వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్ల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్ల దాడి

వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్ల దాడి

Written By news on Thursday, January 1, 2015 | 1/01/2015


వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్ల దాడి
పింఛన్లపై నిలదీసినందుకు దౌర్జన్యం కన్నీటి పర్యంతమైన కౌన్సిలర్లు
 హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ భేటీలో ఘటన

 
 హిందూపురం: పింఛన్ల సమస్యపై ప్రశ్నించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లపై అధికార టీడీపీ కౌన్సిలర్లు దాడి చేశారు.  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించారు.చైర్‌పర్సన్ వారి ఆందోళనను పట్టిం చుకోకుండా ఏకపక్షంగా ఎజెండాను ఆమోదించినట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇందుకు వేదికైంది. చైర్ పర్సన్ రావిళ్ల లక్ష్మి, కమిషనర్ వీరభద్రరావు సమక్షంలో బుధవారం కౌన్సిల్ సమావేశం జరిగింది.
 
 ప్రారంభంలో మున్సిపల్ మేనేజర్ బాల కృష్ణ ఎజెండాలోని అంశాలను చదువుతూ.. పింఛన్ల కోసం మంగళవారం వృద్ధులు, వికలాం గులు ధర్నా చేస్తుండగా వైఎస్సాఆర్‌సీపీ కౌన్సిలర్లు వారికి మద్దతు పలుకుతూ తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. దీంతో టీడీపీ కౌన్సిలర్ రోషన్ అలీ.. ధర్నాలు చేసి బెదిరిస్తారా?అని వాదనకు దిగారు. వృద్ధులు, వికలాంగులు ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాస్తుంటే పింఛను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని ప్రతిపక్ష కౌన్సిలర్లు శివా, ఆసీఫుల్లాలు ప్రశ్నించారు.
 
 బాధితుల పక్షాన నిలిచిన తమనే దోషులుగా చేస్తారా? అని నిలదీశారు. దీంతో రోషన్ అలీతో పాటు మరో టీడీపీ కౌన్సిలర్ రామ్మూర్తి వారిపైకి దూసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు రజనీ, జయమ్మలు వారిని అడ్డుకున్నారు. టీడీపీ కౌన్సిలర్లు నెట్టి వేయడంతో వారిద్దరి చేతులకు రక్త గాయూలయ్యూరుు. మహిళా కౌన్సిలర్లపై దాడి చేసి, దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించారు. ఈ లోగా అజెండాలోని అంశాలకు ఆమోదం తెలుపుతున్నామని,చెప్తూ చైర్ పర్సన్ నిష్ర్కమిం చారు. తమపై దాడి జరిగితే కనీసం సాటి మహిళగా ఆమె స్పందించక పోవడం బాధాకరమం టూ వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యూరు. టీడీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేయూలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి వన్‌టౌన్ సీఐ ఈదురు బాషాకు ఫిర్యాదు చేశారు.
 
 కమిషనర్‌కు ఫిర్యాదు
 హిందూపురంలోని నాలుగవ వార్డులో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయలేదని కౌన్సిలర్ రజని కౌన్సిల్ దృష్టికి తెస్తుండగా.. టీడీపీ కౌన్సిలర్లు రోషన్ అలీ, వెంకటస్వామి, రామ్మూర్తి, చైర్ పర్సన్ వ్యక్తిగత కార్యదర్శి శంకర్, ఉద్యోగి విజయభాస్కర్‌లు కులంతో పేరుతో దూషించి, అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడి చేశారని వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న ఉద్యోగులు విజయ భాస్కర్, శంకర్‌లను ఇకపై కౌన్సిల్ హాలులోకి రానివ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ మాట్లాడుతూ.. సభలో ఇలా జరగడం దురదృష్టకరమని, ఫిర్యాదును పోలీసులకు పంపిస్తానని చెప్పారు.
Share this article :

0 comments: