హంద్రీ-నీవా కోసం 25 గంటల దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హంద్రీ-నీవా కోసం 25 గంటల దీక్ష

హంద్రీ-నీవా కోసం 25 గంటల దీక్ష

Written By news on Tuesday, January 20, 2015 | 1/20/2015


హంద్రీ-నీవా కోసం 25 గంటల దీక్ష
ఉరవకొండ : జిల్లాకు వరప్రసాదమైన అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి 25 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. ఉరవకొండలోని పాత బస్టాండ్ వేదికగా ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం మూడు వరకు దీక్ష చేపడతానని ఆయన ప్రకటించారు. సోవువారం ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ స్థాయి నాయుకుల సవూవేశం నిర్వహించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. హంద్రీ-నీవా పూర్తికి తక్షణమే రూ.250 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాలువకు వంద టీఎంసీల నీటిని కేటారుుంచాలన్నారు. ఎంతో ప్రాధాన్యత కల్గిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇది పూర్తయితే లక్షలాది వుంది రైతులు బాగుపడతారని, ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయని వివరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవాకు అత్యంత ప్రాధాన్యతిచ్చారని గుర్తు చేశారు.

దాదాపు రూ.4,600 కోట్లతో పనులు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జిల్లా ప్రజలు టీడీపీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చినా వారు హంద్రీ-నీవాను పూర్తి చేయించడానికి చిత్తశుద్ధితో కృషి చేయడంలేదని విమర్శించారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించే ఉద్దేశంతో తాను చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ వుహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలవ్ము, అధికార ప్రతినిధి వీరన్న, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చందా వెంకటస్వామి, జెడ్పీటీసీ సభ్యులు మేరీ నిర్మలవ్ము, లలితవ్ము, సింగాడి తిప్పయ్యు, నాయకులు అశోక్, రవుణయూదవ్, ఏసీ ఎర్రిస్వామి, రవుణారెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: