టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు

టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు

Written By news on Monday, January 5, 2015 | 1/05/2015


వైఎస్సార్‌సీపీ  ఉత్తర కృష్ణా అధ్యక్షుడు కొడాలి నాని
కంచికచర్ల : కల్లబొల్లి మాటాలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,  మంత్రులకు  వైఎస్సార్‌సీపీ  అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహనరెడ్డిని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్‌సీపీ  ఉత్తర కృష్ణా   అధ్యక్షుడు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. కంచికచర్ల ఓసీ క్లబ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన మండల పార్టీ కార్యకర్తల సమావేశం నందిగామ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో నాని మాట్లాడుతూ, మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మ     కాయల చినరాజప్ప జగన్‌ను ఏకవచనంతోసంబోధిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో పొలాలను రైతులు ఇవ్వలేదని, పచ్చని పంట పొలాలను టీడీపీ శ్రేణులు తగులబెట్టి అది వైఎస్సార్‌సీపీ నాయకులకు ఆపాదిస్తూ చేతకాని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.  దమ్ముంటే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం విచారణ  నిర్వహించి దోషులను పట్టుకోవచ్చని మంత్రులకు సవాల్ విసిరారు.

రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీరామారావునే వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రైతులను మోసం చేయడం పెద్ద విశేషమేమీ కాదని అన్నారు.  విశ్వసనీయతకు మారుపేరు దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి అని తెలిపారు. మాజీ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని కొన్ని పత్రికలు పని కట్టుకుని ఒక నియంతగా చిత్రీకరించాయన్నారు.

రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం ప్రాజెక్టులు కడుతుంటే ఎద్దేవా చేసిన నాయకులు అదే కాలువల ద్వారా నేడు నీరు విడుదల చేస్తూ తమగొప్పగా చెప్పుకుంటున్నారు.  విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు.  

పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్‌మోహనరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం 20 గంటలు కష్టపడుతున్న వ్యక్తని టీడీపీకి చెందిన మంత్రులు అవహేళనగా మాట్లాడటం వారి   దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. డాక్టర్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు పేదలకు పంపిణీ చేసే సంక్షేమ పథకాలు పచ్చా చొక్కాల వారికే మంజూరయ్యేవిధంగా చూడడం సిగ్గుచేటని అన్నారు.

బండి జానకిరామయ్య, డాక్టర్ అరుణ్‌కుమార్, చింతా రవీంద్రనాథ్, కాలవ వాసుదేవరావు, మాగంటి వెంకటరామారావు, అబ్బూరి నాగమల్లేశ్వరరావు, మార్త శ్రీనివాసరావు, మంగునూరి కొండారెడ్డి కోవెలమూడి వెంకటనారాయణ, పరిటాల రాము, దేవిరెడ్డి శివరాధాకుమారి, పాటిపండ్ల హరిజగన్నాథరావు, బండి మల్లిఖార్జునరావు, కోట బుచ్చయ్య చౌదరి, గుదే రంగారావుతో పాటు  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this article :

0 comments: