నేడు మూడు కుటుంబాలకు షర్మిల పరామర్శ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు మూడు కుటుంబాలకు షర్మిల పరామర్శ

నేడు మూడు కుటుంబాలకు షర్మిల పరామర్శ

Written By news on Thursday, January 22, 2015 | 1/22/2015

నేడు మూడు కుటుంబాలకు షర్మిల పరామర్శ
 హాలియా : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మృతిచెందినవారి మూడు కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల గురువారం పరామర్శించనున్నారు. వైఎస్ చనిపోయారన్న వార్త విని పెద్దవూర మండలం నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని వెంకటనర్సయ్య,  హాలియా మండలం గరికేనాటితండాలోని బాణావత్ బోడియా నాయక్,  త్రిపురారం మండల కేంద్రంలో మైల రాములు మరణించారు. వీరి కుటుంబాలతో మాట్లాడి బాగోగులు తెలుసుకోనున్నారు. రాజన్న బిడ్డను చూసేందుకు, ఆమె ఆత్మీయ పలకరింపుకోసం నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. షర్మిల పరమర్శ యాత్రను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీనాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
 అభిమానం... జిల్లాలు దాటి..
 దేవరకొండ : ఇతని పేరు ఎ. నాగరాజు. గుంటూరు జిల్లా నల్లగొర్లపాడుకు చెందిన ఇతను మరుగుజ్జు . కానీ వైఎస్ కుటుంబానికి మాత్రం వీరాభిమాని. దేవరకొండ నియోజకవర్గంలో షర్మిల పరామర్శయాత్ర ఉందని తెలుసుకున్న నాగరాజు ఎలాగైనా ఆమెను కలవాలని గుంటూరు జిల్లా నుంచి నల్లగొండ జిల్లాకు వచ్చాడు. ఆమెను కలవడానికి వీలు కాక తిప్పలు పడ్డాడు. జనాన్ని దూసుకుంటూ ముందుకెళ్లి ఎట్టకేలకు షర్మిలక్కను కలుసుకున్నాడు. తన పరిస్థితిని వివరించడంతో పాటు తాను మిమిక్రీ ఆర్టిస్టునని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా కలిశానని షర్మిలకు చెప్పాడు. షర్మిల యాత్రలో దేవరకొండ వరకు వచ్చిన నాగరాజు పలు చోట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి మాటలను ఇమిటేట్ చేస్తూ పలువురిని ఆకట్టుకున్నాడు.

రాజన్నరాజ్యం కోసం కృషి చేయాలి
 దేవరకొండ: రాజన్నరాజ్యం తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. షర్మిలతో కలిసి బుధవారం పరామర్శయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వును చూడాలన్నదే దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమన్నారు.  ఒక్క వైఎస్ కాలంలోనే ప్రజలకు మేలు జరిగిందని అటువంటి పాలననే ప్రజలు ఇప్పటికీ కోరుతున్నారన్నారు.  వైఎస్ మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తానని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నల్ల కాల్వ వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన సోదరి  షర్మిల పరామర్శయాత్ర చేపట్టిందన్నారు.

 అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్మ కృష్ణారెడ్డి మాట్లాడుతూ చేతి నిండా పని ప్రశాంత జీవనం సాగించడానికి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధిని వైఎస్ చేసి చూపించారన్నారు. రైతు కూలీలకు, మైనార్టీలకు అన్ని వర్గాల ప్రజలకు ఆయన సమన్యాయం అందించారన్నారు. వైఎస్సార్ కుటుంబం వైఎస్ మరణ వార్త విని మరణించినవారి కుటుంబాలకు అండగా ఉంటుందన్నార. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో మంచి సంక్షేమ పథకాల ద్వా రా వైఎస్సార్ ఎంతో మంది ప్రజలకు దగ్గరయ్యారన్నారు.  అనంతరం నల్లగొండ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ షర్మిల పరామర్శయాత్రకు సాదర ఆహ్వానం లభిస్తోందని, ఇదంతా వైఎస్ కుటుంబంపై ప్రజలకున్న అభిమానమేనన్నారు.

  నక్కలగండి ఎత్తిపోతల ద్వారా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలన్నవైఎస్సార్ ఆశయం నెరవేరేంత వరకు తాము విశ్రమించబోమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రముఖులు ఉన్నారు. వారిలో రాష్ట్ర అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గున్నం నాగిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇరుగు సునీల్‌కుమార్, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎస్సీ సెల్ కన్వీనర్ బెదరకోట భాస్కర్ తదితరులున్నారు.

 ఆమెకే... సాధ్యమైంది
 గువ్వలగుట్ట వరకూ వెళ్లిన ఘనత షర్మిలదే...
 దేవరకొండ :  జిల్లా సరిహద్దు.. నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు నక్సల్స్ షెల్టర్ జోన్.. చుట్టూ కొండలు.. కోనలు.. విసిరేసినట్టుగా ఉన్న గ్రామాలు, తండాలు..  స్థానిక నాయకులు మినహా ఇప్పటివరకు ఏ నాయకుడూ పర్యటించని ప్రదేశాలు.. ఎంతోమంది నాయకులు, అధికారులు అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం దత్తత తీసుకుంటామని ప్రకటించి తిరిగి చూడని చందంపేట మండలం అది. ఈ మండలంలోని మారుమూల ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పర్యటించి ఎవరూ చేయని సాహసం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త విని గుండె పగిలి చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తామని ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఓదార్పు ప్రకటన మేరకు ఆయన సోదరి షర్మిల బుధవారం చందంపేట మండలంలో పర్యటించారు.

 చింతపల్లి మండలంలోని మదనాపురం గ్రామంతోపాటు చందంపేట మండలంలోని దేవరచర్ల గ్రామం లో మృతుడు హన్మానాయక్ కుటుంబాన్ని, మారుమూల ప్రాంతమైన నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ పరీవాహక ప్రాంతంలో ఉన్న గువ్వలగుట్ట తండాకు చెందిన భీమిని కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబాల వారికి నేనున్నాంటూ ఆమె భరోసానిచ్చారు. ఇదిలా ఉంటే మారుమూల చందంపేట మండలాన్ని అభివృద్ధి చేయడానికి  దత్తత తీసుకుంటామని పత్రికా ప్రకటనలు ఇచ్చినప్పటికీ అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ మారుమూల గ్రామాలను, తండాలను సందర్శించే సాహసం కూడా చేయలేకపోవడం గమనార్హం. గతంలో ఓ గవర్నర్, దివంగత జెడ్పీ చైర్మన్ కీత లక్ష్మమ్మ, అప్పటి కలెక్టర్ మనోహర్ ప్రసాద్‌లు చందంపేట మండలాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే గువ్వలగుట్ట  సందర్శించిన ఘనత మాత్రం 1994లో కలెక్టర్‌గా పని చేసిన రణధీర్‌టక్కర్ ఆచార్యకు ఆ తర్వాత వైఎస్ తనయ షర్మిలకే దక్కింది.
Share this article :

0 comments: