వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి

వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి

Written By news on Monday, January 26, 2015 | 1/26/2015


వైఎస్సార్ సీపీ నాయకుడిపై దాడి
బుక్కరాయసముద్రం : వైఎస్సార్ సీపీ మండల నేత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బోయకొట్టాల ముసలన్నపై టీడీపీ అనంతపురం రూరల్ మండల కన్వీనర్, పామురారుు గ్రామానికి చెందిన వెంకటేష్, ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి కథనం ప్రకారం...బోయకొట్టాల గ్రామానికి చెందిన ముసలన్న కుమారుడు నరేష్‌పై పామురాయి గ్రామానికి చెందిన టీడీపీ నేత బాలకృష్ణ మూడు రోజుల క్రితం దాడి చేసి గాయపర్చాడు. ప్రస్తుతం నరేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో ఇరువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసు విషయమై ఎస్‌ఐ మోహన్‌కుమార్ గౌడ్ ఆదివారం ముసలన్నను స్టేషన్‌కు పిలిపించారు. కేసు గురించి ఎస్‌ఐతో మాట్లాడిన తర్వాత ద్విచక్ర వాహనంపై ముసలన్న ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలో ముసలన్నపై టీడీపీ అనంతపురం రూరల్ మండల కన్వీనర్, పామురాయి గ్రామానికి చెందిన వెంకటేష్, టీడీపీ కార్యకర్తలు నారాయణస్వామి, రామకృష్ణ, రఘు, బాబుతో పాటు మరో 20 మంది ద్విచక్ర వాహనాలలో వచ్చి దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో  టీడీపీ నేతలు అక్కడి నుంచి పరారయ్యూరు. దీనిపై ముసలన్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఎంపీటీసీ మాజీ సభ్యుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వైఎస్సార్ సీపీ నేత ముసలన్నపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయూలని కోరుతూ గ్రామస్తులు 200 మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్ జీపును అడ్డుకుని న్యాయం చేయూలని కోరారు.

విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గం ఇన్‌చార్జి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నాగలింగారెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు సాకే రామకృష్ణ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యూయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటువంటివి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Share this article :

0 comments: