణాలను చెల్లించకపోవడంతో రూ.75 కోట్లకుపైగా వడ్డీ రాయితీని మహిళలు కోల్పోయారు. అంటే.. మహిళలపై రూ.210.32 కోట్ల భారం పడినట్లు స్పష్టమవుతోంది.

ఇక సీఎం చంద్రబాబు మార్గదర్శకాల మేరకు జిల్లాలో 54,930 సంఘాల్లోని మహిళలకు రూ.549 కోట్లను పెట్టుబడి నిధిగా అందించాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి వారం రోజుల క్రితం ప్రతిపాదనలు పంపారు. రుణ విముక్తి పథకంలో డ్వాక్రా రుణాల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. డ్వాక్రా మహిళలకు రూ.పది వేల వంతున పెట్టుబడి నిధి ఎప్పుడు అందిస్తారన్నది అంతుచిక్కడం లేదు. చంద్రబాబు మోసానికి నిరసనగా రైతులు, మహిళలు రోడ్డెక్కుతున్నారు. మహిళలు, రైతులకూ వైఎస్సార్‌సీపీ బాసటగా నిలుస్తూ ప్రభుత్వం పోరాటాలు చేస్తోండడం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

లోటు ఉంటుందనే విషయం బాబుకూ తెలుసు


చంద్రబాబుపై భేరి
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ వెల్లడి
వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ హామీలిచ్చారు.. ఎన్నికల మేనిఫెస్టోలు, కరపత్రాలు, ప్రకటనలతో హోరెత్తించారు
అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు
పంటరుణాలని మాత్రమే అన్నానంటున్నారు, డ్వాక్రా రుణాల మాఫీ లేదంటున్నారు
అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబును నిలదీయండి.. నేటి ధర్నాల్లో కలసికట్టుగా పాల్గొనండి

సాక్షి, హైదరాబాద్: రైతుల, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ విషయంలో మాట తప్పి ప్లేటు ఫిరాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు ప్రదర్శించారు.

 వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రచురించిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలు, ఇంటింటికీ పంపిణీ చేసిన కరపత్రాలను చూపించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. మరో ఐదేళ్లపాటు ఎన్నికలు ఉండవన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రజలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఇది చాలదన్నట్లు అడ్డగోలుగా పింఛన్లు కత్తిరించే కార్యక్రమం కూడా జరిగిందన్నారు.

 తాము ఆందోళనకు దిగాం కాబట్టే చంద్రబాబు ఈరోజు కొంతమేరకైనా రుణమాఫీ ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకవైఖరికి నిరసనగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో అందరూ కలిసికట్టుగా పాల్గొనాలని జగన్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...

 రాష్ట్రంలో కోటికి పైగా రైతుల ఖాతాలుండగా చంద్రబాబు 22 లక్షల ఖాతాలకే రుణమాఫీ వర్తింప జేస్తామని చెప్పడం దారుణం. అదికూడా ఎంత మొత్తం మాఫీ చేస్తారో చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు. మరోవైపు మొత్తం రైతుల, డ్వాక్రా మహిళల లక్ష కోట్ల రూపాయల రుణంపై 14 శాతం అపరాధ వడ్డీ అంటే రూ.14 వేల కోట్లవుతుంది. కానీ చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం కేవలం రూ.5 వేల కోట్లే. ఈ మొత్తంతో  20 శాతం రుణ మాఫీ చేస్తానని చెప్పడం భావ్యమేనా?

 2012-13, 2013-14 ఖరీఫ్ కాలాలకు సంబంధించి పంటల బీమా కింద వచ్చిన రూ.68 కోట్లు, రూ.570 కోట్లు రైతులు చెల్లించాల్సిన అప్పుల కింద జమచేశారు. ఇప్పుడు రబీ ముగుస్తున్నా రైతులకు పంటల బీమా లేదు. కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు మాఫీ కాలేదు. ఇది చాలదన్నట్టు రైతులపై అపరాధ వడ్డీ భారం పడింది..

చంద్రబాబుకు అన్నీ తెలుసు
చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ)లో ఏఏ జిల్లాల్లో ఏ మేరకు అప్పులున్నాయో స్పష్టంగా వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జూన్ 30 వతేదీన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు సమర్పించిన నివేదికలోని 6వ పేజీలో 2014 మార్చి 31వ తేదీ నాటికి మొత్తం రైతుల రుణాలు రు.87,612 కోట్ల మేరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవికాక డ్వాక్రా మహిళల రుణాలు రు. 14,204 కోట్ల రూపాయలున్నాయి. రెండూ కలిపితే రు 1,01,816 కోట్లు ఉన్నాయి.

 ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసు. అప్పులెంత ఉన్నాయో, ఖాతాలెన్ని ఉన్నాయో స్పష్టంగా తెలుసు. అయినా ఇవాళ ప్లేటు మార్చారు. పంటరుణాలని మాత్రమే అన్నానని చెబుతున్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అనలేదని బుకాయిస్తున్నారు. ఒక్కో సంఘానికి పది వేల రూపాయలు మాత్రం ఇస్తానని చెప్పానన్నాడు. ఇంత కంటే దారుణం, అన్యాయం మరొకటి ఉంటుందా?

 ఎన్నికలపుడు బాబొస్తాడు, జాబు (ఉద్యోగం) వస్తుందన్నారు. జాబ్ రాకపోతే ప్రతి ఇంటికి రూ.2000లు నిరుద్యోగభృతి ఇస్తామని టీడీపీ వారు కరపత్రాలు వేసి ఇంటింటికీ పంచారు. రాష్ట్రంలో ఉన్న 1.75 కోట్ల ఇళ్లకు ఎక్కడి నుంచి భృతి తెచ్చి ఇస్తావయ్యా? అని మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఎప్పటినుంచి ఇస్తారో ఇప్పుడు మాట్లాడటంలేదు. డ్వాక్రా రుణాల గురించి అడిగితే తరువాత మాట్లాడదామంటూ దాటవేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున తొలి సంతకం రుణాల మాఫీపైనే చేస్తానని చెప్పి, కోటయ్య కమిటీ నియామకంపై చేశారు. అది కూడా ఖాతాల్లో కోతలు పెట్టడానికి.

 చంద్రబాబు ప్లేటు ఫిరాయిస్తున్నారు 
 చంద్రబాబు ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఏం చెప్పారో, ఇపుడు ఎలా ప్లేటు ఫిరాయిస్తున్నారో క్లుప్తంగా మీకు వివరిస్తాను. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంలో ప్రధాన పాత్ర వహించిన చంద్రబాబు తన ఎంపీలతో విభజనకు అనుకూలంగా ఓట్లేయించి తమవల్లే విభజన జరిగిందని చెప్పుకున్నారు. విభజన తరువాత తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంతానికి వేర్వేరుగా రెండు మేనిఫెస్టోలను చంద్రబాబు విడుదల చేశారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఆ రెండు మేనిఫెస్టోల్లో పొందుపర్చారు.

 చంద్రబాబుకు గెజెట్‌లాంటి పత్రిక అయిన ఈనాడులో ఆ మరుసటిరోజు ‘వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ...’ అనే శీర్షికతో ప్రచురించారు. ఆ తరువాత 2014 ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖలో రెండో లైనులోనే వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి వివరించారు. నాకన్నీ తెలుసు, తెలిశాకే వ్యవసాయరుణాల మాఫీకి వెళుతున్నానని చంద్రబాబు స్వయంగా ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు మోదీ బొ మ్మ, తన బొమ్మను పొందుపర్చి ప్రచురిం చిన కరపత్రాల్లో మొట్టమొదటి అంశమే రైతు రుణాల మాఫీ, ఇక రెండో అంశంగా డ్వాక్రా మహిళల రుణాల మాఫీ హామీ ఉంది.

 ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజున చంద్రబాబు గెజెట్ పత్రిక ఈనాడులో జారీ చేసిన ప్రకటనలో మొదటిపాయింటే రైతు రుణాల మాఫీ జరుగుతుందని ప్రచురించారు. రెండో పాయింట్ డ్వాక్రా మహిళల రుణాల రద్దు చేస్తామని వివరించారు. ప్రజలతో పని ఉన్నపుడు చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ, కరపత్రాల్లోనూ ఈ అంశాలే విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. గ్రామాల్లో అయితే పెద్ద పెద్ద లైట్లు అమర్చిన హోర్డింగ్‌లలో రుణమాఫీ ప్రచారం చేసుకున్నారు. ఇక టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు రుణమాఫీ ప్రచారమే కనిపించింది. చంద్రబాబు అపుడేం చెప్పారో మీరే చూడండి. (వీడియోలను ప్రదర్శించారు)

 రైతుల రుణాల పూర్తిగా మాఫీ చేసే బాధ్యత నాదే... మీరంతా (రైతులు) కష్టాల్లో ఉన్నపుడు చూశా... మిమ్మల్ని ఆ కష్టాలనుంచి గట్టెక్కిస్తా... అధికారంలోకి వచ్చాక నా మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తా... రైతులు తీసుకున్న అన్ని బ్యాంకుల రుణాలను మాఫీ చేస్తాం... అంటూ చంద్రబాబు వివిధ సభల్లో చేసిన ప్రసంగాలే సాక్ష్యాలు.

 బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న రైతులు ఇక్కడ ఎవరున్నారో చేతులెత్తండి... మీ అందరి రుణాలను మాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఓ సభలో చెప్పడం నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచీ 86 మంది రైతులు నిరాశానిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క అనంతపురంలోనే 40 మందికిపైగా మృతి చెందినట్లు పత్రికల్లో వారి పేర్లతో సహా ప్రచురించారు.

విభజన తరువాత రెవెన్యూ లోటు ఉండబోతోందనే విషయం చంద్రబాబుకు ఎన్నికలకు ముందు తెలియదా? లోటు ఉంటుందనే విషయం బాబుకూ తెలుసు, జగన్‌కు కూడా తెలుసు. అన్నీ తెలిశాకే ప్రజలను మోసం చేయడానికే ఈ హామీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తిపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Popular Posts

Topics :