బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం

బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం

Written By news on Wednesday, February 4, 2015 | 2/04/2015


'బాబుకు నారాయణ లిమిట్ లెస్ ఏటీఎం'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : తాత్కాలిక రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజాధనాన్ని వృధా చేస్తోందని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారమిక్కడ మండిపడ్డారు. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవన్న చంద్రబాబుకు తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఎలా వచ్చాయన్నారు. విజయవాడ, గుంటూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనే తాత్కాలిక రాజధానిని సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆయన  డిమాండ్ చేశారు. మంగళగిరి సమీపంలో ఉన్న హరిహంత్ ప్రాజెక్ట్ కి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చిన విధంగానే రాజధాని ప్రాంత రైతులకు కూడా ఇవ్వాలని ఆర్కే అన్నారు.

భూకేటాయింపుల వ్యవహారాలను రెవెన్యూ మంత్రి చూడాలని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. అయితే రెవిన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఒక్కసారి కూడా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించకపోవటంలో ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. కేఈ కృష్ణమూర్తి కన్నా మంత్రి నారాయణ అయితే చంద్రబాబు నాయుడుకు బాగా పనికొస్తారని ఆయన్ని ముందుకు పెట్టారన్నారు.

ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చంద్రబాబుకు కేఈ చెప్తారనే ఆయనను పక్కకు పెట్టారని ఆర్కే వ్యాఖ్యానించారు. కేవలం తన చేతిలో కీలుబొమ్మలా ఉండే వ్యక్తులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని ఆయన విమర్శించారు. ఎన్నడూ ప్రజల చేత ఎన్నికకాని మంత్రి నారాయణకు రాజధాని వ్యవహారాలను ఎలా అప్పగిస్తారన్నారు. చంద్రబాబుకు లిమిట్ లెస్ ఏటీఎంగా మంత్రి నారాయణ ఉన్నారని ఆర్కే వ్యాఖ్యానించారు. కృష్ణాతీరంలోని కబ్జారాయుళ్ల జోలికి వెళ్లిని ప్రభుత్వం...పేదల భూముల్ని లాక్కోవడం దారుణమన్నారు.
Share this article :

0 comments: