చిత్తూరు షుగర్స్‌ను కాపాడుకుందాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిత్తూరు షుగర్స్‌ను కాపాడుకుందాం

చిత్తూరు షుగర్స్‌ను కాపాడుకుందాం

Written By news on Tuesday, January 20, 2015 | 1/20/2015


చిత్తూరు షుగర్స్‌ను  కాపాడుకుందాం
కార్మికుల ధర్నాలో చెవిరెడ్డి పిలుపు
355 మంది కార్మికుల తొలగింపు అన్యాయం
ఫ్యాక్టరీ అమ్మకానికే బాబు సిద్ధపడ్డారని ధ్వజం

 
చిత్తూరు: గతంలో ముఖ్యమంత్రిగా సొంత జిల్లాలోని విజయ పాల డెరుురీని మూయించిన చంద్రబాబు, అప్పట్లోనే చిత్తూరు షుగర్స్‌ను అమ్మకానికి పెట్టారని, రైతులు కాపాడుకున్న ఆ ఫ్యాక్టరీని ఇప్పుడు మరోమారు ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమయ్యూరని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీని అమ్మే ఉద్దేశంతోనే ఈ ఏడాది క్రషింగ్ చేపట్టలేదన్నారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 355 మంది కార్మికులను రాత్రికి రాత్రే తొలగించడం దారుణమని విమర్శించారు. చక్కెర ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ కార్మికులు సోమవారం ఉదయం ఫ్యాక్టరీ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు పలికారు. ఫ్యాక్టరీలో క్రషింగ్ నిర్వహించాలంటూ వారం రోజులుగా రిలే నిరాహార దీక్షచేస్తున్న రైతు నాయకుడు వెంకటాచలం నాయుడుకు మద్దతుగా దీక్షలో కూర్చొని    సంఘీభావం ప్రకటించారు. చంద్రన్న సంక్రాంతి కానుకలో పంపిణీ చేసిన చక్కెర, బెల్లం  రైతులు పండిస్తే వచ్చింది తప్ప సింగపూర్ నుంచి రాలేదని ఆయ న ఎద్దేవా చేశారు. జిల్లాలో చిత్తూరు,గాజులమండ్యం ఫ్యాక్టరీలు * 30 కోట్లకు పైగా రైతులు,కార్మికులకు బకాయిలు న్నా బాబు పైసా చెల్లించకపోవడం దా రుణమన్నారు. ఒక వ్యక్తి ప్రైవేటు ఫ్యాక్టరీని నడిపినప్పుడు ప్రభుత్వం, అధికారులు ఎందుకు నడపలేకున్నారని చెవి రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటూ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను ఎందుకు అమ్మకానికి పెడుతున్నారని  ప్రశ్నించారు. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక నెల జీతం కోసం పాలకవర్గం ఫ్యాక్టరీ స్టోర్‌ను ఆప్కాబ్‌కు కుదవపెట్టడం సిగ్గు చేటన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు ఉన్న ఉద్యోగాలను ఊడబెరకడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు పారి శ్రామికవేత్తలకు తాకట్టు పెట్టారన్నారు. సర్పంచ్ పదవికి ఎన్నిక కాలేని మంత్రి నారాయణ,సీఎం రమేష్,సుజనాచౌదరి లాంటి వారి కన్నుసన్నల్లోనే పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు జీవీ.జయచంద్ర చౌదరి,  షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బసివిరెడ్డి, నాయకులు ఓబులనాయుడు, కృష్ణ, జిల్లా యూని యన్ నాయకులు ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులునాయుడు, కేశవరెడ్డి, గిరి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదికేశవులరెడ్డి, పూతలపట్టు నాయకుడు రాజరత్నంరెడ్డి, కొత్తూరుబాబు, వామపక్ష నాయకులు నాగరాజన్, చైతన్యతో పాటు ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీ కాలనీలో చోరీకి గురైన ఇళ్ల కార్మికులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. పోలీసు లు వీలైనంత తొందరలో దొంగలను పట్టుకుని సొత్తు పొగోట్టుకున్న వారికి న్యాయం చేయాలని కోరారు.
 
చక్కెర ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షుడుగా చెవిరెడ్డి

చిత్తూరు: చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ గౌరవాధ్యక్షుడుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం సమావేశమైన కార్మికులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని యూనియన్ గౌరవాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు షుగర్స్‌లో ఈ ఏడాది క్రషింగ్ నిలిపివేయడంతో పాటు కర్మాగారంలో పనిచేస్తున్న 355 మంది కార్మికులను తొలగిస్తూ పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కార్మికులు సోమవారం నుంచి కర్మాగారం ఎదుట ఆందోళనకు దిగారు. రాబోయే కాలంలో ఆందోళనలు ఉద్ధ­ృతం చేయాలని నిర్ణయించారు.
 
 ఫ్యాక్టరీ అమ్మేందుకు కుట్ర

 చక్కెర ఫ్యాక్టరీని అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. 2002లో ఒకసారి ఫ్యాక్టరీని అమ్మారు. కార్మికులు, రైతులు కలిసి పోరాటం చేసి కోర్టుకు వెళ్లి ఫ్యాక్టరీని నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ ఫ్యాక్టరీని అమ్మేందుకు కుట్ర పన్నింది. రైతులు, కార్మికుల కడుపులు కొట్టేందుకు చూస్తోంది.         -రాజమాణిక్యం, చక్కెర ఫ్యాక్టరీ కార్మికుడు

అన్యాయం చేస్తే పుట్టగతులుండవు
 
355 మంది కార్మికులను అన్యాయంగా  ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇంత మంది కుటుంబాల ఉసురు పోసుకున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. రైతులు, కార్మికుల కడుపులు కొట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి.
 -నాగయ్య, చక్కెర ఫ్యాక్టరీ కార్మికుడు
 
రోడ్డున పడేశారు

20 ఏళ్లుగా ఫ్యాక్టరీలో కార్మికుడిగా ప నిచేస్తున్నా. ఒక్కసారిగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉద్యోగాలు ఊడబెరికి రోడ్డున పడేశారు. ఇది దారుణం.. 13 నెలలుగా జీతాలు ఇవ్వకున్నా  పనిచేస్తున్నాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి ఉన్న ఉద్యోగాలను ఊడబెరకడం అన్యాయం. -బాబు, చక్కెర ఫ్యాక్టరీ కార్మికుడు
 
కార్మికుల తొలగింపు అన్యాయం

 
దశాబ్దాలుగా షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం. సకాలంలో జీతాలు ఇచ్చి నా.. ఇవ్వకపోయినా కష్టాలు పడ్డాం. 13 నెలలుగా జీతాలు, పీఎఫ్ పెండిం గ్‌లో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు పాలకవర్గం నిర్ధాక్షిణ్యంగా కార్మికులను తొలగించడం అన్యాయం. తక్షణం విధుల్లోకి తీసుకోవాలి
 -ప్రసన్నకుమార్, చక్కెర ఫ్యాక్టరీ కార్మికుడు
 
 ఆత్మహత్యలే శరణ్యం

 ఇన్నాళ్లు ఫ్యాక్టరీని నమ్ముకుని కష్టనష్టాలకోర్చి బతుకుతున్నాం. హఠాత్తుగా ఉద్యోగాలు తొలగించి వీధుల పాలు చేశారు. తక్షణం విధుల్లోకి తీసుకోకపోతే కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యం. -ప్రకాష్, చక్కెర ఫ్యాక్టరీ కార్మికుడు
Share this article :

0 comments: