18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

18 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర

Written By news on Tuesday, February 10, 2015 | 2/10/2015


హైదరాబాద్: ఈ నెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను షర్మిల ఓదారుస్తారు.
పరామర్శ షెడ్యూల్ ను తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవ రెడ్డి తెలియజేశారు. 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ఆమె పరామర్శయాత్ర కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి నియోజక వర్గం నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజక వర్గాల్లో ఆమె పరామర్శ యాత్ర కొనసాగుతుందని అన్నారు. అంతేకాకుండా బుధవారం ప్రారంభించాల్సిన తెలంగాణ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఈ నెల 15 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.
Share this article :

0 comments: