ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి

ఎమ్మెల్యేపై కరణం బలరాం వర్గీయుల దాడి

Written By news on Monday, January 12, 2015 | 1/12/2015

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో అద్దంకి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు గొట్టిపాటి రవికుమార్ పై టీడీపీ నేత కరణం బలరాం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే రవికుమార్ కు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. కలెక్టరేట్ ఆవరణలోనే బలరాం వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు.

దాంతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించిన సమీక్ష సమావేశంలో ఇరు వర్గాలు పాల్గొన్నాయి. సమీక్ష ముగిసిన అనంతరం బయటకు వస్తున్న ఎమ్మెల్యే రవికుమార్ పై కరణం వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Share this article :

0 comments: