విగ్రహాల తొలగింపులో రాజకీయ కక్ష: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విగ్రహాల తొలగింపులో రాజకీయ కక్ష: అంబటి

విగ్రహాల తొలగింపులో రాజకీయ కక్ష: అంబటి

Written By news on Saturday, February 7, 2015 | 2/07/2015

 కక్షతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు, వైఎస్ ఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని వైఎస్ ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దురద్దేశంతో వైఎస్ ఆర్ విగ్రహాన్ని తాకితే ఏ శక్తి ఉందో తెలుస్తుందని చెప్పారు.

ఎన్టీఆర్ ను విగ్రహాంగా మార్చింది చంద్రబాబు కాదా?  అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు కొన్ని ఛానల్స్ లో వస్తున్న ప్రచారం అవాస్తవమని అంబటి ఖండించారు. కాగా, వైఎస్ ఆర్ సీపీ మానవతా దృక్పథంతోనే పోటీ చేయడం లేదని అంబటి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: