ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు

ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు

Written By news on Friday, January 2, 2015 | 1/02/2015


మంగళగిరి: అసెంబ్లీని మోసం చేసిన చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేయడం తగదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఆర్‌డీఏ బిల్లులో రూల్స్ లేవని అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తితే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బిల్లు పాస్ అయిన తరువాత రూల్స్ చర్చకు వస్తాయని చెప్పి అకస్మాత్తుగా రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు.

తుళ్లూరులో మాట్లాడిన చంద్రబాబు ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగదోడి చూసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ గానీ, తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి గానీ ఏనాడూ రాజధానిని వ్యతిరేకించలేదని, అసెంబ్లీ సాక్షిగా రాజధాని ఎక్కడైనా నిర్మించుకోండని, అయితే ఆ ప్రాంతంలోని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, పేదల భవిష్యత్తును అర్థం చేసుకుని విధి విధానాలు రూపొందించాలని మాత్రమే కోరామన్నారు.

ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చేసి ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెబుతున్న చంద్రబాబు నాయుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని ఇడుపులపాయలో కట్టాలని చూస్తున్నాడని అబద్ధాలు చెప్పడం ప్రపంచంలో ఏ  నాయకుడు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడన్నారు. ఎంత సేపటికీ భూములు లాక్కొని సింగపూర్‌కు అప్పగించి సింగపూర్‌లో తన ఆస్తులను పెంచుకోవాలనే ఆలోచనే తప్ప స్థానిక ప్రజల మనోభావాలను గుర్తించకపోవడం దారుణమన్నారు.

సీనియర్ నేతగా వుండి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అధికారం ఇచ్చారు కదా అని ప్రజలను తప్పుదోవ పట్టించి ఎల్లకాలం తానే ముఖ్యమంత్రిగా వుంటాననే భ్రమలో చంద్రబాబు ఎవ్వరినీ పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెత్తు పోకడలు పోతున్నారన్నారు. తన కేబినెట్‌లోని మంత్రుల అభిప్రాయాలు సైతం తీసుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై పార్టీలోనే గాక ప్రజల్లోనూ అసంతృప్తి నెలకొందని, త్వరలోనే ప్రజలు తిరగబడటం ఖాయమని గుర్తుంచుకోవాలన్నారు.

వైఎస్సార్‌సీపీని, అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ కాలయాపన చేయడం మాని ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవహరించి, తన సీనియారిటీని నిరూపించుకోవాలన్నారు. రాజధాని గ్రామాల్లో భూములను సింగపూర్ ప్రభుత్వానికి, తన వందిమాగధులకు అప్పగించి డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తే ఆయా ప్రాంతాల్లోని రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు భూములపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందన్నారు.
Share this article :

0 comments: