07 December 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఓబులేసు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Written By news on Saturday, December 13, 2014 | 12/13/2014


ప్రొద్దుటూరు : తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకు గురయిన ఓబులేసు కుటుంబాన్నివైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సహించబోమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా కాపాడుకుంటామని తెలిపారు.

కడప జిల్లా చాపాడు మండలం చిన్నవరదాయపల్లె గ్రామ సర్పంచ్‌ భర్త ఓబులేసు గత జూలైలో హత్యకు గురయ్యారు. ఓబులేసు స్కూటర్‌పై వెళ్తుండగా దారి కాచిన ప్రత్యర్థులు కళ్లల్లో కారం కొట్టి ప్రొద్దుటూరు దగ్గర నరికి చంపిన విషయం తెలిసిందే.

పులివెందులలో వైఎస్ జగన్‌


పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి తిరుపతి నుంచి  పులివెందుల చేరుకున్నారు.  శనివారం  ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎంపీ వైఎస్. అవినాష్‌రెడ్డి తెలిపారు.  శనివారం  ఉదయం స్థానిక సుభాకర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్లో పెద్దజూటూరుకు చెందిన వైఎస్‌ఆర్ సీపీనాయకులు రామకృష్ణారెడ్డి తమ్ముని కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన తొండూరు మండలం బోడువారిపల్లె గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
 
 అక్కడి నుంచి సింహాద్రిపురం మండలం అహోబిలం గ్రామానికి చేరుకుని  సీతారాముల విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలు,  కార్యకర్తలు,  ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం 5గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి కుమారుడు ఏర్పాటు చేసిన శ్రేయన్ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాదు బయలుదేరి వెళతారని  ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. ఆదుకోండి


  • తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన షర్మిల
  •  రైతులు, కూలీల బాధలు వర్ణనాతీతం
  •  ఉపాధి హామీని కుదిస్తారేమోనన్న ఆందోళనలో కూలీలు
  •  వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు ఆపడం సరికాదని సూచన
  •  యాత్ర కుటుంబ వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని వ్యాఖ్య
పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో ప్రజానీకం చాలా కష్టాల్లో ఉంద ని, వారిని అన్ని విధాలా ఆదుకోవలసిన బాధ్య త ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. రైతులు, కూలీల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన ‘పరామర్శ యాత్ర’ ముగిసిన సందర్భంగా శుక్రవారం షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘ఐదు రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లా వాసులతో కలిసి వందల కిలోమీటర్లు తిరిగాను. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత నాపై ఉంది. వర్షాలు రాక, కరెంటు లేక, పండిన పంటలకు కూడా మద్దతు ధర లభించక రైతులు అప్పుల పాలై చాలా కష్టాల్లో కూరుకుపోయారు. ఎక్కడికెళ్లినా ‘మా బతుకు ఎలాగమ్మా..’ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం..’’ అని షర్మిల పేర్కొన్నారు. రైతు కూలీలు సైతం పని దొరకక పస్తులు ఉండాల్సి వస్తోందంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కుదిస్తారన్న ఆందోళన కూలీల్లో నెలకొందని.. అదే జరిగితే పాలమూరు వంటి జిల్లాల్లో మళ్లీ కుటుంబాలను వదిలి వలసపోవాల్సి వస్తుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

పేదలకు పెన్షన్లు ఇవ్వరా?

‘పరామర్శ యాత్ర’లో భాగంగా వెళ్లిన ప్రతిచోటా వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్లు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారని షర్మిల తెలిపారు. వెరిఫికేషన్ పేరుతో పింఛన్లను ఆపేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. వెరిఫికేషన్ చేస్తూనే పింఛన్లు ఇవ్వవచ్చని.. ఈ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదని విమర్శించారు. పింఛన్లు ఆపడం చాలా దారుణమని, అన్యాయమని పేర్కొన్నారు. పేదల ఉసురు పోసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.
పరామర్శ యాత్ర సంతృప్తిగా ఉంది

వైఎస్‌ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించడం తనకు సంతృప్తినిచ్చిందని షర్మిల పేర్కొన్నారు. ఐదేళ్ల తరువాత కూడా జగనన్న ఇచ్చిన మాట మేరకు, ఆయన ఆదేశాలతో తాను మహబూబ్‌నగర్ జిల్లాలో 22 కుటుంబాలను పరామర్శించినట్లు ఆమె తెలిపారు.
 
‘‘పరామర్శకు వెళ్లినప్పుడు... ‘ఇది మా కుటుంబానికి, మీ కుటుంబానికి సంబంధించిన విషయం. మిగతా వారు ఎందుకు పరామర్శ మీద మాట్లాడుతున్నారు..’ అని ఒక పెద్దాయన అన్నారు. నిజమే కదా! రాజశేఖర్‌రెడ్డి చనిపోయారనే బాధతో ఆయనను అభిమానించే గుండెలు ఆగాయని తెలిసి మేం వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చితే... ఇతర పార్టీలకు, నాయకులకు ఏమవసరం. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం.

ఇందులో జోక్యం చేసుకునే అర్హత ఎవరికీ లేదు. మాట మీద నిలబడడం మా కుటుంబానికి తెలిసిన విషయం. అందుకే ఈ యాత్ర. ఖమ్మంలో జగనన్న ఓదార్పు యాత్ర పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో కూడా పూర్తయింది. మిగతా 8 జిల్లాల్లో కూడా నేను పరామర్శ యాత్ర చేస్తా..’’ అని షర్మిల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ తదితరులున్నారు.

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి: వైఎస్ జగన్‌

* పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జనం వెన్నంటి ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి

 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనం వెన్నంటి ఉండి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పద్మావతి అతిథిగృహంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన శుక్రవారం ముచ్చటించారు. చిత్తూరుజిల్లాలో మెజార్టీ స్థానాలు ఎనిమిది శాసనసభ.. రెండు లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని శ్రేణులకు  గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంకోసం ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు  జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి శుక్రవారం సాయంత్రం తిరుపతిలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కే.శ్రీనివాసులు, అంజయ్య విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా తిరుపతికి వచ్చిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు.   పద్మావతి అతిథిగృహంలో పార్టీ శ్రేణులతో సమావేశం తర్వాత ఆయన పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో పులివెందులకు వెళ్లారు.

Popular Posts

Topics :