సిట్టింగ్ జడ్జితో విచారించండి: వైఎస్సార్‌సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిట్టింగ్ జడ్జితో విచారించండి: వైఎస్సార్‌సీపీ

సిట్టింగ్ జడ్జితో విచారించండి: వైఎస్సార్‌సీపీ

Written By news on Tuesday, January 6, 2015 | 1/06/2015


* గవర్నర్ నరసింహన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినతి
* ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సర్కారు దుశ్చర్యలపై ఫిర్యాదు
* రైతులను ప్రభుత్వం వేధించడాన్ని సిహ ంచలేమన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
* రైతు సమస్యలపై ఈ నెల 31, ఫిబ్రవరి 1న తణుకులో నిరాహారదీక్ష

 
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో దుండగులు పంట పొలాలను దగ్ధం చేయడంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, గొట్టిపాటి రవికుమార్, మహ్మద్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, ఇతర నేతలు పార్థసారథి, అంబటి రాంబాబు, రాజధాని ప్రాంత రైతులు ఈ బృందంలో ఉన్నారు.
 
  డిసెంబర్ 29వ తేదీన కొందరు దుండగులు కొన్ని గ్రామాల్లో వ్యవసాయ పంట పొలాలను తగులబెట్టారని జగన్ గవర్నర్ దృష్టికి తెచ్చారు. దుశ్చర్యలు చోటు చేసుకున్న ప్రాంతాన్ని పోలీసు అధికారులు సందర్శించకముందే రాష్ర్ట హోంమంత్రి చిన్న రాజప్ప పొలాలను జగన్‌మోహన్‌రెడ్డే తగులబెట్టించారని ప్రకటించడం దిగ్భ్రాంతికరమన్నారు. హోంమంత్రి ప్రకటనతో మరింత విజృంభించిన పోలీసులు రైతులను ముఖ్యంగా భూపరిరక్షణ సమితి సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి వేధించడం ప్రారంభించారన్నారు. కొంతమందిపై చేయి కూడా చేసుకున్నారని తెలిపారు.ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా ఇలాంటి వాటిని సహిస్తూ తాము కూర్చోలేమని జగన్ స్పష్టం చేశారు. పేద రైతులకు న్యాయం చేయాలని కోరడానికే మీ వద్దకు వచ్చినట్టు గవర్నర్‌కు విన్నవించారు. ఈ మొత్తం వ్యవహారాలపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, ల్యాండ్ పూలింగ్‌కు భూములను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులకు రక్షణ కల్పించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
 
 భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులను పోలీసులు, రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారని, ఈ ఘటనలు చూస్తే అసలు రాష్ట్రంలో చట్టం ఉందా? అని అనుమానంగా ఉందని గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద ధర్మాన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి రాజధాని ప్రాంత రైతులను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.  పంట పొలాలను తగలబెట్టిన సంఘటనపై పూర్వాపరాలు తెలుసుకోకుండానే, విచారణ జరిపించకుండానే.. వైఎస్సార్‌సీపీ చేయించిందని హోంశాఖ మంత్రి చినరాజప్ప, ఇతర మంత్రులు చెప్పడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం, పోలీసులు పాల్పడుతున్న దురాగతాలను ఆ ప్రాంతానికి చెందిన సుమారు 200 మంది రైతులు తమ నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలసి విన్నవించారని చెప్పారు. దీనిపై స్పందించిన జగన్ ఆ దురాగతాలన్నిటినీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని కోరగా గవర్నర్ సానుకూలంగా స్పందించారని ధర్మాన తెలిపారు. రైతుల సమస్యలపై ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లోరెండురోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగన్ నిరాహార దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. టీడీపీ రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసిందని విమర్శించారు.
Share this article :

0 comments: