మొదటి సంతకం విలువను పాడుచేసిన బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మొదటి సంతకం విలువను పాడుచేసిన బాబు

మొదటి సంతకం విలువను పాడుచేసిన బాబు

Written By news on Monday, January 26, 2015 | 1/26/2015


మొదటి సంతకం విలువను  పాడుచేసిన బాబు
దువ్వ, తణుకు టౌన్: ఎన్నికల వాగ్దానాల అమలులో మొదటి సంతకానికి ఉన్న విలువను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుంగలో తొక్కి తన మోసకారి తనాన్ని బయటపెట్టారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సాయంత్రం తణుకు మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమావేశానికి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంక రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను నిలువునా ముంచారన్నారు.

 చంద్రబాబు రుణమాఫీ హామీ అమలుకాక హుద్‌హుద్ తుపాను సందర్భంగా ఉత్తరాంధ్రలోని రైతులు పంటల బీమా సౌకర్యాన్ని కోల్పోయారన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా వున్న చంద్రబాబుకు రాష్ట్రం విభజన కారణంగా వచ్చే సమస్యలు తెలియవా అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్, జపాన్‌లు తిరిగే చంద్రబాబు రాష్ట్రంలోని రైతుల సమస్యలను గాలికొదిలేశారన్నారు. సమావేశంలో పాల్గొన్న తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య మాట్లాడుతూ నమ్మిన ప్రజలను నట్టేట ముంచే నైజం చంద్రబాబుదన్నారు. ఆయనను నమ్మి ఓట్లేసి దగా పడిన రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో చేపట్టే రైతు దీక్షను ప్రభుత్వం మేలుకొనేలా జయప్రదం చేయాలని కోరారు.

 సమావేశానికి అధ్యక్షత వహించిన వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన మోసం కారణంగా రాష్ట్రంలో రైతులకు బ్యాంకుల నుంచి కొత్తగా పంట రుణాలు దొరకక అధిక వడ్డీలకు అప్పు తెచ్చి వ్యవసాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డ్వాక్రా మహిళల పొదుపు కార్యక్రమాలు కుంటుపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కరుటూరి సర్వేశ్వరరావు, చుక్కా జార్జిలివింగ్‌స్టన్, మహిళా నాయకురాలు కొండేనాగవేణి, సుగర్‌కేన్ అభివృద్ధి మండలి చైర్మన్ బోడపాటి వీర్రాజు, ఎంపీటీసీలు కడియం శ్రీనివాసు, సరేళ్ల వీరతాతయ్య, నాయకులు మట్టా నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, వర్దినీడి కృష్ణమూర్తి, మద్దూరి కృష్ణ, సెనగన ఏడుకొండలు, రుద్రా ధనరాజు, దివాకర్, కత్తుల జస్పాల్, కొత్తపల్లి బుల్లబ్బులు, సప్పా బలరామ్, కొయ్యల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని దువ్వ, ముద్దాపురం, కోనాల, తేతలి, మండపాక, మహాలక్ష్మీ చెర్వు తదితర గ్రామాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: