14 December 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Happy Birthday YS Jagan garu

Written By news on Saturday, December 20, 2014 | 12/20/2014





కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్ సీపీ


కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్: హుద్ హుద్ తుపాను కారణంగా కొండంత నష్టం జరిగితే చీమంత సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్రకు చెందిన  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు గిద్ది ఈశ్వరి, కళావతి, శ్రీవాణి, సర్వేశ్వరరావు, రాజన్న దొరలు ఈ రోజు శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హుద్ హుద్ తుపానులో నష్టపోయిన గిరిజన ప్రాంతాల రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.

తుపాను వల్ల చనిపోయిన గిరిజన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ఇవ్వలేదని చెప్పారు. తుపాను వల్ల 21వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ సహాయక చర్యలకు మాత్రం 244 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు.

101 జీవో అన్యాయమైనది:వైఎస్ జగన్


101 జీవో అన్యాయమైనది:వైఎస్ జగన్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 101 జీవోను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుబట్టారు. అసలు ఆ జీవో అన్యాయమైనదిగా జగన్ స్పష్టం చేశారు. గత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఆ జీవోను తెస్తే.. నేటి చంద్రబాబు సర్కారు దాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన జగన్.. ఎస్సీ, ఎస్టీల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఓసీలతో కమిటీలను ఏర్పాటు చేయడం ఎంతవరకూ సమంజసమని  ప్రశ్నించారు. గత విధానం ప్రకారం ప్రభుత్వ అధికారులు, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లు, బ్యాంకర్లు కలిసి లబ్ధిదారులను ఎంపిక చేసేవారని.. అదే పద్ధతిలో లబ్ధి దారుల ఎంపిక చేపట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
 
లబ్ధిదారుల కమిటీ సభ్యుల దళారులుగా మారి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. పెన్షన్లు, ఎస్సీ, ఎస్టీల రుణాల లబ్ధిదారుల ఎంపికలో సామాజిక కార్యకర్తల పేరుతో కొంతమందిని ప్రవేశపెట్టి వ్యవస్థలను పాడు చేయొద్దని జగన్ సూచించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని కోరిన జగన్.. లబ్ధిదారుల ఎంపికలో అన్యాయాన్ని ఆధారపూర్వకంగా సభకు సమర్పించారు.

బాబు వస్తారు...జాబు వస్తుందని చెప్పి.


బాబు వస్తారు...జాబు వస్తుందని చెప్పి...
హైదరాబాద్ : బాబు వస్తారు...జాబు వస్తుందని చెప్పి...     అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఏపీ శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం సభలో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ  వైఎస్ఆర్ సీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐకేపీ, అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తుందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. కాగా చర్చకు విపక్షాల పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు.

చర్చకు వైఎస్ఆర్ సీపీ సభ్యుల పట్టు, అసెంబ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే పదినిముషాలు పాటు వాయిదా పడ్డాయి. శనివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్.. ఐకేపీ, అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.

మరో మార్గంలో ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇస్తామని స్పీకర్ సూచించారు.  ఐకేపీ ఉద్యోగుల సమస్యల అంశం తీవ్రమైనదే అయినప్పటికీ...అత్యవసరంగా చర్చించాల్సింది కాదని అన్నారు. అయితే వాయిదా తీర్మానం తిరస్కరించినా కనీసం మంత్రితో సమాధానమైనా చెప్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని వాయిదా తీర్మానంపై సమాధానం చెప్పేది లేదని స్పష్టం చేశారు. దాంతో వైఎస్ ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ అసెంబ్లీని పది నిమిషాలు వాయిదా వేశారు.

పలు సేవా కార్యక్రమాల రూపంలోజగన్‌ పుట్టిన రోజు వేడుకలు


రేపు జగనన్న బర్త్‌డే
సేవా కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ పిలుపు
సాక్షి,చెన్నై : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను చెన్నైలో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు విస్తృత ఏర్పాట్లు  చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ తమిళనాడు విభాగం నేతలు జకీర్‌హుస్సేన్, శరవణన్ తెలిపారు.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే  తమిళులకు ఎంతో అభిమానం. ఆ కుటుంబానికి ఎప్పటినుంచో భాసటగా ఉంటూ వస్తున్నారు. తమ అభిమానాన్ని చాటుకునే విధంగా వైఎస్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. అలాగే వైఎస్సార్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన 42వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈమేరకు సేవా కార్యక్రమం రూపంలో ఆయన బర్తడేను నిర్వహించేందుకు తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జకీర్ హుస్సేన్, శరవణన్‌లు నిర్ణయించారు. శుక్రవారం సాక్షితో వారు మాట్లాడారు.

ఈ ఏడాది పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. వ్యాసార్పాడిలోని డాన్‌బాస్కో స్కూల్ ఆశ్రమంలోని పిల్లలు, వృద్ధులతో కలసి బర్తడే వేడుకకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయాన్నే అక్కడి వారికి అల్పాహార విందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పదిన్నర గంటలకు భారీ కేక్‌ను రెండు వందల మంది పిల్లల సమక్షంలో కట్ చేయబోతున్నట్టు తెలిపారు. పిల్లలకు కేకులు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెడతామన్నారు. ఈ వేడుకకు నగరంలోని వైఎస్సార్, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. వివరాలకు 9841042141 నెంబర్‌ను సంప్రదించ వచ్చని సూచించారు.

ఉద్యోగుల సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విపక్షాలు శనివారం వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. అంగన్ వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

అంటే ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయారా?


* హుద్‌హుద్ తుపాను ప్రాంతాలకు సహాయంలో ఏపీ సర్కారు ఘోర వైఫల్యం
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
తుపాను నష్టం రూ. 80 వేల కోట్లో, ఇంకెంతో అర్థం కావడంలేదని సీఎం చెప్పినట్టు ఓ పత్రికలో వచ్చింది..  844 కోట్లు ఖర్చు చేసినట్టు సర్కారు చెబుతోంది
అంటే ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయారా? అంచనాకి, వాస్తవానికి ఇంత తేడానా?
రూ. 3 వేల కోట్ల పంట నష్టం జరిగితే దమ్మిడీ అయినా ఇచ్చారా?
మత్స్యకార గ్రామాల్లో 50 కిలోలు, కొన్ని చోట్ల 25 కిలోలు, మరికొన్ని ప్రాంతాల్లో 10 కిలోల బియ్యం ఇచ్చారు
ఇవి కిలో రూపాయి బియ్యం.. అంటే మత్స్యకారులకు రూ.50,
ఇతరులకు రూ.25, 10 చొప్పున సాయం చేశారే తప్ప ఇంతకుమించి ఏమిచ్చారు?
వర్షాలతో పనులు లేక, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో
ఇంటికి కనీసం రూ. 5 వేలు ఇమ్మంటే రూపాయైనా ఇచ్చారా?
విపక్ష నేత ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఎదురుదాడికి దిగిన అధికారపక్షం
తుపానుపై చర్చ సమయంలో ముఖ్యమంత్రి సభలో లేకపోవడాన్ని తప్పుపట్టిన జగన్
సీఎం లేకుండా తుపాను నష్టంపై ఏకగ్రీవంగా తీర్మానమెలా చేస్తామని ప్రశ్న
సీఎం వచ్చాక శనివారం చర్చ జరుపుదామని, ఈరోజు రైతుల సమస్యలు,
ఆత్మహత్యలపై చర్చిద్దామని సూచన.. అయినా చర్చ కొనసాగింపు

విశాఖలో బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసర వస్తువులు ఎలా సరఫరా చేశారో మీకు తెలుసా? ఈవేళ నేను గానీ మా పార్టీ వాళ్లు గానీ ఆహార పొట్లాలు తెప్పించి మీకు అలా విసిరేస్తే తీసుకుంటారా? తీసుకోరు గదా. కానీ మీరక్కడ చేసిందందే. బాధితులకు అలా ఎందుకిచ్చారు? ప్రతి గడప గడపకూ ఎందుకు చేర్చలేకపోయారు?

సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ తుపానుకు కకావికలమైన ఉత్తరాంధ్ర జిల్లాలకు సహాయ సహకారాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేకపోయారని విమర్శించారు. బాధితులను ఆదుకోవడానికి దమ్మిడీ విదల్చలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుపాను కారణంగా దాదాపు రూ.80 వేల కోట్లు నష్టం జరిగిందని ముఖ్యమంత్రే చెప్పినట్లు ఓ పత్రికలో వచ్చిందని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ. 844 కోట్లని ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. అంటే ఒక శాతం కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు.

హుద్‌హుద్ తుపానుపై శుక్రవారం శాసన సభలో జరిగిన చర్చలో జగన్ మాట్లాడారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అత్యంతు ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో సీఎం సభలో లేకపోవడాన్ని తప్పుపట్టారు. అధికారపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా పలు ప్రశ్నలు సూటిగా సంధించారు. తన ప్రశ్నలకు అవునో కాదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పక్షానికి జగన్‌మోహన్‌రెడ్డి వేసిన ప్రశ్నలు..

* హుద్‌హుద్ తుపాను వల్ల జరిగిన అపార నష్టంపై శాసన సభలో అర్థవంతమైన చర్చ చేసి కేంద్రం నుంచి మరింత సాయం కోరేలా ఏకగ్రీవంగా తీర్మానం చేయాలనుకున్నప్పుడు ఈ చర్చను వదిలేసి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లారు? ఈరోజు విశాఖలో భారత ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమం, 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందీ ఈ ప్రభుత్వమే కదా? అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి ఈవేళ సభలో లేకుండా ఎందుకు వెళ్లారు?

* చంద్రబాబు గురించి, ప్రభుత్వం గురించి మంత్రి గంటా శ్రీనివాస్ గొప్పగా చెప్పుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేను 10 రోజులు పర్యటించా. ఇంత నష్టం జరిగినా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించలేదు. అవునో, కాదో చెప్పాలి.

* తుపాను నష్టం 70 వేల కోట్లో, 80 వేల కోట్లో, ఇంకెంతో అర్థం కావడంలేదంటూ ముఖ్యమంత్రే చెప్పినట్టు ఓ పత్రికలో వచ్చింది. అంత నష్టం జరిగితే ఇంతవరకు 844.60 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. అంటే 1% కూడా ఖర్చు పెట్టలేకపోయారా? అంచనాకి, వాస్తవానికి ఇంత తేడానా?

* తుపానుకు 400 సోనా బోట్లు, 10 వేల ఫైబర్ బోట్లు గల్లంతయితే మత్స్యకారులకు కనీసం ఒక్క రూపాయి అయినా సాయం చేశారా?

* 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఎకరాకి 20 వేల రూపాయల చొప్పున నష్టం జరిగిందనుకున్నా మొత్తం పంట నష్టం 3 వేల కోట్ల రూపాయలవుతుంది. కానీ ఇప్పటివరకు ఒక్క దమ్మిడీ అయినా విదిల్చారా?

* మీరిచ్చిన హామీని నమ్మి రుణాలు కట్టని కారణంగా పంటల బీమా కూడా రైతులు కోల్పోయారు. దానికి పూచీ ఎవరు?

* మీరు మత్స్యకార గ్రామాల్లో 50 కిలోలు, కొన్ని చోట్ల 25 కిలోలు, మరికొన్ని ప్రాంతాల్లో 10 కిలోల బియ్యం ఇచ్చారు. ఇవి కిలో రూపాయి బియ్యం. అంటే మీరు మత్స్యకారులకు రూ.50, ఇతరులకు 25, 10 రూపాయల చొప్పున సాయం అందించారే తప్ప ఇంతకుమించి ఒక్క రూపాయైనా అదనంగా ఇచ్చారా?

* వర్షాలతో పనులు లేక, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతి ఇంటికి కనీసం 5 వేల రూపాయలు ఇమ్మంటే రూపాయైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించా రు. వీటికి ఏ మంత్రీ సూటిగా సమాధానం చెప్పలేదు. పైగా ఎదురుదాడికి దిగారు.

సీఎం సభలో లేకపోవడం అన్యాయం
మొదట హుద్‌హుద్ తుపాను సహాయంపై సభలో చర్చ ప్రారంభించే ముందు దానిపై జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇంతటి కీలకమైన అంశంపై చర్చ చేపట్టే సమయంలో సభలో ముఖ్యమంత్రి లేకపోవడం అన్యాయమని అన్నారు. ఇంత ముఖ్యమైన అంశం మీద చర్చ జరిగే సమయంలో సభా నేత ఊర్లోనే లేకుండా పోయారని విమర్శించారు. ‘‘శాసన సభ జరిగేదే నాలుగు రోజులు. ఆ మేరకు తేదీలు ఖరారు చేసిందీ వాళ్లే. ఆ నాలుగు రోజులు కూడా ముఖ్యమంత్రి సభలో లేకపోతే ఎలా? హుద్‌హుద్ నష్టంపై సీఎం సమక్షంలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం. సీఎం సభలో లేని సమయంలో ఏకగ్రీవ తీర్మానం చేయలేం. కాబట్టి ఈ చర్చను శనివారానికి వాయిదా వేద్దాం’’ అని సూచించారు.

344 నిబంధన కింద రైతుల సమస్యలు, ఆత్మహత్యల మీద చర్చ చేపడదామని చెప్పారు. ప్రతిపక్ష నేత సూచనను స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అంగీకరించలేదు. సీఎం లేకపోయినా చర్చ చేద్దామని చెప్పారు. ఈ సందర్భంలో మంత్రి గంటా శ్రీనివాసరావు జోక్యం చేసుకొని.. ‘‘ఏకగ్రీవ తీర్మానం చేద్దామని ప్రతిపక్ష నేత సూచించడం బాగుంది. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరవుతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి వెళ్లారు’’ అని చెప్పారు.

తుపాను వచ్చినా పర్యటించని గంటా
తుపాను సమయంలో విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా తిరగకుండా ఇంటికే పరిమితమయ్యారని జగన్ విమర్శించారు. అదేమని అడిగితే మంత్రి జ్వరంతో ఇంట్లోనే ఉన్నట్టు తెలిసిందని, ఇది అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి సమాధానం ఇవ్వడానికి బదులు మంత్రి గంటా ఎదురు దాడికి దిగారు. జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో ధర్నా చేపట్టినప్పుడు తాము కూడా 25 ప్రశ్నలు అడిగామని, ఇప్పటికీ సమాధానం రాలేదని అన్నారు. ప్రతిపక్షం నుంచి సరైన సూచనలు వస్తే స్వీకరిస్తామని, లోటుపాట్లు సహజమని అన్నారు. తన నియోజకవర్గంలో పర్యటించారా లేదా అనే ప్రశ్నకు బదులివ్వకుండా.. ‘‘నేను రాజీనామా చేస్తా. మీరూ చేయండి. భీమిలీలో పోటీ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని కూర్చుండిపోయారు.

రైతు సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం

Written By news on Friday, December 19, 2014 | 12/19/2014

 రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమా, కరువు, అన్నదాతల ఆత్మహత్యలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు డిసెంబర్ 23వ తేదీ వరకు జరుగుతాయి.

పార్టీ మారే ప్రసక్తేలేదు


పార్టీ మారే ప్రసక్తేలేదు
మణుగూరు : తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని వైస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పాయం వెంకటేశ్వర్లును టీఆర్‌ఎస్‌లోకి రావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఆయన ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను అనూహ్య రీతిలో విజయ దుందిబి మోగించానని, అప్పటి నుంచి నేటి వరకు తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కొన్ని పత్రికలు సైతం కావాలని దుష్ర్ఫచారం చేయడం ప్రారంభించాయన్నారు. లేని పోని అభూత కల్పనలతో తనను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని అన్నారు.

నియోజకవర్గ ప్రజలు తనను ఏ ఉద్దేశంతో గెలిపించారో వారి ఆశయ సాధనకు పని చేస్తానే తప్ప పూటకో పార్టీ మారుతూ వారి విశ్వాసాన్ని కోల్పోనని అన్నారు. నియోజకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని చూసి ఓర్వలేని కొందరు ఇటువంటి తప్పుడు ప్రచారాలకు పూనుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్న తనను రాజకీయంగా ఎదుర్కొనలేని వారు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రజలు తను ఆదరించిన తీరును చూసి వారికి రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తన అభిమానులంటూ ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏమోస్తుందని అన్నారు. నిజమైన అభిమానులైతే నేరుగా తనతో మాట్లాడాలే కానీ ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టి తన మనస్సును ఏ విధంగా మారుస్తారని అన్నారు.

కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైఎస్ ఆశయ సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. ఇదే మాట తాను గతంలోను పత్రికా ముఖంగా చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానని అన్నారు. ఇప్పటికైనా తనపై ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని అన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు

Written By news on Thursday, December 18, 2014 | 12/18/2014


హైదరాబాద్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్ ఎల్ వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఇస్రో చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు జగన్ అభినందలు తెలిపారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ రోజు ఉదయం 9.30 గంటలకు జీఎస్ ఎల్ వీ మార్క్-3 రాకెట్ ను నింగిలోకి విజయవంతగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ (వ్యోమగాముల గది)ను ఇస్త్రో శాస్త్రవేత్తలు అమర్చి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

 630. 58 టన్నులు బరువు ఉన్న ఈ రాకెట్  ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యింది. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.విష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది.

బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే.


బాబు..వెంకటరమణను సింగపూర్ తీసుకెళ్లి ఉంటే..
హైదరాబాద్ :  తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. గురువారం సభ ప్రారంభమైన వెంటనే వెంకటరమణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడుతూ  సింగపూర్‌ పర్యటనకు కార్పొరేట్‌ సంస్థలను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు...వైద్య చికిత్స కోసం వెంకటరమణను సింగపూర్‌ తీసుకెళ్లి ఉంటే... ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని  అన్నారు. విధి అనేది ఎవరూ ఆపలేకపోయారని.. ఆయన మరణం నిజంగా బాధాకరమన్నారు.

రైతుల్ని ఆదుకోండి!


రైతుల్ని ఆదుకోండి!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతన్నలకు ఆసరాగా నిలవాల్సిన ఇన్స్యూరెన్సు కంపెనీలు సైతం వేదనకు గురి చేస్తున్నాయి. 2012 రబీ పంటలకు ప్రీమియం చెల్లించినా రెండేళ్లుగా బీమా మంజూరు చేయలేదు. శనిగ పంటకు ప్రీమియం చెల్లించుకోవచ్చుని విషయం తెలిసినా ఒకరోజులోనే గడువు ముగిసింది. తక్షణమే రైతులకు ఇన్స్యూరెన్సు కంపెనీ ఆసరాగా నిలవాలని ఏఐసీ సిఎండి జోసెఫ్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వివరించారు. న్యూడిల్లీలో బుధవారం ఆయన సిఎండి జోసెఫ్‌ను కలిసి జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని వివరించినట్లు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
 
  ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకృతి కారణంగా నష్టపోతున్న రైతులకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో ఇన్స్యూరెన్సు విధానం ప్రవేశ పెట్టింది. పంటలకు ప్రీమియం ముందే చెల్లించినా ఇన్స్యూరెన్సు చెల్లించడంలో కంపెనీలు  వైఫల్యం చెందుతున్నాయి. 2012 రబీ పంటలకు ప్రీమియం చెల్లించినా ఇప్పటికి ఏఐసీ కంపెనీ ఇన్స్యూరెన్సు చెల్లించలేదు.
 శనగకు బీమా గడువు పెంచండి....
 శనగ పంటకు ఇన్స్యూరెన్సు ప్రీమియం చెల్లించుకోవచ్చునని డిసెంబర్ 13న పత్రికల ద్వారా రైతులకు తెలిసింది. తుది గడువు 15గా ప్రకటించారు. అయితే 14వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకుల్లో రైతులు డీడీలు తీసుకునే అవకాశం లేకపోయింది. 15వ తేదీ అందుబాటులో ఉన్న కొద్దిమంది రైతులు మాత్రమే బీమా కోసం డీడీలు కట్టారు. దీంతో ఎక్కువ మంది రైతులంతా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.
 
  ప్రకృతి కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈనెల 25వ తేదీ వరకూ ఇన్స్యూరెన్సు ప్రీమియం చెల్లించేందుకు గడువు పెంచాలి. ఆమేరకు సిఎండిగా మీరు చర్యలు తీసుకుని రైతులకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్పీ వెల్లడించారు. అలాగే 2010 సంవత్సరం నుంచి 126 మంది రైతులకు చెందిన క్లైమ్‌లు సెటిల్ కాలేదు. పులివెందుల మున్సిపాలిటి పరిధిలోని బ్రహ్మణపల్లెకు చెందిన 126 మంది రైతులు వేరుశనగ పంట కోసం ప్రీమియం చెల్లించారు. అయితే బ్యాంకర్లు పొద్దుతిరుగుడు పంట కోసం చెల్లించినట్లుగా తప్పుగా నమోదు చేసుకున్నారు.
 
  రైతులు బ్యాంకులకు చెల్లించింది వేరుశనగ పంట కోసం. ఆమేరకు పులివెందుల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తమ తప్పిదాన్ని ధ్రువపరుస్తూ, 2013 జూలైలో ఏఐసీకి లేఖ రాసింది. రైతులు వేరుశనగ పంట కోసం ప్రీమియం చెల్లించి కూడా బీమా అందుకోలేకపోయారు. వారికి న్యాయం చేయూలని కోరినట్లు చెప్పారు. శనగ పంటకు కనీసం ఈనెల 25వతేదీ వరకూ బీమా గడువు పెంచాలి. 2012 రబీ పంటలకు చెల్లించిన ప్రీమియంకు ఇన్స్యూరెన్సు సత్వరమే అందించాలని సిఎండికి రాతపూర్వకంగా వివరించారు. ఆమేరకు పరిశీలించి సత్వర చర్యలు తీసుకుంటానని  సిఎండి జోసెఫ్ హామీ ఇచ్చారని ఎమ్పీ చెప్పారు.

తెలిసిన వాళ్లకయితే ‘ఇది మరో చార్జిషీటు’ అంతే!.

* ఈడీ అటాచ్‌మెంట్ల క్రమంలో... ఇది పెన్నా చార్జిషీటు!
వరుసగా అటాచ్‌మెంట్లు చేస్తూ వస్తున్న ఈడీ
తాజాగా పెన్నా చార్జిషీటు విషయంలోనూ అదే చర్య
పనిగట్టుకుని ఆందోళన కలిగించేలా ‘ఈనాడు‘ వార్తలు

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: తెలిసిన వాళ్లకయితే ‘ఇది మరో చార్జిషీటు’ అంతే!. అదే తెలియని వాళ్లకయితే... ‘సాక్షి పత్రిక, టీవీ ఆస్తుల జప్తు’ అనేది ఆందోళన కలిగించే అంశం. కాబట్టే ‘ఈనాడు’ పత్రిక మరికాస్త మసాలా దట్టించి మొదటి పేజీలో వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఫొటోతో సహా అంతపెద్ద వార్తను అచ్చేసింది. తన లక్ష్యం సాక్షి, వైఎస్ అభిమానుల్లో ఆందోళనను పెంచటమేనని మరోసారి చాటుకుంది. నిజానికి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో మొదటినుంచీ జరుగుతున్న పరిణామాల్ని చూసినవారెవరూ దేనికీ ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఈ కేసులో జరిగినవన్నీ ఆశ్చర్యం కలిగించేవి, ఇంతకు ముందెన్నడూ ఏ కేసులోనూ జరగనివే కాబట్టి.

తాజా వ్యవహారం విషయానికొస్తే ఇదే కేసులో సాక్షి పత్రిక, చానల్‌కు సంబంధించిన రూ.47 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. నిజానికి ఈ కేసులో ఆస్తుల్ని ఈడీ అటాచ్‌మెంట్ చేయటమనేది ఇది తొలిసారేమీ కాదు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఈడీ స్వయంగా దర్యాప్తు చేయకుండా సీబీఐ వేసిన ప్రతి చార్జిషీట్‌నూ యథాతథంగా స్వీకరిస్తూ సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న ఆస్తుల వివరాల ప్రకారం అటాచ్‌మెంట్ చేస్తున్నట్టు ప్రకటిస్తోంది.  

ఇప్పటికి సీబీఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి 11 చార్జిషీట్లు వేయటం తెలిసిందే. వాటిలో అరబిందో, హెటెరో డ్రగ్స్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, కొందరు వ్యక్తులు వ్యక్తిగత స్థాయిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, రాంకీ గ్రూపు పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును అనుసరిస్తూ... ఆయా చార్జిషీట్లలో పెట్టుబడులుగా పేర్కొన్న మొత్తాలకు సంబంధించి బ్యాంకు డిపాజిట్ల నుంచి భవనాల వరకు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన పలు ఆస్తుల్ని ఈడీ యథాతథంగా అటాచ్ చేస్తూ వస్తోంది. ఈ అటాచ్‌మెంట్లను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి కూడా.

ఇదే క్రమంలో పెన్నా గ్రూపు సంస్థలు సాక్షిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఛార్జిషీటు మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా సోమవారం రాత్రి ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీన్లో ఆయా ఆస్తుల్ని వరసగా పేర్కొంటూ.... సాక్షి భవనాల జాబితాను ఇచ్చేసరికి... ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిన తీరులో సాక్షి , వైఎస్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించేలా ‘ఈనాడు’ మొదటిపేజీలో పేద్ద వార్తను అచ్చేసింది.

‘ఈనాడు’ గమనించాల్సిన విషయమేంటంటే ‘సాక్షి’ ఆస్తుల్ని ఎలియనేట్ చేయరాదంటూ రెండేళ్ల కిందట రాష్ట్ర హైకోర్టే ఓ కేసులో ఉత్తర్వులిచ్చింది.  అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల్లో క్రయవిక్రయాలు  కుదరవు. వాటాలు విక్రయించటం వంటివి చేయకూడదు. అంతకు మినహాయించి రోజువారీ కార్యక్రమాలకు ఏమాత్రం అంతరాయం కలగరాదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రతి లావాదేవీనీ ఎంతో పారదర్శకంగా నిర్వహించే సాక్షి... అప్పటి  నుంచీ అటాచ్‌మెంట్ పరిధిలోనే తన కార్యకలాపాలను కొనసాగిస్తూ... దినదిన ప్రవర్ధమానమవుతుండటం ‘ఈనాడు’కు మింగుడుపడటం లేదు. అదే ఈ రాతలకు అసలు కారణం.

ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా తప్పించుకోవాలని..


శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం
ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా అధికారపక్షం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శ
బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా చర్చకు గట్టిగా పట్టుబట్టాలని శాసనసభ్యులకు పిలుపు
పింఛన్లలో కోత, మాఫీని నీరుగార్చడం, ఇంటికొక ఉద్యోగం హామీని పట్టించుకోని సర్కారుపై ఆగ్రహం
కొత్త రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాన్ని కూడా ఎండగడతాం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాజధాని కోసం ప్రవేశపెట్టే బిల్లులో ప్రజాకంటక అంశాలను ప్రతిఘటిస్తాం: జ్యోతుల నెహ్రూ
అఖిలప్రియను టీడీపీ తరఫున పోటీ చేయిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు: భూమా నాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల పాలనలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వరుస వైఫల్యాలపై శాసనసభలో గట్టిగా నిలదీయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. గురువారం నుంచి ప్రారంభమవుతున్న శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైఎస్సార్‌ఎల్పీ బుధవారం ఇక్కడ సమావేశమైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన శాసనసభ్యులు పాల్గొన్నారు. గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విషయంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలను ఏ రకంగా వంచించిందో వివరించారు. ప్రజల సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా అధికారపక్షం తప్పించుకోవాలని చూస్తోందని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చ కోసం గట్టిగా పట్టుబడదామని జగన్ చెప్పా రు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై చేసే పోరాటంలో ఎమ్మెల్యేల మధ్య సమన్వయం చాలా అవసరమని తెలిపారు. ఈ సమావేశాల్లో అందర ం కలసికట్టుగా ప్రభుత్వాన్ని ఎదుర్కొందామని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లలో కోత, రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీని నీరుగార్చడం, ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి పట్టించుకోకపోవడాన్ని జగన్ ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో పార్టీ ముఖ్య నే తలు ధర్మాన ప్రసాదరావు, డీఏ సోమయాజు లు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఒక్క మాటా నిలబెట్టుకోలేదు
సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు, కలమట వెంకటరమణ, ముస్తఫా, చాంద్‌బాషాలతో కలసి శాసన సభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గత ఆరు నెలల్లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, ఇసుక మాఫియా కార్యకలాపాలు, చేనేత కార్మికుల సమస్యలు, పింఛన్ల అర్హతను పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీల్లో కార్యకర్తల నియామకం వంటి అంశాలను సభలో లేవనెత్తాలని నిర్ణయించామన్నారు.

కొత్త రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాన్ని కూడా ఎండగడతామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగాలన్నింటినీ క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడా ఊసే ఎత్తడంలేదని అన్నారు. గత ఆరు నెలల్లో డీజిల్ ధరలు 8 రూపాయల వరకు తగ్గినప్పటికీ, పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు సభలో స్వీయ పొగడ్తలతో కాలం వెళ్లబుచ్చాలని చూస్తున్నారని, అలా కాకుండా ప్రజా సమస్యలపై చర్చకు ఎక్కువ అవకాశం కల్పించాలని కోరారు.

వివాహ శుభ కార్యాలు, వ్యక్తిగత పనులు, తక్కువ వ్యవధిలో సమాచారం పంపడం వంటి కారణాల వల్ల ఎమ్మెల్యేలు పూర్తి సంఖ్యలో శాసన సభాపక్ష సమావేశానికి హాజరు కాలేకపోయారని శ్రీకాంత్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గురువారంనాటి సమావేశాలకు అందరూ హాజరవుతారని చెప్పారు. సమావేశానికి ముందు శాసన సభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కొత్త రాజధాని కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ప్రజాకంటకమైన అంశాలను గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

మేనిఫెస్టో అమలు చేయాలని కోరతాం
శాసన సభ సమావేశాల్లో తాము కొత్తగా ఏమీ కోరనవసరంలేదని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందో వాటిని అమలు చేసి తీరాలని కోరతామని అన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నీ అపహాస్యం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

కేసులకు భయపడను: భూమా
తనపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులకు భయపడబోనని పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి చెప్పారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో జరిగిన సంఘటనలపై సభలో ప్రస్తావిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలహీనపరిచి, నేతలను మానసికంగా దెబ్బ తీయాలన్న దురుద్దేశంతోనే ఇలా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఒక ఎమ్మెల్యేపై రౌడీషీటు పెట్టే స్థాయికి పోలీసులు వెళ్లారని దుయ్యబట్టారు.

ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో తన కుమార్తె అఖిలప్రియను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారని, అయితే తాను వారి ఒత్తిడికి లొంగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మనుషులే శాశ్వతం కానప్పుడు, పదవులు శాశ్వతమా అని ప్రశ్నించారు. రేపు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే చంద్రబాబు కూడా మాజీ అవుతారని వ్యాఖ్యానించారు. పీఏసీ చైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు.

ప్రతిపక్షనేతగా సంతాపం తెలిపే హక్కులేదా?: వైఎస్ జగన్

అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కించపరిచేలా వ్యహరిస్తున్నారని శాసనసభా పక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ సంతాప తీర్మానం సందర్భంగా ప్రతిపక్ష నేతగా సంతాపం తెలిపే హక్కులేదా అని ఆయన ప్రశ్నించారు.  సభా సంప్రదాయాలను స్పీకర్ పాటించాలని వైఎస్ జగన్ అన్నారు.
 
ఎమ్మెల్యే వెంకటరమణ మృతి బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వెంకటరమణ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. తమ తరపు నుంచి వెంకటరమణ కుటుంబానికి సహాయ సహకారాలు ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు.

రైతాంగ సమస్యలపై వైఎస్ ఆర్ సీపీ వాయిదా తీర్మానం

రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కాగా ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశమైంది. ఈ భేటీకి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు.

అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు

Written By news on Wednesday, December 17, 2014 | 12/17/2014


'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు'
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీపై తనపై అక్రమ కేసులు బనాయించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు.  అయితే తానేమి కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భూమా నాగిరెడ్డి ప్రకటించారు.

వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవి కూడా ఇస్తామని ఆపార్టీ తనకు ఆశ చూపిందని ఆయన వెల్లడించారు.  తాను తిరస్కరించడంతో.. ఆ కక్షతో తనపై కేసులు మోపారని భూమా నాగిరెడ్డి  ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు...పదవులు శాశ్వతమా అని ఆయన అన్నారు. పదవి పోతే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతునారని భూమా వ్యాఖ్యానించారు

నేడు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ

 శాసనసభ, మండలి శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం సమావేశం కానున్నారు. లోటస్‌పాండ్‌లోని ఆ పార్టీ కేంద్రకార్యాలయం జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. రుణమాఫీతో పాటు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు.

మీపక్షాన మేం నిలుస్తాం


మోసం చేయడం చంద్రబాబు ప్రవృత్తి
రైతుల నుంచి మహిళల వరకు అందరినీ సీఎం మోసం చేశారు
విద్యుత్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం
జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సభలో వైఎస్ జగన్
 

అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు అన్ని  వర్గాలను మోసం చేస్తోంది. కడుపుమండిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు  ఇస్తున్నాం...’ అని వైఎస్సార్ సీపీ అధినే త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గాంధీ  నగర్‌లోని జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.
 
విజయవాడ : ‘విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నుంచి డ్వాక్రా మహిళలు, రైతుల వరకు అన్ని వర్గాల వారిని మోసం చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవృత్తి. ఇచ్చిన మాట నిలుపుకోకుండా ప్రజలను మోసం చేసే వ్యక్తి సీఎం సీటులో ఎలా కూర్చుంటారు. సిగ్గుండాలి..’ అంటూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. ఇందులోభాగంగా మంగళవారం గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యాన సభ నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సభలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పుస్తకంలో 30వ పేజీలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఉద్యోగుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ‘మనిషి అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. దాన్ని నిలుపుకొనేందుకు పనిచేయాలి. కానీ, చంద్రబాబు మాత్రం ఉద్యోగులు మొదలుకుని రైతుల వరకు అన్ని వర్గాలను మోసంచేస్తున్నారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆయన ప్రకటించారు. ‘మీకు మా పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది. మీ సమస్యలపై గట్టిగా పోరాడుతోంది. మీరు కూడా పోరాడండి. అయినప్పటికీ చంద్రబాబుకు సిగ్గురాకపోతే నాలుగేళ్ల తర్వాత కచ్చితంగా మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు వెంటనే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం..’ అని కాంట్రాక్టు కార్మికులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

మీపక్షాన మేం నిలుస్తాం : వైఎస్సార్ సీపీ నేతలు

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలుస్తామని శాసనసభలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. చంద్రబాబు నిత్యం సింగపూర్ జపం చేస్తూ రాజధానిలో బహుళ అంతస్తులు, మెగా టవర్లు.. అంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సీఎంకు రాజధాని వ్యాపారం మినహా మరే విషయాలు పట్టడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు మాయమాటలు నమ్మడం వల్లే అందరికీ ఇటువంటి కష్టాలు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపన్న ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన రాష్ట్రాన్ని దత్తత తీసుకుంటే కనీసం కొంతమేలైనా జరిగేదని చెప్పారు.

వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు అందరినీ వంచిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ 18 వేల మంది విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను తక్షణమే క్రమబద్ధీకరిస్తామని, లేకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కేఎన్‌వీ సీతారామ్, కన్వీనర్లు పి.మధు, కాశీ, కో-కన్వీనర్లు ఆర్.ప్రవీణ్, మధుకుమార్, నాగరాజు, వైస్‌చైర్మన్లు ఎన్.శ్రీనివాస్, శివారెడ్డి, మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
 
 కరకట్ట నివాసితులకు అండగా ఉంటాం

‘కరకట్టపై నివాసం ఉన్న ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలంటే ఏలా. నివాసితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఖాళీ చేయించాలి..’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం గుంటూరు నుంచి విజయవాడ వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని కనకదుర్గ వారధి దాటిన తర్వాత రాణిగారితోట వద్ద స్థానికులు, మహిళలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ ఉంటున్నామని, రెండు రోజుల్ల ఇళ్లు కూల్చివేస్తామని అధికారులు చెప్పారని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా పార్టీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్‌రెడ్డి మీకు అందుబాటులో ఉంటారు. వారు అధికారులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరిస్తారు..’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు.
 
మూడు నెలలుగా పింఛను ఇవ్వడం లేదయ్యా..

‘అయ్యా... మూడు నెలలుగా నాకు పింఛను రావడం లేదు. గతంలో చక్కగా ప్రతినెలా మొదటి వారంలో అందేది. ఇప్పుడు పింఛను తీసుకోవాలంటే నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది..’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద సీతన్నపేటకు చెందిన వృద్ధురాలు నడిపూడి కనకమ్మ కన్నీటిపర్యంతమైంది. జింఖానా గ్రౌండ్ వద్దకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె కలిశారు. తమ ప్రాంతంలో పింఛనుదా రులు పడుతున్న ఇబ్బందులను ఆమె వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛను ఇచ్చేవారని, ఇప్పుడు డబ్బులు పెంచినా సకాలంలో ఇవ్వకపోవడంతో తమకు సమస్యగా మారిందని ఆమె చెప్పారు. అందరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు.

అసెంబ్లీలో నిలదీస్తాం


* చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం
ప్రజలకు భరోసా ఇవ్వలేని వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీ ఎందుకు?
రైతన్నలు, డ్వాక్రా మహిళలు, అవ్వాతాతలు, కార్మికులను బాబు మోసం చేశారు
రైతులకు వైఎస్ ఉచిత విద్యుత్ ఇస్తే.. బాబు పదేళ్ల బకాయిలు కట్టాలంటూ  బిల్లులు ఇవ్వడం దారుణం
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబ
ద్ధీకరించేలా పోరాటం చేస్తాం


సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘నోటి వెంట ఒక మాటొస్తే ఆ మాట  నిలబెట్టుకుంటాడనే నమ్మకం, భరోసా ప్రజలకు ఇవ్వలేని వ్యక్తి సీఎం స్థానంలో ఎందుకు కూర్చోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమ లుచేయకుండా రైతన్నలను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, కాంట్రాక్టు ఉద్యోగ సోదరులను, అవ్వా తాతలు అందర్నీ మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే.  ఇటువంటి వ్యక్తి సీఎం అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది.
 
అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును గట్టిగా నిలదీస్తాం. అప్పటికీ ఆ మనిషికి సిగ్గురాకపోతే... మీకు నేను అండగా ఉంటాను. మీ తరపున పోరాడుతా. మరో నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ అందరి సమస్యలు పరిష్కరిస్తానని నేను భరోసా ఇస్తున్నా ను’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గుంటూరు మాజీ ఎంపీపీ, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పెద్ద కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన మంగళవారం గుంటూరు వచ్చారు.
 
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి గుంటూరు వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన జగన్‌ను దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జగన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ వారి సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్‌పై సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తమకు ఉచిత కరెంటును అందిస్తే ప్రస్తుతం చంద్రబాబు ఎనిమిదేళ్ల నుంచి కరెంటు బకాయిలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారని తాడేపల్లిలో రైతులు, మహిళలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వాపోయారు. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
 
భూ సమీకరణపై రైతుల ఆవేదన
 తమ భూములన్నింటినీ సర్కార్ లాక్కుంటే రో డ్డున పడతామని, సారవంతమైన భూములను రాజధాని భూ సమీకరణకు ఇచ్చేది లేదని రాజ ధాని భూ సమీకరణ వ్యతిరేక గ్రామాల రైతులు జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి నిడమర్రు,  కురగల్లు, పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో మంగళగిరి వద్ద జగన్‌కు విజ్ఞాపనలు అందించారు. రైతుల తరపున అసెంబ్లీలో పోరాడుతామని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
 
విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కరకట్టపై తమ ఇళ్లను అధికారులు తొలగించే ప్రయత్నంచేస్తున్నారని పలువురు మహిళలు వాపోయారు. ఇక్కడ ఇళ్లు తొలగిస్తే మీకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వాన్ని కోరతానని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే వైఎస్సార్‌సీపీ నాయకులు వంగవీటి రాధా, పి.గౌతమ్‌రెడ్డి మీ తరపున పోరాడుతారని జగన్ వారికి ధైర్యం చెప్పారు. జగన్‌వెంట ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జలీల్ ఖాన్, మహ్మద్ ముస్తాఫా, పార్టీరాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, తలశిల రఘురామ్, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్ధసారధి, మర్రి రాజశేఖర్, గుంటూ రు నగర అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి,  మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్‌రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షులు మేరుగ నాగర్జున, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు

Popular Posts

Topics :