జనవరి 31, ఫిబ్రవరి 1 తణుకులో వై.ఎస్.జగన్ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనవరి 31, ఫిబ్రవరి 1 తణుకులో వై.ఎస్.జగన్ దీక్ష

జనవరి 31, ఫిబ్రవరి 1 తణుకులో వై.ఎస్.జగన్ దీక్ష

Written By news on Saturday, January 17, 2015 | 1/17/2015


చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం
టీడీపీ విధానాలకు నిరసనగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 8 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో ప్రభుత్వం దద్దమ్మలా వ్యవహరిస్తోందని, ఈ ప్రభుత్వ వ్యవహార శైలితో విసిగిపోయిన ప్రజలు ఎప్పడు పోతుందా అని ఎదురుచూస్తున్నారని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు
Share this article :

0 comments: